Home

»

Gossips

నిజంగానే మందుతాగి చెలరేగిపోయాడు

Jul 18, 2017 3:42PM

‘మద్యం తాగకండి...పోతారు’ అంటూ సినిమా ప్రారంభం ముందు నీతులు చెప్పే నాని.... ఏకంగా లొకేషన్ కే తాగి వచ్చి నటించాడంటే మీరు నమ్ముతారా?..  సరదాగా చెప్పడం లేదు.  ఇది నిజం. ఈ నిజాన్ని ‘నిన్నుకోరి’ రైటర్ కోన వెంకటే ఓ సందర్భంలో చెప్పారు. 

‘నిన్నుకోరి’లోని ఓ సన్నివేశం. హీరో ఫుల్ గా తాగేస్తాడు. హీరోయిన్ గురించీ, హీరోయిన్ పై తనకున్న ప్రేమ గురించీ... సాక్షాత్తూ... హీరోయిన్ భర్తతో చెపుతుంటాడు. తన భార్యపై హీరోకి ఉన్న ప్రేమను ఆ భర్తగారు హీరో మాటల ద్వారా అర్థం చేసుకుంటుంటాడు. ఇది సీన్. 

ఈ సన్నివేశాన్ని దర్శకుడు అమెరికాలో తీశాడు. ఆ సమయంలో చలి జీరో డ్రిగ్రీలో ఉంది. వాతావరణం అనుకూలంగా ఉంది. లొకేషన్ లో అందరూ ఫ్రెండ్సే. సిట్యువేషన్ కమాండ్ చేస్తుంది. ఇక మనం ఎందుకు ‘నో’అనాలి అనుకున్నాడో ఏమో... మూడ్నాలుగు పెగ్గులు 
లాగించేసేడట నాని. ఇక చెప్పేదేముంది.. చెలరేగిపోయి నటించేశాడు. 

ఆ సినిమా చూసినొళ్లందరూ అనుకుంటారు... ‘నాని ఏంటబ్బా ఇంత నాచురల్ గా చేశాడు’అని. దానికి కారణం లోపల రెండో మనిషి ఉన్నాడన్నమాట. నిజంగా చాలా అద్భుతంగా నటించాడు ఆ సీన్ లో.  ఏది ఏమైనా నాచురల్ స్టార్ కదా!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com