Home

»

Gossips

ఆ నిర్మాత కూతురితో గోపీచంద్ పెళ్ళి

Mar 23, 2011 3:42PM

gopichand wallpapers, gopichand stills, gopichand images, gopichand pics, gopichand photos, gopichandpicturesహీరో గోపీచంద్ పెళ్ళి ఎవరితో జరుగుతుందనేది ఈ మధ్య ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. యువ హీరో గోపీచంద్ గతంలో జగపతి బాబుతో కలసి నటించిన "శౌర్యం" చిత్రాన్ని, ఇటీవల గోపీచంద్ సోలో హీరోగా నటించిన "వాంటెడ్" చిత్రాన్నీ నిర్మించిన భవ్య క్రియేషన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత ఆనందప్రసాద్ మీకు తెలుసా...? ఆయన తన కుమార్తెను హీరో గోపీచంద్ కు ఇచ్చి వివాహం చేయాలని ప్రయత్నిస్తున్నారట. ఆ దిశలో భాగంగా హీరో గోపీచంద్ కి, అతని తల్లిగారికీ ఆనందప్రసాద్ కూతురు కూడా బాగా నచ్చిందని సమాచారం. గోపీచంద్ తన పెళ్ళి రిసెప్షన్ చాలా భారీగా చేయాలనుకుంటున్నారట.

నిర్మాత ఆనందప్రసాద్ కి కూకట్ పల్లిలో భ్రమరాంబ, మల్లికార్జున అనే పేరుగల రెండు థియేటర్లూ, పద్మజ ప్లాజా అనే ఒక షాపింగ్ కాప్లెక్స్, భవ్య సిమెంట్స్ అనే సిమెంట్ ఫ్యాక్టరీ ఇలా అనేక వ్యాపారాలున్నాయి. అటువంటి ఆనందప్రసాద్ తన కుమార్తెను హీరో గోపీచంద్ కిచ్చి వివాహం చేయాలనుకుంటున్నారనీ, ఈ సంబంధం దాదాపు నిశ్చయమయ్యిందనీ, కట్నకానుకలకు ఏ మాత్రం లోటుండదనీ, అన్నీ కలిసొస్తే వచ్చే వేసవి కాలంలోనే ఈ వివాహం జరుగుతుందనీ ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com