అప్పుడు బెదుర్స్...ఇప్పుడు అదుర్స్..!!
on Sep 4, 2015
.jpg)
టాలీవుడ్ లో రిలీజ్ కి సిద్దంగా వున్న సినిమాలో వరుణ్ తేజ్ 'కంచె' ఒకటి. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచీ ఈ చిత్రానికి వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. తెలుగులో ఇప్పటికి వరకు వచ్చిన మంచి సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటిగా నిలుస్తుందని ప్రశంసలు కురిపిస్తున్నారు. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ కూడా కంచె ట్రైలర్ అదుర్స్ అంటూ ట్వీటేశాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.
అసలు కంచె సినిమాని ముందుగా మహేషె చేయాలట. గతంలో మహేశ్ బాబుకు దర్శకుడు క్రిష్ వినిపించిన"శివం"స్టోరీ ఇదేననట. శివం స్టోరీతో సినిమా చేయడానికి చాలా రోజులు ఆలోచించిన మహేశ్... ఫైనల్ గా ఈ కథకు నో చెప్పాడట. దాంతో మహేష్ తో చేయాల్సిన శివం... ఇప్పుడు వరుణ్ తేజ్ కంచెగా మారిందంటున్నారు చాలామంది. ఏదేమైనా... కంచె సినిమా మహేష్ చేసి వుంటే దాని రెంజే వేరేలా వుండేది. అయితే ఇందులో నిజమెంతో అన్నది కూడా తెలియాల్సి వుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



