LATEST NEWS
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ భారతదేశ రాజకీయాల్లో,  సోషల్ మీడియా వేదికల్లో ఈ మధ్య కాలంలో  కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరు మార్మోగిపోతున్నది. గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకు ఎక్కడ చూసినా ఈ పేరు మారుమోగిపోతోంది. రోజురోజుకీ ఈ వినూత్న డిజిటల్ ఉద్యమానికి ఫాలోవర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అసలు ఏమిటీ కాక్రోచ్ జనతా పార్టీ? దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? దీనివల్ల ఇండియాలో  కూడా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో వచ్చినట్లు ప్రజా విప్లవాలు వస్తాయా అనే చర్చలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. ఈ తీవ్రమైన రాజకీయ పరిణామాలపై ప్రముఖ థింక్ ట్యాంక్  సెంటర్ ఫర్ లిబర్టీ అధినేత నలమోతు చక్రవర్తి  తెలుగువన్  ఇంటర్వ్యూలో అనేక లోతైన విశ్లేషణ చేశారు.  ఆయన మాటల్లో చెప్పాలంటే..  కాక్రోచ్ జనతా పార్టీ అనేది కేవలం ఒక బాహ్య లక్షణం మాత్రమే..  దీని వెనుక  చాలా లోతైన, మౌలికమైన వ్యవస్థాపక సమస్యలు  ఉన్నాయి. ఇండియాను  చాలా సంవత్సరాలుగా ముందుకు సాగకుండా అడ్డుకుంటున్న నిరుద్యోగం, క్రోనీ క్యాపిటలిజం,  విపరీతమైన పన్నుల విధానాల వల్ల నేటి యువతలో ఉన్న తీవ్రమైన ఫ్రస్ట్రేషన్, నిస్తేజం,  నిరుత్సాహానికి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఒక ప్రతిరూపంగా నిలుస్తోంది. ఇదొక వ్యంగ్యాస్త్రం లాంటిది. అంతే తప్ప వ్యవస్థీకృత రాజకీయ ఉద్యమం కాదని  నల్లమోతు చక్రవర్తి అన్నారు.   నేడు దేశంలో యువతకు కావాల్సింది  గౌరవప్రదమైన ఉపాధి,   మంచి జీతాలు వచ్చే ఉద్యోగాలు. మన పక్కనే ఉన్న చిన్న దేశాలు అనూహ్యమైన ఆర్థిక ప్రగతిని సాధిస్తుంటే.. భారతదేశం మాత్రం వెనకబడిపోతోందన్న బాధ యువతను వేధిస్తోంది.  చైనా మనకంటే 5 నుంచి 6  రెట్లు ఆర్థికంగా ఎదిగింది,  దక్షిణ కొరియా జపాన్ కంటే సంపన్న దేశంగా మారింది. తైవాన్, హాంకాంగ్, సింగపూర్ వంటి దేశాలు అద్భుతమైన అభివృద్ధిని కనబరుస్తున్నాయి. కానీ ప్రపంచంలోనే అతి పెద్ద యువశక్తి ఉన్న ఇండియా మాత్రం వెనుకబడిపోయింది. యువశక్తిని సరిగా ఉపయోగించుకోవడంలో  ఇండియా  రాజకీయ నాయకులు, పాలకులు, సమాజం విఫలమేనని చెప్పక తప్పదని నల్లమోతు అన్నారు.  ఇండియా ప్రస్తుతం ప్రపంచంలో 5  లేదా 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చలామణి అవుతున్నప్పటికీ..  సగటు తలసరి ఆదాయం విషయానికి వస్తే మనం ప్రపంచంలో 140వ స్థానంలో ఉన్నామనే చేదు నిజం , మన ఆర్థిక విధానాల వైఫల్యానికి అద్దం పడుతోంది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వాలు అనుసరిస్తున్న తప్పుడు ఆర్థిక విధానాలు, అలాగే  ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాలు. దేశంలో బ్యాంకుల దగ్గర ఉన్న మొత్తం ధనం దాదాపు 640 లక్షల కోట్లు. ఈ డబ్బే దేశంలో కొత్త పరిశ్రమల స్థాపనకు,  ఉపాధి కల్పనకు పెట్టుబడిగా మారాలి. కానీ.. మన ప్రభుత్వాలు దాదాపు 300 లక్షల కోట్లను వివిధ రకాల ఉచిత పథకాలకు, ఉచిత బస్సు ప్రయాణాలకు, ఉచిత సిలిండర్లకు,  అవినీతిమయమైన ప్రాజెక్టులకు మళ్లించి పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి.  ఉదాహరణకు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ఏకంగా 1.5 లక్షల కోట్లు తగలబెట్టారని..  దీనివల్ల మార్కెట్లో ఉపాధి పెంచేందుకు అవసరమైన క్యాపిటల్ లేకుండా పోయిందని చక్రవర్తి   గణాంకాలతో వివరించారు.  చైనా వంటి దేశాలు మౌలిక సదుపాయాలు, సోలార్ ప్రాజెక్టులు, పరిశ్రమలకు విద్యుత్ అందించడంపై ఖర్చు పెడితే, మన దేశంలో అప్పులు తెచ్చి మరీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం, ఉచితాలు పంచడం అలవాటుగా మార్చారు. డిగ్రీలు పూర్తి చేసి 4 నుంచి 5 ఏళ్లు దాటినా యువత రోడ్ల మీద తిరుగుతున్నారు. ఏదైనా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చినా కూడా..  4 ఏళ్ల అనుభవం ఉన్న వారికి కూడా కేవలం 4 లక్షల వార్షిక ప్యాకేజీ మాత్రమే లభిస్తోందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు దేశంలో క్రోనీ క్యాపిటలిజం తారస్థాయికి చేరింది. కేంద్రంలో కొద్దిమంది కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తే, రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీకి వాటి  సొంత వ్యాపార సంస్థలు ఉన్నాయి. పాలకులు,  వారి అనుకూల వ్యాపారవేత్తలు మాత్రమే సంపన్నులుగా మారుతున్నారు  సామాన్య ప్రజలకు ఆ సంపద అందడం లేదు. దేశంలో పన్నుల దోపిడీ విపరీతంగా పెరిగిపోయింది. పెట్రోల్ మీద దాదాపు 100 శాతం పన్నులు విధిస్తున్నారు, నిత్యావసర వస్తువులపై ఏకంగా 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. సామాన్యుడు కష్టపడి సంపాదించే ప్రతి 10 రూపాయలలో మెజారిటీ వాటా ప్రభుత్వం పన్నుల రూపంలో లాక్కుంటోంది.  ఒక వ్యక్తి తన సొంత ఫ్లాట్‌ను మరొకరికి అమ్ముకోవాలన్నా ప్రభుత్వానికి లక్షల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజులు కట్టాల్సి వస్తోంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రిజిస్ట్రేషన్ ఫీజులను ఏకంగా నాలుగు రెట్లు పెంచేందుకు   ప్రతిపాదనలు సిద్ధం చేయడం ఈ దోపిడీకి పరాకాష్ట. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతి రాజ్యమేలుతోంది. లంచం ఇవ్వకుండా పని చేసే ఒక్క తాహసిల్దార్ ఆఫీస్ కానీ, ఎఫ్ఐఆర్ నమోదు చేసే ఒక్క పోలీస్ స్టేషన్ కానీ, బిల్డింగ్ పర్మిషన్, కరెంట్, వాటర్ కనెక్షన్ ఇచ్చే ఒక్క విభాగం కూడా దేశంలో ఎక్కడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేలు ప్రతి ఇసుక రీచ్, మైనింగ్, వైన్ షాప్,  కాంట్రాక్టర్ల దగ్గర పర్సంటేజీలు,  కమిషన్లు వసూలు చేస్తూ కోట్లు గడిస్తున్నారు. రోడ్లన్నీ గుంతలమయంగా మారినా..  మరమ్మతులకు ప్రభుత్వాల దగ్గర పైసా నిధులు లేవని చేతులెత్తేస్తున్నారు. ఈ వ్యవస్థాగత దోపిడీ వల్లే ప్రజలు తీవ్రంగా విసిగిపోయి ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. ఇక ఈ కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో కేంద్ర ప్రభుత్వం భయపడి వారి ఎక్స్   ఖాతాను నిలిపివేసింది. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఇలా గొంతు నొక్కడం, ఖాతాలను బ్యాన్ చేయడం రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛకు పూర్తిగా వ్యతిరేకం. శాంతిభద్రతల సమస్య  సాకుతో అకౌంట్లు మూసివేయడం పాలకుల చేతగానితనమే అవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల నిరసనలను నేరుగా ఎదుర్కొని, చర్చల ద్వారా వారి కోపాన్ని డిఫ్యూజ్ చేయాలి తప్ప..  ఇలా పారిపోవడం దొంగతనానికి సమానమని నల్లమోతు చక్రవర్తి అన్నారు.  దేశంలో ఎన్నికల కమిషన్ లాంటి ఎంపైర్ వ్యవస్థలపై కూడా ప్రజల్లో నమ్మకం పోయింది.   2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం 240 సీట్లకు పడిపోయి మెజారిటీ కోల్పోవడానికి ప్రజల్లో ఉన్న ఈ తీవ్ర వ్యతిరేకతే కారణం. తమిళనాడులో నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమే అయినా..  ఆయన కూడా పాత ఉచితాల విధానాలనే నమ్ముకోవడం నిరాశకలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, 2019 నుంచి 2024 వరకు వైసీపీ సాగించిన అరాచక, అవినీతి పాలనతో విసిగిపోయిన ప్రజలు కూటమి ప్రభుత్వానికి 164 సీట్ల భారీ మెజారిటీ ఇచ్చారు. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అవినీతి, లంచగొండితనం కొనసాగుతుండటంపై ప్రజల్లో మళ్లీ అసంతృప్తి మొదలైంది. జయప్రకాష్ నారాయణ , వీవీ లక్ష్మీనారాయణ, ప్రవీణ్ కుమార్ వంటి మేధావులు ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ప్రయత్నించి విఫలమవడంతో ప్రజల్లో కొంత నమ్మకం సడలింది. ఏది ఏమైనప్పటికీ.. కాక్రోచ్ జనతా పార్టీ లాంటి చిన్న చిన్న విత్తనాలు భవిష్యత్తులో పెద్ద విప్లవాలుగా మారతాయా లేదా అనేది కాలమే నిర్ణయించాలి, కానీ పాలకుల గుండెల్లో మాత్రం ఇవి వణుకు పుట్టిస్తున్నాయనేది పచ్చి నిజం.  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నాయకులలో ఒకరు. నాలుగు దశాబ్దాలకు  రాజకీయాల్లో ఆయన క్రియాశీలంగా ఉన్నారు.చంద్రబాబు అందరితో కలిసిపోయి..   వారి మాటలను సావధానంగా వింటారు. ప్రస్తుతం జరుగుతున్న మహానాడు విషయంలో ఇది మరింత స్పష్టంగా కనిపించింది.   చంద్రబాబు నాయుడు ఎంతోమంది సామాన్యులకు తనను కలవడానికి, తనతో మాట్లాడటానికి మహానాడును వేదికగా మార్చారు.  చంద్రబాబు తన పక్కన సామాన్యులైన పలువురికి చోటు కల్పించారు.  వారికి చంద్రబాబుతో కూర్చుని మాట్లాడే అవకాశం లభించింది. ఇదే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విషయంలో  మచ్చుకైనా  కనిపించదు. ఎందుకంటే ఆయన సాధారణంగా పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులతో  కూడా సంభాషించడానికి సుముఖంగా ఉండరు.  ఆయనకు ప్రజల్లో ప్రజలతో స్పష్టమైన అనుబంధం ఉండవచ్చు, కానీ రాజకీయ కార్యక్రమాల సమయంలో వేదికపై  కలుపుగోలుతనం  కలికానిక్కూడా కనిపించదు. వైఎస్ జగన్‌తో సహా మిగతా వారందరి నుండి చంద్రబాబును వేరుచేసేది చంద్రబాబులోని ఈ కలుపుగోలు తనమేనని పరిశీలకులు విశ్లేషిస్తునారు.    