LATEST NEWS
తిరుపతి జిల్లా రంగంపేట మార్గంలో అక్రమంగా రవాణా చేస్తున్న 24 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని తరలిస్తున్నకారు నుసీజ్ చేసి   ఒకరిని అరెస్ట్ చేశారు.  టీస్క్ ఫోర్స్ బృందం  భాకరాపేట సెక్షన్ నాగపట్ల బీటు పరిధిలో కూంబింగ్  నిర్వహిస్తుండగా శనివారం (జూన్ 28)  రంగంపేట - శ్రీనివాస మంగాపురం రోడ్డులో  వేగంగా వచ్చిన ఒక కారు పోలీసులను చూసి దూరంగా ఆగింది. అందులోనుంచి  ఒక వ్యక్తి దిగి పారి పోతుండగా  పొలీసులు వెంటాడి  అరెస్టు చేశారు. అతనిని తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కారులో 24ఎర్రచందనం దుంగలు ఉండగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ రూ. 20 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. దుంగలు సహా అరెస్టు అయిన వ్యక్తిని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు.  
ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనంగా మారిన మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత   చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి  ) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనపై సీఐడీ నమోదు చేసిన కేసును  క్వాష్ చేయాలనిఆయన  దాఖలు చేసుకున్న పిటిషన్‌ ను హైకోర్టు   తిరస్కరించింది.  ఈ పిటిషన్ విచారణ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది నాగేశ్వరరావు వాదించగా, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్  దమ్మాలపాటి శ్రీనివాస్  వాదించారు.  మోహిత్ రెడ్డి ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం విజయవాడ   కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. ఒకవైపు దిగువ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే, మరోవైపు హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ దాఖలు చేసి  ః చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు కోరడం సరికాదని దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు ఏజీ  వాదనలతో ఏకీభవించిన హైకోర్టు కింది  కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉండగా, హైకోర్టులో క్వాష్ పిటిషన్‌లో మధ్యంతర ఉత్తర్వులు కోరడంపై  అభ్యంతరం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్‌కు సంబంధించిన వాదనలను విజయవాడ   కోర్టులోనే వినిపించి, అక్కడే తగిన ఆదేశాలు పొందాలని మోహిత్ రెడ్డికి సూచించింది.   ఈ కేసుపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సిట్ ను ఆదేశిస్తూ, తదుపరి విచారణను వాయిదా వేసింది.  ఏపీ మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి మోహత్ రెడ్డిని ఏ39గా సిట్ పేర్కొన్న సంగతి తెలిసిందే.   ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవల మోహిత్ రెడ్డికి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. అయితే మోహిత్ రెడ్డి  . విచారణకు గైర్హాజరై యాంటిసిపేటరీ బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఇలా ఉండగా ఏపీ మద్యం కుంభకోణం కేసులో దూకుడు పెంచిన సిట్.. విచారణకు సహకరించకుండా వ్యవహరిస్తున్న నిందితులకునార్కోటెస్ట్ చేయించాలని భావిస్తున్నారు. ఈ కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీలుగా ఉన్న రాజ్ కసిరెడ్డి, ధనుంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గోవిందప్పకు నార్కో టెస్ట్‌లు నిర్వహించే విషయమై ఉన్నతాధికారులతో చర్చించి వారి సూచనల మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. కోర్టు అనుమతి ఇస్తే లిక్కర్ స్కామ్ నిందితులు నార్కో పరీక్షలు నిర్వహించి నిజాలను రాబట్టాలని సిట్ భావిస్తోంది.
    వినాయకుడి  పెళ్ళికి అన్నీ విఘ్నాలే అన్నట్లు సంవత్సర కాలం పైగా ఇదిగో అదిగో అంటూ వాయిదా పడుతూ వస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. విశ్వసనీయ సమాచారం మేరకు, మరో రెండు రోజులో,జూన్ 30 న నామినేషన్లు,జూలై 1 న నూతన అధ్యక్షుని ఎన్నికకు బీజేపీ అధిష్టానం ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నిజానికి,వచ్చే నెల (జులై) 21 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందుగానే,బీజేపీ జాతీయ అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని, నిర్ణయించిన నేపధ్యంలో,ఈలోగా రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఇందులో భాగంగా, ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటుగా, రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక జరగని మిగిలిన అన్ని రాష్ట్రాలలో జులై 15లోగా రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాలని అధిష్టానం నిర్ణయానికి వచ్చింది.ఇదే విషయాన్ని, బీజీపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడుకే. లక్ష్మణ్ ఇటీవల ఢిల్లీలో ప్రకటించారు. అప్పటినుంచే, ఆసవహుల పరుగులు మొదలయ్యాయి.  అదలా ఉంటే, బీజేపే నూతన అధ్యక్షుని ఎన్నిక విషయంలో, పార్టీ అధిష్టానం ఆచి తూచి అడుగులు వేస్తోందని, పార్టీ వర్గాల అంతర్గత సమాచారంగా తెలుస్తోంది. ముందున్న స్థానిక  సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నికలకు, ప్రాధాన్యత ఇస్తూనే 2028 అసెంబ్లీ ఎన్నికల విజయం, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అంతిమ లక్ష్యంగా దీర్ఘకాల లక్ష్యంతో, అధ్యక్షుని ఎంపిక ఉంటుందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పుడుఎన్నికయ్యే అధ్యక్షుని నాయకత్వంలోనే 2028 ఎన్నికలకు వెళ్ళవలసి ఉంటుందన్న  అంచనాతో తాత్కాలిక వ్యూహంతో కాకుండా దీర్ఘకాలిక వ్యూహంతో నూతన అధ్యక్షుని ఎన్నిక ఉంటుందని భావిస్తున్నట్లు పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు, ‘తెలుగు వన్’ చెప్పారు. అయితే,అది ఎవరనే విషయంలో మాత్రం ఇంతవరకు అధిష్టానం నోటినుంచి సంకేతం రాలేదని అంటున్నారు. అయితే, ప్రస్తుతానికి వినిపిస్తున్న నలుగురు ఎంపీల పేర్లలో. మల్కాజిరి ఎంపీ, ఈటల రాజేందర్ పేరు ముందు వరసలో ఉన్నట్లు తెలుస్తోంది.నిజానికి,ఈటల పేరు, ఎప్పుడోనే ఖరారైందని, అనుకోని సంఘటనలు, అనూహ్య పరిణామాల కారణంగా, ప్రకటన వాయిదా పడిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, ఇటీవల తెర పైకి వచ్చిన, కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణకు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ మంత్రిగా హాజరైన సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, చెప్పిన విషయాలు, కొంత వివాదస్పద మయ్యాయి.ఈ కారణంగా, ఆయన అధ్యక్షుని రేస్’లో వెనక పడ్డారని, నిజామాబాదు ఎంపీ ధర్మపురి ఎంపీ ముందుకు వచ్చారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఇప్పటికీ ఈటలే రేసులో ముందున్నారని, పార్టీ అంతర్గత సమాచారంగా తెలుస్తోంది.  అయితే,ఈటలతో పాటుగా, పార్టీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీలు రఘనందన్‌రావు, డీకే.అరుణ కూడా రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, పాత కొత్త లెక్కల్లో భాగంగా, ముందు నుంచి రేసులో ఉన్న మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు, మాజీ ఎమ్మల్యే చింతల రామచంద్రా రెడ్డి,తో పాటుగా, కల్వకుర్తి నియోజకవరం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన, పార్టీ సీనియర్ నాయకుడు తల్లోజు ఆచారి పేరు కూడా పార్టీ సర్కిల్స్’లో వినిపిస్తోంది. అయితే, అంతిమంగా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది, అనేది అధికారిక ప్రకటన తర్వాత కానీ, తెలిసే అవకాశం లేదని అంటున్నారు. అయితే, రేపు (జులై29) కేంద్ర మంత్రి అమిత్‌షా రాష్ట్రానికి వస్తున్న నేపధ్యంలో, రానున్న 24 గంటల్లో మరికొంత క్లారిటీ రావచ్చని పార్టీ వారలు భావిస్తున్నాయి.
