LATEST NEWS
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సరికొత్త పుంతలు తొక్కుతోందని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన   అధికారిక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన లోకేష్.. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని  డబుల్ ఇంజిన్ సర్కార్  వల్లనే రాష్ట్రానికి మెగా పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన వేగంగా సాధ్యమవుతున్నాయన్నారు.  ఐదేళ్ల  వైసీపీ పాలనలో అమరావతితో పాటు రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని విమర్శించిన ఆయన  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో  కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అమరావతి పనులను శరవేగంగా పరిగెత్తిస్తున్నదన్నారు. అమరావతిని కేవలం భవనాల నగరంగానే కాకుండా, అంతర్జాతీయ స్థాయి ఎయిర్, రోడ్, రైల్ కనెక్టివిటీ కలిగిన గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమనిఉద్ఘాటించారు. గతంలో భారత  రైల్వే రంగంలో భద్రత, పరిశుభ్రత లోపించేవని, కానీ ప్రధాని మోడీ ముందుచూపు వల్ల దేశంలో వందే భారత్, బుల్లెట్ రైళ్లు, 'కవచ్' ఆటోమేటిక్ ప్రొటెక్షన్ టెక్నాలజీతో కూడిన సరికొత్త రైల్వే విప్లవం నడుస్తోందని లోకేష్ కొనియాడారు. దశాబ్దాల నాటి ఆంధ్రుల కల అయిన విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్‌ను ప్రధాని మోడీ వెంటనే మంజూరు చేసి కార్యరూపంలోకి తెచ్చారని, ఇందుకు రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేకంగా మాట్లాడిన లోకేష్.. మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధి కోసం కేంద్ర పర్యాటక శాఖ ద్వారా ' ప్రసాద్' పథకం కింద నిధులు రాబట్టేందుకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక చొరవ చూపారని, ఎంపీ, ఎమ్మెల్యే కలిసి కట్టుగా పని చేస్తే నియోజకవర్గం ఎలా మారుతుందో చెప్పడానికి మంగళగిరి ఒక ఉదాహరణగా నిలిచిందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల బండిలా ముందుకు తీసుకెళ్తున్నామని  వివరించారు. ఒక రూపాయి ఆదాయానికి ఒక రూపాయి నలభై పైసల ఖర్చు ఉన్నప్పటికీ.. సూపర్ సిక్స్ హామీలైన తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, డీఎస్సీ, మెగా జాబ్ క్యాలెండర్ వంటి ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. గతంలో పెట్టుబడులు లేక ఏపీ తీవ్రంగా నష్టపోయిందనీ..  కూటమి ప్రభుత్వం వచ్చాక రాయల్ ఎన్‌ఫీల్డ్, గూగుల్ వంటి గ్లోబల్ సంస్థలతో పాటు ఫైటర్ జెట్ తయారు చేసే  అమ్కా  వంటి భారీ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌కు క్యూ కడుతున్నాయన్నారు. రాబోయే మూడేళ్లలో రాష్ట్ర నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాల వైపు చూడాల్సిన అవసరం ఉండదని, పొరుగు రాష్ట్రాల యువతే ఏపీ వైపు చూసేలా పారిశ్రామిక విప్లవాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఒకప్పుడు తాను చంద్రబాబు నాయుడు గారి కుప్పం నియోజకవర్గ అభివృద్ధిని చూసి నేర్చుకునేవాడినని, కానీ ఇప్పుడు కుప్పం నేతలు కూడా మంగళగిరిని చూసి నేర్చుకునే స్థాయికి ఇక్కడి అభివృద్ధిని తీసుకెళ్లామని సగర్వంగా ప్రకటించారు. రాబోయే రోజుల్లో మంగళగిరిని ఐటీ,  పారిశ్రామిక హబ్‌గా మారుస్తామని లోకేష్ స్పష్టం చేశారు. Nara Lokesh Mangalagiri, Amaravati Capital Development, AP Double Engine Government, Andhra Pradesh Mega Investments South Coast Railway Zone Vizag
తెలుగువన్ ప్రత్యేకం ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ  హయాంలో రాష్ట్రం నుంచి తరలిపోయిన ప్రముఖ పారిశ్రామిక సంస్థలు ఇప్పుడు పొరుగు రాష్ట్రాలలో   విజయవంతంగా రాణిస్తుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పరిశ్రమలు తమంతట తాముగా వెళ్ళిపోలేదని, నాటి ప్రభుత్వ ఒత్తిళ్లు, బెదిరింపులు,  వాటా ఇస్తేనే వ్యాపారం అనే  దౌర్భాగ్య విధానాల వల్లే పారిశ్రామికవేత్తలు దండం పెట్టి మరీ ఏపీని వదిలి పారిపోయారని తెలుగువన్ ప్రత్యేక ఇంటర్వ్యూలో సీనియర్ విశ్లేషకుడు సువేరా అన్నారు. ఇందుకు సంబంధించి ఆయన  సంచలన నిజాలను వెల్లడించారు. తాజాగా తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో అమరరాజా బ్యాటరీస్ గ్లోబల్ కర్మాగారం ప్రారంభోత్సవ నేపథ్యంలో ఏపీ పారిశ్రామిక విధ్వంసంపై ఆయన మాట్లాడారు.  వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన  ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.  ఒక గ్లోబల్ టెక్నాలజీ కలిగిన అమరరాజా సంస్థను బెదిరించడం వల్లే వారు వేల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తరలించారని, నిన్న దివిటిపల్లిలో జరిగిన కనులపండువ లాంటి ప్రారంభోత్సవమే దీనికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. ఏపీలో ఉపాధి కోల్పోయిన యువత తరపున నారా లోకేష్ క్షమాపణలు చెప్పడం నాటి దుస్థితికి అద్దం పడుతోందన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని పక్కనబెట్టి..  కేవలం తమ సొంత బినామీ కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకే వైఎస్ కుటుంబం మొదటి నుంచి ప్రయత్నించిందని   ధ్వజమెత్తారు. కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టుల నుంచి మచిలీపట్నం పోర్టు వరకు బలవంతపు ల్యాండ్ పూలింగ్స్, అధికార దుర్వినియోగంతో చెరబట్టారని ఆరోపించారు. పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురిచేసే ఈ చెంబల్ వ్యాలీ బందిపోటు సంస్కృతి వల్ల ఏపీ బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయంగా దెబ్బతిన్నదని, కేవలం లంపెన్ శక్తులను, అసాంఘిక మూలకాలను ప్రోత్సహిస్తూ వ్యవస్థలను సర్వనాశనం చేశారని సువేరా విశ్లేషించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో ఏపీ పాలన తిరిగి గాడిలో పడుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దశాబ్దాల పారిశ్రామిక అనుభవం, మంత్రి నారా లోకేష్ నిరంతర శ్రమతో మళ్లీ పెట్టుబడులు వరదలా వస్తున్నాయన్న సువేరా.. అనకాపల్లి, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో విదేశీ పెట్టుబడులు వస్తుండటం శుభపరిణామన్నారు. పొరుగు రాష్ట్రాలతో ఆరోగ్యకరమైన పోటీని ఎదుర్కొంటూ ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, భవిష్యత్ తరాల మనుగడ కోసం ఇలాంటి పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని కథనాన్ని ముగించారు. Why Industries Left Andhra Pradesh,  Suvera Analysis,  TeluguOne,  AmarRaja Batteries,  Chandrababu Naidu Investments AP, AP Past Government Industry Scams
హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక టెలివిజన్ చర్చా కార్యక్రమంలో తీవ్ర కలకలం రేగింది. రాజకీయ, మతపరమైన అంశాలపై జరిగిన ఈ లైవ్ డిబేట్‌లో ఒక ప్రతినిధి మరో ప్యానలిస్టుపై భౌతిక దాడికి దిగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ కటౌట్‌కు సంబంధించిన వివాదమే చివరకు ఈ ఘర్షణకు దారితీసింది. దీనిపై ప్రముఖ విశ్లేషకుడు భరద్వాజ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. మతం పేరుతో జరుగుతున్న రచ్చకు ఇది తాజా ఉదాహరణ అన్నారు. అసలు ఇంతకీ  టీవీ లైవ్ డిబేట్ లో భౌతిక దాడికి దారి తీసిన కారణం ఏంటంటే.. ఇటీవల హైదరాబాద్‌కు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన సందర్భంగా నగరంలో భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. అందులో ఒక కటౌట్‌లో శ్రీమహావిష్ణువు విశ్వరూప ప్రదర్శన చిత్రంలో విష్ణుమూర్తి ముఖ స్థానంలో ప్రధాని మోదీ ముఖాన్ని మార్ఫింగ్ చేసి పెట్టారు. దీనిపై హిందూ ధర్మ ప్రచారకుడు, సామాజిక విశ్లేషకుడు రమణమూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దైవ సమానమైన విశ్వరూప స్థానంలో ఒక రాజకీయ నాయకుడి ఫోటో పెట్టడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆయన పేర్కొన్నారు. రమణమూర్తి చేసిన ఈ వ్యాఖ్యలపై డిబేట్‌లో పాల్గొన్న  ధర్మవీర్  సంస్థ ప్రతినిధి కశ్యప్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, హిందుత్వ, మోదీ అన్నీ ఒకటేనని, ఇందులో తప్పేముందని ఆయన వాదించారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య వాడివేడి చర్చ నడిచింది. రమణమూర్తి శాంతంగా సమాధానం ఇస్తున్నప్పటికీ, కశ్యప్ రెడ్డి సహనం కోల్పోయి ఒక్కసారిగా తన చెప్పు తీసుకుని రమణమూర్తిపై దాడికి తెగబడ్డారు. ఈ ఆకస్మిక దాడితో టీవీ స్టూడియోలో ఉన్న యాంకర్లు, ఛానల్ సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే జోక్యం చేసుకుని కశ్యప్ రెడ్డిని పక్కకు లాగి, అక్కడి నుంచి పంపించి వేశారు. అవమానానికి గురైన రమణమూర్తి అనంతరం స్టూడియో వెలుపలికి వచ్చి మీడియా ముందు తన ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో, అదీ టీవీ చర్చల్లో ఇలాంటి భౌతిక దాడులకు దిగడం అత్యంత హేయమైన చర్యని ఆయన మండిపడ్డారు. రమరమూర్తి వ్యతిరేకించింది హిందుత్వనే కానీ హిందూ మతానని కాదని భరద్వాజ విశ్లేషించారు.  రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ,  చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే  హిందుత్వ  వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే  ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.  సామాజిక మాధ్యమాలు, టీవీ చర్చల్లో ఇటీవల కాలంలో కొందరు నాయకులు, సంస్థల ప్రతినిధుల భాష, ప్రవర్తన పూర్తిగా అదుపు తప్పుతోందని, కేవలం రాజకీయ పార్టీల మెప్పు కోసమో, లేదా ఆర్థిక లబ్ధి కోసమో కొందరు ఇటువంటి వివాదాలను సృష్టిస్తూ సమాజంలో అలజడి రేపుతున్నారని అభిప్రాయపడ్డారు.  ఇలాంటి దాడులు జరిగినప్పుడు సదరు రాజకీయ శ్రేణులు గానీ, అనుబంధ సంస్థలు గానీ మౌనంగా ఉండటం మరిన్ని దాడులకు ఉసిగొల్పినట్లవుతుందని హెచ్చరించారు. మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి అసలు ప్రజా సమస్యలైన నిరుద్యోగం, ఫీజు రీయింబర్స్‌మెంట్, పోలవరం నిధులు, ఆరోగ్యశ్రీ వంటి కీలక అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం జరుగుతోందన్నారు. Kashyap Reddy Attacks Ramana Murthy, TV Debate Slipper Attack Hyderabad,  Modi Vishwaroopam Cutout Controversy, Dharmaveer Kashyap Reddy, Tone News,  Tone News Debate Attack Case
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  ఆదివారం (జులై 20)  తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు. ఇటీవల ఆయన భుజానికి   శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఆ సర్జరీ తరువాత   పవన్ కళ్యాణ్ చేస్తున్న తొలి పర్యటన ఇదే కావడం గమనార్హం. ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.  సర్జరీ  అనంతరం  పవన్ కళ్యాణ్ చేపడుతున్న  తొలి అధికారిక కార్యక్రమం ఈ పర్యటన సందర్భంగా పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని స్వయంగా  పరిశీలించనున్నారు.   50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న  పలు కొత్త రోడ్ల నిర్మాణ పనులకు, మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలకు ఆయన   శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా స్థానిక అధికారులతో ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు. ఇందులో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తాగునీటి సమస్యలు, డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణపై చర్చించనున్నారు. పవన్ కళ్యాణ్ తన పర్యటనలో దాదాపు 3 గంటల పాటు స్థానిక ప్రజలు, జనసేన కార్యకర్తలతో నేరుగా ముఖాముఖి మాట్లాడనున్నారు. ప్రజల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నారు.  deputy cm pawan kalyan, janasena party, pawan kalyan surgery updates, pithapuram development works, ap politics latest
  మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ జాతీయ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో తన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించనున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి  హోంమంత్రి అమిత్ షా కు ఉప ప్రధానిగా ప్రమోషన్ దక్కనుందంటూ వైసీపీ మాజీ నాయకుడు,  రాజ్యసభ మాజీ సభ్యుడు సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు  హాట్ టాపిక్ గా మారింది.  కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.   కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షాకు డిప్యూటీ పీఎం పదవి దక్కనుందంటూ వస్తున్న కథనాలను సమర్ధిస్తూ..  రాబోయే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో అమిత్ షాను ఉప ప్రధానిగా మోడీ నియమించనున్నట్లు విజయసాయి పేర్కొన్నారు.  దేశ రాజకీయాల్లో అత్యంత నిర్ణయాత్మకమైన, పాత్ర పోషిస్తున్న అమిత్ షాకు ఉప ప్రధానిగా ప్రమోషన్ రావడం సముచితమని పేర్కొన్న విజయసాయి..  దేశ ప్రయోజనాల కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో అమిత్ షా వెనుకాడరనీ, అందువల్లే ఉప ప్రధాని పదవికి ఆయన అన్ని విధాలా అర్హులని  పేర్కొన్నారు.  భారత రాజకీయ చరిత్రలో గతంలో అత్యంత ప్రభావవంతమైన నాయకులు ఉప ప్రధాని బాధ్యతలను స్వీకరించిన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి   ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పదవితో అమిత్ షాకు దక్కబోయే స్థానాన్ని పోల్చారు. గతంలో సర్దార్ పటేల్ అలంకరించిన ఈ ఉన్నతమైన డిప్యూటీ పీఎం హోదాను అమిత్ షాకు కేటాయించడం  సముచితంగా ఉంటుందని పేర్కొన్న విజయసాయి.. , ముందుముందు  అమిత్ షా చేపట్టనున్న ఈ కొత్త బాధ్యతకు మద్దతు తెలుపుతూ అభినందనలు తెలిపారు.   అమిత్ షా ఉప ప్రధాని అంటూ ఎటువంటి అధికారిక ప్రకటనా రాకముందే..   విజయసాయి రెడ్డి వంటి సీనియర్ పార్లమెంటేరియన్ ఈ అంశంపై బహిరంగంగా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.   భారతదేశంలో 2014 నుంచి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడు విడతల్లోనూ డిప్యూటీ పీఎం పదవిని ఎవరికీ ఇవ్వలేదు. గతంలో బీజేపీ హయాంలోనే అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో లాల్ కృష్ణ అద్వానీ ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ ఆ హోదాను ఎవరికీ కేటాయించలేదు.  ఈ నేపథ్యంలో అమిత్ షాకు  ఉప ప్రధాని పదవి  అప్పగించడం ద్వారా, భవిష్యత్తులో ప్రధాని పదవిని చేపట్టబోయేది అమిత్ షాయే అన్న సంకేతాన్ని వ్యూహాత్మకంగా విజయసాయి ట్వీట్ చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇప్పటి వరకూ అయితే..  ఉప ప్రధాని నియామకంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటిక.. , విజయసాయి రెడ్డి పోస్ట్ వల్ల జాతీయ స్థాయిలో   ఈ విషయంపై చర్చ జోరందుకుంది.  ఒకవేళ  అమిత్ షా అధికారికంగా ఉప ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తే, అది దేశ రాజకీయ ముఖచిత్రాన్ని,  అధికారిక ప్రాధాన్యతలను  మార్చే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.   Amit Shah Deputy PM news, Vijaya Sai Reddy tweet on Amit Shah, Union Cabinet Reshuffle 2026, Narendra Modi government Deputy Prime Minister, YSRCP BJP political updates
ALSO ON TELUGUONE N E W S
అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయాన్ని అందుకనే చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి సంచలన విజయాన్ని అందుకున్న చిత్రమే పొలిమేర పార్ట్ 1 ,పార్ట్ 2 ,. ఇప్పుడు మూడో భాగం తెరకెక్కనుంది. ఈ భాగంలో క్రేజీ హీరో జాయిన్ కాబోతున్నాడు. దీంతో మూడో పార్ట్ కి సరికొత్త జోష్ వచ్చినట్లయింది. తెలుగు ప్రేక్షకులలో సుదీర్ఘ కాలంగా ఫ్యాన్ బేస్ కలిగి ఉన్న సీనియర్ హీరో, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఈ చిత్రంలో ఒక అత్యంత కీలకమైన, పవర్‌ఫుల్ రోల్ లో చేయబోతున్నారు. రీసెంట్ గా బ్లాస్ట్ జోన్ తో సక్సెస్ అందుకున్న అర్జున్ మూడవ భాగానికి   తోడవ్వడం సినిమా రేంజ్‌ని కచ్చితంగా నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళుతుందనడంలో  సందేహం లేదు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ కావడంతో  దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ఈసారి అర్జున్‌ని ఎలాంటి సరికొత్త షేడ్‌లో చూపిస్తారనే సస్పెన్స్ సినిమా లవర్స్‌లో క్యూరియాసిటీని పెంచేస్తోంది.  ఈ మూడవ భాగంలో చేతబడి, క్షుద్ర విద్యల బ్యాక్‌డ్రాప్‌తో పాటు, ప్రస్తుత సమాజంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఒక 'బర్నింగ్ ఇష్యూ'ని టచ్ చేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మొదటి రెండు భాగాల కంటే దాదాపు 3 రెట్లు అధిక బడ్జెట్‌తో, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పొలిమేర-2 చిత్రాన్ని విజయవంతంగా పంపిణీ చేసిన ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి, మొదటి భాగానికి నిర్మాతగా వ్యవహరించిన భోగేంద్ర గుప్తాతో కలిసి ఈ త్రీక్వెల్‌ను అత్యున్నత సాంకేతిక విలువలతో ప్రొడ్యూస్ చేస్తున్నారు.  also read: పెద్ది తర్వాత కొత్త సినిమాకి జాన్వీకపూర్‌ గ్రీన్ సిగ్నల్‌..!  ప్రముఖ నిర్మాణ సంస్థ 'గీతా ఆర్ట్స్' కూడా ఈ ప్రాజెక్ట్‌కు పూర్తి సపోర్ట్ అందిస్తుండటం విశేషం. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, గెటప్ శీను, రాకేందు మౌళి వంటి భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్‌లో విడుదల కానుంది.    
