LATEST NEWS
రాజధానిని తరలించవద్దని డిమాండ్ చేస్తూ గత రెండు నెలలుగా అమరావతి రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమ ప్రాణాలు పోయినా పర్లేదు కానీ, రాజధాని తరలింపుకు ఒప్పుకోబోమని.. రాజధాని ప్రాంతంలో రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు.  రోజురోజుకి ఆ ఆందోళనలు తీవ్రతరమవుతున్నాయి. ఇదిలా ఉంటే, ఈరోజు మందడం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు ఆందోళన చేస్తున్న ప్రాంతాన్ని డ్రోన్ కెమెరాలతో పోలీసులు చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో, పోలీసుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తామేమి ఆర్ధిక నేరగాళ్లం కాదని, అరాచకం సృష్టించే వాళ్ళం కాదని ఎందుకు డ్రోన్ లతో చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట చేసుకుంది. దీంతో మందడంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.
ఏపీ సీఎం వైఎస్ జగన్ పైన, వైసీపీ పైన టీడీపీ నేత నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. మేం ప్రజా చైతన్య యాత్ర చేస్తే వైసీపీకి భయమెందుకు? అని ప్రశ్నించారు. ప్రజా వేదిక కూల్చివేతతో జగన్ తుగ్లక్ పాలన ప్రారంభం అయ్యిందని విమర్శించారు. కేవలం తొమ్మిది నెలల్లోనే రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసారని మండిపడ్డారు. అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలేశారని అన్నారు. తొమ్మిది నెలల్లో ప్రజల్ని ముంచే కార్యక్రమాలు తప్ప జగన్ సర్కార్ చేసిన ఒక్క మంచి కార్యక్రమం లేదని విమర్శించారు.  జగన్‌ అధికారంలోకి వచ్చాక మూడే మూడు పనులు చేశారన్నారు. అవి ఏంటంటే.. రంగులు వేయడం, దాడులు చేయడం, హామీలపై వెనక్కి పోవడం.. అని ఎద్దేవా చేశారు. ఏపీలో ఈ మూడే జరుగుతున్నాయని విమర్శించారు. జగన్‌ వల్ల ఏపీ బ్రాండ్ వ్యాల్యూ పోయిందని ఆరోపించారు. 9 నెలల్లో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి పోయిందని.. జనం గగ్గోలు పెడుతున్నారన్నారు. జగన్‌ ముఖ్యమంత్రై 9 నెలలైంది.. కానీ ఒక్క ప్రెస్‌కాన్ఫరెన్స్‌ పెట్టే ధైర్యం కూడా లేదని లోకేష్‌ విమర్శించారు. ‘‘నీ కేసులు సంగతేంటి?.. కేంద్రం నిధుల సంగతేంటి?.. హోదా ఏమైంది?.. రేషన్‌కార్డులు, పెన్షన్లు ఎందుకు పీకేస్తున్నారు?.. ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయని జగన్‌ భయపడుతున్నారు అని లోకేష్ అన్నారు.
మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కుటుంబ సభ్యలు ఆస్తుల వివరాలను నారా లోకేష్‌ ప్రకటించారు. గత తొమ్మిది సంవత్సరాల నుంచి తాము ఆస్తులను ప్రకటిస్తున్నామని అన్నారు. చంద్రబాబు ఆస్తులు గత ఏడాదితో పోలిస్తే రూ.85 లక్షలు పెరిగాయని తెలిపారు. చంద్రబాబు నికర ఆస్తి 3.87 కోట్లు, అప్పులు రూ.5.13 కోట్లు ఉన్నాయని తెలియజేసారు. ఇక తన తల్లి భువనేశ్వరి ఆస్తి రూ.53 కోట్ల నుంచి రూ.50 కోట్లకు తగ్గిందని చెప్పారు. తన (నారా లోకేష్) పేరు మీదున్న ఆస్తి 24 కోట్లు.. బ్రాహ్మణి ఆస్తి 15 కోట్ల 68 లక్షలు.. దేవాన్ష్‌ ఆస్తి 19 కోట్ల 42 లక్షలుగా ఉన్నాయని తెలిపారు. నారా లోకేష్ చెప్పిన దాని ప్రకారం.. చంద్రబాబు కుటుంబం మొత్తం ఆస్తులు రూ.119.42 కోట్లు. మొత్తం అప్పులు రూ.26.04 కోట్లు. మొత్తంగా చూస్తే ఆస్తుల్లో నుంచి అప్పులు మినహాయించగా, వారి నికర ఆస్తుల విలువ రూ.93.38 కోట్లు. దీనికి నిర్వాణ హోల్డింగ్స్ సంస్థ ఆస్తులు అదనం.  
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం ఢిల్లీ వెళ్లిన పవన్.. ఆర్కేపురంలోని కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శించి, అమర సైనిక కుటుంబాల సంక్షేమానికి రూ.కోటి విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆర్మ్డ్‌ ఫోర్స్‌ బ్యాడ్జీతో పవన్‌ను సైనిక అధికారులు గౌరవించారు.  అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ... సైనిక్ బోర్డుకు సహాయం అందించాలంటూ బ్రిగేడియర్‌ వీరేంద్ర కుమార్ రాసిన లేఖ తనను కదిలించిందని తెలిపారు. అందుకే తన వంతు సహాయంగా కోటి రూపాయలు అందించానని చెప్పారు. ఇటీవల కొన్నిసార్లు ఢిల్లీకి వచ్చినప్పుడు ఆ మొత్తాన్ని ఇద్దామనుకున్నాను. అయితే అప్పుడు కుదరలేదు అన్నారు. దేశాన్ని, సైనికులను ప్రేమించే ప్రతి ఒక్కరూ సైనిక్ బోర్డ్‌కి సహాయం చేయాలని పిలుపునిచ్చారు. మన సాయం సైనిక కుటుంబాలకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని పవన్‌ తెలిపారు.
గుంటూరు జిల్లా వైసీపీలో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. జిల్లాల్లో ఇప్పటికే ఉప్పు నిప్పుగా ఉంటున్న నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ అనుచరులు ఒక్కసారిగా బాహాబాహీకి దిగారు. దీంతో పోలీసులు వారికి సర్దిచెప్పి ఎంపీని అక్కడి నుంచి పంపించారు. మహాశివరాత్రి సందర్భంగా ఎంపీ కృష్ణదేవరాయలు చిలకలూరి పేటలోని పురుషోత్తపట్నంలో జరిగిన ఓ కార్యక్రమానికి ఎమ్మెల్యే రజనీకి సమాచారం ఇవ్వకుండా రావడమే దీనికి అసలు కారణం. గుంటూరు జిల్లాలో వైసీపీ తరఫున గెలిచిన నేతలంతా దాదాపు కొత్తవారే కావడంతో వారి మధ్య సఖ్యత కుదరడం లేదు. గతంలో ఇసుక అక్రమ తవ్వకాలు, తరలింపు నేపథ్యంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ వైఖరిని నిరసిస్తూ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆందోళనకు దిగారు. ఈ వివాదం సీఎం జగన్ వద్దకు వెళ్లడం, ఇద్దరినీ పిలిపించి మాట్లాడటంతో పరిస్ధితి సద్దుమణిగింది. తాజాగా బుధవారం రాత్రి చిలకలూరిపేటలోని పురుషోత్తపట్నంలో మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రభ వద్దకు నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు వచ్చారు. స్ధానిక నేతల ఆహ్వానం మేరకు అక్కడికి వచ్చిన ఎంపీ కృష్ణదేవరాయలను స్ధానిక ఎమ్మెల్యే విడదల రజనీ అనుచరులు అడ్డుకున్నారు. ఇద్దరూ అధికార పార్టీ నేతలు కావడం, గతంలోనూ వీరిద్దరి మధ్య ప్రోటోకాల్ విషయంలో పలు వివాదాలు తలెత్తడం జరిగింది. దీంతో ఒకరంటే మరొకరికి పడటం లేదు. స్ధానికంగా ఉన్న సంఘమిత్ర ఇంటికి వచ్చిన ఎంపీ కారును ఎమ్మెల్యే వర్గీయులు అడ్డగించారు. ఎంపీ అనుచరులు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ వాగ్వాదానికి దిగారు. ఇది కాస్తా ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. తోపులాటలో ఓ వ్యక్తి తలకు గాయాలు కూడా అయ్యాయి. పరిస్ధితి ముదరడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఎంపీ కృష్ణదేవరాయలను అక్కడి నుంచి పంపించేశారు. దీంతో పరిస్ధితి సద్దుమణిగింది. స్ధానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారనేది ఎమ్మెల్యే రజనీ అనుచరుల వాదన కాగా... ఎంపీగా తమ నియోజకవర్గం పరిధిలో ఎక్కడైనా పర్యటించే హక్కు తనకుందనేది ఎంపీ కృష్ణదేవరాయలు వాదన. అయితే వీరిద్దరి మధ్య గతంలో ఉన్న ఆధిపత్య పోరు కారణంగానే తాజా వివాదం తలెత్తిందని జిల్లా వైసీపీ నేతలు చెబుతున్నారు. వాస్తవానికి విడదల రజనీకి వైసీపీ అధిష్టానం పెద్దల ఆశీస్సులున్నాయి. గతంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మర్రి రాజశేఖర్ ను కాదని గత ఎన్నికల్లో జగన్ రజనీకి టికెట్ కేటాయించారు. అప్పటికే నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ప్రత్తిపాటి పుల్లారావుపై ఆమె సునాయాసంగానే విజయం సాధించారు. ఆర్ధికంగా బలమైన నేత కావడంతో పాటు బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళ కావడం ఆమెకు కలిసివచ్చాయి. అయితే తనకున్న అనుకూలతలను వాడుకుండూ ఎంపీ లావు కృష్ణదేవరాయలను తన నియోజకవర్గంలో అడుగుపెట్టనీయకుండా రజనీ కొంతకాలంగా అడ్డుకుంటున్నారు. ఈ వ్యవహారంపై ఆయన అధిష్టానం పెద్దలకు గతంలో ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది. అయినా వారి నుంచి స్పందన రాకపోవడంతో తన పని తాను చేసుకుపోవాలని భావిస్తున్న ఎంపీ లావు యథావిథిగా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. అదే కోవలో చిలకలూరిపేట రావడంతో వివాదం తలెత్తింది. తాజా వివాదంపై ఇరువర్గాలు వైసీపీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ALSO ON TELUGUONE N E W S
లోకనాయకుడు కమల్ హాసన్ మరోసారి తన గొప్ప స్వభావాన్ని చాటుకున్నారు. 'ఇండియన్ 2' సెట్స్ లో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురు టెక్నీషియన్లకు ఆయన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఆ ముగ్గురి కుటుంబాలకు కోటి రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. ఆయా కుటుంబాల్లో చోటుచేసుకున్న నష్టానికి పరిహారం గా ఈ డబ్బు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. తాను ఇస్తున్న కోటి రూపాయలు నష్టపరిహారం కాదని ఆర్థిక సాయం మాత్రమేనని కమల్ హాసన్ పేర్కొన్నారు. ఏదైనా కుటుంబంలోని కీలక వ్యక్తి ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబం బ్రతుకు సాగించడం ఎంత కష్టంగా ఉంటుందో తనకు తెలుసునని ఆయన అన్నారు. భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకునే విధంగా పరిశ్రమ ప్రముఖులతో మాట్లాడినట్లు కమల్ తెలిపారు. ప్రమాదంలో గాయపడిన ఇతరులు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి ఆయన వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. సినిమా కోసం కష్టపడి పనిచేసే వాళ్లకు రక్షణ ఇవ్వలేకపోతున్న అందుకు వ్యక్తిగతంగా సిగ్గుపడుతున్నానని కమల్ తెలిపారు.
"బరువు తగ్గమంటే తగ్గుతాను. నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. కానీ, బరువు పెరగడం అని చెబితే అస్సలు పెరగను" అని రకుల్ ప్రీత్ సింగ్ చెబుతున్నారు. ఏదైనా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే బరువు తగ్గడానికి 'ఎస్' అంటున్న ఈమె.... బరువు పెరగడానికి మాత్రం నో అంటున్నారు. హిందీలో 'దే దే ప్యార్ దే' సినిమా కోసం రకుల్ 45 రోజుల్లో 10 కిలోలు బరువు తగ్గారు. ఆ సినిమాలో క్యారెక్టర్ కోసం ఆమె చాలా కష్టపడ్డారు. గత సినిమాలతో పోలిస్తే ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చూపించారు. ఆ విధంగా ఏదైనా సినిమా కోసం బరువు తగ్గడానికి తనకి ఎటువంటి సమస్య లేదని ఆమె అంటున్నారు. మరి, పెరగడానికి ఎందుకు నో చెబుతున్నారు? అనే ప్రశ్న రకుల్ ముందుంచితే... "నా ఫిట్ నెస్, ఆరోగ్యానికి హాని చేసే పనులు ఏవి నేను చేయను. బరువు పెరగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ప్రతిరోజూ వర్కౌట్ చేయకపోతే, జిమ్ లో చెమట చిందించ కపోతే నా బాడీ పనిచేయదు" అని సమాధానం ఇచ్చారు. అది సంగతి.
