యన్ టి ఆర్ కొత్త చిత్రం"యమ్.యల్.ఎ."... అని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై, జూనియర్ యన్.టి.ఆర్. హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో, దిల్ రాజు ఒక చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఈ చిత్రానికి "యమ్.యల్.ఎ." అన్న పేరుని పరిశీలిస్తున్నారని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం.
ఈ "యమ్.యల్.ఎ." చిత్రం శ్రీనువైట్ల దర్శకత్వంలో, యన్ టి ఆర్ హీరోగా నటిస్తున్న "బాద్ షా" చిత్రం పూర్తయిన తర్వాత ప్రారంభమవుతుందని సమాచారం. "యమ్.యల్.ఎ." చిత్రంలో యన్ టి ఆర్ ఒక యువ రాజకీయ నాయకుడిగా నటిస్తున్నట్లు తెలిసింది.




