LATEST NEWS
సినీ నటుడు, చంద్రబాబు సోదరుడి కుమారుడు నారా రోహిత్ తెలంగాణ తెలుగుదేశం పగ్గాలు చేపట్టనున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.    అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం ఆధ్వర్యంలో తలసీమియా బాధితుల కోసం ఓ మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ తగిన కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ.. ఈ క్యాంప్‌ను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అంటూ నారా రోహిత్ టీటీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి ఓ వీడియో సందేశాన్ని ఇచ్చారు. దీంతో తెలంగాణలో టీడీపీ బాధ్యతను రోహిత్ తీసుకోబోతున్నారంటూ ప్రచారం మొదలైంది.   నారా రోహిత్ గతంలో పలు సందర్భాలలో టీడీపీ తరఫున తన వాణిని వినిపించారు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ తరఫున ప్రచారం కూడా చేశారు. దీంతో టీటీడీపీ పగ్గాలు నారా రోహిత్ అందుకోనున్నారన్న ప్రచారాన్ని పూర్తిగా కొట్టి పారేయలేమని అంటున్నారు. దానికి తోడు ఇటీవల టీటీడీపీ అధ్యక్షుడి మార్పుపై చంద్రబాబుకి పలువురు నేతలు లేఖలు రాసిన నేపథ్యంలో ఈ ప్రచారం తెరమీదకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.   రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ కేడర్ డీలా పడింది. పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే నాయకుడి కోసం ఎదురుచూస్తుంది. గతంలో తెలంగాణలో టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ కి ఇవ్వాలన్న డిమాండ్స్ వినిపించాయి. ఎన్టీఆర్ వస్తే పార్టీలో కొత్త ఉత్సాహం వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఎన్టీఆర్ స్టార్ హీరోగా సినిమాలలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ టైములో ఆయన సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు.    ఇక, రోహిత్ విభిన్న సినిమాలతో తనకంటూ ప్రత్యేక పేరుని సంపాదించుకున్నారు. పార్టీ కార్యకర్తలలో సోషల్ మీడియాలో టచ్ లో ఉంటూ.. అవసరమైన సందర్భంలో పార్టీ తరఫున తన వాణిని వినిపిస్తున్నారు. మరి కేడర్ లో కొత్త ఉత్సాహం నింపడానికి రోహిత్ కి చంద్రబాబు తెలంగాణ టీడీపీ పగ్గాలు ఇస్తారా? అసలు రోహిత్ ఆసక్తిగా ఉన్నారా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, తెలంగాణలో పార్టీ పూర్వవైభవం కోసం చంద్రబాబు తీవ్ర కసరత్తు చేస్తున్నారని, త్వరలోనే కీలక వ్యక్తికి పగ్గాలు అప్పగిస్తారని సమాచారం. 
ఏపీ పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని హిందూ దేవాలయాలు, ఆస్తుల పైన జరుగుతున్న దాడుల పైనా.. తరువాత తిరుమలలో సీఎం డిక్లరేషన్ పైన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు పుట్టించిన సంగతి తెల్సిందే. అయన చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీజేపీ నేతలు నిరసనలు తెలియజేయడమే కాకుండా.. అయన పై పలు చోట్ల కేసులు కూడా పెట్టారు. అంతేకాకుండా మంత్రి నాని చేసిన వ్యాఖ్యలను సొంత పార్టీలోని నేతలు కూడా తప్పు పట్టారు. ఈ మాటల మంటలు చల్లారకే ముందే మరోసారి మీడియా ముందుకొచ్చిన మంత్రి నాని టీడీపీ నేతలపై తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు.   "టీడీపీ సన్నాసులకు చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టులు చదవడం తప్ప లోకజ్ఞానం తెలియదని" కొడాలి నాని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలే దళితులపై దాడులు చేయించి.. జగన్‌ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మంత్రి తాజాగా ఆరోపించారు. "దేనికీ పనికిరాని కొందరు టీడీపీ నేతలు టీవీల ముందుకు వచ్చి విషపూరిత ఉపన్యాసాలు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. దళితులకు ద్రోహం జరుగుతోందంటూ టీవీ చానళ్లు చర్చా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయని, వాస్తవానికి టీడీపీ నేతలే దళితులపై దాడులు చేయిస్తున్నారని అయన ఆరోపించారు. ఓవైపు దళితులపై దాడులు చేయిస్తూ, ప్రభుత్వంపై బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు.
ఏపీలో బీజేపీ సీనియర్ నేత దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఆమె ఇంటర్వ్యూ ఇస్తూ రాజధాని అమరావతి గురినిచి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ ఇంటర్వ్యూ పై ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. "పురంధేశ్వరి ఈరోజు ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ తొ, అందులో రాజధాని, ప్రభుత్వ పనితీరు అంశాలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఆమె జాతీయ నాయకురాలో, జాతి నాయకురాలో పూర్తిగా స్పష్టమైంది" అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ‌పై పలువురు నెటిజన్లు.. అలాగే బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఒక ప్రెస్ మీట్ ద్వారా స్పందించారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన విజయసాయిపై ఫైర్ అయ్యారు. అసలు విజయసాయిరెడ్డి ఒక జైలు పక్షి అని అయ్యన్న తీవ్ర వ్యాఖ్యలు చేసారు.   "నందమూరి కుటుంబం అంటే ఒక తులసీవనం లాంటిది. పురందేశ్వరిని విమర్శించే అర్హత విజయసాయికి అసలు ఉందా?. విజయసాయిరెడ్డి గంజాయి వనంలో గంజాయి మొక్కలాంటివాడు. అహంకారం నెత్తికెక్కి మాట్లాడుతున్నారా?. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో, దొంగలు రాజ్యమేలుతారు అంటే నేను నమ్మలేదు. అహంకారం ఉంటే నెత్తికెక్కి ఎక్కువగా మాట్లాడతారట. కళ్ళు మూసుకుపోయి, పోయే కాలం వచ్చిన వాళ్లే ఇవన్నీ మాట్లాడతారట.. ఆ లక్షణాలన్నీ నాకు విజయసాయిరెడ్డిలో కనిపిస్తున్నాయి. విశాఖ భూకుంభకోణంపై సిట్‌ కాదు.. దమ్ముంటే సీబీఐ దర్యాప్తు వేయండి. రాజకీయ పార్టీల నేతలే కాదు.. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు.. ఇందులో ఐఏఎస్ అధికారులు సైతం ఉన్నారు. అందరి జాతకాలు బయటకు వస్తాయి. దమ్ముంటే సీబీఐ దర్యాప్తు చేయండి. 16 నెలల పాలనలో ప్రజలకు మీరు ఏం చేశారో చెప్పాలి" అని విజయసాయిపై అయ్యన్న స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. 
ఏపీలో టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. తాజాగా చిత్తూర్ జిల్లాలో జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్ర పై దాడి చేసిన వారిని శిక్షించాలని టీడీపీ అధినేత చంద్రబాబు రాసిన లేఖకు బదులుగా డీజీపీ గౌతమ్ సవాంగ్ మరో లేఖ రాస్తూ సాక్ష్యాలు ఉంటే సీల్డ్ కవర్ లో పంపాలని రాసారు. దీనికి సమాధానంగా టీడీపీ నేత పట్టాభిరామ్ తాజాగా ప్రెస్ మీట్ పెట్టి డీజీపీని కొన్ని సూటి ప్రశ్నలు అడిగారు. ఒక రాష్ట్ర డీజీపీ మరీ ఇంతలా దిగజారతారా అని అయన నిలదీశారు. టీడీపీ అధినేత చంద్రబాబు లేఖపై స్పందించిన డీజీపీ.. మంత్రులు బొత్స సత్యనారాయణ, కొడాలి నాని వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదు? అని పట్టాభి ప్రశ్నించారు. చంద్రబాబుకు లేఖరాసినట్లుగానే ఎంపీ విజయసాయి రెడ్డికి డీజీపీ లేఖ రాయగలరా? అని అయన ప్రశ్నించారు.    ఏపీలోని హిందూ దేవాలయాల పై దాడుల వెనుక టీడీపీ హస్తం ఉందన్న నిరాధార వ్యాఖ్యలు చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ పై ఎందుకు చర్యలు తీసుకోరు అని అయన సూటిగా ప్రశ్నించారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా కొడాలి నాని మాట్లాడినా డీజీపీ ఎందుకు స్పందించడంలేదని.. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిని వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చని చట్టం చెబుతుంటే డీజీపీ ఎందుకు ఆ పని చేయరు? అని అయన ప్రశ్నించారు. విజయవాడ కనకదుర్గ ఆలయంలోని మూడు సింహాలు మాయమైపోయినట్లు.. మీ టోపీ పైన మూడు సింహాలు మాయం చేసేశారా డీజీపీ గారు.. మీ టోపీపై ఉన్న మూడు సింహాలను తాడేపల్లి ప్యాలెస్‌లో పెట్టారా? అని తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు. జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై హత్యాయత్నం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పట్టాభిరామ్ ఈ సందర్భంగా కోరారు.
గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికలు ముందే రాబోతున్నాయా? సిటీలో మున్సిపల్ మంత్రి కేటీఆర్ హడావుడి అందుకేనా? అంటే అవుననే తెలుస్తోంది. డిసెంబర్ లోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయని సమాచారం. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో సమావేశమైన మంత్రి కేటీఆర్.. ఇదే సంకేతమిచ్చారు. గ్రేటర్ ఎన్నికలు రెండు నెలల ముందే రావచ్చని అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు కేటీఆర్. ప్రస్తుత బల్దియా పాలకమండలి గడువు ఫిబ్రవరి వరకు ఉంది. అయితే రెండు నెలల ముందే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సంక్రాంతి లోపే అంటే డిసెంబర్ లోనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తుందట.    మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల గ్రేటర్ పై ఎక్కువ ఫోకస్ చేయడంతోనే ఎన్నికలు ముందే రాబోతున్నాయన్న ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే ముందస్తు ఎన్నికలకు సర్కార్ సిద్ధమవుతోంది. గ్రేటర్ ఎన్నికలను ముందే నిర్ణయించాలని డిసైడయ్యాకే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ పార్థసారథిని సర్కార్ సడెన్ గా నియమించినట్లు తెలుస్తోంది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రభుత్వ ఆదేశాలతో ఆయన యాక్షన్ లోకి దిగారు. గ్రేటర్ ఎన్నికల కసరత్తు ప్రారంభించారు పార్థసారథి. ఇటీవలే గ్రేటర్ అధికారులతో సమావేశమై ఎన్నికలపై చర్చించారు. వివిధ పార్టీల నేతలతోనూ మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకున్నారు. కరోనా ప్రభావం ఉన్నందున ఎలాంటి జాగ్రత్తలతో ఎన్నికలు నిర్వహించాలనే అంశంపైనా పార్థసారథి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు.    గ్రేటర్ లోని పెండింగ్ పనులపై వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు మంత్రి కేటీఆర్. పనులు త్వరగా పూర్తి చేసేలా అధికారులను డెడ్ లైన్ పెట్టి పరుగులు పెట్టిస్తున్నారు. పూర్తైన వాటికి ప్రారంభోత్సవాలు, కొత్త అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో హడావుడి చేస్తున్నారు కేటీఆర్. కొత్తగా నిర్మించిన రోడ్లు, ప్లైఓవర్లను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభిస్తున్నారు. దుర్గం చెరువుపై ప్రతిష్టాత్మంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ ను ఇటీవలే ప్రారంభించారు. సిటీలో ప్రధాన రోడ్లకు లింకు కలుపుతూ వేసిన స్లిప్ రోడ్లను అందుబాటులోకి తెస్తున్నారు. కేటీఆర్ దూకుడుతో సిటీలో పెండింగ్ పనులు చకచకా జరుగుతున్నాయి. గ్రేటర్ లో సమస్యగా మారిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపైనా కేటీఆర్ దృష్టి సారించారు. డిసెంబర్ లోగా 85 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణి చేయాలని హౌసింగ్ అధికారులకు డెడ్ లైన్ పెట్టారు మున్సిపల్ మంత్రి.    ఇక గ్రేటర్ లో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల సమావేశంలో కేటీఆర్ మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్టింగ్ కార్పొరేటర్ల పనితీరుపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 15 మంది కార్పొరేటర్ల పనితీరుపై బాగోలేదన్న మంత్రి.. కార్పొరేటర్లు ఇకనైనా తీరు మార్చుకోవాలని హెచ్చరించారట. జిహెచ్ఎంసి పరిధిలో ఇన్ని రోజులుగా చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకుపోవాలని కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. అయితే జీహెచ్ఎంసీ కార్పొరేటర్లను ఉద్దేశించి కేటీఆర్ చేసిన కామెంట్లపై మరో చర్చ జరుగుతోంది. తాను చేయించిన సర్వేల్లో ప్రతికూల ఫలితాలు రావడం వల్లే కార్పొరేటర్లపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. ఫలితాలు తమకు అనుకూలంగా రాకపోతే .. కార్పొరేటర్లపై నెపం మోపవచ్చని గులాబీ పార్టీ ప్లాన్ చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.    గ్రేటర్ హైదరాబాద్ లో ఇటీవల కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి. వరద రోడ్లను ముంచెత్తింది. నాలాలో పడి బాలిక, వరదలో గల్లంతై మరొకరు చనిపోయారు. బల్దియా పనితీరుపై సిటీ జనాల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. ఇక కార్పొరేటర్ల అక్రమ దందాలపైనా కేటీఆర్ కు  ఫిర్యాదులు వచ్చాయంటున్నారు. కార్పొరేటర్లు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని కొందరు ఫిర్యాదు చేశారట. అందుకే ముందే అప్రత్తమై కేటీఆర్ వారికి వార్నింగ్ ఇచ్చినట్లు చెబుతున్నారు. గత ఐదు సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం 67 వేల కోట్ల రూపాయలను హైదరాబాద్ లో వివిధ కార్యక్రమాల కోసం ఖర్చు చేసిందని చెప్పారట మంత్రి. వేల కోట్ల రూపాయలతో తాగునీటి ఇబ్బందులు తొలగించి, వందల కోట్ల రూపాయలతో రోడ్లను అభివృద్ధిపరచి , లక్షల కోట్ల పెట్టుబడులను హైదరాబాద్ కు రప్పించామని.. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారని చెబుతున్నారు.
ALSO ON TELUGUONE N E W S
  సారా అలీఖాన్ డ్ర‌గ్ కేసులో చిక్కుకొని ఉక్కిరి బిక్కిర‌వుతోంది. శ‌నివారం ఆమెను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఇంట‌రాగేట్ చేసింది. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుని డ్ర‌గ్ కోణంలో విచారిస్తున్న ఎన్సీబీ సారా పేరు వెల్ల‌డి కావ‌డంతో ఆమెకు స‌మ‌న్లు జారీచేసి విచారించింది. కాగా ఈ కేసులో కూతురు సారాకు స‌హాయం చేయ‌డానికి సైఫ్ అలీఖాన్ నిరాక‌రించాడంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ క‌థ‌నాన్ని ప్ర‌సారం చేసింది. బాలీవుడ్ డ్ర‌గ్ ద‌ర్యాప్తులో త‌న పేరు వెలుగులోకి వచ్చాక‌, ఎదురైన ప‌రిణామాల్ని హ్యాండిల్ చేయ‌డానికి సారా ఇంక ఏమాత్ర‌మూ తండ్రి మీద ఆధార‌ప‌డే స్థితి క‌నిపించ‌డం లేదు. ఈ విష‌యంలో సారాకు సాయం చేయ‌డానికి సైఫ్ ఆస‌క్తి చూప‌డం లేదు. ఆఖ‌రుకి మాజీ భార్య‌, సారా త‌ల్లి అమృతా సింగ్ చేసిన అభ్య‌ర్థ‌న‌ను కూడా సైఫ్ పెడ‌చెవిన పెట్టాడ‌ని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ తెలియ‌జేసింది. పైగా, గ‌ర్భ‌వ‌తిగా ఉన్న భార్య క‌రీనా క‌పూర్‌, కొడుకు తైమూర్ అలీఖాన్‌ను వెంట‌పెట్టుకొని ఢిల్లీ వెళ్లిపోయాడంట‌. అక్క‌డ క‌రీనా హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఆమిర్ ఖాన్ మూవీ 'లాల్ సింగ్ చ‌డ్ఢా' షూటింగ్ జ‌రుగుతోంది. అయితే సారా నాయ‌న‌మ్మ ష‌ర్మిలా ఠాగూర్ మాత్రం మ‌న‌వ‌రాలికి ఈ విష‌యంలో హెల్ప్ చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తోంద‌ట‌.
  సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో డ్రగ్స్‌ కోణాన్ని వెలికితీసే పనిలో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) బిజీగా ఉంది. ఇప్పటికే కేసులో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌ సహా కొందరిని అరెస్ట్‌ చేశారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్లు దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్‌, సారా అలీ ఖాన్‌, రకుల్‌కి సమన్లు ఇచ్చారు. విచారణ చేపట్టారు. అయితే, మీడియాలో డ్రగ్స్‌ కేసుకు సంబంధించి తన పేరు మీద కథనాలు, వార్తలు ప్రసారం కాకుండా చూడాలని ఢిల్లీ హైకోర్టుకు రకుల్‌ వెళ్ళారు. ఈ సంగతి తెలిసిందే. రకుల్‌ పిటీషన్‌ స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు, తాజాగా ఈ కేసు విషయమై కేంద్రం సహా కొంతమందికి నోటీసులు జారీ చేసింది. రకుల్‌ మీద వస్తున్న కథనాలపై చర్యలు తీసుకోవాలని కోరింది. రకుల్‌ సైతం డ్రగ్స్‌ తీసుకున్నట్టు సుశాంత్‌ ప్రియురాలు, ఆల్రెడీ కేసులో అరెస్ట్‌ అయిన రియా చక్రవర్తి చెప్పినట్టు వార్తలు వచ్చాయి. డ్రగ్స్‌ గురించి రియాతో డిస్కస్‌ చేసిన మాట వాస్తవమే కానీ తానెప్పుడూ డ్రగ్స్‌ తీసుకోలేదని ఎన్సీబీకి రకుల్‌ చెప్పిందట. ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
  క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి ఆగ‌కుండా విజృంభిస్తున్న‌ప్ప‌టికీ, ఇంత కాలం ప‌ని ఆపి కూర్చున్న సినీ, టెలివిజ‌న్ రంగాలు.. కొన్ని వారాలుగా నెమ్మ‌దిగా ప‌నులను పునఃప్రారంభిస్తూ వ‌స్తున్నాయి. అదే విధంగా త‌లైవి సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు ఫైర్‌బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. లేటెస్ట్‌గా త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆమె షేర్ చేసిన పోస్ట్ దీన్ని తెలియ‌జేస్తోంది. "ఫైన‌ల్లీ బ్యాక్ టు వ‌ర్క్" అనే కాప్ష‌న్‌తో త‌న అసిస్టెంట్ కొరియోగ్రాఫ‌ర్‌తో డాన్స్ రిహార్స‌ల్ చేస్తూ తీసుకున్న సెల్ఫీని ఆమె షేర్ చేశారు. కంగ‌న ప్ర‌స్తుతం త‌న స్వ‌స్థ‌లం హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని మ‌నాలిలో ఉంటున్నారు. త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌గా త‌యార‌వుతున్న త‌లైవిలో ఓ పాట కోసం ఆమె అక్క‌డే డాన్స్ రిహార్స‌ల్స్ చేస్తున్నారు. దానికి సంబంధించి అసిస్టెంట్ కొరియోగ్రాఫ‌ర్ ప్ర‌స‌న్న‌బాబు త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ర‌నౌత్‌తో దిగిన సెల్ఫీని షేర్ చేశాడు. అందులో ఫ్రెండ్స్ టీ-ష‌ర్ట్ వేసుకున్న కంగ‌న.. సెల్ఫీ కోసం న‌వ్వుతూ నిల్చున్నారు. "ఫైన‌ల్లీ బ్యాక్ టు వ‌ర్క్‌. జ‌య‌ల‌లిత మేడ‌మ్ బ‌యోపిక్ 'త‌లైవి' కోసం డాన్స్ రిహార్స‌ల్ స్టార్ట్ చేశాం. బోల్డ్ అండ్ ద బ్యూటిఫుల్‌, మోస్ట్ హంబుల్ ప‌ర్స‌న్‌, ఇన్‌స్పైరింగ్ స్టార్ యాక్ట్రెస్ కంగ‌నా ర‌నౌత్ మేడ‌మ్‌తో అద్భుత‌మైన రిహార్స‌ల్ టైమ్ గ‌డిపాను. సాంగ్ షూట్ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నా. ఈ పాట‌కు నా మాస్ట‌ర్, ఎవ‌ర్‌గ్రీన్ బృంద మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ అందిస్తున్నారు" అని రాసుకొచ్చాడు ప్ర‌స‌న్న‌. ఆ ఫొటోనే త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు కంగ‌న‌.