ప్రముఖ నటి, మహిళా దర్శకురాలు, నిర్మాత, గిన్నీస్ బుక్ ఆఫ్‌ రికార్డ్ గ్ర‌హీత, క‌ళావాహిని శ్రీమ‌తి విజయనిర్మల 74వ జయంతి సందర్భంగా నానక్ రామ్ గూడా లోని సూప‌ర్ స్టార్‌ కృష్ణ విజయ నిర్మల నివాసంలోఏర్పాటు చేసిన విజయనిర్మల  కాంస్య విగ్రహాన్ని సూప‌ర్ స్టార్ కృష్ణ ఆవిష్కరించారు.  తెలంగాణ‌ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని నివాళులు అర్పించారు.  ఈ కార్యక్రమంలో విజయ నిర్మల స్త్రీ శక్తి పురస్కారాన్ని డైరెక్టర్ నందినిరెడ్డికి  కృష్ణంరాజు, మహేష్ బాబు అందచేశారు. ఈ సంద‌ర్భంగా... రెబెల్ స్టార్ కృష్ణంరాజు  మాట్లాడుతూ  - ``నాకు బాగా ఇష్టురాలు, స్నేహితురాలు ఆప్యాయంగా అన్నయ్య అని పిలిచే విజయ నిర్మల మనమధ్య లేకపోవడం బాధాకరం. ఆ పేరు లోనే విజయం ఉంది.  ఆ పేరు లోనే నిర్మలత్వం ఉంది. ఆ విజయం కూడా అనితర సాధ్యం. 46 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించి అంత ఎంతో ఎత్తుకి ఎదిగారు. విజయ నిర్మల నాకు బుద్దిమంతుడు సినిమాతో పరిచయం. నేను కృష్ణ గారు విజయ నిర్మల క‌లిసి  ఎన్నో సినిమాలు చేశాం. ఆమె సాధించిన విజయాల్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని అటువంటి విజయాల్ని సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి తల్లితండ్రులు అంటే అభిమానం ఉంటుంది.  అలా నరేష్ తన తల్లికి బంగారు పాదాలు చేయించి పూజించడం గొప్ప విషయం" అన్నారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ  - ‘‘విజయ నిర్మల గారు 50 సినిమాలు చెయ్యడం ఒక చరిత్ర. ఈరోజు ఆవిడ వారసత్వాన్ని అద్భుతంగా కొనసాగిస్తున్నారు’’ అన్నారు. విజయ నిర్మల స్త్రీ శక్తి  అవార్డ్ గ్ర‌హీత, ద‌ర్శ‌కురాలు నందిని రెడ్డి మాట్లాడుతూ  ‘‘విజ‌య‌నిర్మ‌ల గారి పేరు మీద  విజయ నిర్మల స్త్రీ శక్తి అవార్డు మొద‌టి సంవ‌త్స‌రం నేను  తీసుకోవడం చాలా ఆనందంగా వుంది. రాబోయే రోజుల్లో మరింత మంది ఈ అవార్డు తీసుకోవాలి అని కోరుకుంటున్నాను.  మహేష్ చేతుల మీదుగా తీసుకోవడం చాలా హ్యాపీ’’ అన్నారు. నరేష్ విజ‌య‌కృష్ణ‌ మాట్లాడుతూ : ‘‘ప్రతి తల్లి ఒక అమ్మవారు. అమ్మ దీవెనలు వున్న వారు శిఖరాన్ని అందుకుంటారు. మా అమ్మ కృష్ణ గారి దీవెనలతో ఇద్దరు కలసి ఒక రోల్ మోడల్‌గా నిలిచారు. నాకు ఎప్పుడూ మంచి చెబుతూ ధైర్యం నిచ్చారు. అమ్మదీవెనలు అందరికీ వుండాలి. మా వెల్ఫేర్ కోసం నేను ఎప్పుడూ ముందు వుంటాను. అమ్మ పేర అవార్డుని నటీ నటులకు ప్రతి సంవత్సరం అందించనున్నాం’’ అన్నారు మాజీ ఎంపి మురళి మోహన్ మాట్లాడుతూ - " అతి సున్నితమైన మనసున్న మన కృష్ణ గారిని విజయనిర్మల దాదాపు 50 సంవత్సరాలు కంటికి రెప్పలాగా కాపాడుకుంటూవచ్చారు. ఈరోజు ఆవిడ మనమధ్య లేకపోయినా విజయ నిర్మల పుట్టినరోజుని ఇంత ఘనంగా జరపడం నిజంగా అభినందనీయం. ఈ సంవత్సరం లాగే ప్రతి ఏడాది ఆమె పుట్టినరోజు నాడు కళాకారులకు ఆమె పేరు మీద అవార్డ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను" అన్నారు. ప్రముఖ దర్శకుడు ఎస్వి కృష్ణా రెడ్డి మాట్లాడుతూ - "కృష్ణ గారితో నెంబర్ వన్ సినిమా చేస్తున్నప్పుడు ఎవ్వరికి దక్కని అదృష్టం నాకు దక్కింది. అదేంటంటే విజయ నిర్మల గారి చేతి వంట తినే అవకాశం. ఆవిడ చూపించిన ప్రేమ,ఆవిడ వంటలో ఆ రుచి ఒకటి కాదు ఆ అనుభూతిని నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. ఆ అదృష్టం కృష్ణ గారి మూలంగా నాకు దక్కింది. అంతటి ప్రేమానుభూతులు ఉన్నటువంటి విజయ నిర్మల గారు దర్శకత్వ శాఖలో ఉండడం మా అందరికి ఒక అమ్మ ఉన్నట్టుగా అనిపించేది" అన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ - "విజయ నిర్మల గారు నాకు తెలిసి వన్ ఆఫ్ మోస్ట్ గ్రేటెస్ట్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ ఎవర్. నా సినిమాలు రిలీజ్ అయినప్పుడు ప్రతి సారి ఫస్ట్ నాన్నగారు మార్నింగ్ షో చూసి నాతో మాట్లాడేవారు. తరువాత విజయనిర్మల గారు మాట్లాడి కంగ్రాట్స్ చెప్పేవారు. సరిలేరు నీకెవ్వరు రిలీజ్ తరువాత నాన్న గారు కంగ్రాచ్యులేట్ చేశారు తరువాత ఆవిడ మాట్లాడబోతుంది అనుకోని వెంటనే రియలైజ్ అయ్యాను. ఆరోజు ఆ లోటు కనిపించింది. ఈరోజు మనందరం ఆవిడను మిస్ అవుతున్నాం. ప్రతిఏటా ఆమె పుట్టినరోజును ఘనంగా నిర్వహించే వాళ్లం. ఈ ఏడాది విగ్రహావిష్కరణతో ఆమెకు మేము ఇస్తున్న చిన్న నివాళి. ఇవ్వాళ ఆవిడ ఎక్కడున్నా చాలా సంతోషంగా ఉంటారు" అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ - "విజయనిర్మల ఐదారు సినిమాలలో నటించినప్పుడే నేను డైరెక్ట్ చేస్తాను అంది. నేను ఒక సలహా ఇచ్చాను. ఇప్పుడే తొందరపడి డైరెక్ట్ చేయనవసరం లేదు ఒక వంద సినిమాలలో నటించి ఆ తర్వాత నువ్వు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అన్నాను. అలాగే వంద సినిమాలు అయిపోయినతరువాత డైరెక్ట్ చేసింది. మొట్టమొదటి సినిమా బడ్జెట్ తక్కువలో అవుతుందని మలయాళంలో `కవిత` అనే సినిమా చేసింది. అది అద్భుతమైన విజయం సాధించింది. దాని విజయోత్సహంతో తెలుగులో `మీనా` సినిమా తీసింది. అది వందరోజులు ఆడి సూపర్ హిట్ అయింది. ఆ తరువాత వెనక్కి తిరిగి చూడకుండా 46 సినిమాలు తను తీస్తే అందులో 95 శాతం హిట్ సినిమాలే తీసింది. అంత గొప్ప దర్శకురాలు నా భార్య కావడం నా అదృష్టం. ఈరోజున మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. విజయ నిర్మల మీద ఉన్న అభిమానంతో ఈ సభకి విచ్చేసిన  అందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు" అన్నారు. ఈ కార్యక్రమంలో నమ్రత, అచ్చిరెడ్డి, రేలంగి న‌ర్సింహా రావు, గల్లా జయదేవ్, పివిపి, సుధీర్ బాబు,  ఆదిశేషగిరరావు, శివకృష్ణ, మారుతి, బ్రహ్మాజీ, శివ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
మూడేళ్ల క్రితం... తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ 'కాలా' సెట్స్ లో ప్రమాదం కారణంగా మైకేల్ అనే టెక్నీషియన్ మృతి చెందాడు. రెండేళ్ల క్రితం... బహుశా సెప్టెంబర్ నెలలో అనుకుంట! లోకనాయకుడు కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న తమిళ 'బిగ్ బాస్' రియాలిటీ షో చిత్రీకరణలో గుణశేఖరన్ అనే ఏసీ మెకానిక్ మృతి చెందాడు. స్టూడియోలోని సెకండ్ ఫ్లోర్ నుండి ప్రమాదవశాత్తు కింద పడడంతో మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. ఏడాది క్రితం... తమిళ స్టార్ హీరో, ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించిన 'బిగిల్' సినిమా షూటింగులో సెల్వరాజ్ అనే ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. వంద అడుగుల ఎత్తున ఉన్న క్రేన్ కి కట్టిన  ‌ లైట్ కింద పడడంతో అతడిని మృత్యువు కబళించింది. ఈ ఏడాది... కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న 'భారతీయుడు 2' సెట్స్ లో ప్రమాదం జరగడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ నాలుగు ప్రమాదాలకు, ఆరుగురి మరణాలకు ఒక లింక్ ఉంది. అది ఏంటో తెలుసా? చెన్నైలోని ఈవీపీ స్టూడియో. ఈ ప్రమాదాలు అన్నీ ఆ స్టూడియోలో జరిగినవే. ఒక ప్రమాదం వెనుక మరొకటి... మరొక ప్రమాదం వెనుక ఇంకొకటి... వరుసగా అదే స్టూడియోలో ప్రమాదాలు జరగడం, పలువురు మృతి చెందడం చర్చనీయాంశమవుతోంది. 'మురారి' చిత్రంలో ఒకే కుటుంబంలోని వ్యక్తులందరూ ప్రమాదాల కారణంగా మృత్యువాత పడినట్లు... ఈవీపీ స్టూడియోలో ప్రతి ఏడాది ఏదో ఒక ప్రమాదం జరగడం, ఎవరో ఒకరు మృత్యువాత పడుతుండటంతో కొత్త అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. స్టూడియో వాస్తు బాలేదని కొందరు, ఏమై ఉంటుందని మరికొందరు తమకు తోచిన విధంగా మాట్లాడుతున్నారు.
నితిన్, రష్మిక జంటగా 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన 'భీష్మ' మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. గురువారం రాత్రికి అమెరికాలో ప్రీమియర్ షోలు పడతాయి. శుక్రవారం సాయంత్రానికి తెలుగు రాష్ట్రాల్లోనూ రిజల్ట్ ఏంటనేది తెలుస్తుంది. అయితే... రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వాటే వాటే బ్యూటీ పాట, నితిన్ రష్మిక జంట సినిమాపై అంచనాలు పెంచాయి. ట్రైలర్స్ కూడా ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాయి. నితిన్ పెళ్లి కుదరడం, రష్మిక కుక్క బిస్కెట్ ఒక చిన్న బైట్ కొరకడం వంటి వార్తలు బాగా వైరల్ కావడంతో సినిమాకు పబ్లిసిటీ బాగా దక్కింది. క్రేజీ కాంబినేషన్ లో సినిమా కావడంతో ప్రేక్షకులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ శుక్రవారం ఈ సినిమా ఒక్కటే కాదు మరో నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. స్టార్ హీరోయిన్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన 'వసంత కాలం' శుక్రవారం విడుదల అవుతుంది. కమల్ హాసన్ హీరోగా చీకటి రాజ్యం చిత్రానికి దర్శకత్వం వహించిన చక్రి తోలేటి తీసిన ఓ తమిళ సినిమాకు అనువాదం ఇది. సరైన పబ్లిసిటీ లేని కారణంగా ఈ సినిమా ఒకటి వస్తుంది అనేది ప్రేక్షకులకి తెలియలేదు. ఈ శుక్రవారం విడుదల అవుతున్న మరో సినిమా 'ప్రెజర్ కుక్కర్'. పిల్లలపై చదువుల ఒత్తిడి ఏ విధంగా ఉంటుంది? అమెరికా వెళ్లడానికి ఎన్ని కష్టాలు పడతారు? ఒక్కసారి అమెరికా వెళ్ళిన తర్వాత ఇక్కడ వాళ్ల తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడతారు? అనే కథాంశంతో వినోదాత్మకంగా తెరకెక్కించారు అనేది ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. తెలంగాణ యాసలోని సంభాషణలు, రాహుల్ రామకృష్ణ సినిమాకు ప్లస్ అని చెప్పాలి. చిన్న చిత్రమే అయినప్పటికీ అర్బన్ ఆడియన్స్ లో ఈ సినిమాకు కొంత క్రేజ్ ఏర్పడింది. అయితే థియేటర్లకు ఎంతమంది వస్తారు అనేది చూడాలి. 'చీమ - ప్రేమ... మధ్యలో భామ', 'వలయం' అనే మరో రెండు సినిమాలు కూడా ఈ శుక్రవారం విడుదల అవుతున్నాయి. 'భీష్మ' దూకుడు ముందు ఈ సినిమాల్లో ఎన్ని నిలబడ్డాయో చూడాలి.
అందాల భామలు అంగాంగ ప్రదర్శన చేస్తుంటే అందంగా కెమెరాలో బంధించడమే సెలబ్రిటీ ఫొటోగ్రఫీగా మారిన రోజులు ఇవి. కింగ్ ఫిషర్ క్యాలెండర్ కోసం పలువురు భామలు బికినీల్లో ఫొటోలు దిగారు. ఫేమస్ బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ డబూ రత్నాని మరో అడుగు ముందుకు వేశారు. ఒంటి మీద నూలు పోగు వేసుకోని హీరోయిన్ల అందాలు ఆరుబయట కనిపించకుండా ఏదో ఒక వస్తువును అడ్డుపెట్టి ఫొటోషూట్ చేశారు. ప్రతి ఏడాది డబూ రత్నాని క్రేజీ హీరోయిన్లతో క్యాలెండర్ షూట్ చేస్తారు. ఈ ఏడాదీ చేశారు. అయితే.. ఆ షూట్ లో ఎక్కువ న్యూడిటీ కనిపించింది.  తెలుగులో 'భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ' సినిమాల్లో నటించిన కియారా అద్వాణీ ఈ ఏడాది డబూ రత్నాని క్యాలెండర్ షూట్ లో హాట్ టాపిక్. టాప్ లెస్ గా... పై అందాలను కేవలం అరిటాకు కప్పుకుని మాత్రమే ఆమె ఫొటో దిగారు. ఈ ఫోటోపై మీమ్స్ చాలా వచ్చాయి. కియారాను అలా చూపించిన వ్యక్తిని కొట్టడానికి కబీర్ సింగ్ బయలు దేరాడని ఎక్కువమంది కామెడీ చేశారు. ఇక, పోర్న్ స్టార్ సన్నీ లియోన్ అయితే పెద్ద పుస్తకాన్ని అందాలు కనిపించకుండా అడ్డు పెట్టుకున్నారు. భూమి ఫెడ్నేకర్ కూడా దుస్తులు లేకుండా ఫొటోషూట్ చేశారు. ఈ ఫొటోలో క్రియేటివిటీని తక్కువ చేయలేము. కానీ, న్యూడిటీ మాత్రమే నయా ఫ్యాషన్ కావడం శోచనీయమని పలువురు కామెంట్ చేస్తున్నారు. కియారా, భూమి కంటే హాట్ హీరోయిన్లుగా ముద్రపడిన విద్యా బాలన్, జాక్వలైన్ ఫెర్నాండేజ్ దుస్తులు వేసుకుని ఫోటోషూట్ చేయడం గమనార్హం.
నిజం నిలకడ మీద తెలుస్తుంది - పెద్దలు చెప్పిన మాట! సోషల్ మీడియా జమానాలో ఎవరికీ నిలకడ ఉండడం లేదు. నిలకడగా నిజం తెలిసేలోపు అబద్దాన్ని అందరికీ చెప్తున్నారు. ఆ తొందరే కొంపలు ముంచుతోంది. సోషల్ మీడియాలో సెలబ్రిటీలను చంపేస్తోంది. దర్శకుడు శంకర్ ను ఈ విధంగా కొందరు చెంపేస్తుంటే... మరికొందరు గాయాలు అయ్యాయని రాస్తున్నారు. అసలు వివరాల్లోకి వెళితే... చెన్నై నగరశివార్లలోని ఒక ప్రాంతంలో 'ఇండియన్ 2' కోసం సెట్స్ వేస్తున్నారు. బుధవారం రాత్రి సెట్ వర్క్ జరుగుతుండగా ప్రమాదం సంభవించింది. భారీ క్రేన్ కింద పండింది. ఈ ప్రమాదంలో ఒక సహాయ దర్శకుడు, మరో ఇద్దరు మృతి చెందారు. అయితే... ప్రమాదంలో దర్శకుడు శంకర్ కి తీవ్ర గాయాలు అయ్యాయని కొందరు ట్వీట్స్ చేశారు. అందులో నిజం లేదని యూనిట్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. కమల్ హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన హిట్ సినిమా 'ఇండియన్'కి సీక్వెల్ ఈ 'ఇండియన్ 2'.  తాజా సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సీక్వెల్ ను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. బుధవారం రాత్రి జరిగిన ప్రమాదం నుండి కమల్, కాజల్ తృటిలో బయటపడ్డారని కాస్ట్యూమ్ డిజైనర్ అమృతరామ్ ట్వీట్ చేశారు. క్రేన్ పడడానికి పది సెకన్స్ ముందు వరకు కమల్, కాజల్, తానూ అక్కడ ఉన్నామని ఆమె ట్వీట్ చేశారు. దానికి కాజల్ రిప్లై ఇచ్చారు. బాధపడుతున్న ఎమోజి పోస్ట్ చేశారు. 
