LATEST NEWS
ప్రధాని నరేంద్రమోడీ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నారా?  ప్రస్తతం ఉన్న కేబినెట్ నుంచి కనీసం పాతిక మందికి ఉద్వాసన పలకనున్నారా? అన్న చర్చ ఢిల్లీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. ఈ ఊగాహానాల నేపథ్యంలో గురువారం (మే 21) జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మోడీ మంత్రివర్గంలోని కనీసం పాతిక మంది మంత్రులకు ఇదే చివరి కేబినెట్ సమావేశం అవుతుందని విశ్వసనీయంగా తెలుస్తోంది. గత కొంత కాలంగా ప్రదాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ లో పనితీరు సరిగా లేని వారికి ఉద్వాసన పలికి,  కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. ఆ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తయ్యిందని కూడా చెబుతున్నారు. కేవలం పని తీరు మాత్రమే కాకుండా.. ఆరోపణలు, వ్యక్తిగత వ్యవహారశైలి కూడా పరిగణనలోనికి తీసుకుని ప్రస్తుతం ఉన్న మంత్రులలో కొందరిపై వేటు వేసే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత మంత్రివర్గ సమావేశంలో మంత్రుల, శాఖల పనితీరుపై సమీక్షించే అవకాశం ఉందని అంటున్నారు.    కేబినెట్ విస్తరణ ఊహాగానాలతో పాటు దేశ ఆర్థిక, భద్రతా వ్యవహారాలు కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.  పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ పరిస్థితుల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రభావంపై  చర్చించనున్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల ప్రభావం దేశ ప్రజలపై అతి తక్కువగా పడేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై ప్రధాని మోదీ మంత్రులకు, ఆయా విభాగాలకు దిశానిర్దేశం చేయనున్నారు.  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ విశ్లేషకుడు  ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు   తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీజేపీకి వైసీపీ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అనీ, టీడీపీ కేవలం ఇన్స్టంట్ ఫ్రెండ్ మాత్రమేనంటూ ఆయన సరికొత్త థియరీని తెరపైకి తెచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కలిసినప్పుడు ఈ విషయం చర్చకు వచ్చిందని, జనసేన కోర్ కమిటీ ద్వారా ఈ సమాచారం తనకు తెలిసిందని నాగేశ్వర్ పేర్కొనడం సంచలనంగా మారింది. దీనిపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్  తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన  ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలను పూర్తిగా కొట్టిపారేశారు.   ప్రొఫెసర్ నాగేశ్వర్ విజ్ణత కోల్పోయి మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు.   తెలుగు దేశం, బీజేపీ  బంధం నిన్న మొన్నటిది కాదనీ..  1984లో ఎన్టీ రామారావు హయాం నుంచే రెండు పార్టీల మధ్య బలమైన రాజకీయ ప్రస్థానం మొదలైందని గుర్తు చేశారు. నాలుగు దశాబ్దాలకు  పైగా ఉన్న ఈ సుదీర్ఘ అనుబంధాన్ని ఇన్స్టంట్ ఫ్రెండ్ షిప్ అనడం నాగేశ్వర్ అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. కూటమిలో   వైరుధ్యాలు లేవని, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లి విలువైన సమయం గడపడమే ఇందుకు నిదర్శనమని అప్పసాని రాజేష్ అన్నారు.   ఒకరి కాళ్ళ దగ్గర మాటలను తాకట్టు పెట్టి, వారు విసిరే ఎంగిలి మెతుకుల కోసం కొందరు కిరాయి రాజకీయ విశ్లేషకులుగా మారారని నాగేశ్వర్ ఉద్దేశించి అప్పసాని రాజేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్  జై ఆంధ్రప్రదేశ్' అని అనడాన్ని కూడా నాగేశ్వర్ తప్పుగా వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రాంతీయ, కుల విభేదాలను రూపుమాపి సమైక్యతను తీసుకురావడానికే జనసేనాని ఆ నినాదం ఇచ్చారని స్పష్టం చేశారు.  వైసీపీ   హయాంలో మూడు రాజధానుల వివాదం వచ్చినప్పుడే  జై అమరావతి నినాదం ప్రాధాన్యత సంతరించుకుందని, రాష్ట్రం మొత్తాన్ని ఉద్దేశించినప్పుడు  జై ఆంధ్రప్రదేశ్ అనడంలో తప్పేముందని ప్రశ్నించారు. అమరావతి అనేది ఐదు కోట్ల ప్రజల రాజధాని అన్న అప్పసాని రాజేశ్..  అది కేవలం టీడీపీకి మాత్రమే పరిమితమైనది కాదన్నారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూడకుండా కేవలం అమరావతిపైనే నిధులు కుమ్మరిస్తున్నారనడం అబద్ధమని తోసిపుచ్చారు. గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీని కేవలం 11 సీట్లకే ఎందుకు పరిమితం చేశారో ఇలాంటి సోకాల్డ్ ప్రొఫెసర్లకు అర్థం కావడం లేదన్నారు. కూటమి ప్రభుత్వంపై విద్వేషాలు చొప్పించేందుకు జరుగుతున్న ఇటువంటి ఎజెండా బేస్డ్ ప్రచారాలను ప్రజలు నమ్మరనీ, భవిష్యత్తులో వీరికి తగిన బుద్ధి చెబుతారని అప్పసాని అన్నారు.    
జనసేన నాయకుడు ఎమ్మెల్సీ నాగబాబు రాజ్యసభకు వెళ్లనున్నారా? అందు కోసం తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా? ఆయన రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డితో భర్తీ చేయనున్నారా?   అన్న చ‌ర్చ ఇప్పుడు రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది.   ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ప్రచారం ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా మారింది. వైసీపీని వీడి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి తగిన ప్రాధాన్యత ఇస్తామని పవన్ కళ్యాణ్ గతంలో హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ తెరపైకి వస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు..  పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేనకు దక్కే రాజ్యసభ సీటు ద్వారా  నాగబాబును ఢిల్లీకి పంపించి, జాతీయ స్థాయిలో పార్టీ వాయిస్‌ను వినిపించేలా చేయాలన్న‌ ఆలోచనలో జ‌న‌సేన‌ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.  మాములుగా అయితే జ‌న‌సేన  త‌ర‌ఫున‌ లింగ‌మ‌నేని ర‌మేష్ ని రాజ్య‌స‌భ‌కు పంపుతారని అంతా భావిస్తున్నారు. ఈ మేరకు జనసేనాని ఆయనకు గతంలో హామీ కూడా ఇచ్చారని చెబుతున్నారు. ప్రస్తుతం లింగమనేని రామేష్ ను కాదని నాగబాబును రాజ్యసభకు పంపేయోచన చేస్తున్నారని అంటున్నారు.  ఇప్ప‌టికే నాగాబు జ‌బ‌ర్ద‌స్త్ స్టేజ్ పైకి  రీ ఎంట్రీ ఇచ్చారు. మ‌ళ్లీ  ఆయ‌న ఢిల్లీ పాలిటిక్స్ లోకి  ఎంట్రీ ఇస్తే ఈ వినోద కార్య‌క్ర‌మాల‌కు ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది.  ఇక ఢిల్లీలో చ‌క్రం తిప్పేంత  సామర్థ్యం నాగ‌బాబుకు ఉందా? అన్న చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. ఢిల్లీ రాజకీయాలలో చురుకుగా, క్రియాశీలంగా ఉండి, పార్టీ వాయిస్ వినిపించాలంటే.. భాష చాలా ముఖ్యం. మరి హిందీ భాషలో నాగబాబు ప్రావీణ్యం ఎంత అన్న సందేహం వ్యక్తమౌతోంది.  ఇక రాష్ట్ర రాజ‌కీయాల్లోనే  నాగ‌బాబు త‌న కార్య‌క‌ర్త‌లు అడిగే  ప్ర‌శ్న‌ల‌కు తిక‌మ‌క ప‌డుతుంటారు. నాదెండ్ల మ‌నోహ‌ర్ ఈ  విష‌యంలో నాగ‌బాబును బాగా త‌ప్పు ప‌డుతుంటార‌నీ పార్టీ వర్గాల్లోనే ఒక అభిప్రాయం ఉంది.  మ‌రి  అలాంటి  నాగ‌బాబు జాతీయ స్థాయిలో రాణింపు సాధ్య‌మ‌య్యే ప‌నేనా? అన్న సందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి.  ఇక  ఇటు ఒంగోలు రీజియన్‌లో బలమైన నాయకుడిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరినప్పటి నుంచి ఆయనకు ఎలాంటి పదవి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. నాగబాబు గనుక ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్తే..  ఖాళీ అయ్యే ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని కూటమి తరఫున బాలినేనికి కేటాయించే అవకాశం ఉంది.  ఇక్క‌డింకో విచిత్ర‌మైన ప‌రిస్థితి  ఏంటంటే  ఒంగోలు ఎమ్మెల్యే దామంచ‌ర్ల జ‌నార్ధ‌న్ తో బాలినేనికి అస్స‌లు సరిపడదు. ఇద్ద‌రూ ఒకే కూట‌మికి  చెందిన నేత‌లే అయినా ఒక‌రిపై  మ‌రొక‌రు  ఆరోప‌ణ‌లు, విమర్శలు చేసుకుంటున్నారు. బాలినేని ఇంకా వైసీపీలో ఉన్న‌ట్టే త‌న‌పై  నింద‌లు వేస్తున్నార‌ని అంటారు జ‌నార్ధ‌న్. మ‌రి ఈ స‌మ‌స్యకు  ప‌రిష్కారం ఈ ఎమ్మెల్సీ ప‌ద‌వి ద్వారా అయినా ప‌రిష్కారం దొరుకుతుందా? అన్న‌ది  తేలాల్సి ఉంది. బాలినేనికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా ఆయన అనుభవంతో ప్రకాశం జిల్లాతో పాటు ఉమ్మడి గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయవచ్చని కూటమి పెద్దలు భావిస్తున్నారు. ఇప్ప‌టికే నెల్లూరులో  జ‌న‌సేన‌కు   ఇంఛార్జ్ లేరు. బాలినేనిని మండలికి పంపడం ద్వారా ఈ స‌మ‌స్య‌ల‌న్నీ ఒక  కొలిక్కి వ‌చ్చే అవ‌కాశం ఉంటుందా? అన్న‌ది తేలాల్సిఉంది.  