
టాలీవుడ్ స్టార్ హీరోలు మల్టీప్లెక్స్ బిజినెస్‌లో కూడా తమ మార్క్ చూపిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు AMB సినిమాస్‌తో ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ AAA సినిమాస్‌తో నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చారు. అలాగే మాస్ మహారాజా రవితేజ కూడా ఏషియన్ సినిమాస్‌తో కలిసి ART సినిమాస్ తెచ్చారు. ఇప్పుడు ఈ బిజినెస్ రేస్‌లోకి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ ఐటీ హబ్ అయిన గచ్చిబౌలి ప్రాంతంలో తారక్ ఒక ప్రీమియం మల్టీప్లెక్స్ నిర్మించడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారట.
గచ్చిబౌలి అంటేనే ఐటీ ఎంప్లాయిస్, యూత్, నైట్ లైఫ్‌తో ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రైమ్ లోకేషన్. అలాంటి చోట తారక్ మల్టీప్లెక్స్ వస్తే ఆ క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ప్రేక్షకులు కేవలం సినిమా చూడటమే కాకుండా, ఒక లగ్జరీ ఎక్స్‌పీరియన్స్‌ని కోరుకుంటున్నారు. అందుకే మహేష్ బాబు, అల్లు అర్జున్ గ్లోబల్ స్టాండర్డ్స్‌తో థియేటర్లను నిర్మించి సక్సెస్ అయ్యారు.
ఇప్పుడు తారక్ కూడా ఇదే బాటలో నడుస్తూ, ఐటీ కారిడార్‌లో ల్యాండ్ మార్క్‌గా నిలిచేలా ఒక గ్రాండ్ మల్టీప్లెక్స్‌ను ప్లాన్ చేస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. భారీ స్క్రీన్స్, అడ్వాన్స్డ్ డోల్బీ అట్మాస్ సౌండింగ్, వరల్డ్ క్లాస్ సీటింగ్ అండ్ ఫుడ్ కోర్ట్స్‌తో ఈ మల్టీప్లెక్స్ ఉండబోతోందట. ఒక బడా సంస్థతో కలిసి ఈ ప్రాజెక్ట్ పార్ట్‌నర్‌షిప్‌లో రూపుదిద్దుకునే అవకాశం ఉందని సమాచారం.
ఒకవేళ ఇదే గనుక నిజమైతే.. త్వరలోనే గచ్చిబౌలిలో ఎన్టీఆర్ బ్రాండ్ నేమ్‌తో ఒక మైండ్ బ్లోయింగ్ విజువల్ హబ్ సిద్ధం కావడం ఖాయం.
Jr NTR, Multiplex, Gachibowli, Hyderabad