అందని అందం, అంతే అందమైన నటన జాన్వీ కపూర్(janhvi kapoor)సొంతం. అతిలోక సుందరి శ్రీదేవికి పర్ఫెక్ట్ నట వారసురాలనే కితాబు కూడా అభిమానుల నుంచి అందుకుంటూ ప్రీవియస్ మూవీ పెద్దితో బ్లాక్ బస్టర్ అందుకొని తెలుగునాట లక్కీ హీరోయిన్ గా తిష్ట వేసింది.   ఈ వివాదాలన్నింటికీ చెక్ పెడుతూ జాన్వీ కపూర్ తాజాగా కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెద్ది వివాదం, ఆ క్యారక్టర్ కి వచ్చిన ట్రోల్స్ నుంచి పూర్తిగా కోలుకున్న జాన్వీ, ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఉమేష్ బిస్త్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఒక భారీ చిత్రంలో నటించనున్నట్టుగా టాక్.కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, నటిగా తనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించేందుకు ఈ సినిమా ద్వారా ఆమె సిద్ధమవుతోంది. బాలాజీ మోషన్ పిక్చర్స్‌, సిఖ్య ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లపై ఏక్తాకపూర్‌, గునీత్ మోంగా  తెరకెక్కించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ వచ్చే అక్టోబర్‌, నవంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఉమేశ్‌ బిస్ట్‌ ది ట్రయల్, గ్యారహ్ ,గ్యారహ్  వెబ్‌ షోలని  డైరెక్ట్ చేశాడు. Also read: బిగ్ రిస్క్ లో బాలయ్య! మరి ఉమేశ్ బిస్ట్‌ జాన్వీకపూర్‌ కోసం ఎలాంటి క్యారక్టర్  డిజైన్‌ చేశాడు. ఈ సినిమాతో అయినా జాన్వీకపూర్‌కు బ్రేక్‌ వస్తుందా..? అనేది తెలియాల్సి ఉంది. janhvi kapoor, peddi, ram charan
Ram Pothineni's ambitious RAPO23 has become one of the most talked-about upcoming Telugu films, with fresh reports suggesting that veteran Bollywood actor Jackie Shroff is in advanced talks to join the project. If finalized, the actor is expected to play the film's powerful antagonist, setting up an exciting face-off with Ram. The project marks a major milestone in Ram's career as he is not only playing the lead but has also written the script and is making his directorial debut. The actor reportedly began shooting for the film quietly, focusing on bringing his vision of a dark, emotional neo-noir thriller to life. While the makers are yet to officially unveil the complete cast, industry buzz has been growing around the film. Earlier reports claimed that Samyuktha had been signed as the female lead, and now Jackie Shroff's name has emerged as the latest addition. According to reports, discussions with the veteran actor are in the final stages, with his dates also said to be nearing confirmation. Sources describe RAPO23 as an intense, stylish thriller that blends emotional storytelling with gritty action. Ram is said to be working closely with top technicians to create a distinctive cinematic experience, while producer Krishna Pothineni is backing the project on a grand scale. An official confirmation regarding Jackie Shroff's casting is still awaited. However, if the deal goes through, the prospect of Ram Pothineni taking on the seasoned Bollywood star in a dark, high-stakes thriller is expected to significantly raise anticipation for RAPO23. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పాడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ సోషల్ డ్రామా మూవీ 'ది ఇండియా స్టోరీ'. తాజాగా ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. 2 నిమిషాల 35 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్, దేశంలో ఆహార కాలుష్యం, క్రిమిసంహారకాల వాడకం వల్ల సామాన్యుల జీవితాలు ఎలా అతలాకుతలం అవుతున్నాయో కళ్లకు కట్టినట్లు చూపించింది.  ట్రైలర్ ప్రారంభమే ఒక తండ్రి రోదనతో మొదలవుతుంది. తన 7 ఏళ్ల కూతురు హత్యకు గురైందని, దానికి కారణమైన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఒక తండ్రి పోలీస్ స్టేషన్‌లో వేడుకునే సీన్ ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. అయితే ఆ పాప మరణానికి అసలు కారణం క్యాన్సర్ అని మెడికల్ రిపోర్టులు చెబుతాయి. కానీ ఆ క్యాన్సర్ రావడానికి వెనుక ఉన్న భయంకరమైన కార్పొరేట్ మాఫియా, విషపూరిత రసాయనాల వాడకాన్ని ఈ చిత్రం ప్రశ్నించబోతోంది. మన దేశంలో పంటల దిగుబడి కోసం, ముఖ్యంగా జీడి తోటలపై హెలికాప్టర్ల ద్వారా విచ్చలవిడిగా క్రిమిసంహారక మందులను జల్లుతున్నారు. కెమికల్స్ కాదు, అవి నిలువునా ప్రాణాలు తీసే విషం అని ట్రైలర్‌లో బలంగా చూపించారు. మార్కెట్లో దొరికే పండ్లు, కూరగాయలను ఎంత కడిగినా ఆ విషపు రసాయనాల ప్రభావం పోదని, అవి మన శరీరంలోకి చేరి ప్రాణాంతక క్యాన్సర్‌గా మారుతున్నాయని ఈ కథ హెచ్చరిస్తోంది. కేవలం కూరగాయలే కాదు, పండగల సమయంలో, ఫంక్షన్ల సమయంలో విరివిగా వాడే పాలలో కూడా ఎలాంటి కల్తీ జరుగుతుందో, అవి స్వీట్ల రూపంలో మన పిల్లల పొట్టల్లోకి ఎలా చేరుతున్నాయో కూడా ఇందులో ప్రస్తావించారు. ఈ పోరాటం కేవలం ఒక పాప కాదు, దేశంలోని ప్రతి బిడ్డ భవిష్యత్తు కోసం అంటూ సాగే డైలాగులు ఆలోచింపజేస్తాయి. రైతుల్ని అన్నదాతలు అని అంటాం, కానీ కొందరు స్వార్థపరుల వల్ల అమాయక రైతులు కూడా ఎలా నష్టపోతున్నారో ఇందులో చూపించారు. ట్రైలర్‌లో అత్యంత ప్రభావవంతమైన అంశం పంజాబ్ లోని 'బటిండా నుండి బికానీర్' వెళ్లే క్యాన్సర్ ట్రైన్ గురించి ప్రస్తావించడం. క్రిమిసంహారక మందుల వాడకం, రసాయనాల కాలుష్యం ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో దేశంలోని ప్రతి ఊరు నుండి ఒక క్యాన్సర్ ట్రైన్ బయలుదేరాల్సిన పరిస్థితి వస్తుందని కాజల్ పాత్ర ద్వారా చెప్పించిన డైలాగ్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఈ భయంకరమైన సామాజిక సమస్యను ఎదిరిస్తూ జూలై 24న థియేటర్లలోకి రాబోతున్న 'ది ఇండియా స్టోరీ' ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.   Kajal Aggarwal, The India Story, Movie Trailer  
