Home

»

Latest News

అఖిల్ అప్పుడే టెక్కు చూపిస్తున్నాడ‌ట‌!

Oct 7, 2015 10:21AM

ఎదిగే కొద్దీ ఒద‌గ‌మంటారు పెద్ద‌లు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు నుంచి అక్కినేని నాగార్జున వ‌ర‌కూ... అన్న‌పూర్ణ కాంపౌండ్‌లో హీరోలంతా ఇదే ల‌క్ష‌ణాన్ని పుణికి పుచ్చుకొన్నారు. అయితే ఇప్పుడిప్పుడే చిత్ర‌సీమ‌లో అడుగుపెట్టిన అఖిల్‌కి మాత్రం.. ఈ ల‌క్ష‌ణం ఇంకా ఒంట‌బ‌ట్టిన‌ట్టు లేదు. అఖిల్ సినిమాతో అఖిల్ క‌థానాయ‌కుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే.

వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో చాలా అంచ‌నాలే ఉన్నాయ్‌. ఈ సినిమా షూటింగ్‌లో అఖిల్ త‌న యాటిట్యూడ్‌ని పూర్తిస్థాయిలో చూపించేశాడ‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సెట్లో అఖిల్ ప్ర‌వ‌ర్త‌న అంత గొప్ప‌గా లేద‌ని.. చాలాసార్లు అఖిల్ టెక్కు చూపించాడ‌ని ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. అఖిల్ కి కోపం ఎక్కువ‌ని, నాగార్జున నాగ‌చైత‌న్య‌లా కాద‌ని.. అఖిల్ సెప‌రేట‌ని ఈ చిత్రంలో ప‌నిచేసిన కొంత‌మంది గుస‌గుస‌లాడుకొంటున్నార‌ట‌.

సెట్లో ఎలా ఉండాలో, ఎమోష‌న్స్ ని ఎలా దాచుకోవాలో అఖిల్‌కి ఇంకా తెలియ‌ట్లేద‌ని మెల్లిమెల్లిగా తాను కంట్రోల్ చేసుకొంటాడ‌ని వెన‌కేసుకొస్తున్న‌వాళ్లూ ఉన్నారు. సెట్లో వినాయ‌క్ లాంటి అనుభ‌వ‌జ్ఞ‌డు ఉన్నాడు కాబ‌ట్టి అంతా కూల్‌గా సాగిపోయింద‌ని కూడా చెప్తున్నారు. మొత్తానికి అఖిల్ ఎటిట్యూడ్ ఇప్పుడు టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com