Home

»

Latest News

చిరు కావాలంటున్న ముదురు భామ‌లు

Jul 20, 2015 10:38AM


చిరంజీవి 150వ సినిమా కోసం క‌థానాయిల మ‌ధ్య పోటీ ఎక్కువ‌వుతోంది. ఇప్ప‌టికే చిరు ప‌క్క‌న న‌టించాల‌ని వుంది అని చాలామంది క‌థానాయిక‌లు త‌మ మ‌న‌సులోని మాట చెప్పేశారు. ఇప్పుడు మ‌రో ఇద్ద‌రు ముదురు భామ‌లు జ‌త క‌లిశారు. వాళ్లే శిల్పాశెట్టి, ర‌వీనాఠండ‌న్‌. ఈ బాలీవుడ్ భామ‌లు తెలుగులోనూ సినిమాలు చేశారు. అదీ.. టాప్ స్టార్ల‌తో. కానీ చిరంజీవితో క‌ల‌సి న‌టించే అవ‌కాశ‌మే రాలేదు. అందుకే చిరు సినిమాలో న‌టించాల‌ని వుంది అని త‌మ మ‌న‌సులోని మాట బ‌యట‌పెట్టారు..

అదీ చిరంజీవి స‌మ‌క్షంలో. టి.సుబ్బిరామిరెడ్డి అవార్డుల కార్య‌క్ర‌మానికి చిరు ముఖ్య అతిథిగా విచ్చేశారు. టీ ఎస్ ఆర్ అవార్డులు అందుకొన్న అనంత‌రం శిల్పాశెట్టి, ర‌వీనా.. ఇద్ద‌రూ `చిరంజీవితో సినిమా చేయాల‌ని అనుకొన్నా.. కానీ అప్ప‌ట్లో కుద‌ర్లేదు` అంటూ త‌మ మ‌న‌సులోని మాట చెప్పేశారు. అందుకు చిరు కూడా చిరున‌వ్వుతోనే స‌మాధానం ఇచ్చాడు. క‌నీసం చిరు 150వ సినిమా కోస‌మైనా వీళ్లిద్ద‌రి పేర్లూ ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తాయేమో చూడాలి.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com