Home

»

Latest News

ఎన్టీఆర్‌, ప‌వ‌న్ వ‌దిలేస్తే... చిరు ప‌ట్టుకొన్నాడు

Aug 12, 2015

చిరంజీవి 150వ సినిమాలో ఇప్పుడో కొత్త ట్విస్ట్ వ‌చ్చింది. మొన్న‌టి వ‌ర‌కూ చిరు 150వ సినిమా పూరి జ‌గ‌న్నాథ్‌తో అనుకొన్నారు. ఆ త‌ర‌వాత వినాయ‌క్ రేసులోకి వ‌చ్చాడు. రామ్‌చ‌ర‌ణ్ సినిమాలో అతిథి పాత్ర చేసి, 150వ సినిమా మైలురాయి అందుకొంటాడ‌ని చెప్పుకొన్నారు. ఇప్పుడు మ‌రో మ‌లుపొచ్చింది. చిరంజీవి ఓ త‌మిళ రీమేక్‌లో న‌టించ‌డానికి ఒప్పుకొన్నాడ‌ని, అదే... చిరు 150వ సినిమా అవుతుంద‌ని మెగా కాంపౌండ్ వ‌ర్గాలు ఓ న్యూస్ లీక్ చేశాయి.

విజ‌య్ న‌టించిన త‌మిళ సూప‌ర్ హిట్ చిత్రం `క‌త్తి`. ఈసినిమాని రీమేక్ చేయాల‌ని ఎప్పటి నుంచో అనుకొంటున్నారు. ముందు ప‌వ‌న్‌కి ఈ క‌థ వినిపించారు. త‌ను సినిమా చూసి `నో` చెప్పాడు. ఎన్టీఆర్ కూడా ఈ రీమేక్ చేయ‌డానికి స‌ముఖ‌త చూపించ‌లేదు. ఇప్పుడు చిరంజీవి ఈ సినిమా చేయ‌డానికి ముందుకొచ్చాడ‌ని టాక్‌. క‌త్తి రీమేక్ హ‌క్కులు ఠాగూర్ మ‌ధు ద‌గ్గ‌ర ఉన్నాయి. మ‌ధుకీ, చిరుకీ మంచి సాన్నిహిత్యం ఉంది. మ‌ధు సినిమా అంటే అది చిరు ఓన్ బ్యాన‌ర్ లాంటిదే. అందుకే చిరు ఈసినిమా చేయ‌డానికి ఒప్పుకొన్నాడ‌ని తెలుస్తోంది.

భూసేక‌ర‌ణ‌, మీడియా నేప‌థ్యంలో సాగే క‌థ క‌త్తి. త‌న పొలిటిక‌ల్ కెరీర్‌కీ ఈసినిమా బాగా హెల్ప్ అవుతుంద‌ని చిరు భావిస్తున్నాడ‌ట‌. చ‌ర‌ణ్‌సినిమాలో గెస్ట్ రోల్ చేసినా - ఈ క‌త్తి రీమేక్‌లో కూడా చిరు న‌టిస్తాడ‌ని టాక్ వినిపిస్తోంది. ఈనెల 22న చిరు పుట్టిన రోజు. ఆ సంద‌న్భంగా త‌న 150వ సినిమా ఎవ‌రితో అనే విష‌యాన్ని చిరు అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com