Home

»

Latest News

విలన్ గా తారకరత్నకు మరో ఆఫర్.. మెగా హీరోతో..!

May 1, 2016 11:43AM

 

రోజుకో విలన్ టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్న తరుణంలో.. హీరోగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి.. కొన్ని చిత్రాల్లో నటించి.. ఈమధ్య కాస్త సినిమాలకు దూరుంగా ఉండి.. ఇప్పుడు "రాజా చెయ్యి వేస్తే" సినిమాలో విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన తారకరత్నకు మంచి మార్కులే పడినట్టు తెలుస్తోంది. "రాజా చెయ్యి వేస్తే" సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. విలన్ గా మాత్రం తారకరత్నకు మంచి పేరొచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే నారా రోహిత్ కంటే తారకరత్ కే మార్కులు పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో సినిమాలో విలన్ గా తారకరత్నకు అవకాశం వచ్చినట్టు టాలీవుడ్ టాక్. అదేదే చిన్న సినిమా కాదండోయ్.. మెగా హీరో సాయి ధరమ్ తేజ హీరోగా.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో త్వరంలో రానున్న చిత్రంలో తారక రత్నను విలన్ పాత్ర కోసం అడిగారట. దానిని తారకరత్న కూడా సముఖంగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. మొత్తానికి తారకరత్న హీరోగా అంత సక్సెస్ కాకపోయినా విలన్ గా అయినా మంచి సక్సెస్ సాధిస్తారేమో చూద్దాం..

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com