శ్రియ ఆ క్రికెటర్‌తో నిజంగానే అఫైర్ నడుపుతుందా?
on Apr 27, 2017

కొన్ని నెలల క్రితం హీరోయిన్ శ్రియ సరన్ వెస్ట్ ఇండీస్ స్టార్ క్రికెటర్ డ్వెయిన్ బ్రావో తో ప్రేమాయణం నడుపుతుందనే వార్తలొచ్చాయి. అసలు ఈ వార్తలు రావడానికి మూలం ముంబై లో ఒక రెస్టారంట్ లో ఇద్దరు లంచ్ చేస్తూ కెమెరాలకు చిక్కడమే. వీరిద్దరూ తర్వాత కలిసి మరెక్కడా కనిపించక పోయిన, మీడియా మాత్రం ఇద్దరి మధ్యలో ఏదో ఉంది అని ప్రచారం చేస్తూ వచ్చింది. అయితే ఒక ఇంటర్వ్యూ లో బ్రేవో మాట్లాడుతూ శ్రియ చాలా అందమైన అమ్మాయి అని, తనకి మంచి మిత్రురాలు అని పేర్కొన్నాడు.
శ్రియ కూడా మొత్తానికి ఈ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చింది. 'తాను బ్రావో ని 2016 లో ఒక ఫ్యాషన్ షోలో కలిశానని, తర్వాత అతగాడు ఒకసారి మళ్ళీ ఇండియాకి వచ్చినపుడు కలిశానని, తనకు బ్రావో తో మాములు పరిచయమే కానీ, అంతకు మించి ఏమి లేదని, అతడు మంచి ఆటగాడని తెలిసిందని, తన కెరీర్ బాగుండాలని కోరుకుంటున్నానని, శ్రియ ఒక ఇంటర్వ్యూ లో విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకి ఇలా సమాధానం చెప్పింది. గౌతమీపుత్ర శాతకర్ణి తో భారీ హిట్ ఖాతాలో వేసుకున్న శ్రియ, ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న బాలకృష్ణ 101 వ చిత్రంలో ప్రధాన కథానాయిక గా చేస్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



