అటు హీరో - ఇటు దర్శకుడు..రొమాన్స్ చేస్తున్న హీరోయిన్
on Nov 7, 2015

టాలీవుడ్‌లో మొన్నటి వరకూ దాదాపు నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఓ కథానాయిక రొమాంటిక్ యాంగిల్ ఇది. ఓ కథానాయకుడితో డేటింగ్ చేసి, రేపో మాపో పెళ్లనగా తూచ్ చెప్పుకొని విడిపోయింది ఆ భామ. ఆ తరవాత కొంతకాలం ఒంటరిగానే గడిపింది. ఇప్పుడు ఓ స్టార్ దర్శకుడి వెంట తిరుగుతోందన్న గాపిప్ చిత్రసీమలో చక్కర్లుకొట్టింది. ఆ దర్శకుడు, ఈ హీరోయిన్ కలసి సినిమాలు కూడా చేశారు.
హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో పక్క పక్కగదులు తీసుకొని `కాపురం` చేస్తున్నారన్నది టాలీవవుడ్ టాక్. దాంతో ఆ దర్శకుడి ఇంట్లోనూ గొడవలు మొదలయ్యాయట. ఈలోగా ఈ హీరోయిన్ మరో సైడ్ ట్రాక్ వెదుక్కొందన్న గుసగుసలు మొదలయ్యాయి. ఓ యువ హీరోతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోందట. ఆ హీరోతో కూడా ఇది వరకు ఓ సినిమా చేసింది. ఆ సినిమా నుంచే ఇద్దరికీ బాగా కెమిస్ట్రీ వర్కవుట్ అయినట్టు తెలుస్తోంది.
మొత్తానికి కొన్ని రోజులు హీరో దగ్గర, ఇంకొన్ని రోజులు దర్శకుడిగా దగ్గరా.. గడుపుతోందట. ఆ హీరో, ఈ దర్శకుడు కలసి ఓ సినిమా చేసే అవకాశం ఆ మధ్య వచ్చింది. అదీ.. ఈ అమ్మడి వల్లే.. చివరి క్షణాల్లో ఆగిపోయిందని టాక్. ఇద్దరూ కావాల్సిన వారే. ఇద్దరూ ఒకే సెట్లో ఉంటే.. భరించడం కష్టం కదా? అందుకే ఈ హీరోయినే ఆ ప్రాజెక్టుకి పుల్‌స్టాప్ పెట్టిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి టాలీవుడ్‌లో ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోంది. మరి ఈ కథకి ముగింపు ఎలా ఉంటుందో ఏంటో?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