ఇక తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు 2026 విషయానికి వస్తే.. ఈ సారి మహానాడు సరికొత్త రాజకీయ ఒరవడికి వేదికైంది. నెల్లూరులో భారీ ఎత్తున ఏర్పాటు చేయాలనుకున్న ఈ వేదికను, మోడీ ఇచ్చిన పొదుపు పిలుపు నేపథ్యంలో   మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా హైబ్రిడ్ మోడల్‌లోకి  మార్చారు. ఆధునిక సాంకేతికతను జోడించి డిజిటల్ పద్ధతిలో నిర్వహించిన ఈ సరికొత్త మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సమ్మిళిత రాజకీయాల విధానం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఈ వేదికపై నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకొనిపోయే విధంగా నూతన పాలనా సంస్కరణలను ప్రకటించారు. సంక్షేమం,  అభివృద్ధిని రెండు కళ్ళుగా భావించే చంద్రబాబు.. ఈ మహానాడు ద్వారా  వృద్ధులు, చేతివృత్తుల వారికి అండగా నిలిచేందుకు సామాజిక పెన్షన్ మొత్తాన్ని  పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ స్థాయిలో పెన్షన్ అందించడం ద్వారా పేదరిక నిర్మూలన దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కేవలం పెన్షన్లకే పరిమితం కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి అన్నదాతలను ఆదుకునేందుకు ప్రతి రైతుకు ఏటా పెట్టుబడి సాయాన్ని అందిస్తామని ప్రకటించడం పట్ల రైతాంగంలో హర్షం వ్యక్తం అవుతోంది. మహానాడు వేదికగా కూటమి రాజకీయాల ప్రాముఖ్యతను చంద్రబాబు నాయుడు నొక్కి చెప్పారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి నడుస్తున్న ఈ ప్రయాణం కేవలం తాత్కాలిక రాజకీయ అవసరం కాదని, ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే ఒక చారిత్రాత్మక మైలురాయిగా చంద్రబాబు అభివర్ణించారు.   వచ్చే ఎన్నికల్లో కూడా జనసేనతో  కలిసే పోటీ చేస్తామని ప్రకటించి కూటమిలో విభేదాలపై విపక్షాల ఊహాగానాలకు చెక్ పెట్టారు.   
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి  కొడాలి నాని మళ్లీ వార్తల్లో నిలిచారు. గత సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపు   క్రియాశీల రాజకీయాలకు,  దూరంగా ఉంటున్న ఆయన ఇటీవల ఆయన మళ్లీ ప్రజల ముందుకు రావడం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆయన తాను సుదీర్ఘ కాలం రాజకీయాలకు దూరంగా ఉండటానికి కారణం వెల్లడించారు.   తన రాజకీయ అజ్ఞాతవాసానికి   తనకు జరిగిన బైపాస్ సర్జరీయే కారణమన్నారు. సర్జరీ తరువాత  కనీసం 6 నెలలు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడం వల్లనే తాను గుడివాడకు, రాజకీయాలకు దూరంగా ఉన్నానన్నారు.   ఆరోగ్యం సహకరించకపోవడం వల్లే తాను బయటకు రాలేకపోయానని, రాజకీయాల నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని  కొడాలి నాని చెప్పారు.   వైసీపీ అధినేత జగన్ తో తాడేపల్లి ప్యాలెస్ లో భేటీ అనంతరం బుధవారం (మే 27) మీడియాతో మాట్లాడిన ఆయన యథాప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ లపై పరుష పదజాలంతో విమర్శలు గుప్పించారు. అయితే.. ఆ సందర్భంగా ఆయన  శైలి గతానికి పూర్తి భిన్నంగా కనిపించింది. సాధారణంగా కొడాలి నాని,  చంద్రబాబు,  ఆయన కుటుంబ సభ్యుల పట్ల తీవ్రమైన ద్వేషంతో  మాట్లాడతారు. చంద్రబాబు తనకు వ్యక్తిగత శత్రువు అన్నట్లుగా ఆయన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. చంద్రబాబుపై విమర్శలకు ఆయన అభ్యంతరకరమైన భాషను ఉపయోగిస్తుంటారు. కానీ బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతున్నప్పుడు అటువంటిదేదీ కనిపించలేదు. ఎవరో ఒత్తిడి చేయడం వల్ల మాత్రమే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారా అనిపించేలా ఆయన బాడీ లాంగ్వేజ్ ఉంది.  ఏదో నామ్ కే వాస్తే విమర్శలు చేసినట్లుగా అనిపించింది తప్ప.. గతంలో ఆయన మాటల్లో ఉన్న కసి, ఆవేశం ఇసుమంతైనా కనిపించలేదు.  జగన్ లేదా వైసీపీ అగ్రనేతల ఒత్తిడి కారణంగానే ఆయన మీడియా ముందుకు వచ్చి చంద్రబాబుపై విమర్శలు చేసినట్లుగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తన సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన నాలుగు రాష్ట్రాలకు  కొత్త సారథులను ప్రకటించింది.  బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.  ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా,  ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర రాష్ట్రాలకు కొత్త రాష్ట్ర అధ్యక్షులను నియమించారు.   రాబోయే ఎన్నికలు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలను దృష్టిలో ఉంచుకుని ఈ  మార్పులు చేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    ఢిల్లీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కేంద్ర సహాయ మంత్రి, తూర్పు ఢిల్లీ  ఎంపీ హర్ష్ మల్హోత్రా నియమితులయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ స్థానం నుండి ఎంపీగా గెలుపొందిన హర్ష్ మల్హోత్రా.. ప్రస్తుతం కేంద్ర కార్పొరేట్ వ్యవహారాలు,   రవాణా,  రహదారుల శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా స్థానంలో ఆయన ఈ బాధ్యతలను స్వీకరించనున్నారు.  అలాగే  పంజాబ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా, కేవల్ సింగ్ థిల్లాన్‌కు అప్పగించారు. గతంలో 2012 నుండి 2017 వరకు బర్నాలా నియోజకవర్గం నుండి పంజాబ్ అసెంబ్లీ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు అత్యంత సన్నిహితుడైన థిల్లాన్, 2022 జూన్ 4న బీజేపీలో చేరారు. శిరోమణి అకాలీదళ్‌తో తెగదెంపులు చేసుకున్న తర్వాత పంజాబ్‌లో ఒంటరిగా తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్న బీజేపీకి, థిల్లాన్ అనుభవం,  క్షేత్రస్థాయి వ్యూహాలు ఎంతగానో కలిసి రానున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.    హర్యానా రాష్ట్ర బీజేపీ అధ్యక్సురాలిగా  సీనియర్ మహిళా నాయకురాలు డాక్టర్ అర్చనా గుప్తాను కమలం అధిష్ఠానం నియమించింది. ఇక ఈశాన్య భారతంపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ, త్రిపుర రాష్ట్ర అధ్యక్షుడిగా అభిషేక్ దెబ్రాయ్‌ను ఎంపిక చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాతాబారి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన అభిషేక్, ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ పట్టును మరింత బిగించడానికి కృషి చేయనున్నారు.  
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామా  చేశారు.  రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు పై గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు  తెరదించుతూ కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామాచేశారు. 2023 మేలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో కుదిరిన అంతర్గత ఒప్పందం ప్రకారం ఆయన తన పదవి వదులుకున్నారు. బెంగళూరులోని తన అధికారిక నివాసం  కావేరి లో గురువారం (మే 27) ఏర్పాటు అల్పాహార విందు సమావేశంలో ఇదే  విషయాన్ని   తన క్యాబినెట్ సహచరులకు వెల్లడించారు.  ఈ ప్రకటనతో కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా , ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, కర్నాటక  కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టేందుకు మార్గం  సుగమమైంది. సిద్ధరామయ్య తన 3 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న తరుణంలో ఈ మార్పు చోటుచేసుకోవడం గమనార్హం.  ఈ అల్పాహార సమావేశం అత్యంత భావోద్వేగభరితంగా సాగింది. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన సిద్ధరామయ్య, రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తున్న సమయంలో  ఒకింత  భావోద్వేగానికి లోనయ్యారు.  ఇంతకాలం ముఖ్యమంత్రిగా నేను చేసిన పనుల పట్ల, ప్రజలకు అందించిన సేవల పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నానన్నారు. హైకమాండ్ ఆదేశాల మేరకే తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం..  ముఖ్యంగా లోక్‌సభలో  ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇచ్చిన సూచనలకు కట్టుబడి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఈ కీలక సమావేశంలో సీనియర్ మంత్రులు ప్రియాంక్ ఖర్గే, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, రామలింగారెడ్డి, హెచ్‌కే పాటిల్‌తో పాటు పలువురు ప్రముఖ నేతలు పాల్గొన్నారు.   ఈ సందర్భంగా  సిద్ధరామయ్య రాజీనామా  నిర్ణయాన్ని స్వాగతిస్తూ డీకే శివకుమార్ ఆయనను ఆత్మీయంగా అలింగనం చేసుకున్నారు. అనంతరం సిద్ధరామయ్య పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ దృశ్యం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ఐక్యతను చాటిచెబుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోను  కర్ణాటక కాంగ్రెస్   సోషల్ మీడియాలో  షేర్ చేస్తూ..   ఐక్యతే మా బలం! ప్రజాసేవే మా నిరంతర లక్ష్యం అన్న వ్యాఖ్యను జోడించింది. సిద్ధరామయ్య రాజీనామా వార్త బయటకు రాగానే బెంగళూరులోని డీకే శివకుమార్ నివాసం వద్ద ఆయన మద్దతుదారులు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఎత్తున సంబరాలు ప్రారంభించారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ, బాణసంచా కాలుస్తూ  ఆనందాన్ని పంచుకున్నారు.  
