LATEST NEWS
దొంగలు దొంగలూ ఊళ్లు పంచుకున్న చందంగా ప్రస్తుత రాజకీయవ్యవస్థ తయారైంది. ఒకళ్లు చేసిన తప్పులను మరొకరు ప్రశ్నించకుండా, వ్యవస్థ లొసుగులను తమకు అనుగుణంగా మలచుకుంటూ ప్రజాధనాన్ని పంచుకుంటున్నట్లుగా రాజకీయ నాయకుల తీరు తరయారైందంటూ.. వాస్తవ వేదిక లో తెలుగువన్ ఎండీ రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ ల చర్చా సారాంశం ఉంది.  వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో  గురువారం ప్రసారమైంది. ఆ చర్చలో వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు సంగ్రహంగా..  రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పాలనలో జవాబుదారీతనం కరువవ్వడం, ప్రజాధనం దుర్వినియోగమౌతున్న తీరుపై రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్ వాస్తవ వేదికలో కళ్లకు కట్టారు.   ప్రభుత్వ వ్యవస్థల్లో ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తమ మేధాశక్తిని సామాన్యుల బాగు కోసం కాకుండా, పాలకుల తప్పులను కప్పిపుచ్చడానికి వాడుతున్నారని అభిప్రాయపడ్డారు. గతంలో ఐఏఎస్ అధికారులు అసెంబ్లీలో ప్రశ్నలకు భయపడేవారని, కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదని డోలేంద్ర ప్రసాద్ విస్పష్టంగా చెప్పారు.  ఇక ప్రస్తుతం రాష్ట్రంలో  ఉన్నది కూటమి ప్రభుత్వం కాదు కుమ్మక్కు ప్రభుత్వం అనిపిస్తోందన్నారు. ఇందుకు కారణాలు కూడా ఆయన ఉదహరించారు.  తాను కూటమి ప్రభుత్వాన్ని కుమ్మక్కు ప్రభుత్వంగా అభివర్ణించడానికి ఆయన కారణాన్ని కూడా వివరించారు. ప్రభుత్వ పథకాలు, పనుల కాంట్రాక్టుల అప్పగింతలో కూటమి ప్రభుత్వ లోపాలను ఎండగట్టే విషయంలో వైసీపీ చాలా సెలెక్టివ్ గా వ్యవహరిస్తోందన్నారు. అందుకు కారణం వాటిలో వైసీపీయులకు కూడా వాటాలు ఉండటమే కారణమని ఆరోపించారు.  ఇందుకు ఉదాహరణగా గతంలో ఎలక్షన్ల సమయంలో షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్, స్మార్ట్ మీటర్ల విషయంలో గగ్గోలు పెట్టిన తెలుగుదేశం పార్టీ, అధికారంలోకి వచ్చాక అవే సంస్థలకు టెండర్లు ఇవ్వడాన్ని చూపారు. నాడు తాను విమర్శించిన సంస్థలకే  ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం ప్రభుత్వం కాంట్రాక్టులు ఇవ్వడం వెనుక ఉన్న మర్మమేంటని ప్రశ్నించారు.   ఇక దుర్మార్గానికి పరాకాష్ట అన్నట్లుగా ప్రజాధనం దుర్వినియోగం గురించి సోదాహరణంగా వివరించారు.  జగన్ హయాంలో తిండి కోసం రూ. 400 కోట్లు, రుషికొండ ప్యాలెస్ కోసం రూ. 600 కోట్లు, తిరుగుళ్ళ కోసం  250 కోట్లు, ఇక ప్రభుత్వ భవనాలు, పాఠశాలలకు పార్టీ రంగుల కోసం  రూ. 5000 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయితే.. ప్రస్తుత తెలుగుదేశం కూటమి సర్కార్ లో కూడా పాలకులు స్టార్ హోటళ్లలో భోజనానికి రోజుకు నలభై నుంచి ఏభై వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారని డోలేంద్ర ప్రసాద్ ఆరోపించారు. ఇది వారి కష్టార్జితం కాదు కనుకనే యధేచ్ఛగా ఖర్చు పెట్టేస్తున్నారన్నారు. గతంలో అంటే కేంద్రంలో రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో   రూపాయిలో 6 పైసలు మాత్రమే ప్రజలకు చేరేవనీ అదే ఇప్పుడైతే..   పద్దుల్లో లెక్కలు తప్ప ఒక్క పైసా కూడా ప్రజలకు అందకుండానే మాయమౌతోందన్నారు.  గతంలో అంటే 1995లో చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రతి జీవో సమాచారం ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డుల ద్వారా ప్రజలకు తెలిసేదనీ, నేడు  ప్రభుత్వం జారీ చేసే జీవోలు చాలా వరకూ రహస్యంగానే ఉంటున్నాయన్న డోలేంద్ర ప్రసాద్.. అత్యధిక జీవోలను వెబ్సైట్లలో అప్‌లోడ్ చేయడం లేదని విమర్శించారు.  తప్పుగా జారీ చేసే ఏ జీవో కూడా పబ్లిక్ డొమైన్ లో కనిపించడం లేదన్నారు.  ఇప్పటికే ఆర్టీఐ  చట్టాన్ని 90 శాతం నిర్వీర్యం చేసేశారనీ, ఆ చట్టం ద్వారా  సమాధానాలు రావడం లేదనీ పేర్కొన్నారు. అలాగే సోషల్ మీడియాలో ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే..  పోలీసుల ద్వారా కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఇది ఎమర్జెన్సీ కంటే దారుణమైన నియంతృత్వ పోకడ అని విమర్శించారు,. దీనికి బాధ్యత ఎవరిదన్న రవిశంకర్ ప్రశ్నకు డోలేంద్ర ప్రసాద్ గత మూడు దశాబ్దాలుగా  రాజకీయాల్లో ఉన్న నాయకులందరూ వ్యవస్థ పతనానికి బాధ్యత వహించి క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు.   ప్రజలు మేల్కొని ప్రశ్నించే తత్వాన్ని అలవరుచుకోకపోతే పరిస్థితులు మారవని, పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్ తరహా తిరుగుబాటు వచ్చే వరకు పరిస్థితిని తెచ్చుకోవద్దని రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్ లు రాజకీయ నేతలకు హితవు చెప్పారు.  రాజకీయ వ్యవస్థ ప్రస్తుతం ఎలా ఉందంటే, "దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు" ఉంది. ఒకరు చేసే తప్పును మరొకరు ప్రశ్నించకుండా, వ్యవస్థలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ సామాన్యుడి సొమ్మును పంచుకుంటున్నారు.  
తెలంగాణ రాజకీయాలలో అధకార విపక్షాల మధ్య విమర్శలు సరిహద్దు గీత దాటి దుర్భాషల స్థాయికి వెడుతున్నాయనడాన్ని ఎవరూ కాదనలేరు. భాషా సంస్కారం తెలంగాణ రాజకీయాలలో కాగడా పెట్టి వెతికినా కనిపించని పరిస్థితి ఉంది. విమర్శలు దూషణల స్థాయికి మించి దగజారుతున్నదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నాయి. అయితే ఈ పరిస్థితికి కారణం ఎవరన్నది పక్కన పెడితే.. నేతలు తమ భాషా సంస్కారాన్ని పెంచుకోవాలన్న సూచనలూ విజ్ణుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. అది పక్కన పెడితే.. ఒక సంస్కారవంతమైన రాజకీయవాతావరణం మాత్రం ఇటీవలి కాలంలో తెలంగాణలో కనిపిస్తోందని చెప్పక తప్పదు.  ఎందుకంటే.. ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్నవారి మాటే ఫైనల్. విపక్ష గొంతు వినిపించడం సంగతి అటుంచి.. కనీసం వారికి ఇసుమంతైనా ప్రధాన్యత ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అందుకు భిన్నంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రతిపక్ష నేతకు విశేష ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజాస్వామ్య స్ఫూర్తి ఇనుమడించేలా  రేవంత్ వ్యవహరించారన్న ప్రశంసలూ పరిశీలకుల నుంచి వచ్చాయి.   ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడికి రేవంత్ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రాజకీయ వాతావరణం సుహృద్భావ పూరితంగా మారేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఇక తాజాగా ఇద్దరు మహిళా మంత్రులు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ నివాసానికి స్వయంగా వెళ్లి మరీ మేడారం జాతరకు ఆహ్వానించడం  కూడా రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలి కాలంలో ఇటువంటి వాతావరణం కనిపించిన దాఖలాలు లేవు.  తెలంగాణ  రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఇప్పటి వరకూ రెండు సార్లు  తెలంగాణ పండుగ మేడారం జాత‌ర జ‌రిగింది. అయితే.. ఆ రెండు సార్లూ కూడా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి ఇంటికి వెళ్లి ఆయ‌న‌కు ఆహ్వాన ప‌త్రిక‌ ఇచ్చి ఆహ్వానించిన దాఖలాలు లేవు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న అప్పటి ముఖ్యమంత్రి  ఎన్నడూ కూడా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాన్ని పట్టించుకోలేదు.  అయితే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. విమర్శల విషయంలో ప్రతిపక్షానికి దీటుగా ఆయన కూడా మాటల తూటాలు విసురుతున్నప్పటికీ.. వ్యవహార తీరు విషయంలో మాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీలో స్వయంగా ప్రతిపక్ష నేత సీటు వద్దకు వెళ్లి అభివాదం చేయడం గానీ, ఇప్పుడు  మంత్రులు కొండా సురేఖ‌, సీత‌క్క‌లు స్వ‌యంగా ఎర్ర‌వ‌ల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌కువెళ్లి మేడారం జాత‌ర‌కు సంబంధించిన ఆహ్వాన ప‌త్రిక‌ను అందించడం కానీ నిజమైన డెమొక్రటిక్ వాల్యూస్ కు పెద్ద పీట వేయడమేనని పరిశీలకులు అంటున్నారు.  రాజకీయాలకు అతీతంగా జ‌రుగుతున్న ఈ కార్య‌క్ర‌మానికి కేసీఆర్ ను ఆహ్వానించడం, అలాగే అసెంబ్లీలో కేసీఆర్ వద్దకు రేవంత్ స్వయంగా వెళ్లి పలకరించడం వెనుక  వెనుక వ్యూహంఉందంటూ జరుగుతున్న ప్రచారానికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం కనిపించడం లేదు.  ఇదే వాతావరణం కొనసాగాలన్నఆకాంక్ష తెలంగాణ సమాజం నుంచి వ్యక్తమౌతున్నది.  
