Home

»

Latest News

బిర్యానీతో ఫ్లాట్ చేసిన ప్ర‌భాస్‌

May 20, 2015 10:11AM

ప్ర‌భాస్‌ని అంద‌రూ ముద్దుగా డార్లింగ్ అని పిలుస్తుంటారు. మ‌న హీరోలే కాదు... త‌మిళ తంబీల‌కూ త‌ను డార్లింగే. త‌మిళ స్టార్ క‌థానాయ‌కుడు సూర్య‌కీ ప్ర‌భాస్ అంటే విప‌రీత‌మైన అభిమానం. ఇద్ద‌రి మ‌ధ్యా చాలా కాలం నుంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. ఆ స్నేహంతోనే సూర్య సినిమా రాక్ష‌సుడు ఆడియో వేడుక‌కు ప్ర‌భాస్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యాడు. అతిథి అంటే గుర్తొచ్చింది.. అతిథి మ‌ర్యాద‌ల విష‌యంలో ప్ర‌భాస్ రూటే సెప‌రేటు. భీమ‌వ‌రం బ్యాచీ క‌దా.. ఆ విష‌యంలో ఏమాత్రం లోటు చేయడు. సూర్య‌కీ త‌న అతిథి మ‌ర్యాద‌ల్ని చూపించాడు ప్ర‌భాస్‌. ఓసారి ఇద్ద‌రి షూటింగ్ ప‌క్క ప‌క్క‌నే జ‌రుగుతోంద‌ట‌. ఆ స‌మ‌యంలో రాత్రి 11 గంట‌ల వ‌ర‌కూ సూర్య కోసం ప్ర‌భాస్ ఎదురుచూస్తూ కూర్చున్నాడ‌ట‌. లేట్ నైట్ సూర్య షూటింగ్ ఫినిష్ చేసుకొని రాగానే.. ఇంటి నుంచి తీసుకొచ్చిన మిక్స్‌డ్ బిర్యానీ వేడి వేడిగా వ‌డ్డించాడ‌ట‌. ఆ టేస్ట్‌కి సూర్య ఫ్లాటైపోయాడ‌ట‌. ప్ర‌భాస్ ఆరోజు ప్రేమ‌తో వ‌డ్డించిన బిరియానీ రుచి ఇప్ప‌టికీ మ‌ర్చిపోలేక‌పోతున్నా అంటున్నాడు సూర్య‌. అలా ఓ బిరియానీ వ‌ల్ల వీరిద్ద‌రి మ‌ధ్య స్నేహం మ‌రింత బ‌ల‌ప‌డిపోయింద‌న్న‌మాట‌.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com