Home

»

Latest News

నిఖిల్ పారితోషికం ఇంతేనా..?

May 1, 2017 5:43PM

ప్రజంట్ యంగ్ హీరోల్లో మంచి సక్సెస్‌తో దూసుకుపోతున్న హీరో నిఖిల్. ఆయన హీరోగా నటించిన స్వామిరారా, కార్తీకేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా ఇలా వరుస హిట్లు కొడుతూ నిర్మాతల హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్‌గా నిఖిల్ నటించిన సూపర్‌హిట్ మూవీ ఎక్కడికి పోతావు చిన్నవాడా దాదాపు 20 నుంచి 25 కోట్లు కలెక్ట్ చేయడంతో నిర్మాతలు ఈ యువ హీరో ఇంటి ముందు క్యూకడుతున్నారు. అలాంటి సూపర్ హిట్ తర్వాత సుధీర్ వర్మ దర్శ్తకత్వంలో కేశవ చేశాడు ఆ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఒక్క సినిమా హిట్టయితే చాలు హీరోలు రేట్లు పెంచేస్తుంటే..నిఖిల్ ఈ మూవీకి ఎంత తీసుకున్నాడో తెలుసా..అక్షరాలా 90 లక్షలు. దీనికి కారణం లేకపోలేదు..ఎక్కడకు పోతావు చిన్నవాడా సినిమాకన్నా ముందే నిఖిల్ ఈ ప్రాజెక్ట్‌పై సంతకం చేశాడు. అప్పట్లో మనోడి మార్కెట్ చాలా తక్కువ. దీంతో ఆ మార్కెట్‌కు తగ్గట్టుగానే కోటి రూపాయల పారితోషికం అందుకున్నాడు..దానిలో పీఆర్ ఖర్చులు పోను నిఖిల్‌ చేతికొచ్చింది 90 లక్షలట..అయితే ఆ తర్వాత ఎక్కడికి పోతావు చిన్నవాడా హిట్ కొట్టడంతో నిఖిల్ మార్కెట్ కూడా బాగా పెరిగింది. ప్రజంట్ సినిమాకొచ్చి 2.5 నుంచి 3 కోట్లు తీసుకుంటున్నాడట. కేశవ తర్వాత దిల్‌రాజుతో పాటు మరో బడా నిర్మాణ సంస్థ నిఖిల్‌తో సినిమా చేయనుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com