మళ్లీ మణి మ్యాజిక్ చేస్తాడా?
on Jul 7, 2015
ఓడలు బళ్లు-బళ్లు ఓడలు అవడం ఇండస్ట్రీలో కామన్. కాకపోతే మణిరత్నం అంతటి దర్శకుడు హిట్టు కోసం ఎదురుచూడడం ఏంటి?. ఓ రేంజ్ లో వెలిగి.... వరుస ఫ్లాపుల్లో కొట్టుకుపోయి ఈ మధ్య ఓకే బంగారంతో ఒడ్డున పడ్డాడు మణి. దీంతో నెక్ట్స్ స్టెప్ ఆచితూచి వేయాలని డిసైడ్ అయ్యాడట.
అందుకే తెలుగు-తమిళంలో క్రేజ్ ఉన్న హీరోకోసం వేట ప్రారంభించాడట. ఎటుచూసినా సూర్య-కార్తి తప్ప మరెవ్వరూ కనిపించలేదు.సూర్య వద్దకెళ్లి విషయం చెబితే....తనకు డేట్స్ ఖాళీ లేవు కానీ తమ్ముడితో సినిమా తీయమని సలహా ఇచ్చాడట. దొరికిందే బంగారం అనుకున్న మణి కార్తీ నుంచి డేట్స్ తీసుకుని కథ సిద్ధం చేసుకునే పనిలో పడ్డాడట. కార్తీకి హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కబోయే ఈ మూవీని...మలయాళంలో మమ్ముట్టితో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడట ఈ స్టార్ డైరెక్టర్.
హీరోని కాస్త క్లాస్ గా ప్రజెంట్ చేసే మణి మాస్ హీరో కార్తిని ఎలా ప్రజెంట్ చేస్తాడా అనే డిస్కషన్ జోరందుకుంది. అయితే క్లాస్ అయినా మాస్ అయినా కార్తికి కొట్టిన పిండే కాబట్టి నో ప్రాబ్లమ్ అనే వాళ్లు లేకపోలేదు. మొత్తానికి ఈ సినిమా హిట్టైతే...మణి మ్యాజిక్ ఇంకొన్నాళ్లు కొనసాగుతుందన్నది వాస్తవం. మరి ఏం జరుగుతుందో చూద్దాం.