Home

»

Latest News

ఆటోజానీ - ఫ‌స్ట్ ఆఫ్ అదుర్స్‌

May 2, 2015 2:45PM

చిరంజీవి 150 వ సినిమా మెల్లి మెల్లిగా ముందుకు క‌దులుతోంది. ద‌ర్శ‌కుడు, క‌థ విష‌యంపై ఇప్పటికే ఓ క్లారిటీ వ‌చ్చేసింది. బివిఎస్ ప్ర‌సాద్ అందించిన క‌థ చిరుకి న‌చ్చ‌డంతో.. ఆయ‌న ఓకే చెప్పేశారు. ఈచిత్రానికి పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. మిగిలిన టెక్నీషియ‌న్స్ కూడా ఖ‌రారైపోయార‌ట‌. అయితే... వాటి వివ‌రాల్ని చిరు కాంపౌండ్ అత్యంత గోప్యంగా ఉంచుతోంది. తాజా స‌మాచారం ఏమిటంటే. ఆటోజానీ ఫ‌స్ట్ ఆఫ్ స్ర్కిప్టు వ‌ర్క్ జ‌రిగిపోయింద‌ట‌. ఫ‌స్ట్ ఆఫ్ అదిరిపోయింద‌ని, చిరంజీవి రీ ఎంట్రీ వీర‌లెవిల్లో కుదిరింద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఫ‌స్టాఫ్ అంతా ఎంట‌ర్‌టైనింగ్‌గా సాగిపోయేలా తీర్చిదిద్దాడ‌ట‌. అయితే సెకండాఫ్ లో చిరంజీవికి ఇంకా కొన్ని డౌట్లు ఉన్నాయ‌ట‌. చిరు స‌ల‌హాల‌తో సెకండాఫ్‌కి పూరి రిపేర్లు చేస్తున్నాడ‌ట‌. సెకండాఫ్ కూడా ఓ కొలిక్కిరాగానే... ముహూర్తం ఫిక్స్ చేసే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. మొత్తానికి చిరంజీవి ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూసే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com