 సినీలోకం అంటేనే అదో మోజు. అన్నింటికంటే సినిమాకే లోకంల క్రేజ్ ఎక్కువ. అలాంటి సినిమాల్లో ప్రమాదాలు డైరెక్టర్ సృష్టి, కానీ సృష్టిస్తున్న సినిమాలో ప్రమాదం జరిగితే అదీ ఓ భారీ విషాదంగా మారితే కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్2 సినిమా సెట్స్ లో ఇదే జరిగింది. ఒక క్రేన్ అమాంత నేలకూలి ముగ్గుర్ని బలితీసుకుంది. చెన్నై సహా భారతీయ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ భారతీయుడు2 సినిమా షూటింగే. కమల్ హాసన్ నటించిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా రాబోతోంది ఇండియన్ 2. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని 2021లో గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్రయత్నిస్తోంది చిత్ర యూనిట్. అందుకు శరవేగంగా నిర్మాణం జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే రాత్రి వేళల్లోనూ షూట్ కొనసాగించారు డైరెక్టర్ శంకర్. సరిగ్గా రాత్రి పది గంటల సమయంలో పోరుమళ్లీలోని ఇవిపి ఫిలింసిటీలో షూటింగ్ జరుగుతోంది. అప్పటి వరకూ కొన్ని షాట్స్ తీసి కాస్త రిలాక్స్ అయ్యింది టీమ్. కమల్ హాసన్ షూట్ ముగించుకుని ఓ పక్కకు వచ్చారు. డైరెక్టర్ శంకర్ అంతకుముందు సీన్ ఎలా జరిగిందో పరిశీలిస్తున్నారు. ఈ తతంగమంతా జరుగుతోంది. సరిగ్గా అదే టైంలో ఓ టెంట్ కింద పైనుంచి ఓ భారీ క్రేన్ కంట్రోల్ తప్పి నేలకూలింది. క్రేన్ కుండే పొడవైన రాడ్ మాత్రమే కాదు ఇంజిన్ తో సహా అది పక్కకు ఒరిగిపోయింది. అయితే క్రేన్ కూలిన సమయంలో టెంట్ కింద 15మంది వరకు ఉన్నారు. క్రేన్ నేరుగా మీద పడటంతో అందులో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే డైరెక్టర్ శంకర్ కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. చనిపోయిన వాళ్లలో ఇద్దరు ప్రొడక్షన్ అసిస్టెంట్ లు మధు, చంద్రన్. మరొకరు అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ ఉన్నారు. క్రేన్ మీద పడటంతో కనీసం గాయాలతో కూడా తప్పించుకునే పరిస్థితి లేకపోయింది. ఏకంగా వీళ్ళ ప్రాణాలే పోయాయి. ముగ్గురి మృతదేహాలను రాజీవ్ గాంధీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక క్రేన్ మీద పడినప్పుడు అదే టెంట్లో ఉన్న మిగతావాళ్లలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. చిత్ర నిర్మాణంలో సిబ్బందిగా ఉన్న మాన్సింగ్, వాసు, రాంజాన్, అరుణ్ ప్రసాద్, కుమార్, కళైచిత్ర, గునపాలమన్, తిరునావక్కరసు, మురుగుదాస్ ఉన్నారు. ఇక శంకర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఆయన తీవ్రంగా గాయపడ్డట్టు ఏకంగా కాలు ఫ్రాక్చర్ అయినట్టు వస్తున్న వార్తలు మాత్రం పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు శంకర్ సన్నిహితులు. కాగా గాయపడినవాళ్లకు సవితా మెడికల్ కాలేజ్ లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
  "నేను మీమ్స్ క్రియేట్ చేసే క్యారెక్టర్ చేశాను. అందుకే 'భీష్మ'లో ప్రతి సీనూ ఫన్నీగా ఉంటుంది. విలన్ కు వార్నింగ్ ఇవ్వడంలోనూ ఆ క్యారెక్టరైజేషన్ కనిపిస్తుంది. డిఫరెంట్ రోల్ అని చెప్పను కానీ మంచి రోల్" అని చెప్పారు నితిన్. ఆయన హీరోగా వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన సినిమా 'భీష్మ'. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. రష్మికా మందన్న నాయిక. ఫిబ్రవరి 21న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం మీడియాతో సంభాషించారు నితిన్. ఆ విశేషాలు... పెళ్లి ఫిక్సయినందుకు కంగ్రాట్స్. పెళ్లి ఎప్పుడు, ఎక్కడ.. ఆ వివరాలు చెప్తారా? దుబాయ్‌లో ఏప్రిల్ 15న నిశ్చితార్థం, 16న కొద్దిమంది సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో పెళ్లిచేసుకోబోతున్నాం. 21న హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రేమలో ఎప్పుడు పడ్డారు? 2012లో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా శాలిని పరిచయమయ్యింది. అది స్నేహంగా, తర్వాత ప్రేమగా మారింది. నేనే తనకు తొలిసారి నా ప్రేమను వ్యక్తం చేశా. తనూ యాక్సెప్ట్ చేసింది. గత సంవత్సరం ఇద్దరం ఇట్లోవాళ్లకు ఈ విషయం చెప్పాం. అప్పటి దాకా వాళ్లకూ ఈ విషయం తెలీదు. పెళ్లి సరైన సమయంలోనే చేసుకుంటున్నానని అనుకుంటున్నారా? లేటయ్యిందని అనుకుంటున్నారా? నిజానికి మూడేళ్ల క్రితమే పెళ్లి చేసుకోవాల్సింది. కానీ మ్యారేజ్ అనేది జీవితంలో పెద్ద స్టెప్ కాబట్టి, ఆలోచించుకొని ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఎక్కడా బయటపెట్టకూడదని ముందే ప్లాన్ చేసుకున్నారా? అవును. ఒక ప్లాన్ ప్రకారమే మేం ఎక్కడా మా ప్రేమను బయట వ్యక్తం చెయ్యకుండా ఉంచగలిగాం. మీడియా అటెన్షన్ ఒద్దనుకున్నాం. డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది నా ఆలోచన కాదు. శాలిని, ఆమె తల్లిదండ్రులు, మా అమ్మానాన్నల ఆలోచన. ప్రేమలో పడక ముందూ, పడ్డాక మీలో మీకు కనిపించిన మార్పు ఏమైనా ఉందా? నిజాయితీగా చెప్పాలంటే, ఏం లేదండీ. అదివరకు ఎలా ఉన్నానో, ఇప్పుడూ అలాగే ఉన్నా. ఇక 'భీష్మ' విషయానికి వద్దాం. ఈ కథ ఎప్పుడు ఓకే చేశారు? నేను 'శ్రీనివాస కల్యాణం' చేసేటప్పుడు డైరెక్టర్ వెంకీ కుడుముల ఈ లైన్ చెప్పాడు. నాకు నచ్చింది. దాన్ని డెవలప్ చెయ్యడానికి సంవత్సరం టైం తీసుకున్నాడు. మునుపటి మూడు సినిమాలు ఆడలేదు కాబట్టి, ఈసారి స్క్రిప్ట్ పక్కాగా లాక్ చేసుకున్నాకే మొదలు పెడదామని అనుకున్నా. ఈ టైంలోనే 'రంగ్ దే' స్క్రిప్ట్, చంద్రశేఖర్ యేలేటి సినిమా స్క్రిప్ట్ కూడా విని ఓకే చేశాను. వాటి పూర్తి స్క్రిప్టులు అయ్యాకే మూడింటినీ మొదలుపెట్టాను. అలాగే కృష్ణచైతన్య చెప్పిన 'పవర్ పేట' స్క్రిప్ట్, హిందీ సినిమా 'అంధాధున్' రీమేక్ కూడా ఓకే ఛేశాను. ఈ ఏడాది బహుశా నావి నాలుగు సినిమాలు విడుదలవుతాయి. 'భీష్మ' ఎలా ఉంటుంది? 'దిల్' తర్వాత నేను చేసిన లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్. యాక్షన్ కూడా మిళితమై ఉంటుంది. ఇందులో ఆర్గానిక్ వ్యవసాయం అనేది ప్రధానాంశం కాదు. కథలో ఒక ఎలిమెంట్ మాత్రమే. భీష్మ ఆర్గానిక్స్ అనే కంపెనీ ఉంటుంది. అందులో నేనొక ఉద్యోగిని. ఆర్గానికి ఫార్మింగ్ అంటే దాని గురించిన సినిమా అని అంటారేమోనని దాన్ని ప్రమోషన్స్‌లో ఎలివేట్ చెయ్యలేదు. ట్రైలర్లో ఒక ఫైట్ 'అతడు'లోని పొలం ఫైట్ ను గుర్తు చేస్తోంది. దాని స్ఫూర్తితో తీశారా? కరక్టే. 'అతడు'లోని పొలం ఫైట్ ను దృష్టిలో ఉంచుకొనే దాన్ని తీశాం. అది ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. సంగీతానికి ప్రాముఖ్యం ఉన్నట్లు కనిపిస్తోంది... అవునండీ. మహతి స్వరసాగర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. 'వాటే బ్యూటీ' కానీ, 'సరాసరి గుండెల్లో' కానీ, సింగిల్స్ యాంథెం కానీ.. చాలా బాగా మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా బాగా ఇచ్చాడు. మొదట మహతిని కాకుండా వేరే  చాయిస్ కు వెళ్దామని మీరు అన్నట్లు వినిపించింది నిజమేనా? నిజమే. అంతా 'ఛలో' టీం అయిపోతోందని, మహతినైనా మార్చమని వెంకీకి చెప్పా. మహతితో తనకు బాగా సింకవుతుందనీ, అతడితోనే మ్యూజిక్ చేయిద్దామనీ వెంకీ అనడంతో సరేనన్నా. మహతి కూడా మంచి మ్యూజిక్ ఇచ్చి వెంకీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. డాన్సుల గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు? చివరిగా 'గుండెజారి గల్లంతయ్యిందే'లో ఎక్కువ డాన్స్ చేశా. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న స్టెప్స్ ఉన్నాయి కానీ ఎక్కువ డాన్స్ చెయ్యలేదు. ఈ సినిమాకు ముందే అనుకొని డాన్స్ చేసాం. తెరమీద నా డాన్స్ చూసినవాళ్లు కచ్చితంగా ఇష్టపడతారు. రష్మికతో పనిచేయడంపై ఏమంటారు? తెరపై రష్మిక అద్భుతంగా ఉంది. చక్కని నటి. మా మధ్య కెమిస్ట్రీ బాగుందని అందరూ అంటున్నారు. మీ ప్రతి సినిమాలో పవన్ కల్యాణ్ ప్రస్తావన వస్తూనే ఉంటుంది. ఎందుకట్లా.. ప్రమోషన్ కోసమేనా? 'జయం' నుంచి నా ప్రతి సినిమాలో ఆయన ప్రస్తావన ఉంది. ఆయన పాటో, ట్యూనో, పోస్టరో, డైలాగో.. ఉంటూ ఉంది. 'ఇష్క్'తో సక్సెస్ వచ్చాక దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అది ఆయనపై నాకున్న ప్రేమ. నేను ఆయనకు స్వచ్ఛమైన అభిమానిని. మీరు ఎంత దాని గురించి రాసినా దాన్ని పెడుతూనే ఉన్నా. అది నా లవ్. అంతే! 'భీష్మ' చేసే టైంలోనే మరో రెండు సినిమాలూ చేస్తుంటే, క్యారెక్టర్స్ విషయంలో కన్ఫ్యూజ్ అవలేదా? ఒక్కో డైరెక్టర్ ది ఒక్కో స్టైల్ కాబట్టి కన్ఫ్యూజ్ కాలేదు. వెంకీ కుడుములకు డైలాగ్స్ చెప్పేటప్పుడు కళ్లార్పడం ఇష్టముండదు. అదే యేలేటి గారైతే, కళ్లు ఆర్పమంటాడు. ఎప్పుడైనా కాస్త కన్ఫ్యూజ్ అయినా ఆ డైరెక్టర్లే మళ్లీ తమ క్యారెక్టర్ లోకి నన్ను తీసుకొచ్చేవాళ్లు. కానీ ఇంకెప్పుడూ లైఫ్ లో ఒకేసారి మూడు సినిమాలు చెయ్యనండీ బాబూ.. నిద్ర లేదు, రెస్ట్ లేదు. ఎప్పుడైనా ఒకరోజు గ్యాప్ వస్తే, ఆ రోజు తమకు కావాలని ముగ్గురూ కొట్టుకొనేవాళ్లు. ఇప్పుడు 'భీష్మ' అయిపోవడంతో కాస్త ప్రశాంతంగా ఉంది. యేలేటి గారితో చేస్తున్న సినిమా పేరు 'చెక్'. చెస్ ఆటలో 'చెక్' అనే మాట వస్తుంది కదా.. అదే. నిర్మాణ విలువల గురించి ఏం చెబుతారు? సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వరుసగా సినిమాలు చేస్తున్నానంటేనే ఈ బ్యానర్ అంటే ఎంత ఇష్టపడుతున్నానో మీరే ఊహించుకోండి. వీళ్లు తీసే అన్ని సినిమాల్లో నిర్మాణ విలువలు హై లెవల్లో ఉంటాయి. 'అ ఆ' మూవీ నుంచి ఈ బ్యానర్ తో నా జర్నీ మొదలైంది. 'భీష్మ' తర్వాత మళ్లీ ఇదే బ్యానర్ తో 'రంగ్ దే' చేస్తున్నా. దాని తర్వాత కూడా మరో సినిమా చేద్దామని నిర్మాత నాగవంశీ అంటున్నారు. 'అంధాధున్' రీమేక్ ఎప్పుడు ఉంటుంది? జూన్‌లో మొదలవుతుంది. మేర్లపాక గాంధీ డైరెక్టర్. 'పవర్ పేట'ను ఎప్పుడు మొదలుపెడతారు? 'పవర్ పేట' ఆగస్టు నుంచి ఉంటుంది. ఆ సినిమా కథ 1960లో మొదలవుతుంది. 1990లో నా పాత్ర వస్తుంది. అందులో 20 ఏళ్ల యువకుడి నుంచి 60 ఏళ్ల వయసు వాడయ్యేదాకా నా క్యారెక్టర్ ఉంటుంది. 'జయం' నుంచి ఎక్కువగా లవ్ స్టోరీలే చేస్తూ వచ్చారు. బోర్ అనిపించలేదా? కథలన్నీ ఒకదానికొకటి భిన్నమైనవి కాబట్టి బోరేమీ ఫీలవలేదు. ఇప్పుడు డిఫరెంట్ గా చెయ్యాలనే ఉద్దేశంతోనే యేలేటి గారి సినిమా చేస్తున్నా. 'అంధాధున్' డిఫరెంట్ సినిమా, 'పవర్ పేట' డిఫరెంట్ సినిమా. నేను కూడా లవ్ స్టోరీస్ తగ్గించే ఆలోచనలో ఉన్నాను. 'రంగ్ దే' లవ్ స్టోరీ అయినప్పటికీ, ఆ కథ నాకు బాగా నచ్చేసింది. అందులో నేను 24 ఏళ్ల యువకుడిగా కనిపిస్తా. మళ్లా అలాంటి క్యారెక్టర్ చెయ్యలేను కాబట్టి ఒప్పుకున్నా. బ్యాచిలర్ లైఫ్ ముగిసిపోతోందంటే ఏమనిపిస్తోంది? నాకంటే నా తోటి హీరోలు చాలా ఆనందపడుతున్నారు. నాని 'దా దా' అంటున్నాడు. రానా, వరుణ్ తేజ్ కూడా కామెట్ చేస్తున్నారు. నాకైతే ఇప్పటికే చాలా లేటైపోయిందనిపిస్తోంది.