  ప్రతిపక్ష నాయకురాలిగా ప్రజల గొంతుకై ప్రశ్నించింది, తనను నమ్ముకున్న ప్రజల సంతోషాల్లో కష్టాల్లో భాగస్వామ్యం అయింది, ప్రజల పట్ల తనకున్న అభిమానం విలక్షణమైన తన సేవ గుణం దేశంలోనే ఒక గొప్ప నాయకురాలుగా పేరు సంపాదించుకుంది. కానీ అధికార పార్టీ మంత్రిగా ఉన్న తనకి తన పార్టీ నాయకుల వ్యవహార శైలితో రోజురోజుకీ ప్రజల్లో పట్టుకోల్పోతుందా అనిపిస్తుంది ఇంతకీ ఎవరు ఆ నాయకురాలు ఏంటా కథా.. సీతక్క ఓ నమ్మకం, కష్టాలో ఆమె ఓ సహాయం, ఆపదలో ఉన్న వారికి ఆమె భరోసా, ప్రజా నాయకురాలిగా అలుపెరుగని పోరాటం, ప్రజాసేవలో అలసిపోని మానవత్వం కలిగిన అరుదైన వ్యక్తిత్వం సితక్క, ఆలాంటి నాయకురాలు కోటికొక్కరుంటారు..కానీ అధికార పార్టీ మంత్రిగా ఉన్న తనకి ఒకప్పుడు  జేజేలు పలికినవారు నేడు ఆమెకి దూరం అవుతున్నారు. ఒకప్పుడు ఎంత బిజీగా ఉన్నా, ప్రజల కష్టాలలో ఓదార్చి వారి తరుపున మాట్లాడి వ్యక్తి, నేడు రాష్ట్ర మంత్రిగా, మరో జిల్లా ఇంచార్జ్ మంత్రిగా  బిజీ గా ఉండటంతో నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేస్తుందని ప్రజలు వాపోతున్నారు. ఎందుకు సీతక్క లాంటి నాయకురాలు ప్రజల నుండి దూరం అవుతున్నారు, ప్రజలు సీతక్క గురించి ఏమను కుంటున్నారో తన దృష్టికి వెళ్తుందా లేదా ములుగు జిల్లా నాయకులు మంత్రి సీతక్క ను మై మరిపిస్తున్నారా..? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీతక్క మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ములుగు లోని ప్రజలు ఎంతో సంతోషించారు ప్రజల భవిష్యత్తు బాగుంటుందని ఎన్నో కలలు కన్నారు.. కానీ వారు కన్న కలలు కలలుగానే మిగిలిపోతున్నాయి..సితక్క లాంటి డైనమిక్ లీడర్ తన నియోజకవర్గంలో జరుగుతున్న అధికార పార్టీ నాయకుల ఆగడాలు తనకు తెలిసి జరుగుతున్నాయా తెలియక జరుగుతున్నాయా అయోమయంలో నియోజకవర్గ ప్రజలు.  గల్లీ లీడర్ నుంచి జిల్లా లీడర్ వరకు సెటిల్మెంట్ల దందా, ఇసుక దందా లో అధికార పార్టీ నాయకుల చేతివాటం పై అనేక ఆరోపణలు, అర్హులకు అందాల్సిన ప్రభుత్వ పథకాలు అధికార పార్టీ నాయకుల అక్రమ దందాకు అసలైన లబ్ధిదారులు లబోదిబో మంటున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలు ఎవరైనా నిలదీస్తే వారిని టార్గెట్ చేసి కేసులు పెడుతూ దాడులు చేస్తామని బెదిరిస్తున్న అధికార పార్టీ నాయకులు. దీంతో ఒకప్పుడు జేజేలు కొట్టిన వారే ఇప్పుడు అసహ్యించుకుంటున్నారు.ములుగునియోజకవర్గ అధికార పార్టీ నాయకుల వ్యవహార శైలి తో  సీతక్క గెలుపు కోసం ఏమీ ఆశించకుండా పనిచేసిన ఎందరో అభిమానుల మనసులో వున్న అభిమానం తొలగిపోతుంది.  ఒక మండలంలోని గ్రామ అధ్యక్షుడు ఇందిరమ్మ ఇళ్లలో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నాడని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన మంత్రి సీతక్క మండల నాయకుల నుండి జిల్లా నాయకులు వరకు చేస్తున్న అక్రమాలపై చర్యలు తీసుకోవడం లేదు సరికదా వారి ఆగడాలకు అడ్డు కట్ట వేయక పోవటంతో రెచ్చిపోతూ వి డోంట్ కేర్ ఎనీ వన్ అన్ని విర్ర విగుతున్నారు. అధికారమనేది ఎవరికి శాశ్వతం కాదు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని మంచి సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు చేసే అభివృద్ధి పనులు స్థిర స్థాయిగా ప్రజల మనసులో నిలిచిపోవాలి. ఆ విధంగా ప్రజల మన్ననలు పొందాలి.  అధికారం ఉందనే పొగరుతో పోలీసుల సహాయంతో కోర్టు గొడవలు,భూ పంచాయతీలు, బలవంతపు సెటిల్మెంట్, అవినీతి అక్రమాలు, పేకాట దందాలు, ఇసుక దందా, కాంట్రాక్టర్ల దందా లకు కేరాఫ్ అడ్రస్ గా ములుగు కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహార శైలి ఉంది అని ప్రజలు గుసగుస లాడుతున్నారు. ఓ సీనియర్ నాయకుడు జిల్లాలో భారీగా పేకాట శిబిరాలు నిర్వహిస్తూ పలుమార్లు పేకాట ఆడుతూ పోలీసులకు దొరికిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ప్రాణం పోయినా పేకాట ఆపను అని బహిరంగనే చెప్తున్నా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో ఎలాంటి హోదా లేకపోయినా హడావుడి చేస్తున్న ఎందుకు సీతక్క అతనిపై చర్యలు తీసుకోవటం లేదు. నైతిక విలువలకు మారుపేరుగా ఉన్న సీతక్క అధికార మత్తులో విలువలు విశ్వసనీయతను పక్కకు పెట్టేసిందా అని ప్రజలు గుసగుసలాడుతున్నారు.. సీతక్క అంటే ఒక అంకితభావం,క్రమశిక్షణ, పట్టుదల కలిగిన గొప్ప నాయకురాలు తన జీవితం లో ఎన్నో కష్టాలు ఎదుర్కొని, తన 20 సంవత్సరాల పైగా  రాజకీయ జీవితంలో ప్రజా సేవ లలో తనకంటూ ప్రజల్లో గొప్ప అభిమానం సంపాదించుకున్న నాయకురాలు సీతక్క..ఇప్పటికైనా సీతక్క తన వ్యక్తిత్వానికి మచ్చ తీసుకువస్తున్న వారిని కంట్రోల్ చేయాల్సిన అవసర ఎంతైనా ఉంది. అధికార పార్టీ నాయకులను అధికార అహంకారం నుంచి ప్రజాసేవ వైపు మళ్లించాలి ప్రజలు కోరుతున్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పేకాట,సెటిల్మెంట్లు, అక్రమ దందాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకొనీ అధికార పార్టీ మంత్రిగా తనని నమ్ముకున్న ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ప్రజలు ఆశిస్తున్నారు.
