Home

»

Gossips

పవన్ కళ్యాణ్ దేవుడు - కరుణాకరన్

Feb 3, 2012 10:42AM

పవన్ కళ్యాణ్ దేవుడు అని కరుణాకరన్ అన్నారు. వివరాల్లోకి వెళితే నితిన్ హీరోగా, నిత్యామీనన్ హీరోయిన్ గా నటించిన "ఇష్క్" చిత్రం ఆడియో ఫంక్షన్ నిన్న జరిగింది. ఈ చిత్రం ఆడియోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన దర్శకుడు కరుణాకరన్ ప్రసంగిస్తూ "పవన్ కళ్యాణ్ దేవుడు. ఆయన నాకు "తొలి ప్రేమ" చిత్రం అవకాశం ఇవ్వకపోతే ఈరోజున నేనిక్కడ ఉండే వాడిని కాదు. ఆ సినిమా ఉత్తమ ప్రాంతీయభాషా చిత్రంగా జాతీయ అవార్డు అందుకుంది.

ఇలా ఆయన్ని దేవుడిలా కొలిచే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుందే కానీ తగ్గదు" అని అన్నారు. మొన్నటి వరకూ బండ్ల గణేష్ ఈ విధంగా పవన్ కళ్యాణ్  భజన చేస్తూ, అతన్ని  ఆకాశానికి ఎత్తుతుంటే ఈ రోజు అతనికి కరుణాకరన్ కూడా తోడయ్యాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com