  తారక్, త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. 'అరవింద సమేత.. వీరరాఘవ' తర్వాత ఆ ఇద్దరూ మరో సినిమా చెయ్యడానికి సిద్ధమవుతున్న విషయం కొంతకాలంగా వార్తల్లో నలుగుతోంది. తన తదుపరి సినిమా జూనియర్ ఎన్టీఆర్‌తోటే ఉంటుందని త్రివిక్రమ్ వెల్లడించాడు కూడా. ఇప్పుడు నిర్మాతల నుంచే ఆ ప్రకటన వచ్చింది. త్రివిక్రమ్ ఆస్థాన నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌తో పాటు నందమూరి కల్యాణ్ రామ్ సంస్థ నందమూరి తారకరామారావు ఆర్ట్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకోనున్నది. 2021 వేసవిలో ఈ సినిమాని విడుదల చేస్తామని నిర్మాతలు ఎస్. రాధాకృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలయ్యేదీ, తారాగణం, సాంకేతిక నిపుణుల బృందం వివరాల్ని త్వరలో తెలియజేస్తామన్నారు.  తారక్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' మూవీ చేస్తున్న విషయం విదితమే. ఆ సినిమాలో తన సన్నివేశాలు పూర్తయ్యాక, త్రివిక్రమ్ మూవీ సెట్స్ మీదకు ఆయన రానున్నాడు. కాగా నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ లోగో మారింది. మొదట్లో సీనియర్ ఎన్టీఆర్ సంతకం చేసినట్లుగా ఉండే బ్యానర్ లోగోను 'జై లవకుశ' సినిమాకు వేరే డిజైన్‌తో మార్చారు. ఆ రెండూ తెలుగులో ఉండేవి. వాటిలో ఎన్టీఆర్ బొమ్మ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఇంగ్లీషులో డిజైన్ చేసిన బ్యానర్ లోగోలో ఒక చేయి పైకెత్తినట్లున్న ఎన్టీఆర్ షాడో బొమ్మ పసుపు రంగులో కనిపిస్తోంది. తారక్ 30వ సినిమాగా ఇది రూపొందనున్నది. ఈ సినిమాకి ఆయన పారితోషికం తీసుకోకుండా థియేట్రికల్ ప్రి బిజినెస్ విలువలో 40 శాతం వాటా తీసుకోనున్నట్లు సమాచారం. ఒకవేళ రూ. 100 కోట్లకు ఈ సినిమా అమ్ముడైతే, తారక్‌కు రూ. 40 కోట్లు అందనున్నాయి.
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో... ఏ.బీ. వెంకటేశ్వర రావు ఇంటెలిజెన్స్ అదనపు డి.జి.పి. గా ఉన్న సమయంలో విశేషంగా సేవలందించిన ముగ్గురు డి.ఎస్.పి. లకు వై ఎస్ ఆర్ సి పీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇంటెలిజెన్స్ కే సేవలందించే భాగ్యాన్ని పోలీసు బాస్ లు కల్పించారు. ఇంతకీ, ఆ ముగ్గురూ కూడా ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు గానే నిజాయితీ తో కూడిన నివేదికలను ఏ.బి. కి ఇస్తూ వచ్చే వారు. నాయుడు పార్టీ గల్లంతవుతుందని, 50 కి మించి సీట్లు రావని మరీ ఢంకా బజాయించి సమగ్ర నివేదికలు, నియోజకవర్గాల వారీగా ఇచ్చారు. మిగిలిన డి.ఎస్.పి ల మాదిరి, ఏ.బి. అడుగులకు మడుగులు కొట్టకుండా...ఉన్న వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు గా వివరించిన ఆ ముగ్గురు డి ఎస్ పి లకు ఆశ్చర్యకరంగా ఇప్పుడు లా ఎండ్ ఆర్డర్ లో కానీ, ఏ సి బీ లో కానీ, విజిలెన్స్ ఎండ్ ఎంఫోర్సుమెంట్ లో కానీ అవకాశం ఇవ్వటానికి పోలీసు బాస్ లు ససేమిరా అంటున్నారు. ఆ ముగ్గురూ కూడా తెలుగు దేశం హయాం లో నిక్కచ్చిగా పనిచేశారు కాబట్టి, ఎలాంటి రాగ ద్వేషాలకు లొంగకుండా పని తీరు ప్రదర్శించారు కాబట్టి వారి సేవలు ఇంటెలిజెన్స్ కె అవసరం పడతాయని పోలీసు బాస్ లు సూత్రీకరించారు. దరిమిలా...వారి ముగ్గురికీ ఇంటెలిజెన్స్ లోనే కొనసాగాల్సిన గతి ఏర్పడింది. వాస్తవానికి లా ఎండ్ ఆర్డర్ లో కానీ, ఏ సి బి లో కానీ వారికి అవకాశం కల్పించటానికి దారులు ఉన్నప్పటికీ, వారిని మినహాయించి వేకెన్సీ రిజర్వ్ (వీ.ఆర్.) లో ఉన్న చాలా మందికి పోస్టింగులు ఇవ్వటానికి కూడా పోలీసు బాస్ లు ప్రయత్నిస్తున్నారు. విషయం తెలిసిన ఆ ముగ్గురు ఇంటెలిజెన్స్ డి ఎస్ పి లు ఇక తమకు కీలకమైన విభాగాల్లో అవకాశం రాదనీ నిర్ధారించుకుని, రాజీనామా ఇవ్వటానికి సింథ్పడినట్టు పోలీస్ హెడ్ క్వార్ట్రర్స్ భోగట్టా. ఈ విషయమై వారు ఇప్పటికే, పలువురు సీనియర్ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఎలాంటి ఫలితమూ కనపడక పోవటం తో , గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ ముగ్గురూ కూడా తమ పోస్టులకు రాజీనామా చేసేద్దామని నిర్ణయానికి వచ్చినట్టు ఒక సీనియర్ మోస్ట్ పోలీస్ బాస్ తన ఆంతరంగికుల దగ్గర సమాచారాన్ని షేర్ చేసుకున్నట్టు వెలగపూడి సెక్రెటేరియట్ లో చెప్పుకుంటున్నారు. ఇదే గనుక జరిగితే, ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర మైన పరిస్థితి ఏర్పడుతుందని, హోమ్ మంత్రి నేరుగాఈ వ్యవహారం పై దృష్టిపెట్టి , ముఖ్యమంత్రి దృష్టి లో సమస్యను ఉంచాలని సీనియర్ పోలీస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. డి ఎస్ పీ స్థాయి అధికారులు కూడా నైరాశ్యానికి లోనై, ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే, పోలీస్ శాఖపై ప్రజలకు తప్పు సంకేతాలు వెళతాయని ఆందోళనను పోలీసు అధికారులే వ్యక్తం చేస్తున్నారు. అసలు పోలీస్ శాఖపై హోమ్ మంత్రికి సమగ్ర అవగాహనా ఉండేలా ఇంతవరకూ ఒక కార్యాచరణ తో కూడిన ప్లాన్ ను ఏదైనా సీనియర్ అధికారులతో డిస్కస్ చేశారా, లేదా అనేది కూడా తెలియని ఒక అయోమయ స్థితి నెలకొంది.  వాస్తవానికి ఆ ముగ్గురు డి ఎస్ పి లు కూడా వాస్తవాలతో కూడిన నివేదికలు ఇవ్వటం అనేది, ఎన్నికల ముందు వై ఎస్ ఆర్ సి పీ కి కూడా కొంత నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు పాలక పక్షం లో ఉన్న వై ఎస్ ఆర్ సి పీ ప్రస్తుతమ్ ఈ తరహా అన్యాయం పై నోరు మెదపకపోవటం తో ఆ ముగ్గురు డి ఎస్ పి లు అనివార్యంగా తమ రాజీనామా నిర్ణయాన్ని నేరుగా హోమ్ మంత్రి దృష్టి కె తీసుకెళ్లాలని  భావిస్తున్నారు. చిత్రం కాకపొతే, వారి నిక్కచ్చి తనమే ...వారికి ఇపుడు కీలక విభాగాల్లో పోస్టింగులు రాకుండా అడ్డు పడటమేమిటని సెక్రెటేరియేట్ సీనియర్లు ఆశ్చర్య పోతున్నారు. వాస్తవానికి అవినీతీ నిరోధక శాఖ (ఏ సి బీ) కి ఇప్పుడు 14 మంది డి ఎస్ పి ల అవసరం ఉన్నప్పటికీ, ఇటువంటి నిజాయితీ పరులైన అధికారులని ఏ సి బీ కోసం వదులుకోవటానికి ఇంటెలిజెన్స్ శాఖ సిద్ధంగా లేదని ఆ శాఖ లో ఒక పెద్ద ఆఫీసర్ వాక్రుచ్చారు. మరి ఎల్లా కాలమూ, వారు అక్కడే సేవలందించాలా అనే ప్రశ్నకు మాత్రం ఆ పెద్దాయన దగ్గర సమాధానం లేదు. మొత్తానికి, మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏమిటంటే--మరీ ముక్కు సూటిగా పొతే, ఒకో సారి అవసరాలకు కూడా వెతుక్కునే పరిస్థితి ఎదురవ్వచ్చు అని...
తెలంగాణ సీఎం కేసీఆర్ నిరంతర శ్రామికుడు. అలుపెరుగని పోరాట యోధుడు. ఎప్పుడూ ప్రజాకాంక్షే ప్రధానంగా ప్రజానురంజకంగా పాలన సాగించే ఓ మేధావి. గొప్ప రాజకీయ వేత్త. అసాధారణ పట్టుదల, అచంచలమైన ఆత్మవిశ్వాసం, సాధించాలనే తపన కలగలసి ప్రజల్లో ఓశక్తిగా ఎదిగాడు కేసీఆర్. ఎన్నింటినో అసాధ్యం అనుకున్న వాటిని చేపట్టి సుసాధ్యం చేసుకొనేలా వ్యూహాలను.. తెగింపుతో కూడిన పోరాట పటిమను ప్రదర్శించి ప్రజలతో హ్యాట్సాప్ అనిపించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధన కోసం అలుపెరుగని కృషి చేశారుడ. తెలంగాణ ఏర్పాటుతో తిరిగులేని నేతగా ప్రజల హృదయాలను గెలిచాడు. వరుసగా రెండోసారి కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి ప్రజానురంజకంగా పాలన చేస్తున్నాడు. దేశంలోని ఎన్నో రాష్ట్రాలకు కేసీఆర్ తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు ఆదర్శంగా నిలిచాయి. రోల్ మోడల్ సీఎం కేసీఆర్ ను తీసుకొని ఇతర రాష్ట్రాలు పాలన సాగిస్తున్నాయి. సంక్షేమం, అభివృద్ధికి సముచిత ప్రాధాన్యం ఇస్తూ.. కేసీఆర్ పాలన సాగిస్తున్న తీరు అందర్నీ ఎంతో ఆకర్షిస్తుంది. తెలంగాణ చెరువులకు జలకళ తెచ్చాడు. అందుకోసం మిషన్ కాకతీయ.. ఇంటింటికి తాగునీటి కోసం మిషన్ భగీరథ ఎన్నో గొప్ప పథకాలతో దూసుకుపోతున్నారు. ముందు చూపున్న నేతగా కేసీఆర్ చేపట్టిన ఈ పథకాలను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో అపర భగీరథుడుగా మారారు కేసీఆర్. అంతేకాకుండా సంక్షేమం విషయంలో కేసీఆర్ తనదైన శైలిని ఎంచుకున్నారు. కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, ఆసరా ఫించన్లు వంటి  పథకాలు పేదలకు భరోసాని కల్పించాయి. కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు పథకమైతే.. కేంద్రానికే ఆదర్శప్రాయంగా నిలిచింది. అలాగే.. కేసీఆర్ సంక్షేమానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో.. అంతకు మించి అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం కీలకంగా చెప్పవచ్చు. గత ఐదేళ్లలో హైదరాబాద్ ఐటీ రంగం భారీగా పుంజుకుంది. మళ్లీ బెంగళూరుకు పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. ఇదంతా కేసీఆర్ సర్కారు అందిస్తోన్న సుస్థిర పాలన వల్లే సాధ్యమైందని చెప్పవచ్చు. కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజల గొంతుక. ఎవరికీ కష్టం వచ్చినా.. వారికి తెలిస్తే చాలు.. వెంటనే ఫోన్ చేసి ఆరా తీస్తాడు. పేద ధనిక అన్న తేడా లేకుండా అందరితో కలివిడిగా మాట్లాడతాడు. స్థానిక ప్రజలను నవ్వించాలన్నా.. ఏడిపించాలన్నా అది కేసీఆర్ కే సాధ్యం... కాదు కాదు.. ఆయన స్పీచ్ కు సాధ్యం. ప్రజల్లో ఊరమాస్ లెక్క ఉండే ఆయన స్పీచ్ లకు జనాలు దాసోహమౌతారు.  అక్షరం ముక్క రానోడి కూడా ఆయన మాటలకు పడిపోతాడు. అలాంటి కట్టిపడేసే నైజం కేసీఆర్ మాటకు ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్. ఆ స్థాయి ఇమేజ్ తెచ్చుకున్న కేసీఆర్ నిజంగా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్. కాగా ఈరోజు కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేసీఆర్ గారికి మా తెలుగుఒన్.కామ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు.
ప్రశాంత్‌ కిశోర్ అలియాస్ పీకే. ఎన్నికల వ్యూహకర్తగా దేశంలో పాపులరైన పర్సన్. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యూహకర్తగా పనిచేసి ఆనాటి కమల విజయంలో కీలక పాత్ర పోషించడంతో మొదలైన పీకే ప్రస్థానం అప్రతిహాతంగా కొనసాగుతోంది. ఆ తర్వాత కాంగ్రెస్ తో కలిసి పనిచేసి పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో హస్తం పార్టీ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. అలాగే, బీహార్లో జేడీయూ... ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ... ఢిల్లీలో ఆప్ కోసం పనిచేసి ఆ పార్టీల ఘన విజయానికి కారణమయ్యాడు. అయితే, జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ తో వచ్చిన విభేదాలతో ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ప్రశాంత్ కిశోర్.... మోడీ అండ్ నితీష్ లక్ష్యంగా కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న చర్చ ఢిల్లీ వీధుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.  ముఖ్యంగా, తన సొంత రాష్ట్రంలో బీహార్ రాజకీయాల్లో కీ రోల్ పోషించేందుకు సిద్దమవుతున్నారన్న చర్చ జరుగుతోంది. జేడీయూ నుంచి బహిష్కృతుడైన పీకే, అటు జేడీయూ, ఇటు బీజేపీ మీద కసితో రగిలిపోతున్నారు. బీహార్‌లో ప్రాంతీయ పార్టీ పెట్టి, అదే వేదికగా, దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకంచేసి, మోడీ అండ్ అమిత్‌ షాలకు చెక్‌ పెట్టాలనుకుంటున్నారని, అందులో భాగంగా ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీల కూటమి ప్రకటించబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే, ఇప్పుడు అత్యంత ఆసక్తి కలిగిస్తోంది.  అయితే, జగన్‌కు పీకే అత్యంత క్లోజ్. దాంతో, ప్రాంతీయ పార్టీల కూటమిలో చేరాల్సిందిగా జగన్‌ను కోరే అవకాశముంది. ఆమ్‌ ఆద్మీ ఎలాగూ ఓకే చెప్పొచ్చు. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతోనూ పీకేకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇక, తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్‌తోనూ ప్రశాంత్ పని చేయబోతున్నారు. ఇలా బలమైన ప్రాంతీయ పార్టీలన్నింటితోనూ ప్రశాంత్‌ కిశోర్‌కు మంచి సంబంధాలున్నాయి. దాంతో, ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో మోడీ అండ్ షాకి తడాఖా చూపాలని స్కెచ్ వేస్తున్నారట పీకే. ఇందులో భాగంగానే తనకు అత్యంత సన్నిహితునిగా భావించే జగన్‌ను సైతం, ప్రాంతీయ కూటమిలో చేరాలని కోరాడని, అదే ఇప్పుడు కమలంలో అలజడి కారణమైందని అంటున్నారు. ప్రశాంత్ కిశోర్‌ ఫ‌్రంట్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ చేరొద్దని జగన్‌ పై బీజేపీ అధిష్టానం ఒత్తిడి తెస్తోందని అంటన్నారు. ఇప్పడున్నట్టే ఏ కూటమిలోనూ చేరకుండా, తటస్థంగా ఉండాలని సూచించిందట. అందుకే జగన్‌ను ఢిల్లీ పిలిపించుకుని మాట్లాడుతోందని అంటున్నారు. అటు కేసీఆర్‌ను సైతం పీకే ప్రతిపాదిత ఫ్రంట్‌లో చేరొద్దని సూచించబోతోందట. బీజేపీ బుజ్జగింపులకు జగన్‌ సైతం ఓకే చెప్పారని అంటున్నారు. అంతేకాదు, ఎన్డీఏ నుంచి శివసేన బయటికి వెళ్లిపోయినందున, మరో బలమైన మిత్రపక్షం కోసం చూస్తున్న బీజేపీ, కేంద్ర ప్రభుత్వంలో చేరాలని వైసీపీని ఒత్తిడి చేస్తున్నారట. విజయసాయిరెడ్డితోపాటు మరో కీలక వ్యక్తికి కేంద్రమంత్రి పదవులు ఇస్తామమని ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. మొత్తంగా వీటన్నింటిపైనా చర్చించేందుకే, జగన్ ఒక్కరోజు గ్యాప్ లో రెండుసార్లు ఢిల్లీ వెళ్లారని అంటున్నారు.