  'సవ్యసాచి' చిత్రంలో ప్రతినాయకుడిగా నటించడం ద్వారా తొలిసారి నేరుగా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన‌ మాధవన్... 'నిశ్శబ్దం'తో మరోసారి ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అతడు సెల‌బ్రిటీ మ్యుజీషియ‌న్‌గా నటించాడు. గతంలో మాధవన్ అంటే 'సఖి' తరహా రొమాంటిక్ సినిమాలు గుర్తొచ్చేవి. ఇప్పుడు అతడు హారర్, థ్రిల్లర్ సినిమాల్లో ఎక్కువ నటిస్తున్నాడు. అలాగని, రొమాన్స్‌కి దూరం కావడం లేదంటున్నాడు. "రొమాన్స్ వయసుకు తగ్గట్టు ఉండాలి. 2030లో కూడా హీరోయిన్లతో రొమాన్స్ చేస్తాను. అయితే, ఆ కథలు నా వయసుకు తగ్గట్టు ఉండాలి. చాలా సినిమాల్లో తమ కంటే వయసులో చాలా చిన్నవాళ్లు అయిన హీరోయిన్లను హీరోలు రొమాన్స్ చేస్తూ ఉంటారు. ఇద్దరినీ చూస్తే మంచిగా అనిపించదు" అని మాధవన్ అన్నాడు. మొదట 'నిశ్శబ్దం'ను డైలాగులు లేకుండా మూకీ సినిమాగా తీయాలని అనుకున్నారట. హారర్ థ్రిల్లర్ కనుక ప్రేక్షకులకు అర్థం అవుతుందో? లేదో? అని అనుష్క పాత్రకు కాకుండా మిగతా పాత్రలకు కొన్ని డైలాగులు యాడ్ చేశామని మాధవన్ తెలిపాడు. ఈ సినిమాలో చెవిటి, మూగ అమ్మాయి పాత్రలో అనుష్క నటించారు. అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో సినిమా విడుదల అవుతోంది.
  యాక్ట‌ర్లు ఎంత‌మందో ఉంటారు. కానీ అన్ని ర‌సాలు స‌మ‌పాళ్ల‌లో రంగ‌రించి న‌టించే న‌వ‌ర‌స న‌టులు కొంద‌రే ఉంటారు. అలాంటి వారిలో ముందు వ‌రుస‌లో ఉండే న‌టుడు మోహ‌న్‌బాబు. విల‌న్‌గా ముఖంగా క్రూర‌త్వాన్ని అద్భుతంగా ప్ర‌ద‌ర్శించే ఆయ‌న‌, అదే క్రూర‌త్వంలో కామెడీని కూడా మిక్స్ చేసి వ‌హ్వా అనిపించ‌గ‌ల విల‌క్ష‌ణ న‌టుడు మోహ‌న్‌బాబు. మొద‌ట డైరెక్ష‌న్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ డైరెక్ట‌ర్ స్థాయి నుండి న‌టుడిగా మారి విల‌న్ గిరికి ఎదిగి, అక్క‌డి నుంచి హీరోగా ఒకానొక ద‌శ‌లో టాప్ రేంజికి చేరుకోవ‌డం అంటే ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. అది ఆయ‌న‌కే చెల్లింది. కావాల్సినంత ఎత్తు, విన‌సొంపైన డైలాగ్ డెలివ‌రీ సొంతం చేసుకున్న మోహ‌న్‌బాబు హీరోగా న‌టిస్తూ కామెడీతో ప‌లికే ఊత‌ప‌దాలు, మేన‌రిజాలు ఇటు మాస్‌నీ, అటు క్లాస్‌నీ ఉర్రూత‌లూగించాయి. అయితే ఆయ‌న సినిమాల్లో డ‌బుల్ మీనింగ్స్ ఉంటాయ‌నే విమ‌ర్శ లేక‌పోలేదు. ప్రొడ్యూస‌ర్‌గా మోహ‌న్‌బాబు ఎన్నో విజ‌యాలు సాధించారు. టాప్ స్టార్స్ సినిమాలతో పాటు త‌న సినిమాల‌ను ధైర్యంగా రిలీజ్ చేసి బ్లాక్‌బ‌స్ట‌ర్స్ అందుకున్నారు. హీరోగా త‌న ప్ర‌తిభ‌ను త‌న సొంత చిత్రాల ద్వారానే ఎక్కువ‌గా రుజువు చేసుకున్నారు. కొన్ని సినిమాలు ఆయ‌న‌ను క‌లెక్ష‌న్ కింగ్‌ను చేశాయి. అన్ని సినిమాలూ ఆయ‌న‌ను డైలాగ్ కింగ్‌గా నిరూపించాయి. ఇప్పుడు త‌న‌కు బాగా న‌చ్చిన పాత్ర‌ల‌నే ఎంపిక చేసుకుంటూ న‌టుడిగా త‌న ప‌య‌నాన్ని కొన‌సాగిస్తున్నారు మోహ‌న్‌బాబు.
  డాక్టర్ ఎం.కె. దాస్ పాత్రలో నాని నటించిన సినిమా 'దేవ దాస్'. అందులో నానికి జంటగా రష్మిక మంద‌న్న‌ నటించారు. వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో అదే తొలి సినిమా. ఇప్పుడు మరోసారి దాసుతో రష్మిక జంట కట్టే అవకాశాలు ఉన్నాయని ఫిలింనగర్ టాక్. ప్రస్తుతం నాని 'టక్ జగదీశ్' చేస్తున్నారు. కరోనా వల్ల షూటింగుకి అంతరాయం ఏర్పడింది. త్వరలో మళ్ళీ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లి డిసెంబర్ కి కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీని తరవాత 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో 'శ్యామ్ సింగ రాయ్' చిత్రీకరణ ప్రారంభించనున్నారు. 'శ్యామ్ సింగ రాయ్'లో నానితో 'ఎంసీఏ'లో నటించిన సాయి పల్లవి హీరోయిన్. కథలో మరో రెండు కీలక పాత్రలు ఉన్నాయట. అందులో ఓ పాత్రకు నిత్యా మీనన్ ను తీసుకోవాలని ముందు అనుకున్నారు. నిత్యా ఏమన్నదో? ఇప్పుడు రష్మికా మందన్నా అయితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. కథలో కీలకమైన పాత్ర కావడంతో ఆమె ఓకే అంటుందని ఆశిస్తున్నారు. అల్లు అర్జున్ 'పుష్ప'లో రష్మిక హీరోయిన్. ఆ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ బట్టి మిగతావి అడ్జస్ట్ చేసుకోవాలి.
  'సర్కారు వారి పాట' సినిమా చిత్రీకరణకు నవంబర్ లో సూపర్ స్టార్ మహేశ్‌ బాబు అమెరికా వెళ్లనున్నారు. అక్కడ లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారని సమాచారం. నవంబర్ నుండి ఈ ఇయర్ ఎండ్ వరకు మహేశ్‌ అమెరికాలోనే ఉంటారని టాక్. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు కూడా అగ్రరాజ్యంలోనే సెలబ్రేట్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. పరశురామ్ దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తున్న సినిమా 'సర్కారు వారి పాట'. తొలిసారి ఈ దర్శకుడికి మహేశ్‌ అవకాశం ఇచ్చారు‌. బ్యాంకింగ్ నేపథ్యంలో అతడు మంచి కథ రాశారట. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ కొన్ని ట్యూన్స్‌ ఫైనల్ చేశారు. నవంబర్ మొదటివారంలో సర్కారు వారి పాట అమెరికా షెడ్యూల్ మొదలు కానుంది. వాషింగ్టన్, ఫ్లోరిడా తదితర ప్రదేశాల్లో చిత్రీకరణ చేయనున్నారు. అందుకు అవసరమైన అనుమతులను తీసుకునే పనిలో నిర్మాతలు ఉన్నారు. డిసెంబర్ నెలాఖరు వరకు అక్కడే చిత్రీకరణ చేయనున్నారు. కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సినిమాలో మహేశ్‌ సరసన కథానాయికగా ఎవరు నటిస్తున్నది నిర్మాతలు అధికారికంగా ప్రకటించక‌పోయినా, తాను మ‌హేశ్ స‌ర‌స‌న న‌టిస్తున్న‌ట్లు  కీర్తి సురేశ్ స్వయంగా వెల్ల‌డించింది.
  బాలీవుడ్ డ్రగ్స్ కేసులో హీరోయిన్లు దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ ఫోన్లను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, వాళ్ల సంతకాలు తీసుకోవడం మరిచారని నేషనల్ న్యూస్ ఛానల్ టైమ్స్ నౌ పేర్కొంటోంది. ఫోన్లు సీజ్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ మీద ఆ హీరోయిన్ల సంతకాలు తీసుకోవడం కంపల్సరీ. జరిగిన పొరపాటును గ్రహించిన అధికారులు వెంటనే దిద్దుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. దీపిక, రకుల్, సారా, శ్రద్ధా... నలుగురిని ఎన్సీబీ అధికారులు ఇంటరాగేషన్ చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ఇద్దరు సంతకాలను సోమవారం తీసుకున్నారట. సారా అలీ ఖాన్ ఇంటికి వెళ్లగా... ఆమె ఇంట్లో లేదట. దాంతో సారా అలీ ఖాన్ వ్యక్తిగత సిబ్బంది సంతకాలు తీసుకుని వచ్చారట. సుశాంత్ తో సన్నిహితంగా ఉన్న విషయాన్ని ఎన్సీబీ అధికారుల విచారణలో సారా అలీ ఖాన్ అంగీకరించినట్లు సమాచారం. అయితే తానెప్పుడు డ్రగ్స్ తీసుకోలేదని ఆమె చెప్పారట. అలాగే శ్రద్ధా కపూర్ సైతం సుశాంత్ ఫాంహౌస్ పార్టీకి వెళ్లాననీ, కానీ డ్రగ్స్ ఎప్పుడూ తీసుకోలేదనీ, పార్టీకి అందరూ వచ్చేలోపే తాను అక్కడి నుండి వచ్చేసాననీ చెప్పారట.
  నాలుగో వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటిసభ్యుల్లో సోహైల్, అఖిల్ లను స్టోర్ రూం లో ఉన్న హిట్‌మ్యాన్‌ డ్రస్సులు ధరించాలని బిగ్ బాస్‌ ఆదేశించాడు. ఇంటిసభ్యులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు, హిట్‌మ్యాన్‌కు ఐదువేల రూపాయలు ఇచ్చాడు బిగ్ బాస్. బజర్ మోగినప్పుడల్లా డెన్ లో ఉండే హిట్‌మెన్‌ వద్దకు ఒకరు వెళ్ళి హౌస్ లో ఒకరి పేరు చెప్పి, వారిని ఎందుకు చంపాలో కారణం చెప్పి డీల్ కుదుర్చుకోవాలి. హిట్‌మ్యాన్‌ వారిని చంపిన తర్వాత పదివేల రూపాయలు ఇవ్వాలి. ఇలా ఐదు సార్లు బజర్ మోగినప్పుడు ఐదుగురు నామినేట్ అవుతారు. చివరకు హిట్‌మెన్‌లో ఎవరి దగ్గర తక్కువ డబ్బులు ఉంటే వారు నామినేట్ అవుతారు. అయితే హౌస్ కెప్టెన్ గా ఉన్న గంగవ్వ, దేవి బిగ్ బాంబ్ లో సేఫ్ అయిన అరియానాను ఎవరూ నామినేట్ చేయవద్దని సూచిస్తూ నామినేషన్ ప్రక్రియను బిగ్ బాస్ వివరించాడు. డీల్ కుదుర్చున్న తర్వాత బజర్ మోగగానే అఖిల్ పిస్టల్ అందుకుని ఇంటిలోకి వెళ్ళి స్వాతి మెడలో నామినేటెడ్ అన్న ట్యాగ్ వేసి రాజశేఖర్ చెప్పిన కారణం  చెప్పి పిస్టల్ తో ఆమెను షూట్ చేశాడు. ఆ తర్వాత అభిజిత్ ను మోహబూబ్, లాస్యను అరియానా చంపాలని డీల్ చేసుకున్నారు. దాంతో అభిజిత్ ను, లాస్య‌ను అఖిల్ చంపాడు. మోహబూబ్  పేరును హారిక చెప్పగా అత‌డిని తుపాకీ ముందుగా అందుకున్న సోహైల్ చంపాడు. చివరి బజర్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే నోయల్ హిట్ మెన్ డెన్‌ దగ్గర కాపు కాశాడు. బజర్ మోగగానే ఇంటిసభ్యులు పరిగెత్తుకుంటూ వచ్చే లోగానే నోయల్ డెన్ లోకి వెళ్లాడు.   కుమార్ సాయిని చంపాలని డీల్ చేసుకుంటున్న సమయంలో నోయల్ డెన్ లోకి లాన్ లో నుంచి వచ్చాడని, అది చెల్లదని కుమార్ సాయి అన్నాడు. బిగ్ బాస్ చేసిన సూచనలను మరోసారి చదివి వినిపించాడు. దాంతో నోయల్ ఎంట్రీ చెల్లలేదు. బజర్ మోగగానే ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ ఫస్ట్ వచ్చిన సుజాతకు హిట్ మెన్ లతో ఢీల్ కుదుర్చుకునే అవకాశం వచ్చింది. సుజాత కూడా కుమార్ సాయి పేరే చెప్పడంతో కంటెస్టెంట్ మారినా నామినేషన్ మారలేదు అంటూ ఇంటిసభ్యులు నిట్టూర్చారు. ఎవరితో కలవడం లేదు అని ఎన్నిసార్లు చెప్తారు, కొత్తగా ఎమైనా ఉంటే చెప్పండి అంటూ కుమార్ సాయి కామెంట్స్ చేశాడు. కుమార్ ను చంపే డీల్ అఖిల్ తీసుకున్నాడు. దాంతో ఈ మొత్తం డీల్ లో అఖిల్ నలుగిరిని చంపి 40వేలు సంపాదించాడు. సోహైల్ ఒకరిని చంపి పదివేలు తీసుకున్నాడు. తక్కువ వచ్చిన వాళ్ళు నామినేట్ అవుతారని బిగ్ బాస్ చెప్పడంతో అఖిల్  డీల్ అమౌంట్ లో కొంత సోహైల్ కొట్టేశాడు. సగంసగం పంచుకుందామని అఖిల్ తో అన్నాడు.  దాంతో అఖిల్ అదంతా ఏం లేదు.. గేమ్ గేమే అంటూ వారించాడు. ఈ వారం ఏడుగురు.. మళ్ళీ కుమార్ సాయి నామినేషన్ ప్రక్రియ పూర్తి కాగానే హిట్ మెన్ ల్లో ఎవరికి ఎక్కువ డబ్బులు వచ్చాయో చెప్పమన్నాడు బిగ్ బాస్. అఖిల్ కు ఎక్కువ డబ్బులు రావడంతో అతను నామినేషన్ నుంచి సేఫ్ అయ్యారు. అంతేకాదు మరో సభ్యుడిని నామినేట్  చేసే అవకాశం బిగ్‌ బాస్ అఖిల్ కు ఇవ్వడంతో అతను హారికను నామినేట్ చేశాడు. దాంతో స్వాతి, అభిజిత్, లాస్య, మోహబూబ్, హారిక, కుమార్ సాయి, సోహైల్‌ ఈ వారం నామినేషన్ లోకి వచ్చారు. మరి నాలుగో వారం వారికి ఇచ్చే టాస్క్ లు, సభ్యుల ఫర్మామెన్స్, ప్రేక్షకుల ఓట్లు ఎవరిని బిగి బాస్ హౌస్ లో ఉంచుతాయో.. ఎవరిని ఇంటిదారి పట్టేలా చేస్తుందో తెలుస్తుంది.
