LATEST NEWS
National Media reports that, Lashkar-e-Taiba (LeT) commander Abu Dujana who was shot dead in Pulwama encounter was actually offered to surrender to Indian military. However, Abu rejected an army officer's proposal.  What's more, Abu Dujana revealed a shocking reason to the officer for him rejecting the offer. His reply to the officer over phone conversation was, if he surrenders to Indian army, his family in Pakistan would be slayed. Furthermore, Abu Dujana also affirmed that there is no such thing like Jihad in Kashmir and Pakistan is playing a game to cheat people in Kashmir.
NDA backed candidate Ram Nath Kovind has been elected as 14th President of India. While Kovind secured 702044 votes (65.35%), the opposition backed Meira Kumar secured 367314 votes (34.65%). However, Ram Nath Kovind will be sworn-in as new President on July 25th. Ram Nath Kovind is the first President hailing from Uttar Pradesh. Undivided Andhra Pradesh and Tamil Nadu have sent three President's to Rashtrapati Bhavan till date. Ram Nath Kovind is a Dalit leader and a farmer's son. His humble origins and simple lifestyle were stressed by BJP Governments. He is indeed second Dalit President of India after KR Narayanan.
Popular Malayalam hero Dileep was arrested yesterday in connection with the conspiracy behind the case pertaining to the abduction and physical assault of actress Bhavana in February this year. The conspiracy behind the attack on Bhavana was sketched several years back and it was in the second attempt that the actress was attacked in the late night of February 19 in a moving car near Kochi. The police had filed charge sheet against the gang which had attacked the actress, in April this year.  Last week, police had questioned Dileep and film director Nadirsha in connection with the case. Afterwards, police had raided business premises of Dileep's wife Kavya Madhavan. Last month, police found a letter supposedly written by the gang leader Sunil Kumar seeking financial aid. Meanwhile, Dileep too had complained to police that he was being blackmailed by Sunil Kumar seeking money. The Association of Malayalam Movies Artists (AMMA) had rally behind Dileep few months ago.
The Goods and Services Tax (GST) came into effect from July 1. In Tamil Nadu, theatres were shut down on Monday in protest against the high taxation. Haasan said all factions of the industry are agitated. Reacting on the double taxation by the state, universal hero Kamal Haasan said in a statement, “Filmmaking has been made difficult deliberately. There are further tortures and systemic corruption that the film Industry has to endure under this regime.” Earlier also Kamal made strong remarks against government on the double taxation by the state. He warned to quit films, if GST is implemented in the state. Not just Kamal Haasan, few other celebrities in Tamil Nadu are also opposing GST implementation in the state. Latest to join the list is super star Rajinikanth who said, "Keeping in mind the livelihood of Lakhs of people in the Tamil film industry, I sincerely request the TN GOVT to seriously consider our plea." Apparently, Kamal Haasan is pleased with Rajinikanth for voicing his concern over the matter. "Thanks Rajni avaragaLay for voicing your concern. Lets request first as gentlemen should. Then we shall see. @superstarrajini & TN .Govt," stated Kamal Haasan. On the flip side, Tamil Nadu Government is not in a mood to consider Kolywood celebs plea for now.
Swacch Bharat is one of the most ambitious campaign initiated by our Prime Minister Sri Narendra Modi. Wherever you go, you will find advertisements of Swacch Bharat which depict importance of the program. While even opposition parties and celebrities are promoting the good cause, BJP's cabinet minister shames it. Agriculture Minister Radha Mohan Singh who is very close to Modi has mocked Swacch Bharat drive by urinating in public. Going by the pictures circulating on social media, the Cabinet Minister is seen urinating against a wall near his car while his security guards look away. Here are few Twitter trolls against Singh's Shameful Act: * If @PMOIndia is serious about Swachhata Abhiyan then he should seek explanation from this minister. https://twitter.com/ANILGALGALIRTI/status/880280343504465922 … * BJP Minister Radhamohan laying foundation stone of #SwachhBharat Abhiyaan. * In fact people should appreciate that Radha Mohan Singh managed to pee with dhoti ON. #NotInMyName pic.twitter.com/kNZhadIAhD * Peenal action should be taken against Radha Mohan Singh
ALSO ON TELUGUONE N E W S
జగపతిబాబు ఎంతో ఉద్వేగంతో అన్న మాటలివి. ఇంతకీ జగ్గుభామ్ అంత ఉద్వేగంగా మాట్లాడటానికి కారణం? తను వదలను? అంటోంది ఎవరిని? అనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నా.  జగపతిబాబు రీసెంట్ ఫిలిం ‘జయ జానకి నాయక’. బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకునిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో జగ్గూ భాయ్ ఓ విలన్ గా నటించాడు. ఈ చిత్రం సక్సెస్ మీట్ ఇటీవలే కృష్ణాజిల్లా హంసల దీవిలో జరిగింది. అదే ప్రాంతంలో ఈ సినిమాకు సంబందించిన ఓ పోరాట సన్నివేశాలను కూడా తెరకెక్కించిన విషయం తెలిసిందే. సినిమాకు అదే హైలైట్ గా నిలిచింది. అందుకే... అదే ప్రాంతంలో సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్.  ఈ సందర్భంగా జగపతిబాబు ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించడానికి నిలబడ్డాడు. దాంతో... ‘జగపతిబాబూ జిందాబాద్’ అంటూ జయజయ ధ్వానాలు మిన్నంటాయ్. దాంతో... ఆయన ఉద్వేగానికి లోనయ్యాడు. ‘పెళ్లాం అమ్మేసినా నన్ను చూశారు. కూతుర్ని చంపేసినా నన్ను చూస్తున్నారు. ఏం ఇచ్చి మీ రుణం తీర్చుకోగలను. ‘లెజెండ్’కి ముందు అందరూ నా పని అయిపోయిందన్నారు. నేను స్వతహాగా మొండోడ్ని. అలాగే ఆ సినిమాలో నన్ను చూపించాడు బోయపాటి శ్రీను. మీ జగపతిబాబు లోని మరో కోణం ఆ సినిమా నుంచి మొదలైంది. నేను మళ్లీ చెబుతున్నాను. నేను ఎక్కడికీ వెళ్లను. మిమ్మల్ని కూడా వదలను నేను మొండోడ్ని’అని ఉద్వేగంగా మాట్లాడాడు జగపతిబాబు. అభిమానులు ఆ రేంజ్ లో జేజేలు కొడుతుంటే... ఆ మాత్రం ఉద్వేగానికి లోనవ్వడం కామనే. ఎమంటారు ఫ్రెండ్స్? 
‘హేయ్ పిల్లగాడా...’ అంటూ తెరమీద లొల్లి లొల్లి చేసేసి... యువతరం హృదయాలను గిల్లి పారేసింది సాయి పల్లవి. స్క్రీన్ మీద చూసి ఈ అమ్మాయిని ప్రేమించేసిన కుర్రాళ్లు ఉన్నారంటే నమ్ముతారా? ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో డిస్ట్రబ్ చేసిన హీరోయిన్ ఎవరూ లేరంటే అతిశయోక్తి కానేకాదు. దటీజ్ సాయిపల్లవి.  సాయిపల్లవి కోసమే ‘ఫిదా’ను మళ్లీ మళ్లీ చూసేస్తున్నారు కుర్రకారు. చూసిన సినిమానే మళ్లీ మళ్లీ ఏం చూస్తారూ.. అనుకున్నారో ఏమో... ఈ అందాలబొమ్మ మలయాళంలో నటించిన ‘కలి’ చిత్రాన్ని ‘హేయ్ పిల్లగాడా’ పేరుతో డబ్ చేసి తెరమీదకు వదులుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే... సాయిపల్లవి ఉంటే చాలు.. ఇంకేం అవసరం లేదంటున్నారు యూత్.  దుల్హన్ సల్మాన్ కథానాయకునిగా నటించిన ఈ చిత్రానికి సమీర్ తాహిర్ దర్శకుడు. మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన సినిమా ఇది. తప్పకుండా తెలుగులో కూడా విజయం సాధిస్తుందని నిర్మాత డి.వి.కృష్ణస్వామి చెబుతున్నారు.  ఏది ఏమైనా సాయిపల్లవి అల్లరిని మరో కోణంలో చూసే అవకాశాన్ని తెలుగు ప్రేక్షకులకు లభించిందన్న మాట. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. 
కోలీవుడ్లో సిమ్రాన్ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో సూపర్ స్టార్ డమ్ ఎంజాయ్ చేసిన కథానాయిక ఎవరు? అనడిగితే... ఎవరైనా ఠక్కున చెప్పేస్తారు ‘జ్యోతిక’ అని. ఆ స్థాయిలో తమిళనాట జ్యోతిక హవా సాగింది. నటుడు సూర్యను పెళ్లాడేసింది. సినిమాకు కూడా స్వస్తి చెప్పేసింది. అయితే... ఒక్కసారి ముఖానికి రంగేసుకున్న తర్వాత అంత తేలిగ్గా ఆ దురద వదలదు. పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కనేసి, వారి ఆలనా పాలనా చూసుకొని, వారు కాస్త ఎదిగారు అనిపించగానే... మళ్లీ జ్యోతిక దృష్టి సినిమాలపై పడింది.  భార్య మాట కాదనలేని సూర్య... ‘ఎస్’అనేశాడు. ‘36 వయిదినిలే’ సినిమా వచ్చేసింది.  ఆ సినిమా యావరేజ్ గా ఆడినా.. జ్యోతిక నటనకు మాత్రం మంచి మార్కులే వేశారు జనం.  మరి ఒక సినిమాతో తీరుతుందా ఆనందం? అందుకే... స్వయంగా సూర్యనే సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్ పతాకంపై తన భార్య జ్యోతిక ప్రధానపాత్రధారిగా ‘మగళీర్ ముట్టుం’ సినిమాను మొదలుపెట్టాడు. బ్రహ్మ దర్శకుడు. మహిళా ప్రధాన్యత నేపథ్యంలో సాగే సినిమా ఇది. వినోదం, సందేశం రెండూ సమపాళ్లలో ఉంటాయని దర్శకుడు చెబుతున్నారు. జ్యోతిక పాత్ర స్ఫూర్తిమంతంగా ఉంటుందని టాక్.  ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన రెండు పోస్టర్లను విడుదల చేశారు. అందులో జ్యోతికని చూసిన వాళ్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా ఆమెలో గ్లామర్ ఇసుమంత కూడా తగ్గలేదని అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. ఈ సినిమా కోసం జ్యోతిక సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంది. నాజర్, భానుప్రియ, లివింగ్ స్టన్, పొన్నువన్నన్, ఊర్వశి, శరణ్య ఇందులో ప్రధాన పాత్రధారులు. నిజానికి ఈ సినిమాను జులైలోనే విడుదల చేయాలని భావించారు. అయితే... అనుకోని అవాంతరాలు ఎదురవ్వడంతో సెప్టెంబర్ 15న ఈ సినిమా విడుదల కానుంది. 
ప్రస్తుతం నాని రోజులు నడుస్తున్నాయ్. తను పట్టిందల్లా బంగారం అవుతోంది. వరుసగా ఏడు హిట్లు అంటే సాధారణమైన విషయమా? ఇప్పుడున్న ఏ హీరోకీ లేని రికార్డ్ ఇది. సిక్సర్ పూర్తి చేసి... ‘నిన్ను కోరి’ హిట్ తో డబుల్ సిక్సర్ కి శ్రీకారం చుట్టాడు నాని. డిసెంబర్ 21న నాని ‘ఎంసీఏ’ సినిమా రాబోతోంది. ఇది కూడా డెఫెనెట్ హిట్ అని ఘంటాపథంగా చెబుతున్నారు నాని ఫ్యాన్స్. పైగా ఈ సినిమాకు నిర్మాత దిల్ రాజు. కథ ఎంపికలో ఆయన నిజంగా రాజే. అందుకే.. వరుస విజయాలు ఖాతాలో వేసుకోగలుగుతున్నాడు. ఇక ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ... ‘సాయి పల్లవి’. ప్రస్తుతం కుర్రాళ్లు సాయి పల్లవి జపంలో మునిగి తేలుతున్నారు. ‘ఫిదా’తో ఈ అమ్మడు చేసిన మేజిక్కు అలాంటి మరి. ఇంతటి క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడు.  వేణు శ్రీరామ్ గత చిత్రాల గురించి పట్టించుకోకుండా... నాని, దిల్ రాజు ఈ చిత్రానికి అవకాశం  ఇచ్చారంటే.. కచ్చితంగా ఇది మంచి కథ అయ్యుంటుందని ఫిలింనగర్ టాక్. నాని... ఎనర్జీకి మారుపేరు.  సాయి పల్లవి నిజంగా హైపర్ యాక్టివ్. వీరిద్దరూ ఒకేసారి స్క్రీన్ షేర్ చేసుకుంటే... ఇక చెప్పేదేముంది! తెరంతా పండగ వాతావరణమే. మరి ఈ పండగను చూడాలంటే... డిసెంబర్ 21 ఆగాల్సిందే. వెయిట్ అండ్ సీ. 
