Home

»

Gossips

సల్మాన్ ఖాన్ కు మెగాస్టార్ మద్దతు

May 6, 2015 4:47PM

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కేసు తీర్పుపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. యాక్సిడెంట్ లను ఇన్సిడెంట్ లను వేర్వేరుగా చూడాలని.. ఈ క్రమంలో అన్యూహ్యంగా జరిగేవే ప్రమాదాలని, ఉద్దేశ పూర్వకంగా చేసిన ఇన్సిడెంట్ లతో వాటికి ముడిపెట్టి చూడరాదని ఆయన అభిప్రాయపడ్డారు. 2002లో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ దోషే అని కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు. తన సహచరుడు సల్మాన్కు ఇలాంటి పరిస్థితి రావడం బాధగా ఉందన్నారు. ముంబాయి సెషన్స్ కోర్టు తీర్పును సల్మాన్ ఖాన్ బాంబే హైకోర్టుకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉన్నందున కొంత మేలు జరుగుతుందనే ఆశాభావాన్ని చిరంజీవి వ్యక్తం చేశారు. సల్మాన్ ఒప్పుకున్న సినిమాలకు ఎలాంటి నష్టం జరగదని, అవకాశాలను బట్టి అవి కూడా చిత్రీకరణ పూర్తి చేసుకుంటాయని చిరంజీవి పేర్కొన్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com