ఇటీవల బాలినేని, సీఎం చంద్రబాబు నాయుడితో కూడా భేటీ కావడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది.  అయితే ఇవ‌న్నీ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న సమాచారమే అయినప్పటికీ, దీనిపై జనసేన అధిష్టానం లేదా కూటమి పెద్దల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. రాబోయే రోజుల్లో దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కర్నూలులో  కేసు నమోదైంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, కర్నూలు శాసనసభ్యుడు టీజీ భరత్   ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.   మే 14న కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వైసీపీ ధ్వర్యంలో  జరిగిన  ధర్నాలో పాల్గొన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి  మంత్రి టీజీ భరత్‌పై  తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. అయితే.. ఈ నిరసనలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు సమాజంలో అలజడి సృష్టించే విధంగా ఉన్నాయని మంత్రి టీజీ భరత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా  తన వ్యక్తిగత ప్రతిష్టను, సమాజంలో ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని మంత్రి భరత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.   బైరెడ్డి వ్యాఖ్యలు కేవలం పరువు నష్టం కలిగించడమే కాకుండా, సాధారణ ప్రజానీకంలో ఒక రకమైన భయాందోళనలను రేకెత్తించేలా ఉన్నాయని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయనిపేర్కొన్నారు.  మంత్రి   ఫిర్యాదుమేరకు కర్నూలు  త్రీ టౌన్ పోలీసులు  బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కేసు నమోదు చేశారు.  
  మళ్ళీ తేర మీదకి కర్ణాటక సీఎం కుర్చీ పంచాయతీ.  ఒక రెండు మూడు రోజుల్లో ఒక వర్గం ఎంఎల్యేలు ఢిల్లీకి ప్రయాణం కావాల‌ని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏఐసీసీని పూర్తి స్థాయి ప్రక్షాళన చెయ్యాల‌నే ఆలోచన‌లో కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ఉన్న‌ట్టు స‌మాచారం. అధ్య‌క్షుడు మల్లికార్జున ఖార్గే కి ఈ మధ్యనే పేస్ మేకర్ కి సంబందించిన ఆపరేషన్ జ‌ర‌గ‌డం.. దీంతో పాటు ఆయ‌న‌ వయసు సుమారు 84 ఏళ్ళు  ఉండటం  అటు ఆరోగ్య సమస్య  ఇటు వయసు కూడ మీదికి రావడంతో కీల‌క‌  నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో విప‌రీత‌మైన జాప్యం జరుగుతోంది.  ఏఐసీసీ కొత్త‌ ప్రెసిడెంట్ కోసం కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ అన్వేషణ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. అదే సమయంలో కర్ణాటక సీఎం పంచాయతీ కూడ మ‌ళ్లీ తెర‌పైకి వచ్చింది. సిద్ధ రామయ్య- 2028 వరకు నేనే సీఎం అని స్వ‌యం ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్నారు. స‌రిగ్గా అదే సమయలో డీకే సైతం త‌న‌కూ సీఎం పోస్టు కావ‌ల్సిందేన‌ని ప‌ట్టు ప‌డుతున్నారు.   తనకు మద్దతు ఉన్న ఎమ్మెల్యేల ద్వారా ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమస్య కి పరిష్కారం ప్రస్తుత దేశ రాజకీయాల‌ను దృష్టిలో పెట్టుకొని.. సిద్ద రామయ్యనే సీఎంగా కొనసాగిస్తూ డీకే శివ కుమార్ సేవలను దేశ వ్యాప్తంగా ఉపయోగించుకోవాల‌ని కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అయినట్టు స‌మాచారం.   ప్ర‌స్తుత అధ్య‌క్షుడుమల్లికార్జున ఖర్గె ని రాజ్యసభ లో ప్రతిపక్ష‌ నేత గా కొనసాగించి.. కొత్త‌ ఏఐసీసీ ప్రెసిడెంట్ బాధ్య‌త‌లు.. డీకే శివ కుమార్ కి అప్ప చెప్పి.. దేశ వ్యాప్తంగా తన సేవలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాల‌ని కాంగ్ర‌స్ అధిష్టానం డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.  డీకే చేత ఎమ్మెల్యే పదవి, పీసీసీ పదవికి కూడా రాజీనామా చేయించి.. ఆయ‌న వ‌దులుకున్న‌ ఎమ్మెల్యే పదవిని శివ కుమార్ తమ్ముడు- సురేష్ కి అప్పజెప్పేలా క‌నిపిస్తోంది. పీసీసీ పదవిని  ఇక్కడ ఎవరికో ఒకరికి- పార్టీ సీనియర్ నాయకుడికి అప్పచెప్పాల‌ని కూడా కాంగ్రెస్ హై కమాండ్ ఆలోచిస్తున్న‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ నుంచి వస్తున్న ఈ సమాచారం నిజంగానే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు వ్యూహాలకు సంబంధించిన సంచలన, అత్యంత వ్యూహాత్మక పరిణామంగా చెప్పవచ్చు. ఈ  ఒక్క నిర్ణయంతో కాంగ్రెస్ హైకమాండ్ అటు కర్ణాటక సీఎం పీఠం వివాదానికి శాశ్వత పరిష్కారం చూపడమే కాకుండా, ఇటు జాతీయ స్థాయిలో ఏఐసీసీ కి ఒక పవర్‌ఫుల్, యంగ్ అండ్ డైనమిక్ లీడర్‌షిప్‌ను తీసుకురావాలని చూస్తోంది. ఈ మొత్తం పొలిటికల్ ఈక్వేషన్‌ను లోతుగా పరిశీలిస్తే, కాంగ్రెస్ అధిష్టానం ఒకే దెబ్బకు మూడు పిట్టలను కొట్టేలా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది.   ఖర్గేకి 84 ఏళ్లు పైబడటం, ఇటీవల పేస్‌మేకర్ ఆపరేషన్ జరగడం వల్ల ఆయనపై జాతీయ స్థాయి పార్టీ బాధ్యతల భారాన్ని తగ్గించడం ఇటు రాజకీయంగా, అటు మాన‌వీయ కోణంలో చూసినా అవసరంగా క‌నిపిస్తోంది. అయితే ఆయనకున్న సీనియారిటీ, గౌరవాన్ని కాపాడుతూ ఆయన్ను రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కొనసాగించడం ద్వారా పార్లమెంట్‌లో పార్టీ పట్టు చేజారకుండా చూసుకోవచ్చ‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు. కర్ణాటకలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య సీఎం కుర్చీ కోసం జరుగుతున్న అంతర్గత పోరు  మ‌రీ ముఖ్యంగా కేబినెట్ మార్పులు, కొందరు ఎమ్మెల్యేల ఢిల్లీ పర్యటనల నేపథ్యంలో.. పార్టీకి తలనొప్పిగా మారింది. సిద్ధరామయ్య ప్లస్ పాయింట్స్ ఏంటో చూస్తే,  వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీల.. ఓటు బ్యాంకుపై సిద్ధరామయ్యకు ఉన్న పట్టును కాంగ్రెస్ వదులుచుకోలేదు. ఆయన్ను 2028 ఎన్నికల వరకు సీఎంగా ఉంచడం ద్వారా కర్ణాటక ప్రభుత్వ స్థిరత్వానికి ఢోకా ఉండద‌ని భావిస్తోంది హ‌స్తం పార్టీ. ఇక డీకే శివకుమార్‌కు కేవలం కర్ణాటక డిప్యూటీ సీఎం పదవి చాలా చిన్నది. ఆయనకున్న  ట్రబుల్ షూటర్ ఇమేజ్, ఆర్గనైజేషనల్ స్కిల్స్,  ఆర్థిక వనరులను సమకూర్చగల సామర్థ్యం.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చాలా చాలా అవసరం. ఆయన్ను నేరుగా ఏఐసీసీ ప్రెసిడెంట్  చేయడం ద్వారా దేశవ్యాప్తంగా క్యాడర్‌లో కొత్త ఉత్సాహం కూడా  నింపిన‌ట్టు అవుతుంది. డీకే శివకుమార్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే ఆయన ఎమ్మెల్యే పదవికి, కర్ణాటక పీసీసీ  అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ గ్యాప్‌ను భర్తీ చేయడానికి ఆయన తమ్ముడు, మాజీ ఎంపీ అయిన డీకే సురేష్‌ను అసెంబ్లీకి పంపడం ద్వారా కనకపుర నియోజకవర్గంలో డీకే ఫ్యామిలీ పట్టు అలానే ఉంటుంది. పీసీసీ పదవిని డీకే వర్గానికి చెందిన లేదా సిద్ధరామయ్యకు నమ్మకస్తుడైన ఒక సీనియర్ నేతకు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో సమతుల్యత  దెబ్బతినకుండా చూసుకోవచ్చు. ఈ వ్యూహం సక్సెస్ అయితే కాంగ్రెస్‌కు వచ్చే లాభాలు.. ఎలాంటివో చూస్తే.. సౌత్ ఇండియా సెంటిమెంట్ బాగా వ‌ర్క‌వుట్ అవుతుంది.  ఖర్గే  తర్వాత మళ్లీ సౌత్ ఇండియా.. అది కూడా కర్ణాటక నుంచే మరో పవర్‌ఫుల్ లీడర్ ఏఐసీసీ పగ్గాలు చేపట్టినట్టు అవుతుంది. ఆగ్ర‌స్సివ్ పాలిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే.. బీజేపీని వారి శైలిలోనే ఢీకొట్టడానికి డీకే శివకుమార్ లాంటి దూకుడున్న నాయకుడు ఏఐసీసీ చీఫ్‌గా పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ కుర్చీ లాటరీకి ఎండ్ కార్డ్ పడితే, సిద్ధరామయ్య ప్రభుత్వం పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టవచ్చు. ఈ ఢిల్లీ లీక్స్  గనుక నిజమైతే, రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంతర్గత నిర్మాణంలో చాలా పెద్ద మార్పులు చూడబోతున్నాం. డీకే శివకుమార్ జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో కలిసి పార్టీని ఏ మేరకు ముందుకు నడిపిస్తారనేది అత్యంత ఆసక్తికరం!