  భారత  గూఢచార సంస్థ రిసెర్చ్‌ అండ్‌ ఎనాలసిస్‌ వింగ్‌ చీఫ్‌గా పంజాబ్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి పరాగ్‌ జైన్‌‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత చీఫ్ రవి సిన్హా పదవీకాలం జూన్ 30తో ముగియనున్న నేపథ్యంలో ఈ నియామకం జరిగింది. జూలై 1 నుంచి పరాగ్ జైన్ రెండేళ్ల పాటు ఈ కీలక బాధ్యతలను నిర్వర్తిస్తారు. రెండేళ్లపాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు.పరాగ్‌ జైన్‌.. 1989 బ్యాచ్‌ పంజాబ్‌ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ప్రస్తుతం ఏవియేషన్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో హెడ్‌గా పనిచేస్తున్న ఆయన్ని.. రవి సిన్హా స్థానంలో రా చీఫ్‌గా మోదీ ప్రభుత్వం నియమించింది.  పాకిస్థాన్‌పై ఇటీవలే భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ లో పరాగ్‌ జైన్‌ కీలక పాత్ర పోషించారు. ఇంటెలిజెన్స్‌ విభాగానికి సంబంధించిన కీలక సమాచారాన్ని అందించడంలో కృషి చేశారు. అదేవిధంగా జమ్ము కశ్మీర్‌లోని ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్‌లో సైతం పరాగ్‌ తన వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించారు.వీటితో పాటు, జమ్మూ కాశ్మీర్‌లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం కూడా పరాగ్ జైన్‌ను ఈ పదవికి ఎంపిక చేయడంలో దోహదపడింది. గతంలో ఆయన కెనడా, శ్రీలంక వంటి దేశాల్లోనూ భారత ప్రతినిధిగా దౌత్యపరమైన సేవలు అందించారు
ALSO ON TELUGUONE N E W S
మంచు విష్ణు(Manchu Vishnu)ప్రస్తుతం 'కన్నప్ప'(Kannappa)గా థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. తిన్నడు అనే ఒక ఆటవిక మనిషి శ్రీ కాళ హస్తీశ్వరుడి పరమ భక్తుడైన 'కన్నప్ప' గా ఎలా మారాడనే కధాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. కన్నప్ప క్యారక్టర్ లో  విష్ణు ప్రదర్శించిన నటనకి ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఎంతగానో తన్మయత్వం చెందుతున్నాడు.  ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma)కన్నప్ప చిత్రంపై తన అభిప్రాయాన్ని విష్ణుకి వాట్స్ అప్ రూపంలో పంపించాడు. సదరు వాట్స్ అప్ లో ' తిన్నడుగా నువ్వు కేవలం  నటించలేదు. ఆలయమంతా భక్తి, విశ్వాసం మూర్తిభివించిన వ్యక్తిలా కనిపించావు. కొన్ని సన్నివేశాల్లో నీ నటన నన్ను ఊపిరి తీసుకోనివ్వలేదు. క్లైమాక్స్ లో శివలింగం నుంచి రక్తం కారుతుంటే నీ రెండు కళ్ళని సమర్పించే సమయంలో నీ నటన పతాక స్థాయిలో ఉంది. ఆ సమయంలో నువ్వు పలికించిన హావభావాలు, భావోద్వేగ సన్నివేశాలకి చేతులెత్తి నమస్కరించాలి. అందరు ప్రభాస్ కోసం మూవీకి వెళ్తున్నామని అంటున్నారు. కానీ నిన్ను చూడటానికే టికెట్ కొని మరి  థియేటర్ కి వెళ్తున్నాను. నాకు మొదటి నుంచి దేవుడు,భక్తి అంటే నమ్మకం లేదు. అందుకే మొదటి నుంచి నేను అలాంటి సినిమాలు చూడలేదు. కానీ నా కాలేజీ రోజుల్లో భక్త కన్నప్ప ని నటి నటులు  సాంగ్స్ కోసం నాలుగు సార్లు చూసాననే సందేశాన్ని పంపాడు. ఈ వాట్స్ అప్ తాలూకు స్క్రీన్ షాట్ ని విష్ణు సామిజిక మాధ్యమాల ద్వారా షేర్ చేసాడు.  ఇక కన్నప్ప మొదటి రోజు ఇరవై కోట్ల రూపాయలని కలెక్ట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రభాస్(Prabhas)అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్, ప్రీతీ ముకుందన్ కీలక పాత్రలు పోషించగా ముకేశ్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh)దర్శకత్వం వహించాడు.     
నితిన్(Nithiin)హీరోగా తెరకెక్కిన 'తమ్ముడు'(Thammudu)మూవీ జులై 4 న విడుదల కానుంది. దిల్ రాజు(Dil Raju)నిర్మాణ సారధ్యంలో, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో వకీల్ సాబ్ ని తెరకెక్కించిన 'వేణు శ్రీరామ్'(venu Sriram)దర్శకుడు. దీంతో 'తమ్ముడి' పై అందరిలోను భారీ అంచనాలు ఉన్నాయి. ప్రచార చిత్రాలు కూడా బాగుండటంతో సినిమా ఫలితంపై అందరు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే 2020 లో వచ్చిన భీష్మ లాంటి హిట్ మూవీ తర్వాత నితిన్ కి సరైన హిట్ లేదు. రీసెంట్ గా నితిన్ ఒక ఇంటర్వ్యూలో  తమ్ముడు చిత్రం గురించి మాట్లాడుతు ఈ చిత్రానికి తమ్ముడు అనే టైటిల్ ఫిక్స్ అయినప్పుడు నేను వద్దని అన్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో ఇప్పటికే  నా సినిమాలల్లో ఎన్నో చేస్తున్నాననే విమర్శలు ఉన్నాయి, ఈ కారణంతోనే 'తమ్ముడు' టైటిల్ వద్దని అన్నాను. కానీ సబ్జెట్ కి తమ్ముడు టైటిల్  పర్ఫెక్ట్  గా సూటవుతుందని  వేణుశ్రీరామ్,దిల్ రాజు  చెప్పడంతో అంగీకరించానని చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ కి నితిన్ వీరాభిమాని అనే తెలిసిన విషయమే. తను ఇప్పటి వరకు చేసిన చాలా సినిమాల ద్వారా  ఈ విషయం స్పష్టమవుతుంది. ఇక పవన్ కళ్యాణ్  హిట్ లిస్ట్ లో ఉన్న మూవీస్ లో 'తమ్ముడు' కూడా ఒకటి. 1999 లో వచ్చిన ఈ మూవీ కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కి మంచి విజయాన్ని అందుకుంది.  
2000వ దశకం ప్రారంభంలో వీడియో ఆల్బమ్స్‌కి విపరీతమైన ఆదరణ ఉండేది. ఆ సమయంలో షాన్‌, అద్నాన్‌ సామి, సునీతారావు వంటివారు తమ వీడియోస్‌ ద్వారా టీవీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నారు. 2002లో షెఫాలి జరీవాలా నటించిన డిజె డాల్‌ ఆల్బమ్‌లోని ‘కాంటాలగా’ వీడియో సాంగ్‌ దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. వివిధ ఛానల్స్‌లో ఈ పాటను పదే పదే ప్రసారం చేసేవారు. ఆ ఒక్క పాటతో ఎంతో ఫేమస్‌ అయిపోయారు షెఫాలి. ఈ వీడియో విడుదలై 20 సంవత్సరాలు దాటిపోయినా ఇప్పటికీ ఈ పాటను వీక్షిస్తూనే ఉంటారు. అంతటి పాపులర్‌ నటి హఠాన్మరణం అందర్నీ బాధిస్తోంది. జూన్‌ 27 రాత్రి గుండెపోటుతో షెఫాలి మృతి చెందింది. అయితే పోలీసులు మాత్రం దీన్ని అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు.  ప్రస్తుతం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడానికి కారణం.. షెఫాలి మరణించిన వెంటనే ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించకపోవడం, చాలా ఆలస్యంగా స్పందించడం పోలీసుల్లో అనుమానాన్ని రేకెత్తిస్తోంది. జూన్‌ 28న షెఫాలి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. దీనికి సంబంధించిన నివేదిక ఇంకా రావాల్సి ఉంది. షెఫాలి మరణించడానికి 5 గంటల ముందు ఆమె భర్త పరాగ్‌ త్యాగి సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టాడు. ఆ పోస్ట్‌లో తను జిమ్‌లో ఉన్నట్టుగా మిర్రర్‌ సెల్ఫీని పోస్ట్‌ చేశాడు. షెఫాలి మరణం వెనుక కారణాలు ఏమిటి అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. షెఫాలి పాపులర్‌ నటి. ఆమె మరణాన్ని కుటుంబ సభ్యులుగానీ, ఆమె ప్రతినిధులుగానీ అధికారికంగా ప్రకటించకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆమె మరణం వెనుక ఏదైనా మిస్టరీ దాగి ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.  బిసిఎ పూర్తి చేసిన షెఫాలి 2002లో వచ్చిన ‘డిజె డాల్‌’ అనే ఆల్బమ్‌లోని ‘కాంటాలగా’ వీడియో సాంగ్‌లో తన పెర్‌ఫార్మెన్స్‌తో, అందచందాలతో యూత్‌కి పిచ్చెక్కించింది. 2004లో మీత్‌ బ్రదర్స్‌లోని హర్‌మీత్‌ సింగ్‌ను వివాహం చేసుకున్నారు షెఫాలి. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2009లో విడిపోయారు. ఆ తర్వాత 2015లో నటుడు పరాగ్‌ త్యాగిని వివాహం చేసుకున్నారు. వీడియో ఆల్బమ్స్‌లోనే కాకుండా హిందీ సినిమాల్లో, వెబ్‌ సిరీస్‌లలో నటించారు. కొన్ని టీవీ షోలలో కూడా కనిపించారు. 2018లో బిగ్‌బాస్‌ 13లో కూడా షెఫాలి పార్టిసిపేట్‌ చేశారు. 
