Home

»

Gossips

నన్ను వదిలెయ్యండి ప్లీజ్!

May 11, 2015 6:12PM

చెడుని తీసుకున్నంత తొందరగా మంచిని అలవాటు చేసుకోలేరా అని సన్నీ లియోన్ క్లాస్ పీకుతోందట. మంచి గురించి సన్నీ చెబుతోందా అని అవాక్కయ్యారా? అసలు సంగతేంటంటే....నీలిచిత్రాల్లో నటిస్తూ సన్నీ ఇక్కడకు వచ్చిన సంగతి నిజమే. కానీ నేను మారడం ఇష్టం లేదా.... అలాగే ఉండిపోవాలని కోరుకుంటున్నారా? అని రుసరుసలాడుతోందట. ఇంతకీ ఏం జరిగిందమ్మా అంటే...గతాన్ని మరిచిపోయి కొత్తగా జీవిద్దామని వచ్చాను. కానీ కొందరు మహానుభావులు నన్ను అలా బతకనిచ్చేట్టు లేరని బాధపడుతోందట. పదే పదే పోర్న్ స్టార్ అంటూ పాత చిత్రాలు గుర్తు చేస్తున్నారంటోంది. అయినా ఇదేం పద్ధతి బాస్....బుద్ధిగా ఉన్నోళ్లనీ చెడగొడతారు, చక్కగా ఉందామనుకున్న వాళ్లనీ వదలిపెట్టరు? వాళ్లు లైఫ్ స్టైల్ మార్చుకున్నాక అయినా మన ఆలోచనా ధోరణి మార్చుకుంటే మంచిదేమో థింక్ వన్స్.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com