ALSO ON TELUGUONE N E W S
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi),గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)తో అదిరిపోయే స్టెప్స్ వేసి తన కంటు ఒక బ్రాండ్ సృష్టించుకున్న పాన్ ఇండియా భామ 'ఊర్వశి రౌతేలా'(urvashi rautela). రీసెంట్ గా జరిగిన 'కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026 వేడుకల్లో వరుసగా 5వ సారి తన అద్భుతమైన ఫ్యాషన్ లుక్స్‌తో అంతర్జాతీయ స్థాయిలో సన్సేషన్ సృష్టించింది. రీసెంట్ గా  ఊర్వశికి  సంబంధించిన ఒక షాకింగ్ ఏఐ చిత్రం ఇంటర్నెట్‌ని  కుదిపేస్తోంది. ఈ ఫోటోలో ఊర్వశి రౌతేలా ఇతర సీనియర్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల సింహాసనాల ముందు మోకాళ్లపై కూర్చుని, వారి కాళ్లు పట్టుకున్నట్లుగా చూపించడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ వివాదాస్పద ఏఐ చిత్రం బాలీవుడ్‌లోని స్టార్ హీరోయిన్ల గ్లోబల్ స్టార్‌డమ్, వారి స్థానాలని  ఒక క్రమపద్ధతిలో ర్యాంకింగ్ ఇస్తూ రూపొందించబడింది.  అగ్ర నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఒక పెద్ద సింహాసనంపై సుప్రీం స్థానంలో కూర్చుని ఉండగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా  దాని పక్కనే ఉన్న మరొక చిన్న సింహాసనంపై కూర్చుని ఉన్నట్లు చూపించారు. ఇక వారి ఇరువైపులా స్టార్ హీరోయిన్లు మాధురీ దీక్షిత్, దీపికా పదుకొణె నిలబడి ఉండగా.. కింద నేలపై మోకాళ్లపై కూర్చుని వారి పాదాలని  తాకుతున్నట్లుగా ఊర్వశి రౌతేలా, అలియా భట్, కత్రినా కైఫ్, కరీనా కపూర్ ల చిత్రాలని  ఏఐ సాయంతో సృష్టించారు. గ్లోబల్ గుర్తింపులో ఊర్వశి రౌతేలా తక్కువ స్థానంలో ఉందనే అర్థం వచ్చేలా ఈ మార్ఫింగ్ చిత్రాన్ని రూపొందించడం అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఒకవైపు అంతర్జాతీయ వేదికపై ఇంతటి గుర్తింపు తెచ్చుకుంటున్న తరుణంలో, తనని  తోటి నటీమణుల కాళ్ల వద్ద మోకరిల్లినట్లు చూపించడంపై ఊర్వశి తీవ్రంగా స్పందించింది.  తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో  వైరల్ ఏఐ పిక్‌ని షేర్ చేస్తూ  సుదీర్ఘమైన, భావోద్వేగభరితమైన పోస్ట్‌ను పెట్టింది. "ఇలాంటి విషపూరితమైన సంస్కృతిని ఇకనైనా ఆపండి. చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్క హీరోయిన్‌కి  తనదైన స్వంత ప్రయాణం, కఠిన శ్రమ, మరియు విధి ఉంటాయి. మహిళల మధ్య లేనిపోని విభేదాలు సృష్టించడం, ఫ్యాన్ వార్స్‌ని  ప్రోత్సహించడం వల్ల సమాజంలో కేవలం ప్రతికూలత మాత్రమే పెరుగుతుంది. సినిమా రంగంలో ఉన్న మహిళలందరినీ సమానంగా గౌరవించాలి. ఒకరి ప్రతిభని  మరొకరితో పోల్చకుండా ప్రతి ఒక్కరి ఎదుగుదలని , కష్టాన్ని, వారిలోని దయాగుణాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని ఊర్వశి పిలుపునిచ్చింది.  రీసెంట్‌గా రణదీప్ హుడాతో కలిసి 'ఇన్‌స్పెక్టర్ అవినాష్ 2' అనే వెబ్ సిరీస్‌లో నటించిన ఊర్వశి, ఈ ఏఐ వివాదంతో మరోసారి వార్తల్లో నిలిచింది. Also read: Pawan Kalyan: భేటీకి మమ్మల్ని పిలవలేదంటు యువ నిర్మాత సంచలనం.. పవన్ ఏమంటారో సెలబ్రిటీల మధ్య ఫ్యాన్ వార్స్ అనేవి ఎప్పట్నుంచో ఉన్నాయి. ఎవరి అభిమాన నటుడు లేదా నటి వారికే గొప్ప. అయితే, ఈ మధ్యకాలంలో  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ఫ్యాన్ వార్స్ సరికొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. సెలబ్రిటీల ముఖాలని  మార్ఫింగ్ చేస్తూ, విచిత్రమైన ఊహాజనిత చిత్రాలని  సృష్టిస్తూ వైరల్ చేయడం నెటిజన్లకి ఒక అలవాటుగా మారింది.    
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇటీవల జరిగిన ఒక కీలక పరిణామం ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పరిశ్రమ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించేందుకు టాలీవుడ్ అగ్ర నిర్మాతలు, ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా భావించే చిరు నివాసంలో జరిగిన ఈ భేటీపై సీపీఐ జాతీయ నేత నారాయణ తనదైన శైలిలో విమర్శలు గుప్పించడం సంచలనం రేపుతోంది. ఈ సమావేశం వెనుక ఉన్న అసలు ఉద్దేశాలపై నారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ఈ భేటీలో పరిశ్రమ బాగు కోసం చర్చించారా, లేక లాభాల వాటాలు పంచుకోవడంపై మాట్లాడుకున్నారా? అంటూ ఆయన ఘాటుగా ప్రశ్నించారు. భారీ బడ్జెట్ సినిమాల పేరుతో సామాన్య ప్రేక్షకుల జేబులకు చిల్లులు పెట్టేలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ఆయన నిలదీశారు. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో టికెట్ ధ‌ర‌లు పెంపు, అర్ధరాత్రి బెనిఫిట్ షోల అనుమతులపై నారాయణ మండిపడ్డారు. పెద్ద సినిమాలు వస్తున్నాయనే నెపంతో నిర్మాతలు పదేపదే రేట్లు పెంచుకుంటూ పోతుంటే, ప్రభుత్వాలు కూడా అడిగిందే తడవుగా జీవోలు జారీ చేయడంపై ఆయన దుయ్యబట్టారు. సినిమా అనేది కేవలం సామాన్యుడి వినోద సాధనమని, దాన్ని వ్యాపార దోపిడీగా మార్చవద్దని హితవు పలికారు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల నియంత్రణకు సంబంధించి ప్రభుత్వాల వద్ద సరైన విధివిధానాలు లేకపోవడాన్ని నారాయణ తప్పుబట్టారు. ఒక స్పష్టమైన పాలసీ లేకపోవడం వల్లే సామాన్య కుటుంబాలపై మోయలేని భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా సినిమా రంగంలోని పలు సమస్యలపై, సెలబ్రిటీల వ్యవహారాలపై నారాయణ స్పందిస్తూ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. మరోసారి ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నారాయణ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు, సినీ అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. సామాన్య ప్రేక్షకుల పక్షాన నారాయణ మాట్లాడిన మాటల్లో నిజం ఉందంటూ కొందరు మద్దతు తెలుపుతుండగా, సినిమా మేకింగ్ ఖర్చులు విపరీతంగా పెరిగిన తరుణంలో టికెట్ ధరల పెంపు తప్పదంటూ పరిశ్రమ వర్గాల వాదనను మరికొందరు గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో జరిగిన ఈ నిర్మాతల సమావేశం రాబోయే రోజుల్లో టాలీవుడ్‌లో ఎలాంటి మార్పులకు శ్రీకారం చుడుతుందోన‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. అటు ప్రభుత్వాల నుంచి టికెట్ రేట్ల విషయంలో ఎలాంటి స్పష్టత వస్తుందో, ఇండస్ట్రీ పెద్దలు దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
మలయాళ సినీ పరిశ్రమ నుంచి వచ్చే వినూత్న చిత్రాలకు తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. థియేటర్లలో మిస్ అయినా, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా వాటిని చూసేందుకు మన సినిమా లవర్స్ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లోకి సరికొత్త మలయాళ క్యాంపస్ డ్రామా ‘డెర్బీ’ రీసెంట్ గా అడుగుపెట్టింది. యువ నటీనటులతో తెరకెక్కిన ఈ సినిమా డిజిటల్ ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం. ఈ చిత్ర కథాంశం విషయానికి వస్తే.. ఇదొక పూర్తి స్థాయి కాలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ. ఒకే కళాశాలలో చదివే సీనియర్స్, జూనియర్స్ మధ్య జరిగే ప్రతీకారాలు, గొడవలు, సస్పెన్షన్లు, వాటి మధ్యే సాగే ప్రేమకథల చుట్టూ దర్శకుడు సజిల్ మాంప్యాడ్ ఈ కథను నడిపించారు. నూతనత్వాన్ని కోరుకునే నేటి తరం ప్రేక్షకులకు ఈ తరహా రొటీన్ క్యాంపస్ కథ పెద్దగా కనెక్ట్ కాలేదనే చెప్పాలి. మొదటి భాగం కొంతవరకు కాలేజ్ వాతావరణాన్ని గుర్తు చేసినప్పటికీ, ద్వితీయార్ధంలో కథనం గాడి తప్పడం మైనస్‌గా మారింది. ఇక నటీనటుల ప్రదర్శన విషయానికి వస్తే.. ‘అబ్రహం ఓజ్లర్’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న ఆడమ్ సాబిక్ ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు. సాగర్ సూర్య, అల్ అమీన్, జస్న్యా జయదీష్ తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు. అయితే బలహీనమైన క్యారెక్టరైజేషన్ వల్ల ఏ పాత్ర కూడా ప్రేక్షకుడిపై బలమైన ముద్ర వేయలేకపోయింది. షైన్ టామ్ చాకో, శబరీష్ వర్మ వంటి సీనియర్ నటులు ఉన్నప్పటికీ స్క్రిప్ట్ లో బలం లేకపోవడంతో వారు కూడా సినిమాను కాపాడలేకపోయారు. దర్శకుడు పాతకాలపు క్యాంపస్ డ్రామాల్లోని రొటీన్ సన్నివేశాలను, ట్విస్టులను నమ్ముకోవడం వల్ల సినిమాలో ఎక్కడా కొత్తదనం కనిపించదు. సినిమాటోగ్రఫీ మరియు గోపి సుందర్ అందించిన సంగీతం కూడా యావరేజ్‌గానే నిలిచాయి. పాటలు మరియు ఫైట్ సీక్వెన్సులు ఆడియన్స్‌లో ఎలాంటి ఎమోషన్‌ను కలిగించలేకపోయాయి. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఒకే తరహా సీన్లు పదే పదే రావడం వల్ల విసుగు తెప్పించిందని, ఎలాంటి ముగింపు లేకుండా సాగిన ఈ చిత్రంలో కేవలం కామెడీ కోణంలో వచ్చే కొన్ని సీన్లు మాత్రమే కాస్త ఊరటనిస్తాయని టాక్ నడుస్తోంది. ఓవరాల్ గా చూసుకుంటే, రొటీన్ గా సాగే కాలేజ్ గొడవలు మరియు ప్రేమకథలను ఇష్టపడే వారికి ఈ సినిమా డిజిటల్ వేదికపై టైమ్ పాస్‌గా అనిపించవచ్చు. అయితే కొత్తదనాన్ని ఆశించే ఓటీటీ ప్రియులకు మాత్రం ఈ ‘డెర్బీ’ అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా వీకెండ్‌లో ఒకసారి అమెజాన్ ప్రైమ్‌లో దీనిని ట్రై చేయవచ్చు.