తెలుగు జాతి ఆత్మ గౌరవ ప్రతీక నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ ఈ మూడక్షరాలు..   ఒక సంచలనం.  ఒక ప్రభంజనం.  గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తెలుగువారంతా అన్న అని ఆత్మీ యంగా పిలుచుకునే  ఎన్టీ రామారావు సినిమా, రాజకీయ రంగాలను శాసించారు.దాదాపు 400 చిత్రాలలో నటించారు. పలు చిత్రాలు నిర్మించారు. మరెన్నో దర్శకత్వం వహించారు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో  చిరస్థాయిగా,  ఆరాధ్య దైవంగా నిలచిపోయారు.   ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం.  తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో  అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు.  అప్పటికి  మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో (అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్)  సాగుతున్న కాంగ్రెస్  ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు. ఆ తరువాత మూడు దఫాలుగా 7 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.    సరిగ్గా 42 ఏళ్ల కిందట (1983 జనవరి 9) ఇదే రోజున ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అందుకే .. 1983 జనవరి 9 తెలుగు కీర్తిపతాక ప్రపంచ వ్యాప్తంగా రెపరెపలాడిన రోజు.  తెలుగు నేల పులకించిన రోజు.    తెలుగు‘వాడి’  తెలిసిన రోజు. తెలుగు జాతికి పండుగ రోజు. రాజకీయం జనం చెంతకు చేరిన రోజు. తెలుగువారిని చిన్న చూపు చూసిన కాంగ్రస్ పాలనకు రాష్ట్రంలో చరమ గీతం పాడిన రోజు.  పార్టీని స్థాపించిన తొమ్మిది నెలలలోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఎన్టీఆర్ అచ్చమైన ప్రజల మనిషి. అందుకే ఆయన రాజభవన్ ఇరుకు గోడల మధ్య కాదు.. జనం సమక్షంలో  లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర చరిత్రలో ప్రజల సమక్షంలో బహిరంగ మైదానంలో ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడం అదే ప్రథమం. ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచీ లక్షల సంఖ్యలో జనం పోటెత్తారు.  హైదరాబాద్ నగరం ఒక్కటే కాదు, రాష్ట్రం మొత్తం, ఆ మాటకొస్తే.. ప్రపంచ దేశాలలో తెలుగు వారు ఉన్న ప్రతి చోటా ఒక పండుగ వాతావరణం నెలకొంది.   ప్రమాణ స్వీకారం తరువాత ప్రజలను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం చారిత్రాత్మకం. ఉద్వేగ భరి తం. ఉత్తేజపూర్వకం.  సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అంటూ ప్రజల కోసమే పని చేస్తానని ఆయన చేసిన ప్రకటన కేవలం ఊకదంపుడు ప్రకటన కాదని ఆయన తన పాలన ద్వారా చేతల్లో చూపారు.  ప్రజాహితమే తన అభిమతమని  అవిశ్రాంతంగా  ప్రజాసంక్షేమం కోసమే పాటుపడ్డారు. అధి కారమంటే  విలాసం. అధికారమంటే పెత్తనం అన్నట్లుగా సాగిన తీరును సమూలంగా మార్చేసి అధికారం అంటే బాధ్యత. అధికారమంటే జవాబుదారీ తనం. అధికారమంటే ప్రజా సేవ అని తెలిసొచ్చేలా చేశారు. తనను సినీరంగంలో మకుటం లేని మహారాజుగా నిలబెట్టిన మశిక్షణ, రుజు వర్తన,  ,సమయపాలనలను ఎన్టీఆర్ రాజకీయ జీవితంలోనూ కొనసాగించారు.  ముఖ్యమంత్రిగా వచ్చే ఎన్నో సౌకర్యాలను ఆయన తృణప్రాయంగా త్యజించి నిరాడంబరతకు నిలువెత్తు రూపంగా నిలిచారు. బడుగుబలహీన వర్గాలకు  , అధకారంలో భాగస్వామ్యం కల్పించారు.  పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు, రెండు రూపాయలకు కిలో బియ్యం, ఆడపడుచులకు ఆస్తి హక్కు వంటి పథకాలతో జనం మనిషి అనిపించుకున్నారు. అందుకే జనం గుండెల్లో  నిండుగా చిరస్థాయిగా నిలిచిపోయారు. 
సమాజం పట్ల అక్కర, బాధ్యత ఉన్న ఇద్దరు వ్యక్తులు వర్తమాన రాజకీయాలలో భ్రష్ఠత్వంపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు. ఈ భ్రష్టత్వం అఖిల భారత సర్వీసు అధికారులకూ విస్తరించడాన్ని నిలదీశారు. తెలుగువన్  వాస్తవ వేదిక ద్వారా తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ వ్యవస్థ లోపాలపై విమర్శల శస్త్రాలు గుప్పించారు.  రాజకీయ నాయకుల దుబారా ఖర్చులు, ఆడంబర ప్రయాణ వ్యయాలు రాజకీయాలలో నాయకుల ఆర్థిక అరాచకత్వం చూస్తుంటే, ఆర్థిక నిబంధనలన్నవి సామాన్యులకేనా, నేతలకు వర్తించవా అన్న ప్రశ్న తలెత్తుతున్నది. ఇదే విషయాన్ని ‘వాస్తవ వేదిక‘ ద్వారా తెలుగువన్ ఎండీ కంఠం నేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్రప్రసాద్  మరోసారి లేవనెత్తారు.   ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్  ప్రభుత్వ ఖర్చుతోనే చార్టర్డ్ విమానాల్లో తిరుగుతున్నారనీ, ప్రభుత్వం దగ్గర సొంత విమానం లేనందున గంటకు 6 నుండి 8 లక్షల రూపాయలు అద్దె చెల్లిస్తున్నారన్న ప్రచారం, అలాగే  విజయవాడ నుండి హైదరాబాద్‌కు వచ్చి వెళ్లే ట్రిప్పుకు 10 నుండి 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, ఇది వ్యక్తిగత దుబారా అని  విమర్శించారు. లోకేష్ తన ప్రయాణ ఖర్చులకు సొంత డబ్బులు వినియోగిస్తున్నారన్న ఆర్టీఐ  వివరణ నమ్మశక్యంగా లేదని అభిప్రాయపడ్డారు.  ఆయన ముఖ్యమంత్రితో కలిసి ప్రయాణించడం వల్ల ఆ ఖర్చు ముఖ్యమంత్రి ఖాతాలోకి వెళ్తోందని పేర్కొన్నారు. అయితే ఇలా ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.  ఐఏఎస్ అధికారులు  నిబంధనల్లో లొసుగులను ఆసరా చేసుకుని వాటని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. కొందరు అధికారులు ఎలక్షన్ బడ్జెట్‌తో కార్లు కొనుక్కుంటున్నారని, ఒక్కో అధికారికి మూడు నుండి ఐదు కార్లు ఉంటున్నాయనీ అన్నారు.  గతంలో కలెక్టర్లు సొంత పనులకు రిక్షాల్లో వెళ్లేవారని, కానీ ఇప్పటి అధికారులకు ఆ నిబద్ధత లేదని, వారు ఉద్యోగంలో చేరగానే విల్లాలు, అపార్ట్‌మెంట్ల గురించి ఆలోచిస్తున్నారని విమర్శించారు.  దుబారాకు, ఆ దుబారాకు అధికారులు పలుకుతున్న వత్తాసుకు నిలువెత్తు ఉదాహరణగా రుషికొండ ప్యాలెస్ ను చెప్పుకోవచ్చన్న వారు.. తొలుత రుషికొండ ప్యాలెస్ కు 200 కోట్ల రూపాయలు మంజూరైతే.. అది పూర్తయ్యే నాటికి మొత్తం వ్యయం 600 కోట్లకు చేరిదనీ,  అంత ఖర్చు చేసీ  సిఆర్జెడ్, ఎన్విరాన్మెంట్, అటవీ నిబంధనల ఉల్లంఘనా యథేచ్ఛగా జరిగిందనీ దీనిని అడ్డుకోవలసిన అధికారులు ఏం చేస్తున్నారనీ ప్రశ్నించారు.  అదే విధంగా జగన్ హయాంలో ప్రభుత్వ భవనాలకు వైసీపీ  రంగులు వేయడానికి, తీరా వేసిన తరువాత హైకోర్టు మొట్టికాయలు వేసి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఆ రంగులను తొలగించడానికి దాదాపు ఐదువేల కోట్ల రూపాయల ప్రజాధనం వ్యయం చేశారనీ, ఇంకా చెప్పుకుంటూ పోతే..  గతంలో విజయవాడలోని ఒక స్టార్ హోటల్ నుండి ముఖ్యమంత్రి కుటుంబం కోసం రోజుకు లక్షన్నర రూపాయల వరకు భోజన బిల్లులు ఉండేవని, ఐదేళ్లలో ఇది సుమారు 400 కోట్లు అయి ఉండవచ్చనీ పేర్కొన్నారు.    ఇక ప్రజాస్వామ్య దేవాలయంగా చెప్పుకునే అసెంబ్లీలో అర్ధవంతమైన చర్చలు ఇసుమంతైనా జరగడం లేదనీ, కేవలం స్వోత్కర్ష, పరనిందకే అసెంబ్లీని నేతలు వేదికగా చేసుకుంటున్నారనీ సోదాహరణంగా వివరించారు. తెలుగుదేశం, వైసీపీలు ప్రజల ముందే కొట్టుకుంటున్నట్టు కనిపిస్తాయి కానీ, అంతర్లీనంగా అవి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇంటి ఫెన్సింగ్‌కు 14 నుంచి 15 కోట్ల రూపాయలు ఖర్చు చేయడంపై ఎవరూ ప్రశ్నించడంలేదన్నారు. నేతల తప్పులను నిలదీయాల్సిన ప్రజా సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీలు నిర్వీర్యం అయిపోయాయి నామావశిష్టంగా మిగిలాయన్నారు.   మొత్తంగా వ్యవస్థలో  అలీబాబా   మారాడు తప్ప,  40 మంది దొంగలు (అధికారులు, కాంట్రాక్టర్లు, దోపిడీదారులు) అలాగే ఉన్నారనీ, నాయకులు మారినా వ్యవస్థలో దోపిడీ విధానం మారలేదనీ చెప్పారు. ఇక రాష్ట్ర ఉత్పాదకత పెరిగినా ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేకపోవడానికి కారణం   దుబారా, అవినీతేనన్నారు.   ఈ చర్చకు కొనసాగింపు గురువారం (జనవరి 8) రాత్రి ఏడు గంటలకు  తెలుగువన్ ‘వాస్తవ వేదిక‘లో ఈ దిగువన ఉన్న లింక్ ద్వారా చూడండి.