  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, స్నేహారెడ్డి ల‌వ్ స్టోరీతో ఓ మంచి న‌వ‌ల రాయొచ్చు, ఓ సినిమా తీయొచ్చు. భావోద్వేగాల విష‌యంలో భిన్న ధ్రువాలైన ఆ ఇద్ద‌రూ ప‌ర‌స్ప‌రం ఆక‌ర్షితులై, ప్రేమ‌లో ప‌డి, పెద్ద‌ల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. సెప్టెంబ‌ర్ 29 మంగ‌ళ‌వారం అల్లు స్నేహారెడ్డి 33వ పుట్టిన‌రోజు జ‌రుపుకున్నారు. ఎమోష‌న్స్‌ను దాచుకొనే అల‌వాటు ఏమాత్రంలేని బ‌న్నీ తామిద్ద‌రూ ఉన్న ఓ బ్యూటిఫుల్ పిక్చ‌ర్‌ను షేర్ చేసి, త‌న ప్రియ‌మైన భార్య‌కు విషెస్ తెలిపాడు. త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో బ‌ర్త్‌డే కేక్ క‌ట్ చేస్తున్న స్నేహ పిక్చ‌ర్‌ను షేర్ చేసిన బ‌న్నీ, "నా లైఫ్‌లో మోస్ట్ స్పెష‌ల్ ప‌ర్స‌న్‌కు many many happy returns of the day.. మ‌రిన్ని మ‌రిన్ని బ‌ర్త్‌డేస్‌ను నీతో స్పెండ్ చేయాల‌ని కోరుకుంటున్నా. Happy birthday cutieeee... #allusnehareddy" అంటూ క్యూట్ విషెస్ తెలిపాడు. పిక్చ‌ర్‌లోని లైటింగ్‌ని బ‌ట్టి చూస్తుంటే అది అర్ధ‌రాత్రి 12 గంట‌లు దాటి 29వ తేదీ రాగానే జ‌రిపిన బ‌ర్త్‌డే వేడుక అని అర్థ‌మ‌వుతోంది. కొన్నేళ్ల క్రితం ఒక ఫ్రెండ్ పెళ్లికి యు.ఎస్‌. వెళ్లిన బ‌న్నీ అక్క‌డ తార‌స‌ప‌డిన స్నేహ‌కు తొలిచూపులోనే మ‌న‌సిచ్చేశాడు. స్నేహ అంత‌కుముందు అర్జున్ గురించి విని ఉంది కానీ, అత‌ని సినిమాలేవీ చూసిన జ్ఞాప‌కం లేదు. మెసేజ్‌ల ద్వారా పెరిగిన ప‌రిచ‌యం క్ర‌మంగా ప్రేమ‌గా మారింది. త‌న‌యుడి ప్రేమ వ్య‌వ‌హారం అల్లు అర‌వింద్ క‌నిపెట్టేశారు. తండ్రికి దాప‌రికం లేకుండా త‌న ప్రేమ విష‌యం చెప్పేశాడు బ‌న్నీ. మొద‌ట కొంత వ్య‌తిరేకించినా, బ‌న్నీ ప‌ట్టుద‌ల‌, అత‌ని ప్రేమ‌లోని నిజాయితీ గ్ర‌హించి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు అర‌వింద్‌. 2010 న‌వంబ‌ర్ 26న నిశ్చితార్ధం జ‌ర‌గ‌గా, 2011 మార్చి 6న దంప‌తులుగా మారారు బ‌న్నీ, స్నేహ‌. అప్ప‌ట్నుంచీ వారి వైవాహిక జీవితం చాలా హ్యాపీగా సాగుతోంది. వారి అనురాగానికి చిహ్నాలుగా కొడుకు అయాన్‌, కూతురు అర్హ పుట్టారు.
రాజకీయ వ్యూహాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ దిట్ట అంటుంటారు. పరిస్థితులు బాగున్నప్పుడు ఒకలా,,, తనకు అనుకూలంగా లేనప్పుడు మరోలా ఆయన అడుగులు వేస్తుంటారు. అవసరమైతే పూర్తి భిన్నమైన వైఖరులు కూడా తీసుకుంటారు. ఎంతకైనా తెగిస్తారు. అందుకే కేసీఆర్ కు మాటమీద నిలబడరనే ఆరోపణలున్నాయి. అవేమి పట్టించుకోని కేసీఆర్.. తాను అనుకున్నది సాధించేందుకు వెనక్కి తగ్గరనే అభిప్రాయం ఉంది. తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లోనూ కేసీఆర్ ఇదే తరహా కొత్త ఎత్తులు వేస్తున్నారు.    కేసీఆర్ సర్కార్ పై ఉద్యోగులు, నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. టీఆర్ఎస్ నేతలే ఈ విషయాన్ని బహిరంగంగా చెబుతున్నారు. త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజార్టీ ఓటర్లు వీరే. అందుకే మండలి ఎన్నికలు కారు పార్టీని టెన్షన్ పెట్టిస్తున్నాయి. అధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా ముందుకు రాని పరిస్థితి ఉంది. పార్టీ పరిస్థితిని అంచనా వేసిన గులాబీ బాస్ మండలి ఎన్నికల్లో గెలుపు కోసం మరో స్కెచ్ వేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకవైపు వెళ్లకుండా, చీలిపోయేలా ఆయన ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. వీలైనంత ఎక్కువ మంది అభ్యర్థులు మండలి బరిలో ఉండేలా పావులు కదుపుతున్నారు. కేసీఆర్ ప్లాన్ లో భాగంగానే మండలి ఎన్నికల్లో కమ్యూనిస్టులు పోటీ చేయాలని నిర్ణయించారనే ప్రచారం జరుగుతోంది. అందుకే టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ కు వామపక్షాలు మద్దతు ఇవ్వడం లేదని తెలుస్తోంది.   గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ తో కలిసి కమ్యూనిస్టులు పోటీ చేశారు. ఎన్నికల తర్వాత కూడా కోదండరామ్ తో కలిసి పలు ఉద్యమాలు చేశారు. వామపక్ష పోరాట కార్యక్రమాలకు కోదండరామ్ తప్పనిసరిగా హాజరవుతూ వస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడే యూటర్న్ తీసుకుంటున్నారు కమ్యూనిస్టు నేతలు. టీజేఏసీ చైర్మెన్ గా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన, ఇంతకాలం తమ ఉద్యమాలకు మద్దతుగా  కోదండరామ్ ఎమ్మెల్సీ బరిలో ఉంటుంటే మాత్రం ఆయనకు సపోర్ట్ చేయడం లేదు. కోదండరామ్ కు మద్దతు ఇవ్వాలని టీజేఎస్ అధికారికంగా లేఖలు రాసినా కమ్యూనిస్టు పార్టీలు స్పందించలేదని సమాచారం.    శాసనమండలి ఎన్నికలో పోటీ చేయబోతున్న కోదండరామ్ కు వామపక్షాలు సపోర్ట్ చేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వామపక్షాల తీరుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. గత పట్టభద్రుల మండలి ఎన్నికల్లో కమ్యూనిస్టులు పోటీ చేయలేదు. అలాంటిది ఇప్పుడు ఎందుకు పోటీలో ఉంటున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. కేసీఆర్ చెప్పడం వల్లే మండలి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్, బీజేపీ, కోదండరామ్ తో పాటు వామపక్ష అభ్యర్థి, పోటీలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి పోతుందని, అంతిమంగా అది అధికార పార్టీకి లాభిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే కేసీఆర్ డైరెక్టుగా వారితో పొత్తు పెట్టుకోకుండా.. మండలి ఎన్నికల్లో మరో దారిలో వస్తున్నారని చెబుతున్నారు.    అసెంబ్లీ సమావేశం సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డితో కలిసి కేసీఆర్ లంచ్ చేశారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికతో పాటు మండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై మాట్లాడటానికే చాడాను కేసీఆర్ పిలిపించినట్లు అప్పుడే ప్రచారం జరిగింది. కాని సీపీఐ నేతలు మాత్రం ఖండించారు. కొత్త రెవిన్యూ చట్టం గురించే చాడాతో ముఖ్యమంత్రి మాట్లాడారని వివరణ ఇచ్చారు. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఎన్నికల గురించే కేసీఆర్ సీపీఐ నేతతో మాట్లాడినట్లు అంతా అభిప్రాయపడుతున్నారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికపైనా కమ్యూనిస్టులు ఇంకా తమ వైఖరిని ప్రకటించకపోవడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. దుబ్బాకలోనూ అధికార పార్టీకి వామపక్ష పార్టీలు మద్దతు ఇవ్వొచ్చని చెబుతున్నారు.
భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ కమిటిలో తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి చోటు దక్కగా.. గతంలో కమిటీలో పనిచేసిన ముగ్గురు సీనియర్లను తప్పించారు. ఇప్పటివరకు బీజేపీ ప్రధాన కార్యదర్శులుగా ఉన్న రాంమాధవ్‌, మురళీధర్‌రావులను తప్పించారు. జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న జీవీఎల్ నరసింహరావును ఈసారి జాతీయ కమిటీలోకి తీసుకోలేదు. ఈ ముగ్గురు సీనియర్ నేతలకు జేపీ నడ్డా టీమ్ వో  చోటు దక్కకపోవడంపై ఆసక్తి కర చర్చ జరుగుతోంది. బీజేపీలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.                      రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జీవీఎల్‌ నరసింహారావు ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల్లో తలదూర్చి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. అన్ని అంశాల్లోనూ జీవీఎల్ వైఖరి వైసీపీకి అనుకూలంగా, టీడీపీకి వ్యతిరేకంగా ఉంటుందనే గతంలోనే హైకమాండ్ కు కొందరు నేతలు ఫిర్యాదులు చేశారు. అమరావతి విషయంలోనూ రాష్ట్ర నేతల అభిప్రాయానికి భిన్నంగా జీవీఎల్ ప్రకటనలు ఇచ్చేవారనే విమర్శలు బీజేపీలోనే ఉన్నాయి. జగన్ ప్రభుత్వంపై వచ్చే అవినీతి ఆరోపణల విషయంలోనూ జీవీఎల్ ప్రకటనలు రాష్ట్ర పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో పోరాడాలని భావించిన రాష్ట్ర నేతలకు జీవీఎల్ ప్రకటనలు చాలా సార్లు అడ్డంకులు కల్పించాయి. దీంతో రాష్ట్ర నేతల నుంచి వచ్చిన అభిప్రాయాలు.. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలించాకే జీవీఎల్ ను అధికార ప్రతినిధి బాధ్యతల నుంచి హైకమాండ్ తప్పించిందని  బీజేపీ వర్గాల్లో  ప్రచారం జరుగుతోంది.    జాతీయ కమిటీలో స్థానం కోల్పోయిన తెలంగాణకు చెందిన సీనియర్ నేత మురళీధర్‌రావుపైనా ఇదే రకమైన చర్చ జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మురళీధర్ సన్నిహితంగా ఉంటారనే ఆరోపణలున్నాయి. తెలంగాణ ప్రభుత్వంపై పోరాటంలో ఆయన ఎప్పడూ యాక్టివ్ గా లేరని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ కారణంగానే ఆయనను తప్పించారని సమాచారం. కరీంనగర్ కు చెందిన బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నందున.. అదే జిల్లాకు చెందిన మురళీధర్ రావును జాతీయ కమిటి నుంచి తప్పించారనే చర్చ కూడా జరుగుతోంది. ఉత్తర తెలంగాణ వ్యక్తికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినందున..దక్షిణ తెలంగాణకు చెందిన డీకే అరుణకు వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కట్టబెట్టారని భావిస్తున్నారు.    పార్టీ సినియర్ నేత రాంమాధవ్ ను జాతీయ కమిటి నుంచి తప్పిస్తారని చాలా  కాలంగా ప్రచారం జరుగుతోంది. రాంమాధవ్‌ను గత కొంతకాలంగా పార్టీ వివిధ బాధ్యతల నుంచి తప్పిస్తూ వస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ త్వరలో తన కేబినెట్‌ను విస్తరించనున్నట్లు, అందులో రాంమాధవ్ కు అవకాశం కల్పిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే రాంమాధవ్ కు జాతీయ కమిటీలో చోటు దక్కలేదంటున్నారు.    భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ కమిటీలో తెలుగు రాష్ట్రాలకు సముచిత ప్రాధాన్యత దక్కింది. ఏపీ నుంచి ఇద్దరు, తెలంగాణ నుంచి ఇద్దరు నేతలతు జేపీ నడ్డా టీమ్ లో చోటు దక్కింది. తెలంగాణకు చెందిన మాజీ మంత్రి డీకే అరుణకు వైస్ ప్రెసిడెంట్  ఏపీ నుంచి  దగ్గుబాటి పురందేశ్వరికి  జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్‌ను అదే పదవిలో కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ను ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమించారు.
సోషల్ మీడియా వేదికగా కొందరు సన్నాసులు రెచ్చిపోతున్నారు. అసత్యాలు ప్రచారం చేస్తూ పైశాచికానందం పొందుతున్నారు. చీప్ పబ్లిసిటి కోసం, సొంత ప్రయోజనాల కోసం ప్రముఖులను బద్నాం చేస్తున్నారు. ఏపీలో కొన్ని వర్గాలే టార్గెట్ గా ఈ కుట్రలు చేస్తున్నారు. కావాలని బురద చల్లుతూ సిగ్గు లేని వెధవలు సంతోష పడుతున్నారు. అనారోగ్యంతో చనిపోయిన గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం మరణంపైనా పిచ్చోళ్లలా పిచ్చి రాతలు రాస్తున్నారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుపై బురద చల్లుతూ వికృత చేష్టలకు దిగారు బుద్ది, జ్ఞానం లేని చిల్లరగాళ్లు. ఎస్పీ బాలు చావుకు రామోజీరావుకు ముడిపెడుతూ చిల్లర రాతలకు దిగారు. రామోజీ రావు బలవంతం మీదే ఈటీవీ ప్రోగ్రామ్ లో పాల్గొనేందుకు చెన్నై నుంచి బాలసుబ్రమణ్యం హైదారాబాద్ వచ్చారని.. రామోజీ ఫిల్మ్ సిటీకి రావడంతోనే బాలుకి కరోనా సోకిందని  ప్రచారం చేస్తున్నారు. ఈటీవీ ఈవెంట్ లో పాల్గొన్న చాలా మంది కళాకారులకు కరోనా సోకిందని.. బాలు తప్ప అందరూ కోలుకున్నారని ఫేస్ బుక్ పేజీల్లో, వెబ్ సైట్లలో ఇష్టమెచ్చినట్లుగా రాసుకొచ్చారు. రామోజీ ఫిల్మ్  సిటీకి వెళ్లడం వల్లే బాలు చావు తెచ్చుకొన్నాడని, ఈ పాపం రామోజీ రావుదే నంటూ పైశాచికత్వం ప్రదర్శించారు.    అయితే సోషల్ మీడియాలో సన్నాసులు  ప్రచారం చేస్తున్నదంతా పచ్చి బూటకమని తేలిపోయింది. ఇటీవల కాలంలో రామోజీ ఫిల్మ్ స్టూడియోలో ఈటీవీ ప్రోగ్రామ్స్ ఏమి జరగలేదు. కరోనా సమయంలో ఈటీవికి సంబంధించి ఎలాంటి ఈవెంట్లు జరగలేదు. ఎస్పీ బాల సుబ్రమణ్యం పాల్గొన్నది ఈటీవీ ప్రోగ్రామ్ కానే కాదు. జూలై 18న హైదరాబాద్ వచ్చిన ఎస్పీ బాలు, చరణ్ లు మౌనరాగం మురళీ 100వ ఎల్పీ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి ఈటీవికి  ఎలాంటి సంబంధం లేదు. కాని ఈ విషయంపై కావాలనే కుట్రపూరితంగా రాతలు రాస్తున్నారు కొందరు వెధవలు. ఈటీవీ ప్రోగ్రామ్ లో పాల్గొనేందుకు రామోజీరావు బలవంతం మీద.. బాల సుబ్రమణ్యం హైదరాబాద్ వచ్చారని  కొందరు సన్నాసులు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు.    ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు ఎస్పీ బాల సుబ్రమణ్యం మీద ఎంతో అప్యాయత చూపేవారు. పాడుతా తీయగా కార్యక్రమంటే రామోజీ రావుకు అత్యంత ఇష్టం. అందుకే ఎస్పీ బాలుతో నిర్వహించేవారు. బాలూనే ఈ విషయాన్ని చాలా వేదికలపై చెప్పారు. రామోజీరావు తనకెంతో ఇచ్చారని, తానే ఆయనేమి ఇవ్వలేదని చెప్పుకునేవారు. పాడుతా తీయగా కార్యక్రమంతో తన గౌరవం మరింత పెరిగిందని తెలిపేవారు బాలు. ఈ కార్యక్రమంతో తన పేరు కూడా ఎస్పీ బాలు కాకుండా పాడుతా తీయగా బాలుగా మారిందని చెబుతూ నవ్వుకునేవారు. అంతేకాదు ఓ ఈవెంట్ లో వేదికపైనే రామోజీ రావుకి సాష్టాంగ నమస్కారం చేశారు బాలసుబ్రమణ్యం. రామోజీ కూడా బాలును ఎంతో అప్యాయతతో ఆలింగనం చేసుకుని ఆయన పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అందుకే ఎప్పుడు మీడియా ముందుకు రాని రామోజీ రావు.. బాలు మరణంపై మాత్రం మీడియా ముందుకు వచ్చి తమ సంతాపం తెలిపారు. తన జీవిత కాలంలో రామోజీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం ఇది కేవలం రెండోసారి మాత్రమే. మార్గదర్శి మీద అప్పటి వైఎస్సార్ సర్కార్ కుట్ర పూర్వక కేసు పెట్టినపుడు తమ ఖాతాదారులకు భరోసా కల్పించడానికి మెుదటి సారి రామోజీ మీడియా ముందుకు వచ్చారు. ఆయన చిన్న కొడుకు చనిపోయినపుడు కూడా మీడియా ముందుకు రాలేదు రామోజీ రావు. దీన్ని బట్టే చెప్పవచ్చు రామోజీకి, ఎస్పీ బాలు మీద ఉన్న గౌరవం, వారి మధ్య ఉన్న స్నేహం, ప్రేమ.    రామోజీ, ఎస్పీ బాలు మధ్య మంచి అనురాగ బంధాలుండగా.. కొందరు దుర్మార్గలు చావులోనూ చిల్లర చేష్టలకు దిగడం తెలుగు ప్రజలను విస్మయపరుస్తోంది. అయితే రామోజీరావుపై అసత్య ప్రచారం వెనుక పెద్ద కుట్రే ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వంలోని కొందరు పెద్దల డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతుందని సమాచారం. ఏపీలో కొంత కాలంగా కమ్మ నేతలు, కమ్మ వ్యాపారులు, కమ్మ సామాజిక వర్గంలోని ప్రముఖుల టార్గెట్ అయ్యారు. ఆ వర్గం వారిపైనే కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల ఆలయాలపైనా దాడులు జరుగుతున్నాయి. రోజూ ఏదో ఒక చోట ఆలయంపై దాడి జరుగుతూనే ఉంది. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ప్రజల దృష్టిని ఈ అంశంపై నుంచి మరల్చడానికే ఇలాంటి కుట్రలకు తెరలేపారని తెలుస్తోంది. బ్రహ్మణ, కమ్మ వర్గాల మధ్య చిచ్చు పెట్టాలన్నదే  చిల్లర కుట్రదారుల పన్నాగమని సమాచారం. ఎస్పీ బాలు బ్రహ్మణుడు కావడంతో అతని చావుకు రామోజీ రావు కారణమనే చిల్లర రాతలకు దిగారు. తమ ప్రచారంతో బ్రహ్మణులంతా కమ్మ వర్గాన్ని టార్గెట్ చేయాలన్నది వారి ప్లాన్ లో భాగమని భావిస్తున్నారు.   ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణాన్ని రామోజీ రావుకు అంటగడుతూ చేస్తున్న ప్రచారంపై ప్రజలు భగ్గుమంటున్నారు. ప్రచారం కోసం ఇంతగా దిగజారడమేంటని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రముఖులపై చిల్లర ప్రచారం చేసే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరగవచ్చనే ఆందోళన జనాల్లో వ్యక్తమవుతోంది.
రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన పార్టీ.. సొంత పార్టీ నేతల కుమ్ములాట వల్లనో, ప్రత్యర్థి పార్టీల ఎత్తుల వల్లనే అనూహ్యంగా అధికారం కోల్పోవచ్చు. లేదా ఇక ఈ పార్టీ పని పనైపోయింది అనుకున్న పార్టీ.. అనూహ్యంగా పుంజుకుని అధికారంలోకి రావొచ్చు. ఇలా రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. ఇలాంటి ఊహించని పరిణామం త్వరలో ఏపీలో చోటుచేసుకోనుందా అంటే.. ఒక సెంటిమెంట్ బట్టి చూస్తే అవుననే అనిపిస్తుంది.   గుడివాడ నుండి గెలిచి మినిస్ట్రీ లో ఎవరున్నా ఆ గవర్నమెంట్ పూర్తి కాలం ఎప్పుడూ లేదు. మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి అదే సెంటిమెంట్ కొనసాగుతూ వస్తుంది. ఆ సెంటిమెంట్ నుండి ఎన్టీఆర్ కూడా తప్పించుకోలేకపోయారు. 1955 లో గుడివాడ నుండి గెలిచిన దళిత ఎమ్మెల్యే వేముల కూర్మయ్యకి ప్రకాశం పంతులు కేబినెట్ లో స్థానం కల్పించారు. కానీ, ఆ గవర్నమెంట్ పూర్తి కాలం లేదు. ఎన్టీఆర్ కూడా 1983 లో గెలిచి ముఖ్యమంత్రి అయినా 1984 లో నాదెండ్ల భాస్కరరావు కారణంగా ముఖ్యమంత్రి పీఠానికి దూరమయ్యారు. ఇక, 1985 లో హిందూపురం, గుడివాడ నుండి పోటీ చేసి రెండు చోట్లా గెలిచిన ఎన్టీఆర్.. సెంటిమెట్ తో గుడివాడని వదిలేసుకున్నారు. 1989 లో గుడివాడ నుండి గెలిచిన కటారి ఈశ్వర్ కుమార్ ని చెన్నారెడ్డి కేబినెట్ లోకి తీసుకున్నారు. అయితే ఆయన ప్రభుత్వం కూడా పూర్తికాలం లేదు. ఇలా గుడివాడ నుండి గెలిచి మినిస్ట్రీ లో ఎవరున్నా ఆ గవర్నమెంట్ పూర్తి కాలం లేదు. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.   గుడివాడ నుండి ప్రస్తుతం కొడాలి నాని ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన జగన్ మంత్రివర్గంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే, 151 ఎమ్మెల్యేలతో మాకు తిరుగులేదు అనుకుంటున్న అధికార పార్టీని ఇప్పుడు గుడివాడ సెంటిమెంట్ వెంటాడుతోంది. ముఖ్యంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఆ సెంటిమెంట్ ని మరింత బలపరుస్తున్నాయి. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి హిందూ దేవాలయంపై దాడులు, హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారాలు పెరిగిపోయాయి. దీంతో హిందువుల్లో అసంతృప్తి మొదలైంది. దీనికి తోడు అగ్నికి ఆజ్యం పోసినట్టు.. తిరుమలలో అన్యమతస్తులకు డిక్లరేషన్ అవసరం లేదని అధికార పార్టీ చెప్పటం హిందువుల ఆగ్రహానికి కారణమైంది. ఇది చాలదు అన్నట్టు కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హిందువుల ఆగ్రహాన్ని పదింతలు పెంచారు. ఎక్కడా లేని రూల్ తిరుమలలో ఎందుకు?, దేవుడి బొమ్మ చెయ్యి విరిగితే ఏమన్నా నష్టమా?, రథం కాలిపోతే ఏమైంది ఇంకొకటి చేపిస్తున్నాంగా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారాన్ని రేపాయి. ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని హిందూ సంఘాల నుండి పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ నిరసన సెగలు కొడాలి నాని మంత్రి సీటుకే కాదు, అసలు పార్టీ అధికారానికే ఎసరు పెట్టినా ఆశ్చర్యంలేదు. ఎందుకంటే కొడాలి నాని వ్యాఖ్యల మూలంగా ఆ స్థాయిలో ఆగ్రహావేశాలు భగ్గుమన్నాయి.   తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పటికీ వైసీపీని కొన్ని విషయాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అసలే సీఎం జగన్ మెడకి కేసులు కత్తి వేలాడుతూ ఉంటుంది. ఇప్పటికే అవినీతి ఆరోపణల కేసులో 16 నెలలు జైలులో ఉన్న ఆయన.. మరోసారి జైలుకి పోయే అవకాశం లేకపోలేదు. మరోవైపు, ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ.. తెలుగు రాష్ట్రాలలో అధికారంపై కన్నేసింది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియాని ఆకర్షించి అధికారం చేపట్టిన బీజేపీ.. ఏపీలోనూ అలాంటి ఎత్తులు వేసే అవకాశం లేకపోలేదు. దానికితోడు బీజేపీపై హిందూ పార్టీగా ముద్ర ఉంది. ఇప్పుడు వైసీపీ హయాంలో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులు బీజేపీకి ఎంతోకొంత కలిసొచ్చే అవకాశముంది. ఇప్పటికిప్పుడు బీజేపీ ఏపీలో ఏదైనా ఎత్తు వేసినా.. జగన్ ఎదిరించి నిలబడే సాహసం చేయకపోవొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తలచుకుంటే ఆయనను మళ్ళీ  కృష్ణ జన్మ స్థానానికి పంపడం చిటికెలో పని. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, వైసీపీని వెంటాడుతున్న కేసులు, బీజేపీకి ఉన్న అవకాశాలు.. వీటిని బట్టి చూస్తుంటే ఏపీలో అధికారం మారడం సాధ్యమే అనిపిస్తోంది. మరి ఈ గుడివాడ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి ఏపీలో అనూహ్య పరిణామాలు ఏమన్నా జరుగుతాయేమో చూడాలి. హిందూ దేవాలయాలపై దాడులు, హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలతో అధికార పార్టీపైనా, కొడాలి నానిపైనా తీవ్ర ఆగ్రహంతో ఉన్న భక్తులు, హిందూ సంఘాలు మాత్రం.. గుడివాడ సెంటిమెంట్ వెంటనే వర్కౌట్ అయితే బాగుండు దేవుడా అని కోరుకుంటున్నారు.
గత ప్రభుత్వ హయాంలో వేలు, లక్షల కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించిన వైసీపీ సర్కార్.. చివరికి ఈఎస్ఐ స్కామ్ ను తెరమీదకు తీసుకొచ్చి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసింది. మొదట 150 కోట్ల అవినీతి జరిగింది అన్నారు. తరువాత మూడు కోట్లు అన్నారు. చివరికి అసలు అచ్చెన్నకు డబ్బు అందినట్టు ఎలాంటి ఆధారాలు లేవు అన్నారు. అంటే ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారు. కేవలం ఆయన ఒక కంపెనీని పరిశీలించండని ఇచ్చిన లేఖ ఆధారంగా.. అర్థరాత్రి గోడలు దూకి మరీ అరెస్ట్ చేశారు. శస్త్రచికిత్స జరిగిందని చెప్పినా వినకుండా వందల కిలోమీటర్లు కారులో తిప్పారు. దీంతో అచ్చెన్నకు రెండోసారి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన కరోనా బారిన కూడా పడ్డారు. దాదాపు 80 రోజుల తరువాత అచ్చెన్న బెయిల్ పై విడుదల అయ్యారు. ప్రతిపక్షంలోని బలమైన గొంతుని నొక్కాలన్న ఉద్దేశంతోనే అచ్చెన్నను అక్రమంగా అరెస్ట్ చేసి కక్ష సాధింపులకు దిగుతున్నారని టీడీపీ ఆరోపించింది. ఇదిలా ఉంటే.. అసలు ఆధారాలు లేకుండానే ఈఎస్ఐ స్కామ్ పేరుతో అచ్చెన్నను 80 రోజులు నిర్బంధించిన జగన్ సర్కార్.. ఇప్పుడు సాక్షాత్తు కార్మిక శాఖా మంత్రి మీదే ఆరోపణలు వస్తున్నాయి. మరి ఇప్పుడేం చేస్తుంది జగన్ సర్కార్?.   ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కుమారుడు ఈశ్వర్‌కు.. పుట్టినరోజు సందర్భంగా ఈఎస్ఐ స్కాములో అరెస్ట్ అయిన ఏ-14 కార్తీక్ ఖరీదైన బెంజ్ కారు గిఫ్ట్ గా ఇచ్చారు. అయితే, ఇది గిఫ్ట్ కాదని మంత్రికి ఇచ్చిన లంచం అని టీడీపీ ఆరోపిస్తోంది. మంత్రి మాత్రం అబ్బే తన కుమారుడు కారుతో ఫోటో మాత్రమే దిగాడని, తన కుమారుడు చేతుల మీదుగా వాళ్ళు కారు తీసుకున్నారని, ఆ కారు తనదని రుజువు చేస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు.    అయితే మంత్రి ఆ కారు తమ పేరు మీద లేదని చెప్తున్నప్పటికీ.. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కారు మంత్రి కుమారుడిది కాకపోతే ఆయన ఆ కారులో ఎందుకు తిరుగుతున్నట్టు?. మంత్రి కుమారుడు ఈశ్వర్ ఆ కారులో తిరుగుతున్న ఫోటోలు, వీడియోలు చాలా సోషల్ మీడియాలో ఉన్నాయి. ఎవరైనా ఒకటి రెండు సార్లు ఫొటోస్ దిగుతారు. అంతేకాని, ఏడాది పొడవునా తమ దగ్గరే కారు ఉంచుకొని ఫొటోస్, వీడియో తీస్తూ తిరుగుతుంటారా. అంటే ఆ కారు ఎవరు పేరు మీదున్నా.. ఆ కారు మాత్రం మంత్రి కుమారుడిదే అని అర్థమవుతుంది.   అసలు ఈఎస్ఐ స్కాములో ఏ-14 ఉన్న కార్తీక్ మంత్రి కుమారుడుకి అంత ఖరీదైన కారు ఎందుకు ఇచ్చాడు. కోట్ల విలువైన గిఫ్ట్ లు ఇచ్చే అంత రిలేషన్ ఏంటి వాళ్ళకి?. అతను ఏ లబ్ది పొందకుండానే అంత ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చాడా?. ఒకసారి మంత్రి ఈ కార్తీక్ ని దత్త పుత్రుడిగా ప్రకటించారట. అంతేకాదు, ఈఎస్ఐ స్కాములో అరెస్ట్ అయిన అచ్చెన్నకు బెయిల్ రావడానికి 80 రోజులు పట్టింది. కానీ, ఏ-14 కార్తీక్ కి మాత్రం వెంటనే బెయిల్ వచ్చింది. అదెలా సాద్యమైంది? మంత్రి అండదండలు లేకుండానే ఇదంతా జరుగుతుందా?.   ఇంకో విషయం ఏంటనే..మంత్రి కుమారుడు వీడియోస్ లో మరి కొన్ని ఖరీదైన కార్లు కూడా కనిపిస్తున్నాయి. అంతంత ఖరీదైన కార్లు ఎక్కడి నుండి వచ్చాయి?. అంతేకాదు మంత్రి కుమారుడి వివాహ వేడుక సినీస్టార్స్ వెడ్డింగ్ అంత రిచ్ గా జరిగింది. ఇన్నిన్ని డబ్బులు ఎక్కడివి?. గత ఎన్నికల అఫిడవిట్ లో మంత్రి ఇచ్చిన ఆస్తుల విలువ ఎంతో తెలుసా?. చరాస్తులు స్థిరాస్తులు మొత్తం కలిపి 80 లక్షలు. కేవలం 80 లక్షల ఆస్తి కలిగిన కుటుంబం అంత ఖర్చు ఎలా పెడుతుంది? కోట్ల ఖరీదైన కార్లు ఎలా వాడుతుంది. అయితే కొని ఉండాలి లేదా ఎవరైనా ఇచ్చి ఉండాలి. ఒకవేళ కొని ఉంటే.. మంత్రి అఫిడవిట్ లో తప్పుడు వివరాలు ఇచ్చినట్టు లెక్క. అంటే అసలు ఆయన ఎన్నికే చెల్లదు. పోనీ గిఫ్ట్ ఇచ్చారనుకుందాం. ఏ లబ్ది పొందకుండా ఎవరైనా ఎందుకు గిఫ్ట్ ఇస్తారు. అది కూడా ఈఎస్ఐ స్కాములో ఏ-14 ఉన్న వ్యక్తి గిఫ్ట్ ఇవ్వడం వెనక ఉద్దేశం ఏంటి?. దీని వెనుకున్న నిజాలు బయటపడాలి. సీఎం అయిన దగ్గర నుండి అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యం అని చెప్తున్న జగన్.. మంత్రిపై చర్యలు తీసుకుంటారా? లేక మా పార్టీలో ఉన్నోళ్లు అంతా కడిగిన ముత్యాలు అంటూ అవినీతి మరకలతోనే ముందుకు సాగుతారో చూడాలి.   మంత్రి జయరాం మీద ఆరోపణలు కొత్తకాదు. ఈ ఏడాది కాలంలోనే ఆయనపైనా, ఆయన సన్నిహితులపైనా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఆయన సమీప బంధువు పేకాట స్థావరాలు నిర్వహిస్తూ పట్టుబడ్డారు. ఆయన అనుచరులు అక్రమంగా ఇసుక, మద్యం రవాణా చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఆయనపై భూకబ్జా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా బెంజ్ కార్ల లంచం ఆరోపణలు. అసలు ఒక మంత్రి పై ఇన్ని ఆరోపణలా. కారు తమ పేరు మీద ఉంటే రాజీనామా చేస్తానంటున్న మంత్రి.. తనపై వచ్చిన ఈ ఆరోపణలన్నీ అబద్దమని నిరూపిస్తారా?. నిరూపించలేకపోతే రాజీనామా చేస్తారా?.
