Home

»

news

ముందుకొచ్చిన మంచు సినిమా: రేపే విడుద‌ల‌

May 01, 2015

మంచు ల‌క్ష్మి ప్ర‌స‌న్న న‌టిస్తూ, నిర్మించిన‌చిత్రం దొంగాట‌. ఈ సినిమాని ఈరోజు (మే 1న ) విడుద‌ల చేద్దామ‌నుకొన్నారు. కానీ... గంగ‌, ఉత్త‌మ విల‌న్‌ల‌కు పోటీ ఎందుకులే.. అని 9న వాయిదా వేసుకొన్నారు. తీరా చూస్తే.. ఇప్పుడు ఉత్త‌మ విల‌న్‌, గంగ రెండూ వాయిదా ప‌డ్డాయి. స‌డ‌న్ గా బాక్సాఫీసు ద‌గ్గ‌ర సినిమా లేకుండా పోయింది. ఈ గ్యాప్ ని క్యాష్ చేసుకోవాల‌నుకొంటోంది ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌. అందుకే... దొంగాట‌ని రేపు (శ‌నివారం) విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేసేస్తోంది. అర్జెంటుగా త‌న డిస్టిబ్యూట‌ర్ల‌తో మీటింగ్ పెట్టి.. శ‌నివారం అత్య‌ధిక ధియేట‌ర్ల‌లో త‌న సినిమాని విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తోంది. గంగ‌, ఉత్త‌మ విల‌న్ రెండూ బ‌రిలో లేవు కాబ‌ట్టి.. ల‌క్ష్మికి ఇదే మంచి ఛాన్స్‌. కావ‌ల్సిన‌న్ని థియేట‌ర్లు అందుబాటులో ఉంటాయి. పైగా బాక్సాఫీసు ద‌గ్గ‌ర సినిమాల్లేవు. సో.... వ‌సూళ్ల పండ‌గ చేసుకొనే ఛాన్స్ ఉంది. ఆల్ ది బెస్ట్ ల‌క్ష్మీ.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com