సమంత కోసం.. హోల్‌సేల్ గా తొక్కేశారు..!
on Jun 3, 2016
అ.ఆ సినిమా న్యూస్ బయటకు రాగానే... ఇది సమంత కోసం త్రివిక్రమ్ తీస్తున్న సినిమా అన్న ప్రచారం జోరుగా సాగింది. అ.ఆపై లేడీ ఓరియెంటెడ్ సినిమా ముద్ర వేశారు. అయితే దాన్ని కప్పిపుచ్చడానికి త్రివిక్రమ్ చాలా జిమ్మిక్కులే చేశాడు. అనుపమ పరమేశ్వరన్‌ని రంగంలోకి దింపింది అందుకే. ఎప్పుడైతే అనుపమ వచ్చిందో... ఈ సినిమాకి ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఫ్లేవర్ వచ్చింది. కథలో కూడా ముక్కోణపు ప్రేమకథ ఛాయలు కనిపించాయి. ప్రేమమ్ తో బాగా పాపులర్ అయిన అనుపమ చేసిన తొలి తెలుగు సినిమా ఇది. అ.ఆ విడుదలకు ముందు అనుపమ క్యారెక్టర్ ఈ రేంజులో ఉంటుంది, ఆ రేంజులో ఉంటుందన్న ప్రచారం సాగింది. తీరా చూస్తే.. అనుపమ పరమేశ్వరన్ కనిపించింది నాలుగైదు సీన్లలోనే. పైగా ఆమెను సరిగా చూపించనే లేదు. అనుపమ క్యారెక్టర్‌కి కూడా అంత ప్రాముఖ్యత లేదు. అనుపమకి ఎక్కడ ప్రాధాన్యం ఇస్తే..సమంత పాత్ర డౌన్ అయిపోతుందో అన్న భయం వేసిందేమో. అనుపమ అనే కాదు... అన్ని క్యారెక్టర్ల పరిస్థితీ ఇంతే. సమంత ముందు ఏదీ నిలవలేదు. ఆఖరికి నితిన్, నదియా పాత్రలు కూడా. సమంత కోసం అందర్నీ ఇలా హోల్‌సేల్ గా తొక్కేశాడు త్రివిక్రమ్. అయితే అదేం గుర్తుకురానంతగా తన మాటలతో మాయ చేసి థియేటర్ బయటకు పంపేశాడు. త్రివిక్రమా.. మజాకా. ఆయన ఏం అనుకొంటే అది చేయగలడు. అసలే మాటల మాంత్రికుడు కదా?

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
