బాలయ్యకు అంజలి గ్రీన్ సిగ్నల్!
on Apr 11, 2015
.jpg)
జర్నీతో ఒక్కసారి పాపులర్ అయిన అంజలిని చూసి తెలుగులో వెలిగిపోతుందనుకున్నారు. కానీ అంచనాలు తల్లకిందులు చేస్తూ వివాదాల వెంట పరుగుపెట్టింది. వామ్మో వద్దు తల్లో అంటూ దర్శకనిర్మాతలు పక్కనపెట్టారు. ఈ మధ్య గీతాంజలి హిట్టవడంతో మళ్లీ అమ్మడిపై కన్నేశారంతా. అటు బాలయ్యకు హీరోయిన్స్ కరువు ఉండడంతో అంజలి పాపను సంప్రదించారు. నందమూరి నటసింహం నెక్ట్స్ మూవీ డిక్టేటర్ లో అంజలిని సెకెండ్ హీరోయిన్ గా ఎంపిక చేశారట. అయితే లయన్ లోనే అంజలిని తీసుకోవాలనుకున్నారట...కానీ చివరి నిముషంలో బాలయ్య మరదలు రాధిక తెరపైకి వచ్చింది. ఏదిఏమైనా అంజలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సీనియర్ హీరోలకు హీరోయిన్స్ కొరత కాస్త తగ్గినట్టే అంటున్నారు. మరి ఈ సినిమా హిట్టైతే ....కొన్నాళ్ల పాటూ మళ్లీ అంజలి వెలుగులు ఖాయం. అయితే ఈసారైనా వివాదాలకు దూరంగా ఉండి షూటింగ్ కి కోపరేట్ చేయితల్లి అంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



