వినాయక్.. నువ్వూ కాపీ క్యాట్ వేనా?
on Nov 10, 2015

ఎస్.ఎస్.రాజమౌళి ఎన్ని అద్భుతమైన విజయాలైనా సాధించి ఉండొచ్చుగాక.. కానీ ఆయనపై కాపీ క్యాట్ అనే ముద్ర పడిపోయింది. త్రివిక్రమ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. త్రివిక్రమ్ తీసిన సినిమాలు కొన్ని హాలీవుడ్ చిత్రాలకు స్ఫూర్తి అనబడే కాపీలని నిరూపణ కూడా అయ్యింది. ఇప్పుడు వి.వి.వినాయక్‌నీ ఈ జాబితాలో చేర్చాల్సివస్తోంది.
అఖిల్‌తో వినాయక్ తీసిన అఖిల్ సినిఆమ 2003 లో వచ్చిన హాలీవుడ్ చిత్రం టాంబ్ రేడర్ – ది క్రాడిల్ ఆఫ్ లైఫ్‌కి కాపీ అని తేలింది. ఎంజిలీనా జోలి, గెరాల్డ్ బట్లర్ నటించిన ఈ చిత్రం హాలీవుడ్‌లో రికార్డుల మోత మోగించింది. ఇందులోని పాయింట్‌తో పాటు కొన్ని సన్నివేశాల్ని తెలివిగా అఖిల్ కోసం వాడేసుకొన్నాడట వినాయక్.
ఈ సినిమా వచ్చి పన్నెండేళ్లు అయిపోయింది కాబట్టి.. పెద్దగా గుర్తుండదులే అన్నది వినాయక్ ధీమా కావొచ్చు. ఈ సినిమాతో పాటు రెండు మూడు బాలీవుడ్ సినిమాల్నీ స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమాని చుట్టేశాడని టాక్. అఖిల్ మాత్రం ''ఇలాంటి సినిమా టాలీవుడ్‌లోనే రాలేద''0టూ గొప్పయిపోతున్నాడు. ఇంకొన్ని గంటల్లో బొమ్మ పడిపోతుంది. అప్పుడు తెలుస్తుంది ఇది కాపీనా, కాదా అని. అంత వరకూ కాస్త ఓపిక పట్టాలంతే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



