కుటుంబం
ఆగష్టు 22, 1955 న పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరు లో కొణిదెల వెంకట్రావు,అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా చిరంజీవి జన్మించాడు.చిరంజీవి వివాహం ప్రసిద్ధ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో 1980లో జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.
చిరంజీవి సోదరులు నాగేంద్రబాబు (సినిమా నిర్మాత, నటుడు), పవన్ కళ్యాణ్ (మరొక కధానాయకుడు). చిరంజీవి బావ అల్లు అరవింద్ ప్రముఖ సినిమా నిర్మాత. చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ కూడా సినిమా కధానాయకునిగా రాణిస్తున్నాడు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ హీరోగా సినిమా నిర్మాణం 2007లో 'చిరుత'తో ప్రారంభమైంది. ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదలై 170 కేంద్రాలలో 50 రోజులు పూర్తి చేసుకుంది.రామ్ చరణ్ తేజ రెండవ సినిమా మగధీర.ఈ సినిమా జులై 31న విడుదలై 301 కేంద్రాలలో 50 రోజులు పూర్తి చేసుకుంది.ఈ చిత్రం తెలుగు చలన చిత్ర రంగం లోనే అతి పెద్ద విజయం అనే రికార్డును నెలకొల్పినది.
చిరంజీవి కొత్త పార్టీ పేరు ప్రజారాజ్యం పార్టీ, ప్రజారాజ్యం. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు మూడో ప్రత్యామ్నాయంగా ఏర్పడాలని ఈ పార్టీని స్థాపించడం జరిగింది.ఛిరoజీవి కి ఛాలా అభిమాన సoఘాలు వూన్నాయి.
ఇతర భాషలు
ఇటు తెలుగులోనే కాకుండా, తమిళం, కన్నడం, హిందీలలో కూడా చిరంజీవి ప్రసిధ్ధుడు.
మంజునాథ, సిపాయి చిత్రాలు మొదట కన్నడంలో నిర్మించబడినవి. అక్కడ విజయవంతమయిన పిమ్మట తెలుగులోకి అనువదించబడినవి.
రజినీ కాంత్ కథానాయకుడుగా గీతా ఆర్ట్స్ బ్యానరు పై మాప్పిళ్ళై చిత్రాన్ని నిర్మించాడు. దీనికి అత్తకి యముడు అమ్మాయికి మొగుడు మాతృక. ఇందులో చిరు అతిథి పాత్రలో కనిపిస్తారు.
గ్యాంగ్ లీడర్ హిందీ పునర్నిర్మాణం ఆజ్ కా గూండారాజ్ లో,? అంకుశం హిందీ పునర్నిర్మాణం ప్రతిబంద్ లో,? దక్షిణాదిన విజయవంతమయిన జెంటిల్ మేన్ హిందీ పునర్నిర్మాణం ది జెంటిల్ మేన్ లో కూడా కథానాయకుడు గా నటించాడు. ఘరానా మొగుడు మలయాళంలోకి హేయ్ హీరో గా అనువదించబడినది.
? పశ్చిమ ఐరోపా ఖండం, ల్యాటిన్ అమెరికా లలో సైతం చిరు పేరొందాడు. దొంగ చిత్రంలో గోలి మార్ పాటకి మైఖేల్ జాక్సన్ రూపొందంచిన థ్రిల్లర్ ఆల్బం మూలం. ఈ పాటల్లో చిరు మరియు జాక్సన్ నాట్య భంగిమలు, వేషధారణలలో చాలా సామ్యం కనబడుతుంది. అందుకే ఈ దేశాలలో చిరుని ఇండియన్ జాక్సన్ గా వ్యవహరిస్తారు.
కొదమ సింహం చిత్రం ఆగ్లంలొ తీఫ్ ఆఫ్ బాగ్దాద్ గా అనువాదం గావించబడి నార్త్ అమెరికా,మెక్సికొ,ఇరాన్ మరియు ఇతర దేశాలలో విజయవంతంగా ప్రదర్శింపబడినది.
సేవా కార్యక్రమాలు
హైదరాబాద్‌లో చిరంజీవి రక్త, నేత్రనిధి ప్రధాన కార్యాలయం చిరంజీవి అక్టోబర్ 2, 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించాడు. చిరంజీవి బ్లడ్ బాంక్, చిరంజీవి ఐ బాంక్ ఈ ట్రస్టు నడుపుతున్న ముఖ్య సేవా సౌకర్యాలు. రాష్ట్రంలో అత్యధికంగా నేత్రదానం, రక్తదానం సాగిస్తున్న సంస్థలుగా ఇవి గుర్తింపు పొందాయి. అభిమానుల ఉత్సాహాన్ని, సేవా దృక్పధాన్ని పెద్దయెత్తున సమాజసేవా కార్యక్రమాలకు మళ్ళించడం ఈ ట్రస్టులు సాధించిన ఘనవిజయం. వీరి రక్తదానం వలన రాష్ట్రంలో 80,000 మంది, నేత్రదానం వలన 1000? మంది సేవలనందుకొన్నారని అంచనా . ఇప్పటికి? ఈ సంస్థలకు 3.5 లక్షల మంది తమ మరణానంతరం నేత్రాలను దానం చేయడానికి ముందుకొచ్చారు. నాలుగు సంవత్సరాలు ఈ సంస్థలు అత్యుత్తమ సేవా సంస్థలుగా? రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలనందుకొన్నాయి.
రాజకీయ ప్రవేశం
చిరంజీవి క్రొత్తగా ప్రజా రాజ్యం అనే పార్టీని స్ఠాపించారు. 2007 వ సంవత్సరం నుండి ప్రసార మాద్యమాల ద్వారా జరుగుతున్న చర్చకు తెరదించుతూ 17 ఆగస్టు 2008 తన రాజకీయ ప్రవేశ విషయాన్ని పత్రికా ముఖంగా ప్రకటన విడుదల చేసారు. 26 ఆగస్టు 2008 న (మదర్ థెరిసా జన్మదినం) తిరుపతి ఆవిలాల చెరువు మైదానం లో బహిరంగ సభను ఏర్పాటు చేసి తన పార్టీ పేరును, పతాకాన్ని ఆవిష్కరించటం జరిగింది.ఆయన రాజకీయ ప్రవేశంతో చేసే విధి విధానాలు ప్రకటించారు. ప్రస్తుతానికి సినిమాలు తీసే ఆలోచనలు ప్రక్కన పెట్టినట్లు ప్రకటించారు.
చిరంజీవి తన పార్టీ పతాకాన్ని తిరుపతిలో ఆవిష్కరించటం జరిగింది. దీనిలో ప్రదానంగా మూడు రంగులు కలవు. పతాకంలో పై మూడో వంతు తెలుపు రంగు కలదు. క్రింద ఒకవంతు ఆకుపఛ్ఛ రంగు కలదు. ఈ రెంటిని కలుపుతూ మద్యలో ఎరుపు రంగులో సూర్యుడు వృత్తాకారంలో కలదు |