Ram Charan's upcoming sports drama, Peddi marks a significant shift from standard commercial cinema, focusing instead on the untold survival stories of India's rural athletes. Directed by Buchi Babu Sana with music by AR Rahman, the film moves away from urban backdrops to explore the grassroots realities of tribal and village sports. During a recent media interaction in New Delhi, Ram Charan emphasized that the film is a deeply rooted reflection of the true Indian spirit. Highlighting the film's core theme of empowerment, he shared a poignant conversation he had with Prime Minister Narendra Modi about a grassroots talent from West Bengal who ended up inspiring an entire village to pursue athletics. Charan noted that Peddi aims to capture that exact kind of rural resilience on a global canvas. The project demanded intense dedication from its cast to bring these raw stories to life. Ram Charan, who portrays a crossover athlete, described his physical transformation into a wrestler as the most grueling challenge of his career. Co-star Janhvi Kapoor highlighted Charan’s unique approach to the craft, expressing awe at how he conserved his calm energy off-camera only to deliver explosive performances during takes.  For her own part, Kapoor revealed that she modeled her boldly unapologetic character directly after the director's own fierce conviction. Shifting the focus from mere entertainment to lasting impact, the team urged parents to experience the June 4 release in theaters with their children, hoping the journey of these unsung heroes will inspire the next generation to dream beyond their circumstances. Venkata Satish Kilaru produced the film on a massive scale.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  చిత్ర పరిశ్రమలో గత కొన్ని రోజులుగా ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య నడుస్తున్న 'పర్సంటేజీ విధానం' వివాదం ఒక కొలిక్కి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)జోక్యంతో తెలంగాణ ఎగ్జిబిటర్లు ఆయన నివాసానికి వెళ్లి చర్చలు జరపడం, ఆ తర్వాత ఈ సమస్య పూర్తిగా సర్దుమణగడం టాలీవుడ్‌లో పెద్ద ఊరటనిచ్చింది. అయితే ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ గారితో  టాలీవుడ్‌కి చెందిన కొందరు ప్రముఖ నిర్మాతలు హఠాత్తుగా భేటీ అవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ రవి శంకర్‌, వృద్ధి సినిమాస్ వెంకట్ సతీశ్ కిలారు, షైన్ స్క్రీన్స్ సాహు గారపాటి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సూర్యదేవర నాగవంశీ, ఎస్ఎల్వీ సినిమాస్ చెరుకూరి సుధాకర్ వంటి బిగ్ ప్రొడ్యూసర్స్ అంతా కలిసి పవన్ ని కలిశారు. ఈ కీలకమైన సమావేశంపై యువ నిర్మాత ధీరజ్ మొగిలినేని తాజాగా చేసిన ఓపెన్ కామెంట్స్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఒక సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న ధీరజ్ కి  పవన్ కళ్యాణ్‌ గారితో జరిగిన నిర్మాతల భేటీ గురించి మీడియా నుండి ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో ధీరజ్ స్పందిస్తు ఆ మీటింగ్‌కి తమలాంటి చిన్న, మీడియం రేంజ్ నిర్మాతలని ఎవరు పిలవలేదు. కేవలం వంద కోట్ల రూపాయల బడ్జెట్‌తో సినిమాలు తీసే పెద్ద పెద్ద నిర్మాతలు మాత్రమే పవన్ కళ్యాణ్‌(Pawan kalyan)గారిని కలిశారు. మా సమస్యలు మాకు ఉన్నాయి. ఉదాహరణగా చెప్పాలంటే జూబ్లీ హిల్స్ లో 1000 గజాల ప్లాట్ కొనుక్కొని 10 కోట్లతో ఇళ్లు కట్టుకునేవారి సమస్యలు ఒకలా ఉంటాయి. మణికొండలో 250 గజాల ప్లాట్ తీసుకొని ఇళ్లు కట్టుకునేవాడి సమస్యలు వేరే ఉంటాయి. ఇద్దరూ ఇళ్లే కట్టుకుంటున్నా, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్లకి ఉన్నాయి. అదే విధంగా చిన్న, మీడియం రేంజ్ సినిమాల సమస్యలు కూడా వేరే ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న ఇష్యూలో మేము ఇది చెప్పినా ఎవరికీ అర్థం కావడం లేదు.  'పెద్ది' రిలీజ్  తర్వాత, ఒక నెల లోపల చిన్న మిడ్ రేంజ్ సినిమాలు తీసే నిర్మాతలందరం చర్చించుకుని పవన్ కళ్యాణ్ గారిని  కలిసి మాట్లాడతామని  ధీరజ్ మొగిలినేని అన్నారు. Also read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వైభవానికి ఈటీవీ రెడీ.. త్వరలోనే డేట్ వెల్లడి ధీరజ్ మొగిలినేని విషయానికి వస్తే ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ పై ది గర్ల్ ఫ్రెండ్, అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్, ఉర్వశివో రాక్షసీవో, శ్రీరంగ నీతులు వంటి చిత్రాలు నిర్మించి టాలీవుడ్ లో రెగ్యులర్ ప్రొడ్యూసర్ గా మారాడు.        
  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)వన్ మాన్ షో 'ఓజి'(Og)సాధించిన విజయం, సృష్టించిన రికార్డులు తెలిసిందే. 350 కోట్లకి పైగా భారీ వసూళ్లని రాబట్టి పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ గా నిలిచింది.ఫ్యాన్స్ కి కూడా స్పెషల్ మూవీ కేటగిరిలో చేరింది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ శాటిలైట్ హక్కుల బిజినెస్ పై  గత కొంతకాలంగా చిత్ర పరిశ్రమలో తీవ్ర ఉత్కంఠత రేపుతూ ఉంది.  ఎట్టకేలకు ఈ సస్పెన్స్‌కి తెరదించుతూ ప్రముఖ టెలివిజన్ ఛానెల్ ఈటీవీ (ETV) భారీ ఫ్యాన్సీ రేటుతో  శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. త్వరలోనే ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాని  టెలివిజన్ ప్రేక్షకులకు అందించేందుకు ఛానల్ యాజమాన్యం గ్రాండ్ లెవెల్‌లో ఏర్పాట్లు చేస్తోంది. ఓటీటీలో  రికార్డు వ్యూస్ సాధించిన  ఓజి ఇప్పుడు బుల్లితెరపై ఎలాంటి టీఆర్‌పీ (TRP) రికార్డులని సృష్టిస్తుందో చూడాలి. అతి త్వరలోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్‌ని అధికారికంగా అనౌన్స్ చేసేందుకు ఛానల్ సిద్ధమవుతోంది. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆర్ ఆర్ ఆర్ దానయ్య  దానయ్య నిర్మించగా సుజీత్ దర్శకుడు.  ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి కీ రోల్స్ . Also read: Drishyam 3: దృశ్యం 3 సంచలనం.. వారం రోజుల్లోనే ఆ సినిమాల కలెక్షన్స్ గల్లంతు     
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్(Mohanlal),దర్శకుడు జీతూ జోసెఫ్(Jeethu Joseph)ల దృశ్యం 3(Drishyam 3) సరికొత్త చరిత్రని సృష్టించే విధంగా దుకుకెళ్తుంది. సరిగ్గా వారం క్రితం మే 21 న విడుదలైన ఈ మూవీ    రికార్డులే తన లక్ష్యం అన్నట్టుగా 7 రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. చిత్ర బృందం కూడా సదరు కలెక్షన్స్ పై  ఒక మలయాళ చిత్రం ఈ స్థాయిలో వారం రోజుల్లోనే అంతర్జాతీయంగా ప్రభావం చూపించడం ట్రేడ్ వర్గాలని  సైతం ఆశ్చర్యపరుస్తోంది. జార్జ్‌కుట్టి, అతని కుటుంబం చుట్టూ తిరిగే ఈ భావోద్వేగపూరిత క్రైమ్ థ్రిల్లర్ ప్రయాణం థియేటర్లలో ప్రేక్షకులను సీట్ల అంచులపై కూర్చోబెడుతోంది. ఈ అద్భుతమైన విజయంపై మోహన్‌లాల్ తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. "మూడు సినిమాలు.. మూడు అధ్యాయాలు.. ఒక విడదీయరాని బంధం. జార్జ్‌కుట్టి మరియు అతని కుటుంబంతో కలిసి ప్రయాణించినందుకు అందరికీ ధన్యవాదాలు" అంటూ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. కేవలం వారం రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరడం ద్వారా ఈ ఫ్రాంచైజీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'దృశ్యం 3' సరికొత్త రికార్డుని  నెలకొల్పింది. మోహన్‌లాల్ కెరీర్‌లో ఇప్పటికే 'L2: ఎంపూరాన్', 'తుడరుమ్' వంటి చిత్రాలు .200 కోట్ల మార్కును అందుకోగా, ఇప్పుడు ఆ ప్రతిష్టాత్మక జాబితాలోకి ఈ సినిమా కూడా చేరిపోయింది. ఈ సినిమా బాక్సాఫీస్ లెక్కలను నిశితంగా గమనిస్తే, ఏడో రోజైన బుధవారం కూడా ఇండియాలో 6.65 కోట్ల నెట్ వసూళ్లను సాధించి ఈ సినిమా తన సత్తా చాటింది. దీంతో దేశీయంగా మొత్తం నెట్ కలెక్షన్లు రూ.75.30 కోట్లకు చేరుకోగా, గ్రాస్ వసూళ్లు రూ.87.38 కోట్లను తాకాయి. ప్రపంచవ్యాప్తంగా బుధవారం రోజున 4,721 షోలలో ఈ సినిమా ప్రదర్శితమైంది. కేవలం మలయాళ వెర్షన్ నుంచే ఏడో రోజున .5.85 కోట్ల నెట్ వసూళ్లు రాగా, 40.35 శాతం థియేటర్ అక్యుపెన్సీ నమోదైంది. ఇతర భాషల విషయానికి వస్తే, తెలుగు వెర్షన్ రూ.50 లక్షలు (14.19% అక్యుపెన్సీ), తమిళ వెర్షన్ రూ.20 లక్షలు (17.09% అక్యుపెన్సీ), కన్నడ వెర్షన్ రూ.10 లక్షల వసూళ్లను సాధించాయి. Also read: Peddi: హైకోర్టుని ఆశ్రయించిన పెద్ది నిర్మాత.. ఇక సినీ ఆట మొదలైనట్లేనా! ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా జార్జ్‌కుట్టి హవా గట్టిగానే నడుస్తోంది. బుధవారం ఒక్క రోజే 5 కోట్ల గ్రాస్ వసూలు అయ్యాయి. దీంతో  ఓవర్సీస్ కలెక్షన్లు .95.70 కోట్లకి  చేరాయి. దేశీయ, అంతర్జాతీయ వసూళ్లను కలుపుకుని కేవలం 7 రోజుల్లోనే ఈ క్రైమ్ థ్రిల్లర్ .200 కోట్ల మార్కును విజయవంతంగా అధిగమించింది. మరి ఈ లెక్కన 300 కోట్లు పెద్ద కష్టమేమి కాదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.  
