Telugu Cinema USA Schedules     top news
TMDB - TeluguOne Movie Database, Telugu cinema News, Telugu Movie News, Telugu cinema reviews, latest telugu movies, Telugu Film newsNews, Telugu movies online
తàలుàు సినిమా గాసిప్
   గాసిప్   
"అధినాయకుడు"కి జగన్ సెగ
May 29, 2012  Telugu Cinema Gossip : Like This :

యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా, పరుచూరి మురళి దర్శకత్వంలో, యమ్.యల్.కుమార్ చౌదరి నిర్మించిన విభిన్న కథా చిత్రం "అధినాయకుడు" రేపు జూన్ ఒకటవ తేదీన విడుదల కాబోతూంది. ఈ ‘అధినాయకుడు’ చిత్రానికి వైఎస్ జగన్ అరెస్టు సెగ తాకే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కారణం ఈ చిత్రంలో బాలయ్య చెప్పిన కొన్ని డైలాగులు జగన్‌ను టార్గెట్ చేస్తున్నట్లు ఉండటమే. ఈ చిత్రంలోని ‘‘మంచి నాయకులు ప్రజల గుండెల్లో ఉండాలే గానీ, రోడ్డమీద బొమ్మల్లో కాదు...ఉన్నట్టుండి ఈ విగ్రహాల రాజకీయం ఎందుకు మొదలు పెట్టావో చెబుతావా? చెప్పించమంటావా?’’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది.

ఈ డైలాగులో బాలయ్య ఎక్కడ కూడా జగన్ పేరు ప్రస్తావించక పోయినప్పటికీ....అది జగన్‌ను టార్గెట్ చేస్తూ ఉందనేది కాదనలేని సత్యం. కాగా జగన్ అరెస్టుతో ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న వైఎస్ఆర్‌సి కాంగ్రెస్ నేతలు...సినిమా విడుదల సమయంలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే చిరంజీవిపై కూడా ఈ చిత్రంలో సెటైర్లు ఉన్నాయని తెలుస్తోంది. ఈ చిత్రంలోని డైలాగుల మీద ప్రేక్షకుల స్పందన ఎలా ఉండబోతుందనేది తెలుసుకోవాలంటే జూన్ ఒకటి వరకూ ఆగాల్సిందే.

 
<<   యన్ టి ఆర్ కొత్త చిత్రం"యమ్.యల్.ఎ."...? పవన్ కి గణేష్ కాస్ట్లీ గిఫ్ట్   >>
Posted By chinni Posted Date: 2012-05-30 10:05:54
Ballaya, thoda kottatam,Dialogues cheppadam thappa emi cheya galadu,Thandri ni champina babu ki kallu kadigi pillani echadu. Diologue cheppa kunda emi chestadu
Reply
 
 
Related Movie Gossip
"నా సినిమా ప్రచారం చేస్తుంది"- బాలయ్య
"నా సినిమా ప్రచారం చేస్తుంది" అని బాలయ్య అన్నారు. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉపఎన్నికలు జరుగబోతున్నయి. ఈ ఎన్నికలను అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
More »
"అధినాయకుడు"కి జగన్ సెగ
యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా, పరుచూరి మురళి దర్శకత్వంలో, యమ్.యల్.కుమార్ చౌదరి నిర్మించిన విభిన్న కథా చిత్రం "అధినాయకుడు" రేపు జూన్ ఒకటవ తేదీన విడుదల కాబోతూంది. ఈ ‘అధినాయకుడు’ చిత్రానికి వైఎస్ జగన్ అరెస్టు సెగ తాకే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
More »
"అధినాయకుడు" విడుదల వెనుక
"అధినాయకుడు" విడుదల వెనుక ఎవరున్నారు అన్నది ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో ఆసక్తిగా మారింది. వివరాల్లోకి వెళితే శ్రీ కీర్తి క్రియేషన్స్ పతాకంపై, యువరత్న నందమూరి బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేయగా, పరుచూరి మురళి దర్శకత్వంలో, యమ్.యల్.కుమార్ చౌదరి నిర్మించిన విభిన్న కథా చిత్రం "అధినాయకుడు".
More »
"ఆదిత్య 369" సీక్వెల్లో బాలయ్య సరసన అనుష్క
"ఆదిత్య 369" సీక్వెల్లో బాలయ్య సరసన అనుష్క హీరోయిన్ గా నటించనుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. గతంలో యువరత్ననందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన "ఒక్క మగాడు" చిత్రంలో అనుష్క హీరోయిన్ గా నటించింది.
More »
"ఆదిత్య369" కి సీక్వెల్...?
"ఆదిత్య369" కి సీక్వెల్ రానుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా, మోహిని హీరోయిన్ గా, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో, అనిత కృష్ణ నిర్మించగా విడుదలై ఘనవిజయం సాధించిన హిస్టారికల్ సైన్స్ ఫిక్షన్ చిత్రం"ఆదిత్య369".
More »