కేంద్రంలోని మోడీ సర్కార్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గాంధీ భవన్ లో గురువారం (జనవరి 8) జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ప్రసంగించిన ఆయన 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ 400 స్థానాలలో విజయం సాధించి ఉంటే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేసి ఉండేదన్న ఆయన కాంగ్రెస్ ప్రజలను అప్రమత్తం చేయడం వల్లనే ఆ పార్టీకి పూర్తి మెజారిటీని జనం ఇవ్వలేదని అన్నారు. మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు.   మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే  మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు. నిబంధనల మార్పు పేరుతో ఆ పథకాన్ని శాశ్వతంగా నిలిపివేయడానికి కేంద్రంలోని మోడీ సర్కార్ కుట్రపన్ననుతోందని విమర్శించారు. అధికారం ఉందన్న అహంకారంతో చట్టసభలను వినియోగించి పేదలను అణిచివేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.  
ALSO ON TELUGUONE N E W S
      -రాజా సాబ్ విషయంలో ఏం జరుగుతుంది -రిజల్ట్ పరిస్థితి ఏంటి! -సీక్వెల్ లో చెప్పబోతున్న కథ ఏంటి  -అసలు సీక్వెల్ ఉంటుందా      పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.     రాజాసాబ్ మూవీ చివరలో సర్కస్ ట్రైనర్ గా ముఖానికి విభిన్న రంగులని పూసుకొని ఒక ప్రభాస్ చాలా  కోపంగా  రాజా గా చేసిన మరో ప్రభాస్ ని చూస్తాడు. ఆ వెంటనే రాజా సాబ్ కి సీక్వెల్ ఉన్నట్టుగా ది రాజాసాబ్ 2 :సర్కస్ 1935 'అనే టైటిల్ ని మేకర్స్ ప్రదర్శించడం  జరిగింది. దీంతో ఇద్దరు ప్రభాస్ లతో రాజాసాబ్ సీక్వెల్ తెరకెక్కడం ఖాయమయ్యి ఒకరు ప్రతినాయకుడిగా ఉంటే అభిమానులకి మరో పండుగ వచ్చినట్టే అనే మాటలు సోషల్ మీడియా వేదికగా వినపడుతున్నాయి.     రాజాసాబ్ ని మారుతీ(Maruthi)దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(people Media factory)సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో  నిర్మించిన విషయం తెలిసిందే. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్,  రిద్దికుమార్ జతకట్టగా థమన్ మ్యూజిక్ అందించాడు. ప్రభాస్ తాత గా సంజయ్ దత్, నాయనమ్మ గా జరీనా వాహెబ్ కనిపించారు.     
      -సినీ చరిత్రలో ఇదే తొలి తీర్పా! -కోర్టు తీర్పు వెనక మర్మం ఏంటి! -కార్తీ అభిమానులు ఏమంటున్నారు     తమిళ, తెలుగు నాట సమానమైన ఫాలోయింగ్ కలిగిన కార్తీ 'వా వాతియార్'( Vaa vaathiyaar)అనే మూవీని కంప్లీట్ చేసి అభిమానుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. తెలుగు టైటిల్ 'అన్నగారు వస్తున్నారు'. డిసెంబర్ 12 నే రిలీజ్ కావలసి ఉండగా, చిత్ర నిర్మాత జ్ఞానవేల్ రాజా  2011లో ఒక మూవీకి సంబంధించి అర్జున్ లాల్ సుందర్‌దాస్ అనే ఫైనాన్సియర్ నుండి 10.35 కోట్లు అప్పుగా తీసుకున్నారు. సదరు అమౌంట్ వడ్డీతో కలిపి దాదాపుగా 21.78 కోట్ల రూపాయలకి చేరింది. దీంతో అర్జున్ లాల్ చెన్నైలోని హైకోర్టులో జ్ఞానవేల్ రాజా పై పిటిషన్ వేసాడు. సదరు పిటిషన్ లో తనకి రావాల్సిన అమౌంట్ చెల్లించే వరకు వా వాతియార్ రిలీజ్ ని నిలిపివేయాలని కోరాడు. దీంతో వా వాతియార్ రిలీజ్ పై కోర్టు స్టే విధించింది. స్టే ఆర్డర్‌ని సవాలు చేస్తూ జ్ఞానవేల్ రాజా సుప్రీంకోర్టుని  ఆశ్రయించగా హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. రీసెంట్ గా హైకోర్టు వా వాతియార్ విషయంలో ఎవరు ఊహించని విధంగా సరికొత్త తీర్పుని ప్రకటించింది.     జ్ఞానవేల్ రాజా చెల్లించాలిసిన  21.78 కోట్ల రూపాయలని ఫైనాన్షియర్‌కి తిరిగి చెల్లించడానికి, వా వాతియార్ హక్కులని బహిరంగంగా వేలం వేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.  గతంలో ఫైనాన్సియల్ ఇష్యూ తలెత్తడంతో చాలా సినిమాలు కోర్టు గుమ్మం ఎక్కాయి. కానీ   సినిమా హక్కులని బహిరంగంగా వేలం వేసి ఫైనాన్సియర్ కి  అమౌంట్ ఇవ్వాలని చెప్పడం బహుశా ఇదే తొలి సారి ఏమో. అదే విధంగా కోర్టు తన తీర్పులో  బకాయిలు చెల్లించే వరకు, OTT మరియు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు,  థియేటర్లలో సినిమా విడుదలని  కోర్టు శాశ్వతంగా నిలిపివేసున్నట్టుగా కూడా హై కోర్టు తన తీర్పులో తెలిపింది. ఈ తీర్పుతో కార్తీ అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.      Also read:  The raja saab: ది రాజాసాబ్  మూవీ రివ్యూ      వా వాతియార్ లో కార్తీ  డిఎస్ పి రామేశ్వరన్ గా కనిపిస్తుండగా, కార్తీ(karthi)సరసన  ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి(Krithi shetty)జత కట్టింది. సత్యరాజ్, రాజ్ కిరణ్, కరుణా కరణ్ ముఖ్యమైన క్యారెక్టర్స్ ని పోషించాడు. నలన్ కుమారస్వామి(Nalan Kumaraswami)దర్శకత్వంలో జ్ఞానవేల్ రాజా(Ke Jnanavel Raja)సుమారు 70 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్టుగా టాక్. కార్తీకి జ్ఞానవేల్ రాజా సోదరుడి వరుస అవుతాడు.  
  'ది రాజా సాబ్' రూపంలో మారుతికి గొప్ప ఛాన్స్ పిలిచి అవకాశమిచ్చిన ప్రభాస్ ఆ నమ్మకాన్ని మారుతి నిలబెట్టుకున్నాడా?   2012లో 'ఈరోజుల్లో' సినిమాతో దర్శకుడిగా పరిచయమై అందరి దృష్టిని ఆకర్షించిన మారుతి.. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతి రోజూ పండగే వంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. మారుతి ఎక్కువగా చిన్న, మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేశాడు. మధ్యలో వెంకటేష్ తో 'బాబు బంగారం' చేసినప్పటికీ అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అలాంటి మారుతికి 'ది రాజా సాబ్'తో ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమా హిట్ అయితే ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగిపోయే అవకాశమిది. కానీ, ఆ అవకాశాన్ని మారుతి సరిగ్గా వినియోగించుకోలేకపోయాడనే చెప్పాలి. (The Raja Saab)   మారుతితో ప్రభాస్ సినిమా చేస్తున్నాడని తెలిసినప్పుడు ఫ్యాన్స్ తో సహా అందరూ ఆశ్చర్యపోయారు. ప్రభాస్ స్టార్డమ్ ని మారుతి హ్యాండిల్ చేయగలడా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. రూ.400 కోట్లకు పైగా బడ్జెట్ తో హారర్ కామెడీ జానర్ లో ఫిల్మ్, వింటేజ్ ప్రభాస్ ని చూడబోతున్నారనే ప్రకటనలతో చిన్నగా నమ్మకం మొదలైంది. ఇక ప్రభాస్ లుక్స్, ప్రచార చిత్రాలతో ఈ సినిమాపై హోప్ వచ్చింది. తీరా రిలీజ్ అయ్యాక డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది.   Also Read: 'రాజా సాబ్' మూవీలో హైలైట్స్ ఇవే!   తాజాగా థియేటర్లలో అడుగుపెట్టిన 'ది రాజా సాబ్' మూవీ బిలో యావరేజ్ టు యావరేజ్ టాక్ తోనే సరిపెట్టుకుంది. రివ్యూలు గొప్పగా లేవు. జనరల్ ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ప్రభాస్ తో కొత్త జానర్ లో సినిమా చేయాలనే ఆలోచన బాగుంది. స్టోరీ లైన్ కూడా బాగానే ఉంది. కానీ, ఎగ్జిక్యూషన్ లో మారుతి తడబడ్డాడు. ఫస్ట్ హాఫ్ లో ల్యాగ్, సెకండ్ హాఫ్ లో కన్ఫ్యూజన్ సినిమాకి ప్రధాన సమస్యగా మారాయి. ప్రభాస్ వన్ మ్యాన్ షో, ఇంటర్వెల్, క్లైమాక్స్ తప్ప సినిమాలో పెద్దగా వావ్ మూమెంట్స్ లేవు. ఒకే సినిమాలో ఎక్కువ అంశాలు చెప్పడానికి ప్రయత్నించకుండా.. ఈ కాన్సెప్ట్ కి తగ్గట్టు సరైన స్క్రీన్ ప్లేని రాసుకొని ఉంటే.. అవుట్ పుట్ మరోలా ఉండేది. అదే జరిగి, రాజా సాబ్ తో మారుతి మ్యాజిక్ చేసి ఉంటే.. పాన్ ఇండియా వైడ్ గా ఆయన పేరు మారుమోగిపోయేది. కానీ, ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. మొత్తానికి ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ ఇచ్చిన గొప్ప అవకాశాన్ని మారుతి సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు.    
  కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి నటించిన 'జననాయగన్' సినిమా నేడు(జనవరి 9) విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విషయంలో తాజాగా మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. (Jana Nayagan)   పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ దళపతి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ 'జననాయగన్'లో కొన్ని సీన్స్, డైలాగ్స్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో కొన్ని అభ్యంతర సీన్స్ ని తొలగించడంతో పాటు, కొన్ని డైలాగ్స్ ని మ్యూట్ చేయాలని సెన్సార్ బోర్డు సూచించిందని సమాచారం. సెన్సార్ సూచనతో మార్పులు చేసిన మేకర్స్.. సినిమాని మళ్ళీ సెన్సార్ కి పంపారు. మొదట U/A సర్టిఫికెట్ ఇవ్వడానికి ఓకే చెప్పిన.. ఆ తర్వాత మళ్లీ రివ్యూ కమిటీకి పంపింది. ఇదే విషయాన్ని 'జననాయగన్' నిర్మాతలు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.   మద్రాస్ హైకోర్టులో జననాయగన్ సినిమాకు ఊరట లభించింది. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని CBFCని న్యాయస్థానం ఆదేశించింది. సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత మళ్లీ రివ్యూ కమిటీకి పంపాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించిన హైకోర్టు సింగిల్ జడ్జి.. ముందుగా ఇస్తామన్న U/A సర్టిఫికెట్ తక్షణమే ఇవ్వాలని ఆదేశించారు.   అయితే జననాయగన్ కు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయాలనే సింగిల్ జడ్జి తీర్పును సెన్సార్ బోర్డు సవాలు చేసింది. దీనిపై ఈ రోజు లేదా సోమవారం విచారణ జరగనుంది. మరి జననాయగన్ కి పూర్తిగా లైన్ క్లియర్ అవుతుందేమో చూడాలి. జనవరి 14న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.  
  - రాజా సాబ్ మూవీ ఎలా ఉంది? - సినిమాలో హైలైట్స్ ఏంటి? - ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీనా కాదా?   పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) మొదటిసారి హారర్ కామెడీ జానర్ లో చేసిన సినిమా 'ది రాజా సాబ్'(The Raja Saab). మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ, జనవరి 8 రాత్రి ప్రీమియర్ షోలతో థియేటర్లలో అడుగుపెట్టింది. అయితే ఈ ఫిల్మ్ డివైడ్ టాక్ నే సొంతం చేసుకుంది.   'ది రాజా సాబ్' సినిమా టాక్ ఎలా ఉన్నా.. ఇందులో కొన్ని హైలైట్స్ ఉన్నాయి. అందులో మెయిన్ హైలైట్ ప్రభాస్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రభాస్ తన స్క్రీన్ ప్రజెన్స్, ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో సినిమాను తన భుజాలపై మోశాడు. వీక్ రైటింగ్ తో ఏకంగా మూడు గంటల నిడివితో ఈ ఫిల్మ్ తెరకెక్కినప్పటికీ.. ప్రేక్షకులు అంతసేపు కూర్చోగలుగుతున్నారంటే అందుకు కారణం ప్రభాస్. ఈ సినిమాలో మొత్తం పది హైలైట్స్ ఉన్నాయి అనుకుంటే.. అందులో ఒకటి నుంచి ఐదు వరకు ప్రభాసే ఉంటాడు.   Also Read: ది రాజా సాబ్ మూవీ రివ్యూ   ప్రభాస్ తర్వాత 'రాజా సాబ్' మూవీ హైలైట్ ప్రొడక్షన్ వాల్యూస్ అని చెప్పవచ్చు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో ఉన్నాయి. అలాగే వీఎఫ్ఎక్స్ కూడా ఆకట్టుకుంది. ఇక తమన్ మ్యూజిక్ ని కూడా హైలైట్స్ లో ఒకటిగా చెప్పవచ్చు. సాంగ్స్ తో పెద్దగా మ్యాజిక్ చేయనప్పటికీ.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో చాలా సీన్స్ ని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ ని కూడా మెయిన్ హైలైట్ గా పరిగణించవచ్చు. మారుతి తీసుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ, ఎగ్జిక్యూషన్ లో తడబడ్డాడు. ఇంటర్వెల్, క్లైమాక్స్ లో మాత్రమే రచయితగా, దర్శకుడిగా ప్రభావాన్ని చూపించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ తో బాగా మెప్పించాడు.   ది రాజా సాబ్ హైలైట్స్: 1 to 5. ప్రభాస్ 6. ప్రొడక్షన్ వాల్యూస్  7. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 8. వీఎఫ్ఎక్స్ 9. ఇంటర్వెల్ 10. క్లైమాక్స్  
Cast: Prabhas, Sanjay Dutt, Malavika Mohanan, Riddhi Kumar, Niddhi Agerwal, Zarina Wahab, Satya, VTV Ganesh, Prabhas Seenu, Boman Irani, Ammu Abhirami Crew:  Cinematography by Karthik Palani Music by S Thaman Editing by Kotagiri Venkateswara Rao  Written and Directed by Maruthi Dasari Produced by T.G. Vishwa Prasad, Ishan Saksena Release Date: 09/01/2026 Prabhas has taken a gap of almost two years post his Kalki 2898 AD for the horror fantasy epic, The Raja Saab. T.G. Vishwa Prasad and Ishan Saksena have produced this huge budget film over 3 years. Maruthi Dasari has written and directed the film as he is an expert in handling horror comedies. Prabhas also loved to do something different from his big budget action epics post Baahubali. Let's discuss about the film in detail.  Plot: Raju (Prabhas) loves his grandmother Gangamma (Zarina Wahab) to the core. She has advanced alzheimer's disease. She calls him Raja Saab as she belongs to a Zamindar family. But he doesn't believe in her stories yet he wants to search for her husband Kankaraju (Sanjay Dutt). She remembers only him and Raju wants to bring him in front of her eyes to see her happy. They find a clue of years that Kanakaraju is in Hyderabad. He takes an amount of Rs.5 Lakhs from his childhood sweetheart Anitha (Riddhi Kumar) for bribing police to search for him. In Hyderabad, he falls in love with Besse (Niddhi Agerwal). And he gets to know that his grandfather is a cheat and he took Rs. 3 Lakhs from Besse, which Raju donated for a child's heart operation. Meanwhile, Raju gets to know that Besse is going to be a Nun and he accepts advances from Bhairavi (Malavika Mohanan). Who is Bhairavi? What is her connection with Kanakaraju and Gangamma? What is Kanakaraju's real face and motive? Watch the movie ot know more.  Analysis: Prabhas looks active and smart in this film. His acting prowess is on full display in the pre-climax portions and climax. He proved yet again that his screen presence and star image help in pull off any sort of a sequence. But his character lacks the similar kind of magnetic pull that many of his iconic films did provide in the past. Still, he maintained high energy and delivered his best.  Riddhi Kumar, Malavika Mohanan and Niddhi Agerwal fought for who can act worse than the other in many scenes. But they are stunningly beautiful and their pretty looks add glam quotient to the film. Zarina Wahab and Ammu Abhirami as Gangamma are good and believable. Mainly, Zarina Wahab delivered her best in this inconsistently written role. Boman Irani is good but underutilised and Sanjay Dutt is fine. Satya and others comedy did not work as anticipated.  S Thaman's work is not upto the standards that he had set previously. His songs and BGM score are undermining and to be fair, the movie also did not allow him to excel. Kartik Palani's cinematography is good and production values are grand as the budget is visible on screen. VFX and framing could have been much better and they lack any sort of deep meaning that we normally associate with such psychological horror films.  Maruthi looked greatly confused and gravely overwhelmed by the occasion throughout the film. He did not have the sharpness he showcased in his writing in films like Bhale Bhale Mogadivoy and Prati Roju Pandage, Prema Katha Chitram. The comedy did not have innovation and the visual effects seemed too artificial at many places. More or less, the movie looked like filler episodes till the final moments which did not help in creating any sort of emotional connect with the audiences.  Throughout the horror, comedy and fun elements have been so randomly placed that the entire film feels random. When you're touching psychological horror concepts using ghost and other supernatural elements in the same breathe feels like a stretch. Maruthi got a life-changing opportunity but he did not really live-up to the hype and buzz that surrounds a Prabhas film with The Raja Saab. Brain Games needed a much better set-up and pay-off to work best.  Bottomline:  The Raja Saab fails in having a proper emotional connection and things don't work as anticipated.  Rating: 2.5/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