1. 'పెద్ది' మూవీ దుబాయ్ సెన్సార్ టాక్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాల నుంచి బ్లాక్‌బస్టర్ రిపోర్ట్స్ బయటకు వచ్చాయి. ఫస్టాఫ్‌లో రామ్ చరణ్ - జగపతిబాబుల మధ్య వచ్చే సీన్స్ అద్భుతంగా ఉండటంతో పాటు.. సెకండాఫ్‌లోని చివరి 45 నిమిషాలు, ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయట. ఈ చిత్రం జూన్ 4న విడుదల కానుంది. 2. నార్త్ లో ఎన్టీఆర్ 'డ్రాగన్' క్రేజ్ జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ యాక్షన్ మూవీ 'డ్రాగన్'. ఇటీవల ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా విడుదలైన ఈ సినిమా గ్లింప్స్.. సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ గ్లింప్స్ ఒక్క హిందీ వెర్షన్ లోనే ఏకంగా 40 మిలియన్ వ్యూస్ మైలురాయిని దాటి యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. హిందీలో ఈ గ్లింప్స్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. నార్త్ ఇండియా బాక్సాఫీస్ ను డ్రాగన్ షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. 3. 'విశ్వనాథ్ అండ్ సన్స్' రిలీజ్ డేట్ ఫిక్స్ కోలీవుడ్ స్టార్ సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 'లక్కీ భాస్కర్' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో పాటు, ఇటీవల 'కరుప్పు'తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సూర్య నెక్స్ట్ మూవీ కావడంతో.. దీనిపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 4. ముంబైలో బాలయ్య విధ్వంసం! నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రానున్న 'NBK 111' మూవీ, ముంబై నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ కోసం బాలకృష్ణ ఈ వారంలోనే ముంబై వెళ్లనున్నారు. అక్కడ జరగబోయే లాంగ్ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు, భారీ యాక్షన్ సీన్స్ కూడా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ గ్యాంగ్‌స్టర్‌గా సందడి చేయనున్నట్లు సమాచారం. 5. 'పెద్ది' సినిమాకి హైకోర్టు యాంటీ పైరసీ ఉత్తర్వులు  'పెద్ది' సినిమా ఇంటర్నెట్‌లో అనధికారికంగా అప్‌లోడ్ కాకుండా మరియు పైరసీకి గురికాకుండా అడ్డుకోవడానికి మద్రాస్ హైకోర్టు కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ చిత్ర నిర్మాతలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. యాంటీ-పైరసీ ఆదేశాలను ఇచ్చింది. దీని ద్వారా సినిమాను చట్టవిరుద్ధంగా కాపీ చేయడం, పైరసీ వెబ్‌సైట్లలో ప్రసారం చేయడం వంటి చర్యలపై కోర్టు నిషేధం విధించింది. 6. 'ఎల్లమ్మ'గా యంగ్ బ్యూటీ 'బలగం' ఫేమ్ డైరెక్టర్ వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న 'ఎల్లమ్మ' సినిమాలో హీరోయిన్‌గా 'ప్రేమలు' బ్యూటీ మమితా బైజు నటించనున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ఎమోషనల్ డ్రామాలో హీరోయిన్ పాత్ర కోసం ప్రస్తుతం చిత్ర బృందం మమితతో సంప్రదింపులు జరుపుతోంది. గతంలో ఈ క్యారెక్టర్ కోసం సాయిపల్లవి, కీర్తి సురేష్, మృణాల్ ఠాకూర్ వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించగా.. ఫైనల్‌గా ఈ కేరళ కుట్టికి ఛాన్స్ దక్కినట్లు ఫిలిం నగర్ టాక్. 7. 'బ్లాస్ట్ జోన్' మూవీ రివ్యూ యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రలు పోషించిన 'బ్లాస్ట్ జోన్' మూవీ నేడు థియేటర్లలో అడుగుపెట్టింది. ఈ సినిమా సింపుల్ స్టోరీతో సాగినప్పటికీ.. యాక్షన్ ప్రియులను అలరించేలా చక్కటి వినోదభరితమైన స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా నిలిచింది. నటీనటుల పర్ఫార్మెన్స్, సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ సీన్స్, రవి బస్రూర్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఫస్టాఫ్ కథనం కాస్త నెమ్మదిగా సాగడం, సినిమాలోని చాలా సన్నివేశాలు ఊహకందేలా ఉండటం మైనస్ అయింది. 8. 'జైలర్ 2' సినిమాలో హృతిక్ రోషన్ సూపర్‌స్టార్ రజినీకాంత్ 'జైలర్ 2'లో ఒక పవర్‌ఫుల్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ క్యామియో పాత్ర కోసం మొదట షారుఖ్ ఖాన్ అనుకున్నప్పటికీ, డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను సంప్రదించగా, ఆయన రాజకీయ కారణాల వల్ల నో చెప్పారు. కథను మలుపు తిప్పే ఈ కీలక పాత్ర కోసం ప్రస్తుతం దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో చర్చలు జరుపుతున్నారు. 9. డివైడ్ టాక్ తో 200 కోట్లు... మలయాళ స్టార్ మోహన్ లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ 'దృశ్యం 3' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. డివైడ్ టాక్ తెచుకున్నప్పటికీ, కేవలం ఏడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్కును దాటేసి సంచలనం సృష్టించింది. 'దృశ్యం' ఫ్రాంచైజీలోనే అత్యంత వేగంగా రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాగా నిలవడమే కాకుండా, మాలీవుడ్‌లో ఈ ఏడాది అతిపెద్ద హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. 10. ఆరు కోట్లు పెడితే.. 800 కోట్లు వచ్చాయి హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ కర్రీ బార్కర్ దర్శకత్వంలో వచ్చిన హారర్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 'అబ్సెషన్' (Obsession). కేవలం రూ.6.25 కోట్ల బడ్జెట్‌తో, 20 రోజుల్లో తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. థియేటర్లలోకి వచ్చిన కేవలం 12 రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా రూ. 830 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. 2026లోనే అత్యంత భారీ ప్రాఫిట్స్ అందుకున్న హాలీవుడ్ చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది.  
