Home

»

Latest News

లిప్పులాక్కుల్లో రెచ్చిపోయిన అనుష్క‌

Jul 8, 2015 11:41AM

 

వ‌రుస‌గా క‌త్తి ఫైట్లు, యుద్దాలు చేసి విసుగొచ్చిందేమో, డీ గ్లామ‌ర్ పాత్ర‌ల‌పై మోజు త‌గ్గిందేమో.. ఇప్పుడు గ్లామ‌ర్  క్వీన్‌గా అవ‌తారం ఎత్త‌డానికి తాప‌త్ర‌య‌ప‌డుతోంది అనుష్క‌. రుద్ర‌మ‌దేవి, బాహుబ‌లిలో పెద్ద‌గా త‌న గ్లామ‌ర్‌నిచూపించే స్కోప్ అనుష్క‌కు రాలేదు. బాహుబ‌లిలో అయితే `అమ్మమ్మ‌`గా క‌నిపిస్తోంది. రుద్ర‌మ‌దేవిలో క‌త్తి యుద్దాల‌కు త‌ప్ప‌, మ‌రో అంశానికి ప్రాధాన్యం లేకుండాపోయింది. అందుకే త‌దుప‌రి చిత్రం `సైజ్ జోరో`లో త‌న ముచ్చ‌ట్ల‌న్నీ తీర్చుకొంటోంది. ఈ సినిమాలో డీప్ లిప్ లాక్ స‌న్నివేశాలు రెండు మూడున్నాయ‌ట‌. వాటిలో అనుష్క చూపించిన స‌హ‌జ‌సిద్ద‌మైన న‌ట‌న ప్రేక్ష‌కుల్ని ముఖ్యంగా యువ‌త‌రాన్ని కిర్రెక్కిస్తుంద‌ని స‌మాచారం.

త‌మిళ న‌టుడు ఆర్య‌తో అనుష్క లిప్ లాక్ చేసిన స‌న్నివేశాల్ని ఇటీవ‌లే తెర‌కెక్కించారని, ఆ సీన్లో ఇద్ద‌రూ రెచ్చిపోయార‌న్న‌ది టాలీవుడ్ టాక్‌. ఇది వ‌ర‌కు అనుష్క‌, ఆర్య‌లు క‌లిసి వ‌ర్ణ చిత్రంలో న‌టించారు. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డార‌న్న వార్తలొచ్చాయి. ప్రేమ కాదు.. మేం జ‌స్ట్ ప్రెండ్స్ అని చెప్పుకొన్నార‌ప్పుడు. అయితే ఇప్పుడు మాత్రం నిజ‌మైన ప్రేమికుల్లా... ఒక‌రి పెదాల్ని ఇంంకొక‌రు పిండేసుకొన్నార్ట‌. మ‌రి ఆ సీన్లు ఎలా పండాయో తెలుసుకోవాలంటే.. ఈ సినిమా వ‌చ్చే వ‌ర‌కూ ఆగాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com