Kaanta Laga girl and Bigg Boss fame Shefali Jariwala died due to cardiac arrest at the age of 42. Her family members have stated that she always took care of her health, ate only healthy food, decreased partying and even got health check-ups regularly with emphasis on Yoga. Still, she faced a sudden death due to cardiac arrest.  Her husband Parag Tyagi is unconsolable. She previously got married to MEET Brothers fame singer, Harmeet and pressed charges against him for domestic violence. She had epileptic seizures when she was 15 and then took stress, anxiety reliving exercise regime with Yoga as the basis.  Some sources stated that she could have passed away due to anti-ageing treatment she had been taking from past 5-6 years. But doctors are dismissing these rumors stating that such mild cosmetic drugs do not effect heart. But the model - actress death has risen concerns about cardiac health all over.  Whatever could be the reason, the actress died at a young age just like Puneeth Rajkumar, who also maintained his fitness and always prioritised it. Well, many deaths of relatively people due to COVID vaccines is also raising concerns everywhere. Let's hope health situation of Indian youth doesn't deteriorate further.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
Cast: Kajol, Ronit Roy, Indraneil Sengupta, Kherin Sharma, Jitin Gulati, Gopal Singh, Surjyasikha Das, Dibyendu Bhattacharya, Aashit Chatterjee Crew:  Part of Shaitaan Horror Universe  Written by Saiwyn Quadras, Aamil Keeyan Khan, Ajit Jagtap  Music by Harsh Upadhyay, Shiv Malhotra, Rocky Khanna Edited by Sandeep Francis Cinematography by Pushkar Singh Directed by Vishal Furia Produced by Ajay Devgn, Jyoti Deshpande, Kumar Mangat Pathak Kajol is one of the most beloved actresses of Indian Cinema. Her husband Ajay Devgn has decided to start an horror universe after Shaitaan success. As Shaitaan 2 is in plans, he launched Kajol's MAA as part of it. The movie released worldwide on 27th June and Let's discuss about it in detail.  Plot:  Shubankar (Indraneil Sengupta) shifts to Kolkata far away from his ancestral village, Chandrapur, West Bengal. He shifted his life away from his village due to a supersition and a long time belief that a demon, whose lineage belongs to Rakhtabeez. And this demon demands a human sacrifice from families belonging to a certain lineage. Shubankar's wife Ambika (Kajol) is not aware of this issue.  Shubankar's father dies in the village and he needs to visit his ancestral home. He vists along with his wife and daughter Shwetha (Kerin Sharma) to the village. Shwetha is chosen for sacrifice to the demon as Ambika gets increasingly paranoid with this development, she has to fight this demon like Durga to end his terror. Can she do so? How will this be connected to Shaitaan Universe? Watch the movie to know more.  Analysis:  Shaitaan worked big time because of Madhavan's spell binding performance and Janki Bodiwala. Now, MAA has performers like Kajol and Ronit Roy. While they did their best, the writing for the film did not really create the similar exhillarating experience for viewers in theatres. While the movie did try to connect with mythological stories of Goddess Durga. But the connections did not really land organically.  While the VFX portions of Rakthabeej's history and lineage work with AI's assistance, they do look flat and not so interesting. Ajay Devgn's action sequence for the film is exciting but it does not really change the overall impact. MAA fails to really create a great platform for all the connections to work big time. On the other hand, even Shaitaan connection did not really work for the film, too.  Vishal Furia tried hard to find a screenplay to showcase his old ideas in this movie, too. The writing needed to take the characters more seriously and the sequences needed to have more engaging quality. The dragged narrative and unimaginative horror portions make it another ambitious project that doesn't really material as anticipated.  Bottomline:  MAA tries hard but looses the way after initial moments.  Rating: 1.5/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold any liability to them. Viewers' discretion is advised. 
తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ టాపింగ్ జరిగిందనే వార్తలని, మహా న్యూస్ ఛానల్ కొన్ని రోజుల నుంచి ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు కూడా ఫోన్ టాపింగ్ కథనాల గురించి  సదరు న్యూస్ ఛానల్ ప్రసారం చేస్తు ఉంది. దీంతో కొంత మంది బిఆర్ఎస్ కార్యకర్తలు జూబ్లీహిల్స్ లోని మహా న్యూస్ ఛానల్ పై దాడి చేసి, కొన్ని రకాల కారుల అద్దాలని పగలకొట్టడంతో పాటు ఆఫీస్ లోపలకి చొరబడ్డారు. ఈ దాడిని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఖండిస్తూ' మీడియాలో వచ్చే వార్తలు, కథనాలపై అభ్యంతరాలు ఉంటే, తెలియచేసే విధానం ఒకటి ఉంటుంది. ఆ దారిలో వెళ్లకుండా అందుకు భిన్నంగా దాడులు చేయడం కరెక్ట్ కాదు. ఈ దాడిని ప్రజాస్వామ్య వాదులు ఖండించాలి. దాడికి కారణమైన వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ గవర్నమెంట్ కి పవన్ కళ్యాణ్ కి  విజ్ఞప్తి చేసాడు.    
జానీ మాస్టర్(Jani Master)వద్ద ఎన్నో సినిమాలకి డాన్స్ అసిస్టెంట్ గా పని చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రష్టి వర్మ(Shrasti verma). ఒక మూవీలో హీరోయిన్ గా కూడా చేసి సత్తా చాటిన శ్రష్టి  ప్రస్తుతం పలు రకాల చిత్రాలకి సొంతంగా డాన్స్ కంపోజ్ చేస్తుంది. అల్లు అర్జున్(Allu Arjun)రీసెంట్ హిట్ పుష్ప పార్ట్ 2 లోని 'సుసేకి'  సాంగ్ కి కొరియోగ్రఫీ ని అందించిన గణేష్ ఆచార్య మాస్టర్ కి అసిస్టెంట్ గా చేసింది. రీసెంట్ గా శ్రష్టి ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేస్తు 'నాగబంధం' మూవీ నుంచి అందమైన భక్తి గీతాన్నిపూర్తి చేశాం. ప్రతి పదం భక్తితో రూపొందించబడింది. ఈ పాట సంగీతం కంటే ఎక్కువ, ఇది ప్రార్థనలా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. గణేష్ ఆచార్య  మాస్టర్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు. మాస్టర్ మీ  నుంచి నేను చాలా నేర్చుకున్నాను. మీ మార్గదర్శకత్వం, ఓర్పు నాపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి. అది మీ ప్రత్యేకమైన బోధనా విధానం అయినా లేదా మీరు పంచుకున్న జ్ఞానం అయినా నాతో ఎప్పుడు ఉంటాయి. మీరు నేర్చించిన పాఠాలెన్నో నాలో విశ్వాసం, క్రమ శిక్షణని పెంచాయంటూ శ్రష్టి వర్మ పోస్ట్ చేసింది. గణేష్ ఆచార్య సుదీర్ఘ కాలంగా భారతీయ చిత్ర పరిశ్రమలో అనేక హిట్ సాంగ్ కి కొరియో గ్రఫీ ని అందిస్తు వస్తున్నాడు. ఈ క్రమంలోనే నాగ బంధం మూవీకి సంబంధించి గణేష్ మాస్టర్ ‌తో శ్రష్టి వర్మ అసోసియేట్ అయినట్టుగా తెలుస్తోంది.  డెవిల్ మూవీ ఫేమ్ 'అభిషేక్ నామ'  స్వీయ దర్శకత్వంలో నాగబంధం'(Nagabandham)తెరకెక్కుతుంది. పురాతన విష్ణు దేవాలయాల రహస్యాలను మరియు ఆ దేవాలయాలలో ఉండే నాగబంధం యొక్క ఆచారాల గురించి ఈ చిత్రం చెప్పబోతోంది. పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుండగా విరాట్ కర్ణ ,నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతి బాబు, జయప్రకాశ్, మురళిశర్మ , బిఎస్ అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.         