టాలీవుడ్‌లో అనతికాలంలోనే తనదైన ముద్ర వేసుకున్న కన్నడ సౌందర్యం ఆషికా రంగనాథ్ సోషల్ మీడియాలో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. నిరంతరం వెండితెరపైనే కాకుండా, సామాజిక మాధ్యమాల్లోనూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసిన గ్లామరస్ ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. తాజాగా ఆషికా ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఫోటో షూట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పిక్స్‌లో ఆమె పింక్ కలర్ రా సిల్క్ వన్ మినిట్ శారీలో మెరిసిపోయింది. దానికి జతగా ధరించిన హాఫ్ షోల్డర్ హెవీ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేసింది. చీర కొంగును సంప్రదాయబద్ధంగా కాకుండా ట్రెండీగా చేత్తో పట్టుకుని సరికొత్త స్టైల్ స్టేట్‌మెంట్‌ను సెట్ చేసింది. ఈ ప్రత్యేకమైన అవుట్‌ఫిట్‌కు తగ్గట్టుగా మెడలో సింపుల్ చోకర్ ధరించి రాయల్ లుక్‌ను సొంతం చేసుకుంది. ప్రముఖ స్టైలిస్ట్ ఖుషి జగదీష్ పర్యవేక్షణలో రూపొందిన ఈ మోడరన్ ఎత్నిక్ లుక్, ఆషికాలోని అసలైన గ్లామర్ యాంగిల్‌ను ఆవిష్కరించిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతూ లైకుల వర్షం కురిపిస్తున్నాయి. నటనా రంగంలోకి వస్తే.. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ సినిమాతో ఇషికా పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఈ భామ పరిచయమైంది. ఆ తర్వాత కింగ్ నాగార్జున సరసన ‘నా సామిరంగా’ చిత్రంలో 'వరాలు' అలియాస్ వరమహాలక్ష్మిగా అద్భుతమైన నటనతో పాటు, అచ్చతెలుగు అందంతో కుర్రకారు మనసు దోచుకుంది. ఈ సినిమా విజయంతో టాలీవుడ్‌లో ఈమెకు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇటీవలే మాస్ మహారాజా రవితేజ సరసన ‘భర్త మహాశ‌యులకు విజ్ఞప్తి’ అనే చిత్రంలోనూ ఆషికా సందడి చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినప్పటికీ, ఆషికా తన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు గ్లామర్ డోస్‌తో ప్రేక్షకులను లవ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ముంచెత్తింది. తన నటనకు విమర్శకుల నుండి సైతం మంచి మార్కులే పడ్డాయి. ఈ బ్యూటీ షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలపై అభిమానులు కామెంట్ల రూపంలో ప్రశంసలు గుప్పిస్తున్నారు. ట్రెడిషనల్ వేర్‌లో ఇంత హాట్‌గా కనిపించడం కేవలం ఆషికాకే సాధ్యమంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు. సినిమా అవకాశాలు ఒకవైపు వస్తూనే, మరోవైపు ఇలాంటి ఫోటోషూట్లతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది ఈ కన్నడ కస్తూరి. ప్రస్తుతం ఆషికా రంగనాథ్ కెరీర్ టాలీవుడ్‌లో శరవేగంగా దూసుకుపోతోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’లో ఈమె ఒక కీలక పాత్ర పోషిస్తోంది. దీనితో పాటు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘సర్దార్ 2’లోనూ మెరవనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ పెద్ద ప్రాజెక్టులు విడుదలైతే ఆషికా టాలీవుడ్ టాప్ లీగ్‌లోకి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఎల్లప్పుడూ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సామాజిక బాధ్యత గల కథాంశాలను ఎంచుకోవడానికి ఇష్టపడతారు. వైవిధ్యమైన నటనతో దేశవ్యాప్తంగా అశేష జనవాహినిని సంపాదించుకున్న సూర్య కెరీర్‌లో 'జై భీమ్' ఒక అద్భుతమైన మైలురాయిగా నిలిచింది. ఇప్పుడిక అదే మ్యాజిక్‌ను వెండితెరపై మళ్లీ పునరావృతం చేయడానికి ఈ లీడింగ్ స్టార్ రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో బలమైన టాక్ వినిపిస్తోంది. 'జై భీమ్' వంటి క్లాసిక్ హిట్‌ను అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ టి.జె. జ్ఞానవేల్‌తో సూర్య మరోసారి చేతులు కలపబోతున్నట్లు సమాచారం. ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన ప్రాథమిక చర్చలు ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా ముగిశాయని, స్క్రిప్ట్ కూడా ఒక కొలిక్కి వచ్చిందని కోలీవుడ్ వర్గాలు గట్టిగా చెప్తున్నాయి. కథా చర్చలు పూర్తి కావడంతో ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను మేకర్స్ వేగవంతం చేశారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియలో దర్శకుడు జ్ఞానవేల్ బిజీగా ఉన్నారట. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. గతంలో వచ్చిన 'జై భీమ్' చిత్రం కేవలం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న న్యాయవ్యవస్థలోనూ, సామాజిక కోణంలోనూ పెద్ద చర్చకు దారితీసింది. లాయర్ చంద్రుగా సూర్య అభినయం అందరి గుండెలను పిండేసింది. అయితే ఇంతటి ఘనవిజయం సాధించిన ఈ చిత్రానికి జాతీయ అవార్డు దక్కకపోవడంపై అప్పట్లో నెటిజన్లు, సినిమా అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ కారణాల వల్లే అవార్డు మిస్ అయిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో రాబోయే కొత్త సినిమా కూడా సమాజంలోని కొన్ని కీలక సమస్యలను ఎండగట్టే బలమైన రియలిస్టిక్ డ్రామాగా సాగనుందని ఇండస్ట్రీ టాక్. ఈసారి జాతీయ అవార్డులను మించి, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకునేలా ఒక అద్భుతమైన సామాజిక సందేశాత్మక చిత్రాన్ని ఈ జోడీ అందించబోతోందని ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు సూర్య టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఆగ‌స్ట్ 14న‌ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ ప్రాజెక్ట్ థియేటర్లలోకి వచ్చిన వెంటనే సూర్య, జ్ఞానవేల్ దర్శకత్వంలో సరికొత్త సామాజిక కథతో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రతి తల్లిదండ్రులు తమ కూతురు జీవితంలో విజయవంతంగా, బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని కోరుకుంటారు. దీనికి మంచి విద్య, మంచి విలువలు చాలా అవసరం. ఇవన్నీ ఉన్నా సరే.. కొంతమంది అమ్మాయిలు తమ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. ముఖ్యంగా వివాహం తర్వాత అమ్మాయిల జీవితం తమ చేతుల్లో నుండి జారిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అమ్మాయిలు తరచుగా ఇతరులను సంతోషపెట్టడానికి తమ కోరికలను, భావోద్వేగాలను అణచివేసుకుంటారు. ఈ అలవాటు క్రమంగా వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.  అందుకే అమ్మాయిలకు విలువలు,  మంచి విద్య మాత్రమే కాదు.. ఎంత కష్టంలో అయినా నిలబడాలంటే.. ప్రతి తల్లి తన కూతురికి కొన్ని నేర్పించాలి. వాటిలో  ముఖ్యమైనది.. ఏదైనా కరెక్ట్ కాని విషయానికి " నో " చెప్పడం.  ఇలా ఏదైనా సరికాని విషయానికి నో చెప్పడం అమ్మాయిలను ఎందుకు బలంగా ఉంచుతుంది? దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. "నో" అని చెబితే.. ఒక అమ్మాయి 'కాదు' అని చెప్పడం నేర్చుకున్నప్పుడు, ఆమె సంబంధాలలో, వృత్తిలో , సమాజంలో తనను తాను గౌరవించుకోవడం కూడా నేర్చుకుంటుంది. ఈ ఒక్క అలవాటే ఆమెను మానసికంగా దృఢంగా, స్వయం సమృద్ధిగా , ఆత్మవిశ్వాసంతో ఉండేలా చేస్తుంది. ఇది  జీవితంలో ముందుకు సాగడానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఆత్మగౌరవం పెరుగుతుంది.. ఆడపిల్ల తన ఇష్టాయిష్టాలను బయటకు  వ్యక్తపరిచినప్పుడు, ఆమె తన ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటుంది. దీనివల్ల ఆమెకు ఆత్మగౌరవం పెరుగుతుంది. తప్పుడు వ్యక్తుల నుండి దూరం.. మొహమాటంతోనో లేక ఇతరులను సంతోషపెట్టాలనో ప్రతి దానికి సరే అని చెప్పే అలవాటు.. ఎదుటివారు అమ్మాయిలను  స్వార్థం కోసం ఉపయోగించుకోవడానికి వీలు కల్పిస్తుంది. 'కాదు' అని చెప్పడం  భద్రతను ఇస్తుంది. అమ్మాయిలకు ఏదైనా సరికాదు అనిపిస్తే మొహమాటం లేకుండా నో చెప్పడం వల్ల జీవితంలో ఎన్నో సమస్యలను నివారించవచ్చు. నిర్ణయాలలో ఆత్మవిశ్వాసం.. తన మనసులోని మాటను చెప్పడానికి భయపడని అమ్మాయి జీవితంలోని అతిపెద్ద నిర్ణయాలను కూడా ఆత్మవిశ్వాసంతో తీసుకోగలదు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది.. అందరినీ సంతోషంగా ఉంచాలని ప్రయత్నించడం ఒత్తిడిని పెంచుతుంది. అందుకే ప్రతి అమ్మాయి తన  స్వంత బౌండరీస్ ను నిర్దేశించుకోవడం మనశ్శాంతిని ఇస్తుంది. బలమైన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది.. స్పష్టమైన ఆలోచన , ముక్కుసూటితనం ఉన్న అమ్మాయిలు సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టిస్తారు. పొగరు, లెక్కలేనితనం.. ఇలాంటి మాటలు అనుకునేవారు కూడా ఉంటారు.  కానీ వ్యక్తిత్వం, మంచితనం,  నిర్ణయాలు సరిగా తీసుకోవడం వంటివి జరుగుతూ ఉంటే.. విమర్శించిన వారే మెచ్చుకునే రోజులు వస్తాయి. దీని వల్ల వ్యక్తిత్వం బలంగా మారుతుంది. ఎలా నేర్పాలి.. ఏదైనా విషయం సరికాదు అనిపిస్తే దానికి నో చెప్పడం ఎలా అనే విషయాన్ని తల్లులు తమ కూతురికి నేర్పాలి.  కానీ ఎలా నేర్పాలో కొందరికి అర్థం కాదు. తల్లి కూతురి దగ్గర స్నేహితురాలిగా ఉండి మనసు విప్పి మాట్లాడాలి.  దీనివల్ల కూతురి ఏ విషయాన్ని అయినా మనసు విప్పి పంచుకోగలుగుతుంది. అందరినీ సంతోషపెట్టడం కోసం అన్నీ అంగీకరించాల్సిన అవసరం లేదని అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఆడపిల్ల అభిప్రాయానికి, నిర్ణయాలకు విలువ ఇవ్వాలి. చిన్న చిన్న విషయాలలో నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి.  తీసుకున్న నిర్ణయాలు సరిగా లేకపోయినా,  వాటిలో ఏవైనా ఇబ్బందులు ఎదురైనా.. వాటిని వివరించి చెప్పాలి. తప్పు చేసినప్పుడు లేదా తప్పు నిర్ణయాలు తీసుకున్నప్పుడు తిట్టడానికి బదులుగా వాటి పర్యావసానాలు వివరించి చెప్పాలి.  ఎలా నిర్ణయం తీసుకుంటే బాగుండేదో.. ఎలా ఉండాలో చెప్పాలి. ఆడపిల్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం తప్పు విషయం కాదని,  అది తన వ్యక్తిత్వాన్ని  తెలియజేస్తుందని వివరించాలి.  అప్పుడే అబిప్రాయాలు, నిర్ణయాలు ఎలా ఉండాలో.. ఎలా ఉండే తన వ్యక్తిత్వం మంచిగా ఉంటుందో వారికి అర్థమవుతుంది.                           *రూపశ్రీ.