  ‘వంద కోట్లు, రెండోందల కోట్లు.. అని వసూళ్ల గురించి చెబుతూ...చంకలు గుద్దుకోవడం  సినిమావాళ్లకు పరిపాటైపోయింది. . కానీ.. ఇది ఆనందించాల్సిన విషయం కాదు. బాధ పడాల్సిన విషయం. వంద కోట్ల జనాభా ఉన్న మన భారత దేశంలో ఓ సినిమాకు కేవలం రెండోందల కోట్ల రూపాయలు మాత్రమే వసూళ్లు వస్తున్నాయంటే... ఆ సినిమాను ఎక్కువమంది చూడటం లేదని అర్థం. నిజానికి మన భారతీయ సినిమా విడుదలైతే... వెయ్యికోట్లు వసూళ్లు రావాలి.  మన దేశ జనాభానీ, టికెట్ రేట్ ని పరిగణలోకి తీసుకొని చూస్తే అది నిజమని మీరే ఒప్పుకుంటారు’అని ఓ సందర్భంలో కమల్ హాసన్ అన్నారు. ఆయన చెప్పింది నిజం. పెరిగిన టికెట్ ధర వందల్లో ఉంటుంటే... చూసేవాళ్లు తక్కకువైనా... వసూళ్లు గ్రాండ్ గానే అనిపిస్తాయి. నిజానికి అవి సరైన వసూళ్లు కావు. అదే సినిమాను అందరూ చూస్తే... వసూళ్ల  సునామీనే. ఇప్పుడు ఇదంతా దేనికి చెబుతున్నామంటే.. సినిమాను ఒకసారి చూడడమే గగనమైపోతున్న నేటి రోజుల్లో... ఓ షాట్ ఫిలిం 30 కోట్ల వ్యూస్ వచ్చాయ్. అదే ఓ సినిమాను 30 కోట్లమంది చూస్తే... ఇప్పుడున్న టికెట్ రేట్లను బట్టి వేల కోట్ల వసూళ్లు వస్తాయ్. ఏమంటారు? ఇంతకీ 30 కోట్ల వ్యూస్ వచ్చిన ఆ షాట్ ఫిలిం పేరు చెప్పనేలేదు కదూ.. దాని పేరు ‘పీకే 2’. అమీర్ ఖాన్ ‘పీకే’ చిత్రాన్ని అనుకరిస్తూ.. ఈ షాట్ ఫిలింను హిందీలో తెరకెక్కించాడు దర్శకుడు  శ్రీకాంత్ రెడ్డి. దక్షిణభారతదేశంలోనే ఎక్కువమంది చూసిన షాట్ ఫిలింగా ‘పీకే 2’ నిలిచింది. ఈ షాట్ ఫిలింకి దర్శకత్వం వహించిన శ్రీకాంత్ రెడ్డిని నిజంగా అభినందించాలి. కేవలం వినోదం మాత్రమే కాకుండా... గ్లోబల్ వార్నింగ్ గురించి విశ్లేషణాత్మకమైన వివరణ ఇస్తూ... మనిషి బాధ్యతాయుతంగా ఉండాలని చెబుతూ.. వినోదంతో కూడిన సందేశంతో ‘పీకే 2’ను మిలిచాడు శ్రీకాంత్ రెడ్డి. నిజానికి ‘బాహుబలి’ సినిమానే 30 కోట్ల మంది చూసుండరు. ఇంతటి సంచలనాత్మకమైన షాట్ ఫిలిమ్ ని మనకందించిన శ్రీకాంత్ రెడ్డికి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెబుతుందీ ‘తెలుగు వన్’.
Akkineni Akhil's new film in Vikram Kumar direction is fast progressing with its shoot. The yet to be titled film's first look poster was leaked online yesterday and this leakage didn't bother Nagarjuna, Akhil and other film unit. Both Nagarjuna and Akhil stated that, more surprise is in the offing for fans on coming 21st. Nagarjuna gave first clue about title of the film by posting the super hit song "Hello Guru Prema Kosam" from his film Nirnayam. He also informed fans that second clue will be given by his son Naga Chaitanya and to-be-bahu Samantha Ruth Prabhu. "Guess @AkhilAkkineni8 's next movie name hidden in this iconic song? Watch out for the 2nd clue by @chay_akkineni & @Samanthaprabhu2 tom," tweeted Nagarjuna. Most of Twitterati expected "Hello Guru Prema Kosame" might be title of the film. We may get more clarity on title of the romantic entertainer film tomorrow.
  ఉట్టికి ఎరలేనమ్మ... స్వర్గానికి ఎగురుతానందట.. అలా ఉంది ప్రస్తుతం తాప్సీ వ్యవహారం చూస్తుంటే. ఈ భామ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఎన్నో ఏళ్లు గడిచినా... సరిగా బ్రేక్ మాత్రం రాలేదనే చెప్పాలి. గ్లామర్ పరంగా మాత్రమే తెలుగు ప్రేక్షకులను అలరించగలిగింది. ఆ తరువాత పెద్దగా అవకాశాలు కూడా రాలేదు. దాంతో కోలీవుడ్ కు.. అక్కడి నుండి బాలీవుడ్ మకాం మార్చింది ఈ భామ. అయితే బాలీవుడ్ భామకు అవకాశాలు వచ్చి.. అవి హిట్ అయ్యాయి. దీంతో అమ్మడు కళ్లు నెత్తికెక్కి టాలీవుడ్ పై విమర్శలు గుప్పించింది. ఇప్పుడు అవన్నీ మరిచిపోయినట్టు పాపం. అందుకే మళ్లీ టాలీవుడ్ లోనే ఉంటా అంటూ కబుర్లు చెప్పుకొస్తుంది. ప్రస్తుతం తాప్సీ నటించిన 'ఆనందో బ్రహ్మ' సినిమా విడుదలై థియేటర్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆ ఆనందంలో ఉన్న తాప్సీ.... సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఇక పై గ్యాప్ తీసుకోకుండా వరుసగా తెలుగు సినిమాలు చేస్తానని చెప్పింది. విచిత్రం ఏంటంటే.. తానే గ్యాప్ తీసుకున్నట్టుగా ఆమె మాట్లాడటం. అసలు ఆమెకు సినిమాలు ఇచ్చేదే తక్కువ మళ్లీ తానే గ్యాప్ తీసుకున్నట్టు వరుసగా సినిమాలు చేస్తాననడం...మరి తాప్సీ వరుసగా సినిమాలు చేస్తా అన్నది సరే కానీ.. మరి ఆమెకు ఇచ్చేవారేరి...?
Telugu producer, director and Madhrura Music owner Madhura Sridhar has plans to make biopic on Telangana Chief Minister K Chandrasekhar. He announced the same long ago, but was looking for right actor to portray the politician role. Earlier, Bollywood talented actor Rajkumar Rao was considered for the prestigious venture. However, latest buzz is that, award winning actor Nawazuddin Siddiqui is almost finalized to play KCR. It is also heard that, Nawazuddion has been preparing himself by watching KCR speeches and other videos. As we all know, Nawazuddin Siddiqui is a superb actor and he is currently one of the most sought after character artist in Bollywood. Good thing about Nawaz is he prefers to pick challenging roles and it will be another challenge for him to essay KCR on screen. Nonetheless, an official confirmation is awaited on this. Nawazuddin Siddiqui is perfect choice for KCR biopic. What do you say folks?
  ఈ నెల 22 కోసం మెగా అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కారణం...మెగాస్టార్ పుట్టిన రోజు మాత్రమే కాదు.  ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’చిత్రం మోషన్ పోస్టర్ విడుదల కూడా అదే రోజున. అభిమానుల్లో ఆ ఉత్సాహం అందుకే.. ఈ సినిమాకు ‘మహావీర’టైటిల్ అనుకుంటున్నట్లు టాక్. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకునిగా ఖరారైనట్లు తెలుస్తోంది. నయనతార ఇప్పటికే ఓ కథానాయికగా ఎంపిక కాగా.. మరో కథానాయిక పాత్ర కోసం ఐశ్వర్య రాయ్ తో సంప్రదింపులు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కన్నడ నటులు ఉపేంద్ర, సుదీప్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలిసింది. సాయిమాధవ్ బుర్రా... ఇప్పటికే ఈ సినిమా బౌండ్ స్క్రిప్ట్ ఇవ్వడం జరిగింది. షూటింగ్ అనేది మొదలైతే... శరవేగంగా పూర్తి చేయాలనీ, వచ్చే వేసవికి ఈ చిత్రం విడుదల ఉండాలని మెగాస్టార్ ఇప్పటికే దర్శకుడు సురేందర్ రెడ్డికి సూచించినట్లు తెలిసింది. ఇదిలావుంటే... ఈ చిత్రం మోషన్ పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని ఘనంగా జరపాలని మెగా క్యాంప్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి ఎస్.ఎస్.రాజమౌళి అతిధిగా హాజరవుతారనీ... ఆయన చేతులమీదుగానే ఆవిష్కరణలు జరుగుతాయనీ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అంటే... ఆ రోజునే సినిమా టైటిల్ కూడా తెలిసిపోతుంది.  ఫ్యాన్స్ ఇక పండగ చేసుకోండి!
Young Charming Hero Simbu's latest is 'Sarasudu' with Glamorous Stars Nayanthara, Andrea, Adah Sharma. 'Sarasudu' is Presented & Produced by 'Prema Sagaram' T Rajendar in Simbu Cine Arts & JasonRaj Films banners. Pandi Raj Directed this film in Tamil & Telugu languages. Tamil version of this film 'Idhu namma Aalu' collected more than 27 crores becoming biggest hit in Simbu's career. 'Sarasudu' is surrounded with good expectations as this film is releasing in Simbu Arts banner after 'Kurrodochaadu'. It is known that Simbu & Nayanthara are ex-lovers in real life and this is their first film after their break-up. They both loved the script and did this film. Romantic scenes between them have been dealt in realistic manner. Young audience will love this film. Music composed by T.R.Kuralarasan, brother of Simbu has already became a big hit. Film has completed all formalities and will be releasing in highest number of theatres on September 8th. Speaking about the film hero Simbu said," 'Manmadha', 'Vallabha' became Super Hits in Telugu. After a gap I am coming back to telugu audience with 'Sarasudu'. This film became biggest hit in my career in Tamil. I am confident that this will become much bigger hit than 'Manmadha' & 'Vallabha' in telugu too. This is the first film I and Nayanthara acted together after our break-up. Young and Family audience will love this film. Director Pandiraj made a beautiful love story. Nayanthara, Andrea, Adah Sharma performed very well in this film. My brother Kuralarasan provided excellent Music and BGM for this film. I am very happy that he is getting offers for other films too even before the release of this film. Sathyam Rajesh did a very good character in this film. His character will get very good response from audience." Producer T.Rajendar said, " We launched Simbu as Hero in Simbu Cine Arts banner with 'Kurrodochaadu'. After that we made 'Sarasudu' in this banner. This film has been made as a bi-lingual in Tamil & Telugu. This film has collected more than 27 crores in Tamil. Telugu version got delayed due to de-monetization effect. We have been looking for good date to release the film and finally we locked September 8th as Release Date for 'Sarasudu'. This film has been made as a romantic entertainer in software backdrop. Lyrics and Dialogues were penned by me. My younger son Kuralarasan composed the music. I wish audience will give him success and encourage him like they did for me and Simbu. While I introduced Simbu as Hero, Simbu introduced Kuralarasan as a Music Director. He gave excellent Music for this film. Entire credit goes to Simbu. Each and every song is different in its own way. Simbu sang a melody song in this film. I too crooned for a mass song and it will be loved by mass audience. After 'Kurrodochaadu', 'Sarasudu' is the film releasing in Simbu Cine Arts. Film came out really well. 'Sarasudu' is releasing on September 8th and I wish Telugu audience will love this film and give a big success."