ముఖ్యమంత్రిగా తొలిసారి పరిమిత మీడియాతో జగన్ మాటా మంతి.. సీఎం స్థానం అంటే.. ఈరాష్ట్రానికి తండ్రిలాంటి స్థానం: జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడనుంచి పనిచేయాలన్నది ముఖ్యమంత్రి ఇష్టం.                                          ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే పాలనా యంత్రాంగం అక్కడ ఉంటుంది: సి.ఎం. జగన్ మోహన్ రెడ్డి మనముందున్న లక్ష్యం విశాఖను  టైర్‌–1 స్థాయికి అభివృద్దిచేయడమే: జగన్ మోహన్ రెడ్డి .మొత్తానికి సి ఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పరిమిత మీడియా తో అయినా, అపరిమితమైన అంశాలను షేర్ చేసుకున్నారు. పెన్షన్ల దగ్గర నుంచి పోలవరం దాకా, ఇంగ్లిష్ మీడియం నుంచి రాజధాని నిర్మాణం దాకా....అనేకానేక విషయాలను స్పృశించిన జగన్ మోహన్ రెడ్డి , తన మనసులో మాటలను, ఆలోచనలను ప్రజలతో పంచుకున్నారు. పెన్షన్లగురించి మాట్లాడుతూ.. ఒకరికి  ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే ... అన్యాయం జరిగిందనే భావన వారికి ఉంటుందాని చెప్పుకొచ్చారు. ప్రజల ముందే లబ్ధిదారుల జాబితా పెడుతున్నామనీ, సామాజిక తనిఖీకోసం గ్రామ ప్రజలముందే, గ్రామ సచివాలయంలో పెడుతున్నామనీ, ఎవరుకూడా తప్పులు చేసే అవకాశం లేకుండా చేస్తున్నామనీ చెప్పుకొచ్చారు సి.ఎం. ప్రతి పథకంకూడా సంతృప్తస్థాయిలో, పారదర్శకంగా అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చిన సి.ఎం, పెన్షన్‌ ఇంతకుముందు కావాలంటే మూడు నెలల పెన్షన్‌ డబ్బు లంచంగా ఇవ్వాల్సి వచ్చేదన్న విషయాన్ని గుర్తు చేశారు. పధకాల గురించి మాట్లాడుతూ, మేం ఏంచెప్పామో అదే చేస్తున్నామన్నారాయన. మేం ప్రతి పథకాన్నీ పెడుతున్నామంటే.. మేం చెప్తున్నదాన్ని అమలుచేస్తున్నామని కదా? ప్రతి ఏటా రెవిన్యూ ఎంతోకొంత పెరుగుతుంది. నంబర్లలో కాస్త అటూ ఇటూ ఉండొచ్చుకాని, పెరుగుదలైతే ఉంటుందని కూడాభరోసాఇచ్చారు... ఇంగ్లిషు మీడియంపైన మాట్లాడుతూ, "న్యూట్రల్‌ మనిషిని ఎవరైనా అడగండి...కచ్చితంగా మా విధానాలను బలపరుస్తారు, మద్దతిస్తారు. ఇవాళ ఇంగ్లిషు మీడియం పెడితేనే... 20ఏళ్లలో మార్పులు వస్తాయి.ఇవాళ ఫస్ట్‌క్లాస్‌ చదవే వ్యక్తి.. 20 ఏళ్ల తర్వాత డిగ్రీ పూర్తిచేస్తారు. ఇవాళ ఫోన్‌ఆన్‌  చేస్తే..కమ్యూనికేషన్‌ అంతా ఇంగ్లిషే. కంప్యూటర్లు.. ఇంటర్నెట్‌అంతా ఇంగ్లిష్‌లోనే. డ్రైవర్‌లెస్‌కార్లు వస్తున్నాయన్నది రియాల్టీ. ఇవాళ మనం మార్పు చేసుకుంటేనే.. భవిష్యత్‌తరాలకు మంచి జరుగుతుంది. సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి," అని హితవు కూడా చెప్పారు.  అన్ని ప్రభుత్వ స్కూళ్లలోని విద్యాకమిటీలు పూర్తిగా ఇంగ్లిషు మీడియం పెట్టాలని వారంతా తీర్మానాలు చేసి పంపారని, ఎవర్ని అడిగినా ఇంగ్లిషుమీడియం కావాలనే చెప్తారని కూడా సి.ఎం. చెప్పుకొచ్చారు. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై  మాట్లాడుతూ... "రాజధానిపై నేను చెప్పాల్సింది అంతా అసెంబ్లీలోనే చెప్పాను. రాజధానిని ఎంచుకున్న ప్రాంతాన్ని చూడండి. అటు విజయవాడా కాదు, ఇటు గుంటూరూ కాదు... రాజధాని ప్రాంతం ఎక్కడ వస్తుందీ ముందే తనవారికి, తన అనుచరులకీ చెప్పి.. వేలాది ఎకరాలు కొనుగోలుచేయడం, క్యాబినెట్‌ సబ్‌కమిటీ ప్రాథమిక పరిశీలనలోనే 4వేలకుపైగా ఎకరాలు బటయపడ్డం.. అదంతా వేరే కథ.మరికొన్ని కీలక అంశాలను చూస్తే.. రాజధాని ప్రాంతానికి వెళ్లాలంటే ఇవ్వాళ్టికీ మనం సింగిల్‌ రోడ్డుమీదే వెళ్లాలి. కరకట్టమీదున్న సింగిల్‌ రోడ్డుమీదనుంచే పోవాలి. నేనేమీ అబద్ధాలు చెప్పడంలేదు. మీడియా ప్రతినిధులుగా మీరుకూడా అదే దారివెంబడి వెళ్లాలి. సమీకరించిన భూమిని డెవలప్‌ చేయడానికి, కరెంటు, రోడ్లు, పైపులైన్‌తో నీరు ఇవ్వడానికి ఎకరాకు కనీసం రూ.2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని గత ప్రభుత్వం వాళ్లే చెప్పారు. రూ. 1,09,000 కోట్ల అంచనా వేశారు. కాని అదే ప్రభుత్వం ఐదేళ్లకాలంలో రూ.5600 కోట్లకు మించి ఖర్చు చేయలేదు. మరో రూ.2–3 వేల కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించమని మాకు అప్పగించి వెళ్లిపోయారు. ఇందులోనూ రూ.500 కోట్ల రూపాయలు వడ్డీలుగా చెల్లించాల్సిన పరిస్థితి," అని గణాంకాలతో సహా వివరించారు జగన్ మోహన్ రెడ్డి. . ప్రతి ఏటా రూ.6 నుంచి 7 వేల కోట్లరూపాయలు రాజధాని మీద పెడితే.. అది సముద్రంలో వేసిన నీటిబొట్టే అవుతుంది. పరిస్థితిలో ఏ మాత్రం మార్పు ఉండదు. ఇక్కడి రాజధాని ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కోసం వేసిన అంచనాలో 10శాతం డబ్బును విశాఖపట్నంలో పెడితే కచ్చితంగా మార్పు వస్తుంది. ఇవాళ కాకపోయినా 10 ఏళ్లకైనా మనం హైదరాబాద్‌తోగాని, చెన్నైతోగాని, బెంగుళూరుతోగాని పోటీపడే పరిస్థితి వస్తుంది. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం ఉంటుంది. అయినా సరే.. ఇక్కడ ప్రజలను దృష్టిలో పెట్టుకుని లెజిస్లేచర్‌ క్యాపిటల్‌గా కొనసాగిస్తామని చెప్పాం. మహారాష్ట్రలోని నాగపూర్, కర్ణాటకలోని బెల్గాంల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడనుంచి పనిచేయాలన్నది ముఖ్యమంత్రి ఇష్టం.ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే పాలనా యంత్రాంగం అక్కడ ఉంటుంది. సీఎం అక్కడనుంచి పనిచేయాలి? ఇక్కడ నుంచి పనిచేయాలి? అని ఎవ్వరూ చుప్పలేరు. మంత్రివర్గానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తారు, మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంటుంది, ఆ నిర్ణయాలను పాలనాయంత్రాంగం అమలు చేస్తుంది. విశాఖలో నీటికి కొరత ఉందనేది వాస్తవం కాదు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరీ.. పోలవరం నుంచి మరింత నీటిని అందించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టామని ముఖ్యమంత్రి చెప్పారు. తుపాన్ల సమస్య రాష్ట్రంలోని 9 కోస్తా జిల్లాలకూ ఉందని చెప్పిన సి.ఎం., ఇదే కృష్ణాజిల్లాలోని దివిసీమలో ఉప్పెన వచ్చిన ఘటనలూ ఉన్నాయన్నారు. విజయవాడకు కేవలం 60 కి.మీ దూరంలో సముద్రం కూడా ఉంది. అలాగే కరవు పీడిత ప్రాంతాలూ ఉన్నాయి. వీటన్నింటికీ మించి మనం చూడాల్సిన అంశం మరొకటి ఉంది. విశాఖపట్నం అనేది రాష్ట్రంలో నంబర్‌ ఒన్‌ సిటీ. దేశవ్యాప్తంగా టైర్‌ –2 సిటీల్లో అగ్ర స్థానంలో ఉంది. ఇప్పుడు మనముందున్న లక్ష్యం దీన్ని టైర్‌–1 స్థాయికి అభివృద్దిచేయడమే. సీఎం స్థానం అంటే.. ఈరాష్ట్రానికి తండ్రిలాంటి స్థానం. దేవుడు మనకు ఈస్థానం ఇచ్చినప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక తండ్రిలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తీసుకోవాల్సిన సమయంలో నిర్ణయాలు తీసుకోకపోతే అదికూడా తప్పే అవుతుంది. దానికి ఎంతో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.మనం విశాఖపట్నం వెళ్లకూడదు, ఇక్కడా అభివృద్ధికాదు. దీనివల్ల నష్టం మన పిల్లలకే. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణకు బిల్లులు పెట్టాల్సిన అవసరంలేదు. సీఆర్డీఏను ఏఎంఆర్‌డీఏగా మార్పుడానికే బిల్లు పెడితే సరిపోతుంది. కాని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ ఒక సంకేతం ఇవ్వడానికే ఈ బిల్లులు పెట్టం.ఇక్కడ వారికీ న్యాయం చేస్తున్నాం, దీంతోపాటు మిగిలిన ప్రాంతాలకూ న్యాయం చేస్తున్నామని, అందరికీ మంచి చేస్తున్నామని చెప్పడానికే బిల్లులు పెట్టాం. ఒక్క ఏఎంఆర్‌డీఏ చట్టంకోసమే బిల్లు పెడితే ప్రస్తతు రాజధాని ప్రాంతం వారికి తప్పుడు సంకేతం పోతుందని చెప్పాం. ఈ బిల్లులను ఎవ్వరూ ఆపలేరు. 3 నెలలు ఆలస్యం చేయగలరు తప్ప.. ఎవ్వరూ అడ్డుకోలేరు. స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెట్టే బిల్లునుకూడా ఇలాగే మండలిలో అడ్డుకున్నారు. ఆగిపోయిందా? అలాగే ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు బిల్లును కూడా అడ్డుకున్నారు.. ఆగిపోయిందా?, అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కాని, ప్రజలకు మంచిచేసే బిల్లులను ఆమాత్రం ఆలస్యం కూడా ఎందుకు చేయాలి? ప్రజలకు మంచి చేయాలని లేనప్పుడు మండలి ఎందుకు?ప్రజలకు మంచి చేసే బిల్లులను ఆలస్యం చేయాలన్నదేవారి ఉద్దేశం అయినప్పుడు, నిబంధనలను కూడా ఉల్లంఘించి వాళ్లు బిల్లులను ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకున్నప్పుడు మండలి అవసరం ఎందుకు? కేవలం మండలిలో ఒక పార్టీకి మెజార్టీ సభ్యులు ఉన్నారని రాజకీయపరమైన ఆలోచనలు చేశారు.  అసలు మండలిని అసెంబ్లీ సృష్టిస్తుంది, అసెంబ్లీకి సహాయపడుతుంది. మండలి అనేది అసెంబ్లీకి సలహా ఇచ్చే ఒక సభ. ఈ పనిని విడిచిపెట్టి రాజకీయంగా ఆలోచించి ప్రజలు ఇచ్చిన తీర్పును పరిహాసం చేస్తామంటే.. ఎలా? ఒక్క మండలి నిర్వహణ కోసం ఏడాదికి రూ.60 కోట్లు ఖర్చుచేస్తున్నాం. ఏడాదిపోతే..., శాసనమండలిలో మాక్కూడా మెజార్టీ వస్తుంది. కాని, ఈ ఏడాది సమయాన్నికూడా ఎందుకు వదులుకోవాలి? ప్రజలకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రభుత్వ నిర్ణయాల వల్ల వచ్చే మంచిచేరాలి. ఇంగ్లిషు మీడియం బిల్లును ఆమోదిస్తే ఎవరికి లాభం?ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఉంటే ఎవ్వరికి లాభం? రాజధానికార్యకలాపాలు, అభివృద్ధి వికేంద్రీకరణ వల్ల ఎవ్వరికి లాభం? విశాఖను అభివృద్ధి చేస్తే ఎవ్వరికి లాభం? ఇవన్నీ కూడా మన పిల్లలకి లాభం కదా? మన ప్రజలకు లాభం కాదా? అన్నది ఆలోచించాలి. అమరావతి రైతుల నుద్దేశించి ప్రశ్నలపై మాట్లాడుతూ, అమరావతి రైతులకు ఏం చేయదలుచుకున్నామో అసెంబ్లీలోనే చెప్పాం. ఎవ్వరికీ అన్యాయం చేయం. రైతులికిచ్చే యాన్యునిటీని పదేళ్ల నుంచి పదిహేనేళ్లకు పెంచాం. అలాగే భూమిలేని వ్యవసాయ కూలీలకు ఇచ్చే జీవనభృతిని రూ.2500 నుంచి రూ.5వేలకు పెంచాం. అసైన్డ్‌దారులకు పట్టాదారులతో సమానంగా ప్లాట్ల కేటాయింపులు చేస్తాం. మేం గత ప్రభుత్వం మాదిరిగా బాహుబలి సినిమా గ్రాఫిక్స్‌ చూపించడంలేదు.  వాస్తవాలను ముందు పెడుతున్నాం. అమరావతి లెజిస్లేచర్‌ కేపిటల్‌గా కొనసాగుతుందని చెప్పామన్నారు ముఖ్యమంత్ర బీజేపీ మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ, 2019లో బీజేపీ మేనిఫెస్టో ఏంచెప్పిందో ఒక్కసారి చూడండి.రాజధాని భూముల్లో అవినీతి జరిగింది... వెనక్కి ఇచ్చేస్తామని చెప్పారు. కాని రాష్ట్రంలోని బీజేపీ నాయకులు దీనికి భిన్నంగా మాట్లాడుతున్నారు. అదే పార్టీకి చెందిన జాతీయ స్థాయి ప్రతినిధులు ఉన్న విషయాలు చెప్తున్నారన్నారు సి.ఎం. ప్రత్యేక హాదా గురించి మాట్లాడిన సి.ఎం., ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయం కాదన్నారు.  ముగిసిపోయిన అధ్యాయం అనే పదం వాడ్డం సరికాదు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలన్న మా ప్రయత్నాలు ఎప్పటికీ కొనసాగుతాయి. ప్రతిసారి మేం కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నాం. ప్రధానమంత్రి గారిని అభ్యర్థిస్తున్నాం. ఎప్పుడో ఒకసారి మా అవసరం వస్తుందనే ఆశాభావంతో ఉన్నాం.  