  సంక్రాంతి పండుగకి గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)సినిమా చూస్తే వచ్చే మజా వేరని అభిమానుల నమ్మకం. మెజారిటీ సినీ ప్రేమికులు, ప్రేక్షకులు కూడా ఆ మాటకి ఏకీభవిస్తారు. స్వయానా బాలకృష్ణకి కూడా సంక్రాంతికి తన సినిమా రిలీజ్ చెయ్యడం  సెంటిమెంట్. ఏదో ఒకటి రెండు సార్లు మినహా సంక్రాంతి  పండుగ బరిలో నిలిచిన ప్రతిసారీ బ్లాక్ బస్టర్ హిట్లతో రికార్డుల వేట సాగించాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన కొత్త మూవీ చేస్తున్నాడు. బాలయ్య, గోపీచంద్ కాంబోలో వీరసింహా రెడ్డి తర్వాత వస్తున్న మూవీ కావడంతో  అభిమానుల్లో, ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మొదట ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 16న రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ, ఇప్పుడు డిసెంబర్ లేదా సంక్రాంతి రేసులో నిలపాలని గట్టిగా భావిస్తున్నారు. అయితే, సంక్రాంతి బరిలోకి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను తీసుకురావాలనే ఆలోచన ఇప్పుడు బాలయ్యకు ఒక పెద్ద సవాలుగా, సరికొత్త రిస్క్‌గా మారిందని ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తోంది..ఈ సవాలుకి ప్రధాన కారణం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అని విశ్లేషకులు చెబుతున్నారు. టాలీవుడ్‌లో సంక్రాంతి సీజన్ అంటే అనిల్ రావిపూడికి ఒక బలమైన హోల్డ్ ఉంది. ఇప్పటికే ఎఫ్2, ఎఫ్ 3 , సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం. మన శంకర వరప్రసాద్ గారు  వంటి వరుస హిట్లతో పండుగ విన్నర్‌గా నిలుస్తూ వస్తున్నాడు. రాబోయే సంక్రాంతి బరిలోనూ విక్టరీ వెంకటేష్ ళ్యాణ్ రామ్ కాంబినేషన్ చిత్రంతో వస్తున్నాడు. గతంలో సంక్రాంతి రేసులో అనిల్ రావిపూడి సినిమాలతో పోటీపడిన రెండు సందర్భాల్లోనూ బాలకృష్ణ సినిమాలకి గట్టి దెబ్బ తగిలింది. 'ఎఫ్2' మూవీకి పోటీగా వచ్చిన బాలయ్య 'కథానాయకుడు' ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. సాధారణంగా పండుగ సీజన్ లో ఫ్యామిలీ ఆడియన్స్‌  కనెక్ట్ చేసే వినోదాత్మక చిత్రాలే భారీ వసూళ్లు సాధిస్తుంటాయి, ఆ విషయంలో అనిల్ రావిపూడి ఎక్స్‌పర్ట్ కావడమే దీనికి కారణం. సంక్రాంతికే వచ్చిన 'డాకు మహారాజ్' చిత్రం మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ, అనిల్ రావిపూడి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా హవాని  తట్టుకోలేకపోయింది.  Also read: షాక్ లో అక్కినేని ఫ్యాన్స్! ఆ సమయంలో డాకు మహారాజ్ నాలుగు రోజుల ముందే థియేటర్లలోకి రావడం వల్ల బ్రేక్ ఈవెన్ సాధించి సేఫ్ జోన్‌లోకి వెళ్ళగలిగింది కానీ, ఒకే రోజు గనుక పోటీ పడి ఉంటే గట్టెక్కడం చాలా కష్టమయ్యేదని ట్రేడ్ నిపుణులు లెక్కలు వేస్తున్నారు. ఇప్పుడు గోపీచంద్ మలినేని సినిమా విషయంలో కూడా అదే రిపీట్ అవుతుందేమో అన్న ఆందోళన అభిమానుల్లో ఉంది. కేవలం అనిల్ రావిపూడి మాత్రమే కాదు, ఈ సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో వస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ కూడా పోటీకి సిద్ధమవుతోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' సంక్రాంతికి ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. మరి ఈ ట్రిపుల్ కాంబో బాక్స్ ఆఫీస్ వార్ లో నటసింహం తన సెంటిమెంట్‌  కాపాడుకుని విజేతగా నిలుస్తారో లేదో చూడాలి!    balakrishna, nbk111, chiranjeevi, anilravipudi, venkatesh, kalyan ram
'మంజుమ్మెల్ బాయ్స్' సినిమాతో ఇండియన్ సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన టాలెంటెడ్ డైరెక్టర్ చిదంబరం దర్శకత్వంలో వచ్చిన సరికొత్త మిస్టరీ థ్రిల్లర్ చిత్రం 'బాలన్: ది బాయ్' (Balan: The Boy). జూన్ 19న థియేటర్లలో విడుదలైన ఈ మలయాళ చిత్రం ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు అందుకుంది. ఈ ఏడాది మాలీవుడ్‌లో వచ్చిన అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచిన ఈ సినిమా, విజయవంతంగా థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకుంది. దీంతో ఈ సినిమా డిజిటల్ విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మిస్టరీ థ్రిల్లర్ యొక్క ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలను అధికారికంగా ప్రకటించారు. 'బాలన్: ది బాయ్' చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జీ5' (ZEE5) లో జూలై 31, 2026 నుండి స్ట్రీమింగ్ కానుంది. చిదంబరం తన మునుపటి చిత్రం 'మంజుమ్మెల్ బాయ్స్' తో ఒక రియల్ లైఫ్ సర్వైవల్ డ్రామాను చూపిస్తే, ఈ చిత్రంలో మాత్రం భయం, మనుగడ, ఒక మిస్టీరియస్ పాత జీవితం నేపథ్యంగా సాగే తల్లి-కొడుకుల బంధాన్ని చాలా వినూత్నమైన పంథాలో ఆవిష్కరించారు. ఈ విభిన్న కథాంశమే థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసింది. బాక్సాఫీస్ గణాంకాల విషయానికి వస్తే, 'బాలన్: ది బాయ్' సినిమా థియేట్రికల్ రన్‌లో ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లను సాధించింది. ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా దాదాపు రూ. 30.24 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మహిళల కారాగారంలో తన తల్లితో కలిసి పెరిగే బాలన్ అనే బాలుడి చుట్టూ తిరుగుతుంది. ఆ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత, అతని తల్లి తన పాత జీవితం నుండి తప్పించుకోవడానికి నిరంతరం ప్రదేశాలను మారుస్తూ, వారి గుర్తింపులను, నేపథ్యాలను మారుస్తూ ఉంటుంది. మనుగడ సాగించాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎవరినీ నమ్మకూడదని బాలన్ చిన్నతనం నుంచే నేర్చుకుంటాడు. ఒక ప్రశాంతమైన కొండ గ్రామంలో కొన్నాళ్లు వారి జీవితం నిలకడగా సాగినప్పటికీ, కొన్ని ఊహించని సంఘటనల వల్ల బాలన్ తన తల్లికి దూరమవుతాడు. ఆ తర్వాత అబ్బాస్ అనే వ్యక్తి బాలన్‌కు ఆశ్రయం ఇచ్చి, అతని తల్లిని వెతకడానికి సహాయం చేస్తానని అంటాడు. చిన్నతనం నుండి నేర్చుకున్న మెలకువలతో బాలన్ తన తల్లి కోసం, ఆమె వదిలిపెట్టిన పాత జీవితం వైపు అడుగులు వేస్తాడు. ఈ అన్వేషణ కేవలం ఒక తల్లి కోసం సాగే ప్రయాణం మాత్రమే కాకుండా, భయం మనుషులను ఎలా వెంటాడుతుందో చూపించే ఒక ఎమోషనల్ రైడ్‌గా మారుతుంది. ఈ చిత్రంలో అధిశేషన్ కె.ఆర్, ఫర్జానా పలాతింగల్, ముహమ్మద్ జినాన్ ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే జీన్ పాల్ లాల్, డాలీ జూన్, గిరీష్ ఎ.డి కీలక పాత్రల్లో కనిపించగా, ప్రముఖ నటుడు టోవినో థామస్ ఒక ప్రత్యేకమైన ఎక్స్‌టెండెడ్ కామియో రోల్‌లో మెరిశారు. జితు మాధవన్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించగా, కేవీఎన్ ప్రొడక్షన్స్, థెస్పియన్ ఫిల్మ్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణ, శైలజ దేశాయ్ ఫెన్ సంయుక్తంగా నిర్మించారు.      Balan The Boy, OTT Release Date, Chidambaram, Tovino Thomas, ZEE5 Movie  