పార్ల‌మెంటు మొద‌లై ప‌ట్టుమ‌ని మూడు రోజులు కూడా కాలేదు. ఆదిలోనే హంస‌పాదు ఎదుర‌వుతున్న‌ది. ఎంపీల్లో చాలామంది పార్ల‌మెంటుకి హాజ‌ర‌య్యేందుకు బొత్తిగా ఇష్ట‌ప‌డ‌టం లేదు. క‌రోనా వైర‌స్ ఏమాత్రం జాలి లేకుండా త‌న మానాన తాను దూకుడుగా ఎగిరి గంతేస్తున్న ఈ త‌రుణంలో ఎవ‌రికి వారు మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తూ పార్ల‌మెంటుకి వ‌స్తున్న‌ట్టు అనిపిస్తున్న‌ది. బుధ‌వారం మాజీ ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్, మాజీ ఆర్ధిక మంత్రి చిదంబ‌రంతో స‌హా డ‌జ‌నుకు పైగా ఎంపీలు సెల‌వు చీటీలు స‌మ‌ర్పించారు. వ‌యోభారం వ‌ల్ల స‌మావేశాల‌కు రాలేక‌పోతున్నారా అంటే అదేమీ కాదు. క‌రోనా కార‌ణంగా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌తోనే వారీ నిర్ణ‌యానికొచ్చారు. మ‌న్మోహ‌న్ సింగ్ వ‌య‌స్సు 87 ఏళ్లు. అందువ‌ల్ల ఆయ‌న అవ‌స్ధ‌ని అర్ధం చేసుకోవ‌చ్చు. ఎక్కువ వ‌య‌స్సున్న వాళ్ల‌ని క‌రోనా అతి సునాయాసంగా ఆక‌ర్షిస్తున్న‌ద‌న్న వైద్యుల అప్ర‌మ‌త్త‌త నేప‌థ్యంలో మ‌న్మోహ‌న్ సింగ్ సెల‌వు పెట్ట‌డాన్ని పెద్ద‌గా అభ్యంత‌ర‌పెట్ట‌లేము. ఇక చిదంబ‌రం. ఆయ‌నకు 75 ఏళ్లు. కాబ‌ట్టి చిదంబ‌రానికీ మిన‌హాయింపు ఇవ్వొచ్చు. ఇలాంటి పెద్ద‌లు ఈ స‌మావేశాల చివ‌రి దాకా సెల‌వు అడిగారు. వీళ్లే కాదు. వైకాపా త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన పిర‌మ‌ల్ న‌త్వానీ కూడా సెల‌వు పెట్టారు. ఇలా మొత్తంమీద ప‌ద‌మూడు మంది దాకా సెల‌వు బాట‌లో ఉన్నారు. రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య నాయుడు వీరంద‌రికీ సెల‌వు మంజూరు చేశారు. మ‌రి రేప‌ట్నుంచి ఇంకా ఎంత‌మంది ఇదే బాట‌లో ప‌య‌నిస్తారో తెలీదు.    ఇటు రాజ్య‌స‌భ‌, అటు లోక్‌స‌భ ఇలా సెల‌వుల ప‌ర్వంలో ఉంటే స‌మావేశాలు స‌జావుగా సాగుతాయా అన్న సందేహాలున్నాయి. అయితే ప్ర‌స్తుతం ఉభ‌య స‌భ‌లు అటు సంఖ్యాప‌రంగానే కుదించుకున్నాయి. పూర్తి స్ధాయిలో స‌భ్యులు హాజ‌రు కావ‌డం లేదు. అలాగే ప్ర‌శ్నోత్త‌రాలు ఎత్తేశారు. ఇలా కీల‌క‌మైన స‌భా కార్య‌క్ర‌మాల‌నే కుదించాల్సి వ‌చ్చింది. మ‌రి రాజ్యాంగ నియ‌మాల ప్ర‌కారం పార్ల‌మెంటు జ‌ర‌పాలి. పెండింగ్ బిల్లులు ఉంటాయి. వాటిని ఆమోదించి చ‌ట్ట‌రూపం తేవాలి. అవి నిజానికి చాలా ముఖ్యమైన‌విగా ఉంటాయి. కాని అవ‌త‌ల క‌రోనా ప‌రిస్థితి అలా ఉన్న‌ప్పుడు ప్ర‌భుత్వం కూడా మ‌మ అనే ప‌ద్ద‌తిలోనే స‌భ‌ను సాగిస్తున్న‌ది. అందువ‌ల్ల ఎంత‌మంది స‌భ్యులు సెల‌వులు పెట్టినా స‌భ‌లో పూర్తి చేయాల్సిన ప్ర‌భుత్వ‌ప‌ర‌మైన కార్య‌క్ర‌మాలు పూర్తి చేయ‌డానికి పెద్ద‌గా అడ్డంకులు ఏవీ ఉండ‌క‌పోవ‌చ్చు. ఎటొచ్చీ స‌మావేశాల చివ‌రిదాకా ఎంత‌మంది స‌భ‌లో నిలుస్తార‌న్న‌దే ప్ర‌శ్న‌. తామెవ్వ‌రం లేకుండా బిల్లులు ఆమోదించ‌డానికి వీల్లేద‌ని ఎంత‌మంది అడ‌గ‌గ‌ల‌రు? అడిగితే ప్ర‌భుత్వం మిన్న‌కుంటుందా? అవ్వా కావాలి..బువ్వా కావాలి అంటే కుద‌ర‌దు..అవ‌త‌ల క‌రోనాకి లీవూ మీరే అడుగుతారు..మ‌ళ్లీ బిల్లుల మీద చ‌ర్చ‌లో మీరే ఉండాల‌ని అడుగుతారా అంటూ ఎదురుదాడి చెయ్య‌దా? -రాజా రామ్మోహ‌న్ రాయ్‌
జ‌యాబ‌చ్చ‌న్‌..డెబ్బ‌య్ రెండేళ్ల రాజ్య‌స‌భ స‌భ్యురాలు..అంటే పెద్ద‌ల స‌భ‌లో స‌భ్యురాల‌న్న మాట‌. అంటే ఆమె ఏమి చెప్పినా పెద్ద‌రికంతో చెప్పిన‌ట్ట‌న్న‌మాట‌! పెద్ద‌రికంతో చెప్పాలి కాబ‌ట్టి..క‌నీసం అలా చెప్పిన‌ట్ట‌యినా అనిపించాలి కాబ‌ట్టేమో ఆమె ఆచితూచి మాట్లాడుతుంటారు. ఆమాట‌కొస్తే ఆచితూచే స‌భ‌కూ వ‌స్తుంటారు. ఇంకా స్ప‌ష్టంగా చెప్పాలంటే ఏదైనా చెప్పాల‌నుకున్న‌ప్పుడే స‌భ‌కు వ‌స్తుంటార‌ని అనుకునేవాళ్లూ ఉన్నారు! అలానే మంగ‌ళ‌వారం నాడు స‌భ‌కి వ‌చ్చారు. ఆమె వ‌చ్చారంటే ఏదో పెద్ద విష‌య‌మే ఆమె మాట్లాడ‌తార‌ని అనుకోవ‌చ్చు. అలాగే ఒక పెద్ద విష‌య‌మే లేవ‌నెత్తారు. ఏదో కొంద‌రి కార‌ణంగా సినిమా ప‌రిశ్ర‌మ మొత్తాన్ని భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నార‌ని ఆమె ఆక్రోశించారు. ముఖ్యంగా బీజేపీ ఎంపీ,భోజ్‌పురి న‌టుడు ర‌వి కిష‌న్ మీద అగ్గిగుగ్గిల‌మే అయ్యారు. సినీ ప‌రిశ్ర‌మ అన‌గానే సోష‌ల్ మీడియా ఒంటికాలికి మీదికి లేస్తుంద‌ని, ప్ర‌భుత్వం సినీ ప‌రిశ్ర‌మ‌కు వీస‌మెత్తు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం లేద‌ని ఆమె దుయ్య‌బ‌ట్టారు.   బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం చెల‌రేగి సంచ‌ల‌నంగా మారిన నేప‌థ్యంలో ఆమె ఆవేశం క‌ట్ట‌లు తెంచుకుంటున్న‌ది. మాద‌క ద్ర‌వ్యాల‌ను ఎవ‌రో కొంద‌రు వాడుతున్నంత మాత్రాన మొత్తం ప‌రిశ్ర‌మ‌నే వేలెత్తి చూపుతారా అన్న‌ది ఆమె ప్ర‌శ్న‌. అంత సీనియ‌ర్ స‌భ్యురాలు స‌భ‌లో ఈ అంశాన్ని ఈ కోణంలో ప్ర‌స్తావించ‌డాన్ని సినీ అభిమానులు ఏమాత్రం జీర్ణం చేసుకోలేక‌పోతున్నారు. సినీ ప‌రిశ్ర‌మ‌లోని డ్ర‌గ్స్ మాఫియా భ‌ర‌తం ప‌ట్టాల‌ని ఆమె డిమాండ్ చేసి ఉంటే యావ‌త్ ప్ర‌జానీకం సంతోషించి ఉండేవారు. సుశాంత్ లాంటి యువ‌త‌రాన్ని బ‌ల‌గొంటున్న డ్ర‌గ్స్ మాఫియా ఊసెత్త‌కుండా దాన్ని ఎవ‌రో కొంద‌రికే ప‌రిమిత‌మైన అంశంగా ఆమె భావించ‌డం రాజ్య‌స‌భ స‌భ్యురాలిగా ఆమె స్ధాయికి త‌గిన‌ట్టుగా లేద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. మ‌రో న‌టి కంగ‌నా ర‌నౌత్ ఇప్ప‌టికే కొంద‌రి పేర్లు ప్ర‌స్తావించి, వారు ర‌క్త‌ప‌రీక్ష‌లు చేయించుకుని అంద‌రికీ ఆద‌ర్శంగా ఉండాల‌ని ఇచ్చిన పిలుపికి జ‌యాబ‌చ్చ‌న్ ఏమాత్రం స్పందించ‌క‌పోవ‌డం ఇక్క‌డ గుర్తించాల్సిన అంశం. కంగ‌నా ర‌నౌత్ బ‌హిరంగంగా పేర్లు ప్ర‌స్తావించిన‌ప్పుడు యావ‌త్ బాలీవుడ్ మౌన‌మే వ‌హించింది. అంటే దాన‌ర్ధం ఏమిటి? ఆ పెద్ద‌వాళ్ల గొడ‌వ‌లో వేలు పెట్ట‌డం ఇష్టం లేద‌నా? లేక కంగ‌నా లేవ‌నెత్తిన అంశంలో వాస్త‌వం ఉంద‌నా? ఇంకా చెప్పాలంటే సినీప‌రిశ్ర‌మ‌లో డ్ర‌గ్స్ మాఫియా గురించి కంగ‌నాయే ధైర్యంగా నోరెత్తింది. ఆమెకి త‌గినంత మ‌ద్ద‌తు రాలేదు.    ఇంక మ‌రో విష‌యం. కంగ‌నా ర‌నౌత్ ముంబాయి ఆఫీసు వివాదాస్ప‌ద‌మై ఇర‌వై నాలుగ్గంట‌ల్లో ముంబాయ్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు ఆమె ఆఫీసు భ‌వ‌నంలో కొంత భాగాన్ని ఆగ‌మేఘాల మీద కూల్చివేసిన‌ప్పుడూ జ‌యాబ‌చ్చ‌న్ నోరు మెద‌ప‌లేదు. మ‌రి కంగ‌నా ర‌నౌత్ కూడా సినీ ప‌రిశ్ర‌మ‌లోని ప్ర‌ముఖ న‌టి, ద‌ర్శ‌కురాలు, నిర్మాత‌గా ఎదిగింది. త‌న‌కంటూ సొంత వ్య‌క్తిత్వంతో బాలీవుడ్‌లో నిల‌బ‌డింది. అటువంటి న‌టికి సంఘీభావంగా నిల‌బ‌డాల్సిన స్ధాయిలో ఉండి కూడా జ‌యాబ‌చ్చ‌న్ అస‌లా అంశం త‌న‌కు సంబంధించ‌నిదిగానే వ్య‌వ‌హ‌రించారు. కంగ‌నా ర‌నౌత్ మ‌హ‌రాష్ట్ర ప్ర‌భుత్వంతోనే యుద్దానికి త‌ల‌ప‌డ్డారు. ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ థాక్రే కుమారడు ఆదిత్య థాక్రేకు మాద‌క ద్ర‌వ్యాల మాఫియాతో లింకులు న్నాయ‌ని ఆమె నేరుగా ఆరోపించారు. అయితే అది ప్ర‌భుత్వంతో ముడిప‌డి ఉన్న అంశం అయినందున జ‌యాబ‌చ్చ‌న్ ఆ విష‌యం జోలికి వెళ్ల‌లేదు. నిజానికి రాజ్య‌స‌భ‌లో ఆమె ఈ అంశాన్ని కూడా ప్ర‌స్తావించి ఉండాల్సింది. ద‌ర్యాప్తుకి డిమాండ్ చేసి ఉండొచ్చు. కంగ‌నా ర‌నౌత్ మీద రాజ‌కీయ ప్ర‌తీకార చ‌ర్య‌ల్ని నిలువ‌రించాల‌ని గొంతెత్తి ఉండాల్సింది. కాని ఇవేమీ జ‌ర‌గ‌లేదు. సినీ ప‌రిశ్ర‌మ గురించి ఒక సినీ న‌టుడే అలా మాట్లాడ‌టం శోచ‌నీయం అంటూ ర‌వి కిష‌న్ వ్యాఖ్య‌ల గురించి ప్ర‌స్తావించారు. బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ తీవ్ర‌త గురించి ఎప్ప‌టిక‌ప్పుడు జ‌రుగుతున్న ప‌రిణామాల గురించి ప్ర‌సారం చేస్తున్న ప్ర‌సార మాధ్య‌మాల‌ను ఆమె త‌ప్పుబ‌డుతున్నారు.    జ‌రుగుతున్న వాస్త‌వాల‌ను అర‌చెయ్యి అడ్డుపెట్టా ఆపాల‌ని ఆమె భావిస్తున్న‌ట్టు అనిపిస్తున్న‌ది. సుశాంత్ మ‌ర‌ణం కేసు ఎన్నెన్ని మ‌లుపులు తిరుగుతున్న‌దో ఆమెకి తెలీద‌ని అనుకోలేము. అలా మ‌లుపులు తిర‌గ‌డంలోని ఉచితానుచితాల గురించీ ఆమెకు ప్రాథ‌మిక స‌మాచారమైనా తెలీద‌నీ భావించ‌లేము. సుశాంత్ కేసులో అది హ‌త్యా? ఆత్మ‌హ‌త్యా? అని తేల్చాల్సిన త‌రుణంలో కేసు ఆ ప‌రిధిని ఎప్పుడో దాటిపోయిన‌ట్టు అనిపిస్తున్న‌ది. ఎందుక‌లా జ‌రిగిందో ఎవ్వ‌రూ అడ‌గ‌డం లేదు. ఇప్పుడ‌ది మాద‌క ద్ర‌వ్యాల వాడ‌కం ద‌గ్గ‌ర‌కొచ్చి రియాను, ఆమె సోద‌రుణ్ని అరెస్టు ఘ‌ట్టం ద‌గ్గ‌ర‌కి తీసుకెళ్లి ఆపింది. ఇన్ని మ‌లుపుల నేప‌థ్యంలో జ‌యాబ‌చ్చ‌న్ సినీప‌రిశ్ర‌మ ద‌య‌నీయ‌ప‌రిస్థితి గురించి ఆందోళ‌న ప‌డ‌టం క‌న్నా, నిజానిజాల వెలికితీత‌కు ప‌ట్టుబ‌ట్టి ఉండాల్సింది! -రాజా రామ్మోహ‌న్ రాయ్‌
బాలీవుడ్ న‌టుడు సుశాంత్ రాజ్‌పుత్ మ‌ర‌ణం ఎన్నెన్ని సంచ‌ల‌నాలకు సాక్షీభూత‌మైంది! ఎన్నెన్ని మ‌లుపులు తిరుగుతున్న‌ది! ఎంతెంత మందిని బైటికి తీస్తున్న‌ది! ఇదంతా ఒక క్ర‌యిమ్ థ్రిల్ల‌ర్ బాలీవుడ్ సినిమాను త‌ల‌పిస్తున్న‌ది. ప్ర‌ధానంగా రియా చ‌క్ర‌వ‌ర్తి తెర‌మీదికొచ్చింది. ఆమె సుశాంత్ ప్రియురాలిగా ముద్ర‌ప‌డి అనుమానాస్ప‌ద స్వార్ధ‌పూరిత చ‌ర్య‌ల‌తో సుశాంత్ మ‌ర‌ణానికి కార‌ణ‌మైంద‌న్న అభియోగాన్ని ఎదుర్కొంటున్న‌ది. ఇదంతా స‌రే. రోజువారీ ప‌రిణామాలు తెలుస్తూనే ఉన్నాయి. సుశాంత్ మ‌ర‌ణం హ‌త్యా? ఆత్మ‌హ‌త్యా? అన్న‌ది తేల్చేందుకు మొద‌లైన ఈ కేసు ద‌ర్యాప్తు బీహార్‌, మ‌హ‌రాష్ట్ర పోలీసుల మ‌ధ్య భేదాభిప్రాయాల‌తో ఇంకొన్ని మ‌లుపులు తిరిగి చివ‌రికి డ్రగ్స్ బాట ప‌ట్టింది. సుశాంత్ మ‌ర‌ణంతో బాలీవుడ్ లోని కొంద‌రు ప్ర‌ముఖుల పేర్లు గాలిలో ఊగిస‌లాడాయి. కొంద‌రు తెగువ క‌లిగిన వారైతే కొన్ని పేర్లు బ‌య‌ట పెట్టారు కూడా. అందులోని నిజానిజాలు నిర్ధార‌ణ కావాల్సి ఉంది. అలాగే డ్ర‌గ్స్ కేసులోనూ చాలా పేర్లు తెర‌మీదికొస్తున్నాయి. రియా చ‌క్ర‌వ‌ర్తి చెబుతున్న జాబితాలో ప్ర‌ముఖంగా తెలుగు హీరోయిన్ రకుల్ పేరు వ‌చ్చింది. వాళ్లిద్ద‌రూ ముంబాయ్ లో క‌లిసి దిగిన ఫోటోలు కూడా బ‌హిరంగ‌మ‌య్యాయి.    సుశాంత్ కు చెందిన ఒక ఫామ్ హౌజ్‌లో బాలీవుడ్, తాలీవుడ్ ప్ర‌ముఖులు త‌ర‌చూ క‌లిసి పార్టీలు చేసుకుంటుంటార‌ని రియా చెప్పింది. ఆ పార్టీల్లో మాద‌క‌ద్ర‌వ్యాల‌ను తీసుకుంటార‌ని కూడా చెప్పింది. ఇదేదో రియా ఇప్పుడు ఒక అండ‌పిండ బ్ర‌హ్మాండాన్ని బ‌ద్ద‌లు చేసింద‌ని భావించ‌న‌క్క‌ర్లేదు. ఇది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. సినీన‌టులు, ఇంకా చెప్పాలంటే ఈనాటి టీవీ న‌టులు య‌థేచ్చ‌గా మాద‌క ద్ర‌వ్యాల‌ను వాడుతున్నారు. త‌మ గ్లామ‌ర్ పెంచుకోవ‌డానికి అవి వాడ‌క త‌ప్ప‌ద‌ని కొంద‌రు బాహాటంగానే ప్ర‌క‌ట‌న‌లిచ్చారు. కొద్దిపాటి మోతాదులో వాటిని తీసుకోవ‌డం నేరం కాద‌ని కూడా వారు త‌మ చ‌ర్య‌ల్ని స‌మ‌ర్ధించుకుంటున్నారు. ఇదంతా ప‌క్క‌న బెడితే రియా చ‌క్ర‌వ‌ర్తి చెబుతున్న పేర్ల మీద మాద‌క‌ద్రవ్యాల నిరోధ‌క శాఖ అధికారులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటార‌నేది ఇక్క‌డ ముఖ్యాంశం. నిన్న‌టికి నిన్న ఈ కేసు విచారిస్తున్న సంబంధిత శాఖాధికారి త‌మ జాబితాలో బాలీవుడ్ ప్ర‌ముఖుల పేర్లేవీ లేవ‌ని స్ప‌ష్ట‌త‌నిచ్చారు. తాము కేవ‌లం మ‌త్తు ప‌దార్ధాల ఏజెంట్ల‌ను, త‌యీరీదార్ల‌ను, స‌ర‌ఫ‌రాదార్ల‌ను మాత్ర‌మే ప‌ట్టుకుంటున్నామ‌ని, వారిమీదే నిఘా ఉంచామ‌ని వెల్ల‌డించారు. ఇది చాలా కీల‌క ప్ర‌కట‌న‌. మ‌రి రియా చెప్పే పేర్ల సంగ‌తేమిటి? సుశాంత్ మ‌ర‌ణం కేసుని దాని ప‌రిధిని దాటించి మ‌త్తుప‌దార్ధాల వైపుకి మ‌ళ్లించారు. పోనీ మ‌త్తుప‌దార్ధాలు సేవిస్తున్న వారి ఆట క‌ట్టిస్తారా అంటే తాము చేయాల్సింది అది కాద‌ని అధికారులే చెబుతున్నారు.    2017లో  తెలంగాణా రాష్ట్రంలోనూ తెలుగు సినీ న‌టులు మాద‌క ద్ర‌వ్యాలు వాడుతున్నార‌న్న కేసు కొద్ది వారాల పాటు హ‌ల్ చ‌ల్ చేసింది. పూరీ జ‌గ‌న్నాధ్‌, ఛార్మి, న‌వ‌దీప్‌, త‌రుణ్‌, సుబ్బ‌రాజు, సినిమాటోగ్రాఫ‌ర్ శ్యామ్ కె.నాయుడు త‌దిత‌రుల్ని ప్ర‌త్యేక ద‌ర్యాప్తు టీమ్ విచారించింది. అప్ప‌ట్లో అది పెద్ద సంచ‌ల‌నం. ఏరోజుకారోజు ద‌ర్యాప్తుకి పిలిచిన వారిని అరెస్టు చేస్తార‌న్న ఉత్కంఠ‌. కాని అది అతి తేలిగ్గా అట‌కెక్కింది. మాద‌క‌ద్రవ్యాలు తీసుకునే వారు నేర‌స్ధులు కార‌న్న సిద్దాంతాన్ని తెర‌మీదికి తెచ్చారు. కేవలం వీరికి స‌రఫ‌రా చేసిన‌వారిని క‌నుగొనేందుకే వారిని పిలిచి ప్ర‌శ్నించిన‌ట్టు తేల్చేశారు.    ఇప్పుడు రియా డ్ర‌గ్స్ కేసు ఎటు వెళ్ల‌బోతోంది? ఆమెని అరెస్టు చేశారు. ఆమె సుశాంత్‌కి మాద‌క ద్ర‌వ్యాలు ఇచ్చింద‌న్న‌ది అభియోగం. ఒక‌వంక స్వ‌ల్ప మోతాదులో అది తీసుకోవ‌డం నేరం కాదంటున్నారు. మ‌రి ఆమె అత‌డికి స్వ‌ల్ప మోతాదులోనే తెప్పించి ఇచ్చానంటున్న‌ది. దానివ‌ల్లే సుశాంత్ మ‌ర‌ణించాడ‌ని ద‌ర్యాప్తు సంస్ధ‌లు తేలుస్తాయా? సుశాంత్‌ని మాన‌సికంగా వ‌త్తిడికి గురిచేసి, అత‌డికి సినిమా అవ‌కాశాలు రాకుండా చేశార‌న్న ఒక ప్రధాన అభియోగం ఎటు పోయిన‌ట్టు? అది వ‌దిలేసి, సుశాంత్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో రియా మీద నిఘా పెట్టారు. సుశాంత్ మ‌ర‌ణించాక అత‌ని బ్యాంకు అకౌంట్ నుంచి కొన్ని కోట్లు మాయ‌మ‌య్యాయి. ఇది రియా ప‌నేన‌ని సుశాంత్ తండ్రి అభియోగం. ఆ ప్ర‌కారం పోలీసులు ఆమె మీద నిఘా పెట్టారు. చివ‌రికి అది మాద‌క ద్ర‌వ్యాల వైపు మ‌ళ్లింది. అంటే ఇప్ప‌టికి రెండు మ‌లుపులు తిరిగిన‌ట్టు. ఇంకా ఎన్ని మ‌లుపులు తిరుగుతంది?  మాద‌క ద్ర‌వ్యాలు తీసుకునే ప్ర‌ముఖ హీరోలు, ద‌ర్శ‌క‌లు పేర్లు సోష‌ల్ మీడియాలో వ‌చ్చేస్తున్నాయి. కంగ‌నా ర‌నౌత్ ప‌రోక్ష ప్రస్తావ‌న‌లో కొన్ని పేర్లు తెర‌మీదికి తెచ్చింది. కాని వారికి ఏమీ కాదు. కేవ‌లం రియాకు మాత్ర‌మే ఇది నేరంగా వ‌ర్తిస్తుంది. మ‌న చ‌ట్టాల్లోని లొసుగులు క్ర‌మ‌క్ర‌మంగా ప్ర‌జ‌ల‌కు అర్ధ‌మ‌వుతున్నాయ్‌! -రాజా రామ్మోహ‌న్ రాయ్‌
