సినిమాగా యన్.టి.ఆర్.జీవితచరిత్ర రాబోతూందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి.వివరాల్లోకి వెళితే సీనియర్ యన్.టి.ఆర్. జీవితచరిత్రను సినిమాగా నిర్మించాలని కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారట. ఆ చిత్రానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించనున్నారట.
ఆ చిత్రంలో యన్.టి.ఆర్. కుర్రతనంలోని పాత్రకు జూనియర్ యన్ టి ఆర్ ని, పెద్ద హీరో అయిన తర్వాత యన్.టి.ఆర్. పాత్రలో బాలకృష్ణ చేత నటింపజేయాలని ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ ప్రయత్నంలో భాగంగా ఈ చిత్రం గురించి బాలయ్యకు చెప్పగా ఆయన అందుకు చాలా ఆనందంగా అంగీకరించారనీ ఫిలిం నగర్ లో ఒక పుకారు షికారు చేస్తూంది. మరి ఈ చిత్రం నిర్మిస్తే దాన్లో లక్ష్మీ పార్వతి ఎపిసోడ్ ఉంటుందా...? చెప్పలేం కదా...! |