బాలయ్యకు జూనియర్ విషెస్ చెప్పలేదా..?
on Jun 10, 2016
నందమూరి అభిమానులందరూ ఎన్టీఆర్ తర్వాత ఆ వారసత్వాన్ని కొనసాగించిన వారసుడిగా బాలయ్యను ఆరాధిస్తుంటారు. అలాంటి బాలయ్య 57వ పుట్టినరోజు ఈ రోజు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా అదిరిపోయేలా ఆయన బర్త్ డే సెలబ్రేషన్స్ ను నిర్వహించారు. అభిమానులతో పాటు, కుటుంబసభ్యులు కూడా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాలో కూడా బాలయ్య పుట్టినరోజు ట్రెండ్ అవుతోంది. నారా లోకేష్ మావగారికి కేక్ తినిపిస్తున్న పిక్ ను తన ట్విట్టర్లో పెట్టాడు. హ్యాపీ బర్త్ డే టు వర్సటైల్ ఆర్టిస్ట్ అండ్ లవింగ్ ఫాదర్.. అవర్ డియర్ లెజండ్ బాలయ్య మావయ్య అంటూ లోకేష్ తన విషెస్ తెలిపాడు. ఆయన తండ్రి చంద్రబాబు కూడా, వార్మ్ గ్రీటింగ్స్ టు నందమూరి బాలకృష్ణ ఆన్ హిజ్ బర్త్ డే అంటూ గౌరవంగా తన అభినందనలు తెలిపారు. హరికృష్ణ పెద్ద తనయుడు కళ్యాణ్ రామ్ హ్యాపీ బర్త్ డే బాబాయ్ అంటూ తన అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఇలా కుటుంబ సభ్యులందరూ తమ తమ సోషల్ మీడియాలోనూ, ఫోన్ లోనూ బాలకృష్ణకు విషెస్ చెప్పారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ విషయంలో స్పందించలేదు. తన సోషల్ నెట్ వర్కింగ్ లో ఎక్కడా కూడా బాలయ్యకు విష్ చేయలేదు. ఇద్దరికీ సన్నిహితులైన వారి దృష్ట్యా ఫోన్ చేసే అవకాశం కూడా లేనట్టే అంటున్నారు. ప్రస్తుతం నందమూరి అభిమానుల్లో ఈ విషయమ్మీదే చర్చ జరుగుతోంది.