బుల్లితెరపై 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో రిషి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న కన్నడ నటుడు నిహార్ ముఖేశ్ ఇప్పుడు వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మన ముందుకు వచ్చాడు. ఆయన నటించిన సరికొత్త చిత్రం 'తీర్థరూప తాండేయవారిగే' ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'అమెజాన్ ప్రైమ్'లో తెలుగు ఆడియోతో అందుబాటులోకి వచ్చింది. రామెనహళ్లి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒక భావోద్వేగభరితమైన ఫ్యామిలీ సస్పెన్స్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో నిహార్ ముఖేశ్ సరసన రచన ఇందర్ కథానాయికగా నటించగా, సీనియర్ నటి సితార, రవీంద్ర విజయ్, రాజేష్ కీలక పాత్రలు పోషించారు. జై చాముండేశ్వరి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమా రేటింగ్ విషయానికి వస్తే 5 కి 2.00 గా నిలిచింది. ఒక తండ్రీ కొడుకుల మధ్య ఉండే ఎమోషన్, కుటుంబంలో ఉండే అపార్థాలు, మరియు ఒక మిస్టరీ చుట్టూ ఈ కథ మొత్తం తిరుగుతుంది. కథ విషయానికి వస్తే, పృథ్వీ (నిహార్ ముఖేశ్) ఒక మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన యువకుడు. అతను ఒక పాపులర్ ట్రావెల్ వ్లాగర్ కావడంతో, అందమైన లొకేషన్లకు వెళ్తూ వీడియోలు చేస్తూ డిజిటల్ ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు. సమాజంలో అతనికి ఎంతో క్రేజ్ ఉన్నప్పటికీ, అతని వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎప్పుడూ ఒక పెద్ద వెలితి వెంటాడుతూనే ఉంటుంది. దానికి కారణం అతని చిన్నతనంలోనే తండ్రి శివ శంకర్ (రవీంద్ర విజయ్) ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్లిపోవడం. తండ్రి లేని కారణంగా పృథ్వీ స్కూల్ రోజుల నుండి కాలేజ్ వరకు ఎన్నో అవమానాలను, హేళనలను ఎదుర్కొంటాడు. తన తండ్రి ఎందుకు వెళ్లిపోయాడు, ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్న అతన్ని నిరంతరం వేధిస్తూ ఉంటుంది. ఇదే సమయంలో తన తల్లి జానకి (సితార) స్థానిక వ్యక్తి విశ్వనాథ్ (రాజేశ్ నటరంగ)తో సన్నిహితంగా ఉండటం పృథ్వీకి నచ్చదు. తన తండ్రి ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి తల్లి ప్రవర్తనే కారణమని భావించి, ఆమెతో చాలా ముభావంగా ఉంటాడు. ఈ క్రమంలోనే పృథ్వీ జీవితంలోకి అక్షర (రచన ఇందర్) అనే అమ్మాయి ప్రవేశిస్తుంది. వారి పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. అయితే, అక్షర తండ్రి రవి రామనాథపుర ఒక సీనియర్ జర్నలిస్ట్ అని తెలిసి పృథ్వీ షాక్ అవుతాడు. కొన్ని కారణాల వల్ల వారి ప్రేమ ఫలించడం కష్టమని అనుకుంటున్న తరుణంలో, అక్షర తండ్రి హఠాత్తుగా మరణిస్తాడు. ఆయన చనిపోయే ముందు రాసిన ఒక లేఖ అక్షర చేతికి చిక్కుతుంది. ఆ లేఖ చదివిన అక్షరకు ఒక చేదు నిజం తెలుస్తుంది. పృథ్వీ తండ్రి శివశంకర్ అదృశ్యం కావడానికి, తన తండ్రి రవి రామనాథపురకి మధ్య ఏదో బలమైన సంబంధం ఉందని ఆమె గ్రహిస్తుంది. అసలు ఆ ఇద్దరి గతంలో ఏం జరిగింది, అక్షర ఈ నిజాన్ని పృథ్వీకి చెప్పిందా లేదా, చివరికి పృథ్వీ తన తండ్రి జాడను కనుగొన్నాడా అనే ఆసక్తికరమైన అంశాలతో మిగతా కథ నడుస్తుంది. దర్శకుడు రామెనహళ్లి జగన్నాథ్ ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ, దాన్ని తెరపై ఆవిష్కరించిన విధానంలో కొన్ని లోపాలు కనిపిస్తాయి. సినిమా ఫస్టాఫ్ చాలా నిదానంగా సాగుతుంది. హీరోకి తండ్రి లేడనే అసంతృప్తిని, తల్లి పట్ల ఉన్న కోపాన్ని చూపించడానికి ఎక్కువ సమయం తీసుకున్నారు. లవ్ ట్రాక్‌లో రొమాన్స్ మరింత పండించి ఉంటే బాగుండేది. అయితే, సెకండాఫ్ నుండి కథలో వేగం పుంజుకుంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సాంకేతిక విభాగంలో దీపక్ ఫొటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలం. మేఘాలయ వంటి లొకేషన్లను కెమెరాలో అద్భుతంగా చూపించారు. జో కోస్టా అందించిన నేపథ్య సంగీతం పర్వాలేదనిపించినా, పాటల సాహిత్యం మరియు డబ్బింగ్ పరంగా మరింత శ్రద్ధ పెట్టాల్సింది. మొత్తానికి, 'తీర్థరూప తాండేయవారిగే' నెమ్మదిగా సాగే ఒక ఎమోషనల్ డ్రామా, ఓటీటీలో ఒకసారి చూడదగ్గ చిత్రంగా మిగిలింది.
Presented by Elred Kumar under the RS Infotainment banner, Mandaadi is directed by Mathimaran Pugazhendi and produced by Elred Kumar. The film stars Soori and Suhas in pivotal roles.  The content released so far has generated a strong response from audiences. The striking character transformations of Soori and Suhas have grabbed attention, while the makers are confident that the film's high-octane action sequences and stunning visuals will be among its biggest highlights. The much-talked-about boat action sequence, which the team has already teased, is expected to be one of the major attractions of the film. Mandaadi is all set for a grand worldwide release on September 10 in Telugu, Tamil, Kannada, Malayalam, and Hindi. The Telugu version will be distributed across Andhra Pradesh and Telangana by Mythri Movie Distributors LLP, ensuring a massive release in the Telugu states. The film also stars Mahima Nambiar as the female lead, alongside Sathyaraj, Ravindra Vijay, Mithun, Bala Saravanan, and others in key roles. The music is composed by G.V. Prakash Kumar, while S.R. Kathir handles the cinematography. D.R.K. Kiran is the production designer, Pradeep E. Ragav serves as the editor, and the action sequences are choreographed by Peter Hein, Dileep Subbarayan, and Mahesh Mathew. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  అఖిల్ అక్కినేని(Akhil Akkineni)లెనిన్ తో సూపర్ హిట్ అందుకోవాలని కోరుకొని అభిమాని లేడు. ఆ అభిమానుల భావోద్వేగాల మధ్య లెనిన్ రిలీజ్ కావడం, సూపర్ హిట్ టాక్ అందుకోవడం జరిగింది. కేవలం 3 రోజుల్లోనే  ప్రపంచవ్యాప్తంగా  68 కోట్ల గ్రాస్ వసూలు చెయ్యడంతో ఫ్యాన్స్ మొత్తం కాలర్ ఎగరేసుకొని ఫిగర్ తాలూకు ఇమేజ్ ని తమ ఫోన్ లో స్టేటస్ గా ఉంచుకున్నారు.  ఇక లెనిన్(Lenin)తో అఖిల్ తొలి సారి వంద కోట్ల క్లబ్ లోకి చేరబోతున్నాడని, అందుకు తగ్గ పోస్టర్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తూ ఉన్నారు. కానీ మేకర్స్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. వాళ్ళు ఆందోళన చెందటానికి కారణం లేకపోలేదు. లెనిన్ గత శుక్రవారం 10 న రిలీజ్ అయ్యింది.మూడు రోజులకే  68 కోట్ల గ్రాస్ ని అందుకుంది. సోమవారం నుంచి వర్కింగ్ డేస్ ప్రారంభం కావడంతో కలెక్షన్ల గ్రాఫ్ కాస్త తగ్గుముఖం పట్టింది. నాల్గవ రోజు కేవలం 4.5 కోట్ల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి . వంద కోట్ల మార్కు అందుకోవడానికి 32 కోట్లు అవసరం. also read: ప్రీతీ ముకుందన్ బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు.. ఆ అపర మేధావికి మునిమనవరాలు! మరోవైపు నిన్న శుక్రవారం బాక్సాఫీస్ బరిలోకి కొన్ని సినిమాలు వచ్చాయి పైగా 'ఓడిస్సి, మూవీ కూడా తిష్ట వేసింది. అందుకే అభిమానుల్లో లెనిన్ వంద కోట్ల క్లబ్ లోకి చేరుతుందా లేదా అనే టెన్షన్ లో మొదలైంది. మరి బాక్సాఫీస్ రేసులో 'లెనిన్' వంద కోట్ల క్లబ్ లో చేరుతుందేమో చూడాలి. akhil, lenin, nagarjuna, nagavamsi    
