Home

»

Latest News

ఎన్టీఆర్ ఔట్‌.. బ‌న్నీ ఇన్‌

Aug 18, 2015 2:20PM


శ్రీ‌మంతుడుతో కొర‌టాల శివ‌కు డిమాండ్ బాగా పెరిగింది. సెన్సిబుల్ స్టోరీస్‌ని క‌మ‌ర్షియ‌ల్ పంథాలో చెప్ప‌గ‌ల‌డు అని ఈ సినిమాతో నిరూపించుకొన్నాడు కొర‌టాల‌. దాంతో అగ్ర హీరోలంతా కొర‌టాల‌పై దృష్టి పెట్టారు. శ్రీ‌మంతుడు త‌ర‌వాత కొర‌టాల ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సింది. ఈ సినిమాని మైత్రీ మూవీస్ నిర్మించ‌నుంది. అయితే.. ఇప్పుడు స‌డ‌న్‌గా ఎన్టీఆర్ ప‌క్క‌కు వెళ్లిపోయాడు. ఆ స్థానంలో అల్లు అర్జున్ వ‌చ్చాడ‌ని వినికిడి. బ‌న్నీకి కొర‌టాల ఇది వ‌ర‌కే ఓ క‌థ వినిపించాడు. ఎందుక‌నో.. ఆ ప్రాజెక్టు ప‌ట్టాలెక్క‌లేదు.

శ్రీ‌మంతుడు విజ‌యంతో కొర‌టాల‌పై బ‌న్నీకి న‌మ్మ‌కం బాగా పెరిగింది. అందుకే కొర‌టాలని పిలిచి 'మ‌నం సినిమా చేసేద్దాం' అన్నాడ‌ట‌. దాంతో ఈ ప్రాజెక్టు కాస్త ఓకే అయిపోయింది. సుకుమార్ సినిమా పూర్త‌య్యే వ‌ర‌కూ ఎన్టీఆర్ ఖాళీ అవ్వ‌డు. ఈలోగా బ‌న్నీతో సినిమా చేసేద్దామ‌ని కొర‌టాల ఫిక్స్ అయిన‌ట్టు స‌మాచారం. అటు బోయ‌పాటి శ్రీ‌ను, ఇటు కొర‌టాల శివ‌.. ఈ రెండు సినిమాల్నీ స‌మాంత‌రంగా పూర్తి చేయాల‌ని బ‌న్నీ ఆలోచ‌న‌ల్లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇంకొద్ది రోజుల్లో ఈ విష‌యంపై ఓ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com