మెగా 150 లో దేవసేన లేదా..!
on May 31, 2016
149 సినిమాలు చేసిన మెగాస్టార్ కు ఇంత తర్జన భర్జన ఎప్పుడూ లేదేమో. కత్తిలాంటోడు కోసం మెగాస్టార్ చాలా ఆలోచించేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ విషయంలో ఆయన ఒక క్లారిటీకి రావడం లేదు. నయనను అడిగితే భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసి హ్యాండ్ ఇచ్చింది. పోనీ అనుష్కనైనా ఓకే చేసుకుందాం అనుకుంటే, ఇప్పుడు ఆవిడ గారు హ్యాండ్ ఇచ్చినట్టే కనిపిస్తోందని సినీ జనాలు అనుకుంటున్నారు. బాహుబలి 2 షూటింగ్ లో బిజీగా ఉన్న అనుష్కను ఈ షూటింగ్ టైం లో వేరే ప్రాజెక్ట్స్ ఏమీ కమిట్ అవ్వద్దని ముందే చెప్పాడట రాజమౌళి. దీంతో ఇప్పుడు చిరు సినిమాకు అనుష్క అనుమానంగా మారింది. అయితే బాహుబలి షూటింగ్ ఇంకో నెలరోజుల్లో పూర్తై పోతుందని సమాచారం. ఇంకా మెగాస్టార్ మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి, హీరోయిన్ ఉన్న సీన్లంటినీ లాస్ట్ షెడ్యూల్ లో ప్లాన్ చేసుకుంటే మాత్రం, అనుష్క అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. విచిత్రంగా చిరు 150 తో పాటు, బాలయ్య 100 కు కూడా హీరోయిన్ సమస్య వెంటాడుతోంది. ఒకప్పుడు ల్యాండ్ మార్క్ సినిమాలనగానే హీరోయిస్లు పోటీపడేవారు. కానీ ఇప్పుడు మాత్రం సీనియర్ హీరోల పక్కన చేయడం రిస్క్ అని భావిస్తున్నారు. ఇలా అయితే వీళ్ల సినిమాలకు లీడింగ్ లేడీస్ ను వెతికి పట్టుకోవడం కష్టమే..