    -సినిమా పేరు: ది రాజాసాబ్ -న‌టీన‌టులు:  ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, సంజయ్ దత్, జరీనా వాహెబ్, -బొమన్ ఇరానీ, సముద్ర ఖని, వీటీవీ గణేష్, ప్రభాస్ శ్రీను, సత్య త‌దిత‌రులు -సినిమాటోగ్ర‌ఫీ:  కార్తీక్ పళని -ఎడిట‌ర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు    -మ్యూజిక్: థమన్  -నిర్మాత‌: టిజి విశ్వప్రసాద్  -బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ  -రచన, ద‌ర్శ‌క‌త్వం: మారుతీ  -రిలీజ్ డేట్ : జనవరి 9 ,2025    అభిమానులు, మూవీ లవర్స్ కోలాహలం మధ్య పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ బెనిఫిట్ షోస్ తో రాజాసాబ్ గా సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. ప్రభాస్ ఫస్ట్ టైం హర్రర్ కామెడీ చెయ్యడంతో పాటు  రిలీజ్ కి ముంచే పాజిటివ్ వైబ్రేషన్స్ రావడం  రాజా సాబ్ స్పెషాలిటీ.మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.   కథ రాజు అలియాస్ రాజాసాబ్ (ప్రభాస్) తన నాయనమ్మ గంగా దేవి(జరీనా వాహెబ్) తో కలిసి ఉంటుంటాడు. గంగాదేవి అల్జీమర్స్ అనే వ్యాధితో అందర్నీ మర్చిపోయినా సరే తన భర్త  కనకరాజు (సంజయ్ దత్) మనవడు రాజుని మాత్రం గుర్తుంచుకుంటుంది. దేవనగర సామ్రాజ్యానికి నమ్మిన బంటు గంగరాజు(సముద్ర ఖని) ద్వారా రాజుకి తన తాత కనకరాజు గురించి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. దీంతో తన తాత కనకరాజు ని అంత మొందించాలని రాజు ఫిక్స్ అవుతాడు. రాజు ఎందుకు తన తాత ని చంపాలని అనుకుంటాడు? కనకరాజు మంచి వ్యక్తా? చెడ్డ వ్యక్తా? కనకరాజు గతం ఏంటి? హీరోయిన్స్ గా చేసిన బెస్సి, అనిత, భైరవి ల క్యారెక్టర్స్ ఏంటి? అసలు రాజా సాబ్ కథ వెనక ఉన్న ఉద్దేశ్యం ఏంటనేదే చిత్ర కథ       ఎనాలసిస్  దర్శకుడు మారుతి ప్రభాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ కథని రాసుకున్నాడని  స్టార్టింగ్ నుంచి వచ్చిన ప్రతి సీన్ ద్వారా అర్ధమవుతుంది. కానీ గందరగోళానికి గురయ్యి ఒక మంచి కథకి అన్యాయం చేసాడేమో అనిపిస్తుంది..  నాయనమ్మ కోరిక తీర్చిన మనవడు అనే కాన్సెప్ట్ కొత్తగానే ఉన్నా స్క్రీన్ ప్లే లో ఎన్నో లోపాలు ఉన్నాయి . ఫస్ట్ హాఫ్ ఓపెన్ చేస్తే ప్రభాస్ ఇంట్రడక్షన్ నుంచి మిగతా అన్ని క్యారెక్టర్స్ సీన్స్ నేటి ట్రెండ్ కి తగ్గట్టు విధంగా ఉండి ఫాస్ట్ గానే ఉన్నాయి. కాకపోతే గంగా దేవి సామ్రాజ్యం గురించి కథ ని చెప్పాల్సింది.   దాంతో కొత్త లుక్ వచ్చేది. బెస్సీ, అనిత భైరవి క్యారెక్టర్స్ యొక్క ప్లేస్ మెంట్ కూడా బాగుంది. కాకపోతే వీళ్ళని ఎక్కువగా ఉపయోగించుకోలేదేమో అనిపిస్తుంది. రాజు,గంగా దేవి మధ్య వచ్చిన సీన్స్ బాగున్నాయి. కనకరాజు, గంగా దేవి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ లో పెద్ద ట్విస్ట్ ఏం లేదు. సెకండ్ ఆఫ్ చూసుకుంటే కథ ఎక్కువ భాగం ఒక ఫారెస్ట్‌లోని కోట చుట్టూ తిరిగి పరుల సొమ్ము కోసం ఆశపడే కనకరాజు తన మాయాజాలంతో అందరి నుంచి డబ్బులు దోచుకుని దాన్ని కోటలో దాచుకోవడం, చనిపోయిన తర్వాత కూడా ఆ సొమ్మంతా తనకే దక్కాలని, ఆ సంపదకు వారసుడు తాను మాత్రమేనని, ఇంకెవరికీ దక్కకూడదని ముందే వీలునామా రాసుకోవడం వంటి సీన్స్ ఆసక్తి రేపాయి.     చనిపోయి ఆత్మగా మారిన తర్వాత తన భార్యని చంపాలని ప్రయత్నిస్తుండటం  ఉత్కంఠని కలిగిస్తుంది. ఈ సందర్భంగా ప్రభాస్ తో వచ్చే సీన్స్, కోటలోకి బెస్సి, అనిత, భైరవి లని ఇన్ క్లూడ్ చేసిన విధానం బాగుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ బాగున్నాయి   నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు  రాజా సాబ్ తో మరో సారి పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద ఎంత వాల్యుబుల్ స్టార్ నో ప్రభాస్  చాటి చెప్పాడు. తన క్యారక్టర్ వరకు అత్యద్భుతంగా చేసి కథనం యొక్క వేగాన్ని జెట్ స్పీడ్ వేగంతో తీసుకెళ్లాడు.సదరు  క్యారక్టర్ లో ప్రభాస్ ని తప్ప మరొకర్ని ఊహించలేం. ఎంటర్ టైన్ మెంట్ లో కూడా కింగ్ ని అని చెప్పినట్లయింది ఈ సినిమా ద్వారా ప్రేక్షకులు చాన్నాళ్ల తర్వాత వింటేజ్ ప్రభాస్‌‌ని చూస్తారు. ఏ విషయాన్నైనా సరదాగా తీసుకుంటూ బాగా వెటకారం కలగలిపిన క్యారెక్టర్‌లో వింటేజ్ ప్రభాస్ కనిపిస్తాడు. నాయనమ్మ కోసం ఎంతకైనా తెగించే మనవడిగా, ముగ్గురు భామల మధ్యలో ఇరుక్కున్న ప్రియుడిగా, తాత నిజస్వరూపం తెలుసుకున్న తర్వాత అతడిని ఎలాగైనా అంతమొందించాలన్న పట్టుదలతో ప్రాణాలను సైతం లెక్కపెట్టక పోరాడే వ్యక్తిగా   ప్రభాస్ అలరించాడు. హీరోయిన్స్ గా చేసిన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ లు గ్లామర్ పరంగానే కాకుండా నటన పరంగా కూడా మెప్పించారు. కనకరాజుగా   సంజయ్ దత్ ది బెస్ట్ పెర్ ఫార్మ్ ఇవ్వడమే కాకుండా తన కెరీర్ లోనే రాజా సాబ్ మరో మెమొరీబుల్ మూవీగా ఉండేలాగా చేసుకున్నాడు.   మిగతా క్యారెక్టర్స్ లలో చేసిన బొమన్ ఇరానీ. సముద్ర ఖని తో పాటు అందరు  మెస్మరైజ్ చేసే పెర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు.  సాంగ్స్ కి థమన్ ఇచ్చిన మ్యూజిక్ ని  స్క్రీన్ పై చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఒక రేంజ్ లో ఉంది. ప్రతి సీన్ ని కూడా ఎంతో ఎలివేట్ చేస్తు సాగి ఒక కొత్త లోకాన్ని పరిచయం చేసింది. గ్రాఫిక్ నిపుణుల పని తనం ఐ ఫీస్ట్ అనుభూతిని కలిగించింది. ఇక దర్శకుడిగా మారుతి నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యాడు కానీ రచయితగా తడపడ్డాడు పీపుల్ మీడియా నిర్మాణ విలువలు ఒక రేంజ్ లో ఉన్నాయి. రాజా సాబ్ తో దర్జాగా భారతీయ చిత్ర పరిశ్రమలో టాప్ బ్యానర్ గా తమ సంస్థ పేరుని ఉండేలా చేసుకుంది . కార్తీక్ పళని ఫొటోగ్రఫీ అయితే ఎక్స్ లెంట్    ఫైనల్ గా చెప్పాలంటే కథనంలో లోపాలు ఉన్నా ప్రభాస్ పెర్ ఫార్మెన్స్ మాత్రం సూపర్ గా ఉంది.   రేటింగ్ : 2.5/5   - అరుణా చలం
Tejas Gunjal Films and Rohit Gunjal Films proudly present the action crime drama ‘ONE/4 (One by Four)’, starring Venkatesh Peddapalem, Aparnna Mallick, and Heena Soni in the lead roles. The film is directed by Bahubali Palani K, who previously worked as an Associate Director on the blockbuster Baahubali. Produced jointly by Ranjana Rajesh Gunjal and Rohit Ramdas Gunjal, ONE/4 is gearing up for a grand worldwide theatrical release on January 30 across 200 theatres. Speaking on the occasion, the film unit shared "ONE/4 (One by Four) is a gripping action crime entertainer with a fresh concept. In real life, we often underestimate the consequences of a simple tongue slip, but its impact can be life-changing. This film explores what happens when one small mistake triggers a chain of unexpected crimes. The movie features intense action episodes, powerful performances by the cast, energetic choreography by Sagar Master, and engaging music by Subhash Anand. Director Palani K’s visual storytelling, inspired by the grand narrative style of S.S. Rajamouli, keeps the audience hooked without a single dull moment. Every frame is crafted to maintain suspense and momentum.” The team confidently added that ONE/4 will offer a high-voltage cinematic experience and promises to entertain audiences thoroughly when it releases worldwide on January 30. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
The makers of ‘Raakaasaa’, a fantasy-comedy produced under Pink Elephant Pictures and Z Studios, have officially unveiled the film’s title announcement poster, confirming a worldwide theatrical release on April 3, 2026. Presented as A Niharika Konidela Production, the announcement formally introduces the identity of #PEP2 and signals its steady movement toward release. The title announcement poster establishes the film’s tonal world with striking clarity. Centred around the imagery of a solar eclipse emerging through dense, storm-laden clouds, the visual language leans decisively into myth and fantasy. The title ‘Raakaasaa’ appears sculpted in an organic, root-like form, glowing subtly from within, evoking folklore and elemental force. Notably, the poster avoids overt comedy cues, suggesting that humour in the film emerges organically from character and narrative rather than surface-level visual treatment. ‘Raakaasaa’ features an ensemble cast that includes Sangeeth Shobhan, Nayan Sarika, Vennela Kishore, Brahmaji, Tanikella Bharani, Ashish Vidyardhi, Getup Srinu, Sukwinder Singh, Annapurnamma, Anoopsingh takur, Ramana Bhargav, Vasu Inturi, Rohini (Jabardast), Rohan (#90’s), among others. The casting reflects a balance between familiar performers and character-driven roles, aligning with the film’s fantasy-comedy framework. Written and directed by Manasa Sharma, the film carries a unified creative vision, with Story, Screenplay, Dialogues, and Direction handled by her. Mahesh Uppala contributes as Additional Screenplay writer. The technical crew includes Anudeep Dev as music composer, Raju Edurolu as cinematographer, Anwar Ali as editor, and Vijay as action choreographer. Production design is led by Ramanjaneyulu, with Pulla Vishnu Vardhan serving as art director and Sandhya Sabbavarapu overseeing costume design. The project progressed through a major action-heavy schedule, choreographed by Vijay, who has earned strong industry recognition for his recent work on They