సమంతని లవ్ చేశానని డైరెక్ట్ గా చెప్పేసిన టాలీవుడ్ హీరో?
on Aug 16, 2017
.jpg)
వామ్మో! సాయిధరమ్ ... నువ్వు మామూలోడివి కాదయ్య. ఎంత ఇష్టం ఉంటే మాత్రం ఇంత స్ట్రయిట్ గా నిజంగా చెప్పేస్తావా? పాపం... ఆ అమ్మాయి ఏమైపోవాలీ... ఆ అమ్మాయిని చేసుకోబోయేవాడు ఏమై పోవాలీ... ఏంటి నాయనా ఈ రచ్చ?
ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ విషయంలో ఎక్కడ చూసినా ఇవే మాటలు. ఇంతకీ మనవాడు ఏమన్నాడు? ఎవరి గురించి మాట్లాడాడు? ఆ అమ్మాయి ఎవరు? అబ్బాయ్ ఎవరు? ఇవేగా మీ అనుమానాలు. విషయం ఏంటంటే...

మనవాడు స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్ పోలీస్ బెటాలియన్ తో కాసేపు సరదాగా ముచ్చటించాడు. అక్కడ వాళ్లడిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ.. తన మనసులో మాట బయటపెట్టేశాడు. విషయం ఏంటంటే..! తను ఓ అమ్మాయిని ప్రేమించాడట. ప్రపోజ్ చేసే లోపే ఆ అమ్మాయికి మరొకరితో పెళ్లి ఓకే అయిపోయిందట. దాంతో నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడట. ఆ అమ్మాయంటే ఇప్పటికీ తనకు చాలా ఇష్టమట. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో చెప్పనే లేదు కదూ! తనెవరో కాదు. మన అక్కినేనివారి కాబోయే కోడలు సమంత.
సమంత, చైతూ ప్రేమలో ఉన్నారన్న విషయం తెలియగానే తన నిర్ణయాన్ని మార్చుకున్నానని, నిజంగా సమంత చాలా మంచి అమ్మాయి అని, తను ప్రేమలో పడకపోతే మాత్రం కచ్చితంగా ట్రై చేసేవాడ్నని అన్నాడు సాయిధరమ్. మరి ఈ విషయం తెలిశాక సమంత, నాగ చైతన్యల రియాక్షన్ ఎలా ఉంటుందో పాపం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