ALSO ON TELUGUONE N E W S
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించేందుకు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మరోసారి సిద్ధమయ్యారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత, డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక 158వ చిత్రం ‘మెగా 158’ అత్యంత వైభవంగా ప్రారంభమైంది.  (Mega 158 Launch) హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్ర పూజా కార్యక్రమానికి సంబంధించిన విశేషాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ గ్రాండ్ లాంచ్ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు కలిసి హాజరుకావడం మెగా అభిమానులకు కంటినిండా ఆనందాన్ని ఇచ్చింది. మెగా బ్రదర్స్ ముగ్గురిని ఒకే ఫ్రేమ్‌లో చూసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా పండగ చేసుకుంటున్నారు.  ఈ భారీ ప్రాజెక్టు ప్రారంభంతోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే, ఈ ఓపెనింగ్ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించిన మరో ముఖ్యమైన విశేషం చిత్రంలో నటిస్తున్న ఒక యువ నటి. మలయాళ చిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన నటనతో అనతికాలంలోనే విశేష గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ అనశ్వర రాజన్ (Anaswara Rajan) ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుగులో గతంలో ‘చాంపియన్’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ కేరళ కుట్టి, ఇప్పుడు టాలీవుడ్‌లో ఒకేసారి మెగాస్టార్ సినిమాలో అత్యంత ప్రాధాన్యత కలిగిన భారీ ఆఫర్‌ను సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రంలో అనశ్వర రాజన్ పాత్ర సాధారణమైనది కాదు, కథ మొత్తాన్ని మలుపు తిప్పే అత్యంత కీలకమైన పాత్ర అని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మొదటి నుంచి ‘మెగా 158’ చిత్రం ఒక బలమైన కూతురు సెంటిమెంట్‌తో కూడిన కథాంశంతో తెరకెక్కనుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఈ క్రమంలోనే మెగాస్టార్ కూతురి పాత్ర కోసం టాలీవుడ్ మరియు సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖ యంగ్ హీరోయిన్ల పేర్లు కూడా గట్టిగా వినిపించాయి. చివరకు ఆ లక్కీ ఛాన్స్‌ను అనశ్వర రాజన్ దక్కించుకోవడం విశేషం.  సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, అనశ్వర రాజన్ మధ్య వచ్చే తండ్రీకూతుళ్ల ఎమోషనల్ సీన్స్ హృదయాలను కదిలించేలా ఉంటాయని, ఇవే ఈ సినిమాకు ప్రధాన హైలైట్ అని టాక్ నడుస్తోంది. ఒక వైపు కమర్షియల్ ఎలిమెంట్స్ చూపిస్తూనే, మరోవైపు బాబీ కొల్లి ఈ సెంటిమెంట్‌ను అద్భుతంగా పండించబోతున్నట్లు తెలుస్తోంది.  మరి ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి-బాబీ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో, ఈ ఎమోషనల్ సెంటిమెంట్ డ్రామా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.   https://x.com/Theteluguone/status/2057336205029843119
Director Prashanth Neel has shared the extreme physical toll Jr. NTR underwent for his upcoming film, Dragon. Cast as an Afghanistan-based assassin, NTR was asked to drop significant weight to achieve a lean visual. However, the actor pushed his body beyond the initial requirement, shedding over 15 kilos and looking pale and physically weak. The drastic change caused distress among his family and the production crew. Neel revealed that NTR's wife, his mother, and the entire Dragon unit were upset with the filmmaker for initiating this grueling transformation. Observing the severe impact on the actor's health, Neel personally intervened and asked him to stop the extreme regimen. Despite the director's request, NTR refused to halt the process and persisted until he exactly mirrored the assassin concept they had designed. Fans loved his dedication for the role but felt his previous avatars in RRR and Aravinda Sametha were much better.  Audiences on social media expressed a similar point, noting that the actor looked too lean and unrecognizable in the recent glimpse. While the dedication is great, maybe he pushed himself a bit too much.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Chiranjeevi's 158th film is officially underway. Following the success of Waltair Veerayya, the veteran actor is reuniting with director Bobby Kolli for a new action drama produced by Venkat K Narayana under KVN Productions. The project, tentatively titled #Mega158, was formally launched today in Hyderabad with a traditional pooja ceremony. The event saw a notable turnout from the Telugu film industry, with Pawan Kalyan attending as the chief guest to sound the first clapboard. Sushmita Konidela switched on the camera, while filmmaker VV Vinayak directed the honorary first shot. Veteran directors B. Gopal and Kondarami Reddy, along with Nagababu, presented the script to the team. Billed as a large-scale commercial entertainer, the film will reportedly feature Chiranjeevi in a physically demanding role, which aligns with the intense fitness training videos he recently shared on social media. Malayalam actor Anaswara Rajan has been officially cast in a prominent role, bringing fresh talent to the ensemble. The core technical team comprises S Thaman handling the music composition and Vijay Karthik Kannan taking charge of the cinematography. With pre-production formalities now complete, principal photography is scheduled to begin tomorrow in Hyderabad. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
సోషల్ మీడియా ప్రపంచంలో ఒకే ఒక్క డైలాగ్‌తో రాత్రికి రాత్రే స్టార్‌డమ్ సంపాదించుకుని, కోట్లాది మంది గుండెల్లో నిలిచిపోయిన ‘కుర్చీ మడతపెట్టి’ తాత ఇకలేరు. తనదైన మాస్ డైలాగ్‌తో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న మహ్మద్ పాషా (64) కన్నుమూశారు. (Kurchi Madathapetti Thatha) కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ కృష్ణకాంత్ పార్కులో మహ్మద్ పాషా ప్రతిరోజూ లాగే వాకింగ్ చేయడానికి వెళ్లారు. అయితే, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయన నడుస్తూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. స్థానికులు గమనించి కాపాడేలోపే ఆయన ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలోనే తీవ్రమైన వడదెబ్బ (సన్‌స్ట్రోక్) కారణంగానే మహ్మద్ పాషా మృతి చెందినట్లు వైద్యులు, కుటుంబ సభ్యులు ధృవీకరించారు. 64 ఏళ్ల వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా కనిపించే ఆయన, ఇలా వడదెబ్బకు బలికావడం అందరినీ కలచివేస్తోంది. మహ్మద్ పాషా పేరు చెబితే ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు కానీ, ‘కుర్చీ మడతపెట్టి’ తాత అంటే తెలియని తెలుగువాడు ఉండడు. ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆయన అన్న ఆ ఒక్క మాట ఇంటర్నెట్‌ను ఊపేసింది. ఆ డైలాగ్ ఎంతలా వైరల్ అయిందంటే.. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమాలో ఆ డైలాగ్‌తో ఒక ప్రత్యేకమైన సాంగ్ నే డిజైన్ చేశారు. థమన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘కుర్చీ మడతపెట్టి’ పాట ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది.  ‘కుర్చీ మడతపెట్టి’ తాత మరణవార్త తెలియగానే సినీ ప్రముఖులతో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, నెటిజన్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ‘మీరు లేకపోయినా మీ డైలాగ్ ఎప్పటికీ సజీవంగా ఉంటుంది తాత’ అంటూ సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు.   
