అనుష్క ఫ్రీగా చేస్తే... ఇంత అంతే!
on Oct 7, 2015
.jpg)
చిత్రసీమలో కామ్ గోయింగ్ కథానాయికగా అనుష్కకు భలే మంచి పేరుంది. సెట్లో అత్యంత అణకువగా ఉండే కథానాయిగా అనుష్కనే అని ఆమెతో పనిచేసిన వాళ్లు చెప్తుంటారు. నిర్మాతలకూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తుందట అనుష్క. పారితోషికం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పెట్టదట. ఎంతిస్తే అంత అనుకొనేంత మంచి మనసు అనుష్క సొంతమట. అయితే ఫ్రీగా సినిమా చేసిన సందర్భాలున్నాయా అంటే కాస్త వెరైటీ ఆన్సర్ చెప్పుకొచ్చింది.
ఫ్రీగా చేస్తానంటే ఏమైనా ఉందా, జనమంతా ఎగబడి పోతారు... అంటూ నవ్వేస్తోంది. అయితే ఎప్పుడైనా నేను ఫ్రీగా సినిమా చేశానంటే అది అద్భుతమైన కథ అయ్యిండాలి.. అలాంటి కథ కోసం నేనూ ఎదురుచూస్తున్నా అంటోంది అనుష్క. అయితే తానెప్పుడూ ఫ్రీగా సినిమాలు చేయలేదని, అయితే పారితోషికం విషయంలో ఎవరితోనూ పేచీలు పెట్టుకోలేదని, పారితోషికం తగ్గించుకొన్న సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పుకొచ్చింది అనుష్క. అడిగినంత పారితోషికం ఇవ్వకపోతే పీకల మీద కూర్చుని వసూలు చేసుకొంటున్న ఈ రోజుల్లో.. అనుష్క లాంటి కథానాయికలు ఉండడం గ్రేటే కదూ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



