సుకుమార్ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్?
on Sep 15, 2015
.jpg)
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. అదుర్స్ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించి అదరగొట్టిన ఎన్టీఆర్ మరోసారి డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు టాలీవుడ్ లో వర్గాల టాక్. సుకుమార్ ఎన్టీఆర్ కోసం డ్యూయల్ రోల్ కథను తయారు చేశాడట. ఇప్పటిదాకా సుకుమార్ రిలీజ్ చేసిన ఎన్టీఆర్ న్యూ లుక్ ఒక క్యారెక్టర్ ది మాత్రమే నంట. రెండో గెటప్ ను సీక్రెట్ వుంచాలని సుకుమార్ భావిస్తున్నాడట. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ యాభై శాతం పూర్తయింది. వినాయక చవితికి ఈ సినిమాకి సంబంధించిన ఓ చిన్న టీజర్ ని కూడా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారట. అదుర్స్ సినిమాలో డబుల్ రోల్ తో కాసుల వర్షం కురిపించిన ఎన్టీఆర్ ..ఇప్పుడు ఈ సినిమాతో తాను కోరుకుంటున్న బ్లాక్ బ్లాస్టర్ అందుకుంటాడో లేదో వేచి చూడాలి!!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