భారత్ పై చైనా యుద్ధం ప్రకటించింది! ఇది అందరికీ తెలిసిందే. కావాలనే ఆ దేశం కవ్విస్తోంది. ఒకవైపు డోక్లామ్ లో నెలల తరబడి తిష్టవేసి కయ్యానికి కాలుదువ్వుతోంది. మరో వైపు తాజాగా లద్ధాఖ్ లో కూడా లడాయికి దిగింది. కాని, బీజింగ్ లోని పాలకులు మాత్రం తమకేం తెలియదంటూ దొంగ నాటకాలు ఆడుతున్నారు. మొత్తం మీద డ్రాగన్ ఎలాగైనా ఇండియాని కాల్పుల దాకా తీసుకొచ్చి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాలని తాపత్రయపడుతోంది. కాని, ఇండియా మాత్రం కూల్ గానే కనిపిస్తోంది. అయితే, మరో మూల నుంచి మోదీ సర్కార్ సైలెంట్ గా చైనాపై యుద్ధానికి దిగుతోందని నిపుణులు అంటున్నారు!   చైనాపై నిశ్శబ్ధ యుద్దామా అంటారా? అవును… నిశ్శబ్ద యుద్ధమే! పైగా ఇది చైనా మాదిరిగా ఆర్మీని ఉపయోగించి, రెచ్చగొట్టి, రాళ్లు రువ్వి, తోసుకుని, తిట్టుకునే కవ్వింపు కూడా కాదు. మరి ఏంటి అంటారా? ఇన్ డైరెక్ట్ వార్! డ్రాగ్ న్ను ఎక్కడ గిల్లితే ఆ దేశానికి బాగా మంట పుడుతుందో అక్కడ మెలిపెట్టాలని ఇండియా నిర్ణయించుకుంది. ఆల్రెడీ చర్యలు కూడా మొదలు పెట్టింది!   చైనాకు ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది మన సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ( సీఈఏ ). ముందు ముందు భారతీయ పవర్ స్టేషన్లు, గ్రిడ్లు భద్రంగా వుండేందుకు, సైబర్ దాడులు జరక్కుండా వుండేందుకు తగిన చర్యలు తీసుకోవాలనుకుంటోంది. అందుకోసం తగిన రోడ్ మ్యాప్ కూడా తయారవుతోందని స్వయంగా విద్యుత్ శాఖా మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఇక మీదట కాంట్రాక్టులు ఇచ్చేప్పుడు ఇండియన్స్ కి , ఇండియన్ కంపెనీలకి తొలి ప్రాధాన్యత వుంటుందని ఆయన అన్నారు. త్వరలోనే చైనీస్ కంపెనీలకు రకరకాల రూల్స్ తో చెక్ పెట్టనున్నారు. పదేళ్ల నుంచీ సదరు కంపెనీ ఇండియాలో కొనసాగుతూ వుండాలి, కంపెనీ టాప్ పొజీషన్లలో భారతీయ పౌరులు వుండి వుండాలి, ఇలాంటివే నిబంధనలే కాక మరికొన్ని టెక్నికల్ రూల్స్ కూడా చైనా కంపెనీలకు చుక్కలు చూపించే అవకాశాలున్నాయి…   విద్యుత్ రంగంలోనే కాదు టెలికామ్ రంగంలోనూ కామ్ గా తన పని తాను చేసుకుపోతోంది ఇండియా. కొద్ది రోజుల క్రితమే స్మార్ట్ ఫోన్ల తయారీలో ప్రస్తుతం పాటిస్తోన్న భద్రతా పరమైన చర్యలు తెలపాల్సిందిగా… ఎలక్ట్రానిక్స్ , ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 21 కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది! సహజంగానే వీటిలో అత్యధిక కంపెనీలు చైనీస్! జియోమీ, లెనోవో, ఓప్పో, వివో, జియోనీ లాంటి కోట్లాది రూపాయలు గడిస్తోన్నవి అన్నీ వున్నాయి…   విద్యుత్, టెలికామ్ తో మొదలైన ఈ ఇన్ డైరెక్ట్ వార్ ముందు ముందు ఇతర రంగాలకు కూడా విస్తరించవచ్చని నిపుణులు అంటున్నారు. చైనాకు ఇండియాలో లక్షల కోట్ల మార్కెట్ వున్నా తెంపరితనంతో కయ్యానికి కాలు దువ్వుతోంది. అలాగే, మరో వైపు పాకిస్తాన్ తో కలిసి దుర్మార్గ రాజకీయం చేస్తోంది. ఇన్ని చేస్తూ కూడా అప్పన్నంగా ఇండియా నుంచి కోట్లు డండుకోవాలని నిర్ణయించుకుంది. ఇది జరక్కుండా వుండేలా కఠిన చర్యలు మొదలు పెట్టింది భారత్. ఇది మన లోకల్ కంపెనీల సంక్షేమం దృష్ట్యా కూడా తక్షణ అవసరం అంటున్నారు జాతీయవాదులు.   ఇప్పటికే జపాన్ లాంటి దేశాలు స్పష్టంగా తమ మద్దతు ఇండియాకు ప్రకటించాయి. అమెరికా కూడా మన వైపునే మాట్లాడుతోంది. ఈ రాజకీయ వ్యూహం కాకుండా ఆర్దికంగా కూడా చైనాను కట్టడి చేయటం తప్పనిసరిగా అభినందించాల్సిన విషయమే!
  నంద్యాల సంగ్రామం భారీ యుద్ధంగానే పరిణమించింది! ఏదో సాదాసీదా ఉప ఎన్నికగా ముగుస్తుందనుకున్న పోరు కాస్తా ఇప్పుడు సాధారణ ఎన్నికల రేంజ్లో కాక రేపుతోంది! అయితే, ఇందుకు కారణం టీడీపీనా? వైసీపీనా? రెండూ అనే చెప్పాలి! అధికార పక్షం ప్రిస్టేజ్ గా తీసుకుంటే… ప్రతిపక్షం రానున్న ఎలక్షన్స్ కి ప్రిపరేషన్ గా తీసుకుంటోంది! అందుకే, కేవలం ఒకే ఒక్క సీటు కోసం ఓ భారీ యుద్ధమే కొనసాగిస్తున్నారు బాబు, జగన్ వర్గంలోని వారంతా!   నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ దాడుల సెగ బాలయ్య బాబుకి కూడా తప్పటం లేదు. ఇన్ని రోజులు చంద్రబాబును టార్గెట్ చేసిన వైసీపీ మద్దతుదారులు తాజాగా సోషల్ మీడియాలో బాలయ్య బాబును ఆడిపోసుకుంటున్నారు. వారు వైరల్ చేస్తోన్న వీడియో బాలకృష్ణ ఓ అభిమానిని కొట్టింది! ఆయన ఎందుకు అసహనానికి గురయ్యారు? అలా ఎవరో ఒక ఫ్యాన్ మీద చేయి చేసుకుంటే హిందూపురం ఎమ్మెల్యేకి వచ్చే లాభం ఏంటి? ఇలాంటివేవీ ఆలోచించకుండా బాలయ్య దురుసు ప్రవర్తన అంటూ వైసీపీ అల్లరి చేస్తోంది! అంతే కాదు, ఫ్యాన్ పార్టీ నంద్యాల అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి, బాలకృష్ణ ఫ్యాన్స్ హర్ట్ అయ్యేలా కామెంట్స్ చేశారు! ఆయన కోపమొస్తే ఎవర్ని పడితే వార్ని కొడతారంటు ఎద్దేవ చేశారు!   బాలకృష్ణ నంద్యాల ప్రచారంలో వైసీపీని రాజకీయంగానే టార్గెట్ చేశారు. ఆయన జగన్ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయమని మాత్రమే అన్నారు. ఎక్కడా ఎవర్నీ పర్సనల్ గా విమర్శించలేదు. అయినా, వైసీపీ వారు ఆయన ఓ వ్యక్తిపై చేయి చేసుకుంటే దాన్ని గురించి రాద్ధాంతం చేస్తున్నారు. కనీసం అలా జరగటానికి కారణం కూడా చెప్పకుండా విచ్చలవిడి కామెంట్లు, షేరింగ్ లకు తెగబడుతున్నారు. కాని, జనం ఓటు వేయటానికి బూతుకి వచ్చేటప్పుడు సోషల్ మీడియా హంగామాలు ప్రభావం చూపుతాయా? అదీ బాలకృష్ణ లాంటి ఓ ఇమేజ్ వున్న అగ్ర నటుడు, నందమూరి తారకరామారావు కొడుకు…. ఆయన పై జనం ఓ వైరల్ వీడియో చూసి సీరియస్ అయిపోతారా? ఇది వైసీపీ ఆలోచించుకోవాలి! రాజకీయ నాయకుల్ని పర్సనల్ గా టార్గెట్ చేయటమే తప్పు… అటువంటిది సినీ గ్లామర్ , కోట్లాది మంది అభిమానులున్న బాలకృష్ణ లాంటి హీరో వ్యక్తిత్వాన్ని కించపరటం మరింత తప్పు. దీని వల్ల పెద్దగా లాభం వస్తుందనైతే ఆశించటం దండగ! ఇప్పటికే జగన్ చంద్రబాబుని, రోజా మంత్రి అఖిలప్రియని పర్సనల్ గా టార్గెట్ చేశారు. ఇప్పుడు బాలకృష్ణను కూడా వైసీపీ వారు వ్యక్తిగత దూషణలతో టార్గెట్ చేస్తున్నారు. దీని ఫలితం ఎన్నికల కౌంటింగ్ నాడు మాత్రమే తెలుస్తుంది!   ఒకవైపు జగన్ శిబిరం వ్యక్తిగత దాడులతో రచ్చ చేస్తుంటే… జగన్ పుట్టక ముందు నుంచే పాలిటిక్స్ లో వున్న చంద్రబాబు తన అనుభవంతో కూల్ గా పని చేసుకుపోతున్నారు. కర్నూల్ లో బలమైన నేతగా వున్న వైసీపీ నాయకుడు గంగుల ప్రతాప్ రెడ్డిని టీడీపీలోకి ఆకర్షించగలిగారు! శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రఫాణి రెడ్డీల్ని తమ వైపుకు లాగిన వైసీపీకి ఇది నిజంగా నష్టమే! గంగుల ప్రతాప్ రెడ్డి మద్దతు దారులు కర్నూల్ లో చెప్పుకోదగ్గ స్థాయిలో వుంటారు. వారి ప్రభావం కేవలం నంద్యాల ఉప ఎన్నికకే కాదు రానున్న సాధారణ ఎన్నికపై కూడా తప్పక పడుతుంది!
  కాంగ్రెస్ ముక్త్ భారత్… ఈ నినాదం మోదీ నోట వచ్చింది మొదలు బ్యాడ్ టైం నడుస్తూనే వుంది హస్తం పార్టీకి! అయితే, అందుక్కారణం నిజంగా మోదీనో, మరో ఇతర పార్టీనో కాదు! స్వయంగా కాంగ్రెస్ హై కమాండే! ఇంకా స్పష్టంగా చెప్పాలంటే… కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ! ఈ మధ్య చాలా రోజులుగా సోనియా యాక్టివ్ గా వుండటం లేదు. ఆమె పాల్గొనే మీటింగ్ లు, ఇస్తోన్న స్పీచ్ లు బాగా తగ్గిపోయాయి. ఆమె బాధ్యత తాను తీసుకోవాల్సిన రాహుల్ గాంధీ ఎప్పుడు ఇంట్లో వుంటాడో, ఎప్పుడు విదేశాలకు, ఎందుకు వెళాతాడో అర్థం కాని పరిస్థితి! దీనికి తోడు ఈ మధ్య కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నోరు తెరిస్తే చాలు వివాదాలు, వినోదాలు దొర్లిపొతున్నాయి. ఆయన మాట్లాడే తప్పులు పదే పదే సుబ్రమణ్యం స్వామి ముద్దుగా పిలిచిన పప్పు అన్న పదాన్నే గుర్తుకు తెస్తున్నాయి…   అతి త్వరలో కాంగ్రెస్ పార్టీ డూ ఆర్ డై ఎన్నికలు ఎదుర్కోబోతోన్న రాష్ట్రం కర్ణాటక. గుజరాత్ లాంటి రాష్ట్రంలోనూ ఎన్నికలున్నా అక్కడ గెలుపు అవకాశాలు దాదాపు శూన్యం! ఇక మిగిలింది దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటక. అయితే, అక్కడ సిద్ధరామయ్య సర్కార్ హడావిడి నిర్ణయాలు చూస్తుంటే కాంగ్రెస్ టెన్షన్ లో వున్నట్టు ఈజీగానే అర్థమైపోతోంది. తాజాగా ఇందిరా క్యాంటీన్స్ అంటూ ఓ కాపీ పథకం ప్రవేశపెట్టారు కన్నడ సీఎం. అందులో ప్రత్యేకతేం లేదు… తమిళనాడులో జయలలిత అమ్మ క్యాంటీన్ల పేరుతో చేసిన పనే సిద్ధారామయ్య చేస్తున్నారు. అయితే, 5రూపాయలకు టిఫిన్, తక్కువ ధరకు భోజనం ఆల్రెడీ ఇంకా అనేక రాష్ట్రాల్లో అమల్లో వుంది. ఏపీలో , తెలంగాణలో, ఉత్తర్ ప్రదేశ్ లో ఇలాంటి చీప్ అండ్ బెస్ట్ క్యాంటీన్స్ విజయవంతంగా నడుస్తున్నాయి.   ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని అయినా సరే… సిద్ధరామయ్య ఇంత ఆలస్యంగా బెంగుళూరులో ఇందిర క్యాంటీన్స్ ప్రారంభించటం ఆనందించాల్సిన విషయమే! కాని, తమాషా అంతా ఈ క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి వచ్చిన రాహుల్ స్పీచ్ తోనే జరిగింది. తన నాన్నమ్మ ఇందిరా గాంధీ పేరున కన్నడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరా క్యాంటీన్స్ మొదలు పెడితే రాహుల్ అమ్మ క్యాంటీన్స్ అన్నాడు! మళ్లీ వెంటనే సర్దుకుని ఇందిర క్యాంటీన్స్ అన్నాడు. ఆ తరువాత, త్వరలోనే బెంగుళూరులోని అన్ని నగరాల్లో ఇందిర క్యాంటీన్లు మొదలవుతాయని అన్నాడు! బెంగుళూరు సిటీలో మళ్లీ వివిధ నగరాలు వుండటం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు! కేవలం 5నిమిషాలు సాగిన రాహుల్ స్పీచ్ లో ఒకట్రెండు సార్లు క్యాంటీన్ అనకుండా క్యాంపైన్ అన్నాడట కూడా!   ఉపన్యాసం ఇస్తున్నప్పుడు పొరపాట్లు జరగటం సహజం. దాన్ని సరదాగా తీసుకొని ఊరుకోవచ్చు. కాని, రాహుల్ భారతదేశ అతి పురాతన పార్టీకి ఉపాధ్యక్షుడుగా వుంటూ ఇలాంటి చిన్న చిన్న తప్పులు పదే పదే చేయటం… అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది! ఆ మధ్య ఓ సారి గాంధీల వారసుడు ఆలూ కి ఫ్యాక్టరీ అన్నాడు! ఆలుగడ్డల కర్మాగారం అంటే అర్థం ఏంటో స్పీచ్ విన్న వారికి ఎవరికి అర్థం కాలేదు!   రాహుల్ గాంధీ పదాలు సరిగ్గా పలికినా పలక్కపోయినా కర్ణాటక కాంగ్రెస్ కు వచ్చే లాభం, నష్టం పెద్దగా వుండకపోవచ్చు. కాకపోతే, ఒక వైపు ఇందిర క్యాంటీన్ల ప్రారంభోత్సవ హడావిడిలో సీఎం తలమునకలైతే… మరో వైపు బెంగుళూరు నగరం మొత్తం గత శతాబ్దంలో ఎప్పుడూ లేని విధంగా భీభత్సమైన వర్షాన్ని ఎదుర్కొంది. ఆ వర్షం నుంచి ఇంకా తేరుకోక ముందే రాహుల్ వచ్చి క్యాంటీన్లు ప్రారంభించాడు. ఆయన రాక కోసం గంటల తరబడి రోడ్లు మూసి వేయటంతో జనం విపరీతమైన అసహనానికి లోనయ్యారట! అలాగే చాలా చోట్ల ఈ సరికొత్త ఇందిరా క్యాంటీన్ల ఏర్పాటు స్థానికులు వ్యతిరేకిస్తున్నారట. క్యాంటిన్ల నిర్వహణ వల్ల వచ్చి పడే చెత్తా, చెదారం గురించి ఆందోళన చెందుతున్నారట!   ఇందిరా క్యాంటీన్ల పథకం కన్నడ కాంగ్రెస్ కు ఎన్ని ఓట్లు తెచ్చి పెడుతుందో చూడాలి …
  ఆగస్ట్ 14…. మనకు పెద్ద ప్రత్యేకం ఏం కాదు! కాని, ఆగస్ట్ 15 మనకు చాలా స్పెషల్! ఆ రోజే మనకు స్వాతంత్ర్యం సిద్ధించింది. అయితే, ఆగస్ట్ 14 మన పక్క దేశానికి వెరీ వెరీ స్పెషల్! పాకిస్తాన్ పుట్టింది ఆ రోజే! మనకన్నా ఒక్క రోజు ముందు పాకిస్తాన్ కు స్వేచ్ఛ లభించింది. అయితే, అఖండ భారత్ నుంచి పాకిస్తాన్, నేటి బంగ్లాదేశ్ లు విడిపోయిన రోజుగా.. ఆగస్ట్ 14 మనకు మాత్రం ఓ విషాద దినం! మరి మన 70ఏళ్లు పూర్తైన మన స్వతంత్ర ప్రస్థానం వేళ… ఓ సారి కొన్ని ముఖ్యమైన సంఖ్యలపై దృష్టి సారిద్దామా! ఈ కీలకమైన నెంబర్లు మనకే కాదు, పాకిస్తానీలకు, బంగ్లాదేశీలకు కూడా ఎంతో ముఖ్యమే!   190… అవును… 190సంవత్సరాల సుదీర్ఘ కాలం మన దేశాన్ని బ్రిటీషర్లు ఆక్రమించారు. పరిపాలించారు. దోపిడీ చేశారు. వెళుతూ వెళుతూ ఇండియా, పాకిస్తాన్ గా అఖండ భారత్ ని విడదీసి వెళ్లారు.   400మిలియన్లు… అంటే 40కోట్లు! ఈ సంఖ్య డెబ్బై ఏళ్ల కిందటి భారత దేశ జనాభ! మనల్ని బ్రిటీష్ వాళ్లు వదిలి వెళ్లేటప్పుడు ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ భూభాగాలు మొత్తంలో కలిపి వున్న జనం సంఖ్య!   40రోజులు… ఈ సంఖ్య ఏంటో తెలుసా? బ్రిటీష్ జడ్జ్ సిరిల్ రాడ్ క్లిఫ్ కు విధించిన కాల పరిమితి! కేవలం 40రోజుల్లో కోట్లాది మంది భారతీయుల బతుకుల్ని, చావుల్ని నిర్దేశించే దేశ విభజన చిత్రపటాన్ని గీసేశాడు ఆ తెల్ల న్యాయాధికారి! అతను చేసిన విభజన తరువాత విపరీతమైన ప్రాణ నష్టం సంభవించింది…   3800మైళ్లు… అంటే 6100కిలో మీటర్లు! ఇంత సుదీర్థ సరిహద్దులు ఇండియా , పాకిస్తాన్ ల మధ్య ఏర్పడ్డాయి. ఆనాటి తూర్పు పాకిస్తాన్… అంటే నేటి బంగ్లాదేశ్ … పశ్చిమ పాకిస్తాన్ కు 1000మైళ్ల దూరంలో వుండేది! మధ్యలో భారత భూభాగం వుండగా తూర్పున, పశ్చిమాన పాకిస్తాన్ వుండేలా విభజన జరిగింది.   0… అవును సున్నా సార్లు పాకిస్తాన్ అన్న పేరు ఉచ్ఛరించారు అప్పటి బ్రిటీష్ ప్రధాని అట్లీ, భారత వైస్రాయ్ మౌంట్ బ్యాటన్! దేశ విభజన ప్రకటన చేస్తూ, జూన్ 3, 1947న… బ్రిటీష్ ప్రధాని, వైస్రాయ్ ఒక్కసారి కూడా పాకిస్తాన్ అన్న పదం వాడలేదు!   48గంటలు… ఇండియాకి ఫ్రీడమ్ డిక్లేర్ చేయటానికి 48గంటల ముందు నుంచీ బ్రిటీష్ సేనలు తమ స్వదేశానికి బయలుదేరటం ప్రారంభించాయి. కాని, పూర్తిగా తెల్ల వారి సైన్యం ఇంటి ముఖం పట్టటానికి 1948 ఫిబ్రవరీ వరకూ సమయం పట్టింది!   1మిలియన్… అంటే 10లక్షలు! ఈ ఒళ్లు గగుర్పొడిచే సంఖ్య భారత్ , పాకిస్తాన్ విభజన కారణంగా చనిపోయిన అభాగ్యులది! ఇది తప్పని వాదించే వారు చాలా మంది వున్నారు. 20లక్షల మందికి పైగానే ప్రాణాలు కోల్పోయి వుంటారని అంచన!   83వేలు! మీ గుండె రాయి చేసుకోండి! ఈ సంఖ్య దేశ విభజన కాలంలో అత్యాచారాలకి, కిడ్నాప్ లకి గురైన అమ్మాయిలు, స్త్రీల సంఖ్య! సహజంగానే… ఇది కూడా ఖచ్చితమైన లెక్క కాదు! ఇంకా ఎక్కువ సంఖ్యలోనే అభాగిణులు తమ మానాలు, ప్రాణాలు కోల్పోయి వుండవచ్చు!   15మిలియన్లు… అంటే ఒక కోటీ యాభై లక్షలు! ఇంత మంది భారత్ , పాకిస్తాన్ ల మధ్య వలస వెళ్లారు! అత్యధికులు హిందూ, సిక్కు మతస్థులు పాకిస్తాన్ నుంచి భారత్ వచ్చేశారు!   4లక్షలు… అవును… నాలుగు లక్షల మంది పాకిస్తాన్ నుంచి కాలి నడకన ఎర్రటి ఎండలో భారతదేశం వలసొచ్చారు! వారంతా ఒకే క్రమ వరుసలో క్యూ కట్టినట్టు స్వంత దేశంలో శరణార్థలై నడిచొచ్చారు!   2లక్షల మైళ్లు… శరణార్థుల్ని మోసుకుని వచ్చిన ట్రైన్లు అప్పట్లో తిరిగిన మొత్తం దూరం సంఖ్య ఇది!   3…. ఇప్పటికి మూడు సార్లు మనకు , పాకిస్తాన్ కు మధ్య యుద్ధం జరిగింది! మూడు సార్లు మనమే గెలిచాం. ఒకసారైతే విభజన సమయంలో తూర్పు పాకిస్తాన్ గా ఏర్పడ్డ భూభాగం బంగ్లాదేశ్ గా ఆవిర్భవించింది! ఇందిరా గాంధీ సమయంలో జరిగిన ఈ పరిణామం భారతదేశానికి ఎంతో మేలు చేసిందని చెప్పాలి! ఇరువైపుల పాకిస్తాన్ వుంటే… ఇప్పటి మన పరిస్థితి మరింత దారుణంగా వుండేది!
  ఇప్పుడు ప్రపంచం దృష్టి మొత్తం కేంద్రీకృతమైన చోటు ఉత్తర కొరియా. అక్కడ ఏ క్షణమైనా అమెరికా నిప్పుల వర్షం కురిపించవచ్చని చాలా మంది భావిస్తున్నారు. యుద్ధం వచ్చేది కాదు, అన్నీ ఒట్టి బెదిరింపులే అనేవారు ఇంకా వున్నారు. కాని, పైకి ఎవరు ఎన్ని మాటలు చెబుతున్నా లోలోన యుద్దం జరగదని నమ్మకమున్న వారు చాలా తక్కువ! చివరకు, ఇంత కాలం హాయిగా తమాషా చూస్తూ వచ్చిన చైనా కూడా ఇప్పుడు అమెరికా, కొరియాల మధ్య ఏం జరుగుతుందోనని బెంగ పడుతోన్నట్టు కనిపిస్తోంది!   ఒకవైపు మనతో డోక్లామ్ లో కోరి కొరివితో తల గొక్కుంటున్న చైనా ఉత్తర కొరియాను మాత్రం ఆ పని చేయొద్దని హెచ్చరిస్తోంది. అధికారికంగా కాకున్నా అక్కడి ప్రధాన పత్రికల సంపాదకీయాల్లో ఆ భావం వచ్చేలా రాయిస్తోంది. తాజాగా ఓ పత్రిక ఉత్తర కొరియాను సీరియస్ గా హెచ్చరించింది. యుద్ధం అమెరికా మొదలు పెడితే చైనా అడ్డుకుంటుంది తప్ప నార్త్ కొరియా బలుపుతో అడుగు ముందుకు వేస్తే తాము ఏం చేయమని అంటోంది! ఇది చైనా పాలకుల మాట కాదు. కాని, కమ్యూనిస్టు చైనాలో పత్రికలు తమ స్వంత అభిప్రాయాలు రాయవనేది అందరికీ తెలిసిందే. అక్కడి రూలింగ్ పార్టీ అభ్రిపాయమే మీడియా చెబుతుంది!   గత వారం రోజుల్లో ట్రంప్ , కిమ్ ఇద్దరూ రెచ్చిపోయారు. పదే పదే తమని తట్టి లేపుతోన్న కొరియాపై అమెరికా గట్టి మాటలతో దాడి చేసింది. ప్రపంచం కనీవినీ ఎరుగని రీతిలో నిప్పుల వర్షం కురిపిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. దానికి కౌంటర్ గా ఉత్తర కొరియా నియంతృత్వ పాలకులు అమెరికా భూభాగమైన గువామ్ పై అణు దాడి చేస్తామంటూ బాధ్యతా రహితంగా మాట్లాడారు. దీంతో యుద్ధం తప్పదని అంతా భావించటం మొదలు పెట్టారు. మరో వైపు ఆస్ట్రేలియా లాంటి దేశాలు యుద్ధం వస్తే తాము అమెరికా వైపే అంటూ ప్రకటనలు కూడా చేసేస్తున్నాయి. జపాన్, దక్షిణ కొరియాలైతే ఎప్పట్నుంచో ఉత్తర కొరియా పని పట్టాలని కసిగా వున్నాయి!   ఇరు కొరియాలు విడిపోయి వుంటే ఎక్కువగా లాభపడేది చైనానే! అందుకే, నియంతృత్వంలో మగ్గుతోన్న ఉత్తర కొరియాకి ఎల్లప్పుడూ డ్రాగన్ సాయం అందుతూ వుంటుంది. అక్కడ కూడా ప్రజాస్వామ్యం వచ్చేస్తే ఇరు కొరియాలు అమెరికా పంచన చేరటం అనివార్యం. అది చైనాకి ఎంత మాత్రం ఇష్టం లేదు. అందుకే, ఎప్పుడూ ఉతర్త, దక్షిణ కొరియాల నడుమ ఉద్రిక్తలు వుండాలనే కొరుకుంటుంది. కాని, ఇప్పుడు తీరా ట్రంప్ యుద్ధం చేసే ఆలోచనకు వచ్చే సరికి చైనా టెన్షన్ లో మునిగిపోయింది. ఎందుకంటే, మార్కెట్ అవసరాల దృష్ట్యా చైనా అమెరికాను ఎదుర్కొనే స్థితి ఇప్పడు లేదు. ఏక పక్షంగా అగ్ర రాజ్యం ఉత్తర కొరియా మీద దాడి చేసినా చైనా చేయగలిగింది చాలా తక్కువే! అందుకే, నార్త్ కొరియా రెచ్చగొట్టి అమెరికా కొరివితో తల గొక్కోవద్దని చైనా చెబుతోంది. ఒకవేళ యుద్ధమే మొదలైతే ఉత్తర కొరియాలో నియంతృత్వం కొనసాగటం అసాధ్యం. ఆ తరువాత చైనాకు మిగిలే లాభమూ శూన్యం!
నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. 2019 ఎన్నికలకు ముందు ఎవరి స్టామినా ఏంటో..మూడేళ్ల టీడీపీ పాలనపై ప్రజల మనసులో ఏముందో..ప్రతిపక్షంపై అసలు జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలంటే సర్వేలతో అయ్యే పనికాదు. అందుకే నంద్యాలపై పాలక, ప్రతిపక్షాలు అంతగా ఫోకస్ చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఓటు నిర్ణయాత్మకమే..అందుకే ఇరు పార్టీల అధినేతలు వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తున్నారు. తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా రాష్ట్ర నలుమూలల నుంచి నాయకులును నంద్యాలకు తరలించి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి ఇరు వర్గాలు. వైసీపీ అధినేత జగన్ ప్రచార పర్వంలోకి దిగడంతో ప్రచారానికి ఊపు వచ్చింది. దీంతో తాము వెనుకబడ్డామని భావించారో ఏమో తెలియదు కానీ అపర చాణుక్యుడు చంద్రబాబు కొత్త ఎత్తు వేశారు.   రాయలసీమ ప్రాంతంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ప్రచారంలోకి తీసుకురావాలని టీడీపీ భావిస్తోంది. ఇందుకు బాలయ్య కూడా అంగీకరించినట్లు సమాచారం. ఇక బాలయ్యకు తోడుగా జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌ని కూడా రంగంలోకి దించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అయితే టీడీపీకి మద్దతు ఇచ్చే విషయంపై పవన్ ఇంకా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నట్లు జనసేన వర్గాలు అంటున్నాయి. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేనను మరింత పటిష్టం చేసుకునే దిశలో ముందుకు సాగుతున్నారు పవన్. ఇలాంటి పరిస్ధితుల్లో టీడీపీకి మద్దతిస్తే జనసేనకు ప్లస్సా..? మైనస్సా  అన్న విషయంలో ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.   ఈ మూడేళ్లలో ఉద్దానం కిడ్నీ బాధితులు , ప్రత్యేక హోదా వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసినా మిత్రపక్షం నుంచి బయటికి రాలేదు. పలుసార్లు సీఎం చంద్రబాబును కలిసి సమస్యలు వివరించారే తప్ప.. అధికార పక్షానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. దీంతో నంద్యాల ఉప ఎన్నికకు పవన్ తమకే మద్దతు ప్రకటిస్తారని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ పవన్ కనుక సైకిల్‌కే సై అంటే మాత్రం జగన్‌కు నష్టమే..2 లక్షల 9 వేల 612 మంది ఓటర్లు ఉన్న నంద్యాలలో బలిజ ఓటర్లు దాదాపు 42 వేలు ఉంటారని అంచనా..పవర్ స్టార్ టీడీపీ తరపున ప్రచారంలోకి దిగితే అది బలిజ ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.   మరో వైపు మెగా కుటుంబంతో భూమా కుటుంబానికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. భూమా దంపతులు పీఆర్‌పీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2009లో ఆళ్లగడ్డ నుంచి శోభా నాగిరెడ్డి ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు కూడా. ఈ నేపథ్యంలో పవన్ మద్దతు తమకే ఉంటుందని మంత్రి భూమా అఖిల ప్రియ బలంగా విశ్వసిస్తున్నారు. నంద్యాలలో విజయం తమదేనని భావిస్తున్న వైసీపీ నేతలు పవన్, బాలయ్య ప్రచారంలోకి వస్తే వారిని తమ అధినేత ఏ విధంగా నిలువరిస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పార్టీ అధినేత్రిగా, ముఖ్యమంత్రిగా జయలలిత ఉన్నంత కాలం నల్లేరుపై నడకలా సాగిన అన్నాడీఎంకేకు ఆమె మరణం శరాఘాతంలా తగిలింది. అమ్మ మరణానంతరం పార్టీని, ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకునేందుకు చిన్నమ్మ వేసిన ఎత్తులు ఫలించకపోవడం..సుప్రీంకోర్టు తీర్పుతో శశికళ జైలు పాలవ్వడం వెంట వెంటనే జరిగిపోయాయి. తనకు దక్కకపోయినా పర్లేదు కానీ..పన్నీరుకు మాత్రం సీఎం కుర్చీ దక్కడానికి వీల్లేదని భావించిన చిన్నమ్మ జైలుకు వెళుతూ..వెళుతూ ఎడప్పాడి పళనిసామిని ముఖ్యమంత్రిగా నియమించారు. అప్పటికే పళనిసామిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని..అందువల్ల అలాంటి వ్యక్తి కంటే..అమ్మకు విశ్వాసపాత్రుడైన పన్నీరు సెల్వమే రాష్ట్రాధినేత కావాలని కొందరు ఎమ్మెల్యేలు బయటకు వచ్చేశారు. దీంతో అన్నాడీఎంకే పన్నీరు వర్గంగా..పళనిస్వామి వర్గంగా చిలీపోయింది.   ప్రజల మద్దతు లేని పళనిస్వామి కంటే పన్నీరుకే మద్దతు ఉంటుందని, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలంతా ఎప్పటికైనా ఓపీఎస్ చెంతకు చేరుతారని అందరూ భావించారు. అయితే అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి..సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పార్టీలో అసంతృప్తులను చల్లార్చుకుంటూ..అందరినీ కలుపుకుంటూ పోతున్నారు పళనిస్వామి. కానీ మాజీ ముఖ్యమంత్రి, జయ నమ్మిన బంటు పన్నీరు సెల్వం మాత్రం అన్నాడీఎంకే పురచ్చి తలైవి అమ్మ వర్గం పేరుతో రాష్ట్రంలోని సమస్యలపై ఆందోళన కొనసాగిస్తున్నారు. సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తుంటే డీఎంకేకు కోపమొస్తోందని, దీన్ని బట్టి చూస్తే స్టాలిన్‌తో పళని ప్రభుత్వం పొత్తు పెట్టుకుందని స్పష్టమవుతుందన్నారు పన్నీరు.   అన్నాడీఎంకే వర్గాలు ఏకమవుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరదించాలనుకున్నారో లేక మరొకటో కానీ ఎంజీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళనాట సంచలనం సృష్టిస్తున్నాయి. అధికార పార్టీ చురుకుగా లేకపోవడంతో రాష్ట్రంలో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదంటూ ఆరోపించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జల్లికట్టు సమస్య, చెన్నై తాగునీటి కోసం ఏపీ సీఎంను కలిసి 2.5 టీఎంసీల నీటిని పొందడం వంటి కఠినతరమైన సమస్యలను చక్కగా పరిష్కరించానని గుర్తు చేశారు. తాను అమ్మ అడుగు జాడల్లో రాజకీయంగా ఎదిగానని..తాను రెండుసార్లు పెరియకుళం నుంచి, రెండుసార్లు బోడి నియోజకవర్గం నుంచి గెలిచానని ప్రజల మద్దతు తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. తాము ప్రారంభించిన ధర్మయుద్ధం కొనసాగుతుందని..ఈ పోరాటంలో విజయం సాధించడానికి అందరు సహకరించాలని పిలుపునిచ్చారు. భారత ఎన్నికల సంఘం శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా అంగీకరించలేదని...అందువల్ల ఆమె ద్వారా నియమితులైన ఇతరులు పార్టీకి, ప్రభుత్వానికి నేతృత్వం వహించడానికి అనర్హులని..అమ్మ ద్వారా నియమించబడిన తమకు మాత్రమే పార్టీకి నాయకత్వం వహించే అర్హత ఉందని స్పష్టం చేశారు.   ఇదిలాఉండగా ఈ అసమ్మతి సెగలను తనకు అనుకూలంగా మార్చకునేందుకు అన్నాడీఎంకే ఉపప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌‌ పావులు కదుపుతున్నారు. పార్టీపై పట్టు కోసం 64 మంది అనుయాయులకు పదవులు కట్టబెట్టారు. ఎవ్వరినీ పదవులు నుంచి తొలగించకుండా, ఖాళీగా ఉన్న పదవులను మాత్రమే తన అనచరులతో భర్తీ చేశారు. దీంతో పళని, పన్నీర్ వర్గాలు ఖంగుతిన్నాయి. ఈ అర్హత, అనర్హతలకు అర్థాలు వెతకడం మాని పార్టీని ముందు చేజిక్కించుకోవాలని లేదంటే పార్టీ అంతిమంగా ప్రభుత్వం కూడా మన్నార్‌గుడి మాఫియా చెప్పు చేతల్లోకి వెళ్లిపోతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. శశికళ-ఆమె బంధువు దినకరన్‌ను పార్టీ నుంచి బహిష్కరించామని ప్రకటనలు వస్తున్నా..వారిద్దరూ సాంకేతికంగా ఇంకా పార్టీ సభ్యులే..కాబట్టి ఎడప్పాడి, ఓపీఎస్ గ్రూపులు రాష్ట్రంలో, పార్టీలో నెలకొన్న అనిశ్చితిని తొలగించడంపై దృష్టి సారిస్తే మంచిది.
ప్రపంచ క్రీడా చరిత్రలో తమ తమ రంగాల్లో తిరుగులేని ప్రతిభా పాటవాలను చూపించినవారు, రికార్డులను నెలకొల్పినవారు ఎంతో మంది ఉన్నారు. కానీ, సదరు క్రీడ వల్ల వ్యక్తికి కాకుండా, ఆ వ్యక్తివల్లే ఆ ఆటకు గుర్తింపు రావడం అరుదు. బాక్సింగ్‌లో మహ్మద్ అలీ, క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్, ఫుట్‌బాల్‌లో మారడోనా ఇలా ఎంతో మంది క్రీడాకారులు ప్రపంచం చేత జేజేలు పలికించుకున్నారు. అలాంటి వారి జాబితాలో ఉసేన్ బోల్ట్ కూడా ఒకరు. 100. మీ పరుగుపందెంలో దశాబ్ధకాలం పాటు స్ప్రింట్‌కింగ్‌గా ప్రపంచాన్ని ఏలాడు ఉసేన్. ప్రాణ ప్రదమైన కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికాలని ప్రతీ ఒక్క ఆటగాడికి ఉంటుంది. అయితే అలా జరగడం కొందరికి మాత్రమే చెల్లింది.   ప్రాణంగా ప్రేమించిన కెరీర్‌ను వీడుతున్నానే బాధో అభిమానులను ఇక అలరించలేను అనుకున్నాడో కానీ తన ఆఖరి పరుగు పందెంలో ఈ జమైకా చిరుత అడుగు తడబడింది. స్వర్ణంతో గ్రాండ్‌గా కెరీర్‌కు బై..బై చెబుదామనుకున్న బోల్ట్‌ ఆశ నెరవేరలేదు. ఐఏఏఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో భాగంగా ఈ ఆదివారం జరిగిన 100 మీ ఫైనల్లో బోల్ట్‌కు షాకిచ్చాడు ఆయన చిరకాల ప్రత్యర్థి గాట్లిన్. ఈ వార్త యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎందుకంటే ఉసేన్ రేస్‌లో ఉన్నాడంటే...ప్రత్యర్థులతో పాటు అభిమానులు కూడా సెకండ్ ప్లేస్‌ ఎవరిదా అని బెట్టింగులు వేసుకునేవారు. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ ఎలాగూ బోల్ట్‌దేనని ఫిక్స్‌ గనుక.‌   అటువంటి ఆటగాడి చివరి పరుగు కోసం ప్రపంచం మొత్తం ఊపిరిబిగబట్టి ఎదురుచూసిన వేళ..స్వర్ణం పక్కా అనుకుంటే..కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గాట్లిన్ 9.92 సెకన్లలో గమ్యానికి చేరగా, అమెరికాకు చెందిన క్రిస్టియన్ కోల్‌మన్ 9.94 సెకన్ల టైమింగ్‌తో రజతాన్ని సాధించగా..బోల్ట్ 9.96 టైమింగ్‌తో కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. క్రీడల్లో ఎంతటి వారైనా పరాజయం పాలుకాక తప్పదు కానీ రెండుసార్లు డోపీగా పట్టుబడిన గాట్లిన్ చేతిలో బోల్ట్ ఓడిపోవడం అతని అభిమానులను జీర్ణించుకోలేకుండా చేస్తోంది.   ఆ అక్కసుతో వారు స్టేడియంలో గాట్లిన్‌ను హేళన చేశారు. అవేవి నేను పట్టించుకోనని బోల్ట్‌ను ఓడించడానికి అతడినే స్పూర్తిగా తీసుకున్నానని..ట్రాక్‌పై ఉన్నంత సేపే ఉసేన్‌ తనకు ప్రత్యర్థని..బయట మాత్రం తాము మంచి మిత్రులమని చెప్పి విజయం సాధించిన అనంతరం బోల్ట్ ముందు మోకరిల్లాడు గాట్లిన్. వెళ్లిపోతూ..వెళ్లిపోతూ నన్ను క్షమించండి, విజయంతో కెరీర్‌ను ముగించలేకపోయాను..కానీ మీ అభిమానానికి మాత్రం కృతజ్ఞతలని చెబుతూ తనదైన డ్యాన్స్‌ చేసి వాళ్లని హుషారెత్తించాడు. కానీ ఒక్కటి మాత్రం నిజం..ఫైనల్లో బోల్ట్ ఓడిపోయి ఉండవచ్చు..అతని అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయి ఉండవచ్చు. కానీ ట్రాంక్ అండ్ ఫీల్డ్‌లో అతడిదో శకం. తన సృష్టించిన రికార్డుల ద్వారా ఎవరూ అందుకోలేనంత ఎత్తుకెదిగాడు బోల్ట్.   