Mohanlal’s Drishyam 3 has reportedly achieved a rare box office milestone by recovering its budget even before the first show. Released on the actor’s 66th birthday, the Jeethu Joseph directorial is said to have crossed breakeven entirely through advance sales. Made on a controlled budget of around Rs.15 crores, the third instalment of the thriller franchise has already generated nearly Rs.27 crores gross in worldwide pre-sales, translating to an estimated distributor share of Rs.16.5 crores. The franchise hype played a major role in driving the numbers, with more than 3.34 lakh tickets sold on BookMyShow ahead of release. For a content-driven suspense thriller with no dependence on extravagant action set pieces or visual spectacle, the advance booking response underlines the strong audience trust the Drishyam brand has built over the years. What makes the achievement stand out further is the financial planning behind the film. Mohanlal reportedly chose a profit-sharing model and ensured the production stayed within the requirements of the script instead of inflating costs unnecessarily. At a time when several star-driven projects are struggling under massive budgets, Drishyam 3 appears to have prioritized writing, execution, and controlled spending. The contrast becomes sharper when viewed alongside Patriot, the heavily mounted Mahesh Narayanan film that brought Mohanlal and Mammootty together this year. Despite enormous pre-release hype and the appeal of seeing the two legends share screen space, the film failed to sustain momentum at the box office, with criticism largely directed at its execution and pacing. Ironically, the same Malayalam industry that delivered one of the year’s biggest disappointments in terms of scale has also produced a film that reportedly recovered its investment before release simply through audience trust in its story and franchise value. That versatility and adaptability is exactly why veterans like Mohanlal and Mammootty continue to stay relevant across generations. Perhaps stars from other industries should take note too — sometimes all a film really needs is a strong script, disciplined budgeting, and confidence in storytelling instead of hundreds of crores spent on noise, hype, and slow-motion entries.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) పుట్టినరోజు సందర్భంగా నిన్న(మే 20) అభిమానులు చేసిన సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా "సీఎం ఎన్టీఆర్" నినాదాలతో ఆన్ లైన్ లోనూ, ఆఫ్ లైన్ లోనూ మోతమోగించారు. దీంతో ఆయన రాజకీయ అరంగేట్రంపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.  ఈ క్రమంలో రీసెంట్ గా 'తెలుగువన్'కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తారక్ పొలిటికల్ ఎంట్రీపై ప్రముఖ కమెడియన్ రఘు కారుమంచి (అదుర్స్ రఘు) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయ్యారని, ఎన్టీఆర్ కూడా ఇప్పుడు పాలిటిక్స్ లోకి రావాలని కోరుకోవడం కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వేరొకరిని చూసి రాజకీయాల్లోకి వస్తే అది ‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లే’ అవుతుందని రఘు వ్యాఖ్యానించారు. (Raghu Karumanchi Interview) తెలుగువన్ ఇంటర్వ్యూలో రఘు మాట్లాడుతూ.. "దళపతి విజయ్ దాదాపు 35 ఏళ్ల సినీ ప్రస్థానంలో 69 సినిమాలు పూర్తి చేసిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఎన్టీఆర్ కేవలం 20 ఏళ్ల కెరీర్‌లో 30 సినిమాలు మాత్రమే చేశారు. ప్రస్తుతం తారక్ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉంది. అందుకే ఆయన పాలిటిక్స్‌లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు, అందులో తప్పులేదు. కానీ ఆయన మనసులో ఏముందో మనకు తెలియదు. ఎన్టీఆర్ భవిష్యత్తులో సొంతంగా పార్టీ పెడతారా? లేక ఉన్న పార్టీ బాధ్యతలు తీసుకుంటారా? అసలు వస్తారా రారా? అనేది తెలియకుండా ఇప్పుడే జడ్జిమెంట్స్ ఇవ్వడం అనవసరం. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని నేను కూడా కోరుకుంటాను. కానీ, ఎవరో వచ్చారని ఎన్టీఆర్ ను రమ్మనడం కరెక్ట్ కాదు. అది ‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లే’ అవుతుంది" అని అన్నారు. తారక్ ఎప్పుడు పాలిటిక్స్‌లోకి వచ్చినా విజయ్ తర్వాత అంతటి చరిత్ర సృష్టించేది ఆయనేనని రఘు స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతానికైతే ఆయన్ను ప్రశాంతంగా సినిమాలు చేసుకోనివ్వాలని కోరారు. ఎన్టీఆర్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ రఘు ఎమోషనల్ అయ్యారు. 'ఆది సినిమా సమయం నుంచే తారక్‌తో తనకు బలమైన బంధం ఉందని, అన్న కోసం ప్రాణాలైనా ఇస్తానని రఘు అన్నారు. రఘు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. మరిన్ని ఆసక్తికర ఇంటర్వ్యూల కోసం తెలుగువన్ (TeluguOne) యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.   https://x.com/Theteluguone/status/2056620453817655445
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'దృశ్యం 3' (Drishyam 3) గురువారం (మే 21, 2026) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి విడుదలైంది. మోహన్‌లాల్ పుట్టినరోజు రోజే ఈ సినిమా రిలీజ్ కావడంతో థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం అంబరాన్నంటింది. ఉదయం ఆట నుంచే కేరళతో పాటు దేశవ్యాప్తంగా థియేటర్లలో 80 శాతానికి పైగా (80% Occupancy) అక్యుపెన్సీతో ఈ చిత్రం సంచలనం సృష్టిస్తోంది. జార్జ్‌కుట్టి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే మూడో పోరాటం ఎలా ఉందో తెలుసుకోవాలనే ఆరాటంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. మొదటి రోజే బుక్ మై షోలో ఏకంగా 3,34,000 కి పైగా టికెట్ల సేల్స్ సాధించి అత్యధిక ప్రీ-సేల్స్ సాధించిన రెండో మలయాళ చిత్రంగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. (Drishyam 3 Twitter Review) మొదటి ఆట చూసిన ప్రేక్షకులు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తమ రివ్యూలను పంచుకుంటున్నారు. వారి అభిప్రాయం ప్రకారం, జీతూ జోసెఫ్ మరోసారి తన మార్క్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను అబ్బురపరిచారు. సినిమా ఫస్టాఫ్ అంతా ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాతో సాగుతూ, ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక భారీ ట్విస్ట్‌తో ఊహించని మలుపు తిరుగుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం కేవలం సినిమా కాదు, ఒక అద్భుతం (Absolute Cinema) అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మోహన్‌లాల్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన ఎంట్రీ సీన్ థియేటర్లలో ఈలలు వేయించేలా ఉంది. జార్జ్‌కుట్టి క్యారెక్టర్‌లో మోహన్‌లాల్ నటన విశ్వరూపం చూపించారని, మీనా, అన్సిబా, ఎస్తేర్ అనిల్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని ప్రేక్షకులు కొనియాడారు. సినిమా సెకండ్ హాఫ్, అందునా క్లైమాక్స్ పోర్షన్స్ ఈ చిత్రానికి అసలైన ప్రాణమని ప్రేక్షకులు చెబుతున్నారు. గత రెండు భాగాల కంటే ఇందులో ట్విస్టులు, మైండ్ గేమ్స్ మరింత పీక్స్‌లో ఉన్నాయట. జార్జ్‌కుట్టికి వ్యతిరేకంగా సాగే ఒక ఇన్విజిబుల్ సైకలాజికల్ వార్ ప్రేక్షకులను సీట్ల అంచులపై కూర్చోబెడుతుంది.  వినాయక్ ఎడిటింగ్, సతీష్ కురుప్ సినిమాటోగ్రఫీ, అనిల్ జాన్సన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ను మరింత రసవత్తరంగా మార్చేశాయి. క్లైమాక్స్ చూసిన ప్రతి ఒక్కరూ నోరెళ్లబెట్టడం ఖాయమని, జీతూ జోసెఫ్ థ్రిల్లర్ల దేవుడు అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. మొత్తం మీద 'దృశ్యం 3' బ్లాక్‌బస్టర్ అని, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయమని ఎక్స్ (ట్విట్టర్) టాక్ స్పష్టం చేస్తోంది.  
