Home

»

Latest News

అయ్యోయ్యో బాల‌య్యా.. రావ‌ట్లేదా??

May 5, 2015 2:17PM

నంద‌మూరి అభిమానుల‌కు నిరాశ త‌ప్ప‌దా? మ‌రోసారి ల‌య‌న్ విడుద‌ల వాయిదా వేస్తారా?? ప‌్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్‌. ఏప్రిల్‌లో వ‌చ్చేస్తుంద‌నుకొన్న ల‌య‌న్ మే 1కి వాయిదా ప‌డింది. తీరా చూస్తే మే 1న కూడా బాల‌య్య హ్యాండిచ్చాడు. మే 8న విడుద‌ల ఫిక్స్ చేశారు. ఇప్పుడు మే 8న కూడా ఈ సినిమా డౌటేన‌ట‌. కొన్ని సాంకేతిక కార‌ణాల వ‌ల్ల మే 8న ఈ సినిమా విడుద‌ల చేయ‌డం సాధ్యం కావ‌ట్లేద‌ని తెలుస్తోంది. సాంకేతిక కార‌ణాలంటే ఏం కాదు.. ఈ సినిమా కొన్ని ఏరియాలో బిజినెస్ చేసుకోలేదు. `లెజెండ్‌` త‌ర‌వాత వ‌స్తున్న సినిమా ఇది. నిజానికి బీభ‌త్స‌మైన హైప్ ఉండాలి. కాక‌పోతే.. మార్కెట్ దృష్ట్యా ఈ సినిమాకి గ్లామ‌ర్ త‌గ్గింది. అందుకే కొన్ని చోట్ల బిజినెస్ ఇంకా పూర్తికాలేదు. సో.. మే 8 నుంచి ఈ సినిమా మే 14కి వాయిదా ప‌డ‌డం ఖాయ‌మంటున్నారు. అధికారిక స‌మాచారం రావాల్సివుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com