ఇప్పుడు ఏదైనా పొరపాటు చేసి క‌రోనా వ్యాప్తికి అవకాశం ఇస్తై భవిష్యత్తులో మనల్ని మనం క్షమించుకోలేం. కరోనా వ్యాప్తి అగిన తర్వతానే లాక్ డౌన్ ఎత్తేయాలి. కరోనా కట్టడికి సామాజిక దూరం ఒక్కటే మార్గం. అభివృద్ది చెందిన దేశాలు సైతం కరోనా మహ్మమారిని ఎదుర్కోలేక కష్టాలు పడుతున్నాయ‌ని మంత్రి కెటి రామారావు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో అందరికి టెస్టులన్న అలోచన ఆచరణ సాద్యం కాదు. విచ్చలవిడి టెస్టులకు అనుమతిస్తే ప్రజల భయాందోళనల నేపధ్యంలో టెస్టు సెంటర్ల దోపిడీకి దారి తీస్తుంది. అవసరం అయిన వారీకీ టెస్టులు చేసే వీలుండని పరిస్ధితి ఏర్పడుతుంది. అందుకే విచ్చలవిడి టెస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కరోనా ను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్దంగాఉన్నది. అవసరం అయిన సౌకర్యాలు, వైద్యసామాగ్రిన సిద్దం చేసి ఉంచుతున్నాం. లాక్ డౌన్లో ఒక్క అకలి చావు లేకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నం. మద్యతరగతి, పేదల సమస్యలను పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం. పారిశ్రామిక వర్గాలు, కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామ‌ని మంత్రి కె.తారక రామారావు మీడియాతో మాట్లాడారు.   లాక్ డౌన్ పొడగించేందుకు సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అమెరికా, యూరప్ లోని ఇటలీ, స్పెయిన్ లాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా ఉండాలంటే లాక్ డౌన్, సామాజిక దూరం ఒక్కటే మార్గమని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మూడు దశల్లో కరోనా వైరస్ ని ఎదుర్కోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని కెటిఆర్ అన్నారు. ఇప్పుడు ఏదైనా పొరపాటు చేసి క‌రోనా వ్యాప్తికి అవకాశం ఇస్తై భవిష్యత్తులో మనల్ని మనం క్షమించుకోలేం. కరోనా వ్యాప్తి అగిన తర్వతానే లాక్ డౌన్ ఎత్తేయాలి. కరోనా కట్టడికి సామాజిక దూరం ఒక్కటే మార్గం. అభివృద్ది చెందిన దేశాలు సైతం కరోనా మహ్మమారిని ఎదుర్కోలేక కష్టాలు పడుతున్నాయ‌ని మంత్రి కెటి రామారావు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో అందరికి టెస్టులన్న అలోచన ఆచరణ సాద్యం కాదు. విచ్చలవిడి టెస్టులకు అనుమతిస్తే ప్రజల భయాందోళనల నేపధ్యంలో టెస్టు సెంటర్ల దోపిడీకి దారి తీస్తుంది. అవసరం అయిన వారీకీ టెస్టులు చేసే వీలుండని పరిస్ధితి ఏర్పడుతుంది. అందుకే విచ్చలవిడి టెస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.     కరోనా ను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్దంగాఉన్నది. అవసరం అయిన సౌకర్యాలు, వైద్యసామాగ్రిన సిద్దం చేసి ఉంచుతున్నాం. లాక్ డౌన్లో ఒక్క అకలి చావు లేకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నం. మద్యతరగతి, పేదల సమస్యలను పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం. పారిశ్రామిక వర్గాలు, కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామ‌ని మంత్రి కె.తారక రామారావు మీడియాతో మాట్లాడారు.     లాక్ డౌన్ పొడగించేందుకు సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అమెరికా, యూరప్ లోని ఇటలీ, స్పెయిన్ లాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా ఉండాలంటే లాక్ డౌన్, సామాజిక దూరం ఒక్కటే మార్గమని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మూడు దశల్లో కరోనా వైరస్ ని ఎదుర్కోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని కెటిఆర్ అన్నారు.
* సఫాయన్న సేవకు చేతులెత్తి నమస్కరిస్తాడు  * బతుకుంటే బలుసాకైనా తినొచ్చంటడు  ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద రెండు రోజుల పాటు నిరంతరాయంగా సోషల్ మీడియా లో చర్చ..ఆయన నిరాఘాట, నిరుపమాన శబ్ద ప్రకటన మీద అన్ని సోషల్ మీడియా వేదికలు విస్మయం వ్యక్తం చేయటం... ఈ మధ్య కాలం లో ఎక్కడా చూడలేదు, వినలేదు కూడా.. సోషల్ మీడియా ను మోడీ మ్యానియా కమ్మేసిన వేళ, వాస్తవాల ప్రకటన తో, విస్తుపోయే నిజాలతో ఆయన విసిరిన మాటల మంత్రదండం ముందు చాలా మంది నాయకుల వాక్పటిమ వెలవెలపోయింది. ఎందుకంటే, ఆయన మాటల్లో నిజాయితీ ఉంది కాబట్టి, నిజముంది కాబట్టి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులలో -టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్ టీ రామారావు ల తర్వాత, సామాన్యుడిని ఆకట్టుకునే నాయకత్వ పటిమను సాంతం సొంతం చేసుకున్న ముఖ్యమంత్రిగా కె సి ఆర్ చరిత్ర సృష్టించారు. ఇది పొగడ్త కాదు, ప్రశంసా కాదు... సోషల్ మీడియా ఎనాలిసిస్.  సిబ్బందిని మోటివేట్ చేయడంలో, ప్రత్యర్థులకు వార్నింగ్ ఇవ్వడంలో, వినేవాళ్ళకి విసుగు రాకుండా మాట్లాడటంలో ఆయనకు పోటీ లేదు.... ఎదురు ఒక్క పేపర్ ఉండదు.., ఒక్క నోట్ ఉండదు.... తడబాటు ఉండదు... చెప్పాల్సింది సూటిగా, సుత్తి లేకుండా....జనానికి అర్థం అయ్యేలా....భరోసా ఇచ్చేలా....ఇంగ్లీష్, హిందీ, తెలుగు అన్ని భాషల్లో.... ఇంకో బైట్ అని అడిగే పని కూడా ఉండదు. అది ఆయన గొప్పతనం.. అది ఆయన దక్షత. ఇదేదో ఆయన్ను పొగిడే ప్రహసనం కాదు. కరోనా లాక్ డౌన్ విషయం లో మరో రెండు వారాలు కొనసాగించాలని కుండబద్దలు కొట్టిన కె సి ఆర్, బతికుంటే బలుసాకు తిందామంటూ చెప్పుకొచ్చిన తీరు, ఈ పదిహేను రోజుల్లో తెలంగాణ 435 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయిందని చెపుతూనే, ప్రజల ప్రాణాల కాన ఆర్ధిక మాంద్యం తనకు లెక్క కాదని తేల్చిపారేశారు. ఈ 15 రోజుల్లో తెలంగాణ కు కేవలం రెండు కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనీ, అయినా కూడా జనాన్ని బతికుంచుకోవటమే తనకు ముఖ్యమని స్పష్టం చేసిన ఆయన నాయకత్వం దేశాన్ని ఆకట్టుకుంది. నరేంద్ర మోడీ వారాంతపు కార్యక్రమాలలో ఒవైసీ కి కనిపించిన ఎంటర్టైన్మెంట్, కె సి ఆర్ అనర్గళ ఉపన్యాసం లో కనిపించకపోవటానికి కారణం ఏమిటంటే, ఈయన జనం బాగు కోరుకుని లాక్ డౌన్ కొనసాగించాలని చెప్పటం. తాను మాట్లాడుతున్న అంశం మీద విపరీతమైన అధారిటీ, కాగితాలు చూసి చదివే అలవాటు ఏ మాత్రం లేని క్షుణ్ణమైన పరిజ్ఞానం, ఎదుటివాడు ప్రశ్నించటానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వని కూలంకుష పరిశోధన కె సి ఆర్ కు పెట్టని ఆభరణాలు. ప్రజలను మానసికంగా సిద్ధం చేయటానికి ఆయన వారి మీద ఎలాంటి ఒత్తిడీ చేయలేదు. ఉన్న వాస్తవాలను మాత్రమే అందరిముందూ పరిచారు. సామాన్యుడికి అర్ధమయ్యే భాషలో చెప్పారు.. ఈ సాహసోపేత కార్యక్రమంలో సేవలందిస్తున్న డాక్టర్లందరికీ, నర్సులు, పారిశుధ్య కార్మికులు అందరికీ మొక్కుతున్నానంటూ ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి కె సి ఆర్. కష్ట కాలంలో ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని కె సి ఆర్ మోటివేట్ చేసిన తీరు తో దేశం యావత్తూ చకితమై చూసింది.  సోషల్ మీడియా అనలిటిక్స్ అంతా కూడా కె సి ఆర్ లోని వినూత్న కోణాన్ని తమకర్ధమైన భాషలో అనువదించే పనిలో బిజీ అయిపొయింది. ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక నవీన్ పట్నాయక్, ఒక మమతా  బెనర్జీ, ఒక అరవింద్ కేజ్రీ వాల్, ఒక  నితీష్ కుమార్..మీరందరూ కూడా అద్భుతంగా శ్రమిస్తూ ఉండవచ్చు గాక.. కానీ, ఒక కె సి ఆర్ దగ్గరున్న మోటివేషన్ టెక్నాలజీ మాత్రం మీ దగ్గర లేదనేది సోషల్ మీడియా ఎనాలిసిస్. అంతే కాదు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మీద సోషల్ మీడియా వేసిన సెటైర్ల పైన కూడా కె సి ఆర్ విరుచుకుపడటాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ విస్తారంగా చర్చించాయి. సంక్షోభ సమయం లో దేశ ప్రధాని కి దన్నుగా నిలబడటం ద్వారా కె సి ఆర్, సరైన రాజకీయ స్ఫూర్తిని ప్రదర్శించారని, సఫాయన్న నీకు సలామన్నా అంటూ వినమ్రపూర్వక విజ్ఞప్తి చేయటం ద్వారా జన హృదయాన్ని చూరగొన్నారని కూడా సోషల్ మీడియా వేదికలు ప్రశంసించాయి. భేష్ కె సి ఆర్.. మీ స్ఫూర్తి మా గుండెలకు ఊపిరినిచ్చింది. రేపటి మీద ఆశ చిగురింప చేసింది.
* ఐ సి యు లో ఉన్న టీ డీ పీ కి రోజూ ఆక్సిజన్ ఎక్కిస్తున్న వై ఎస్ ఆర్ సి పీ * నాయుడు అంతర్జాతీయ తీవ్రవాది అని తేల్చిన పేర్ని నాని * ఏజెంట్ పేర్ని నాని పరిశోధనలో బయటపడ్డ నాయుడు అంతర్రాష్ట్ర లింకులు పిచ్చ పీక్ కు వెళిపోతే, ఇలాంటి ఆరోపణలే చేస్తారు మరి. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు, ఉండాల్సిన కనీస మర్యాదను కరకట్ట దారిలో తొక్కేసి మరీ, కసిగా రాష్ట్ర రవాణా,సమాచార పౌరసంబంధాల శాఖమంత్రి పేర్నినాని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్రం లో నిరుటి ఎన్నికల్లో పరువు కోల్పోయి, 23 సెగ్మెంట్స్ కు పరిమితమైన చంద్రబాబు నాయుడు, పార్టీ ఉనికి కోసం ఏదో తనదైన శైలిలో రోజు వారీ చేసే అనుగ్రహ భాషణాల్లో కూడా కుట్ర కోణాలు వెతికే పేర్ని నాని ని చూసి సోషల్ మీడియా జాలిపడుతోంది. ఐ సి యు లో ఉన్న తెలుగు దేశం పార్టీకి మూడు రాజధానుల ఇష్యూ తో తిరిగి ఆక్సిజన్ ఎక్కించిన పాలక వై ఎస్ ఆర్ సి పీ నాయకులు , తాజాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పై ఒళ్ళు మరిచి చేస్తున్న విమర్శలూ, ఆరోపణలూ కూడా సోషల్ మీడియా కి కావాల్సినంత ఆహారం ఇస్తున్నాయి. ఈ కోవలోనే పేర్ని నాని సైంటిస్ట్, ఇంకా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అవతారాలు ఎత్తారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు , ఎక్కడ, ఏమి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారనే మినిట్ to మినిట్ ప్రోగ్రాం వివరాలు తన దగ్గర ఉన్నాయంటూ విలేకర్ల సమావేశం లో వెల్లడించారు.  చంద్రబాబు పక్కరాష్ట్రం లో బతుకుతున్నారని కనుక్కున్న ఆయన, తన పరిశోధనలో చంద్రబాబుకు, అంతర్జాతీయ తీవ్రవాదులకు పెద్ద  తేడా కనిపించడం లేదనే విషయాన్ని కనుక్కున్నారు. చంద్రబాబు మనస్తత్త్వం చూస్తే అంతర్జాతీయ తీవ్రవాదిలా ఉన్నారన్న పేర్ని నాని, తన పరిశోధన లో వెల్లడైన మరిన్ని సంచలన విషాలను షేర్ చేశారు.  "తీవ్రవాదులు కూడా వేరే దేశంలో ఉంటూ ఇక్కడ బాంబులు పెడుతూ,రకరకాల వైరస్ లు పంపుతుంటారు. నాశనం కోరుకుంటారు. పాజిటివ్ కేసులు వచ్చినచోట్ల కూడా(రెడ్ జోన్లు) వైద్యులు,పారిశుధ్యకార్మికులు,రెవిన్యూ, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు వాలంటీర్లు వీరంతా చిరుద్యోగులు ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారు.మిలటరీలో దేశాన్ని కాపాడటానికి ఏ విధంగా సైనికులు పోరాడుతున్నారో అదే విధంగా వారందరూ సేవలందిస్తున్నారు.విలేకరులను చూసైనా చంద్రబాబు సిగ్గుతెచ్చుకోవాలి.ఆర్దిక బాధలు దిగమింగి ప్రజలను అప్రమత్తం చేయడం లో, ప్రభుత్వసూచనలు ప్రజలకు చేరవేయడంలో ప్రజలను మేలుకొల్పుతూ వ్యాధిని అరికట్టడంలో విలేకరులు సేవలందిస్తున్నారు. మీడియా వారు సామాజిక బాధ్యతగా పనిచేస్తున్నారు. ఇంకా వ్యాధి ప్రబలుతుందని చంద్రబాబు చెబుతున్నారు.అంటే మీరు ఎవర్ని దెబ్బతీయదలుచుకున్నారు.ఎవరి ఆత్మస్దైర్యం దెబ్బతీస్తున్నారు.ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నవారిని వారి ఆత్మస్ధైర్యాన్ని దెబ్బతీస్తున్నారా. కరోనా వ్యాధి వస్తుందనే ముందువరకు కూడా చాలా డిపార్ట్ మెంట్లను తిట్టుకునే పరిస్దితి నుంచి ఈరోజు ఆ యా డిపార్ట్ మెంట్లను,ఉద్యోగులను ప్రజలు నేడు వారి సేవలు చూసి వేనోళ్ల కొనియాడుతున్నారు. కరోనా లెక్కలు దాచామని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు.చంద్రబాబు లెక్కలు చెబితే వారికి పరీక్షలు చేయిస్తాం," అని కూడా పేర్ని నాని సవాల్ చేశారు. ఆంధ్ర  రాష్ట్రంలో ఐదుకోట్ల మంది ఉంటే ఐదుకోట్ల మందికి పరీక్షలు చేస్తారా.ఎక్కడైతే వ్యాధిప్రబలుతుంటే అక్కడ పరీక్షలు చేస్తారు.14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తనకు ఇవి తెలియవా, అంటూ కూడా పేర్ని నాని ప్రశ్నించారు.  దొంగలెక్కలు రాయడం చంద్రబాబుకే అలవాటు.దుర్మార్గమైన ఆలోచనలు చంద్రబాబు మానుకోవాలని సూచించిన పేర్ని నాని పరిశోధన లో తేలిన విషయాలేమిటంటే, చంద్రబాబు కు మానవత్వం లేదు.మానవీయకోణం లేవని. వేల సంఖ్యలో మరణాలు ఉన్నాయి కాని ప్రభుత్వం దాస్తుందనే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారంటే విలేకరులు వాస్తవాలు దాస్తున్నట్లుగా మాట్లాడుతున్నట్లేకదా అని కొత్త లాజిక్ ని కూడా పేర్ని నాని తీశారు. కరోనా సోకిందనే బాధ కంటే ఇలాంటి దిక్కుమాలిన వ్యక్తి మమ్మల్ని ఇన్నాళ్లు పాలించారా అని ప్రజలు బాధపడుతున్నారని కూడా పేర్ని నాని కనుగొన్నారు.  ఈ యుధ్ద వాతావరణంలోనే కాదు చంద్రబాబు పాలనలో రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వకుండా, ధాన్యం కొని వారికి డబ్బులు చెల్లించకుండా, విత్తనాలు అందించకుండా అన్ని విధాలా బాధ పెట్టిన విషయాన్నీ కూడా పేర్ని నాని కనుగొన్నారు.