Kannappa starring Manchu Vishnu, Prabhas, Mohan Babu, Mohanlal, Preity Mukundhan, Sarath Kumar, Kajal Aggarwal and Akshay Kumar took a grand opening all over. Thanks to Prabhas cameo, his fans have gone to the theatres to watch their ideal on big screens in Telugu States.  The movie did not receive such big collections from other languages but producer Manchu Vishnu has announced that the movie secured a wide release with huge number of screens, everywhere. The makers are stating that the movie took a grand collection of Rs.20 crores on opening day, worldwide.  Trade experts are surprised with these numbers but are stating that being a devotional film, Prabhas star power, Mohanlal star craze have helped the film. Also, Vishnu is able to create a huge promotional campaign surrounding the film prior to the release.  While the reviews have been generally positive, we have to wait and see how the movie will perform on Monday, that too, from all other languages along with Telugu. The real litmus test for the film is ahead post this opening weekend.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
స్టార్ హీరోయిన్ రష్మిక   'మైసా' అనే కొత్త మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు నిన్న టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు ఒక  పోస్టర్  ని రిలీజ్ చేసారు.సదరు పోస్టర్ లో రష్మిక చాలా ఆవేశంతో ఉండటంతో పాటు కత్తిని పట్టుకొని ఉంది. ఫేస్ నిండా రక్తపు మరకలు ఉన్నాయి. ఈ ఒక్క పోస్టర్ తో సినిమాపై పాన్ ఇండియా రేంజ్ లో అందరిలో అంచనాలు పెంచేసింది. ఈ చిత్రం ద్వారా రవీంద్ర అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నాడు. అన్ ఫార్ములా ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మిస్తుంది.  స్టార్ హీరో  విజయ్ దేవరకొండ తన ఇనిస్టాగ్రమ్ లో 'మైసా' పోస్టర్ ని షేర్ చేస్తు 'ఇది అద్భుతంగా ఉండనుంది' అనే  క్యాప్షన్ ని చేసాడు. ఈ క్యాప్షన్ కి రష్మిక రిప్లై ఇస్తు 'విజ్జు  ఈ సినిమాతో నిన్ను గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నాను' అంటూ హార్ట్ ఎమోజి ని జోడించింది. విజయ్, రష్మిక  రిలేషన్ లో ఉన్నారనే వార్తలు చాలా కాలం నుంచి వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్ ని సోషల్ మీడియా వేదికగా విజ్జు అని రష్మిక  పిలవడంతో మరోసారి ఈ జంట హాట్ టాపిక్ గా మారింది. ఇక విజయ్,రష్మిక గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాల్లో నటించారు. రష్మిక రీసెంట్ గా కుబేర తో  తన ఖాతాలో మరో విజయాన్ని చేర్చుకుంది. విజయ్ ప్రస్తుతం 'కింగ్ డమ్' అనే మూవీతో బిజీ గా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.    
మంచు విష్ణు(Manchu Vishnu)నటించిన మైథలాజికల్ మూవీ 'కన్నప్ప'(Kannappa). నిన్న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన 'కన్నప్ప' ఉదయం 7 గంటల ఆట నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. విష్ణు కెరీర్ లోనే ఒక మరుపురాని మూవీగా నిలిచిపోవడం ఖాయమనే మాటలు కూడా వినపడుతున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో విష్ణు నటన ఎంతో అద్భుతంగా ఉందనే అభిప్రాయాన్ని సినీ విమర్శకులు సైతం వ్యక్తం చేస్తున్నారు.   ఇక ఈ మూవీ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఇరవై కోట్ల రూపాయిల గ్రాస్ కలెక్ట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి . మంచు విష్ణు కెరీర్ లోనే ఇది హయ్యస్ట్ కలెక్షన్స్ అని చెప్పవచ్చు. మూవీకి పాజిటివ్ టాక్ ఉన్న దృష్ట్యా రాబోయే రోజుల్లో భారీ కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది. పాన్ ఇండియా వ్యాప్తంగా ఉన్న అన్ని భాషల్లోను మార్నింగ్  షో కి ఒక మాదిరిగా బుకింగ్స్ స్టార్ట్ అయ్యి, ఫస్ట్ షో, సెకండ్ షోస్ కి హయ్యస్ట్ బుకింగ్స్ ని కన్నప్ప సాధించింది. 'రుద్ర' అనే క్యారక్టర్ లో చేసిన ప్రభాస్(Prabhas)తో పాటు, శివుడుగా చేసిన  అక్షయ్ కుమార్(Akshay Kaumar)కన్నప్ప తండ్రి శరత్ కుమార్(Sarath Kumar)కిరాత  గా చేసిన  మోహన్ లాల్(Mohanlal)కన్నప్ప భార్య ప్రీతీ ముకుందన్' ఇలా అందరు తమ పాత్ర పరిధి మేరకు నటించి సినిమా విజయంలో భాగస్వామ్యమయ్యారు. మహాభారతం ఫేమ్ ముకేశ్ కుమార్ సింగ్(MukeshkuMar singh) దర్శకత్వంలో  అవా ఎంటర్ టైన్ మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పై మోహన్ బాబు, విష్ణు సుమారు 200 కోట్ల రూపాయలతో నిర్మించారు.   
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఈకాలంలో పుట్టిన పిల్లలకు కాస్త నడవడం రాగానే పేరెంట్స్ అందరూ చేసేపని ఓ చిన్న సైకిల్ తెచ్చి ఇవ్వడం. ఆ సైకిల్ తో పిల్లలు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అయితే కొంచెం పెద్దయ్యాక ఇంకా ముఖ్యంగా స్కూల్ స్థాయి దాటిపోగానే వాళ్ల మనసంతా బైకులు, స్కూటీలు, గాడ్జెట్స్ చుట్టూ ఉంటుంది. కొందరు ఆసక్తి కొద్దీ గేమ్స్ వైపు వెళ్లి ఎన్నోరకాల ఆటల్లో మునిగి తేలిన సైకిల్ ను పక్కకు పెట్టేస్తారు. స్కూల్ దశ అయిపోగానే పక్కకు పెట్టేసే సైకిల్ ఇప్పటి కాలంలో మనుషుల ఆరోగ్యం పాలిట గొప్ప ఆప్షన్ అనేది వైద్యులు, ఫిట్నెస్ ట్రైనర్ ల అభిప్రాయం. అసలింతకూ అలా ఎందుకంటారు.  రెగులర్ ఎక్సర్సైజ్! ఉదయం లేచాక చాలామంది ఇంటి నుండి బయట పడితే తరువాత సాయంత్రం ఇంటికి చేరుతూ ఉంటారు. ఉద్యోగస్తులు అందరూ ఇంతే. అయితే ఉద్యోగం చేసేవాళ్ళు ఆఫీసుల్లో కూర్చునే చేస్తారు. ప్రస్తుతకాల ఉద్యోగాల్లో మానసిక ఒత్తిడి తప్ప శారీరక ఒత్తిడి ఉండదు అనేది వాస్తవం కదా. అయితే ఇంటి దగ్గర ఉండే కొద్దిసమయంలో ఏదైనా చిన్న చిన్న పనులకు బయటకు వెళ్లాలంటే పుటుక్కున బైక్ స్టార్ట్ చేస్తుంటారు అందరూ.  కనీసం కొత్తిమీర కట్టనొ, లేక వెల్లుల్లినో లేదా నిమ్మకాయలో ఇలాంటి చిన్న వాటికి కూడా బైకులు స్టార్ట్ చేస్తే మహానుభావులు ఉంటారు. బయట ఎండలు లేదా అర్జెన్సీ అనే కల్లబొల్లి కబుర్లు చెప్పేవాళ్లకు ఎలాంటి సందేహం లేకుండా సైకిల్ ఒక ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇంజిన్ ఖర్చు లేనే లేదు! బైకు తీస్తే బర్రున శబ్దం చేసుకుంటూ రాకెట్ లో పోవాలంటే అందులో పెట్రోల్ ఉండాలి. పెట్రోల్ లేని బండి మూలన పడి ఉండాల్సిందే. కనీసం దాన్ని తొక్కడానికి  కుదరదు, తోయడానికి మనిషికే కండలు ఉండాలి. పెరిగిపోతున్న పెట్రోల్ ఖర్చులతో మనిషి పాకెట్ కు చిల్లులే. కానీ మన సైకిల్ ఉందండి. కష్టపడి అప్పుడప్పుడు గాలి కొట్టుకుంటే చాలు, టైర్ లలా ఉన్న మనుషులను స్లిమ్ గా చేసేస్తుంది. ఎలాంటి పెట్రోల్ గోల లేకుండా హాయిగా జాగ్రత్తగా వాడుకుంటే జీవితకాలం సేవలు చేస్తుంది.  వేగవంతమైన జీవితంలో అన్ని తొందరగా అయిపోవాలనే ఆలోచనలో చాలామంది ఎంతో ఉపయోగకరమైన వస్తువులను కొన్నింటిని పక్కకు తోసేస్తున్నారు. తీరా ఆరోగ్యాలు నష్టపోతున్న సందర్భాలలో జిమ్ లలో చేరి అక్కడ సేమ్ సైక్లింగ్ వర్కౌట్ చేస్తుంటారు. అలా నెలకు వేలు తగలెయ్యడం కంటే ఒక సైకిల్ పెట్టుకుని కొన్ని పనులకు సైకిల్ ని ఉపయోగించడం మంచిది. బైకులు, స్కూటీల కంటే తక్కువ ఖర్చుతో, పెట్రోల్ గట్రా అదనపు ఖర్చు లేకుండా, రోజూ తగినంత వ్యాయామాన్ని అందించే సైకిల్ కు హైఫై కొడితే పోయేదేముంది?? శరీరంలో అదనపు కొవ్వు తప్ప. అయితే మోకాళ్ళ నొప్పులు సమస్యలు ఉన్నవాళ్లు వైద్యుల సలహా తీసుకోండి మరి. సైకిల్ పెడిల్ తొక్కుతూ కాస్త రౌండ్స్ కొట్టండి మరి.            ◆ వెంకటేష్ పువ్వాడ.
