Home

»

Gossips

విడాకులు తీసుకోనున్న పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్

Mar 28, 2011 3:55PM

 pawan kalyan wallpapers, pawan kalyan stills, pawan kalyan images, pawan kalyan pics,   pawan kalyan photos, pawan kalyan picturesపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి రేణూ దేశాయ్‌ల దాంపత్య జీవితంలో ఎడబాటు వచ్చినట్టు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య అంతరం బాగా పెరిగినట్టు తెలుస్తోంది. వారిద్దరి మధ్య ఏర్పడిన చిన్నపాటి విభేదాలు ముదిరి పాకాన పడి తెగతెంపుల చేసుకునే స్థాయికి చేరుకున్నట్టు సమాచారం. ఈ పుకార్లను ఫిల్మ్ నగర్ వర్గాలు కూడా కొట్టివేయడం లేదు. దీంతో వారిద్దరు విడిపోవడానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం భరణం కింద ఆరు కోట్ల రూపాయలను రేణూ దేశాయ్‌కు పవన్ కళ్యాణ్ చెల్లించినట్టు తెలుస్తోంది. అలాగే, పిల్లల బాధ్యతను కూడా తానే చూసుకుంటానని పవన్ హామీ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం రేణూ దేశాయ్ తన పుట్టినిల్లు పూణెలో ఉన్నట్టు తెలుస్తోంది.


పవన్ కళ్యాణ్ కూడా మొన్నటి వరకూ పూణెలోనే ఉన్నారు. ఈ విభేదాలు తలెత్తగానే పవన్ కళ్యాణ్ తన మకాం హైదరాబాద్ కి మార్చారట. ఇటీవల వారి బంధువు అల్లు అర్జున్ వివాహానికి కూడా రేణూ దేశాయ్ హాజరవలేదు. పవన్ కళ్యణ్ గతంలో విశాఖపట్టణానికి చెందిన నందినీ అనే అమ్మాయిని పెద్దలు వద్దన్నా ప్రేమించి పెళ్ళిచేసుకుని, రేణు దేశాయ్ తో సహజీవనం సాగిస్తూ, ఆ పై నందినితో తెగతెంపులు చేసుకున్నారు. ఆ తర్వాత రేణు దేశాయ్ కి ఒక బిడ్ద పుట్టిన తర్వాత అఫీషియల్ గా వివాహం చేసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్‍ చేసుకున్న ఈ పెళ్ళి కూడా పెటాకులయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని ఫిలిం నగర్‍ వర్గాల భోగట్టా 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com