పతంజలి..ఈ పేరు చెబితే వెంటనే గుర్తొచ్చేది యోగా గురు రాందేవ్ బాబానే.. మరుగును పడిపోతున్న యోగాకు మళ్లీ పునర్వైభవాన్ని తీసుకురావడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. అదే బాటలో..అంతే శక్తివంతమైన భారతీయ ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు గాను నడుం బిగించారు. పతంజలి బ్రాండ్‌ పేరుతో కంపెనీని స్థాపించి ఆయుర్వేద ఉత్పత్తులను మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చారు రాందేవ్..వచ్చీ రావడంతోనే కార్పోరేట్ కంపెనీలకు దడ పుట్టించింది. తొలుత ఆయుర్వేద ఔషధాలనే తయారు చేయాలని రాందేవ్ భావించారు. అయితే ప్రజల నుంచి వస్తున్న ఆదరణతో క్రమంగా ఆహారోత్పత్తులు, సౌందర్య ఉత్పత్తుల తయారీని ఆయన ప్రారంభించి 500 రకాల ఉత్పత్తులను అందించే స్థాయికి ఎదిగింది పతంజలి..   ఈ సంస్థ దూకుడుతో ఎన్నో ఏళ్లుగా భారతీయ ఎఫ్ఎంసీజీ మార్కెట్‌ను శాసిస్తున్న ఐటీసీ, డాబర్, హిందూస్థాన్ యూనిలీవర్. కోల్గేట్, పీ&జీ వంటి సంస్థలకు ముచ్చెమటలు పట్టాయి. 2016 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 146 శాతం పెరుగుదలను నమోదుచేసి..769 మిలియన్ డాలర్ల నికర లాభాన్ని సాధించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అలా భారతీయతకు..భారతీయ వారసత్వానికి జవసత్వాలు అందజేసిన వ్యవస్థగా పతంజలికి గుర్తింపు వస్తున్న తరుణంలో ఆ సంస్థ మాజీ సీఈవో ఎస్‌కే.పాత్రా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. పతంజలి 10,500 కోట్ల టర్నోవర్ సాధించడంలో ముఖ్యభూమిక పోషించడంలో నిజమైన శ్రామికులు కంపెనీ ఉద్యోగులేనని కానీ వారికి నేటి వరకు సరైన వేతనం అందడం లేదన్నది పాత్రా ప్రధాన ఆరోపణ.   సేవ పేరుతో వారి శ్రమను దోపిడి చేస్తున్నారని ఆయన అన్నారు. రెండు ఉద్యోగాలకు విడి విడిగా వేతనం చెల్లిస్తామని మొదట హామీ ఇచ్చారని కానీ అలా జరగలేదని.. తాను సీఈవోగా ఉన్నప్పుడు పతంజలి ఆయుర్వేద, పతంజలి ఫుడ్‌పార్క్‌లో ఒకేసారి రెండు విధులు నిర్వర్తించానని పేర్కొన్నారు. తనకు వేతనం ఆపడంపై పాత్రా పలుమార్లు బాబా రాందేవ్‌తో వాగ్వివాదానికి దిగారు. నాకు వేతనం కావాలి..నా కోసం కాదు..నాకో కుటుంబం ఉంది. వారిని చూసుకోవాల్సిన బాధ్యత నాదే. అందుకోసమైనా నాకు జీతం కావాలి అంటూ బాబాను వేడుకున్నానని దీంతో తనకు జీతం చెల్లించారని..అది కూడా ముందు హామీ ఇచ్చినట్లు కాకుండా ఒక ఉద్యోగానికి వేతనం ఇచ్చారని ఆరోపించారు.   రాందేవ్‌ పతంజలిని స్థాపించిన తర్వాత ఆ సంస్థపై ఈ స్థాయిలో ఆరోపణలు వచ్చింది లేదు..మొదట్లో నూడిల్స్‌లో పురుగులు వచ్చినట్లు తేలడం..పతంజలి నూడిల్స్‌కి లైసెన్స్‌ లేదంటూ ఆహార భద్రత (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే అప్పటికే నెస్లే వంటి అంతర్జాతీయ దిగ్గజానికి నోటీసులు అందడంతో పతంజలిని ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అలా కాదు..ఆరోపణలు చేసిన వ్యక్తి సంస్థలో ఒక మాజీ ఉద్యోగి..అది కూడా సీఈవో స్థాయి వ్యక్తి కావడంతో ఈ వ్యాఖ్యలకు కార్పోరేట్ ప్రపంచంలో హాట్ చర్చకు దారి తీసింది. మరి పాత్రా ఆరోపణలపై బాబా రాందేవ్ ఎలా స్పందిస్తారో..?
రెండు రోజుల క్రితం కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డాక్టర్ శివకుమార్, ఆయన సోదరుడితో పాటు బెంగళూరులోని ఓ రిసార్టుపైనా దాడులు నిర్వహించారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. ఈ సోదాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. శివకుమార్‌కు చెందిన మొత్తం 39 ప్రాంతాలపై దాదాపు 300 మంది సిబ్బంది నేటీకి నిర్విరామంగా సోదాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం రూ.11.43 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నాట్లు ప్రకటించారు. శివకుమార్, ఆయన సోదరుడి ఇంటిపై దాడులు జరిగి ఉంటే ఎవరూ అంతగా పట్టించుకునే వారు కాదేమో..కానీ ఓ రిసార్టులో సోదాలు నిర్వహించడం హాట్ టాపిక్‌గా మారింది. గుజరాత్‌లో రాజ్యసభ ఎన్నికలను బీజేపీ సీరియస్‌గా తీసుకుని సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకునే వ్యూహాలను రచిస్తోంది.   ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా..వారిలో ముగ్గురు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ మిగిలిన 44 మందిని కాపాడుకునేందుకు తమ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకకు తరలించింది. ఇక్కడే కమలనాథులు వ్యూహాత్మకంగా వ్యవహారించింది. తమకునన అధికారాలతో ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్‌పై ఐటీ దాడి చేయించింది. డైరెక్ట్‌గా దాడులు నిర్వహిస్తే లేని పోని చిక్కుల్లో పడతామని ఊహించారో ఏమో కానీ..ఈ ఎమ్మెల్యేల బస ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి శివకుమార్ ఆయన కుటుంబసభ్యుల ఇళ్లపై దాడి చేయించింది. తమ ఎమ్మెల్యేలను భయపెట్టేందుకే బీజేపీ ఐటీ దాడులు చేయించిందని కాంగ్రెస్ పార్లమెంట్ సాక్షిగా నిలదీసింది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద మొత్తంలో ముడుపులు ఇచ్చిందన్న ఆధారాలతోనే తాము సోదాలు నిర్వహించినట్లు ఐటీ అధికారులు చెబుతున్నారు.   అమిత్‌షా, ప్రధాని నరేంద్రమోడీలే ఈ దాడుల వెనుక ఉన్నారని అంతా భావిస్తున్న వేళ..శివకుమార్ తల్లి బాంబు పేల్చారు. నా కొడుకు ఇంటీపై ఐటీ అధికారులు సోదాలు చేయడం వెనుక కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హస్తం ఉందంటూ ఆయన తల్లి గౌరమ్మ ఆరోపించారు. నా కుమారుడికి రాజకీయంగా ఎంతోమంది శత్రువులు ఉన్నారు..వారిలో కాంగ్రెస్‌కు చెందిన కొందరు నేతలు కూడా ఉన్నారని...ముఖ్యంగా సీఎం నా బిడ్డ పట్ల ముందు నుంచి వ్యతిరేకంగా ఉంటున్నారు. నా కొడుకు ఎదుగుదలను చూసి ఓర్వేలేక ఐటీ దాడులు చేయించారన్నారు. ఎన్నో పనులకు శివను ఉపయోగించుకున్న ముఖ్యమంత్రి..ఆ తర్వాత నమ్మక ద్రోహం చేశారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు బెంగళూరుతో పాటు ఢిల్లీలోనూ కలకలం రేపాయి.   సొంత పార్టీ వ్యక్తి మీద దాడులు చేయించాల్సిన అవసరం సిద్ధూకి ఏముంటుందని..అయినా ఆదాయపు పన్ను శాఖ ప్రధాని అజమాయిషీలో పని చేస్తుంది కానీ ముఖ్యమంత్రుల మాట అది వింటుందా అని కాంగ్రెస్ మద్ధతుదారులు అంటున్నారు. అయితే శివకుమార్ తల్లిని, ఆయన కుటుంబాన్ని ఎవరో బెదిరించి ఉంటారని..వారి బెదిరింపులకు భయపడే మంత్రి కుటుంబం అలాంటి వ్యాఖ్యలు చేస్తోందని కన్నడ నాట పుకార్లు షికారు చేస్తున్నాయి. గుజరాత్ ఎమ్మెల్యేలను తీసుకొచ్చి కన్నడ నాట కుంపట్లు రాజేశారని కొందరు అంటున్నారు. ఈ మొత్తం డ్రామాకి తెరపడాలంటే రాజ్యసభ ఎన్నికల వరకు ఆగాల్సిందే.
ఆసియా పెద్దన్నగా ఎదిగేందుకు భారత్, చైనాలు నువ్వా నేనా అన్న స్థాయిలో పోటీ పడుతున్నాయి. ఎన్నో అంశాల్లో మన ఎదుగుదలను చూసి ఓర్వలేని చైనా..భారత్‌ను అదను చూసి దెబ్బ కొట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. పొరుగునే ఉంటూ పక్కలో బల్లెంలా మారిపోయింది చైనా..శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్లు మన దాయాదీ పాక్‌కు అన్ని రకాలుగా చేయూతనిస్తూ మన మీదకు ఉసిగొల్పుతోంది. చైనా అండతో రెచ్చిపోతున్న పాక్‌లోని ఉగ్రవాద సంస్థలు భారత్‌లో విధ్వంసానికి కాలుదువ్వుతున్నాయి. అలా జరిగిన వాటిలో ఒకటే పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి. నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న రోజుల్లో దేశ రక్షణ వ్యవస్థకు కీలకమైన పఠాన్‌కోట్‌పై దాడికి దిగింది జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ.   చీమ చిటుక్కుమన్నా అప్రమత్తమయ్యేంత అత్యాధునిక భద్రతా వ్యవస్థ ఉన్న ఆ స్థావరంలోకి దర్జాగా ప్రవేశించిన ఆరుగురు ముష్కరులు వచ్చి రావడంతోనే ఐదుగురు అధికారుల్ని కాల్చి చంపారు. ఎయిర్‌బేస్‌లో నక్కిన ముష్కర మూకను ఏరిపారేయడానికి మన భద్రతా దళాలకు మూడు రోజులు పట్టింది. ఈ దాడితో అప్రమత్తమైన భారత ప్రభుత్వం నిందితులేవరో వారి వెనుక ఎవరున్నారో తేల్చేపనిలో పడింది. పక్కా ఆధారాలతో పాక్‌ ప్రేరేపిత జైషే మహ్మద్ సంస్థ ఈ దాడికి పాల్పడినట్లు తేల్చింది. దాని అధినేత మసూద్ అజర్‌ను నిందితుడిగా చేరుస్తూ అతన్ని తమకు అప్పగించాల్సిందిగా పాకిస్థాన్‌ను కోరింది. కాని పాక్ ఎప్పటిలాగే తమకు సంబంధం లేదని పేర్కొంది. దీంతో మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని కోరుతూ ఐక్యరాజ్యసమితిని కోరింది భారత్. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఐరాస మండలికి చెందిన 1267 కమిటీ ముందు పెట్టింది.   ఈ తీర్మానాన్ని అమెరికా, ఫ్రాన్స్, యూకే సహా 14 దేశాలు బలపరిచాయి..అయితే ఒక్క చైనా మాత్రం తన వక్రబుద్దిని బయటపెట్టుకుంది. సాంకేతిక కారణాలు చూపిస్తూ..అందుకు మూడు నెలలు గడువు కావాలంటూ తన వద్ద ఉన్న వీటో పవర్‌తో అడ్డుకుంది. తన చిరకాల మిత్రుడు పాకిస్థాన్‌కు అనుకూలంగానే చైనా ఇలా అడ్డుకుందని ప్రపంచం కోడై కూసింది. తాజాగా ఇదే అంశంపై మరోసారి భారత్‌ ఐక్యరాజ్యసమతిని సంప్రదించగా మళ్లీ డ్రాగన్ అడ్డుతగిలింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి మరో మూడు నెలలు గడువు పొడిగించాలని కోరింది. ఒకవేళ చైనా గనుక గడువు పొడిగింపు కోసం కోరకపోతే మసూద్ అజర్‌ ఆటోమేటిగ్గా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటింపబడి ఉండేవాడు.   చైనా ఇలాంటి వ్యూహాన్ని అమలు చేసేందుకు బలమైన కారణాలు ఉన్నాయి. పాక్‌తో డ్రాగన్ పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తోంది. పాక్ తీరంలో అభివృద్ధి చేస్తోన్న ఒక ఓడరేవు నుంచి తమ దేశానికి చమురు తరలించేందుకు, ఇతర పనుల కోసం చూనా ఒక పైపు లైను వేస్తోంది.. దీనికి తోడు భారత్‌తో యుద్ధం గనుక వస్తే నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టేందుకు వీలుగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో సైనికులను మోహరిస్తోంది. ఇన్ని ప్రయోజనాలను కాపాడుకునేందుకే చైనా పాకిస్థాన్‌కు మద్ధతు ఇస్తోంది. అయినా పాక్‌తో స్నేహం ఎంత ప్రమాదకారమో చైనా ఇంకా రుచి చూడలేదు. అమెరికా సారథ్యంలోని పాశ్చాత్య దేశాలకు ఐఎస్ఐఎస్ రూపంలో జరిగిన నష్టం ప్రపంచానికి తెలుసు. కాబట్టి చైనా ఎంత త్వరగా కళ్లు తెరిస్తే అంత మంచిది. లేదంటే ఇస్లామిక్ ఉగ్రవాదుల బీజింగ్‌ వీధుల్లో స్వైర విహారం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.
