Home

»

news

హ‌న్సిక‌కు మ‌రో ఐదుగురు పిల్ల‌లు

Jun 01, 2015

క‌థానాయిక అంటే.. సినిమాలు, షూటింగులు, గాసిప్పులే కాదు. ఇప్పుడు వాళ్లు కూడా సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ విష‌యంలో హ‌న్సిక అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తోంది. త‌న ప్ర‌తి పుట్టిన రోజుకీ ఓ అనాథ బాలిక‌ను ద‌త్త‌త తీసుకొంటోంది హ‌న్సిక‌. అలా ఇప్ప‌టికే పాతిక‌మంది పిల్ల‌లకు ఆధారం చూపించింది. ఇప్పుడు మ‌రో అయిదుగురు అమ్మాయిల్ని కూడా ద‌త్త‌ల తీసుకోవ‌డానికి ఏర్పాట్లు చేసుకొంటోంది. అంటే... హ‌న్సిక ద‌గ్గ‌రున్న మొత్తం పిల్ల‌లు 30మంద‌న్న‌మాట‌. వీళ్లంద‌రి కోసం ముంబై శివార్ల‌లో ఓ అనాధాశ్ర‌మం ఏర్పాటు చేయ‌బోతోంది. అందుకోసం స్థ‌లం కూడా కొనుగోలు చేసింది. వ‌చ్చే పుట్టిన రోజుకి అనాథాశ్ర‌మం ప‌నుల్ని మొద‌లెట్టాల‌న్న‌దే ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకొంద‌ట‌. ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స‌హాయం అర్దించ‌కుండా, అనాధాశ్ర‌మం కోసం ప్ర‌తి పైసా త‌నే ఖ‌ర్చు పెట్టాల‌ని భావిస్తోంది హ‌న్సిక‌. నిజంగా.. హ‌న్సిక గ్రేట్ క‌దూ.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com