కేంద్రానికి అవసరమైన రోజున మన ఎంపీల పాత్ర కీలకం అవుతుంది. ఆ సమయంలో మనకున్న డిమాండ్‌ ప్రత్యేక హోదా మాత్రమే. కియా.. వ్యవహారంపై మాట్లాడుతూ, కియా తరలిపోతుందంటూ తప్పుడు వార్త ఇచ్చారు. అనైతికమైన రిపోర్టింగ్‌ చేశారు. వాస్తవాలను నిర్ధారించుకోకుండా వార్తా కథనం ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా ఇచ్చిన కథనం ఇది. తాము ఎక్కడికీ వెళ్లడంలేదంటూ కియా వరుసగా ఖండనలు ఇస్తున్నా... వాళ్లు వాస్తవాలు పట్టించుకోవడంలేదు. రాజకీయాలకోసం వ్యవస్థలను మేనేజ్‌చేసి ఏ స్థాయికైనా దిగజారే పరిస్థితి చూస్తున్నాం. నామీద బురదజల్లడం, నిందలు వేయడం ఇప్పడు మొదలుపెట్టింది కాదు. ఇవన్నీ నాకు అలవాటే. నిజాలతో పనిలేకుండా ఒక మనిషికి చెడ్డపేరును ఆపాదించాలని ప్రయత్నాలు నిరంతరం చేస్తూనే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు కచ్చితంగా మాకు తోడుగా ఉంటాడు.  గతంలో మా పార్టీలో 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను  కొనుగోలుచేశారు. ఎన్నికల తర్వాత వారికి వచ్చిన సీట్లు 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే. దేవుడు రాసిన గొప్ప స్క్రిప్టు ఇది. వాళ్లు చేసే కొద్దీ దేవుడు అయ్యో పాపం అంటూ.. మన పక్కనే ఉంటాడు. 2014 నుంచి రాష్ట్రంలో పరిశ్రమలకు రాయితీల రూపంలో చెల్లించాల్సిన రూ.4వేల కోట్ల రూపాయలను గత ప్రభుత్వం చెల్లించలేదు.  ఈ రాయితీలు ఇవ్వకుండా చంద్రబాబు దావోస్‌ వెళ్లాడు, మార్కెటింగ్‌కోసం కోట్లు ఖర్చుచేశాడు. రాష్ట్రంలో నడుస్తున్న పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకుండా మనం అదిచేస్తాం, ఇది చేస్తాం అని ప్రకటనలు చేసీ ఏం లాభం. మా  ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాలుగు వేల కోట్ల రూపాయలను చెల్లిస్తున్నాం. పరిశ్రమలకు కావాల్సింది ప్రధానంగా సరసమైన ధరలకు భూములు, నీళ్లు, కరెంటు. అవినీతిలేని పాలన, సానుకూల దృక్పథం ఉన్న ప్రభుత్వం, విధానాల్లో పారదర్శకత. ఇవన్నీ ఉన్న ప్రభుత్వం మాది. పైగా అబద్ధాలు చెప్పే అలవాటు మా ప్రభుత్వానికి లేదు. పరిశ్రమలకు ఇవన్నీ సానుకూల అంశాలు. మిగిలినవన్నీ సహజంగానే వస్తాయి.  విషయాలన్నింటికీ ఎప్పటికప్పుడు మేం చెప్తూనే ఉన్నాం. కాకపోతే మాకు మీడియా బలం తక్కువన్నారు సి.ఎం. . సీఎంగా అతి పెద్ద సవాల్‌ ఏమి ఉంటుందన్న ప్రశ్నకు,ప్రతిరోజూ సవాలే. మంచి సమర్థతతో ఆ సవాలను అధిగమించాలి. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నీటిపారుదల, హౌసింగ్‌... వీటిని ప్రాధాన్యతలుగా పెట్టుకున్నాం. అసలు అభివృద్ధి అంటే ఏమిటి? నాడు– నేడు కార్యక్రమం ద్వారా స్కూళ్లను బాగా అభివృద్దిచేస్తున్నాం? ఇది అభివృద్దికాదా? ఇంగ్లిషు ల్యాబ్‌ సహా 9 రకాల సదుపాయాలను ప్రతిస్కూళ్లలో కల్పిస్తున్నాం. ప్రతి స్కూళ్లో ఇంగ్లిషు మీడియం పెడుతున్నాం.మధ్యాహ్న భోజనంలో నాణ్యత బాగా పెంచాం.  గ్రీన్‌ఛానళ్లో పెట్టి బిల్లులు పెండింగులో లేకుండా చూస్తున్నాం.ఆయాల జీతాలు రూ.వేయి నుంచి రూ.3వేలకు పెంచాం. అమ్మ ఒడి అమలు చేశాం.ఫీజు రియంబర్స్‌మంట్‌ పూర్తిగా ఇస్తున్నాం. పాఠ్యప్రణాళికలో పూర్తిగా మార్పులు తీసుకు వస్తున్నాం. డిగ్రీ విద్యార్థులకు ఏడాదిపాటు అదనంగా అప్రెంటిస్‌ ఇప్పిస్తున్నాం.ఇది అభివృద్ది కాదా, అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ పోలవరం మీద ఎంతో «ధ్యాసపెడుతున్నామని చెప్పిన ముఖ్యమంత్రి, గత ప్రభుత్వం ప్రాజెక్టును మిస్‌ హ్యాండిల్‌ చేసిందని, త ప్రభుత్వానికి ప్రాజెక్టు నిర్మాణలో విజన్‌ లోపించిందని చెప్పారు. "స్పిల్‌వే పూర్తికాకుండానే కాపర్‌ డ్యాం నిర్మాణం చేపట్టింది. దీనివల్ల వరదనీరు అటు స్పిల్‌వేగుండా పోవడంవల్ల పనులు చేయలేని పరిస్థితి. నవంబర్‌ వరకూ పనులు నిలిపేయాల్సి వచ్చింది. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి. 2021 జూన్‌ నాటికి పనులు పూర్తవుతాయి," అని వివరించారు.  
కొత్త ఉద్యోగాలేమో గానీ, ఉన్న ఉద్యోగాలను ఊడబీకే విధంగా జగన్ ప్రభుత్వ విధానాలు కనిపిస్తున్నాయి. అసలే ఏపీకి కొత్త కంపెనీలు రావడానికి భయపడుతున్నాయని ప్రచారం జరుగుతుంటే... ప్రభుత్వ నిర్ణయాలతో ఉన్న కంపెనీలూ వెళ్లేపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే, కియా మోటర్స్ ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోనుందంటూ ప్రముఖ వార్తాసంస్థ రాయిటర్స్ ప్రచురించిన కథనం ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపుతుండగా... ఇఫ్పుడు మరో వార్త సంచలనం రేపుతోంది. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన జగన్ ప్రభుత్వం... సెక్రటేరియట్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల కోసం మిలీనియం టవర్స్ ను ఎంపిక చేసుకుంది. దాంతో, మిలీనియం టవర్స్ లో ఆపరేషన్స్ నిర్వహిస్తున్న ఐటీ కంపెనీలను ఖాళీ చేయాలంటూ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. మార్చి 30లోపు మిలీనియం టవర్స్ ను ఖాళీ చేయాలంటూ ఆ నోటీసుల్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే, 5వేల మందికి ఉద్యోగాల కల్పన కోసం 300 కోట్ల రూపాయల పెట్టుబడితో విశాఖ మిలీనియం టవర్స్ లో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న కాండ్యుయేట్ కంపెనీ.... ప్రభుత్వ నోటీసులతో తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో మొత్తం ఆపరేషన్సే షట్ డౌన్ చేయాలని కాండ్యుయేట్ కంపెనీ బోర్డు డెసిషన్ తీసుకుందని అంటున్నారు. తమ కార్యకలాపాల కోసం కొత్త ప్రదేశాలను అన్వేషిస్తున్న కాండ్యుయేట్ కంపెనీ.... హైదరాబాద్ లేదా కొచ్చిలో కార్యాలయం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మిలీనియం టవర్స్ లో పనిచేస్తున్న 2400మందిని హైదరాబాద్ లేదా కొచ్చి తరలించాలని నిర్ణయం తీసుకుందని అంటున్నారు.  ఇక, మిలీనియం టవర్స్ లోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్ సీఎల్, ఎల్ అండ్ టీ కూడా మార్చి 30 తర్వాత ఆ బిల్డింగ్ ను ఖాళీ చేయనున్నాయి. దాంతో, మిలీనియం టవర్స్ నుంచి దాదాపు 18వేల మంది ఉద్యోగులు తరలిపోనున్నారని చెబుతున్నారు. అయితే, టీడీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఈ కంపెనీల కోసం ఆనాడు తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చింది. ఫార్చ్యూన్‌-500 కంపెనీల్లో ఒకటైన కాండ్యుయెంట్‌ సంస్థను విశాఖ తీసుకురావటానికి చంద్రబాబు ప్రభుత్వం ఎంతో కష్టపడింది. కానీ, ఇఫ్పుడు సచివాలయం పేరుతో భవనాన్నే ఖాళీ చేయమంటూ జగన్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంతో.... మొత్తం ఏపీనే వదిలివెళ్లిపోవాలని ఆయా ఐటీ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే, ఎంతోకష్టపడి తీసుకొచ్చిన ఐటీ కంపెనీలను ఇలా తరిమేయడం రాష్ట్రానికి మంచిది కాదని విపక్షాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి.  
సమ్మక్క సారాలమ్మ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆదివాసీలకు కాకతీయ రాజులకు మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలోనే ఈ గాథలన్నీ ప్రాచుర్యంలోకి వచ్చాయి. కొన్ని కథల్లో సమ్మక్క మరణించినట్లు ఉంటే... మరికొన్ని కథల్లో నెత్తురోడుతూ చిలుకల గుట్టవైపు వెళ్లిపోయిందని చెబుతున్నాయి. ఇంకొన్ని గాథల్లో సమ్మక్క సహగమనం చేసినట్లు ఉంటుంది. కొన్ని కథల్లో ఆదివాసీలకు... కాకతీయ ప్రభువులకు మధ్య ఘర్షణ జరిగి... కప్పం కట్టకపోవడం కారణంగా చెప్పగా... మరికొన్ని కథల్లో సహజ వనరుల పంపకాల్లో వివాదం వచ్చినట్లు ఉంది. అయితే, ఆదివాసీల నుంచి కాకతీయ రాజులు కప్పం వసూలు చేసిన దాఖలాల్లేవని చరిత్రకారులు చెబుతున్నప్పటికీ... ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న కథలు మాత్రం కప్పమే యుద్ధానికి కారణమని చెబుతున్నాయి. అయితే, అందరి నోళ్లలో ప్రసిద్ధి చెందిన కథ ఇలా ఉంది. ఏడో శతాబ్దంలో తమ నివాస స్థలమైన మేడారం నుంచి కోయ దొరలు వేట కోసం అడవికి వెళ్లగా, ఓ చోట పెద్ద పులులు కాపలా మధ్య దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఓ పసిపాప కనిపించిందని, ఆ పాపను కోయదొరలు తమ గూడేనికి తీసుకెళ్లి పెంచి పెద్దచేశారని, అయితే... ఆ పసిపాప వచ్చినప్పట్నుంచి అన్నీ శుభాలే జరగడంతో కొండ దేవతే తమకు పాప రూపంలో సాక్షాత్కరించిందని నమ్మి ఆ చిన్నారికి సమ్మక్కగా పేరు పెట్టారని చెబుతారు. అలా, పెరిగి పెద్దయిన సమ్మక్కను కోయ చక్రవర్తి అయిన మేడరాజు... కరీంనగర్ ప్రాంతాన్ని ఏలుతున్న తన మేనల్లుడైన పగిడిద్ద రాజుకిచ్చి పెళ్లి జరిపించాడని చెబుతారు. పగిడిద్ద రాజు, సమ్మక్కకు సారాలమ్మ, నాగులమ్మతోపాటు జంపన్న జన్మించారు. అయితే, మేడారం ప్రాంతాన్ని పాలించే కోయరోజులు... ఓరుగల్లు రాజులకు సామంతులుగా ఉండేవారు. కరువు కాటకాలతో ఒక సంవత్సరం కోయరాజుల... కాకతీయ ప్రభువులకు కప్పం చెల్లించలేకపోయారు. దాంతో, కాకరాజు రాజు ప్రతాపరుద్రుడు తన సైన్యాన్ని గిరిజనులపైకి యుద్ధానికి పంపాడు. అయితే, కాకతీయ సేనల ముందు గిరిజనులు నిలువలేకపోయారు. ఈ యుద్ధంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజుతోపాటు వారి కుమార్తెలు సారాలమ్మ, నాగులమ్మ, అల్లుడు గోవిందరాజు వీరణమరణం పొందుతారు. ఈ పరాజయాన్ని తట్టుకోలేక జంపన్న... మేడారం సమీపంలోని వాగులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతారు. అయితే, సంపెంగ వాగు సమీపంలో జంపన్నను కాకతీయ సేనలు హతమార్చాయని మరో కథ ప్రచారంలో ఉంది. జంపన్న వీరమరణం పొందిన వాగు కావడంతో దాన్ని అప్పట్నుంచీ జంపన్న వాగుగా పిలుస్తారు. అయితే, భర్త పిల్లల మరణవార్త తెలుసుకున్న సమ్మక్క మహోద్రురాలిగా మారి కాకతీయ సేనలపై విరుచుకుపడిందని, కానీ... ఓ సైనికుడు దొంగచాటుగా బల్లెంతో పొడవడంతో తీవ్రంగా గాయపడిన సమ్మక్క నెత్తురోడుతూనే ఈశాన్య వైపునున్న చిలుకలగుట్టపైకి వెళ్లి అదృశ్యమైందని చెబుతారు. సమ్మక్కను కొందరు కోయలు అనుసరించినప్పటికీ జాడ తెలియలేదని, అయితే చిలుకలగుట్టపైనున్న నాగవృక్షం కింద ఒక కుంకుమ భరిణె కనిపించడంతో, సమ్మక్కే అలా మారిందనే నమ్మకంతో అప్పట్నుంచి మాఘశుద్ధ పౌర్ణమి రోజు ముత్తయిదువల పండగ జరుపుకోవడం మొదలుపెట్టారని, ఇదే కాలక్రమేణా జాతరగా రూపొంతరం చెంది, సమ్మక్క సారాలమ్మ మేడారం మహా జాతరగా మారింది. అయితే, కోయవీరులు మరణించారంటే ఆదివాసీలు అంగీకరించరు. వాళ్లింకా బతికే ఉన్నారని... సమ్మక్క భరిణె రూపంలో రెండేళ్లకోసారి సాక్షాత్కరిస్తుందనేది వాళ్ల విశ్వాసం. అందుకే, ప్రతి రెండు సంవత్సరాలకోసారి ఈ మేడారం నిర్వహిస్తున్నామని చెబుతారు. అలా, ఆదివాసీల్లో వీరవనితగా పేరుగాంచిన సమ్మక్క... కుంకుమభరిణె రూపంలో వెలిసి... భక్తులకు కొంగుబంగారంగా విరాజిల్లుతోందని పురాణగాథలు చెబుతున్నాయి.