* క్వారంటైన్ ను ఎప్పటి నుంచో జీవన విధానంగా మలుచుకున్న యనమల కన్నా, వర్ల రామయ్య, బుద్ధా వెంకన్నలే బెటరని నేతల్లో అభిప్రాయం  * చంద్రబాబు నాయుడు 24X 7 ప్రజా క్షేత్రంలో ఉన్నా, యనమల మాత్రం పత్రికా ప్రకటనలకే  పరిమితం కావటం పై ఆక్షేపణ  ఎసెట్స్, లయబిలిటీస్ అని మనం చదువుకుంటూ ఉంటాం. ఆంధ్ర ప్రదేశ్ లో, ఆ మాట కొస్తే, రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ కి లయబిలిటీ గా మారిన చాలామంది నేతల్లో మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఒకరు అనే భావన చాల మంది నాయకుల్లో బలంగా ఉంది.  పలుకే బంగారమాయెరా పద్ధతిలో ఆయన తనను తాను  ప్రెస్ నోట్స్ కు మాత్రమే పరిమితం చేసుకుని, సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోవటం ఆయన ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పటి నించీ చూస్తూనే ఉన్నాం. అయితే ఆయన చాలా సీనియర్ మోస్ట్ కావటం వల్లనూ, పార్టీ లో ఆయనకు చంద్రబాబు నాయుడు అత్యంత ప్రయారిటీ ఇవ్వటం కారణం గానూ, ఎన్ఠీఆర్ ను పదవీచ్యుతుని చేసిన సమయం లో ఆయన అద్భుతమైన 'శ్రమదానం' చేసినందువల్లనూ --ఇప్పటికీ తెలుగు దేశం నాయకులు ఆయన్ను అరమోడ్పు కన్నులతో, ఆరాధ్య పూరిత దృక్కులతో చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. అలా, తనదైన శైలిలో- పార్టీ లో 'సరిలేరు నాకెవ్వరు' టైటిల్ పెట్టుకుని మహరాజులా వెలిగిపోతున్న యనమల రామకృష్ణుడు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మీద ప్రెస్ రిలీజ్ లో చెడా మడా నిప్పులు చెరిగేశారు. అలా చెరిగిన నిప్పులలో-కొన్ని నిప్పురవ్వలను మీ కోసం ప్రత్యేకంగా అందచేస్తున్నాం.  రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో వైసిపి ప్రభుత్వ వైఫల్యం మీద ఆగ్రహం వ్యక్తం చేసిన యనమల, ఉపశమన చర్యలు శరవేగంగా చేపట్టాలని, ఒక ప్రకటనలో  డిమాండ్ చేశారు. "విపత్తుల్లో ప్రజలను కాపాడేవాడే పాలకుడు. ఆపదల్లో అండగా ఉండటం నాయకత్వ లక్షణం. అలాంటిది ప్రజలను కష్టాల్లో వదిలేయడం రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించడమే.  రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ ఉధృతం. పాలకుల ఉదాసీనత వల్లే  రాష్ట్రంలో కరోనా విస్తృతం. వైద్య ఆరోగ్యశాఖకు కేటాయించిన రూ 11,399కోట్లలో ఎంత ఖర్చు పెట్టారు..? రూ 11,399కోట్ల బడ్జెట్ పెట్టి, కరోనా మాస్క్ లకు రూ 30కోట్లే ఇస్తారా," అంటూ ఆవేశంగా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ను నిలదీశారు.  ఇదేనా మీరు చెప్పిన ‘‘నాడు-నేడు’’..? నాడు సీఎంగా చంద్రబాబు ఇలాగే చేశారా..? నేడు సీఎంగా మీరెలా చేస్తున్నారో ప్రజలే చూస్తున్నారంటూ కూడా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ను కడిగి పారేశారు. విపత్తుల్లో చంద్రబాబు పనితీరుకు, మీ పనితీరుకు ప్రజలే బేరీజు వేస్తున్నారంటూ కూడా హెచ్చరించారు. " టిడిపి ప్రభుత్వం మెడ్ టెక్ జోన్ పెట్టకపోతే ఇప్పుడు పరిస్థితి ఏమిటి..? డాక్లర్లు, వైద్య సిబ్బందికి రక్షణ ఉపకరణాలు ఉండేవేనా..? మెడ్ టెక్ జోన్ పై చేసిన ఆరోపణలపై ప్రజలకు క్షమాపణ చెప్పాలి. గత ఏడాది రూ 2,27,975కోట్ల బడ్జెట్ లో ఎంత ఖర్చు పెట్టారు. తొలి 6నెలల్లో 35%కూడా ఖర్చు చేయలేదు. రెవిన్యూ వ్యయమే తప్ప కేపిటల్ వ్యయం శూన్యం. 65% నిధులు మీవద్దే ఉంటే ఉద్యోగుల జీతాల్లో కోతలు ఎందుకు," అంటూ యనమల ఆ పత్రికాప్రకటనలోనే ఆగ్రహం తో ఊగిపోయారు.  కరోనా నిరోధానికి నిధులు ఎందుకివ్వరు..? డాక్టర్లు, సిబ్బందికి మాస్క్ లు, రక్షణ ఉపకరణాలు ఎందుకు కొనరు..?పోలవరం సహా అన్ని ప్రాజెక్టుల పనులు నిలిపేశారు. అమరావతి సహా అభివృద్ది పనులన్నీ నిలిపేశారు.  విపత్తు నిర్వహణకు, నరేగా కు, 14వ ఆర్ధిక సంఘ నిధులు, డివల్యూషన్ నిధులు, కేంద్రం ఇచ్చిన నిధులన్నీ ఏం చేశారు..? 11నెలల్లో అభివృద్ది శూన్యం, పేదల సంక్షేమం నిల్.. కరోనా ఉపశమన చర్యలు కూడా మొక్కుబడిగానే.. డిసెంబర్ లోనే విదేశాల్లో కరోనా ప్రభావం ప్రారంభం. జనవరి 3వ వారంలో మనదేశంపై కరోనా ప్రభావం. నాలుగో క్వార్టర్ పై కరోనా ప్రభావం చూపింది. మరి మొదటి 3క్వార్టర్లలో మీరు చేసిన అభివృద్ది, సంక్షేమం ఏమిటి..? కరోనా రాకముందు ఏం చేయలేదు, కరోనా వచ్చాక చేసిందేమీ లేదని కూడా జగన్ మోహన్ రెడ్డి లెక్క తేల్చేశారు.  కరోనాపై కేంద్ర మార్గదర్శకాలు గాలికొదిలేశారు. లాక్ డౌన్ కు వైసిపి నేతలే తూట్లు పొడుస్తున్నారు. కరోనా వ్యాప్తి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సాహమా..? ఈ విపత్తులోనూ ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తారా..?కరోనాలోనూ మీ అవినీతి,అక్రమాలు మానుకోరా, అంటూ నిప్పులు చెరిగారు. లోడింగ్ కార్మికులకు కరోనా సోకితే బాధ్యత ఎవరిది..? లాక్ డౌన్ పీరియడ్ లో వందల లారీల్లో ఇసుక తరలింపులా..? ట్రాక్టర్లలో గ్రావెల్, మట్టి తరలిస్తుంటే ఏం చేస్తున్నారు..? మద్యం అక్రమ విక్రయాలను ప్రోత్సహిస్తారా, అని కూడా తన ప్రెస్ రిలీజ్ లో ఆయన ప్రశ్నించారు.  ఏడాది గడుస్తున్నా పరిపాలనపై సీఎంకు అవగాహన లేదు. సంబంధిత శాఖలపై ఏ ఒక్కమంత్రికి పట్టు దొరకలేదు. స్వప్రయోజనాలే తప్ప ప్రజారోగ్యంపై వైసిపి నేతలకు శ్రద్ద లేదు. టిడిపి హయాంలో ఏ అభివృద్ది పని ఆగలేదు. ఏ సంక్షేమ పథకం రద్దు చేయలేదు. పైగా అనేక కొత్త సంక్షేమ పథకాలు ప్రారంభించాం. అనేక అభివృద్ది ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేశాం. విపత్తుల్లో బాధిత ప్రజానీకాన్ని ఆదుకున్నాం. హుద్ హుద్ లో, తిత్లి తుపాన్ లో ఎలా ఆదుకున్నామో ప్రజలకు తెలుసునని కూడా యనమల గుర్తు చేశారు.  విపత్తులంటే సీఎం జగన్ కు భయం. ఎప్పుడు విపత్తులు వచ్చినా పత్తా ఉండరు. తిత్లి తుపాన్ లో, మొన్న గోదావరి, కృష్ణా వరదల్లో ఎక్కడ ఉన్నారో ప్రజలు మరిచిపోలేదు. పాలకుల నిర్లక్ష్యం  ప్రజలకు శాపం కారాదు. ఇప్పటికైనా కరోనా కట్టడి చర్యలు ముమ్మరం చేయాలి. ఫ్రంట్ లైన్ వారియర్లకు రక్షణ ఉపకరణాలు అందజేయాలి. వైద్య ఆరోగ్య శాఖకు నిధులు విడుదల చేయాలి. రైతుల వద్ద పంట ఉత్పత్తులు వెంటనే కొనుగోలు చేయాలి. ప్రతి పేద కుటుంబానికి రూ 5వేలు ఆర్ధిక సాయం అందించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇలా ఆయన ప్రెస్ రిలీజ్ సాంతం ఆయన జగన్ మోహన్ రెడ్డి ని కడిగేసి, నిప్పులు చెరిగి చంద్రబాబు నాయకత్వం పట్ల తన విధేయతను ను ఎప్పటిలాగానే-కాగితం రూపేణా తీర్చుకున్నారు. "జగన్ మోహన్ రెడ్డి ఈ ఎనిమిది నెలల నుంచే క్వారంటైన్ లో ఉన్నారు. మా యనమల వారు రాజ్యం చేసినంత కాలం ఎక్కువ సమయం క్వారంటైన్ లో గడిపిన సన్నివేశాలను, సందర్భాలను ఇప్పుడో సరి మేము గుర్తు చేసుకుంటున్నాం, ఎలాగూ కరోనా కారణంగా కాస్తంత వీలు చిక్కింది," అంటూ టీ డీ పీ నాయకులు నిట్టూరుస్తున్నారు.
అనగనగా ఓ అమ్మాయి. ఆ అమ్మాయికి చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి నిబ్బరంగా సంసారాన్ని నెట్టుకొస్తూ ఉంది. కానీ కూతురు మాత్రం ప్రతి చిన్న కష్టానికీ కంగారుపడిపోయేది. ఏం చేయాలో పాలుపోక తెగ బాధపడిపోయేది. ‘ఇక ఈ కష్టాలను భరించడం నా వల్ల కాదమ్మా!’ అని ఓ రోజు తన తల్లితో తెగేసి చెప్పింది కూతురు. తల్లి, కూతరి వంక ఒక్క నిమిషం చూసింది. ఆ తరువాత మారుమాట్లాడకుండా ఆమెను వంటింట్లోకి తీసుకువెళ్లింది. తల్లి తనకేం చెప్పాలనుకుందో తెలియని అయోమయంలో కూతురు ఆమెను అనుసరించింది.   వంటింట్లోకి వెళ్లిన తల్లి ఒక మూడు పాత్రలు తీసుకుంది. ఒకదానిలో బంగాళదుంప, మరోదానిలో కోడిగుడ్డు, ఇంకోదానిలో కాఫీ గింజలు వేసి వాటిని పొయ్యి మీద పెట్టింది. తల్లి చేస్తున్న పని చాలా అసంబద్ధంగా తోచింది కూతురికి. అయినా మారు మాటాడకుండా చూస్తూ నిల్చొంది. ఒక పది నిమిషాలు అయిన తరువాత... ‘ఒకో గిన్నెలో ఏం జరిగిందో గమనించు’ అంటూ అడిగింది తల్లి. ‘గమనించడానికి ఏముంది! బంగాళదుంప వేడి నీటికి మెత్తబడిపోతుంది. కోడిగుడ్డు గట్టిపడిపోతుంది. కాఫీ గింజలతో కాఫీ తయారవుతుంది’ అంది కూతురు ఎగతాళిగా. ‘కదా! పైకి గట్టిగా కనిపించే బంగాళదుంప కాస్త వేడినీరు తగలగానే ఇట్టే మెత్తబడిపోయింది. చేయి తగిలితే చాలు చితికిపోయే కోడిగుడ్డేమో వేడినీటికి గట్టిపడిపోయింది. ఇక కాఫీ గింజలు మాత్రం తన చుట్టూ ఉన్న నీటిని తన ఉనికితో నింపేశాయి,’ అని చెప్పుకొచ్చింది తల్లి. తల్లి చేసిన వింత చేష్ట వెనుక ఏదో మంచిమాట దాగి ఉంటుందని అప్పటికి అర్థమైంది కూతురికి.   ‘మనం కూడా ఇంతే! అప్పటివరకూ ధైర్యంగా ఉన్నవారు కూడా కష్టాలు రాగానే ఇట్టే డీలా పడిపోతారు.. ఆ బంగాళదుంపలా. మరికొందరేమో కష్టాలు ఎదురయ్యేసరికి మొద్దుబారిపోతారు. అప్పటివరకూ సున్నితంగా ఉన్నవారు కూడా రాయిలా మారిపోతారు- కోడిగుడ్డులా. కానీ చాలా కొద్ది మంది మాత్రమే కష్టాలకు ఎదురీదుతారు. ఆ కష్టాలను సైతం తనకు అనుకూలంగా మార్చుకుంటారు. వాళ్ల స్వభావంతో, వారి చుట్టూ ఉన్న వాతావరణమే పూర్తిగా మారిపోతుంది... కాఫీ గింజల్లాగా! ఇప్పుడు చెప్పు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు?’ అని అడిగింది తల్లి. కూతురు మారు మాట్లాడకుండా చిరునవ్వుతో కాఫీని ఒక రెండు కప్పుల్లోకి సర్ది, ఒకదాన్ని తన తల్లికి అందించింది. మరోదాన్ని తను ఆస్వాదించేందుకు సిద్ధపడింది... జీవితాంతం!   - నిర్జర.
ఇవాళ రేపట్లో కంప్యూటర్లో ఏదో ఒక అకౌంట్‌ లేకుండా పూట గడవడం లేదు. అది ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ కావచ్చు, ఆన్‌లైన్‌ షాపింగ్‌ కావచ్చు... ఏదీ కాకపోయినా కనీసం ఈ-మెయిల్‌ అకౌంటన్నా కావచ్చు. వీటన్నింటికీ మంచి పాస్‌వర్డుని ఎంచుకోవడం ఒక సమస్యే! ఆ మన దగ్గరే ఏముందిలే నష్టపోయేందుకు అనుకోవడానికి కూడా లేదు. మన వ్యక్తిగత సమాచారాన్నీ, ఫైళ్లని తస్కరించడం దగ్గర్నుంచీ... మన కాంటాక్ట్‌ లిస్టులో ఉండేవారి మెయిల్స్‌కు తప్పుడు మెయిల్స్‌ పంపడం వరకూ హ్యాకర్లు దేనికైనా తెగించగలరు. ఎవరిపడితే వారి పాస్‌వర్డులను ఛేదించేందుకు ప్రత్యేకమైన సాఫ్టవేర్లు అందుబాటులో ఉన్నాయంటే నమ్మగలరా! అందుకే అలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ఈ చిట్కాలు-   1- చిన్నపాటి పాస్‌వర్డులకు కాలం చెల్లిపోయింది. మీ పాస్‌వర్డు కనీసం 10 అక్షరాలకు పైనే ఉండాలంటున్నారు నిపుణులు. ఇక మరీ జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భాలలో కనీసం 12 నుంచి 14 అక్షరాలు ఉండాలని సూచిస్తున్నారు.   2- పాస్‌వర్డులో కేవలం అక్షరాలే ఉంటే సరిపోదన్నది అందరికీ తెలిసిందే! అంకెలు, అంకెల దిగువున ఉండే సింబల్స్, క్యాపిటల్‌ లెటర్స్‌, స్మాల్‌ లెటర్స్ ఇలా కీబోర్డు మీద టైప్‌ చేయదగిన అన్ని రకాల సంకేతాలనీ వాడాల్సిందే!   3- మీకు సంబంధించిన వ్యక్తిగతమైన వివరాలని (ఉదా॥ పుట్టినరోజు, భార్యపేరు) పాస్‌వర్డులో ఉంచితే పాస్‌వర్డుని ఛేదించడం సులువైపోతుంది. అందుకే మీకు బాగా గుర్తుండి, మీ చుట్టుపక్కల వారికి ఏమాత్రం అవగాహన లేని (ఉదా॥ తల్లి తరఫు ఇంటి పేరు, పిల్లలకి పురుడు పోసిన డాక్టరు పేరు) పాస్‌వర్డులను ఎంచుకోవాలి.       4- నిఘంటువులో కనిపించే పదాలను (ఉదా॥ house, system, daughter) ఎట్టిపరిస్థితుల్లోనూ పాస్‌వర్డుగా ఉంచకూడదు. వీటిని పాస్‌వర్డు తస్కరించే సాఫ్టవేర్లు పసిగట్టేస్తాయి. My wife, happy home వంటి రోజువారీ వాక్యాలను కూడా ఇవి పట్టేస్తాయి.   5- చాలామంది బలమైన పాస్‌వర్డునే ఎంచుకొంటారు. కానీ పాస్‌వర్డు మర్చిపోయినప్పుడు కంప్యూటర్‌ అడిగే ప్రశ్నలకు గాను చాలా తేలికైనవి ఎంచుకొంటారు. ఫలితంగా ఎవరైనా సదరు ప్రశ్నలకు జవాబు చెప్పి మీ అకౌంటులోకి ప్రవేశించే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.       6- మనసులో ఏదో ఒక వాక్యాన్ని అనుకొని అందులోని పదాల తొలి అక్షరాలతో పాస్‌వర్డుని ఏర్పాటు చేసుకోవడం ఒక మంచి పద్ధతి. ఉదా॥ My Son was born on 14th January 2000 అన్న వాక్యాన్ని గుర్తుంచుకోవడం చాలా తేలిక. దీని ఆధారంగా MSWBO1422000 అన్న పాస్‌వర్డుని సృష్టించుకోవచ్చు.   7- వేర్వేరు అకౌంట్లకి ఒకటే పాస్‌వర్డుని ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకూడదన్నది నిపుణులు హెచ్చరిక. ఒకవేళ అలా వాడాల్సి వచ్చినా, తప్పనిసరిగా అందులో ఎంతో కొంత మార్పు చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు పైన ఎంచుకొన్న MSWBO1422000 పాస్‌వర్డుని AMAZONకి కూడా వాడాలనుకుంటే MSWBO-amaze-1422000 అంటూ పాస్‌వర్డుకి తగిన మార్పు చేయవచ్చు.       8- బ్యాంకింగ్‌ వంటి ఆర్థికపరమైన, గోప్యమైన లావాదేవీలు జరిపే ఖాతాలకి చెందిన పాస్‌వర్డుల విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. వీటిని తరచూ మారుస్తూ ఉండటం, మరే ఇతర పాస్‌వర్డులతో సంబంధం లేకుండా ఉంచడం అవసరం. ఇందుకోసం ఎలాంటి అనుమానం రాని పాస్‌వర్డులు కావాలనుకుంటే ఆన్‌లైన్లో http://passwordsgenerator.net/ వంటి సైట్లు ఉచితంగా క్లిష్టమైన పాస్‌వర్డులను అందిస్తాయి.   9- ఎట్టి పరిస్థితులలోనూ పాస్‌వర్డుని బయటవారితో పంచుకోకూడదు. ఇవాళ ఉన్న బంధం రేపు ఉంటుందని చెప్పలేం కదా! ఒకవేళ అలా ఎవరితోనన్నా పాస్‌వర్డుని పంచుకోవల్సిన సందర్భం వచ్చినా, ఎవరికన్నా పాస్‌వర్డు తెలిసిపోయిందన్న అనుమానం కలిగినా... వెంటనే దానిని మార్చివేయడం మంచింది.    10- ఈ రోజుల్లో పది రకాల ఖాతాలకు పది రకాల పాస్‌వర్డులు కావాల్సి వస్తోంది. పైగా అవి క్లిష్టంగా ఉండాలన్న నియమం ఎలాగూ ఉంది. దీంతో తరచూ ఏదో ఒక పాస్‌వర్డుని మర్చిపోవడం అతి సహజం. ఇందుకోసం వీటిని వీటిని ఎక్కడన్నా భద్రమైన చోట రాసి ఉంచుకోవడంలో తప్పులేదు. అయితే అలా రాసి ఉంచుకున్న కాగితాన్ని నిర్లక్ష్యంగా ఉంచితే మాత్రం అసలుకే ఎసరు తప్పదు! - నిర్జర.