భారతీయ కార్పొరేట్, డిజిటల్ రంగ చరిత్రలోనే అత్యంత సంచలనం సృష్టించిన స్మార్ట్ ఫోన్ మోసం ఆధారంగా సరికొత్త తెలుగు వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కేవలం రూ. 251 ధరకే పూర్తి ఫీచర్లు కలిగిన సరికొత్త స్మార్ట్‌ఫోన్ అందిస్తామంటూ 2016వ సంవత్సరంలో ఒక కంపెనీ దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఆ రోజుల్లో మొబైల్ ఫోన్ కొనడం సామాన్యుడికి పెద్ద పెట్టుబడితో కూడుకున్న వ్యవహారం కావడం, దానికి తోడు ఇంత తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ లభిస్తుండటంతో జనం ఎగబడ్డారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా ఏకంగా 7 కోట్ల మందికి పైగా వినియోగదారులు ఆ స్మార్ట్‌ఫోన్ కోసం రిజిస్ట్రేషన్లు చేసుకోవడం అప్పట్లో ఒక రికార్డు. అయితే అత్యంత చౌకైన ఈ స్మార్ట్ ఫోన్ డ్రీమ్ కాస్తా కొద్దిరోజుల్లోనే ఒక పెను వివాదంగా మారి, భారతదేశపు అతిపెద్ద వ్యాపార మోసాలలో ఒకటిగా నిలిచింది. తాము నమ్మిన సంస్థ నుంచి స్మార్ట్ ఫోన్లు రాకపోవడంతో కోట్లాది మంది రిజిస్టర్డ్ కస్టమర్లతో పాటు, భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిన డిస్ట్రిబ్యూటర్లు, వెండర్లు కోట్ల రూపాయల నష్టాలను చవిచూశారు. ఇప్పుడు ఇదే వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' (Aha) ఒక ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను నిర్మించింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు 'ఆజాదీ 501' (Azadi 501) అనే విభిన్నమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్టర్ శివతేజ తెరకెక్కించారు. థర్స్ డే సినిమాస్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ రచన రెడ్డి ములుముడి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. తాజాగా విడుదల చేసిన ఈ సిరీస్ ప్రమోషనల్ పోస్టర్ ప్రేక్షకులలో అమితమైన క్యూరియాసిటీని పెంచుతుంది. దేశంలోనే అతిపెద్ద మొబైల్ స్కామ్ వెనుక ఉన్న అసలు రహస్యాలు, తెరవెనుక జరిగిన పొలిటికల్ అండ్ బిజినెస్ డ్రామాను ఈ సిరీస్ ద్వారా కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నారు. జూలై 29 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్‌లో తేజ కాట్రగడ్డ, హర్షవర్ధన్, బంటి ద్వారక, శశాంక్, గీతా భాస్కర్, రాకీ కృష్ణ, రవివర్మ కీలక పాత్రలు పోషించారు. భారతదేశపు బిగ్గెస్ట్ డిజిటల్ స్కామ్ మిస్టరీని డీకోడ్ చేస్తూ రాబోతున్న ఈ 'ఆజాదీ 501' వెబ్ సిరీస్ ఓటీటీలో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. https://www.instagram.com/p/Da45snBpmOC/     Aha Telugu, Azadi 501 Web Series, Freedom 251 Scam, Smartphone Scam  
  వయసు పైబడే కొద్దీ, చాలా మంది తల్లిదండ్రులకు రోజువారీ పనులలో సహాయం అవసరం అవుతుంది. ఉద్యోగాల రీత్యా పిల్లలు దూరంగా ఉండటం లేదా విదేశాల్లో ఉండటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో పిల్లలు తల్లిదండ్రుల కోసం పిల్లలు కేర్ టేకర్ ను నియమించుకోవాలని అనుకుంటారు.  తల్లిదండ్రులు చాలా పెద్దవారైపోయి,  వారికి వారి పనులు కూడా చేసుకోలేని పరిస్థితిలో చాలా కుటుంబాలు కూడా కేర్ టేకర్ ను నియమించుకోవాలి అనుకుంటాయి.  అయితే కేవలం అనుభవం ఉందనో లేదా తక్కువ  పేమెంట్ తో కేర్ టేకర్ వస్తున్నారనో  తల్లిదండ్రుల కోసం కేర్ టేకర్ ను నియమించడం మంచిది కాదని అంటున్నారు లైఫ్ స్టైల్ నిపుణుల.   తల్లిదండ్రుల ఆరోగ్యం, భద్రత , మానసిక ఆరోగ్యం  కోసం  మంచి కేర్ టేకర్ ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే కేర్ టేకర్ ను నియమించుకునే ముందు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి.  అవేంటో తెలుసుకుంటే.. ముఖ్యమైన విషయం.. మొదట తల్లిదండ్రులకు ఎలాంటి సంరక్షణ అవసరమో నిర్ధారించుకోవాలి. వారికి అల్జీమర్స్, డిమెన్షియా లేదా మరో తీవ్రమైన అనారోగ్యం ఉంటే, శిక్షణ పొందిన కేర్ టేకర్  అవసరం అవుతారు. వారికి కేవలం సమయానికి మందులు వేసుకోవడం, ఆహారం తినడం లేదా రోజువారీ పనులు చేసుకోవడంలో సహాయం అవసరమైతే, ఒక సాధారణ కేర్ టేకర్ కూడా  సరిపోతారు. కేర్ టేకర్ ను  ఎంచుకునే ముందు, స్నానం చేయడం, బట్టలు మార్చుకోవడం, ఆహారం తినడం, మరుగుదొడ్డికి వెళ్లడం, మందులు వేసుకోవడం లేదా రాత్రిపూట వారికి ఎంత సంరక్షణ అవసరమో వంటి రోజువారీ అవసరాల లిస్ట్ ను తయారు చేసుకోవాలి. ఇది సరైన కేర్ టేకర్ ను  ఎంచుకోవడాన్ని సులభతరం చేస్తుంది. ప్రశ్నలు అడిగేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు.. కేర్ టేకర్ ను ఇంటర్ప్యూ చేసే  సమయంలో అనుభవం గురించి అడిగితే సరిపోదు. వారు ఇంతకుముందు ఏ జబ్బు ఉన్న వ్యక్తులకు సర్వీస్ చేశారో,  మెడిసిన్ షెడ్యూల్ ను  నిర్వహించగలరో లేదో, అవసరమైతే భోజనం వండగలరో లేదో,  వైద్య అత్యవసర పరిస్థితిలో సరైన నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం ఉందో లేదో కూడా తెలుసుకోవాలి.  వీల్‌చైర్ లో ఉన్న తల్లిదండ్రుల కోసం  లేదా మంచం నుండి లేవడానికి సహాయం అవసరమయ్యే వారి గురించి పై  విషయాన్ని ముందుగానే చర్చించాలి.   తల్లిదండ్రులను కలవాలి.. కేర్ టేకర్ ను నియమించాలనే నిర్ణయం తీసుకునే ముందు, కేర్ టేకర్ ను తల్లిదండ్రులకు తప్పకుండా పరిచయం చేయాలి. దీనివల్ల తల్లిదండ్రులు, కేర్ టేకర్ ఇద్దరూ  ఒకరితో ఒకరు కంఫర్ట్ గా ఉన్నారో లేదో అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. కొన్నిసార్లు, అనుభవం కంటే ప్రవర్తన , మాట్లాడే విధానం వంటివి ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ప్రతి కేర్ టేకర్ ట్రైనింగ్ తీసుకున్నవారే అయి ఉండరు అనే విషయం  గుర్తుంచుకోవాలి. చాలా మందికి వృద్ధులను చూసుకునే విషయంలో అనుభవం లేదా వైద్య శిక్షణ ఉండదు. అందువల్ల వృద్దులకు  ఇన్సులిన్ ఇవ్వడం, రక్తంలో చక్కెర స్థాయిలను చెక్ చేయడంలో,, గాయానికి కట్టు కట్టడం లేదా ఇతర నర్సింగ్ పనులు అవసరం అయితే.. వాటిని చేసేందుకు వీలుగా నర్సింగ్ శిక్షణ తీసుకున్న వారిని ఎంచుకోవాలి. కుటుంబ భాద్యత.. చాలామంది కేర్ టేకర్ ను నియమిస్తే.. ఇక తల్లిదండ్రుల విషయంలో ఎలాంటి బాధ్యత,   భయం లాంటివి తమకు లేనట్టే అని అనుకుంటారు.  కానీ కేర్ టేకర్ ఉన్నంత మాత్రాన కుటుంబ బాధ్యతలు పూర్తిగా  వదిలేయాలని అర్థం కాదు.. కేర్ టేకర్ తల్లిదండ్రులను సరిగా చూసుకుంటున్నారా లేదా అని చెక్ చేస్తూ ఉండాలి.  కేర్ టేకర్ తమను బాగా చూసుకుంటున్నారా లేదా అని పెద్దలను అడిగి తెలుసుకుంటూ ఉండాలి, అలాగే కొందరు పెద్దవాళ్లు చాదస్తంగా కేర్ టేకర్ లు ఎంత బాగా చూసుకున్నా తృప్తి పడరు. ఇలాంటి పరిస్థితులలో కేర్ టేకర్ ను అర్ఖం చేసుకోవడం,  కేర్ టేకర్ కు మద్దతుగా ఉండటం చాలా ముఖ్యం.                                 *రూపశ్రీ.  
   పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదని అనుకుంటారు.  సాధారణంగా ఇంట్లో మగవాళ్లు అయినా ఆడవాళ్లు అయినా పిల్లలు ఉన్నా పెద్దగా పట్టించుకోకుండా బట్టలు మార్చుకుంటారు.  అయితే.. ఇలా పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం సరైనదేనా?  దీని వల్ల కలిగే పర్యవసానాలు ఏంటి? తెలుసుకుంటే.. మంచి, చెడు.. పిల్లలు అనేది వారి వయసును పరిగణలోకి తీసుకునే.. అలాంటి పిల్లల మెదడు ఇంకా ఎదిగే దశలో ఉంటుంది.  ఈ కారణంగా పిల్లలకు మంచి ఏది చెడు ఏది అనే విషయాలు అర్థం చేసుకునేంత ఆలోచన ఉండదు. తల్లిదండ్రులు పిల్లల ముందు బట్టలు మార్చుకుంటే.. తమ ముందు ఎవరు అలా బట్టలు మార్చుకున్నా లేదా విప్పినా అది పెద్ద విషయమేమీ కాదని అనుకుంటారు. ఇదెప్పుడూ మంచిది కాదు. ప్రైవసీ.. ప్రైవసీ అనేది ప్రతి ఒక్కరికి ఉండాల్సిన విషయం. తల్లిదండ్రులైనా సరే.. పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం ద్వారా వారికి శరీరం వాల్యూ తెలియదు. శరీరం బట్టలు లేకుండా ఉన్నప్పుడు ఒకరికి కనిపించకూడదని, ఇతరుల ముందు ఎల్లప్పుడూ శరీరాన్ని వస్త్రాలతో కప్పి ఉంచాలని.. ఇలాంటి చిన్న విషయాలు వారు తెలుసుకోలేరు.  ఈ కారణంగా వారికి  శరీరం గురించి అవగాహన రాదు. హద్దలు.. పిల్లలకు కూడా వ్యక్తిగత హద్దులు అనేవి ఉండాలి.  తమ ముందు ఎవరు ఎలా ఉండాలి?  తాము ఎవరి ముందు ఎలా ఉండాలి వంటివి పిల్లలు అర్థం చేసుకోవాలంటే అది తల్లిదండ్రుల ద్వారా మాత్రమే సాధ్యం  అవుతుంది.  తల్లిదండ్రులు పిల్లల ముందు దుస్తులు మార్చుకుంటే.. తమ ముందు ఎవరు మార్చుకున్నా పర్వాలేదని,  తాము కూడా ఎవరి ముందైనా బట్టలు మార్చుకోవచ్చని అనుకుంటారు. తల్లిదండ్రులు చేసే పని వల్ల వారికి హద్దులు అనేవి అర్థం కావు. తప్పులు.. తల్లిదండ్రులు పిల్లల ముందు బట్టలు మార్చుకుంటే పిల్లలు తప్పు మార్గంలో వెళ్లే అవకాశం ఉంటుంది. ఎవరైనా బట్టలు మార్చుకొనేటప్పుడు కూడా తాము చూడటం తప్పు కాదని అనుకుంటారు. ఇది ఇతరుల ప్రైవసీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. ఇతరులకు విలువ కూడా ఇవ్వకుండా తయారవుతారు. ఈ వయసుకు తప్పనిసరి.. పిల్లలకు వయసు అనుసరించి ప్రైవసీ నేర్పాలి. ముఖ్యంగా మూడు సంవత్సరాల తర్వాత పిల్లలకు ప్రైవసీ నేర్పాలి.  ఇతరుల ముందు బట్టలు మార్చుకోవడం,  విప్పడం  చేయరాదని, ఇతరులు బట్టలు మార్చుకొనేటప్పుడు చూడరాదని పిల్లలకు చెప్పాలి.  ఇదంతా తల్లిదండ్రులు తమ నుండే మొదలు పెట్టాలి.                                    *రూపశ్రీ  
  ఒకప్పుడు ఆడపిల్ల పుడితే భారం అనుకునేవారు.  వారిని పెంచి పెద్ద చేయాలి,  మంచి కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి.  ఆడపిల్ల పుట్టిందంటే పెద్ద ఆర్థిక భారంగా భావించేవారు. కానీ నేటికాలంలో ఆడపిల్లే కావాలని ఆశ పడే తల్లిదండ్రులు ఉన్నారు.  ముఖ్యంగా.. ఆడపిల్లను యువరాణిలాగా,  అపురూపంగా పెంచే వారు ఉన్నారు.  తల్లిదండ్రులు ఇద్దరిలో ఆడపిల్ల విషయంలో తండ్రే ఎక్కువ ప్రేమ చూపిస్తాడని అందరూ అంటారు. అందుకే ఆడపిల్లను డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని అంటుంటారు.  అయితే ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రి కొన్ని అలవాట్లు వదులుకోవాలి.  లేదంటే ఆడపిల్ల ఎదుగుదల దెబ్బతింటుంది, పైగా ఆడపిల్ల భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తుంది.  ఇంతకూ ఆడపిల్ల తండ్రులు వదులుకోవలసిన అలవాట్లు ఏంటో తెలుసుకుంటే.. కోపంగా అరవడం.. చాలామంది మగాళ్లకు కోపంతో గట్టిగా అరవడం అనే అలవాటు ఉంటుంది. కానీ ఆడపిల్లలు ఉన్న తండ్రులు ఇంట్లో ఇలా కోపంగా, గట్టిగా అరిస్తే ఆడపిల్లలకు భయం పెరిగి నమ్మకం తగ్గుతుంది.  తనకు ఏదైనా బాధ లేదా సమస్య అనిపిస్తే తండ్రితో మనసు విప్పి చెప్పుకోలేదు. అందుకే కోపంగా అరిచే అలవాటు ఉంటే ఆ అలవాటు మానేయ్యాలి. భార్యను తక్కువ చేయడం.. భార్య మీద అరవడం, బార్యను తక్కువ చేసి మాట్లాడటం వంటివి చాలా మంది మగాళ్లకు ఉండే అలవాటు. అయితే కూతురు ఉన్నప్పుడు ఇలా  భార్యను తక్కువ చేసి మాట్లాడటం, భార్య మీద అరవడం వంటివి చేయరాదు. ఎందుకంటే భార్య విషయంలో మగాడు చేసే ప్రవర్తన వల్ల కూతురికి తండ్రి మీద గౌరవం తగ్గిపోతుంది. అతను ఎప్పటికీ కూతురి దృష్టిలో ఉన్నతంగా ఉండలేడు. అందుకే కూతురి ముందు భార్యను తిట్టడం, చిన్నతనంగా మాట్లాడటం, అవమానించడం చేయకూడదు. ఆడపిల్లలను తక్కుగా మాట్లాడటం.. చాలామంది మగాళ్లు ఆడపిల్లల విషయంలో అనే మాట.. నువ్వు ఆడపిల్లవు అది చేయకు ఇది చేయకు అని.  నువ్వు చేయలేవు అని అనడం.  ఇలా మాట్లాడటం వల్ల ఆడపిల్లకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. ఆడపిల్ల తన జీవితంలో ఎలాంటి ఉన్నత లక్ష్యాలు సాధించకపోగా, భయస్థురాలిగా ఉండిపోతుంది. అందుకే ఆడపిల్లలను ప్రోత్సహించాలి తప్ప తక్కువ చేసి మాట్లాడకూడదు. పద్దతుల పేరుతో కఠినం.. సమాజంలో ఎంతో మంది తల్లిదండ్రులు పద్దతులను  మగపిల్లల కంటే ఆడపిల్లలను పెంచడంలోనే ఎక్కువ ప్రయోగిస్తారు. పద్దతుల పేరుతో ఆడపిల్లలను కఠినంగా, వారిని భయపెడుతూ పెంచుతారు.  కానీ ఆడపిల్లలను పద్దతుల పేరుతో భయపెట్టి కాదు.. ప్రేమతో పెంచాలి. సమస్యలు, పరిష్కారం.. ఆడపిల్లకు సామర్థ్యం ఉండదని, ఏ సమస్యను వారు ఎదుర్కోలేరని తల్లిదండ్రులు అనుకుంటారు. ఈ కారణంగానే ఆడపిల్ల ఏదైనా సమస్య అనగానే తండ్రే పరిష్కరించడం ఆడపిల్లను సేఫ్ జోన్ లో ఉంచడం చేస్తారు.  దీని వల్ల ఆడపిల్ల చేతకాని దాని లాగా,  సమస్యలు వచ్చినప్పుడు దిక్కుతోచక నిస్సహాయంగా ఉండిపోతుంది. అందుకే అన్ని సమస్యలు తండ్రి పరిష్కరించకుండా కొన్ని ఆడపిల్ల కూడా పరిష్కరించేలా అవకాశం ఇవ్వాలి.  ఇది జీవితంలో కొండంత ధైర్యాన్ని, సమస్యలను ఎదుర్కునే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.                                        *రూపశ్రీ.