మెగా అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి  కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'మెగా 158' (Mega 158) పూజా కార్యక్రమాలతో గురువారం (మే 21, 2026) హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా ప్రారంభమైంది.  ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) టాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తూ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక ఓ అపురూపమైన ద్యశానికి వేదికగా నిలిచింది. మెగా పవర్ హౌస్ మొత్తం ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులకు పూనకాలు వచ్చాయి. ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌కు ఐకానిక్ మెగా బ్రదర్స్ — మెగాస్టార్ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు కలిసి హాజరై సందడి చేశారు.  గతంలో చిరు, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మళ్లీ అదే క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ సినిమా ముహూర్తపు వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి క్లాప్ కొట్టడం విశేషం.  మెగా బ్రదర్స్ ముగ్గురూ ఒకే వేదికపై పక్కపక్కన నిలబడి నవ్వుతూ కనిపించిన విజువల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. #Mega158, #KVNTeluguDebut హాష్ ట్యాగ్‌లు నెట్టింట క్షణాల్లో టాప్ ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లాయి. ఈ భారీ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ కోసం మెగాస్టార్ చిరంజీవి తన లుక్‌ను పూర్తిగా మార్చేశారు. ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా కసరత్తులు చేసి, బరువు తగ్గి (Weight Loss for Mega 158) ఎంతో ఫిట్‌గా, వింటేజ్ మాస్ అవతార్‌లో కనిపించబోతున్నారు. డైరెక్టర్ బాబీ ఈసారి చిరంజీవిని మునుపెన్నడూ చూడని ఒక పవర్‌ఫుల్ అండ్ ఫెరోషియస్ క్యారెక్టర్‌లో చూపించబోతున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ఎస్.ఎస్. థమన్ (Thaman S) సంగీతాన్ని అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. వెంకట్ కె. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల నుంచే ప్రారంభం కానుంది. ఈ మెగా మాస్ ఎంటర్‌టైనర్‌ను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.   https://x.com/Theteluguone/status/2057308998953832627
భారతీయ సినీ పరిశ్రమలో మాస్ యాక్షన్ సినిమాలకు సరికొత్త కేరాఫ్ అడ్రస్‌గా మారిన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), తాజాగా తన రాబోయే సంచలనాత్మక చిత్రం 'డ్రాగన్' (Dragon) గ్లింప్స్‌తో సరికొత్త చరిత్ర సృష్టించారు. టాలెంట్, మాస్ అప్పీల్ కలగలిసిన తారక్ నటనకు, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మేకింగ్ తోడవడంతో ఈ సినిమా అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ యూట్యూబ్‌లో ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ వీడియో సంచలనం రేపింది. అభిమానుల అంచనాలకు మించి, ఊహించని రీతిలో సరికొత్త రికార్డులను తిరగరాస్తూ దూసుకుపోతోంది.  (Dragon Glimpse) కేవలం 24 గంటల వ్యవధిలోనే ఈ 'డ్రాగన్' గ్లింప్స్ ఏకంగా 64 మిలియన్లకు పైగా (64M+ Views) వ్యూస్ సాధించి, భారతదేశంలోనే అత్యధికంగా వీక్షించబడిన గ్లింప్స్‌గా (India's Most Viewed Glimpse in 24 Hours) సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ అద్భుతమైన ఘనతతో భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.  మైత్రీ మూవీ మేకర్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకాలపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు కేవలం గ్లింప్స్ తోనే ఇంతటి క్రేజ్ రావడం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒక్క రోజులో 64 మిలియన్ల వ్యూస్ మార్క్‌ను దాటడం అనేది ఎన్టీఆర్ గ్లోబల్ క్రేజ్‌కు, ప్రశాంత్ నీల్ బ్రాండ్ వాల్యూకు నిదర్శనం. సోషల్ మీడియాలో #DragonGlimpse అనే హాష్ ట్యాగ్ ఇండియాలోనే టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది.  రికార్డుల వేట ఇప్పుడే మొదలైందని, రాబోయే రోజుల్లో టీజర్, ట్రైలర్లతో ఈ చిత్రం మరిన్ని పెద్ద రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని సినిమా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ 'డ్రాగన్' సృష్టించబోయే విధ్వంసానికి ఈ గ్లింప్స్ రికార్డులు కేవలం ఒక చిన్న శాంపిల్ మాత్రమే అని నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు.  
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబోలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం 'డ్రాగన్' (Dragon). ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ యూట్యూబ్‌లో రికార్డుల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా ఎన్టీఆర్ లుక్ చూసి అభిమానులతో పాటు సినీ వర్గాల్లోనూ తీవ్రమైన చర్చ నడుస్తోంది. తారక్ మునుపెన్నడూ లేని విధంగా చాలా సన్నగా, బక్కచిక్కిపోయి కనిపించడంతో ఆయన ఆరోగ్యంపై రకరకాల పుకార్లు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ అసలు నిజాలను వెల్లడించారు. ఎన్టీఆర్ ఇంతటి కఠినమైన మేకోవర్ ట్రై చేయడానికి గల అసలు కారణాన్ని వివరిస్తూ అందరికీ క్లారిటీ ఇచ్చారు. సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్న తరుణంలో, కథలో ఎన్టీఆర్ పోషించే క్యారెక్టర్ కోసం కొంచెం బరువు తగ్గితే బాగుంటుందని తాను కేవలం ఒక చిన్న సలహా మాత్రమే ఇచ్చానని ప్రశాంత్ నీల్ పేర్కొన్నారు. అయితే తారక్ మాత్రం ఆ పాత్రపై ఉన్న పట్టుదలతో కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఏకంగా 15 కిలోల బరువు తగ్గిపోయారని (Lost 15 Kgs in 4 Months) వెల్లడించారు. ఎన్టీఆర్ అలా అకస్మాత్తుగా సన్నబడటంతో ఆయన చుట్టూ ఉన్నవారంతా తీవ్రంగా ఆందోళన చెందారని చెప్పారు. ముఖ్యంగా తారక్ భార్య లక్ష్మీ ప్రణతి, ఆయన తల్లి షాలిని, సన్నిహితులు, స్నేహితులతో పాటు ప్రశాంత్ నీల్ సొంత టీమ్ మెంబర్స్ కూడా ఈ విషయంలో నీల్‌పైనే తీవ్రంగా మండిపడ్డారని, అందరూ తననే తిట్టారని ఆయన నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ మరీ బలహీనంగా మారిపోవడంతో, తాను కూడా చాలాసార్లు బరువు తగ్గడం ఇక చాలని, ఆపేయమని స్వయంగా కోరినట్లు ప్రశాంత్ నీల్ తెలిపారు. కానీ తారక్ మాత్రం తన పాత్ర పర్ఫెక్షన్ కోసం ఎవరి మాట వినకుండా కష్టపడ్డారని కొనియాడారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ అఫ్గాన్ డ్రగ్ మాఫియా కంపెనీలో పనిచేసే ఒక భీకరమైన నరహంతకుడి (Assassin) పాత్రలో కనిపించబోతున్నారు. అటువంటి వైల్డ్ క్యారెక్టర్‌కు ఈ తరహా లీన్ లుక్ ఎంతో సహాయపడుతుందని తారక్ భావించారట. ఎన్టీఆర్ ఆరోగ్యం బాలేదని లేదా వ్యక్తిగతంగా ఏదైనా సమస్య ఉందని వస్తున్న వార్తలన్నీ ముమ్మాటికీ అబద్ధాలని, కేవలం సినిమా పాత్ర కోసం ఆయన పడిన తపన, కష్టం మాత్రమే ఇదని డైరెక్టర్ స్పష్టం చేశారు. ఇంతటి అంకితభావం, పట్టుదల ఉన్న నటుడిని తాను ఎక్కడా చూడలేదని ప్రశాంత్ నీల్ ప్రశంసల వర్షం కురిపించారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రుక్మిణి వసంత హీరోయిన్‌గా నటిస్తుండగా, అనిల్ కపూర్, ఖుష్బూ, అశుతోష్ రాణా వంటి భారీ తారాగణం నటిస్తోంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
హిమాలయాలకు వెళ్ళిన ఒక యోగి ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చినప్పుడు వారిని చూసి, "ఇంకా పోట్లాడుకుంటూనే వున్నారా?” అని ఆశ్చర్యపోయాడంట. పిల్లల దగ్గరనుండి పెద్దవాళ్ళ వరకూ, మనుష్యులు పోట్లాడుకోకుండా క్షణముండలేరు. ఈ విషయంలో ఆధునికులూ పూర్వీకులూ అనిగానీ, ఈ జాతివారు ఆ జాతివారు అనిగానీ, ఈ మతంవారూ మరో మతానికి చెందినవారని గానీ, స్త్రీ పురుష భేదాలు గానీ ఏమీలేవు. పోట్లాడటం ప్రధానం, కారణమేదైనాగానీ, పోట్లాట అనేది ఒకటి వుంటూ వుండాలి. లేకపోతే తోచదు. సాధారణంగా చిన్న పిల్లల్ని "మీరిద్దరూ ఏదో గిల్లికజ్జా పెట్టుకుంటారేమిటర్రా?" అని మందిలిస్తాం కానీ, పెద్దవాళ్ళూ చేసేది అదే. కాకపోతే చిన్నవాళ్ళు ఏ చాక్లెట్ల పంపిణీ దగ్గరో, బడిలో ఏ కుర్చీలో ఎవరు కూచోవాలి అనే విషయానికో తగాదా పడతారు. పెద్దవాళ్ళు చాలా “పెద్ద” విషయాలనుకునే వాటి విషయంలో అంటే... మతపరమైన, భాషాపరమైన విషయాలతో, పోరాటానికి సిద్ధపడతారు. చిన్న పిల్లలు గిల్లుకోవటంతో ఆపేస్తారు. పెద్దవాళ్ళు రక్తం చిందిస్తారు. మనిషిలో తల ఎత్తే ప్రతి అభిప్రాయమూ, మరొక మనిషితో వచ్చే ప్రతి అభిప్రాయ భేదమూ రక్తం ధారపోసేటంతటి ముఖ్యమైన విషయమే. ఇక్కడ ఒక విషయమేమంటే తప్పని సరి అయితేనే తన రక్తం చిందుతుంది.  సాధారణంగా అయితే  తన అనుచరుల రక్తమే ఉంటుందక్కడ ఇదీ నేటి రాజకీయం, సమాజ పోకడ. మత విశ్వాసాలు బలంగావున్న కాలంలో ఒక్కొక్క మతం వారు మరొకరి మీద విరుచుకు పడేవారు. ఒకే మతానికి చెందినవారిలో కూడా ఎన్నో సంఘర్షణలు. కేథలిక్కులూ, ప్రాటస్టాంట్ లూ ఆనాటికీ ఈనాటికీ ఐర్లాండ్లో కుత్తుకలను కత్తరించుకోడానికి వెనుకాడడం లేదు. ముస్లిములలో సున్నీలకు షియాలకు మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూనే వున్నది. హిందూమతంలోని వైష్ణవులకు, శైవులకు ఎంతటి ప్రజల విరోధమో చరిత్ర తెలియజేస్తూనే వున్నది. మతం కాకపోతే భాష, భాష కాకపోతే ప్రాంతం, నగరాలకై గ్రామాలకై పెనుగులాట, ఆదర్శాలకై, అభిప్రాయాలకై పోరుసల్పమని నాయకులు ఉద్ఘాటిస్తూనే వుంటారు. పోరునష్టం అనే విషయం మానవుడికి తెలిసినట్లుగానే వుంటుంది. కాని పోరునే అతడు ఆరాధిస్తాడు. పోరే అతడి జీవనసూత్రం, అందుకనే జీవితాన్ని కూడా "జీవనసమరం, జీవనపోరాటం" అనే పేర్లతో వ్యవహరిస్తూ వుంటాడు.  పూర్వం మనరాజులు ఆచరించిన అశ్వమేధయాగం లో "చేతనైతే మా యజ్ఞాశ్వాన్ని ఆపిచూడండి, ఆపినవారు మా భుజబలాన్ని చవిచూడండి". అనే ప్రకటన, పోరుకు ఆహ్వానమే కదా? అంటే మనిషికి పోరు అతి సహజమైన గుణమన్నమాట, పైపెచ్చు ఇది ఎంతో గౌరవించదగిన గుణమని మన నాగరీకుల భావన. కానీ ఈ ప్రపంచంలో అక్కడక్కడ కొన్ని "అనాగరికమైన" అడవి జాతులు కూడా వున్నాయి. వారిలో ఒక జాతివారు మరొక జాతివారిమీద అనివార్య కారణాల వల్ల యుద్ధ దుందుభులు మ్రోగించారనుకుందాం. ఇవతలి జాతివాడు అవతలి జాతివాణ్ణి చంపడం కూడా జరిగిందనుకుందాం. అప్పుడు ఇతడు తానొక ఘనకార్యం చేశానని తానొక వీరాధి వీరుణ్ణని భావించడం జరుగుతుంది. చాలా ఉద్రేకంగా ఉత్సాహంగా తనవారిలోకి తిరిగి వస్తాడు. అతని గ్రామంలోని వారందరూ అతడికి బ్రహ్మరథం పట్టారనీ, "వీరగంధం" పూస్తారని మనం అనుకోవచ్చు. కానీ మన ఊహ సరికాదు అంటాడు, ఆఫ్రికాలోని కొన్ని అడవి జాతుల్ని అధ్యయనం చేసిన ప్రఖ్యాత మనస్తత్వ శాస్త్రవేత్త, కార్ల్ యూంగ్, ఈ వీర శూర శిఖామణిని ఊరి పొలిమేరల్లోనే ఆపి అక్కడే ఒక గుడిసెలో అతడికి నివాసం ఏర్పాటు చేస్తారు. అతడిలోని రక్తదాహం తొలగిపోవడానికి కొన్ని నెలలపాటు అతణ్ణి ఏకాంతంగా వుండనిచ్చి, శాఖాహారం మాత్రమే పెడుతుంటారు. ఆ అడవి జాతివారికి తోటి మానవుడి ప్రాణం తీయడం అంత గర్భనీయం అంటారు. ఇదీ మనిషిలో ఉండే ఒకానొక స్వభావ కోణం                                    ◆నిశ్శబ్ద.
  భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది ఒక విలువైన సంబంధం. అయితే ఈ బంధం  ఎప్పుడూ తగాదాలు,  వాదనలతో నిండి ఉంటుంది.  కానీ గొడవ అయినా, తగాదాలు అయినా  భర్త పదేపదే  అబద్ధం చెప్పడం చాలా ఇబ్బందికర విషయం.  ఇలా  అబద్ధాలు చెప్పడం భార్యను బాధకు గురిచేస్తుంది. భర్త చెప్పేవి అబద్దాలు అని తెలిసినా సరే.. కొందరు భార్యలు తమ భర్తల విషయంలో ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉంటారు. మరికొందరు గొడవ పడుతుంటారు. అయితే ఇలా గొడవ పడటం వల్ల భార్యాభర్తల బంధానికే ముప్పు వాటిల్లుతుంది. అయితే ఇలాంటి విషయాల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భర్త ఇంకోసారి అబద్దం చెప్పకుండా ఉండటానికి సహాయపడే కొన్ని చిట్కాలు ఉన్నాయి.  వాటిని ఫాలో అయితే భర్తలు అబద్దం చెప్పడం మానేస్తారు.  అవేంటో తెలుసుకుంటే.. భర్తకు అబద్ధాలు చెప్పే అలవాటును ఎలా వదిలించాలి..  భర్త  భార్యకు  అబద్ధం చెబితే, అది సంబంధానికి పెద్ద సమస్యగా మారవచ్చు. అబద్ధం చెప్పడం వల్ల భార్యాభర్తల మధ్య నమ్మకం తగ్గిపోతుంది.  సంబంధంలో చీలిక ఏర్పడుతుంది. దీన్ని నివారించడానికి  కొన్ని చిట్కాలను అనుసరించవచ్చు.  భర్తతో బహిరంగంగా మాట్లాడవచ్చు.. భర్త అబద్దాలు చెబుతుంటే భార్య వాటిని ఊరికే సహించడం చేయకుండా నేరుగా  భర్తతో ఓపెన్ గా  మాట్లాడాలి. అబద్ధం ఎంత ప్రమాదకరమూ,  అది భార్యను  ఎలా బాధపెడుతుందో వివరించాలి. ఇలాంటి విషయాలు చెప్పేటప్పుడు భర్తకు ఆ విషయాలు అర్థం కావడం కోసం కొన్నిఉదాహరణలు కూడా చెప్పవచ్చు. అతను చెప్పిన అబద్దాల వల్ల ఏ సందర్భంలో ఎంత బాధ అనుభవించారనేది చెప్పవచ్చు.  ఇలా చేస్తే భర్తలో ఆలోచనలు కలిగి అతను అబద్దం చెప్పడం మానుకునే అవకాశం ఉంటుంది. కారణాలు అర్థం చేసుకోవాలి.. భర్త అబద్దం చెప్పడం అనే విషయాన్ని మాత్రమే కాకుండా.. అతను ఎలాంటి సందర్బంలో, పరిస్థితిలో అబద్దం చెప్పాడు అనే విషయాన్ని కూడా కూడా అర్థం చేసుకోవడం భార్య బాధ్యత.  ఇలా అర్థం చేసుకుంటే  తన భావాలను భార్య అర్థం చేసుకుంటోందని అతను గ్రహిస్తాడు.  అతని అబద్ధాల వెనుక గల కారణాలను అర్థం చేసుకుంటే ఆ తరువాత అతను ఎప్పుడైనా అర్థం చెప్పినా అదంత బాధ లేదా కోపాన్ని కలిగించదు.   పరిష్కారం.. భార్య భర్తకు ఎలాంటి పరిస్థితిలో అయినా  అండగా ఉన్నారని,  ఏవైనా సమస్యలు వస్తే వాటి పరిష్కార మార్గాలు కనుగొనడంలో అతనికి సహాయం చేస్తారని అతనికి  అర్థమయ్యేలా చేయాలి. ఇలా చేస్తే భర్త ఏ సమస్య వచ్చినా తన భార్య కూడా తనకు సమస్య పరిష్కారంలో తోడు ఉంటుందనే భరోసాతో అబద్దాలు చెప్పకుండా ఏ విషయాలు దాపరికం లేకుండా ఉంటారు.   బయటి నుండి సహాయం.. పైన చెప్పుకున్న చిట్కాలన్నింటినీ అనుసరించిన తర్వాత కూడా భర్త ప్రవర్తన మెరుగుపడకపోతే.. భార్య  మంచి సలహాదారుడి సహాయం తీసుకోవచ్చు. అంతేకాదు భర్త అబద్ధం చెప్పడం మానేయడానికి  అతను చేస్తున్నది ఎంత  తప్పు అనే విషయం  అర్థం చేసుకునేలా చేయడానికి  అతనితో సమయం గడపాలి. దగ్గరి వ్యక్తుల  సహాయం..   భర్త అబద్దాలు చెప్పడం అనే  సమస్యను కుటుంబానికి బాగా దగ్గరగా ఉన్న వ్యక్తులు,   స్నేహితులు,  ఆత్మీయులు మొదలైనవారితో  చర్చించవచ్చు. ఈ సమస్యను పరిష్కరించడానికి సమయం పట్టవచ్చు.  కాబట్టి కొంత ప్రశాంతంగా ఉండాలి.  భార్యాభర్తల బంధంలో అబద్దాలు చెప్పడం బంధాన్ని ఎంత ప్రమాదంలో పడేస్తుందో అతనికి అర్థమయ్యే వరకు వేచి ఉండాలి.                                *రూపశ్రీ.
టీ భారతీయులకు ఒక గొప్ప ఎమోషన్. ఇది వేరే దేశం నుండి మన దేశానికి వచ్చిన పానీయమే అయినా భారతీయులు టీ అంటే ప్రాణం ఇస్తారు.  సమయం పాడు లేకుండా టీ తాగే వారు ఉంటారు.  నలుగురు స్నేహితులను అయినా,  ఉద్యోగ చర్చలకు అయినా, పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడానికి అయినా ఛాయ్ సిట్టింగ్ ఒక మంచి మార్గం.  అయితే చాలా మందికి టీ తాగే సరైన మార్గం తెలియదు. టీ తాగడానికి కూడా ఒక పద్దతి ఉంది.  టీ కప్పు పట్టుకోవడం దగ్గర నుండి దాన్ని సిప్ చేయడం వరకు టీ వెనుక ఒక సంప్రదాయం,  దానికంటూ ఒక ప్రత్యేక గౌరవం ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద రెస్టారెంట్లు,  ఖరీదైన లైఫ్ గడిపే వ్యక్తుల దగ్గర టీ తాగాల్సి వస్తే ఇష్టమొచ్చినట్టు తాగకూడదు.  టీ తాగేటప్పుడు పాటించాల్సిన టిప్స్ ఏంటి తెలుసుకుంటే.. కొన్ని ప్రాంతాలలో కొన్ని పదార్థాలను ఇష్టమొచ్చినట్టు తినలేం, తాగలేం.  తప్పు పద్దతిలో తినడం, తాగడం చేస్తే ప్రాంతీయత పరంగా వారిని అవమానించినట్టు ఫీలవుతారు.  అందుకే ప్రతి పదార్థం ఎలా తినాలి, ఎలా తాగాలి అనేవి తెలుసుకోవాలి. వాటిలో టీ తాగడం కూడా ఒకటి.  టీ భారతీయుల పానీయం కాదు.. కాబట్టి దాన్ని భారతీయులు వారికి నచ్చిన పద్దతిలో నచ్చినట్టు తాగేస్తారు. టీ తాగేటప్పుడు టీ కప్పు హ్యాండిల్ ను ఎల్లప్పుడూ టీ కప్పు సాసర్ పై ఉంచాలి. అది కూడా టీ కప్పు హ్యాండిల్ గడియారంలో  3 సంఖ్య ఎక్కడ ఉంటుందో ఆ కోణంలో ఉండాలి.  ఇక ఎడమ చేతితో టీ తాగేవారు అయితే టీ కప్పు హ్యాండిల్ గడియారంలో 9 సంఖ్య ఎక్కడ ఉంటుందో ఆ కోణం దగ్గర ఉండాలి. ఇలా ఉంటే టీ కప్పు అందుకోవడం సులభంగా ఉంటుంది. టీ కప్పు హ్యాండిల్ పట్టుకోవడానికి ఎప్పుడు చూపుడు వేలు, మధ్యవేలు,  బొటన వేలును ఉపయోగించాలి.  ఉంగరపు వేలు,  చిటికెన వేలును సపోర్ట్ కోసం ఉపయోగించాలి. టీ కప్పుతో పాటు చెంచా ఉంచితే దాన్ని కప్పు వెనుక భాగంలో ఉంచాలి.  కప్పులో ఎప్పుడూ చెంచాను ఉంచకూడదు.  టీలో పాలు లేదా పంచదార వేసుకున్నప్పుడు చెంచాను  కప్పు లో వృత్తాకారం లో తిప్పకూడదు.  అర్థవృత్తాకారంలో మాత్రమే అది కూడా ముందుకు వెనక్కు తిప్పాలి. శబ్దం రాకుండా తిప్పాలి. పంచదారను టీలో వేసుకుని చెంచాతో కలుపుతూ సుడిగుండం సృష్టించినట్టు తిప్పకూడదు.  అలాగే చెంచాను కప్పు మీద గట్టిగా కొట్టడం లాంటివి కూడా చేయకూడదు. టీని కలిపిన తరువాత చెంచాకు అంటుకున్న టీని నాకడం చేయకూడదు.  చెంచాను టీ కప్పు వెనుక భాగంలో పెట్టేయాలి. టీని కప్పులో సొంతంగా పోసుకునే పరిస్థితి ఉన్నప్పుడు కప్పు నిండుగా టీ పోసుకోకూడదు. ఎప్పుడూ కప్పులో 75శాతం మాత్రమే టీతో నింపాలి. 25శాతం ఖాళీగా ఉంచాలి.                                                *రూపశ్రీ.