అదో పెద్ద అడవి. ఆ అడవిలో రకరకాల జంతువులు. వాటిలో సహజంగానే ఓ సింహమూ, ఓ జింకా ఉన్నాయి. ఒక రోజు ఆ సింహం జింకని చూడనే చూసింది. వెంటనే దాన్ని వేటాడేందుకు వెంటపడింది. సింహం నుంచి తప్పించుకోవడానికి జింక చాలా ప్రయత్నమే చేసింది. దాని నుంచి పరిగెడుతూ పరిగెడుతూ పొరపాటున ఒక చెరువులోకి పడిపోయింది. దాన్ని తరుముతూ సింహం కూడా చెరువులోకి దూకేసింది. ఆ చెరువు నిండా నీళ్లున్నా బాగుండేది. కానీ కరువుతో చెరువు సగానికి ఎండిపోయింది. బురదతో నిండిపోయింది. ఆ బురదలో ఒక పక్క జింక, మరోపక్క సింహం మోకాళ్ల లోతు వరకు కూరుకుపోయాయి. ‘‘హహ్హా! ఇంక నేను నీ వెనుక పరిగెత్తాల్సిన పని లేదు. ఈ బురదలో చిక్కుకున్న నీ ఎముకలు విరిచి, నీ లేత మాంసాన్ని రుచిచూస్తాను,’’ అంటూ నవ్వింది సింహం.   ‘‘నా మాంసపు రుచి తర్వాత. ముందు నువ్వు ఇక్కడి నుంచి ఎలా బయటపడగలవో ఆలోచించు,’’ అంటూ వెక్కిరించింది జింక. జింక మాటలకి కోపంగా సింహం ముందుకు కదలబోయింది. కానీ అది ఎంతగా కదులుతుంటే అంతగా బురదలో దిగబడిపోతోంది. ‘‘నిజమే నేను కదల్లేకపోతున్నాను. ఇప్పుడెలా!’’ అని బిక్కమొగం వేసింది సింహం. ‘‘నీకు ఎవరన్నా స్నేహితులు ఉన్నారా?’’ అని తాపీగా అడిగింది జింక.   ‘‘నేను ఈ అడవికి రాజుని. అంతా నన్ను చూసి భయపడేవాళ్లే కానీ స్నేహితులు ఎక్కడ ఉంటారు. నాకు బానిసలు, శత్రువులే కానీ స్నేహితులు ఉండరు,’’ అని గర్వంగా చెప్పింది సింహం. ‘‘కానీ నాకైతే చాలామంది స్నేహితులు ఉన్నారు. మేమంతా కలిసిమెలిసి ఉంటాం. నేను కనిపించకపోయేసరికి వాళ్లంతా నన్ను వెతుక్కుంటూ వస్తారు. ఎలాగైనా నన్ను రక్షిస్తారు,’’ అని నమ్మకంగా చెప్పింది జింక. ‘‘సరే! అదీ చూద్దాం... ’’ అని ధీమాగా అంది సింహం. ఆ బురద చెరువులో కాలం చాలా భారంగా గడిచింది. ఒకో గంటా గడిచెకొద్దీ సింహంలో అసహనం పెరిగిపోయింది. కానీ జింక మాత్రం నిశ్చింతగానే ఉంది. తన స్నేహితులు వస్తారనే నమ్మకం తనలో ఇసుమంతైనా తగ్గలేదు.   సాయంత్రం అయ్యింది. నిదానంగా చీకటి పడింది. అసలే ఆకలితో ఉన్న సింహం డీలాపడిపోయింది. కానీ తన స్నేహితుల మీద ఉన్న నమ్మకంతో జింక మాత్రం నిబ్బరంగా నిలబడి ఉంది. ఇంతలో.... చెట్ల చాటు నుంచి ఏవో శబ్దాలు వినిపించాయి. ముందు ఓ జింక పిల్ల చెరువువైపు తొంగిచూసింది. ఆ తర్వాత మరో జింక, దాని వెనుక ఇంకో జింక.... వరుస పెట్టి ఓ జింకల మంద చెరువుగట్టుకి చేరింది. వాటికి అక్కడి పరిస్థితి చిటికెలో అర్థమైపోయింది. ఎలాగొలా తన నేస్తాన్ని రక్షించుకోవాలని అనుకున్నాయి. తాళ్లే పడేశాయో, చేతులే చాచాయో... మొత్తానికి ఎలాగొలా బురదలో చిక్కుకున్న జింకని ఒడ్డుకి తెచ్చాయి. దాన్ని తీసుకుని అడుగులో అడుగు వేసుకుంటూ తిరిగి వెళ్లిపోయాయి.   తన కళ్ల ముందే జరుగుతున్నది చూసిన సింహానికి మతిచెడిపోయింది. కచ్చగా తను కూడా బురదలోంచి బయటపడాలని ఒకసారి విదిలించుకుంది. అంతే! అది మరింత లోతుకి జారిపోయింది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.
సంవత్సరానికి 1,35,445 మంది... ప్రతిరోజూ సగటున 242 మంది మగవారు, 129 ఆడవారు జీవితాన్ని వద్దనుకుని బలవంతంగా ప్రాణాలు వదులుతున్నారు మన భారతదేశంలో. అందులోనూ 15 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉన్నవారే ఎక్కువట. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా పాటిస్తున్న ఈరోజున ఆత్మహత్యలని నివారించడానికి మనంగా ఏం చేయాలని ఆలోచించి తీరాలి. సమాజం, సామాజిక సంస్థలు, ప్రభుత్వం బాధ్యత ఎంతవుందో.. వ్యక్తులుగా, మన బాధ్యత కూడా అంతే వుందన్నది నిజం. అందుకే పెద్ద పెద్ద సిద్ధాంతాలని పక్కనపెట్టి సగటు మనిషిగా ఆలోచిస్తే మనతోపాటు మసలే మన కుటుంబంలోని వ్యక్తి లేదా స్నేహితుడు, బంధువు, సహోద్యోగి లేదా పక్కింటివారు... ఇలా మన పరిధుల్లో మనకి పరిచయం వున్నవారు, నిన్నటిదాకా మనతో వున్నవారు హఠాత్తుగా చడీచప్పుడు లేకుండా బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారంటే అందులో మన పాత్ర ఏం లేదా? మనం చేయగలిగింది ఏం లేదా? వీటిని ఆపడం సాధ్యం కాదా? చిన్న విషయమే.. అందరికీ తెలిసిన విషయమే.. మనందరి అనుభవంలోనిదే. మనసుకి బాధ కలిగితే పంచుకోవడానికి ఒక వ్యక్తి కావలసి వుంటుంది. ఎలాంటి ఆక్షేపణలు లేకుండా కేవలం మనసుపెట్టి వినే ఒక్క వ్యక్తి చాలు ఆ నిమిషానికి దేవుడిలా కనిపిస్తాడు. అందుకే వినటం నేర్చుకుందాం. ఎదుటి వ్యక్తికి మాట్లాడే అవకాశమిద్దాం. మనసులోని బాధనంతా వెళ్ళగక్కేందుకు కొంచెం సమయం ఇద్దాం. సత్సంబంధాలు, సాన్నిహిత్యం మనుషుల్లో భరోసాని, ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగిస్తాయి. ఆపద రాగానే పరిగెట్టుకు రాగలరు. బాధని పంచుకోగలరు. దీనికి చేయాల్సిందల్లా ఒక్కటే.. కొంచెం మానవ సంబంధాలపై దృష్టి పెడదాం. ఉదయం లేచి మనకి ఎదురుపడే ప్రతి ఒక్కరిని చిన్న చిరునవ్వుతో పలకరిద్దాం. ఇంట్లోని పనిమనిషి నుంచి ఆఫీసులోని ప్యూను దాకా అందరినీ కుశలం అడుగుదాం. నాలుగు కబుర్లు చెబుదాం. మన జీవితంలోని విశేషాలని పంచుకుందాం. వాళ్ళ జీవితంలోని విశేషాలని అడుగుదాం. బలమైన మానవ సంబంధాలు ఎప్పుడూ ధైర్యాన్నిస్తాయి. ఆత్మహత్య అనే భూతం ఎప్పుడు ఎవర్ని నిశ్శబ్దంగా కబళిస్తుందో తెలీదు. బతుకు పోరాటంలో ఎత్తుపల్లాలు సహజమని తెలిసీ ఆ క్షణానికి నైరాశ్యానికి లొంగిపోయే వారెందరో! సహాయం చేయగలమా, వారి సమస్యలని తీర్చగలమా అన్నది పక్కన పెడితే, తన బాధలనయితే వినగలం కదా! నాలుగు ధైర్య వచనాలు పలకగలం కదా! ఏదో ఒక దారినైతే చూపించగలం కదా! ఇలా జరగాలంటే ముందు మనం నలుగురికి అందుబాటులో వుండాలి. ఒంటరితనపు కంచుకోటని బద్దలు కొట్టుకుని బయటకి రావాలి. ఈరోజున ఆ నిర్ణయం తీసుకుందాం. ‘‘ఆత్మహత్యల నివారణకి వ్యక్తిగా నేనేం చేయగలను’’ అన్న ఒక చిన్న ఆలోచన చేద్దాం. నలుగురితో ఆ ఆలోచని పంచుకుందాం. నిస్సహాయంగా, నిర్వేదంగా జీవితానికి వీడ్కోలు పలికే దుస్థితి ఎవరికీ రావద్దు అంటే కొంచెం మానవత్వంతో ఆలోచిద్దాం. మానవ సంబంధాలని బలపర్చుకుందాం. -రమ  
కుటుంబసమేతంగా హాయిగా గడిపేందుకు ఏదో పుణ్యక్షేత్రానికని బయల్దేరతాం లేదా పండుగ రోజుల్లో ఓ నాలుగు ఊళ్లు తిరిగిరావాలని గడపదాటతాం. ఊరు దాటాక ఏదో ఒకటి తినక మానదు. జిహ్వచాపల్యం అణచుకోలేకో, ఆకలికి తట్టుకోలేకో ఎక్కడో అక్కడ కాస్త ఆహారం తీసుకుంటాం. అంతే! మన విహారయాత్రలో నిప్పులు పోస్తూ అజీర్ణం మొదలవుతుంది. కడుపులో నొప్పి, గ్యాస్, విరేచనాలతో మన సంబరం కాస్తా సద్దుమణిగిపోతుంది. ఇలాంటి పరిస్థితికి ఓ పేరు ఉంది... అదే ట్రావెలర్స్ డయేరియా! అపరిశుభ్రతే అసలు కారణం నలుగురూ తిరిగే చోట పరిస్థితులు ఏమంత పరిశుభ్రంగా ఉండవు. హోటల్లో వంట చేసేవారి దగ్గర్నుంచీ వడ్డించేవారి వరకూ ఎవరో ఒకరు అపరిశుభ్రమైన చేతులతో ఆహార పదార్థాలను ముట్టుకోవచ్చు. ఇలాంటి సమయంలో వారి చేతికి అంటుకుని ఉన్న E.coli వంటి సూక్ష్మక్రిముల ద్వారా ట్రావెలర్స్ డయేరియా (TD) సోకే ప్రమాదం ఉంది. ఇవీ లక్షణాలు అకస్మాత్తుగా విరేచనాలు మొదలవ్వడం, జ్వరం, వాంతులు వికారం, ఆకలి వేయకపోవడం, కడుపులో పోట్లు, పొట్ట ఉబ్బరం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ లక్షణాల నుంచి ఉపశమనం లభించేందుకు మందులు ఎలాగూ అందుబాటులో ఉంటాయి. వాటితో పాటుగా పుష్కలంగా నీరు తాగుతూ ఉండాలి. నీళ్ల విరేచనాలు అవుతుంటే ORS పొడి నీళ్లలో కలుపుకుని తాగాలి. ఒకవేళ విరేచనాలలో రక్తం పోతున్నా, జ్వరం ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించడమే మంచిది. పసిపిల్లలు, గర్భవతులలో TD లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా అందుబాటులోని వైద్యుడిని సంప్రదించాల్సిందే! ఇవీ జాగ్రత్తలు TD వ్యాధి సాధారణంగా 3 నుంచి 7 రోజులల లోపు తగ్గిపోతుంది. చాలా అరుదైన సందర్భాలలో తప్ప ఇది ప్రాణాంతకం కాదు. కాబట్టి అట్టే కంగారుపడాల్సిన పని లేదు. అయితే బయట తిరిగే నాలుగు రోజులూ రోగంతో గడిచిపోతే అంతకు మించిన విషాదం ఏముంటుంది. TD సోకిన తరువాత కంగారుపడి మందులు వాడుతూ తిప్పలు పడేకంటే అసలు అది రాకుండా చూసుకోవడం మేలు కదా! అందుకోసం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి... - అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలలో ఆహారం తీసుకోకూడదు. దారి పొడుగూతా అలాంటి హోటళ్లే కనిపిస్తుంటే ఓ నాలుగు పళ్లు తిని ఆకలి చల్లార్చుకోవడం మంచిది. - పచ్చి కూరలు, ఉడకని పదార్థాలు ముట్టుకోకపోవడమే మేలు. - అపరిశుభ్రమైన నీటితో తయారయ్యే ఐస్తో చేసే జ్యూస్ల జోలికి పోకూడదు. - బయట తాగే నీటి విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. మినరల్ వాటర్ కానీ, కాచి చల్లార్చిన నీరు కానీ తాగాలి. అలా కుదరకపోతే క్లోరిన్ లేదా అయోడిన్ బిళ్లలు కలుపుకొని తాగాలి. - నీరు అస్సలు బాగోలేదు అని అనుమానం ఉన్న చోట, ఆ నీటిని పుక్కిలించినా కూడా ప్రమాదమే! - ప్రయాణాలలో ఎక్కడపడితే అక్కడ మాంసాహారం ముట్టకూడదు. ఎందుకంటే మాంసంలో ఏమాత్రం అపరిశుభ్రత ఉన్నా, అది ఒకోసారి ప్రాణాంతకంగా మారవచ్చు. ముఖ్యంగా చేపల జోలికి అసలు పోవద్దని హెచ్చరిస్తూ ఉంటారు. ఇన్ని కబుర్లు చెబుతున్నారు. మరి నిత్యం అక్కడే ఉండిపోయే వారి పరిస్థితి ఏమిటి అన్న అనుమానం వచ్చిందా! నిజమే! అపరిశుభ్రమైన ప్రదేశాలలో నిరంతరం నివసించేవారికి కూడా మొదట్లో TD సోకి తీరుతుంది. కాకపోతే ఓ ఏడెనిమిదేళ్ల తరువాత వారి శరీరం ఆ సూక్ష్మక్రిములని తట్టుకునేందుకు అలవాటుపడిపోతుంది. కానీ మనకి అంత సమయం ఉండదు కదా! అందుకనే బయట తిరిగే నాలుగు రోజులు కాస్త జాగ్రత్తగా మెలగాల్సిందే! - నిర్జర.  
శరీరానికి కావల్సిన సూక్ష్మ పోషకాలు ఎక్కువగా లభించే పదార్థాల్లో కొబ్బరి పాలు ఒకటి. ఇందులో సోడియం, క్యాల్షియం, ఫాస్ప‌ర‌స్‌, ప్రోటీన్స్‌, పొటాషియం వంటి పోష‌కాలు స‌మృద్దిగా ఉంటాయి. అంతేకాదు క‌రోనాను అరిక‌ట్టే జింక్‌, బీ12 వంటి న్యూట్రియంట్స్ కూడా పుష్క‌లంగా లభిస్తాయి. ఇప్పుడు కొబ్బరిపాలు మార్కెట్ లో కూడా లభిస్తున్నాయి. అయితే ఇంట్లో తయారుచేసుకోవడం మంచిది. పచ్చి కొబ్బరిని తురిమి లేదా మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. పలుచటి క్లాత్ తీసుకుని అందులో ఈ కొబ్బరి ముద్దను వేసి గట్టిగా పిండాలి. ఈ పాలను సన్నని మంటమీద ఐదు నిమిషాలు వేడి చేయాలి. ఆ తర్వాత చల్లారనివ్వాలి. ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే పోషకాలు శరీరానికి అందుతాయి. సహజసిద్ధంగా లభించే కొబ్బరిపాలలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికే కాదు అందానికి కూడా కొబ్బరిపాలు ఎంతో మేలు చేస్తాయి. చుండ్రు సమస్యతో బాధపడేవారు కొబ్బరిపాలను తలకు పట్టించి బాగా మసాజ్ చేస్తే చుండ్రు సమస్య తొలగిపోతుంది. జుట్టు పట్టులా మెరుస్తుంది.