12 రోజులు... 12మంది టాలీవుడ్‌ ప్రముఖులు... సుమారు 92 గంటలు... సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో ఫస్ట్‌ పార్ట్‌ ముగిసింది... రోజుకొకరు చొప్పున సిట్‌ విచారణ కంప్లీట్‌ చేసింది. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌తో మొదలైన సిట్‌ ఎంక్వైరీ.... యువ నటుడు నందుతో ముగిసింది. మొదటిరోజు పూరీ జగన్నాథ్‌ను సుమారు 11గంటలపాటు విచారించిన సిట్‌... మిగతా వారిలో వణుకు పుట్టించింది.  ఉదయం 10 గంటలకు మొదలైన ప్రశ్నల వర్షం రాత్రివరకూ కంటిన్యూ అయ్యింది. దాంతో పూరీ జగన్నాథ్‌ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దాంతో డ్రగ్స్‌ కేసులో రోజురోజుకీ ఉత్కంఠ పెరుగుతూ వచ్చింది.    ఆ తర్వాత కెమెరామెన్‌ శ్యామ్‌ కే నాయుడుని 6 గంటలు, కేరెక్టర్ ఆర్టిస్ట్‌ సుబ్బరాజుని 13 గంటలు, ఆర్ట్ డైరెక్టర్  చిన్నా 4 గంటలు, హీరో నవదీప్‌ని 11 గంటలు, తరుణ్‌ను 13 గంటలు, హీరోయిన్ ఛార్మిని హైకోర్టు ఆదేశాలతో ఉదయం 10నుంచి ఐదు గంటల వరకు విచారించింది. ముమైత్ ఖాన్‌ని 6 గంటలు, రవితేజను 9 గంటలు, రవితేజ డ్రైవర్ శ్రీనివాసరావు, తనీష్‌‌లను 4 గంటలు, నందుని మూడున్నర గంటల చొప్పున ఇంటరాగేట్‌ చేసింది. విచారణ మొత్తం వీడియో చిత్రీకరించింది. కొందరు బ్లడ్‌ శాంపిల్స్‌ ఇస్తే... మరికొందరు నిరాకరించారు. అయితే పూరీ జగన్నాథ్‌, ఛార్మి, రవితేజ, తరుణ్ విషయంలో మీడియా భారీ హైప్‌ ఇచ్చింది.   డ్రగ్స్‌ తీసుకుంటారా? డ్రగ్స్‌ ఎప్పట్నుంచి అలవాటు ఉంది? కెల్విన్‌, జీశాన్‌తో ఎలా పరిచయం? డ్రగ్స్ తీసుకోవడమేనా...సప్లై కూడా చేస్తారా? పబ్‌ల్లో డ్రగ్స్‌ సరఫరా చేస్తారా? డ్రగ్స్‌ను ఎవరికైనా అలవాటు చేశారా? సినీ పరిశ్రమలో ఇంకా ఎవరు డ్రగ్స్‌ తీసుకుంటారు? ఇలా సాగింది సిట్‌ ఇంటరాగేషన్‌. అయితే తొలి విడత విచారణ కంప్లీట్‌ కావడంతో... పార్ట్‌-2 ఉంటుందనే టాక్‌ వినిపిస్తోంది. తొలి విచారణలో సేకరించిన ఇన్ఫర్మేషన్‌ ఆధారంగా ప్రముఖులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే సెకండ్‌ లిస్ట్‌లో సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో డ్రగ్స్‌ కేసులో పార్ట్‌-2 ఉండకపోవచ్చని అంటున్నారు. అయితే సాఫ్ట్‌‌వేర్‌ ఉద్యోగులు డ్రగ్స్‌ తీసుకుంటున్నారని గుర్తించిన సిట్‌ అధికారులు... సెకండ్‌ లిస్ట్‌లో వీళ్లను మాత్రమే పిలిచి మమ అనిపిస్తారనే టాక్‌ వినిపిస్తోంది.   
  ప్రపంచంలో ఎవరికైనా రోజుకి 24 గంటలే ఉంటాయి. కానీ ఆ 24 గంటలని ఎవరు ఎలా ఉపయోగించుకుంటారు అనేదాని మీద వారి జీవితాలు ఆధారపడి ఉంటాయి. అందుకే 20వ శతాబ్దంలో ‘Time Management’కి చాలా ప్రాధాన్యతని ఇస్తున్నారు. వాటికోసం రకరకాల వ్యూహాలూ ప్రచారంలో ఉన్నాయి. అలాంటి ఒక పద్ధతే ‘POSEC Method’. 1943లో Maslow అనే ఆయన Hierarchy of needs అనే సిద్ధాంతాన్ని రూపొందించారు. ఒక మనిషి సంతోషంగా ఉండేందుకు ఎలాంటి అవసరాలు తీరాలో ఇందులో పేర్కొన్నారు. దీని ఆధారంగానే ‘POSEC Method’ని రూపొందించారు. మన అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఈ పద్ధతిలో సూచించే ప్రయత్నం చేశారు.  అవేమిటంటే... Prioritize – మీ జీవితంలో అతిముఖ్యమైన లక్ష్యాలు ఏమిటి. వాటిని సాధించేందుకు ఏం చేయాలి. వాటి కోసం ఎంత సమయం కేటాయించాలి అన్న విషయాలన్నీ ఈ Prioritize కోవలోకి వస్తాయి. Organize – జీవితం స్థిరంగా ఉండేందుకు ఎలాంటి పరిస్థితులు అవసరం అన్న అంశాలు ఈ విభాగంలోకి వస్తాయి. ఉదాహరణకు కుటుంబం, ఉద్యోగం, ఆరోగ్యం... లాంటి అంశాలన్నమాట. Streamline – చేసే ప్రతి పనీ మనకి ఇష్టం లేకపోవచ్చు. కానీ జీవితం సాఫీగా సాగిపోవాలంటే వాటిని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. సమయానికి బండిని సర్వీస్‌ చేయించుకోవడం దగ్గర నుంచీ, బీమా ప్రీమియం చెల్లించడం వరకు మన చుట్టూ ఉంటే పరిస్థితులను సక్రమంగా ఉంచుకోవడం వల్ల సమయం, శ్రమా రెండూ ఆదా అవుతాయి. Economize – కొన్ని పనుల వల్ల ఉపయోగం ఉండదు. అవి అత్యవసరమూ కాదు. కానీ ఇవి లేకపోతే జీవితం మరీ బోర్‌ కొట్టేయవచ్చు. స్నేహితులతో పార్టీ చేసుకోవడం, బంధువులు ఇంటికి వెళ్లడం, సినిమా చూడటం... లాంటివన్నీ ఈ కోవలోకే వస్తాయి. Contribute – పక్కవారికి ఏదో సాయం కావాలి! తోటి మనిషిగా ఆ బాధ్యతలో పాలు పంచుకోవడం మన కర్తవ్యం. వీధిలో జనం అంతా కలిసి రోడ్డుని శుభ్రం చేసుకుంటున్నారు! పౌరుడిగా పాల్గోవడం మన ధర్మం. ఎన్నికలు జరుగుతున్నాయి. పౌరుడిగా ఓటు వేసేందుకు లైనులో నిలబడటం మన బాధ్యత. ఇవన్నీ చేయాలని ఎవరూ అనరు. ఇలాంటి పనులు చేయడం వల్ల మనకి సమయం, శ్రమ వృధాగానే తోచవచ్చు. కానీ వీటి ఫలితం భవిష్యత్తులో కనిపించి తీరుతుంది. సమాజాన్ని ముందుకు నడిపించడంలో, మనం అశ్రద్ధ చేయలేదన్న తృప్తిని అందిస్తుంది. ఇలాంటి పనులన్నీ Contribute విభాగంలోకి వస్తాయి. ఇవండీ ‘POSEC Method’ లక్షణాలు. మన జీవితంలో పనులన్నింటినీ ఈ దృక్పథంతో చూస్తే... వేటికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఎంత సమయం కేటాయించాలి అన్న స్పష్టత ఏర్పడుతుంది.  - నిర్జర.
  ఓ చిన్న కథ గుర్తుందా మీకు? ఒకడు బుట్టనిండా గాజు సామాను పెట్టుకుని అమ్మటానికి పట్టణానికి వెళుతూ, దారిలో చెట్టు నీడలో కాసేపు కూర్చుంటాడు. ఆ కాసేపటిలో తాను బుట్టలోని సామాను అంతా అమ్మేసినట్టు, దాని నుంచి వచ్చిన డబ్బుతో మళ్ళీ సామాను కొన్నట్టు, అలా అలా వ్యాపారం పెరిగి పెద్ద ఇల్లు, సేవకులు, మంది మార్బలం, పెళ్ళాంపిల్లలు... అలా ఊహించుకుంటూ, ఆ ఊహలో సేవకుడు ఏదో పని చెబితే చేయలేదని కాలితో ఓ తన్ను తంతాడు. ఊహల్లోని సేవకుడికి ఇతని కాలిదెబ్బ తగిలిందో లేదోగానీ, వాస్తవంలో కాలి దగ్గర వున్న గాజు సామాను కాస్తా నేలపాలై విరిగిపోతాయి. ఇలా గాల్లో మేడలు కడితే వచ్చేదేం లేదు కానీ, ఉన్నది కూడా పోతుందని పెద్దలు నీతి చెబుతారు. అయితే అదే పనిగా గాల్లో మేడలు కడుతూ, పగటి కలలు కంటూ వుంటే ఏమోగానీ, అప్పుడప్పుడు మాత్రం పగటి కలలు మంచివే అంటున్నారు ప్రముఖ మానసిక నిపుణురాలు డాక్టర్ బూత్రా.   సోమరితనం కాదు...   ఎవరైనా తమ స్థాయికి మించి ఏదో సాధిస్తామని చెప్పినప్పుడు పగటి కలలు కంటున్నావా? అంటూ వెక్కిరిస్తాం. ఆ తీరుని సోమరితనమని, కాలం వృధా చేయటమని అనుకుంటాం. కానీ, అవి మంచివే అంటున్నారు మానసిక వైద్య నిపుణులు. వ్యక్తులు తాము సాధించాలని అనుకుంటున్న కోరికలని, ఆశలని, తన ఆలోచనల్లో నింపుకున్నప్పుడు మనసంతా వాటితోనే నిండిపోయే పగటి కలలు కనడం ప్రారంభిస్తారు అంటున్నారు వీరు. మేలుకొని వుండగానే తమకిష్టమైన వాటిని అద్భుతంగా ఊహించుకోవడమే పగటికట అంటూ విశ్లేషిస్తున్నారు కూడా. సాధారణంగా అవి సంతోషకరమైన సందర్భాలు, ఆశలు, ఆశయాలే అయి వుంటాయి.   ఆరోగ్యకరం కూడా...   పగటి కలలు మంచివి మాత్రమే కావు.. ఒకోసారి అవి ఆరోగ్యకరమని కూడా చెబుతున్నారు క్లినికల్ సైకాలజిస్టులు. ముఖ్యంగా సంగీతం, నవలా రచన, దర్శకత్వం వంటి సృజనాత్మక వృత్తుల్లో రాణించడానికి ఈ పగటి కలలు ఎంతో ఉపయోగపడతాయని కూడా చెబుతున్నారు. సృజనాత్మకకి ఊహాశక్తి అవసరం కదా! ఆ ఊహల్లోంచి అద్భుత సృష్టి జరుగుతుంది. కాబట్టే చాలామంది గొప్పగొప్ప కవులు, రచయితలు వాస్తవ ప్రపంచంతో సంబంధం లేనట్టు ఎప్పుడూ ఊహాలోకాల్లో వుంటారంటూ చెబుతున్నారు వీరు. ఇంకా ఈ పగటి కలలు కనని వాళ్ళకి వాటిలో మునిగి తేలండంటూ సలహా కూడా ఇస్తున్నారు.   పగటి కలలకీ హద్దుంది...   నిరాశ ఆవరించినప్పుడు, ధైర్యం కోల్పోయినప్పుడు, కోపం అతలాకుతలం చేస్తున్నప్పుడు.... వెంటనే ఇష్టమైన విషయం కోసం లేదా రేపటి భవిష్యత్తు కోసం, ఉద్యోగం కోసం, పిల్లల కోసం... ఇలా ఎవరికి నచ్చిన ఊహల్లోకి వాళ్ళు వెళ్ళిపోవాలిట. కాసేపు... అంటే ఓ పది, పదిహేను నిమిషాలసేపు ఆ పగటి కలల్లో విహరిస్తే చాలు అప్పటి వరకు వున్న బాధ, నిరాశ పోయి వాటి స్థానంలో సంతోషం వచ్చి చేరుతుందిట. అదెలా సాధ్యం? అంటూ సందేహం వద్దు. ఎన్నో అధ్యయనాలు చేసి మరీ చెబుతున్నారు ఈ నిపుణులు. నమ్మకం కలగాలంటే మీరూ పగటి కలల్లోకి వెళ్ళి రావాల్సిందే. అయితే ఇక్కడ ఓ విషయం చెప్పాలి. పగటి కలలు అనేవి వాస్తవ పరిస్థితులకు పూర్తి భిన్నంగా వుండాలి. అంతేకానీ, ఆ కలల్లో కూడా కష్టాలు, కన్నీళ్ళు నింపితే ఆనందం బదులు కష్టం రెండింతలవుతుంది. అందులోనూ ఊహలకి హద్దేముంది? అలా హిమాలయాలదాకా వెళ్ళిరండి. లేదా రోడ్డుపై కారు నడపటానికి కూడా భయపడేవాళ్లు ఏకంగా విమానం నడిపేస్తున్నట్టు గాల్లో తేలిపోండి. సాధ్యాసాధ్యాల ప్రసక్తే లేదు. కానీ ఆ కలలకి కూడా హద్దు వుంది.   కమ్మటి కలల్లో విహరించండి...   పగటి కలల్ని పనులు మానుకుని మరీ కనాలనేం లేదుట. హాయిగా రాత్రి పడుకోబోయేముందు ఓ ఐదు నిమిషాలు అలా ఊహాలోకంలోకి వెళ్తే చాలుట. చక్కటి భావన కమ్మటి నిద్రని ఇస్తుందిట. అయితే నిపుణులు మరో విషయం కూడా చెబుతున్నారు. మంచివి అన్నాం కదా అని గంటలు గంటలు పగటి కలల్లోనే మునిగిపోతే మళ్ళీ అదో మానసిక సమస్యగా మారే ప్రమాదం వుందని అంటూ హెచ్చరిస్తున్నారు. నచ్చిన విషయాలని, కావాలనుకుంటున్న వాటిని కలలోనైనా దక్కించుకోవడం మంచిదే అంటున్నారు. మరింకేం... వీలు చిక్కితే కమ్మటి కలల్లో విహరించండి. -రమ ఇరగవరపు