Call Him OG. Following the completion of this action block, the team filmed comedy-driven sequences and other crucial narrative portions that strengthen the film’s humour and character dynamics. With these segments now completed, ‘Raakaasaa’ has wrapped the bulk of its shoot, with only one remaining song and approximately four days of talkie portions left to be filmed, placing the project firmly in its final stage of production. Produced by Niharika Konidela and Umesh Kumar Bansal, with Manyam Ramesh serving as Executive Producer, ‘Raakaasaa’ continues Niharika Konidela’s focus on youthful, content-driven cinema under the Pink Elephant Pictures banner. An established actress-turned-producer, she has been actively sharing glimpses from the sets through her social media platforms, offering audiences insight into the film’s progress. Following her mainstream production debut with Committee Kurrollu, ‘Raakaasaa’ represents a continuation of her evolving producer journey, with the banner also engaging audiences through behind-the-scenes updates on its official platforms. With its atmospheric title reveal, near-completion of principal photography, and a clearly defined fantasy-comedy approach, ‘Raakaasaa’ is steadily building anticipation. The project has also drawn increased attention within industry circles, with ZEE5 recently coming on board, reflecting confidence in the film’s concept and execution, while Z Studios continues its association, strengthening the film’s scale and visibility ahead of its April 3, 2026 theatrical release. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
Sree Vishnu, often called the King of Entertainment, has established himself as one of the most reliable actors in Telugu cinema through his steady success. Following a string of hit films, he is back with a unique character in his upcoming movie, Vishnu Vinyasam, directed by Yadhunaath Maruthi Rao. This time, he portrays a man with an extreme, almost crude, belief in astrology. The producers recently shared an intriguing title poster, which has now been followed by the release of a very catchy title song. Composed by Radhan, the track serves as a playful introduction to the protagonist. The lyrics by Ramjogayya Sastry cleverly describe his character as a devoted believer in stars and signs, highlighting how his obsession creates comical frustration for those around him. The singer, Sri Krishna, adds a fantastic vibe to the song with his lively vocals. Sree Vishnu looks incredibly energetic in this unconventional role, proving once again that his comic timing is top-notch. His chemistry with actor Satya and his funny antics perfectly fit the character's personality. Furthermore, his dance moves are both stylish and fitting for the beat; specifically, a unique "T-Shirt step" is already expected to become a massive trend on social media. With the release of this upbeat track, the filmmakers have successfully sparked curiosity about the movie's plot. Because the lead character is so distinct and different from the usual hero tropes, the film promises to be a hilarious experience for theater audiences. Produced by Sumanth Naidu, this comedy entertainer features Nayan Sarika as the leading lady. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఈకాలంలో పుట్టిన పిల్లలకు కాస్త నడవడం రాగానే పేరెంట్స్ అందరూ చేసేపని ఓ చిన్న సైకిల్ తెచ్చి ఇవ్వడం. ఆ సైకిల్ తో పిల్లలు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అయితే కొంచెం పెద్దయ్యాక ఇంకా ముఖ్యంగా స్కూల్ స్థాయి దాటిపోగానే వాళ్ల మనసంతా బైకులు, స్కూటీలు, గాడ్జెట్స్ చుట్టూ ఉంటుంది. కొందరు ఆసక్తి కొద్దీ గేమ్స్ వైపు వెళ్లి ఎన్నోరకాల ఆటల్లో మునిగి తేలిన సైకిల్ ను పక్కకు పెట్టేస్తారు. స్కూల్ దశ అయిపోగానే పక్కకు పెట్టేసే సైకిల్ ఇప్పటి కాలంలో మనుషుల ఆరోగ్యం పాలిట గొప్ప ఆప్షన్ అనేది వైద్యులు, ఫిట్నెస్ ట్రైనర్ ల అభిప్రాయం. అసలింతకూ అలా ఎందుకంటారు.  రెగులర్ ఎక్సర్సైజ్! ఉదయం లేచాక చాలామంది ఇంటి నుండి బయట పడితే తరువాత సాయంత్రం ఇంటికి చేరుతూ ఉంటారు. ఉద్యోగస్తులు అందరూ ఇంతే. అయితే ఉద్యోగం చేసేవాళ్ళు ఆఫీసుల్లో కూర్చునే చేస్తారు. ప్రస్తుతకాల ఉద్యోగాల్లో మానసిక ఒత్తిడి తప్ప శారీరక ఒత్తిడి ఉండదు అనేది వాస్తవం కదా. అయితే ఇంటి దగ్గర ఉండే కొద్దిసమయంలో ఏదైనా చిన్న చిన్న పనులకు బయటకు వెళ్లాలంటే పుటుక్కున బైక్ స్టార్ట్ చేస్తుంటారు అందరూ.  కనీసం కొత్తిమీర కట్టనొ, లేక వెల్లుల్లినో లేదా నిమ్మకాయలో ఇలాంటి చిన్న వాటికి కూడా బైకులు స్టార్ట్ చేస్తే మహానుభావులు ఉంటారు. బయట ఎండలు లేదా అర్జెన్సీ అనే కల్లబొల్లి కబుర్లు చెప్పేవాళ్లకు ఎలాంటి సందేహం లేకుండా సైకిల్ ఒక ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇంజిన్ ఖర్చు లేనే లేదు! బైకు తీస్తే బర్రున శబ్దం చేసుకుంటూ రాకెట్ లో పోవాలంటే అందులో పెట్రోల్ ఉండాలి. పెట్రోల్ లేని బండి మూలన పడి ఉండాల్సిందే. కనీసం దాన్ని తొక్కడానికి  కుదరదు, తోయడానికి మనిషికే కండలు ఉండాలి. పెరిగిపోతున్న పెట్రోల్ ఖర్చులతో మనిషి పాకెట్ కు చిల్లులే. కానీ మన సైకిల్ ఉందండి. కష్టపడి అప్పుడప్పుడు గాలి కొట్టుకుంటే చాలు, టైర్ లలా ఉన్న మనుషులను స్లిమ్ గా చేసేస్తుంది. ఎలాంటి పెట్రోల్ గోల లేకుండా హాయిగా జాగ్రత్తగా వాడుకుంటే జీవితకాలం సేవలు చేస్తుంది.  వేగవంతమైన జీవితంలో అన్ని తొందరగా అయిపోవాలనే ఆలోచనలో చాలామంది ఎంతో ఉపయోగకరమైన వస్తువులను కొన్నింటిని పక్కకు తోసేస్తున్నారు. తీరా ఆరోగ్యాలు నష్టపోతున్న సందర్భాలలో జిమ్ లలో చేరి అక్కడ సేమ్ సైక్లింగ్ వర్కౌట్ చేస్తుంటారు. అలా నెలకు వేలు తగలెయ్యడం కంటే ఒక సైకిల్ పెట్టుకుని కొన్ని పనులకు సైకిల్ ని ఉపయోగించడం మంచిది. బైకులు, స్కూటీల కంటే తక్కువ ఖర్చుతో, పెట్రోల్ గట్రా అదనపు ఖర్చు లేకుండా, రోజూ తగినంత వ్యాయామాన్ని అందించే సైకిల్ కు హైఫై కొడితే పోయేదేముంది?? శరీరంలో అదనపు కొవ్వు తప్ప. అయితే మోకాళ్ళ నొప్పులు సమస్యలు ఉన్నవాళ్లు వైద్యుల సలహా తీసుకోండి మరి. సైకిల్ పెడిల్ తొక్కుతూ కాస్త రౌండ్స్ కొట్టండి మరి.            ◆ వెంకటేష్ పువ్వాడ.
  టీ భారతీయులకు ఒక గొప్ప ఎమోషన్. ఇది వేరే దేశం నుండి మన దేశానికి వచ్చిన పానీయమే అయినా భారతీయులు టీ అంటే ప్రాణం ఇస్తారు.  సమయం పాడు లేకుండా టీ తాగే వారు ఉంటారు.  నలుగురు స్నేహితులను అయినా,  ఉద్యోగ చర్చలకు అయినా, పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడానికి అయినా ఛాయ్ సిట్టింగ్ ఒక మంచి మార్గం.  అయితే చాలా మందికి టీ తాగే సరైన మార్గం తెలియదు. టీ తాగడానికి కూడా ఒక పద్దతి ఉంది.  టీ కప్పు పట్టుకోవడం దగ్గర నుండి దాన్ని సిప్ చేయడం వరకు టీ వెనుక ఒక సంప్రదాయం,  దానికంటూ ఒక ప్రత్యేక గౌరవం ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద రెస్టారెంట్లు,  ఖరీదైన లైఫ్ గడిపే వ్యక్తుల దగ్గర టీ తాగాల్సి వస్తే ఇష్టమొచ్చినట్టు తాగకూడదు.  టీ తాగేటప్పుడు పాటించాల్సిన టిప్స్ ఏంటి తెలుసుకుంటే.. కొన్ని ప్రాంతాలలో కొన్ని పదార్థాలను ఇష్టమొచ్చినట్టు తినలేం, తాగలేం.  తప్పు పద్దతిలో తినడం, తాగడం చేస్తే ప్రాంతీయత పరంగా వారిని అవమానించినట్టు ఫీలవుతారు.  అందుకే ప్రతి పదార్థం ఎలా తినాలి, ఎలా తాగాలి అనేవి తెలుసుకోవాలి. వాటిలో టీ తాగడం కూడా ఒకటి.  టీ భారతీయుల పానీయం కాదు.. కాబట్టి దాన్ని భారతీయులు వారికి నచ్చిన పద్దతిలో నచ్చినట్టు తాగేస్తారు. టీ తాగేటప్పుడు టీ కప్పు హ్యాండిల్ ను ఎల్లప్పుడూ టీ కప్పు సాసర్ పై ఉంచాలి. అది కూడా టీ కప్పు హ్యాండిల్ గడియారంలో  3 సంఖ్య ఎక్కడ ఉంటుందో ఆ కోణంలో ఉండాలి.  ఇక ఎడమ చేతితో టీ తాగేవారు అయితే టీ కప్పు హ్యాండిల్ గడియారంలో 9 సంఖ్య ఎక్కడ ఉంటుందో ఆ కోణం దగ్గర ఉండాలి. ఇలా ఉంటే టీ కప్పు అందుకోవడం సులభంగా ఉంటుంది. టీ కప్పు హ్యాండిల్ పట్టుకోవడానికి ఎప్పుడు చూపుడు వేలు, మధ్యవేలు,  బొటన వేలును ఉపయోగించాలి.  ఉంగరపు వేలు,  చిటికెన వేలును సపోర్ట్ కోసం ఉపయోగించాలి. టీ కప్పుతో పాటు చెంచా ఉంచితే దాన్ని కప్పు వెనుక భాగంలో ఉంచాలి.  కప్పులో ఎప్పుడూ చెంచాను ఉంచకూడదు.  టీలో పాలు లేదా పంచదార వేసుకున్నప్పుడు చెంచాను  కప్పు లో వృత్తాకారం లో తిప్పకూడదు.  అర్థవృత్తాకారంలో మాత్రమే అది కూడా ముందుకు వెనక్కు తిప్పాలి. శబ్దం రాకుండా తిప్పాలి. పంచదారను టీలో వేసుకుని చెంచాతో కలుపుతూ సుడిగుండం సృష్టించినట్టు తిప్పకూడదు.  అలాగే చెంచాను కప్పు మీద గట్టిగా కొట్టడం లాంటివి కూడా చేయకూడదు. టీని కలిపిన తరువాత చెంచాకు అంటుకున్న టీని నాకడం చేయకూడదు.  చెంచాను టీ కప్పు వెనుక భాగంలో పెట్టేయాలి. టీని కప్పులో సొంతంగా పోసుకునే పరిస్థితి ఉన్నప్పుడు కప్పు నిండుగా టీ పోసుకోకూడదు. ఎప్పుడూ కప్పులో 75శాతం మాత్రమే టీతో నింపాలి. 25శాతం ఖాళీగా ఉంచాలి.                                                *రూపశ్రీ.
