పాపం ప్రభాస్ ని పటించుకోవడం లేదు!!
on Jul 14, 2015
.jpg)
ప్రిన్స్ మహేష్‌బాబు కు ఎంత లేడీ ఫాలోయింగ్ ఉందో.. అదే స్థాయిలో ప్రభాస్‌కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిన్న పిల్లల దగ్గర నుంచి యూత్ వరకూ ప్రభాస్ ను ఆరాధించే బ్యాచ్ కాస్త పెద్దదే. తన చుట్టూ ఉన్న వారిని డార్లింగ్ అంటూ పిలిచే ప్రభాస్‌ను.. ఆయన అభిమానులు డార్లింగ్ అని ప్రస్తావిస్తుంటారు.
తాజాగా విడుదలైన బాహుబలి సినిమాలో ప్రభాస్ పేరుకు హీరో అయినా.. క్రెడిట్ విషయంలో మాత్రం డార్లింగ్ కంటే రానాకు కాస్త ఎక్కువ పడిందన్న మాట బాగా వినిపిస్తోంది. అదొక్కటే కాదు.. మరికొన్ని విషయాల్లో డార్లింగ్ కి దెబ్బ పడిందన్న ఆయన ఫ్యాన్స్ వాదన.ఎందుకంటే.. ఇప్పటివరకూ సినిమా అంటే హీరో ప్రాధాన్యత ఉంటుంది. ఇక.. భారీ సినిమాల్లో హీరోదే హవా. విడుదలయ్యాక కూడా హీరో మీదే సినిమా నడుస్తుంది.
అత్తారింటికి దారేది సినిమా చూస్తే.. ఈ సినిమాలో తెర మీద కనిపించే హీరో పవన్ అయినా.. తెర వెనుక మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ దే. అయితే.. సినిమా విడుదలయ్యాక జనం పవన్ గురించి మాట్లాడుకున్నారే కానీ..త్రివిక్రమ్ గురించి మాట్లాడినోళ్లు తక్కువ మంది. తాజాగా బాహుబలి సినిమా విషయానికి వస్తే.. మొదట అందరి నోట నానుంది దర్శకుడు రాజమౌళినే. ఆ తర్వాత భల్లాల దేవ.. ఆ తర్వాతే ప్రభాస్ ప్రస్తావన వస్తోంది. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కి కాస్త ఇబ్బంది కలిగిస్తోందట. భారీ అంచనాలతో విడుదలై.. వందల కోట్లను అవలీలలగా కొల్లగొట్టేస్తున్నప్పటికీ డార్లింగ్‌కి రావాల్సిన పేరుప్రఖ్యాతులు మాత్రం రావటం లేదని చెబుతున్నారు. ఇది ఎంత వరకు నిజం అంటారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