‘ఈ కాలం కుర్రాళ్లున్నారు చూశారూ! వాళ్లకి అసలు భయమే లేదనుకోండి..’ అని తెగ చిరాకు పడిపోతుంటారు పెద్దలు. ఎన్ని శతాబ్దాలు గడిచినా ఈ మాట ఇలాగే ఉంటుంది. ఎన్ని తరాలు దాటినా, కుర్రాళ్లు దూకుడుగానే ఉంటారు. ఇంతకీ కుర్రకారు ఎందుకని అలా దూకుడుగా ఉంటారు? దాని వల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? అన్న ప్రశ్నలకి ఇప్పటికి జవాబు దొరికిందట. కుర్రకారు దూకుడి గురించి ఇప్పటిదాకా చాలా పరిశోధనలే జరిగాయి. వీటిలో చాలా పరిశోధనలు రకరకాల విశ్లేషణలు చేశాయి. యువకులలో ‘టెస్టాస్టెరాన్‌’ వంటి హార్మోనుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని కొందరు తేల్చారు. మెదడులోని ‘prefrontal cortex’లో లోపం వల్ల దూకుడు పెరుగుతుందని మరికొందరు ఊహించారు. కానీ ఇవేవీ నిజం కాదని అమెరికా పరిశోధనలు రుజువుచేస్తున్నారు. మనం ఏదన్నా సాహసం చేసేటప్పుడు ఉద్వేగానికి లోనవుతాం. ఆ సాహసం చేశాక ఒక తెలియని తృప్తి లబిస్తుంది. ఈ తృప్తి కోసమే కుర్రకారు సాహసాలు చేసేందుకు సిద్ధంగా ఉంటారని తాజా పరిశోధనలో బయటపడింది. ఒకోసారి ఇలాంటి తృప్తిని కోరుకునే తొందరపాటులో మద్యంలాంటి అలవాట్లు చేసుకోవడం, లేనిపోని గొడవలకు వెళ్లడం, బళ్లు వేగంగా నడపడం... లాంటి ప్రవర్తన కనిపిస్తుంది. అలాంటి సందర్భాలు పక్కన పెడితే, దూకుడు వల్ల కుర్రకారుకి జీవితపాఠాలు తెలుస్తాయంటున్నారు. కుర్రవాళ్లు అప్పుడప్పుడే జీవితంలోకి అడుగుపెడుతూ ఉంటారు. లోకం అంతా వారికి కొత్తగా కనిపిస్తుంది. ఆ ప్రపంచాన్ని నిదానంగా ఆకళింపు చేసుకుందాం అనుకుంటే విలువైన జీవితం కాస్తా గడిచిపోతుంది. అందుకోసం వారి ముందు ఉన్న మార్గం ఒక్కటే! Trial and error method ద్వారా ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోవడమే! జీవితాన్ని శోధించి చూడటమే! అందుకే వారిలో దూకుడు పెంచేలా ‘డోపమైన్’ అనే రసాయనం ఎక్కువగా ఉత్పత్తి అవుతుందట. వారు ఎంత సాహసం చేస్తే అంత తృప్తి లభించేలా ఈ డోపమైన చూసుకుటుంది. ఇలా కుర్రతనపు చేష్టలతో మనం రకరకాల అనుభవాలను పొంది చూస్తాం. వాటి ఫలితాల ఆధారంగా మనదైన వ్యక్తిత్వాన్ని రూపొందించుకుంటాం. మున్ముందు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను దాటేందుకు ఆ వ్యక్తిత్వమే ఉపయోగపడుతుంది. ఎలాంటి ఉద్యోగాన్ని ఎన్నుకోవాలి? సమయాన్ని ఎలా గడపాలి? డబ్బు ఎలా ఖర్చుచేయాలి? లాంటి కీలకమైన ప్రశ్నలకు ‘కుర్రతనపు’ అనుభవాలే ఉపయోగపడతాయట. దూకుడుగా ఉండటం వల్ల కుర్రకారుకి మేలే అని తేలిపోయింది. కానీ దీనివల్ల నష్టాలు కూడా ఉంటాయి కదా! లేనిపోని గొడవలూ వస్తాయి కదా! అందుకే ఇంట్లో కుర్రకారు ఉన్న తల్లిదండ్రులు తెగ మధనపడిపోవడం సహజం. కానీ అందరు కుర్రకారూ ఇలా చెడుదారులలోకి వెళ్లాలని కానీ, అదే దారిలో ఉండిపోవాలని కానీ లేదట. తమని తాము అదుపు చేసుకోలేని మనస్తత్వం ఉన్నవారే ఇలా ప్రవర్తిస్తారట. అలాంటివారి నడవడిని చిన్నప్పుడే గ్రహించవచ్చని చెబుతున్నారు. అంటే సమస్య కుర్రతనంలో దూకుడుగా ఉండేవారితో కాదు, చిన్నప్పుడే దూకుడుగా ఉండేవారితో అన్నమాట!   - నిర్జర.
  Sjogren’s syndrome is an autoimmune disorder characterized by dry mouth and dry eyes. As in any other autoimmune disease, there is abnormal production of extra antibodies in the blood that are directed against various tissues of the body. This overactive and misdirected immune system causes inflammation of the tissues; these immune forces are particularly directed at the glands that produce tears (lacrimal glands) leads to decreased water production for tears and dry eyes, the glands that produce the saliva in the mouth (salivary glands, including the parotid glands) leads to decreased saliva production and dry mouth and dry lips.   Primary Sjogren’s Syndrome, it is solely characterized by the glandular inflammation and barring the inflammation of other connective tissues. While, Secondary Sjögren’s Syndrome is a combination of glandular inflammation along with inflammation of other soft tissues presenting as  rheumatoid arthritis, systemic lupus erythematosus or even scleroderma. In certain patients there is only dryness of eyes and mouth without any other symptoms of Sjögren’s Syndrome.   Since it is an autoimmune disorder, the cause is not well known, it might be genetic cause. These are more commonly associated with other autoimmune illnesses, such as systemic lupus erythematosus, autoimmune thyroid disease, type I diabetes, etc. Most patients with Sjögren's syndrome are female.   Though there is no specific treatment for this syndrome, however the suffering can minimized by supportive treatment, such as artificial tear and intake of huge amounts of liquids.
  అంతా మాయ! ఈ జగమంతా మాయ! ఏంటీ… ఇదేదో వేదాంతం అనుకుంటున్నారా? అస్సలు కాదు! ప్రాక్టికల్ సైన్స్! ఇంతకీ… విషయం ఏంటంటే… మనం ప్రపంచంలో వుంటాం. కాని, నిజంగా జరిగేది ఏంటంటే… ప్రపంచం మన మనస్సులో వుంటుంది! మన మనస్సు లేదా మెదడు ఎలా భావిస్తే ప్రపంచం కూడా అలాగే వుంటుంది! అందుకే మన పెద్దలు అంతా మిథ్యా అనేశారు! మనం ఎలా భావిస్తే మన చుట్టూ పరిస్థితులు కూడా అలానే వుంటాయి! ఇందుకు వైన్ కూడా మినహాయింపు కాదు!   వైనుకు , వేదాంతానికి లింకేంటి అనుకుంటున్నారా? జర్మనీలో తాజాగా కొందరు రీసెర్చర్స్ చేసిన అధ్యయనం ప్రకారం సంబంధం వుంది! జర్మనీలోని ఓ యూనివర్సిటీలో కొందరు శాస్త్రవేత్తలు ఓ పరిశోధన చేశారు. దానిలో భాగంగా కొందరు వ్యక్తుల్ని ఎమ్ఆర్ఐ స్కానింగ్ చేసే మిషన్ లో ప్రవేశపెట్టారు. తరువాత వారికి సాధారణ వైన్ తాగించారు. కాని, ఒక చిన్న ట్రిక్ ప్లే చేశారు! మార్కెట్లో కేవలం 12యూరోలు వుండే ఆ వైన్ ని 18 నుంచి 36యూరోల దాకా వెల వున్నట్టు బాటిల్స్ పై అచ్చు వేయించారు! ఆ రేట్ చూస్తూ వైన్ పుచ్చుకున్న సదరు వ్యక్తులు తమ మెదళ్లలో టేస్ట్ అదిరిపోయినట్టుగా ఫీలయ్యారట! కాని, నిజంగా వారు ప్రతీసారీ తాగింది 12యూరోలు విలువ చేసే మామూలు వైనే!   బాటిల్ పై వున్న రేటు చూసి ఒకే రకమైన వైన్ని రకరకాలుగా ఎందుకు ఫీలయ్యారు? ఎంత ఎక్కువ రేటు వుంటే అంత టేస్టీగా వున్నట్టు ఎందుకు అనిపించింది? ఎమ్ఆర్ఐ స్కాన్ లో తేలింది ఏంటంటే… వైన్ తీసుకున్న వారి మెదళ్లలో కొన్ని ప్రత్యేక భాగాల్లో అదిక ధర కారణంగా చలనం వచ్చిందట! తాము తాగుతున్నది కాస్ట్ లీ వైన్ అనే ఫీలింగ్ కారణంగా వారికి టేస్ట్ కూడా బావున్నట్టు అనిపించిందట! ఈ కారణంగానే కొన్ని కంపెనీలు కావాలని అదిరిపోయే లేబుల్స్ పెట్టి, గొప్ప గొప్ప బ్రాండ్ నేమ్స్ చూపించి అధిక ధర వసూలు చేస్తాయని రీసెర్చర్స్ అంటున్నారు!   మనిషి సుఖం, దుఃఖం, కష్టం, నష్టం అన్నీ మనసులోనే వుంటాయని మన పూర్వులు ఎప్పుడో చెప్పారు. పాశ్చాత్యులు కూడా అన్ని ఫీలింగ్స్ బ్రెయిన్లోనే వుంటాయని ఒప్పుకుంటారు! కానీ, ఈ తాజా పరిశోధనతో మరో కొత్త విషయం తేలింది! అదేంటంటే… మత్తు వైన్ లో కాదు నిజంగా మెదళ్లలో వుంటుంది! దానికి ఒక్కసారి అధిక ధర వల్ల అద్భుతమైన టేస్ట్ లభిస్తుంది అన్న మత్తు ఎక్కించామంటే… ఇక మంచి నీళ్లు తాగినా మందు తాగినట్టే అనిపిస్తుంది! ఇదే మనసు చేసే మాయ అంటే!
Is there any mechanism which can help us to know that a person is in depression state? Experts say that , though Depression varies from person to person, there are some common signs and symptoms. It’s important to remember that these symptoms can be part of life’s normal lows. But the more symptoms you have, the stronger they are, and the longer they’ve lasted—the more likely it is that you’re dealing with depression. These are the sample symptoms which will say that you are in depression mode:   ·Seems like, nothing will ever get better in life and there’s nothing you can do to improve your situation. ·You develop,  "don’t care anymore attitude"  about your hobbies, pastimes, social activities, especially love life will go for  a toss. ·You often feel fatigued, sluggish, and physically drained. Your whole body may feel heavy, and even small tasks also look so exhausting and  take longer time  to complete. ·Significant weight loss or weight gain will be shown. ·Drastic change is seen your body metabolism.. ·You have extreme variations in your sleeping pattern. either total sleeplessness or oversleeping is observed. ·An increase in physical complaints such as headaches, back pain, aching muscles, and stomach pain are often seen. ·Feeling agitated, restless, or even violent. tolerance level will become low and  your temper becomes short. ·Everything and everyone gets on your nerves. If these symptoms are observed in one own self or others, it’s time to consult doctor on priority basis.   -Bhavana