  మనిషి జీవితంలో ఆదాయం రావడానికి ఏదో ఒక ఉపాధి తప్పనిసరిగా ఉండాలి.  కొందరు ఒకరి కింద పనిచేస్తారు. మరికొందరు తమకు తామే ఉపాధి సృష్టించుకుంటారు.  ఇలా తమకు తాము ఉపాధి సృష్టించుకునేవారు వ్యాపారస్తులు అవుతారు. వ్యాపారం బాగా ఎదిగితే వీరే కొందరికి తమ కింద ఉపాధి కల్పిస్తారు.  అయితే వ్యాపారం మొదలుపెట్టిన ప్రతి ఒక్కరు సక్సెస్ కాలేరు. దీనికి కారణం  వ్యాపారానికి సంబంధించి కొన్ని విషయాలు తెలియకపోవడమే.. చేతిలో డబ్బు ఉంటే చాలు వ్యాపారం చేసేయవచ్చు అని కొందరు అనుకుంటారు. కానీ వ్యాపారం చేయాలన్నా, అందులో విజయం సాధించాలన్నా జ్ఞానం చాలా అవసరం. వ్యాపారంలో విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందేమిటో తెలుసుకుంటే.. కష్టపడి పనిచేయడం.. వ్యాపారంలో విజయం సాధించాలంటే కష్టపడి పనిచేయడం ఎప్పుడూ అవసరం.  సోమరితనంతో,  నిర్లక్ష్యంగా పనిచేస్తే ఎప్పటికీ విజయం సాధించలేరు.  తగినంత సమయం ఉన్నప్పుడు లక్ష్యాలను చేరుకోవడానికి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే అది విజయానికి బదులుగా అపజయాన్ని మిగులుస్తుంది. సానుకూల ఆలోచన.. పాజిటివ్  ఆలోచన,  ఆత్మవిశ్వాసం విజయానికి కీలకం. తమ మీద తాము నమ్మకం పెట్టుకోవడం ద్వారా తాము చేసే పనులలో  సానుకూల ఫలితాలను పొందగలుగుతారు. ప్రతికూల ఆలోచనలు  మనసులోకి ఎప్పుడూ రానివ్వకూడదు. ఇది  ఆత్మవిశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. సత్సంబంధాలు..  స్వంత వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు ప్రజలతో మంచి సంబంధాలను కొనసాగించాలి. ఇది  వ్యాపారానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎల్లప్పుడూ  కస్టమర్లకు ప్రాధాన్యత ఇవ్వాలి.  కస్టమర్ల సాటిసిఫ్యాక్షన్ ను దృష్టిలో ఉంచుకోవాలి. దానికి తగినట్టు ప్రణాళికలు మారుస్తూ ఉండాలి. రిస్క్.. కొత్త వ్యాపార అవకాశాలను త్వరగా గుర్తించి, వాటిలో పెట్టుబడి పెట్టడానికి భయపడకూడదు.. అయితే, ఏదైనా రిస్క్ తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. రిస్క్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అన్ని అంశాలను పరిగణిలోకి తీసుకోవాలి. నిజాయితీ.. వ్యాపారస్తులకు ఉండాల్సిన  ఒక ముఖ్యమైన లక్షణం నిజాయితీ.  నిజాయితీగా వ్యవహరించడం వల్ల  ఖ్యాతి,  వ్యాపారం మెరుగుపడుతుంది.  దీని ద్వారా  గొప్ప లక్ష్యాలను సాధించవచ్చు. కస్టమర్‌లు,  ఉద్యోగుల మధ్య నమ్మకమైన వాతావరణాన్ని నిర్మించాలి. ఇది  వ్యాపారాన్ని పెంచుతుంది. దృఢ సంకల్పం.. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు, ప్రతి ఒక్కరూ ఎప్పుడు విజయం సాధిస్తామో అని ఆలోచిస్తారు. విజయం రాత్రికి రాత్రే రాదు. ఓపికగా ఉండి ప్రయత్నిస్తూ ఉండాలి.  వ్యాపారం అంటే  విజయం మాత్రమే కాదు.. అందులో విజయం ఉంటుంది,  వైఫల్యం కూడా ఉంటుంది. కాబట్టి  వైఫల్యాలు ఎదురైతే వాటి  నుండి నేర్చుకుని ముందుకు సాగండి. విజయం సాధిస్తే మళ్లీ కొత్త మార్గాలను జాగ్రత్తగా అన్వేషిస్తూ సాగాలి. లీడర్షిప్ స్కిల్స్.. వ్యాపారం చేయడానికి న్యాయకత్వ నైపుణ్యాలు ఉండాలి.  వాటిని మెరుగుపరుచుకోవాలి.  ఎందుకంటే తన కింద వారిని నడిపించడానికి అవి సహాయపడతాయి.  సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. పై విషయాలను అన్వయించుకోవడం ద్వారా  వ్యాపారంలో విజయం సాధించవచ్చు. వ్యాపారాన్ని  కొత్త శిఖరాలకు తీసుకెళ్లవచ్చు.  జీవితంలో కీర్తిని, ప్రతిష్టను కూడా సాధించవచ్చు.                                        *రూపశ్రీ.
చలికాలంలో చలి సహజమే.. కానీ కొందరికి సాధారణం కంటే ఎక్కువ చలి పెడుతూ ఉంటుంది. ఇంత చలి పెడుతుంటే ఇతరులు ఎలా భరిస్తున్నారో ఏంటో అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది.  మందం పాటి దుస్తులు దరించినా,  స్వెట్టర్లు వేసుకున్నా కూడా కొందరికి లోపల వణుకు పుడుతూనే ఉంటుంది.  అయితే ఇది చలి కారణంగా వచ్చే చలి కాదని, దీని వెనుక వేరే కారణాలు ఉంటాయని అంటున్నారు  వైద్యులు.  అసలు కొందరిలో అధికంగా చలి ఎందుకు పెడుతుంది? శరీరంలో కలిగే మార్పులు ఏంటి? తెలుసుకుంటే.. మానవ శరీరంలో  అంతర్గత ఉష్ణోగ్రతను నిర్వహించడానికి సంక్లిష్టమైన థర్మోర్గ్యులేషన్ వ్యవస్థను ఉపయోగించబడుతుంది. ఇది ప్రతి శరీరం దానికదే నిర్వహించుకుంటుంది. దీనికి నిర్దిష్ట విటమిన్లు,  ఖనిజాలు అవసరం. శరీరంలో ఈ పోషకాలు లోపించినప్పుడు రక్త ప్రసరణ ప్రభావితమవుతుంది,  జీవక్రియ మందగిస్తుంది. దీని వలన శరీరం తగినంత వేడిని ఉత్పత్తి చేయకపోవడం జరిగవచ్చు.  ఇలా జరిగితే మనిషిలో  సాధారణం కంటే చల్లగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇది చాలా వరకు రక్తహీనత లేదా థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో ఎక్కువగా ఉంటుంది. అందుకే చలికాలంలో వేడిగా ఉండటానికి ఇంటి వాతావరణాన్ని వెచ్చగా ఉంచడం కంటే తినే ఆహారం విషయంలో మార్పులు చేసుకోవడం మంచిదని అంటున్నారు వైద్యులు. అంతేకాదు.. కొన్ని పోషకాలు కూడా చలి ఎక్కువ కలగడానికి కారణం అవుతాయట. ఐరన్,  విటమిన్-బి12 లోపం.. చాలా చల్లగా అనిపించడానికి అత్యంత సాధారణ కారణం ఐరన్  లోపమట. ఐరన్ బాగుంటేనే  హిమోగ్లోబిన్‌ మెరుగ్గా ఉంటుంది. ఇది కణాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళుతుంది. అదే ఐరన్ లోపిస్తే ఆక్సిజన్ సరఫరా లోపించి చలి పెరగడానికి దారి తీస్తుంది.   విటమిన్ బి12 లోపం నరాలను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల చేతులు,  కాళ్ళు తిమ్మిరిగా ఉండటం,  చల్లగా ఉండటం జరుగుతుంది. మెగ్నీషియం,  ఫోలేట్ కూడా కండరాల సంకోచం,  శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి అవసరమైన శక్తిని  ఉత్పత్తి చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. చలి ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటే.. అకస్మాత్తుగా చాలా చలిగా అనిపిస్తే కాస్త  వ్యాయామం చేయడం మంచిది.  లేదంటే శరీరాన్ని  సాగదీయడం కూడా మంచి ఫలితం ఇస్తుంది. శారీరక శ్రమ రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది శరీరాన్ని వెంటనే వేడి చేస్తుంది. అలాగే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు లేదా అల్లం టీ తాగవచ్చు. అయితే అల్లం టీ ఖాళీ కడుపుతో తాగకూడదు. ఆహారంలో మార్పులు.. శరీరం వెచ్చగా ఉండటానికి  ఆహారంలో బెల్లం, వేరుశనగ, ఖర్జూరం,  మిల్లెట్ వంటి వెచ్చని ఆహారాలను చేర్చుకోవాలి. వెల్లుల్లి,  అల్లం తీసుకోవడం పెంచాలి.  ఇవి రక్త నాళాలను విస్తరిస్తాయి,  రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి.  ఆహారం తీసుకున్నప్పటికీ సమస్య కొనసాగితే, వైద్యుడిని సంప్రదించి,  వైద్యుల సలహా మేరకు మందులు లేదా చికిత్స తీసుకోవడం మంచిది.                                   *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  
