Home

»

Latest News

చరణ్ ‘గోవిందుడు..' అత్తారింటికి కాపీయే..!

Sep 24, 2014 6:46PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ న్యూమూవీ ‘గోవిందుడు అందరివాడేలే’ అక్టోబర్ '1' రిలీజ్ కి రెడీ అవుతోండగా, ఈ మూవీ స్టొరీకి సంబంధించిన వార్త వెబ్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా అత్తారింటికి దారేది 2 అని ఫిల్మ్ నగర్ టాక్. అత్తారింటికి దారేది లో పవన్ కళ్యాణ్ తమ ఫ్యామిలీని కలపడం కోసం విదేశాల నుంచి ఇండియాకి వస్తాడు. అలాగే గోవిందుడులో అభిరామ్‌(రామ్‌చరణ్‌) ఫ్యామిలీలో సమస్యలను పరిష్కరించి, అందరినీ ఒకటి చేయడానికి ఇండియాకి వస్తాడట. ఫ్యామిలీకి దూరంగా బాబాయి శ్రీకాంత్ ని వాళ్ల నాన్న(ప్రకాశ్‌రాజ్‌)నూ, తండ్రి (రెహమాన్‌)ని ఎలా కలుపుతాడనేది ఓ పాయింట్‌. అలాగే ‘గోవిందుడు అందరివాడేలే’ క్లైమాక్స్ ‘అత్తారింటికి దారేది’ ఫార్మాట్‌లోనే వుంటుందని అంటున్నారు. మరి దర్శకుడు కృష్ణవంశీ ఈ స్టొరీని ఎలా మలిచాడు అనేది తెలుసుకోవాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com