“మనం డబ్బును సంపాదిస్తాం కానీ, డబ్బు మనల్ని సంపాదించడం లేదు కదా?” అని డాంబికంగా పలికేవారున్నారు. అనడానికైతే ఇలా అన్నప్పటికీ వారి జీవితమంతా డబ్బుకు దాస్యం చేస్తూనే వుంటారు. ఆ డబ్బుకై ఎవరినైనా ఆశ్రయిస్తారు. ఎంతైనా వేడుకుంటారు. లేనితనం వల్ల వీరిలా తయారైనారా అంటే అది నిజం కాదు, కేవలం ధనం మీద ఆపేక్షే వీరినిస్థితికి తెచ్చింది. అసలీ జీవితాన్ని ధనార్జనకు కాక మరొకందుకు వినియోగించే వీలుందనే ఆలోచన కలగదు. మతాన్ని ఆశ్రయించామని, దైవారాధనకు అంకితమయామని ప్రకటించే వారిలో కూడా చాలా మందికి ధనమే దైవం వారు తలపెట్టే “మహత్కార్యా” లన్నిటికీ ధనం పోగుచేస్తుంటారు. ఎక్కడో వందలాది ఎకరాల స్థలం కొంటామంటారు. అక్కడ అనేకమందిని చేర్చి ఏదో విశ్వమానవ కల్యాణం సాధిస్తామంటారు. మిగతా రంగాల్లో పనిచేసేవారు కూడా ఇలాంటి "లోక కళ్యాణ” పథకాలే రూపొందిస్తుంటారు. సినిమాలు తీసేవారు, సినిమాహాళ్ళు కట్టించేవారు. హోటళ్ళు నెలకొల్పేవారూ, మార్కెట్లోకి కొత్తపత్రికలు వెలువరించేవారూ, మార్కెట్లోకి కొత్త సబ్బు, విశిష్టమైన సూటింగ్ క్లాత్, చల్లటి కూల్డ్రింకు ప్రవేశ పెట్టేవారూ, అందరూ కూడా ప్రజాక్షేమం కాంక్షించే ఈ పనులు చేస్తున్నామంటారు. కానీ అందరికీ కావలసింది డబ్బే. కానీ డబ్బు అక్కరలేనివారు అరుదుగా ఎక్కడైనా కనిపించవచ్చు. అలాంటివారు కోర్కెల్నీ, సంకల్పాలనూ దాటి వుంటారు. నీమ్ కరోలి బాబా అలాంటి యోగి. ఆయన ఇటు ఇహంలోను, అటు పరంలోనూ ఏక కాలమందు నివసించినట్లు ఉండేవాడని అంటారు స్వామీ రామా. బాబా ఎవరి పరిచయమూ కోరేవాడు కాదు. ఎవరైనా తన దర్శనార్థమై వస్తే, “నేను మిమ్మల్ని చూడడమైనది. మీరు నన్ను చూడడమైనది. ఇక వెళ్ళిరండి" అనేయడం ఆయనకు అలవాటు. నైనిటాల్లో ఒకసారి బాబాతో కూచోనుండగా, భారతదేశంలోని అత్యంత ధనికుల్లో ఒకరైన ఒక వ్యక్తి కరెన్సీ కట్టలతో బాబా వద్దకు వచ్చారని అంటాడు స్వామీ రామా. " ఈ ధనమంతా మీకు సమర్పించడానికి తెచ్చానండీ" అన్నాడు ఆ ధనికుడు.  బాబా ఆ నోట్లకట్టలను కిందపరిచి చక్కగా వాటి మీద ఆసీనుడయ్యాడు. "కూర్చుకునేందుకు అంత మెత్తగా లేవు. వీటికన్నా దిండు నయం. నాకు చలిమంట వేసుకునే అలవాటు లేదు, పోనీ అందుకైనా ఉపయోగిద్దామంటే వీటినేమి చేయను?" అని అడిగాడు బాబా. "అయ్యా ఇది ధనమండీ" అన్నాడు అతడు.  బాబా ఆ మొత్తం తిరిగి ఇచ్చేస్తూ "దీనితో కాసిని పళ్ళు కొనుక్కురండి. అందరం తినచ్చు" అన్నాడు. "ఈ ప్రాంతంలో మార్కెట్ లేదు గదండీ?” అన్నాడు అతడు. "ఐతే మరి ఇది డబ్బెలా అవుతుందయ్యా. పండ్లు కూడా కొనలేని దీనిని నేనేమి చేసుకోను" అని, కాసేపు ఆగి "ఏమి కావాలని నావద్దకొచ్చావు" అన్నారు.  "నాకు విపరీతమైన తలనొప్పి, భరించలేని బాధ" అని చెప్పాడు అతడు "అది నువ్వు సృష్టించుకున్నదే, నేనేమి చేయగలను." అన్నారు బాబా.  "అలా అంటే ఎలా మహాత్మా? మీరు నాకు సాయపడాలి.” అని వేడుకున్నాడు అతను. అప్పుడు బాబా, “పోనీ పాపం” అనుకున్నట్లున్నారు.. “సరే ఇకనుండి నీకు తలనొప్పి ఉండదు పో, కానీ ఇవాళ నుండి నీవు ఇతరులకు పెద్ద తలనొప్పిగా రూపొందుతావు. నీ దగ్గర వెర్రి డబ్బు పోగవుతుంది. తద్వారా నీవు సమాజానికి గొప్ప శిరోవేదన కలిగిస్తావు, ఇక వెళ్ళు" అని పంపించేశాడు నీమ్ కరోలి బాబా. ఆయన చెప్పినట్లే, ఆ ధనికుడు ఆరోగ్యవంతుడై, తన జీవన విధానంతో సంఘానికి గొప్ప “శిరోభారం" గా పరిణమించాడు.                                             ◆నిశ్శబ్ద.