అల్పాహారం ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉదయాన్నే తీసుకునే ఆహారం.  ప్రతి రోజూ ఉదయం 8 నుండి 9 గంటలలోపు అల్పాహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని, రోజంతా చురుగ్గా ఉండటానికి సహాయపడుతుందని వైద్యులు, ఆహార నిపుణులు చెబుతుంటారు.  అందుకే అల్పాహారం ఆరోగ్యకరంగా, పోషకాలతో నిండి ఉండాలని కూడా చెబుతారు.  అందరూ ఒకే విధమైన బ్రేక్పాస్ట్ తీసుకోరు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఆహారం బ్రేక్పాస్ట్ లో తీసుకోవడం అలవాటుగా ఉంటుంది.  అయితే బ్రేక్పాస్ట్ విషయంలో చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల టోటల్ గా బాడీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుందని ఆహార నిపుణులు అంటున్నారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని కూడా చెబుతున్నారు. ఇంతకీ బ్రేక్ పాస్ట్ విషయంలో అస్సలు చేయకూడని మిస్టేక్స్ ఏంటి? అసలు బ్రేక్పాస్ట్ చేయడం వల్ల జరిగే మేలు ఏంటి? తెలుసుకుంటే.. బ్రేక్పాస్ట్ ప్రయోజనం.. అల్పాహారం లేదా బ్రేక్పాస్ట్  రోజులో మొదటగా తీసుకునే ఆహారం.  ఇది రోజంతా శక్తివంతంగా చురుగ్గా ఉండేందుకు సహాయపడుతుంది. జీవక్తియ రోజంతా చురుగ్గా ఉండేందుకు సహాయపడుతుంది. ఈ కారణంగా ఉదయాన్నే సరైన బ్రేక్పాస్ట్ చేయడం కూడా చాలా ముఖ్యంగా పరిగణించబడుతుంది. బ్రేక్పాస్ట్ విషయంలో చేసే తప్పులు.. ఖాళీ కడుపుతో టీ.. ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంటే ఇది చాలా పెద్ద మిస్టేక్ అంటున్నారు వైద్యులు.  ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఆమ్లత్వం పెరుగుతుంది కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయని, డీహైడ్రేషన్‌కు కారణమవుతుందని,  ఆకలి కూడా  తగ్గుతుందని వైద్యులు అంటున్నారు. చపాతీ, పరాటా.. మీరు ప్రతిరోజూ బ్రేక్పాస్ లో చపాతీలు లేదా  పరాటాలు  తింటే  ఉదయాన్నే ఎక్కువ  కార్బోహైడ్రేట్లను తీసుకోవడానికి కారణం అవుతుంది. ఇది ప్రోటీన్ లోపానికి కూడా దారితీస్తుంది. ఉదయాన్నే చపాతీలు లేదా పరాటాలు తినడం వల్ల  కడుపు నిండినట్టు అనిపిస్తుంది  కానీ ఇది ఇన్సులిన్ స్పైక్‌కు కారణమవుతుందట.  మధ్యాహ్నం  తీసుకునే ఆహారం వల్ల  మరింత హెవీగా  మారుతుందని ఇది శరీరాన్ని బరువుగా ,  పనుల మీద ఆసక్తి మరల్చేలా మారుస్తుందని చెబుతున్నారు. ఇన్స్టంట్ ఓట్స్..  అల్పాహారంలో చాలామంది  ఇన్‌స్టంట్ ఓట్స్ తింటుంటారు.  ఇది చాలా ఆరోగ్యకరమని కూడా అనుకుంటారు. ఇందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది చాలా మంచిదని కూడా అనుకుంటారు.  కానీ ఈ ఓట్స్  అధికంగా ప్రాసెస్ చేసి ఉంటారు. ఇది చక్కెర స్థాయిలను పెంచుతుంది. బరువు తగ్గడానికి దీనిని తినకూడదని వైద్యులు సలహా ఇస్తున్నారు. టీ తో బిస్కెట్,  జ్యూస్.. ఉదయాన్నే  టీతో పాటు బిస్కెట్లు లేదా జ్యూస్‌లు తీసుకోవడం చాలా మందికి అలవాటు.  దీన్నే బ్రేక్పాస్ట్ గా సరిపేట్టేస్తుంటారు కూడా. అయితే వీటిలో శుద్ధి చేసిన పిండి, చక్కెర,  ట్రాన్స్ ఫ్యాట్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్ స్పైక్‌లకు కారణమవుతాయి,  ఊబకాయాన్ని పెంచుతాయి. బ్రేక్పాస్ట్ స్కిప్ చేస్తే.. చాలామంది డైటింగ్ పేరుతో ఉదయాన్నే బ్రేక్పాస్ట్ స్కిప్ చేస్తుంటారు.  బరువు తగ్గాలనే తాపత్రయంతో బ్రేక్పాస్ట్ స్కిప్ చేసి నేరుగా  బోజనం చేస్తుంటారు.  కానీ ఇది సరైన పద్దతి కాదని వైద్యులు చెబుతున్నారు.  బ్రేక్పాస్ట్ స్కిప్ చేస్తే జీవక్రియ మందగిస్తుందట. ఉదయం బ్రేక్పాస్ట్ స్కిప్ చేసే చాలామంది ఉదయం సమయంలో బిస్కెట్లు, జంగ్ ఫుడ్స్, ఇన్స్టంట్ డ్రింక్స్, ఇన్స్టంట్ ఫుడ్స్ తింటుంటారు. పైగా అవి చాలా లైట్ ఫుడ్స్ అని కూడా అనుకుంటారు.  ఇది చాలా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.                                     *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఆహారం శరీరానికి ఎంతో అవసరం.  నేటి ఉరుకుల పరుగుల జీవితాలలో ఆహారం వండుకోవడానికి సమయం సరిపోక ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు.  ఇంట్లోనూ,  బయటా రెండు చోట్లా ఒత్తిడితో కూడుకున్న పనులు.  సమయాభావం కారణంగా చాలా సార్లు వండుకోవడం కష్టంగా మారుతుంది.  ఇలాంటి సందర్బాలలో బయట ఆహారం తినాలని  అనుకున్నా అవి ఖర్చుతో కూడుకుని ఉండటం తో వాటి వైపు వెళ్లాలన్నా కూడా భయపడతారు. ఇలాంటి వాళ్లను టార్గెట్ చేసుకుని వచ్చినవే ప్యాకేజ్డ్ ఫుడ్స్.. వీటిలో రెడీ టూ యూజ్  ఫుడ్స్ చాలా ఉంటున్నాయి.  సింపుల్ గా వేడి నీరు పోయడం లేదా వేడి చేయడం ద్వారా నిమిషాలలో ఆహారం రెడీ అవుతుంది.  పైగా మంచి మసాలాలతో రుచిగా ఉండటంతో రెడీ టూ యూజ్  పుడ్స్ కు మంచి డిమాండ్ కూడా ఉంది.  చిన్న పిల్లలు,  యువత ఎక్కువగా ఈ రెడీ టూ యూజ్ ఫుడ్స్ కు ప్రాధాన్యత ఇస్తుంటారు.  అయితే ఈ ఫుడ్స్ గురించి చాలామందికి తెలియని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అసలు రెడీ టు యూజ్ ఫుడ్స్ అంత రుచిగా ఎందుకుంటాయి? వీటిని తినడం వల్ల కలిగే ప్రమాదం ఏంటి? తెలుసుకుంటే.. రెడీ టూ యూజ్ ఫుడ్స్.. అల్యూమినియం సాల్ట్.. సాధారణంగా రెఢీ టూ యూజ్ ఫుడ్స్ అన్నీ ప్యాక్డ్ ఫుడ్స్ గానే ఉంటాయి. ఈ ప్యాక్స్ లోని ఆహారాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేలా వాటిలో హానికర రసాయనాలు కలుపుతారు. మరీ ముఖ్యంగా నిత్యం ఇంట్లో ఉపయోగించే కారం, పసుపు, మసాలలో అల్యూమినియం సాల్ట్స్ ను కలుపుతున్నారు. వీటివల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని,  వీటిని వాడటం వల్ల చిన్నపిల్లలు , వృద్దులు,  అప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రెడీ టు యూజ్ ఫుడ్స్ తో వచ్చే వ్యాధులు.. రెడీ టూ యూజ్ ఫుడ్స్ లో ఆలమ్ స్పైస్ కలుపుతారు.  ఇది కలిపిన మసాలాలు ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతిని నరాల బలహీనత, మతిమరుపు లాంటి సమస్యలు వస్తున్నాయి.  50ఏళ్లు దాటిన వారిలో మతిమరుపు రావడం ఈ ఆలమ్ స్పైస్ వాడటం వల్లే అని స్పష్టం చేస్తున్నారు. అసలేంటీ ఆలమ్ స్పైస్..   అల్యూమినియం సాల్ట్ నే ఆలమ్ స్పైస్ అని అంటారు. అల్యూమినియం పొటాషియం సల్పేట్ నే అల్యూమినియం సాల్ట్ అని అంటారు.  మసాలా దినుసులు పాడవకుండా దీన్ని కలుపుతుంటారు. దీని వల్ల మసాలా దినులు ఎక్కువ కాలం పాటూ రుచి,  స్వభావం,  రంగు  మారకుండా పురుగులు పట్టకుండా, అలాగే మసాలాలు ఉండలు కట్టకుండా సహాయపడుతుంది. ప్యాకింగ్ ఫుడ్స్ లో దీన్ని మోతాదుకు మించి వాడుతుండటం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి.  అందుకే వీలైనంత వరకు మసాలా పొడులను కూడా బయటి నుండి తెచ్చుకోవడం కంటే.. ఇంట్లోనే తయారు చేసుకుని వాడటం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...