2020-21 కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటు ముందుకు రానుంది. ప్రపంచ దేశాలను మాంద్యం చుట్టుముడుతున్న వేళ దేశం పై ఆర్థిక మందగమన ప్రభావం పడకుండా ఆర్థిక మంత్రి ఎటువంటి చర్యలు తీసుకుంటారోనని సామన్యులతో పాటు వివిధ రంగాల నిపుణులు ఎదురు చూస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం తగ్గుతున్న పొదుపుతో దిగాలుగా ఉన్న సగటు వేతన జీవి ఈసారైన ఆదాయపు పన్ను పై ఆర్థిక మంత్రి తీపికబురు అందిస్తారని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ఆరేళ్లలో ఆదాయపు పన్నుకు సంబంధించి మోదీ సర్కారు తీసుకున్న చర్యలు ఈ సారి ఎలాంటి మార్పులు చేసే అవకాశాలున్నాయో చూడాలి.  2014 బడ్జెట్ లో నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆదాయపు పన్ను మినహాయింపు పరిధిని రెండు లక్షల నుంచి రెండున్నర లక్షలకు పెంచారు. సీనియర్ సిటిజన్ లకు మినహాయింపు 2.5 లక్షల నుంచి మూడు లక్షలకు మార్చారు. 2015 బడ్జెట్ లో పన్ను శ్లాబుల జోలికి వెళ్లకుండా ఆరోగ్య భీమపై డిటెక్షన్ ను రూ.15,000 నుంచి రూ.25,000 రూపాయలకు పెంచారు. సీనియర్ సిటిజన్లకు రూ.20,000 నుంచి రూ.30,000 లుగా మార్చారు. సంపద పన్ను తొలగించి సంపన్నుల పన్ను ఆదాయం కోటి దాటితే రెండు శాతం సర్ చార్జ్ విధించేలా నిబంధనలు పెట్టారు. 2016 బడ్జెట్ లో సెక్షన్ 87 కింద ఐదు లక్షల ఆదాయం మించని వారికి పన్ను రిబేట్ ను రూ.2000 నుంచి రూ.5000 లకు పెంచారు. సెక్షన్ 80 జీజీ కింద అద్దెకు సంబంధించిన డిడక్షన్ ను రూ.24,000 నుంచి రూ.60,000 లకు పెంచారు. కోటి వార్షికాదాయం దాటిన వారిపై మరోసారి సర్ చార్జిని 12 నుంచి 15 శాతానికి పెంచారు. 2017 బడ్జెట్ లో 2.5 లక్షల నుంచి ఐదు లక్షల ఆదాయం ఉన్న వారికి పన్నును ఐదు శాతం చేశారు. వార్షికాదాయం 3.5 లక్షలు ఉన్న వారికి పన్ను రిబేట్ ను రూ.5000 నుంచి రూ.2,500 చేశారు. 50 లక్షల నుంచి కోటి ఆదాయం పై 10 శాతం సర్ చార్జిని వేధించడం మొదలు పెట్టారు. 2018 లో మెడికల్ రీయంబర్స్ మెంట్ ట్రాన్స్ పోర్టు అలవెన్సుల స్టాండర్డ్ డిడక్షన్ పరిధిని రూ.40,000 పెంచారు. ఆదాయపు పన్ను కార్పొరేట్ పన్ను పై ఉన్న మూడు శాతం విద్యాసెస్సు స్థానంలో 4 శాతం విద్య, ఆరోగ్య సెస్ విధించారు. 2019 లో పీయూష్ గోయల్ ప్రవేశపెట్టినా తాత్కాలిక బడ్జెట్ లో ఐదు లక్షల వరకు ఆదాయానికి పన్ను రిబేట్ ప్రకటించారు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.40,000 నుంచి రూ.50,000 లకు పెంచారు. మోదీ ప్రభుత్వం రెండోసారి బాధ్యతలు చేపట్టాక ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఆదాయపు పన్నుకు సంబంధించి ఎటువంటి ప్రకటనలు వెలువడలేదు.ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రభుత్వం కొత్త పన్ను శ్లాబులను తీసుకొచ్చి అంచనాలున్నాయి. చాలా ఏళ్లుగా వ్యక్తిగత పన్ను శ్లాబులలో సవరణలు పరిమితుల పెంపు లేదు. రిబేట్ల లాంటి ప్రత్యామ్నాయాలు కాకుండా 5,10,20,30,35 శాతం శ్లాబులు తేవాల్సిన అవసరం ఉంది. ఆదాయాన్ని అయిదు శ్లాబులుగా విభజిస్తే ఎంతో మందికి ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం రూ.2,50,000 ఉన్న ఆదాయ పరిమితిని ఐదు లక్షలకు పెంచితే ఎంతో మందికి పన్ను భారం తగ్గుతుంది
మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చినప్పటి నుండి కమిటీలు , నివేదికలతోనే కాలం గడిచిపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండటం మంచిదని జగన్ చెప్పిన విధంగానే నివేదిక కూడా వెల్లడించింది. అలా నివేదిక ఇచ్చిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌కు రూ.5 కోట్ల 95 లక్షల ఫీజు చెల్లించింది ప్రభుత్వం. ఎటువంటి జీవో లేకుండా బోస్టన్‌కు అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిన కంపెనీతో రహస్య లావాదేవీలు జరిపింది వైసీపీ ప్రభుత్వం. మొత్తం వ్యవహారాలు ఈమెయిల్స్ ద్వారానే నడిపింది. ఈ మొత్తం వ్యవహారం రాష్ట్ర ప్రణాకా విభాగం ద్వారా చేసింది. రాజధాని కేసులపై వాదించేందుకు ప్రభుత్వం నియమించుకున్న లాయర్ ముకుల్ రోహత్గీకి కూడా ప్రణాళికా విభాగం ద్వారానే రూ. 5 కోట్లు మంజూరు చేశారు. అది కాకుండా బోస్టన్ గ్రూప్‌కి కూడా దాదాపుగా రూ.6 కోట్లు ఇచ్చింది ప్రభుత్వం. ఆ మొత్తాన్ని కూడా ఈ ప్రణాళికా విభాగం ద్వారానే విడుదల చేసినట్లుగా తెలుస్తోంది.  బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నుంచి బయటకు వచ్చిన లేఖల ప్రకారం చూస్తే రాష్ట్ర ప్రభుత్వమే ఆ కంపెనీని సంప్రదించింది. మూడు రాజధానులపై అధ్యయనం చేసేందుకు 2019 , నవంబర్‌ 27వ తేదీన బోస్టన్ కమిటీని ఎంపిక చేసినట్లుగా అధికారులు ఈమెయిల్ పంపారు. ఆ తర్వాత జనవరి 3వ తేదీన బోస్టన్ కమిటీ నివేదిక ఇచ్చింది. అంటే ప్రభుత్వం ఎంపిక చేసినట్లుగా నెల రోజుల్లోనే బోస్టన్ కమిటీ నివేదిక సమర్పించింది. అసలు ఆ కమిటీ ఏపీలో ఉండే ఎటువంటి పరిస్థితులను అధ్యయనం చేసి నివేదిక వెల్లడించిందో తెలియయటం లేదు. బోస్టన్ నివేదికలో కూడా గతంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన బ్లూప్రింట్‌లోని అంశాలు ఉన్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా మూడు రాజధానుల అంశం కూడా ఉంది. అంటే ముందస్తుగా ఒక రిపోర్టును ప్రభుత్వమే సిద్ధం చేసి.. దానికి బోస్టన్ గ్రూప్ అనే ట్యాగ్ వేసి ఇచ్చేందుకు రూ. 6 కోట్లను సమర్పించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలా బోస్టన్ నివేదిక గురుంచి గూగుల్ లో చాలా మంది వెతికినా దొరకలేదు.. అలానే ప్రభుత్వం కూడా చెప్పలేదు. అయితే ఇప్పుడు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌తో ప్రభుత్వం నేరుగా జీవో ద్వారా కాకుండా.. మరో విధంగా ఒప్పందం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ప్రభుత్వ చీకటి వ్యవహారాలు అంచనా వేయలేని విధంగా ఒక్కొక్కటి బయటపడుతున్నాయని ప్రజల్లో విమర్శలు వస్తున్నాయి.
తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసులో తమకు అనేక అనుమానాలు ఉన్నాయని కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు హైకోర్టు తెలిపారు. తాము, హైదరాబాద్ నుంచి పులివెందుల వెళ్లేలోపే వైఎస్ వివేకా బెడ్రూమ్ అండ్ బాత్రూమ్ లో రక్తపు మరకల్ని శుభ్రం చేసేశారని సునీత హైకోర్టుకు తెలిపారు. అదే రోజు సిట్ ఏర్పాటు చేశారని... కానీ, తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి... సీబీఐ దర్యాప్తు కావాలని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. అయితే, వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక... 2019 జూన్ 13న కొత్త డీజీపీ గౌతమ్ సవాంగ్... కొత్త అధికారులతో మళ్లీ సిట్ ఏర్పాటు చేశారని వివేకా కుమార్తె హైకోర్టుకు తెలియజేశారు. ఈ సిట్ 1300మందిని విచారించి సాక్ష్యాలను సేకరించిందని... కానీ కడప ఎస్పీగా అన్బురాజన్ నియమితులయ్యాక దర్యాప్తు నత్తనడకన సాగుతోందని సునీత ఆరోపించారు.  ఇక, సీబీఐ దర్యాప్తు కోరుతూ తన తల్లి సౌభాగ్యమ్మ... అలాగే తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాల్లో ఇప్పటివరకు ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయలేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పైగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తు కావాలని కోరిన తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 8 నెలలు అవుతున్నా ఇఫ్పటివరకు సీబీఐ దర్యాప్తు కోరలేదని ప్రశ్నించారు. అంతేకాదు... ప్రతిపక్షంలో ఉండగా ఏపీ పోలీసులపై విశ్వాసం లేదన్న జగన్.... తాను అధికారంలోకి వచ్చాక మళ్లీ సిట్ ను ఏర్పాటు చేసి ఉండకూడదన్నారు. జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో ఉన్నంతకాలం సీబీఐ దర్యాప్తు కోసం ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నట్లుగా భావించాలని సునీత అన్నారు. ఇక, తమ పిటిషన్ లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సిట్ ఎస్పీ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు సునీత. ఇదిలాఉంటే, వైఎస్ వివేకా కుమార్తు సునీత ప్రధానంగా 15మందిపై అనుమానాలు ఉన్నాయంటూ హైకోర్టుకు తెలిపారు. అందులో ఎక్కువగా వైఎస్ కుటుంబ సభ్యులే ఉండగా, మిగతా అనుమానితులు కూడా వైఎస్ కుటుంబ సభ్యులకు సన్నిహితులే ఉన్నారు. వివేకా కుమార్తె సునీత హైకోర్టుకు అందజేసిన అనుమానితుల జాబితాలో మొదట వాచ్ మన్ రంగయ్య(1)(వివేకా ఇంటి కాపలాదారు) పేరు ఉంది.ఆ తర్వాత యర్ర గంగిరెడ్డి (వివేకాకు అత్యంత సన్నిహితుడు)... 3.ఉదయ్ కుమార్ రెడ్డి (ఎంపీ వైఎస్ అవినాష్ కి అత్యంత సన్నిహితుడు).... 4.డి.శివశంకర్ రెడ్డి (వైసీపీ రాష్ట్ర కార్యదర్శి) (అలాగే, వైఎస్ అవినాష్ రెడ్డికి, వైఎస్ భాస్కర్ రెడ్డికి సన్నిహితుడు)... 5.పరమేశ్వర్ రెడ్డి... 6.శ్రీనివాస్ రెడ్డి... 7.వైఎస్ భాస్కర్ రెడ్డి (ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి)... 8.వైఎస్ మనోహర్ రెడ్డి (ఎంపీ అవినాష్ రెడ్డి చిన్నాన్న)... 9.వైఎస్ అవినాష్ రెడ్డి (కడప వైసీపీ ఎంపీ).... 10.శంకరయ్య (సీఐ)... 11.రామకృష్ణారెడ్డి (ఏఎస్సై).... 12. ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి.... 13. ఆదినారాయణరెడ్డి (మాజీ మంత్రి).... 14. బీటెక్ రవి అలియాస్ ఎం.రవీంద్రనాథ్ రెడ్డి (టీడీపీ ఎమ్మెల్సీ)... 15. సురేందర్ రెడ్డి (పరమేశ్వర్ రెడ్డి బావమరిది)... ఇలా, ప్రధానంగా 15మందిపై తమకు అనుమానాలు ఉన్నాయన్న వైఎస్ వివేకా కుమార్తె... ఎందుకో కారణాలను కూడా హైకోర్టుకు వివరించారు.
శాసనమండలి రద్దు దిశగా జగన్ సర్కారు అడుగులు వేస్తోంది. 50శాతం ఓట్లు, 151మంది ఎమ్మెల్యేలతో తిరుగులేని విజయం సాధించి అధికారంలోకి వచ్చినా... శాసనమండలిలో మాత్రం ప్రతిపక్ష తెలుగుదేశం బలమే ఎక్కువగా ఉండటంతో జగన్ ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా వైసీపీ సర్కారు ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుకు మండలిలో చుక్కెదురు కావడంతో కౌన్సిల్ రద్దు దిశగా జగన్ ప్రభుత్వం అడుగులేస్తోంది. అయితే, మండలిని రద్దు చేయాలంటే మొదటగా శాసనసభలో తీర్మానం చేయాల్సి ఉంటుంది. శాసనసభలో ఎలాగూ జగన్ ప్రభుత్వానిదే మెజారిటీ కనుక తీర్మానం ఆమోదం పొందడం ఖాయమే. అయితే, శాసనసభ చేసిన తీర్మానాన్ని పార్లమెంట్లో చర్చించి లోక్ సభ, రాజ్యసభల్లో ఆమోదించాల్సి ఉంటుంది. అయితే, పార్లమెంట్ కి విచక్షణాధికారాలు ఉన్నాయి. దాంతో, కేంద్రానికి ఇష్టంలేకపోతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని ఆమోదించకుండా వెనక్కి పంపే అవకాశమూ ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో బీజేపీ-జనసేన కలిసి పనిచేస్తున్న తరుణంలో జగన్ ప్రభుత్వ తీర్మానాన్ని ఆమోదించకుండా తిప్పిపంపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే, మూడు రాజధానులను జనసేన వ్యతిరేకిస్తుండటం... అదే సమయంలో ఏపీ బీజేపీ కూడా అమరావతే... ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగాలని తీర్మానం చేసిన నేపథ్యంలో...  మండలి రద్దు అంత సులువు కాదనే మాట వినిపిస్తోంది. అయితే, శాసన మండలి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేదని, దీనిపై కేంద్రానికి ఎలాంటి హక్కూ ఉండదని వైసీపీ నేతలు అంటున్నారు. మండలి రద్దుకు శాసనసభ తీర్మానంచేసి పంపితే, దాన్ని కచ్చితంగా పార్లమెంట్ ఆమోదించి తీరుతుందని అంటున్నారు. ఇందులో రాజకీయాలు ఏమీ ఉండవని చెబుతున్నారు. అందుకు, ఎన్టీఆర్ హయాం నాటి ఘటనను గుర్తుచేస్తున్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు... ఎన్టీఆర్ కూడా శాసనమండలి రద్దు చేశారని, అయితే, ఆనాడు కాంగ్రెస్ నేతలంతా రాజీవ్ కు మొరపెట్టుకున్నా... ఎన్టీఆర్ సూచన మేరకు మండలిని రద్దు చేశారని చెబుతున్నారు. ఇక, ఇప్పుడు కూడా ఆర్ధిక భారం పేరుతో మండలిని రద్దు చేయాలంటూ కేంద్రాన్ని కోరితే... కేంద్రం చేయక తప్పదని అంటున్నారు.
మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. న్యాయపరంగా ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటొంది. ఈ నెల 18న క్యాబినెట్ సమావేశం కాగా 20 నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని భావించినా రెండూ ఒకే రోజు జరిపితే మంచిదన్న అభిప్రాయానికి వచ్చింది ఏపీ సర్కార్. దీని ప్రకారం 20 ఉదయం 9:30 గంటలకు క్యాబినెట్ సమావేశం నిర్వహించి హైపవర్ కమిటీ నివేదికను ముందుగా ఆమోదిస్తారు.11:30 నిమిషాలకు అసెంబ్లీ భేటీ జరుగుతుండగా రాజధానితో పాటు అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ విషయంలో చట్ట పరంగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తరలింపు విషయంలో ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలను అధిగమించాలంటే ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేయాల్సిందేనన్న ఆలోచనల్లో జగన్ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు రాజధాని విభజన విషయంలోనూ అలాగే వికేంద్రీకరణ విషయంలోనూ కొత్త చట్టాన్ని తెచ్చే దిశగా కసరత్తు చేయడమే కాక రాజధాని పేరు లేకుండా కొత్త చట్టం రూపొందించే పనిలో పడింది ఏపీ సర్కార్. ఏపీ డిజిటలైజేషన్ అంటూ ఈక్వల్ డెవలప్ మెంట్ ఆఫ్ ఓల్డ్ రీజన్స్ బెల్ ట్వంటీ ట్వంటీ పేరుతో కొత్త బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టి సూచనలు వెలువడనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లును అధికారులు సిద్ధం చేస్తున్నారు.ఏపీలో ఉన్న మూడు ప్రాంతాల్లో వివిధ జోన్ లుగా ఏర్పాటు చేసే దిశగా కొత్త బిల్లు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.ప్రతి జోన్ కు ప్రత్యేకంగా 9 మంది సభ్యులతో బోర్డును ఏర్పాటు చేస్తారు. ప్రతి బోర్డుకు ఒకరు చైర్మన్ గా వ్యవహరిస్తారు, అలాగే వైస్ చైర్మన్ ను కూడా ఏర్పాటు చేస్తారు. ప్రాంతీయ బోర్డులో సభ్యులుగా 1 ఎంపి, 2 ఎమ్మెల్యేలు, మరో 4 ప్రతి నిధులు వుండేలా బిల్లును సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సదరు ప్రాంతీయ బోర్డు కార్యదర్శిగా ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారిని నియమించే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఏఏ జోన్లలో ఏఏ ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలి,ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే అంశాలను, కర్ణాటక మోడల్ తరహాలో బిల్లును రూపొందిస్తున్నారు.జీఎన్ రావు కమిటీ నివేదికతో పాటు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదిక కూడా దాదాపు ఇలాంటి సూచనలే చేశాయి. కొత్త చట్టాన్ని తీసుకు రావడంతో పాటు ఇప్పటికే ఉన్న సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలని కూడా సర్కారు నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు అధికారులు సీఆర్డీఏ రద్దుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సీఆర్డీఏ చట్టం రద్దు చేస్తే ఉత్పన్నమయ్యే సమస్యలను ప్రభుత్వం ఏ విధంగా అధిగమిస్తుందో వేచి చూడాలి.
రాజధాని అమరావతి కోసం ప్రతి ఇల్లు ఉద్యమించాలని.. ప్రతి ఇంటి నుంచి ఒకరు ముందుకు రావాలని.. అందరూ సంఘటిత శక్తిగా మారాలని.. టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజధానిని అమరావతి లోనే ఉంచాలి అంటూ అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో  తొలిసారిగా మచిలీపట్నం, విజయవాడలో జరిగిన జేఏసీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రజా రాజధానిని రక్షించేందుకు పార్టీలకు అతీతంగా అందరూ ఒకే వేదికపైకి వచ్చామని చంద్రబాబు అన్నారు. అమరావతి పరిరక్షణ సమితి అంటే సీఎం జగన్ భయపడుతున్నారని..అందుకే బస్సు యాత్రకు అన్ని అనుమతులు ఇచ్చి చివర్లో రూట్ పర్మిషన్ లేదంటూ పోలీసులను ఉసిగొలిపి అడ్డుకున్నారని దుయ్యబట్టారు.  ముందుగా ప్రజావేదికను కూల్చేశారన్నారు. అమరావతికి ముంపు భయం లేదని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ చెప్పినా కూడా మునిగిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని తాను అమరావతిలో పెద్ద ఎత్తున భూములు కొన్నానని ప్రచారం చేశారన్నారు. హై కోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలంటే వెనుకడుగువేస్తున్నారు. ఎన్నికల ముందు అమరావతిలో చదరపు గజం రూ 30,000 పలికింది. తాను మళ్లీ వచ్చి ఉంటే లక్ష పలికేదని.. ఆ డబ్బుతోనే అమరావతిని బ్రహ్మాండంగా నిర్మించవచ్చని ఎద్దేవా చేశారు. ఇది ప్రజా రాజధాని దేవుళ్ల మొదలు ప్రజలందరి ఆశీస్సులు ఉన్నాయి. దానిని కదిలించే శక్తి ఎవరికీ లేదన్నారు. ప్రజా రాజధానిని రక్షించుకునేందుకు ఇంటికో వ్యక్తి బయటికి వస్తే.. మనమందరం కలిసి కట్టుగా ఉద్యమిస్తే జగన్ తోక ముడుస్తారని అన్నారు. ఆయన తీరుతో బయటి రాష్ట్రాల్లో మన పరువు పోతుందన్నారు. ఆంధ్ర ప్రజల బతుకు మూడుముక్కలాటయిందని ఇతర రాష్ర్టాల ప్రజలు నవ్వుతున్నారు. అమరావతి కోసం ఉద్యమించే వారిపై తన పత్రిక ద్వారా బురద చల్లుతున్నారని తెలియజేశారు. రాజధానిపై రెఫరెండం పెట్టి.. దమ్ముంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవండి.. అప్పుడు మీ ఇష్టం వచ్చిన చోట రాజధానులు పెట్టుకోవాలి అన్నారు.  మంత్రి పేర్ని నాని, పవన్ కళ్యాణ్ ను పవన్ నాయుడు అని సంబోధిస్తున్నారు. మరీ ఆయనేమన్నా నాని రెడ్డా పవన్ స్వశక్తితో ఎదిగిన వాడు. ఆయన వ్యక్తిగత జీవితంపై బురద జల్లుతున్నారు. ఉన్న ఊరి నుంచి రాజధాని తరలిపోతుంటే ఎవరైనా పోరాడతారని అన్నారు. కానీ మంత్రి పేర్ని నానికి ఇక్కడ రాజధాని ఉండటం ఇష్టం లేనట్లే ఉంది.. అందుకే సిగ్గులేకుండా హైపవర్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. తాను ఒక పిలుపు ఇస్తే అమరావతి రైతులు 33,000 ల ఎకరాలను రాజధాని కోసం స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు.  విశాఖ నీతి నిజాయితీ ఉండేవాళ్ల నగరం.. అక్కడ అరాచకాలు సృష్టించేందుకు వైసీపీ నాయకులు బయలుదేరారు అని చంద్రబాబు అన్నారు. హుద్ హుద్ ముందు హుద్ హుద్ తర్వాత విశాఖ ఎలా ఉందో అక్కడ ఎవరిని అడిగినా చెబుతారని అన్నారు. దానిని టెక్నాలజీ హబ్ గా, ఫార్మా హబ్ గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే అన్నారు. మచిలీపట్నంలో జరిగిన బహిరంగ సభకు అధికారులు అవంతరాలు సృష్టించేందుకు ప్రయత్నించారు. విద్యుత్ సరఫరాను నిలిపేశారు. సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ ఇలాంటి చర్యలతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. సభకు వచ్చిన వారందరు తమ సెల్ ఫోన్లలో ఉన్న లైట్ ను వెలిగించాలని పిలుపునిచ్చారు. దీంతో ఒక్కసారిగా సభా ప్రాంగణం వద్ద సెల్ ఫోన్ లైట్ల వెలుగుతో నిండిపోయింది.
  We must of have heard this sentence by many people, who are couples, just married or married for long and also from people who are couples to be. People often say that compatibility is the key for any relationship. But what is this compatibility all about? For example, when he/ she getting married or looking for partner, their selection may happen based on looks, professional outlooks, or pay cheques etc.. But the most important thing in choosing a partner should be campatibility of values. Because, looks, professions, careers, tastes will change but values will never change. They remain with you through out. We often say that, you have to take right decissions in marriage; but make the decisions right in your marriage should be the correct attitude. When we call life as a journey, partner is also sailing with us through out.  To make this journey beautiful,  happy and memorable, we certainly have to invest our time and energies. When marriage  is  commitment for the life time you have to keep up your word by working on it continuously. compatability is having this thought of "continuous work" from both sides. However,  when one is weak in the he pair then the other one has to walk that extra mile to reach the goal. For this  you need to have trust, faith and belief in self and others and the philosophy you follow. When this matches  with  each other's thought process, this is called compatibility of values. This is the only thing which can help the couple to hold the relationship. Here the issue is not about inter cast, inter religion or different social and financial status but it's all about how far your values are compatible with your partner's. For example if you both trust in God whether it is Jesus or Jagannath,  you "having trust in the devine" is your compatibility.  you can worship eighter of them but "praying" play important role here. But if one believe in prayers and one won't then this difference of openion may lead to arguments. In a marriage,  when your values differ with each other, belief system is different from each other , there you suffer and your kids suffer more than any body. To avoid such circumstances,  find out your partner,  who is campatible with you in values of life.  In this current scenario,  we have so many options to know each other beforeentering  in to the wedlock. This helps a lot to know about your compatibility levels. Remember, marriage is a relationship where you need to work constantly.  This bonding will be always under construction. Enjoy the journey. ...............Bhavana  
  Studio Apartments or single large room tenements are ideal for bachelors’. But they also come with issues like clutter and where to put what. Try these known but simple tips to help you do up your studio pad into a wonderful and organized living space. ->Once you know your space, you need to demarcate your living areas as to where you want the kitchen, TV set up, bed and your storage places. ->If the room has a platform for the kitchen area you could think about storage places to put your dishes and cutlery and make sure they don’t spill over. ->You could consider using a curtain or partition to separate your bedroom from the rest of the room for privacy. These can pushed back for space when not in use. Use colors like white or grey so that it doesn't look too dark. ->If you are on a budget you could look at purchasing second hand storage spaces to keep your clothes and other stuff. ->When it comes to a bed you could buy those which are fold able into a small Diwan and also have storage space in them. It serves as double purpose. ->If the room has a separate nook or corner you could convert that into your reading place where you could keep a chair and lamp and your books in that corner. ->If the place has huge window, try making the most of it for letting sunlight in and use a colorful drapery to give it a nice look. ->And last but not the least - Avoid clutter. Keep things that are only useful and functional and if you are done using an item throw it or give it away to avoid clutter. Since you are the master of your single studio domain it is best to keep your place functional and hassle free and enjoy the bliss of your home.
Summer is almost reaching its climax but the sun isn’t stepping back to pomp its fury on the urban clan. Whilst many are still puzzled how to keep it stylish and still manage to minimize the gruesome heat here are few essentials men need to carry till the temperatures cool off. 1. Lenin shirts 2. A pair of Sunglasses 3. Cotton/Denim shorts 4. Slip On’s or Boat shoes / Flip Flops 5. Invisible socks 6. Dry Spray Deodorants 7. Tank tops 8. Cuffed Cotton Trousers 9. Dry Hair Gel 10.Smuffs One can go with their personal clothing preferences as far as they can carry it with ease and comfort but the wardrobe never gets complete without the above listed essentials for action packed summer. ............Ratnakar
      Papaya is a deliciously sweet fruit which has numerous nutritional benefits. It is very low in calories and also contains no cholesterol. Excellent for those who want to lose weight, consider eating papaya every day to maximize its health benefits.   Also a beauty food, papaya is low in fructose and is excellent for digestion! The antioxidant nutrients found in it, including Vitamins C and E and beta-carotene, are great at reducing inflammation and acne. Moreover, Vitamin C may also protect your skin against sun damage. Once considered quite exotic, they can now be found in markets throughout the year and if you have tree at home you can enjoy its benefits year long. The fruit, as well as the other parts of the papaya tree, contain papain, an enzyme that helps digest proteins. This enzyme is especially concentrated in the fruit when it is unripe. Health Benefits Papayas are a rich source of nutrients like carotenes, vitamin C and flavonoids; e B vitamin, folate and pantothenic acid; and rich in minerals like potassium, copper, and magnesium; and fiber. To categorize the health benefits without going into depth, the health benefits of papaya include: ·        It’s an antioxidant ·        Protection against Heart Disease ·        Promotes digestive health ·        Anti-Inflammatory ·        Supports the Immune system ·        Protection against Macular degeneration ·        Protects  against Rheumatoid arthritis ·        Protects against colon cancer   276.00 grams of Papaya contains 119 Calories Nutrient Values Vitamin C 224.1% Folate        25.5% Fiber         18.7% Vitamin A 14.5% Magnesium 14.4% Potassium    14.3% Copper        13.3% Pantothenic Acid  10.6%
India has emerged as the world's largest consumer of antibiotics, followed by China and the US, according to a new study on the growing alarm surrounding antibiotic-resistance. The study, Global Trends in Antibiotic Consumption 2000- 2010, according to Princeton University researchers found that worldwide antibiotic use has risen a staggering 36 per cent over the studied 10-year period. Among the 16 groups of antibiotics studied, cephalosporins, broad-spectrum penicillins and fluoroquinolones accounted for more than half of that increase, with consumption rising 55 per cent from 2000 to 2010. The study quantifies the growing alarm surrounding antibiotic-resistant pathogens and a loss of efficacy among antibiotics used to combat the most common illnesses. The report also highlights an increasing resistance to carbapenems and polymixins, two classes of drugs that have long been considered last-resort antibiotics for illnesses without any other known treatment. Overall, the study reviewed patterns, seasonality and frequency of use of antibiotics in 71 countries. "The data underscore the welcome evidence that more global citizens are able to access and purchase antibiotics. But that use is not being effectively monitored by health officials, from doctors to hospital workers to clinicians," the researchers noted. "Consequently, antibiotic use is both rampant and less targeted. That reality is driving antibiotic resistance at an unprecedented rate," researchers said. The five BRICS nations - Brazil, Russia, India, China and South Africa - have been held responsible for more than three-quarters of that surge. While India is the largest consumer of antibiotics, US accounts for the highest per capita consumption, with a rate of more than twice that of India. Source: PTI  
    Alternate healing methods for chronic pains and diseases are often considered as they provide treatment for various health issues. One such chronic problem which both men and women face are Varicose veins .This a condition where a person has dilated, tortuous and elongated veins, especially on the legs. The causes of varicose veins are mainly due to standing for long hours at work, genetic tendency, during pregnancy and due to obesity. Now there are various treatments for varicose veins. Through non-medical treatment where postural corrections and lifestyle changes are recommended, wearing suitable stockings to hold the legs and if the problem is too severe surgical treatment is also prescribed but in rare cases. Since the pain is persistent and takes time to cure, one could try Homeopathic treatment. This works very well for those who have mild to moderate cases of varicose veins.  It significantly helps to reduce pain and controls more varicosity and reduces swelling in the legs. Homeopathy is known to also help significantly in the cases where varicose leads to varicose ulcers. It is strongly recommended for all cases of varicose veins and though the dosage prescribed may be for two or three months they work well and show good results.