వేసవి కాలం రాగానే, చెమట నీళ్ళు కుమ్మరించినట్టు కారిపోతూ ఉంటుంది.  ఎంతమంచి బట్టలు వేసుకున్నా చెమట కారణంగా పాడైపోతూ ఉంటాయి.పైగా చెమట కారణంగా దుర్వాసన కూడా వస్తుంది. చెమట వాసన చాలా మందికి పెద్ద సమస్యగా మారుతుంది. ముఖ్యంగా  ఎక్కువ సేపు బయట ఉండాల్సి వచ్చినప్పుడు లేదా తీవ్రమైన వేడిలో పని చేస్తున్నప్పుడు, శరీర దుర్వాసన చాలా ఇబ్బంది పెడుతుంది.  చాలా మంది ఖరీదైన డియోడరెంట్లు , పెర్ఫ్యూమ్‌లను ఉపయోగిస్తారు, కానీ వాటి ప్రభావం కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. శరీరంలోని బ్యాక్టీరియా చెమటతో కలిసి దుర్వాసనను ఉత్పత్తి చేసినప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఎక్కువ ఖర్చు పెట్టకుండా శరీర దుర్వాసనను వదిలించుకోవాలనుకుంటే, కొన్ని ఇంటి చిట్కాలు సహాయపడతాయి.  ఆ సులభమైన ఇంటి చిట్కాలేంటో తెలుసుకుంటే.. వేసవిలో శరీర దుర్వాసన ఎందుకు పెరుగుతుంది? వేసవిలో శరీరానికి ఎక్కువగా చెమట పడుతుంది. ఈ చెమట చర్మంపై ఉండే బ్యాక్టీరియాతో సంపర్కంలోకి వచ్చినప్పుడు, దుర్వాసన వెలువడుతుంది. శరీరాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే లేదా చెమట ఎక్కువసేపు శరీరంపై ఉండిపోతే, శరీర దుర్వాసన సమస్య పెరుగుతుంది. శరీర దుర్వాసన రాకూడదంటే.. స్నానం నీటిలో వీటిని కలపాలి.. నిమ్మరసం.. బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడుతుంది శరీరానికి తాజా అనుభూతిని కలిగిస్తుంది. చెమట వాసనను తగ్గించవచ్చు ఒక బకెట్ నీటిలో ఒకటి రెండు స్పూన్ల నిమ్మ రసం కలుపుకుని స్నానం చేయడం వల్ల రిఫ్రెషింగ్  అనుభూతి కలుగుతుంది. రోజ్ వాటర్.. గులాబీ నీరు చల్లదనాన్ని, తేలికపాటి సహజ సువాసనను అందిస్తుంది.  స్నానపు నీటిలో 3-4 టీస్పూన్ల రోజ్ వాటర్ కలపాలి.  ఇది చర్మానికి తాజా అనుభూతిని కూడా కలిగిస్తుంది. వేసవిలో శరీర జిగట తగ్గిస్తుంది. బేకింగ్ సోడా.. బేకింగ్ సోడా శరీర దుర్వాసనను తగ్గించడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఇది దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను నియంత్రించడంలో సహాయపడుతుంది.  అయితే దీన్ని అధిక పరిమాణంలో ఉపయోగించకూడదు.  సున్నితమైన చర్మం ఉన్నవారు ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. వారానికి రెండు మూడు సార్లు మాత్రమే వాడాలి. పటిక.. పటికలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి.  ఇది చెమట వాసనను తగ్గించడానికి సహాయపడుతుంది. వేప నీరు.. వేప నీరు చర్మ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది. దురద , బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడుతుంది.  వేప ఆకులను ఉడకబెట్టి, ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకోవచ్చు.                                  *రూపశ్రీ.  
పుదీనా ఎంతో సువాసనగా, ఆహ్లాదాన్ని ఇచ్చే మొక్క.  ఎన్నో రకాల కూరల నుండి పచ్చళ్ల తయారీ  వరకు పుదీనాను  ఉపయోగిస్తారు.   ఇక వేసవి కాలంలో అయితే షర్బత్ నుండి నిమ్మరసం, ఆమ్ పన్నా, మసాలా మజ్జిగ ఇలా.. చాలా పానీయాల తయారీలో కూడా పుదీనాను ఉపయోగిస్తారు. పుదీనా పానీయాల రుచిని పెంచుతుంది. శరీరాన్ని చల్లబరుచుతుంది. అయితే వేడి ఎక్కువగా ఉంటే పుదీనా మొక్క చాలా తొందరగా వాడిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో మొక్కకు పచ్చదనాన్ని పెంచడానికి , మొక్క పచ్చగా ఎదగడానికి కొన్నిచిట్కాలు ఉపయోగించవచ్చు. వాటిలో ఎంతో ప్రబావవంతంగా పనిచేసే చిట్కా తెలుసుకుంటే.. పటిక నీరు.. పుదీనా మొక్కకు పటిక నీటిని కలపడం వల్ల మట్టి ఆమ్లంగా మారుతుంది. కుండీలోని మట్టి క్షారంగా మారినప్పుడు, పుదీనా పెరుగుదల కుంటుపడి, ఆకులు పసుపు రంగులోకి మారతాయి. ఇటువంటి పరిస్థితిలో, పటిక నీటిని ఉపయోగించడం మొక్కకు మేలు చేస్తుంది. పటిక నీరు మట్టి  pH స్థాయిని తగ్గిస్తుంది, దీనివల్ల అది పుదీనా మొక్కకు అనుకూలంగా మారి, పోషకాలను మరింత సులభంగా గ్రహించడానికి వీలు కలుగుతుంది. క్రిమినాశకం.. పుదీనా వాసన తరచుగా కీటకాలను దూరంగా ఉంచుతుంది, కానీ కొన్నిసార్లు చీమలు , బూజు దాని వేళ్ళను ఆశించి, మొక్క దెబ్బతినేలా చేస్తాయి. ఈ సమస్యలున్నప్పుడు   మొక్కపై పటిక నీటిని చల్లవచ్చు. పటికలో యాంటీ బాక్టీరియల్  యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి, ఇవి మొక్కను కీటకాలు, బూజు , చీమల నుండి రక్షించడంలో సహాయపడతాయి. పెరుగుదల.. కొన్నిసార్లు, మొక్కలకు సరైన పోషకాలు అందకపోవడం వల్ల ఆకుల పెరుగుదల మందగిస్తుంది. పటిక నీటిని కలపడం వల్ల ఆకులు పెద్దవిగా, పచ్చగా, , మరింత నిగనిగలాడేలా పెరగడానికి సహాయపడుతుంది. మొక్క  కొమ్మలను చిగురింపజేసి, మరింత దట్టంగా పెరగడం ప్రారంభిస్తుంది. ఎలా వాడాలి? ఒక లీటరు శుభ్రమైన నీటిని తీసుకుని, అందులో ఒక పటిక ముక్కను వేయాలి. అర టీస్పూన్ పటిక పొడి వచ్చేంత ముక్కను వాడాలి. దానిని 10 నుండి 15 నిమిషాల పాటు నాననివ్వాలి. . నీరు మరీ చిక్కగా ఉండకూడదు. ఈ పటిక నీటిని పుదీనా వేర్లకు అందేలా  పోయాలి. నీటిని కేవలం మట్టికి మాత్రమే అందించాలి.                                 *రూపశ్రీ.
వేసవి కాలంలో దాదాపు ప్రతి ఇంట్లో కూలర్‌ను ఉపయోగిస్తారు, ఏసీ పెట్టించుకోలేని మధ్యతరగతి,  దిగువ తరగతి వారికి కూలర్ వాడకం ఎంతో ఉపయోగకరంగా, వేసవి నుండి ఎంతో ఉపశమనంగా కూడా ఉంటుంది.  చాలా మంది కూలర్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయడాన్ని నిర్లక్ష్యం చేస్తారు, దీనివల్ల సౌకర్యం చేకూరకపోగా ఆరోగ్య ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. కూలర్ వాడేవారు చేసే ఒకే ఒక తప్పు కుటుంబ సభ్యులకు మొత్తం ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అదేంటో.. ఎలా జాగ్రత్త పడాలో తెలుసుకుంటే.. కూలర్ ప్యాడ్లు.. కూలర్ ప్యాడ్‌ల మీద చాలా తొందరగా దుమ్ము,  ధూళి పేరుకుపోతుంది.  చాలామంది వేసవి అవ్వగానే కూలర్ ను అలా ఒకమూల పెట్టేయడం,  తిరిగి వేసవి రాగానే దాన్ని మళ్లీ వాడటం మొదలుపెడతారు. అంతేకానీ కూలర్ ప్యాడ్ ల విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోరు. మురికిగా ఉన్న కూలర్ ప్యాడ్‌లు దుమ్ము, బ్యాక్టీరియా , ఫంగస్‌కు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఈ కలుషితమైన గాలి గది అంతటా వ్యాపించినప్పుడు, అది అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. ఎవరికి ప్రమాదమంటే.. కూలర్ ప్యాడ్ లు ఇలా మురికిగా మారడం ముఖ్యంగా పిల్లలకు , వృద్ధులకు ప్రమాదకరంగా ఉంటుంది. అందువల్ల, వేసవి కాలంలో కూలర్‌లను సరిగ్గా శుభ్రపరచడం , వాటి నిర్వహణ అత్యంత ముఖ్యం. కూలర్ ప్యాడ్ లు మురికిగా మారితే కలిగే ప్రమాదాలు.. శ్వాసకోశ సమస్యలు.. మురికిగా ఉన్న కూలర్ ప్యాడ్‌లపై దుమ్ము, ధూళి , బ్యాక్టీరియా పేరుకుపోతాయి, ఇవి గాలి ద్వారా శరీరంలోకి ప్రవేశించగలవు.  దీనివల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు పెరగవచ్చు. ఇలాంటి వాతావరణంలో ఎక్కువ కాలం ఉండటం వల్ల ఊపిరితిత్తులపై కూడా ప్రభావం పడవచ్చు. అలెర్జీల ప్రమాదం.. మురికిగా ఉన్న కూలర్ ప్యాడ్‌లపై త్వరగా బూజు, శిలీంధ్రాలు పెరుగుతాయి. ఇది చర్మం , కంటిలో చికాకు, దురద ,  అలెర్జీ రియాక్షన్స్ వంటి వాటికి  కారణం అవుతాయి.  ఇప్పటికే అలర్జీ సమస్యలు ఉన్నవారికి ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారవచ్చు. దుర్వాసన, గాలి కాలుష్యం.. కూలర్‌ను చాలా కాలం పాటు శుభ్రం చేయకపోతే, దాని నుండి వచ్చే గాలిలో ఒక వింత వాసన వస్తుంది.  ఈ వాసన గది వాతావరణాన్ని అనారోగ్యకరంగా మార్చడమే కాకుండా, తలనొప్పి లేదా ఇతర అనారోగ్యాలకు కూడా కారణం కావచ్చు. ఇన్పెక్షన్.. మురికి నీరు , కలుషితమైన ప్యాడ్‌ల వల్ల కూలర్‌లో బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. ఇవి గాలి ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్‌కు కారణమవుతాయి, దీంతో జ్వరం , ఇతర వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఎవరికి ఎక్కువ ప్రమాదం.. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన పిల్లలు , వృద్ధులు,  అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నవారు  మురికిగా ఉండే చల్లని గాలి వల్ల ఎక్కువగా ప్రభావితమవుతారు. దీనివల్ల వారికి శ్వాసకోశ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వారి గదిలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.                    *రూపశ్రీ.
నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో చాలా మంది చేసే అతిపెద్ద తప్పు – ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ (టిఫిన్) మానేయడం. ఆఫీసులకో, కాలేజీలకో వెళ్లే తొందరలోనో.. లేదా బరువు తగ్గిపోతామనే అపోహతోనో చాలా మంది ఉదయపు ఆహారాన్ని పూర్తిగా స్కిప్ చేస్తుంటారు. కానీ, ఇలా చేయడం వల్ల బరువు తగ్గడం పక్కన పెడితే.. మీరు మరింత వేగంగా లావెక్కిపోయే (Overweight) ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ప్రముఖ సీనియర్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ డాక్టర్ పి. జానకి శ్రీనాథ్.  ప్రత్యేక వీడియోలో ఆమె మాట్లాడూతూ.. ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ మానేయడం వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి, అది ఊబకాయానికి ఎలా దారితీస్తుందో ఈ VIDEO లో సరళంగా వివరించారు. 1. మెటబాలిజం (జీర్ణక్రియ) నెమ్మదిస్తుంది: రాత్రంతా నిద్రపోవడం వల్ల దాదాపు 8 నుండి 10 గంటల పాటు మన శరీరం ఉపవాసంలో (Fasting) ఉంటుంది. అందుకే ఉదయం తీసుకునే ఆహారాన్ని 'బ్రేక్-ఫాస్ట్' (ఉపవాసాన్ని విరమించడం) అంటారు. ఉదయాన్నే ఆహారం తీసుకోకపోతే, శరీరం ఎనర్జీని ఆదా చేయడం కోసం మెటబాలిజం రేటును తగ్గించేస్తుంది. దీనివల్ల క్యాలరీలు త్వరగా కరగవు. 2. మితిమీరిన ఆకలి – ఓవర్ ఈటింగ్ (Overeating): ఉదయం టిఫిన్ మానేయడం వల్ల మధ్యాహ్న సమయానికి ఆకలి విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల లంచ్ టైమ్‌లో మనకు తెలియకుండానే ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని, ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే పదార్థాలను తినేస్తాము. ఈ క్రమంలో శరీరం అవసరానికి మించి క్యాలరీలను స్టోర్ చేసుకుని, కొవ్వుగా మారుస్తుంది. 3. జంక్ ఫుడ్స్ వైపు మొగ్గు: బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోవడం వల్ల, ఉదయం 11 గంటల సమయంలో చిప్స్, బిస్కెట్లు, సమోసాలు లేదా టీ/కాఫీ వంటి అన్‌హెల్తీ స్నాక్స్ వైపు మనసు మళ్లుతుంది. ఇవి శరీరంలో కొవ్వును పెంచడానికి ముఖ్య కారణాలు. 4. నీరసం, ఏకాగ్రత లోపించడం: మెదడు సజావుగా పనిచేయడానికి గ్లూకోజ్ అవసరం. బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే రోజంతా నీరసంగా ఉండటంతో పాటు, పనులపై శ్రద్ధ పెట్టడం కష్టమవుతుంది. ఆరోగ్యంగా, స్లిమ్‌గా ఉండాలనుకునే వారు ఉదయం పూట ప్రోటీన్లు, ఫైబర్ (పీచుపదార్థం) ఎక్కువగా ఉండే ఇడ్లీ, ఉప్మా, మొలకెత్తిన గింజలు లేదా ఓట్స్ వంటి పోషకాహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు డైట్ కంట్రోల్ చేయాల్సింది రాత్రి పూట మాత్రమే, ఉదయం కాదు అని డాక్టర్ జానకి శ్రీనాథ్ స్పష్టం చేశారు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పదం నౌతప.. నౌతప అంటే తొమ్మిది రోజుల పాటు ఉండే ప్రమాదకరమైన వేడి వాతావరణం.  గత ఒకటి రెండు నెలలుగా వేసవి కాలం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. వడగాలులు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ఈ  వడగాలులు మరింత తీవ్రతరం కాబోతున్నాయి. నౌతప ఎంటర్ అయ్యింది. ఇది మే 25న ప్రారంభమై, జూన్ 2వ తేదీ వరకు కొనసాగుతుంది. నౌతప అంటే తొమ్మిది రోజుల పాటు ఉండే ప్రమాదకరమైన వేడి వాతావరణం. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ రోజులలో గ్రహాల స్థానాలు అనుకూలంగా ఉండటం వల్ల సూర్యకిరణాలు నేరుగా భూమిపై పడతాయట, దీనివల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంటున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..  నౌతప అంటే తొమ్మిది రోజుల పాటు ఉండే ప్రమాదకరమైన వేడి వాతావరణం. నౌతప అనేక విధాలుగా అవసరమైనదనే చెబుతారు. ఇది పొలాల్లోని హానికరమైన కీటకాలను, తెగుళ్లను నాశనం చేసి, పంట నష్టాన్ని నివారిస్తుంది, ఈ తొమ్మిది రోజులు ఆరోగ్య పరంగా చాలా సవాలుగా ఉంటాయి. ఇప్పటికే తీవ్రంగా ఉన్న వేడికి తోడు ఈ తొమ్మిది రోుల  సమయంలో ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశం ఉంది, ఇది వడదెబ్బ , డీహైడ్రేషన్ వంటి సమస్యలను తీవ్రతరం చేస్తుంది. అనేక ప్రాంతాలలో నౌతప సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణంగా 45 డిగ్రీల సెల్సియస్‌ను మించిపోతాయి, ఇది శరీరంలోని అనేక భాగాలపై ప్రమాదకరమైన ప్రభావాలను కలిగిస్తుంది. ఇప్పుడు ఈ రోజుల్లో  ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనేదే పెద్ద ప్రశ్న. నౌతప సమయంలో అనారోగ్యం బారిన పడకుండా ఉండటానికి ఏమి చేయాలి, ఏమి చేయకూడదు? తెలుసుకుంటే.. ఆరోగ్య నిపుణుల అబిప్రాయం.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, నౌతప అందరికీ ప్రమాదకరమైనప్పటికీ, పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు,  ముందు నుంచే గుండె మరియు మధుమేహం వంటి సమస్యలు ఉన్నవారు ఈ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక శరీర ఉష్ణోగ్రతల వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం పెరుగుతుంది, ఇది ప్రాణాంతకం కూడా కావచ్చని వైద్యులు చెబుతున్నారు. వడదెబ్బ , ఎండదెబ్బ, శరీరంలో నీటి శాతం కోల్పోవడం, అలసట, నిద్ర సమస్యలు , చిరాకును గణనీయంగా పెంచుతాయి. తీవ్రమైన వేడి కారణంగా ప్రతి సంవత్సరం వేలాది మంది మరణిస్తున్నారు. ఈ తొమ్మిది రోజుల కాలం గుండె , మూత్రపిండాల రోగులకు ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. తీవ్రమైన వేడి కారణంగా గుండె దడ , గుండెపోటు వచ్చే ప్రమాదం పెరగవచ్చు. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? నౌతప సమయంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీరు , ఎలక్ట్రోలైట్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం, ఎండకు దూరంగా ఉండటం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చిన్నపాటి అజాగ్రత్త కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. పిల్లలు, వృద్ధులు , గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే వారి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే సామర్థ్యం బలహీనంగా ఉంటుంది. వడదెబ్బ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి, మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లడం మానుకోవాలి. ఈ సమయంలో లేత రంగు దుస్తులు ధరించడం, పుష్కలంగా నీరు త్రాగడం , శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా అవసరం. ఈ తొమ్మిది రోజులు ఇవి తప్పనిసరిగా చేయాలి.. వడదెబ్బ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి దాహం వేయకపోయినా రోజంతా పుష్కలంగా నీరు త్రాగడం చాలా అవసరం. నీటితో పాటు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ , ఓఆర్ఎస్ (ORS) తాగాలి. ఇవి శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడటానికి సహాయపడతాయి. తేలికపాటి భోజనం చేయడం ఉత్తమం. పుచ్చకాయ, దోసకాయ, కర్బూజా , పెరుగు వంటి ఆహారాలు శరీరాన్ని చల్లబరచడానికి సహాయపడతాయి. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ లేదా టవల్ ఉపయోగించాలి. ఈ తొమ్మిది రోజులు ఏం చేయకూడదు? తీవ్రమైన ఎండలో బయటకు వెళ్లడం మానుకోవాలి, ఖాళీ కడుపుతో బయటకు వెళ్లకూడదు. ఏదైనా పని మీద బయటకు వెళ్లాల్సి వస్తే, శరీరాన్ని పూర్తీగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి.  అలాగే గొడుగు వాడాలి. అధికంగా టీ, కాఫీ , మద్యం తీసుకోవడం వల్ల శరీరంలో నీటి కొరత పెరగవచ్చు. కాబట్టి వాటిని చాలా తగ్గింతాలి. మూసివున్న, వేడి గదిలో ఎక్కువసేపు ఉండటం కూడా ప్రమాదకరం. అధిక జ్వరం, తల తిరగడం, స్పృహ కోల్పోవడం, వాంతులు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే,  వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇవి వడదెబ్బకు సంకేతాలు కావచ్చు.                                       *రూపశ్రీ.