ప్రస్తుత ఆధునిక కాలంలో శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, మానసిక ఆరోగ్యానికి (Mental Health) కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. కానీ, నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, వ్యక్తిగత సమస్యల వల్ల చాలా మంది రకరకాల మానసిక రుగ్మతల (Mental Illness) బారిన పడుతున్నారు. అసలు మానసిక సమస్యలు ఎందుకు వస్తాయి? వాటి రకాలు ఏమిటి? వీటికి మందులు వాడకుండా కేవలం కౌన్సెలింగ్, థెరపీల ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందా? అనే విషయాలపై ప్రముఖ సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ అన్నం సుబ్రహ్మణ్యం (న్యూ లైఫ్ కౌన్సెలింగ్ సెంటర్, హైదరాబాద్) గారు ఈ VIDEO లో విలువైన సమాచారాన్ని పంచుకున్నారు. మానసిక రుగ్మత (Mental Illness) అంటే ఏమిటి? సాధారణంగా ఒక వ్యక్తి ఆలోచనా విధానంలో, ప్రవర్తనలో మరియు భావోద్వేగాలలో అసాధారణ మార్పులు వచ్చి, అవి వారి దైనందిన జీవితాన్ని దెబ్బతీస్తే దానిని మానసిక రుగ్మతగా పరిగణిస్తారు. ఇది కేవలం 'పిచ్చి' కాదు, గుండె జబ్బు, మధుమేహం లాగే మెదడు పనితీరుకు సంబంధించిన ఒక ఆరోగ్య సమస్య. ప్రధాన మానసిక సమస్యలు - రకాలు: సమాజంలో ఎక్కువగా కనిపించే కొన్ని ముఖ్యమైన మానసిక రుగ్మతలు: డిప్రెషన్ (Depression - తీవ్ర నిరాశ): ఎప్పుడూ బాధగా ఉండటం, దేనిమీదా ఆసక్తి లేకపోవడం. యాంగ్జైటీ డిజార్డర్స్ (Anxiety Disorders - ఆందోళన): చిన్న విషయాలకే విపరీతంగా భయపడటం, కంగారుపడటం.  అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (OCD): ఒకే ఆలోచన పదే పదే రావడం (ఉదాహరణకు చేతులు కడగడం, తాళాలు సరిచూసుకోవడం).  బైపోలార్ డిజార్డర్ (Bipolar Disorder): ఒకసారి విపరీతమైన ఆనందం, మరోసారి తీవ్రమైన నిరాశకు లోనవడం.  స్కిజోఫ్రీనియా (Schizophrenia): లేని విషయాలు ఉన్నట్లు ఊహించుకోవడం, భ్రమపడటం. మానసిక సమస్యలను గుర్తించడం ఎలా? (Diagnosis) చాలా మంది తమకు సమస్య ఉన్నా బయటకు చెప్పుకోవడానికి సంకోచిస్తారు. ఒక వ్యక్తిలో క్రింది లక్షణాలు కనిపిస్తే వారు మానసిక ఒత్తిడిలో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు: నిద్రలేమి లేదా అతిగా నిద్రపోవడం. ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండటానికి ప్రయత్నించడం. చిన్న విషయాలకే విపరీతంగా కోపం లేదా ఏడుపు రావడం. నెగటివ్ ఆలోచనలు, ఆత్మహత్య ఆలోచనలు రావడం. మందులు లేకుండా మానసిక సమస్యలకు చికిత్స (Treatment Without Medication): చాలా మంది మానసిక సమస్య అనగానే జీవితాంతం మందులు (Psychiatric Medicines) వాడాలేమో అని భయపడతారు. అయితే, అన్ని సమస్యలకూ మందులు అవసరం లేదని డాక్టర్ అన్నం సుబ్రహ్మణ్యం గారు స్పష్టం చేశారు. సైకాలజిస్టులు అందించే కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా వీటిని పూర్తిగా నయం చేయవచ్చు: కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT): ఈ థెరపీ ద్వారా రోగిలోని ప్రతికూల (Negative) ఆలోచనలను గుర్తించి, వాటిని సానుకూల (Positive) ఆలోచనలుగా మారుస్తారు. సైకాలజికల్ కౌన్సెలింగ్: మనసులోని బాధను, ఒత్తిడిని నిపుణులైన సైకాలజిస్ట్‌తో పంచుకోవడం ద్వారా సగం సమస్య పరిష్కారమవుతుంది. వారు సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కారాన్ని చూపిస్తారు. లైఫ్ స్టైల్ మార్పులు: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం, సరైన నిద్ర మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మైండ్‌ఫుల్‌నెస్ మరియు ధ్యానం: మెదడును ప్రశాంతంగా ఉంచడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం (Meditation) ఎంతో సహాయపడుతుంది. మానసిక సమస్యలు అనేవి దాచుకోవాల్సిన విషయాలు కావు. శారీరక నొప్పులకు డాక్టర్‌ను సంప్రదించినట్లే, మానసిక ఇబ్బందులు ఉన్నప్పుడు సంకోచించకుండా సైకాలజిస్ట్‌ను కలిసి కౌన్సెలింగ్ తీసుకోవడం ఉత్తమం. మందుల వాడకం లేకుండా, కేవలం సరైన అవగాహన, థెరపీలతో మానసిక రుగ్మతలను జయించి సంతోషకరమైన జీవితాన్ని గడపటానికి మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 [TeluguOne Health] సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
మలబద్ధకం (Constipation) లేదా మలబద్దకంతో బాధపడుతున్నారా? సుఖ విరేచనం అవ్వక ఇబ్బంది పడుతున్నారా? ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పైల్స్, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే సహజంగా మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ ఈ వీడియోలో అద్భుతమైన చిట్కాలను వివరించారు.  ముఖ్యంగా ఎండుద్రాక్ష (Raisins లేదా Kishmish) ఉపయోగించి సుఖ విరేచనం ఎలా అయ్యేలా చేసుకోవచ్చో, అలాగే మలబద్ధకానికి గల కారణాలు మరియు ఆయుర్వేద గృహ వైద్యం గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసి తెలుసుకోండి. వీడియోలోని ముఖ్యమైన అంశాలు: మలబద్ధకం రావడానికి గల ముఖ్య కారణాలు ఏమిటి? కిస్‌మిస్ (ఎండుద్రాక్ష) మలబద్ధకాన్ని ఎలా నివారిస్తుంది? సుఖ విరేచనం కోసం కిస్‌మిస్‌ను ఎలా ఉపయోగించాలి? నిత్యం పాటించవలసిన సులభమైన ఆయుర్వేద చిట్కాలు. ఈ రోజే ఈ చిట్కాలను పాటించండి, మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం పొందండి! మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
మానవ శరీరంలో ప్రేగుల పాత్ర చాలా ఉంది.,  తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో,  శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో ప్రేగులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం నుండి లభించే పోషకాలు రక్తంలోకి శోషించబడేది కూడా ప్రేగుల ద్వారానే. శరీరంలో ఇంత ముఖ్యమైన విధులు నిర్వర్తించే ప్రేగుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.  ప్రేగు ఆరోగ్యంగా బలహీనంగా ఉంటే పైన పేర్కొన్న విధులు మందగిస్తాయి. శరీరంలో కనిపించే కొన్ని లక్షణాల ద్వారా ప్రేగు ఆరోగ్యంగా బలహీనంగా ఉందా లేదా తెలుసుకోవచ్చు.  ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుంటే.. ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉందని సూచించే లక్షణాలు.. ఆహారం తిన్న తర్వాత.. ఆహారం తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉన్నా, బరువుగా అనిపించినా ప్రేగు ఆరోగ్యంగా బలహీనంగా ఉందని  అర్థం.  అయితే భారీ ఆహారం తీసుకున్నప్పుడు సాధారణంగానే ఉబ్బరంగా లేదా బరువుగా అనిపిస్తుంది. కానీ సాధారణ ఆహారం తీసుకున్నప్పుడు కూడా బరువుగా అనిపించడం, అది కూడా తరచుగా అనిపిస్తూ ఉంటే.. ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉందని అర్థం. మలబద్దకం.. ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉందని చెప్పడానికి ఉండే అతిపెద్ద లక్షణం మలబద్దకం.  మలం గట్టిగా రావడం లేదా మలవిసర్జన చేసేటప్పుడు గట్టిగా బలవంతంగా విసర్జన చేయడానికి ప్రయత్నించడం వంటివి ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉందని సూచిస్తాయి. అలాగే మలవిసర్జన ప్రతి రోజూ ఒకే సమయానికి కాకుండా అస్తవ్యస్తంగా రావడం కూడా ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉందని సూచిస్తుంది. గ్యాస్.. నేటికాలంలో చాలామంది ఎదుర్కుంటున్న గ్యాస్, ఎసిడిటీ,  ఛాతీలో మంట వంటి సమస్యలు అన్నీ కేవలం ఆహార అలవాట్లు సరిగా లేకపోవడం వల్ల వస్తున్నాయని అనుకుంటారు చాలామంది. కానీ ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉంటేనే ఈ సమస్యలు వస్తాయి. అది కూడా గ్యాస్,  ఎసిడిటీ,  ఛాతీలో మంట వంటి సమస్యలు పదే పదే వస్తాయి. నోటి ఆరోగ్యం.. నాలుక పైన తెల్లటి పూత రావడం, నోటి దుర్వాసన రావడం కూడా ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉందని చెప్పడానికి ఒక సూచన. చాలామందికి నోరు ఎంత శుభ్రం చేసుకున్నా నాలుక మీద తెల్లని పూత,  నోటి దుర్వాసన వస్తుంది. ఇలాంటి వారిలో ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆకలి.. ఆకలి సరిగా లేకపోయినా లేదా  అతిగా ఆకలి వేసినా కూడా ప్రేగు ఆరోగ్యం సరిగా లేదని అర్థం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.                           *రూపశ్రీ.