Home

»

Latest News

చిరు సినిమా.. బండ్ల గ‌ణేష్ చేతికి??

May 01, 2015

బండ్ల గ‌ణేష్ మ‌హా జాదూగాడు. ఎదుటి వాళ్ల‌ని మాట‌ల‌తో ఐస్ చేయ‌డం, ఎవ‌రి కాంపౌండ్‌లోకైనా ధైర్యంగా అడుగుపెట్ట‌డం, చొర‌వ‌గా దూసుకుపోవ‌డం.. ఈ విద్య‌ల‌న్నీ బాగా అబ్బాయి. అందుకే త‌న తొలి సినిమానే ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో తీయ‌గ‌లిగాడు. ఆ త‌ర‌వాత గ‌బ్బ‌ర్ సింగ్ ప్రాజెక్టునీ చేజిక్కించుకొన్నాడు. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల‌తో సినిమాలు తీసి బ్లాక్ బ్ల‌స్ట‌ర్ ప్రొడ్యూస‌ర్ అనిపించుకొన్నాడు. ఇప్పుడు... చిరంజీవి 150వ సినిమాకీ నిర్మాత అయిపోయాడ‌ని.. ఇండ్ర‌స్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. చిరు 150వ సినిమా కోసం ఎప్పుడు మాట్లాడుకొన్నా... నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ అని చెప్పుకొనేవారు. `డాడీ సినిమాకి నేనే నిర్మాత‌` అని చ‌ర‌ణ్ కూడా చాలాసార్లు చెప్పాడు. అయితే.. ఇప్పుడు చిరు త‌న నిర్ణ‌యం మార్చుకొన్నార‌ట‌. ఇంట్లోవాళ్ల‌కంటే బయ‌టి వ్య‌క్తికే ఈ సినిమా నిర్మాణ బాధ్య‌త‌లు అప్ప‌గిద్దామ‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. స‌రిగ్గా అదే స‌మ‌యంలో బండ్ల గ‌ణేష్ కూడా చిరంజీవికి బాగా దగ్గ‌ర‌య్యాడ‌ని టాక్‌. `అన్న‌య్యా.. నీ సినిమా నా చేతుల్లో పెట్టు. నా త‌డాఖా చూపిస్తా..` అని మాటిచ్చాడ‌ట గ‌ణేష్‌. మ‌రోవైపు పూరి కూడా గ‌ణేష్‌కి ఓ సినిమా చేసిపెట్టాల్సివుంది. అలా.. లెక్క స‌రిపోతుంది. అందుకే చిరు.. త‌న 150వ సినిమాని గ‌ణేష్‌కి అప్ప‌గించిన‌ట్టు తెలుస్తుంది. ముందు గ‌ణేష్ ఉన్నా.. వెనుక నుంచి చ‌ర‌ణ్ కూడా అన్ని విష‌యాలూ చూసుకొంటూనే ఉంటాడ‌ట‌. చిరంజీవి 150వ సినిమా కోసం ఎంతో మంది హేమాహేమీలైన నిర్మాత‌లు బ‌రిలో ఉండ‌గా, త‌న వార‌సుడు చ‌ర‌ణ్‌ని కూడా కాద‌ని చిరు గ‌ణేష్‌ని న‌మ్ముతున్నాడంటే ఈ బండ్ల ఎంత మ్యాజిక్ చేశాడో అర్థ‌మ‌వుతోంది. ద‌టీజ్ బ్లాక్ బ్ల‌స్ట‌ర్ బండ్ల గ‌ణేష్.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com