Home

»

Latest News

నందమూరి బాలయ్య జోరుమీదున్నాడు

Dec 02, 2015

నందమూరి బాలకృష్ణ అటు ఎమ్మెల్యే గా, ఇటు నటుడిగా తన జోరును కొనసాగిస్తున్నాడు. బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ డిక్టేటర్‌ సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నామని చిత్ర యూనిట్ ప్రకటించగా అందరూ పెద్దగా పట్టించుకోలేదు. బాలయ్యకున్న బిజీ షెడ్యూల్ వల్ల ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తి కావడం కష్టమని అందరూ భావించారు. కానీ ఇప్పుడు బాలయ్య వాళ్ళందరి నోళ్ళు మూయించారు. అనుకున్న దాని కంటే వేగంగా డిక్టేటర్‌ షెడ్యూల్‌ని పూర్తి చేసేసి టాకీ పార్టుకి శుభం కార్డు వేసేసాడు. ఇంకా కొన్ని పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి వుంది. సో సంక్రాంతికి ఏ సినిమా వచ్చినా రాకపోయినా డిక్టేటర్‌ రిలీజ్‌ మాత్రం ఫిక్స్‌ అయిపోయింది. అయితే బాలయ్య సినిమాల్లో కంటే ఈ సినిమాలో కామెడీ డోస్ ఎక్కువగా వుండబోతున్నట్టు సమాచారం. శ్రీవాస్‌ ఈ సినిమాలో బాలయ్యని చాలా డిఫరెంట్ చూపించబోతున్నారట. మరి ఈ సినిమా నందమూరి అభిమానుల్ని ఆకట్టుకోవడంలో ఎంత వరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com