Celebrities IPhone App     top news
TMDB - TeluguOne Movie Database, Telugu cinema News, Telugu Movie News, Telugu cinema reviews, latest telugu movies, Telugu Film newsNews, Telugu movies online
తెలుగు సినిమా ఈవెంట్స్
   ఈవెంట్స్   
అల్లు అర్జున్ రూ.20 లక్షల ఆర్థిక సాయం
Oct 14, 2014 Like This :
Facebook Twitter Google

హుదూద్ తుఫాన్ బాధితులకు స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రస్తుతం కొచ్చిన్ లో ఉన్న అల్లు అర్జున్ హుదూద్ తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర కకావికలమైందన్న వార్త తనను కలిచి వేసిందని అర్జున్ పేర్కొన్నారు. టీవీల్లో తుఫాన్ వార్తలు తెలుసుకున్న ఆయన వారు పడుతున్న బాధలతో తీవ్ర ఆవేదనకు గురైనట్టు చెప్పాడు. తనవంతు సాయంగా సిఎం రిలీఫ్ ఫండ్ కు తక్షణమే రూ.20 లక్షలు ఇస్తున్నానని చెప్పారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ... ఆదివారం సంభవించిన హుదుద్ తుఫాన్ భీభత్సంతో... నాకెంతో ఇష్టమైన విశాఖపట్నం రూపురేఖలను మార్చేయడం దురదృష్టకరం. ముఖ్యంగా రైతులు, మధ్యతరగతివారు, మత్స్యకారులు తీవ్రంగా నష్ట పోయారు. నేను ప్రకటించిన 20 లక్షల ఆర్థిక సాయంలో ఎక్కువ భాగం సముద్రాన్నే నమ్ముకుని జీవించే మత్స్యకారుల కోసం ఉపయోగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. తుఫాన్ ప్రభావంతో  మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. వారి వలలు, పడవలు ధ్వంసమవ్వడంతో జీవనోపాధి దెబ్బతినడం నన్ను కలచివేసింది. మెగాభిమానులు సైతం తుఫాను సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని తోచినంత సాయం చేయాల కోరుతున్నానని అన్నారు.
 

 
<<   అనితో ప్రారంభమైన మనోజ్‌ చిత్రం
Be the first one to post comment.
 
Related Movie Events
బన్నీ క‌త్తిప‌ట్టి... న‌రుకుడే న‌రుకుడు
స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమాలో స్టైల్ గా, హోమ్లీ మ్యాన్‌గా క‌నిపించాడు అల్లు అర్జున్‌. అయితే ఇప్పుడు క‌త్తిప‌ట్టి ర‌క్త‌పాతం సృష్టించ‌డానికి రెడీ అంటున్నాడు. బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌కత్వంలో న‌టించ‌డానికి బ‌న్నీ ప‌చ్చ‌జెండా ఊపిన సంగ‌తి తెలిసిందే. బోయ‌పాటి సినిమా అంటేనే..యాక్ష‌న్ ఓ రేంజులో ఉంటుంది.
More »
సత్యమూర్తిని నడిపిస్తున్న త్రివిక్రమ్
స‌న్నాఫ్ స‌త్య‌మూర్తికి విప‌రీత‌మైన డివైడ్ టాక్ వచ్చిన కలెక్షన్లు మాత్రం బాగానే రాబడుతోంది. దీనికి అసలు కారణం త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ అని అందరూ అంటున్నారు. వేసవి సెలవులు కావడంతో సినిమా బాలేదు అంటున్నా.. త్రివిక్రమ్ సినిమా ఎలా ఉందో ఓసారి చూసొద్దాం.. అనేవాళ్లే ఎక్కువ‌య్యారు.
More »
బ‌న్నీ థ్యాంక్స్ చెప్ప‌డం లేదు
అత్తారింటికి దారేది ఘ‌న‌విజ‌యం సాధించిన త‌ర‌వాత‌.. టీమ్ అంతా క‌ల‌సి థ్యాంక్యూ ఫంక్ష‌న్ చాలా గ్రాండ్‌గా నిర్వ‌హించారు. ఆ స‌మ‌యంలోనే పైర‌సీ వీరుల తాట తీస్తా.. అంటూ ప‌వ‌న్ రెచ్చిపోయి ప్ర‌సంగించాడు. ఆ సినిమా ఎంత హిట్ట‌య్యిందో ఆ పోగ్రాం అంత‌కంటే హిట్ట‌య్యింది.
More »
సొనారిక మంత్రం జపిస్తున్న బన్నీ
అల్లు అర్జున్ టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఫామ్ లో ఉన్నవారిపై కన్నా కొత్త కొత్త ముద్దుగుమ్మలపై మోజు పడుతుంటాడు బన్నీ. గంగోంత్రిలో అదితి అగర్వాల్, ఆర్యలో అనుమెహతా, బన్నీలో గౌరీ ముంజల్, వరుడు లో భానుశ్రీ మెహ్రా తో రొమాన్స్ చేశాడు. మిగిలిన సినిమాల్లో జస్ట్ ఎంట్రీ ఇచ్చి అప్పటికి పెద్దగా పాపులారిటీ లేని అమ్మాయిల్ని ఎంచుకున్నాడు. అమలాపాల్,. కేథరిన్, షీలా, ఆదాశర్మ ఈ కోవకే చెందుతారు.
More »
బ‌న్నీ సినిమాకి త‌మిళ‌నాట షాక్‌..!
అల్లు అర్జున్‌కి త‌మిళ‌నాట షాక్ త‌గిలింది. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమాకి త‌మిళ‌నాడులో ప్ర‌తిఘ‌ట‌న ఎదురైంది. గురువారం ప్ర‌పంచ వ్యాప్తంగా స‌న్నాఫ్ స‌త్యమూర్తి సినిమా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. త‌మిళ‌నాడులో కూడా అత్య‌ధిక ప్రింట్ల‌తో ఈ సినిమాని విడుద‌ల చేశారు. అక్క‌డ కాంచీపురంతో స‌హా కొన్ని ప్ర‌ధాన‌మైన న‌గ‌రాల్లో ఈ సినిమాని అడ్డుకొన్నారు. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి ప్ర‌దర్శ‌న నిలిపివేశారు.
More »