Home

»

Latest News

షాకింగ్ న్యూస్ : దాస‌రితో సంపూ సినిమా

May 4, 2015 1:50PM

సంపూర్నేష్ బాబుకి రాజ‌యోగం పిచ్చ పిచ్చ‌గా ప‌ట్టేసింది. వ‌రుస సినిమాల‌తో హోరెత్తిస్తున్నాడు. అదీ క్రేజీ కాంబినేష‌న్ల‌తో. మంచు విష్ణు నిర్మాత‌గా సంపూ హీరోగా ఓ చిత్రం తెర‌కెక్కింది. అది త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతోంది. రాంగోపాల్ వ‌ర్మ - సంపూ కాంబినేష‌న్ కూడా సెట్ అయ్యింది. త్వ‌ర‌లోనే ఈసినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ఈలోగా మ‌రో షాకింగ్ న్యూస్‌. దాసరి నారాయ‌ణ‌రావు - సంపూ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతోంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా దాస‌రి నారాయ‌ణ‌రావే ప్ర‌క‌టించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. అయితే ఈసినిమాకి దాస‌రి కేవ‌లం నిర్మాత‌గానే వ్య‌వ‌హ‌రిస్తార‌ని తెలిసింది. ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌నేది త్వ‌ర‌లో చెబుతారు. మొత్తానికి సంపూ... రేంజ్ రోజు రోజుకీ పెరుగుతోంది. వ‌ర్మ‌, దాస‌రి సినిమాల‌తో స‌డన్‌గా స్టార్ అయిపోయినా పోవ‌చ్చు. చూద్దాం.. ఏం జ‌రుగుతుందో?

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com