బ్రహ్మ ముహూర్తానికి మించిన ముహూర్తం లేదు. బ్రహ్మ ముహూర్తంలో ఏ పని ప్రారంభించినా శుభమే. సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు... రాత్రి భాగంలో ఆఖరి నలభై ఎనిమిది నిమిషాల ముందు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారం. ఇది ఎంతో విశిష్టమైన సమయం. పూజలు చేయడానికి, వ్రతాలు జపాలు చేయడానికి అనువైన సమయం. అందుకే ఈ ముహూర్తానికి అంత విశిష్టత. అయితే కేవలం ఆధ్యాత్మిక పరంగాగానే కాదు... మన జీవనపరంగా కూడా ఈ ముహూర్తం ఎంతో మేలు చేకూరుస్తుంది. ఏ మంచి పని చేసినా బ్రహ్మ ముహూర్తంలో కనుక మొదలు పెడితే విజయం లభించి తీరుతుంది. పిల్లలను ఉదయమే లేచి చదువుకోమని చెప్పేది అందుకే. ఆ సమయంలో చదివితే చదివింది బాగా ఎక్కడమే కాకుండా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందుకే వైద్యులు, నిపుణులు కూడా ఆ సమయంలోనే చదుకొమ్మని సూచిస్తుంటారు.  ఉదయాన్నే వాకింగ్ కి వెళ్లే సమయం కూడా అదే. లేలేత భానుడి కిరణాల నుంచి విటమిన్ డి లభిస్తుంది. తద్వారా ఎముకలు గట్టిపడతాయి. ఎన్నో రకాల వ్యాధులు నయమవుతాయి. కొన్ని రకాల వ్యాధులు దగ్గరికి రాకుండా ఉంటాయి. అసలు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల మానసిక ఒత్తిడి కూడా ఉండదట. మనసు, మెదడు ప్రశాంతంగా ఉండి ఆరోగ్యం ఇనుమడిస్తుందట.  అందుకే బ్రహ్మ ముహూర్తాన్ని మించిన ముహూర్తం లేదని అంటారు. ఆ ముహూర్తాన్ని చేజార్చుకోకూడదని పెద్దలు సూచిస్తుంటారు. -Sameera  
  డయాబెటిస్ అనేది తీవ్రమైన,  పూర్తిగా నయం చేయలేని వ్యాధి. ఇందులో శరీరం  రక్తంలో చక్కెరను నియంత్రించే సామర్థ్యం తగ్గుతుంది. దీనికి కారణం ఇన్సులిన్ అనే హార్మోన్ లేకపోవడం లేదా దాని  పనితీరు సరిగా లేకపోవడం. భారతదేశంలో 10 కోట్లకు పైగా ప్రజలు డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. డయాబెటిస్‌ను సకాలంలో నియంత్రించకపోతే, అది శరీరానికి అనేక విధాలుగా హాని కలిగిస్తుంది. ఇది కళ్ళు, మూత్రపిండాలు, నరాలు, గుండె,  రక్తపోటు, పాదాల సమస్యలు,  లైంగిక సమస్యలను కలిగిస్తుంది. చాలా మంది డయాబెటిస్‌ను మందులతో కూడా నియంత్రించలేరు.  ఇలాంటి వారు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవలసి ఉంటుంది. కానీ ఇలా ఇన్సులిన్ తీసుకునే వారు సాధారణంగా చేసే 5 ప్రధాన తప్పులు ఉన్నాయి.  ఈ తప్పుల వల్ల ఇన్సులిన్ తీసుకున్నా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గవు. ఇంతకూ ఇన్సులిన్ తీసుకునే వారు  చేసే తప్పులేంటంటే.. అర్థం చేసుకోవడంలో పొరపాటు.. చాలా సార్లు రోగులు డాక్టర్ సలహాను సరిగ్గా అర్థం చేసుకోలేరు.  చాలా ఎక్కువ లేదా చాలా తక్కువ ఇన్సులిన్ తీసుకుంటారు. లేదా తప్పు సమయంలో ఇంజెక్ట్ చేస్తారు. దీనిని నివారించడానికి సులభమైన మార్గం  డాక్టర్ ఇచ్చిన మోతాదు,  సమయాన్ని  పాటించడం. గ్లూకోజ్ మానిటర్‌తో చక్కెరను తనిఖీ చేస్తూ ఉండాలి . స్టోర్ చేయడంలో తప్పులు.. ఇన్సులిన్‌ను తీవ్రమైన వేడిలో లేదా చల్లగా ఉంచినా, లేదా గడువు తేదీ తర్వాత ఉపయోగించినా, దాని ప్రభావం తగ్గుతుంది. దీన్ని చేయడానికి ఉత్తమ మార్గం మూసి ఉన్న సీసాను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం. తెరిచి ఉన్న సీసాను సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద (25°C కంటే తక్కువ) 30 రోజుల వరకు ఉంచవచ్చు. ఇన్సులిన్‌ను ఎప్పుడూ ఫ్రీజ్ చేయకూడదు. లేదా చాలా వేడి ప్రదేశంలో ఉంచకూడదు. ఎక్స్‌పైరీ డేట్.. ఇన్సులిన్ కొనుగోలు చేసేటప్పుడు దాని గడువు తేదీని తనిఖీ చేయడం ముఖ్యం. చాలా సార్లు  దాని తేదీని తనిఖీ చేయకుండా ఇన్సులిన్ కొని దాన్ని ఉపయోగిస్తారు. గడువు తేదీని తనిఖీ చేసిన తర్వాత మాత్రమే ఇన్సులిన్ కొనాలి. ఇన్సులిన్ తెరిచిన 30 రోజుల్లోపు దాన్ని ఉపయోగించండి. సిరంజి రకం.. తప్పుడు రకం సిరంజితో ఇన్సులిన్ తీసుకోవడం వల్ల అధిక లేదా తగినంత మోతాదు తీసుకోకపోవచ్చు.  ఈ తప్పు చేస్తుంటే వెంటనే దాన్ని ఆపాలి. దీన్ని నివారించడానికి, 40 IU/ml ఇన్సులిన్ కోసం ఎరుపు రంగు క్యాప్ ఉన్న సిరంజిని ఉపయోగించాలి. 100 IU/ml ఇన్సులిన్ కోసం నారింజ రంగు క్యాప్ ఉన్న సిరంజిని ఉపయోగించాలి. వైద్యుడి సలహాతో సరైన సిరంజిని ఎంచుకోవాలి. ఒకే  ప్రదేశంలో ఇంజెక్షన్.. ఇన్సులిన్ ఒకే చోట పదే పదే ఇంజెక్ట్ చేస్తే, అక్కడ గడ్డలు లేదా గుంటలు (లిపోడిస్ట్రోఫీ) ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఇది ఇన్సులిన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీనిని నివారించడానికి, ప్రతిసారీ ఇంజెక్షన్ సైట్‌ను మార్చాలి. ఉదాహరణకు కడుపు, తొడ, చేయి లేదా తుంటిపై. అంతకు ముందు ఇంజెక్షన్ చేసిన స్థానం నుండి కనీసం 1 సెం.మీ దూరంలో ఇంజెక్ట్ చేయాలి. గుర్తుంచుకోవలసిన విషయం.. ఇన్సులిన్ ఒక ముఖ్యమైన ఔషధం. కానీ దాని సరైన ఉపయోగం మాత్రమే ప్రభావవంతంగా ఉంటుంది. పైన పేర్కొన్న తప్పులను నివారిస్తూ,  ఎల్లప్పుడూ వైద్యుడి సలహా మేరకు ఇన్సులిన్ తీసుకోవాలి. ఇది  చక్కెర స్థాయిని  నియంత్రించడంలో,  తీవ్రమైన సమస్యలను నివారించడంలో మీకు సహాయపడుతుంది.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  అధిక కొలెస్ట్రాల్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్య. ఇది అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యకరమైన కణాలను నిర్మించడానికి కొలెస్ట్రాల్ చాలా అవసరం. కొలెస్ట్రాల్ అధిక మోతాదు గుండె జబ్బులు,  స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కొలెస్ట్రాల్ అంటే ఏమిటి? కొలెస్ట్రాల్ అనేది కాలేయం ద్వారా ఉత్పత్తి అయ్యే కొవ్వు పదార్థం, ఇది వివిధ శారీరక విధులకు అవసరం. ఇది కొన్ని ఆహారాలలో కూడా కనిపిస్తుంది. కొలెస్ట్రాల్ రెండు రకాలు: LDL (తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) - దీనిని "చెడు" కొలెస్ట్రాల్ అని కూడా పిలుస్తారు, ఇది ఎక్కువగా ఉండటం వలన ధమనులలో ఫలకాలు ఏర్పడతాయి. HDL (అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) - "మంచి" కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. ఇది రక్తప్రవాహం నుండి అదనపు LDL ను తొలగించడానికి