ఏంజెలినా కు సవతిగా సన్నీ?
on Jul 7, 2015
పోర్న్ స్టార్ నుంచి ఫిల్మ్ స్టార్ గా మారిన సన్నీలియోన్ కి బీ టౌన్ జనాలు పట్టం కట్టారు. ఇటు టాలీవుడ్, కోలీవుడ్ లోనూ కరెంట్ తీగలా మెరిసి మురిపించింది. అయితే ప్రస్తుతం సన్నీ కన్ను హాలీవుడ్ పై పడింది. అంతేకాదు హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్ పిట్ తో డేటింగ్ చేయాలనుందని పెద్ద షాక్ ఇచ్చింది.
అదేంటి అమ్మడూ అంటే...నేను చెప్పింది నిజమేనండీ....ఇప్పుడంటే పెళ్లైపోయింది కానీ....తనకు పెళ్లికాకుండా ఉంటే మాత్రం బ్రాడ్ ని వదిలేది కాదట. అక్కడితో ఆగిందా.... బ్రాడ్ పిట్ అంత హాటెస్ట్ మెన్ ఈ ప్రపంచంలోనే లేడని వగలుపోయింది. అతగాడితో కలసి నటించే ఛాన్స్ వస్తే.....నో చెప్పే ప్రశక్తే లేదంది. దీంతో బీ టౌన్ జనాల మాటెలా ఉన్నా....సన్నీ భర్త డానియెల్ వెబర్, అటు బ్రాడ్ పిట్ భార్య ఏంజెలినా జోలి ఎలా రియాక్ట్ అవుతారో అనే హాట్ హాట్ డిస్కషన్ జోరందుకుంది.
ఏదేమైనా ఏంజెలినా మొగుడిపై కాస్త కన్నేసి ఉంచితే సరి అని ఓ ఉచిత సలహా పడేస్తున్నారు. మొత్తానికి రియల్ లైఫ్ సంగతి పక్కనపెడితే రీల్ లైఫ్ లో అయినా సన్నీ....బ్రాడ్ పిట్ తో రొమాన్స్ చేస్తుందంటారా?