స్మోకింగ్ మానాలంటే చాలా కష్టంగా ఉందా? ఇలా చేస్తే ఈజీగా మానేయవచ్చు..! ధూమపానం ఆరోగ్యానికి హానికరం.  ఈ విషయాన్ని పేపర్ లు,  టీవీ యాడ్స్ మాత్రమే కాకుండా ఏకంగా  సిగరెట్ ప్యాకెట్ ల పైన కూడా రాసి ఉంటుంది. ఇలా ఎవరు ఎంత చెప్పినా సరే.. చాలామంది స్మోక్ చేయడం మాత్రం మానరు. స్మోకింగ్ వల్ల ఎవరికి ఎంత సమస్య వచ్చినా దాని విషయంలో చాలా బలహీనంగా ఉంటారు. కానీ స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి, ఆస్తమా, క్షయ,  క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు కూడా కారణం అవుతుంది. కేవలం ధూమపానం చేసేవారికే కాకుండా ఆ పొగను ఇతరులు పీల్చడం వల్ల ఇతరులకు కూడా సమస్య వస్తుంది. అయితే స్మోకింగ్ మానాలని మానలేకపోతున్న వారికి కొన్ని మంచి మార్గాలు ఉన్నాయి.  వాటిని పాటిస్తే స్మోకింగ్ మానేయడం చాలా ఈజీ.. ఆ మార్గాలు ఏెంటో తెలుసుకుంటే.. నిర్ణయం, కట్టుబడి ఉండటం.. ధూమపానం మానేయాలని నిర్ణయించుకుంటే మొదట ఎప్పటి నుండి మానేయాలి అనే విషయాన్ని నిర్ణయించుకోవాలి.  ఈ నిర్ణయం గురించి  కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా చెప్పాలి,  చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలి.  దీని వల్ల ఇతరులకు చెప్పాం కాబట్టి మానెయ్యాలి అనే ఆలోచన కూడా ఉంటుంది. పైగా ఫలానా రోజు నుండి మానేయాలి అని మనసును కూడా సన్నద్ధం చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు,  స్నేహితులు కూడా ప్రో్త్సహించే అవకాశం ఉంటుంది. కొత్త అలవాట్లు.. ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం, యోగా లేదా వేగంగా నడవడం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా.. కొత్త అభిరుచిని అలవరచుకోవడం లేదా తమను తాము ఏదో ఒక పనిలో  నిమగ్నం చేసుకోవడం  కూడా ధూమపానం చేయాలనే కోరికను తగ్గించడంలో సహాయపడుతుంది. వైద్య సహాయం.. స్మోకింగ్ మానేయడానికి పదేపదే ప్రయత్నించినప్పటికీ  ధూమపానం మానుకోలేకపోతే, వైద్యుడిని లేదా స్మోకింగ్మ మానేయడానికి సహాయపడే నిపుణులను సంప్రదించాలి.  అవసరమైతే వారు నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (NRT), మందులు లేదా కౌన్సెలింగ్‌ను సిఫార్సు చేసే అవకాశం  ఉంటుంది.  వైద్యుడిని సంప్రదించకుండా ఎలాంటి మందులను వాడటం అయితే మంచిది కాదు. 4-డి సూత్రం.. "4-డి" సూత్రం అత్యంత ప్రభావవంతమైన పద్ధతిగా పరిగణించబడుతుంది. స్మౌకింగ్ చేయాలనే కోరికలు కలిగినప్పుడు, వెంటనే చేయకూడదు.. కొద్దిసేపు ఆగాలి, ఎందుకంటే అవి సాధారణంగా ఐదు నిమిషాల్లో తగ్గిపోతాయి, లోతైన శ్వాస తీసుకోవాలి, నీరు త్రాగాలి,  అదే ఆలోచనలో ఉండకుండావేరే పనులలో తమను తాము నిమగ్నం చేసుకోవడం లేదా స్నేహితులతో,  కుటుంబ సభ్యులతో మాట్లాడటం వంటి పనుల ద్వారా మైండ్ డైవర్ట్ చేసుకోవాలి.   స్మోకింగ్ మానడానకి  ప్రయత్నం చేసేటప్పుడు మొదట్లో చాలా కష్టంగా అనిపించవచ్చు.  కానీ పైన చెప్పుకున్నట్టు పాటిస్తూ ఉంటే తొందరలోనే స్మోకింగ్ మానేయవచ్చు.                                       *రూపశ్రీ.
వాము, జీలకర్రతో చేసే ఈ చూర్ణం గ్యాస్, అజీర్ణానికి ఎంత ఉపయోగమో తెలుసా.! గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు ప్రస్తుతం చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి సమస్యలను సహజసిద్ధమైన ఆయుర్వేద పద్ధతిలో ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ ఈ వీడియోలో వివరించారు.   ఈ వీడియోలో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఒక ప్రభావవంతమైన ఆయుర్వేద చూర్ణం తయారీ విధానాన్ని చూపించారు. వాము, ధనియాలు, జీలకర్ర, సోంపు, నల్ల ఉప్పు వంటి మన వంటింట్లో ఉండే పదార్థాలతో ఈ చూర్ణాన్ని ఎలా తయారు చేయాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎప్పుడు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందో పూర్తి వివరంగా తెలిపారు. ఈ చూర్ణం జీర్ణక్రియను మెరుగుపరచడంలో, గ్యాస్ సమస్యను తగ్గించడంలో, కడుపు ఉబ్బరాన్ని నియంత్రించడంలో, అసిడిటీ వల్ల కలిగే ఇబ్బందులను తగ్గించడంలో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు వివరిస్తున్నారు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యమైన విషయాలు: గ్యాస్, అసిడిటీకి సహజమైన ఆయుర్వేద చిట్కా ఇంట్లోనే చూర్ణం తయారు చేసే విధానం వాము, జీలకర్ర, ధనియాలు, సోంపు ప్రయోజనాలు చూర్ణం తీసుకునే సరైన సమయం, మోతాదు జీర్ణక్రియను మెరుగుపరచే సహజ మార్గాలు మీరు తరచూ గ్యాస్, అజీర్ణం, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడుతుంటే, ఈ వీడియోలో చెప్పిన సూచనలు మీకు ఉపయోగపడవచ్చు. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆయుర్వేద నిపుణులు అందించిన సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.      
మోకాళ్ల నొప్పి ప్రస్తుతం అన్ని వయస్సుల వారిలో కనిపిస్తున్న సాధారణ సమస్యగా మారింది. మెట్లు ఎక్కడం, నడవడం, ఎక్కువసేపు నిలబడటం వంటి రోజువారీ పనులు కూడా కష్టంగా అనిపిస్తాయి. ఈ వీడియోలో యోగా ఆచార్య ధాకారం గారు మోకాళ్ల నొప్పిని తగ్గించడంలో సహాయపడే సులభమైన యోగా ఆసనాలు మరియు వ్యాయామాలను వివరంగా చూపించారు. ఈ యోగా పద్ధతులను సరైన విధంగా, క్రమం తప్పకుండా చేస్తే మోకాళ్ల కండరాలు బలపడటంతో పాటు కీళ్ల కదలిక మెరుగుపడుతుంది. మోకాళ్లలో గట్టిదనం తగ్గి, నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు ఇవి ఉపయోగపడవచ్చు. వయస్సుతో వచ్చే మోకాళ్ల సమస్యలు, ఆస్టియోఆర్థ్రైటిస్ ప్రారంభ దశలో ఉన్నవారు లేదా ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగాలు చేసే వారు కూడా ఈ వ్యాయామాల గురించి తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో తెలుసుకునే అంశాలు: మోకాళ్ల నొప్పికి కారణాలు మోకాళ్ల కండరాలను బలపరిచే యోగా వ్యాయామాలు నొప్పిని తగ్గించే సులభమైన స్ట్రెచింగ్ పద్ధతులు నడవడం, మెట్లు ఎక్కడం సులభం కావడానికి ఉపయోగపడే సూచనలు మోకాళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకునే యోగా చిట్కాలు గమనిక: మోకాళ్ల నొప్పితో బాధపడుతున్న వారు ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య లేదా శస్త్రచికిత్స అనంతర పరిస్థితి ఉంటే, ఈ వ్యాయామాలను ప్రారంభించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం TeluguOne Health ను ఫాలో అవుతూ ఉండండి