సహాయపడుతుంది. అనారోగ్యకరమైన జీవనశైలి అంటే సరైన ఆహారం లేకపోవడం, వ్యాయామం లేకపోవడం, ధూమపానం,  అధిక మద్యం సేవించడం వంటివి అధిక చెడు కొలెస్ట్రాల్ కు కారణం. పెద్దలు 20 సంవత్సరాల వయస్సు నుండి ప్రతి 4-6 సంవత్సరాలకు ఒకసారి  కొలెస్ట్రాల్‌ పరీక్ష చేయించుకోవాలని  వైద్యులు చెబుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ కు కారణమేమిటి? అధిక కొలెస్ట్రాల్‌కు అనేక కారణాలు ఉన్నాయి.. సంతృప్త,  ట్రాన్స్ కొవ్వులు (ప్రాసెస్ చేసిన,  వేయించిన ఆహారాలు) అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం. శారీరక శ్రమ లేకపోవడం అధిక శరీర బరువు. ధూమపానం, మద్యం వినియోగం జన్యుశాస్త్రం (కొంతమందికి అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు వారసత్వంగా వస్తాయి) అధిక కొలెస్ట్రాల్ చరిత్ర ఉన్నవారికి, జీవనశైలి మార్పులు మాత్రమే దానిని నియంత్రించడానికి సరిపోకపోవచ్చు. అధిక కొలెస్ట్రాల్‌ను ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి. రక్తప్రవాహంలో కొలెస్ట్రాల్ పెరిగితే, అది రక్త ప్రసరణను పరిమితం చేస్తుంది.  శరీరంలోని వివిధ భాగాలను ప్రభావితం చేస్తుంది. ఇక్కడ కొన్ని సాధారణ  సంకేతాలు ఉన్నాయి. చర్మంపై పసుపు రంగు మచ్చలు.. అధిక కొలెస్ట్రాల్  మొట్టమొదటి కనిపించే సంకేతాలలో ఒకటి పసుపు రంగు కొవ్వు నిల్వలు లేదా చర్మంపై, ముఖ్యంగా కళ్ళు, మోచేతులు మరియు మోకాళ్ల చుట్టూ గడ్డలు. వీటిని జాంతోమాస్ అని పిలుస్తారు. రక్తంలో అదనపు కొలెస్ట్రాల్‌ను సూచిస్తుంది. చేతులు,  కాళ్ళలో జలదరింపు,  తిమ్మిరి.. ధమనులలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, రక్త ప్రసరణ మందగిస్తుంది, దీని వలన చేతులు,  కాళ్ళలో తిమ్మిరి, జలదరింపు లేదా సూదులు గుచ్చిన  అనుభూతి కలుగుతుంది. చికిత్స చేయకపోతే ఇది నరాలు దెబ్బతినడం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. జీర్ణ సమస్యలు,  పిత్తాశయ రాళ్లు.. అధిక కొలెస్ట్రాల్ జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తుంది.  పిత్తాశయ సమస్యలకు దారితీస్తుంది. పిత్తంలో అధిక కొలెస్ట్రాల్ పిత్తాశయ రాళ్లకు కారణమవుతుంది. ఇది ఉదరం  కుడి ఎగువ భాగంలో నొప్పి, వికారం,  అజీర్ణానికి దారితీస్తుంది. ఛాతీ నొప్పి,  శ్వాస ఆడకపోవడం.. ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు అది గుండెకు రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది, దీని వలన ఛాతీ నొప్పి (ఆంజినా),  శ్వాస ఆడకపోవడం జరుగుతుంది. ఈ లక్షణాలను ఎప్పుడూ విస్మరించకూడదు, ఎందుకంటే అవి గుండె జబ్బుల ప్రారంభ సంకేతాలు కావచ్చు. తిమ్మిరి,  మాట్లాడటంలో ఇబ్బంది.. కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల మెదడుకు రక్త ప్రసరణకు ఆటంకం కలిగితే, అది స్ట్రోక్‌కు దారితీస్తుంది.  ఆకస్మిక తిమ్మిరి లేదా బలహీనత, మాట్లాడటంలో ఇబ్బంది,  సమతుల్యత కోల్పోవడం వంటివి దీని లక్షణాలే. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. అధిక కొలెస్ట్రాల్ తరచుగా సమస్యలు తలెత్తే వరకు స్పష్టమైన లక్షణాలను చూపించదు. కాబట్టి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.                                       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  
  ఆరోగ్యంగా ఉండటానికి సంతోషంగా,  ఒత్తిడి లేకుండా ఉండటం చాలా ముఖ్యం. దీని కోసం చాలామంది  తమకు ఇష్టమైన కార్యకలాపాలు చేయడానికి, తమకు ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడటానికి, సంగీతం వినడానికి, ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. కానీ ప్రతి ఒక్కరి ఆనందంలో హార్మోన్లు  పెద్ద పాత్ర పోషిస్తాయని చాలామందికి తెలియదు.  మన శరీరంలో సంతోషకరమైన హార్మోన్లు విడుదలవుతాయి. వీటిని హ్యాపీ హార్మోన్స్ అంటారు.  ఇవి  వ్యక్తిని సానుకూలంగా,  సంతోషకరమైన మూడ్‌లో ఉంచడానికి బ్యాలెన్స్డ్ గా ఉండటం చాలా ముఖ్యం.  సంతోషకరమైన హార్మోన్లు ప్రధానంగా మెదడు,  శరీరంలోని వివిధ భాగాలు (పిట్యూటరీ గ్రంథి, హైపోథాలమస్ మరియు న్యూరాన్లు) ఉత్పత్తి చేస్తాయి. శరీరంలో సంతోషకరమైన హార్మోన్లు తక్కువగా ఉత్పత్తి అయితే, అది ఆ వ్యక్తి మానసిక,  శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల  విచారం, ఆందోళన,  ఒత్తిడిని వంటివి  అనుభవించవచ్చు. కానీ  ఈ హార్మోన్లను కొన్ని విధాలుగా పెంచవచ్చు. ఇది ఆందోళనను తగ్గిస్తుంది,   సంతోషంగా,  ఒత్తిడి లేకుండా చేస్తుంది. సంతోషకరమైన హార్మోన్లను మంచి అనుభూతిని కలిగించే హార్మోన్లు అని కూడా అంటారు. అవి సంతోషకరమైన,  ఉత్సాహభరితమైన భావాలను ఉత్పత్తి చేయడానికి పనిచేస్తాయి. వాటిలో ప్రధానంగా నాలుగు రకాలు ఉన్నాయి. డోపమైన్, సెరోటోనిన్, ఎండార్ఫిన్లు,  ఆక్సిటోసిన్. హ్యాపీ హార్మోన్స్ పెంచే మార్గాలు.. వ్యాయామం.. వ్యాయామం చేయడం వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి  విని ఉంటారు. కానీ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల, ముఖ్యంగా పరుగు వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. ఇది  మంచి అనుభూతిని కలిగిస్తుంది. సంగీతం.. సంగీతం వినడం అనేక విధాలుగా ప్రయోజనకరంగా నిరూపించబడింది. సంగీతం శరీరంలో డోపమైన్‌ను పెంచడానికి కూడా పనిచేస్తుంది. ఈ హార్మోన్ ఆనందం,  ప్రతిఫల భావనలలో పాత్ర పోషిస్తుంది. బయటకు వెళ్లడం.. శరీరంలో సెరోటోనిన్ హార్మోన్  పెంచుకోవాలనుకుంటే, బయటకు వెళ్లి కొంత ఎండలో ఉండాలి. సెరోటోనిన్ మానసిక స్థితిని నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.  కాబట్టి దీనిని "హ్యాపీ కెమికల్" అని కూడా పిలుస్తారు. ఫిజికల్ అఫెక్షన్.. శారీరక అనురాగం, కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం వంటివి శరీరంలో ఆక్సిటోసిన్‌ను పెంచుతాయి. ఇది సంతోషకరమైన హార్మోన్. దీనిని "ప్రేమ హార్మోన్" లేదా "బంధన హార్మోన్" అని కూడా పిలుస్తారు. సానుకూల సంబంధాలు,  ప్రేమ శరీరంలో కార్టిసాల్ స్థాయిలను (ఒత్తిడి హార్మోన్) కూడా తగ్గిస్తాయి.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...